
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగిరి మండలం ముస్త్యాల ప్రభుత్వం పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద అదే గ్రామానికి చెందిన డాక్టర్ విజయ్‌కుమార్ హంగామా చేసినట్లు సర్పంచ్ లావణ్య తెలిపారు. సెంటర్ ఇక్కడ ఎందుకు పెట్టారు అంటూ ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లను, మెడికల్ ఆఫీసర్‌ను, కార్యదర్శితో గొడవకు దిగినట్లు తెలిపారు.
వ్యాక్సినేషన్ సెంటర్‌కు ప్రజలు రాకుండా ఇబ్బంది కలిగేలా తన బైక్‌ను అడ్డుగా పెట్టడంతో, బైక్ తీయాలని అడిగిన నాగరాజుపై చేయిచేసుకున్నట్లు తెలిపారు. దీనిపై గోదావరిఖని టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా కానిస్టేబుల్ రావడంతో గొడవ సద్దుమణిగినట్లు తెలిపారు. ఈ విషయంపై పెద్దపల్లి డీఎంహెచ్‌ఓ దృషికి తీసుకెళ్తామని తెలిపారు. కాగా విజయ్‌కుమార్ యైటింక్లయిన్‌కాలనీ అల్లూరు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment