Peddapalli
-
వందల ఏళ్ల రక్షణ స్థావరం.. రామగిరి కోట!
అభివృద్ధికి అవకాశం ఉన్న పర్యాటక ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. తెలంగాణలో తొలిసారిగా రోప్‌వే పర్యాటకానికి అవకాశం కల్పించింది. భువనగిరి జిల్లా యాదగిరి గుట్టపై 2 కిలోమీటర్ల రోప్‌వేను తొలిసారిగా ఏర్పాటు చేస్తుండగా.. రాష్ట్రంలో మరో నాలుగు ప్రతిపాదిత రోప్‌వేలలో పెద్దపల్లి జిల్లా రామగిరి కోటకు చోటు కల్పించారు. – మంథనిప్రాచీన శిల్పకళా సంపదకు చిరునామా.. రామగిరి ఖిలా జిల్లాలోని రామగిరి ఖిలాను జాతీయస్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్‌ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. ఇక్కడి ప్రాచీన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. రామగిరి ఖిలా (Ramagiri fort) క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలో రామగిరి కోటగా రూ పుదిద్దుకుంది. ఈ కోట శత్రుదుర్భేద్యమైన రక్షణ స్థావరంగా వందల ఏళ్లపాటు వివిధ వంశాల రాజులకు ఆశ్రయమిచ్చింది. ఎంతో ఎత్తున్న దుర్గం, అనేక రాతి కట్టడాలు, బురుజులు, ఫీనాలతో విరాజిల్లుతోంది. దుర్గం అంతర్భాగంలో సాలుకోట, సింహాల కోట, జంగేకోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వాల, కొలువుశాల, మొఘల్శాల, చెరసాల, గజశాల, భజనశాల, సభాస్థలితో పాటు రహస్య స్థలాలు, రహస్య మార్గాలు, సొరంగాలు, తీపులు, ఫిరంగి గుండ్లు ఇక్కడ దర్శనమిస్తాయి.తెలంగాణలోని దుర్గాల్లో ఈ దుర్గం పటిష్టంగా ఉండి.. వజ్రకూటంగా ప్రసిద్ధి చెందింది. సీతమ్మ కొలను గుంటపై పసుపు, ఎరుపు రంగు నీరు దర్శనమివ్వడం విశేషం. పిల్లల ఫిరంగి నుంచి దూరితే సంతానప్రాప్తి లభిస్తుందని పర్యాటకుల విశ్వాసం. రామగిరి ఖిలాపై సుందర దృశ్యాలు, ప్రాకారాలు.. సందర్శకులను ఆకర్షిస్తాయి. శ్రీరాముని మూల విగ్రహాలున్న స్థలంలో కొండ చరియకింద వెయ్యిమంది తలదాచుకోవచ్చు.రామగిరి కోటలో ఇరువైపులా 9 ఫిరంగులు, 40 తోపులు ఉన్నాయి. శ్రీరాముడు వనవాసకాలంలో రామగిరికోటపై తపస్సు చేసి గుహలో శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి కొండపై నుంచి వచ్చే నీటిధార.. బిలం నుంచి లోయలోకి ప్రవహిస్తోంది. ఈ ద్వా రం వద్ద సీతాదేవి స్నానమాచరించినట్లు భక్తుల నమ్మకం. కొండపై సీతారాముల విగ్రహాలతో పాటు నంది విగ్ర హం ఉంది. నీటిధార నేరుగా శివలింగం, నంది విగ్రహాలపై పడటం విశేషం. రామగిరి కొండ పైనుంచి వర్షాకాలం జలపాతాలు కనువిందు చేస్తాయి. రోప్‌వే (Rope Way) ద్వారా పర్యాటకుల్ని గుట్టపైకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు చేశారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే.. రామగిరి ఖిలాకు పర్యాటకుల సందడి పెరగనుంది.లోయలాంటి సరస్సు ఎల్‌మడుగు గోదావరి నది మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన అతి పెద్ద లోయలాంటి సరస్సే ఎల్‌మడుగు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల మధ్య మంథని మండలం ఖాన్సాయిపేట – శివ్వారం అటవీ ప్రాంతంలోని ఎల్‌మడుగు రెండు గుట్టల నడుమ ప్రవహిస్తోంది. ఈ సరస్సు చుట్టూ ఆనుకున్న దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తయిన కొండలు, గుట్టలు.. రెండు కొండల మధ్యనుంచి ప్రవహించే గోదావరి నది.. ఆ సరస్సులో సందడి చేసే పక్షుల కిలకిలారావాలు, నీటిలో ఎగిరే చేపల విన్యాసాలు కనువిందు చేస్తాయి. చిన్న చిన్న చేపపిల్లలు గుంపుగా కదులుతున్న దృశ్యం.. కళ్లెదుటే ఆక్వేరియం ఉన్నట్టు అనిపిస్తుంది. సుమారు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండే ఈ సరస్సులో.. ఈ సుందర దృశ్యాలను కచ్చితంగా చూడాల్సిందే అనడం అతిశయోక్తి లేదు.ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఎల్‌మడుగును ఇకో పార్కుగా అభివృద్ధి చేసేందుకు రూ.2 కోట్లు కేటాయించారు. ఇప్పటికే మంథని (Manthani) మండలం ఖానాపూర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గోదావరి వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కాళేశ్వరంలో పర్యాటక అభివృద్ధికి రూ.115 కోట్లు, మంథనిలోని గోదావరి నది తీరంలో గౌతమేశ్వర ఘాట్ అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఇటీవల మంథనిలో పర్యటించగా, పర్యాటక శాఖ కమిషనర్ న్యాలకొండ ప్రకాశ్‌రెడ్డి సైతం రామగిరిని సందర్శించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్.. మంత్రి శ్రీధర్‌బాబు సతీమణి కాగా, పర్యాటక శాఖ కమిషనర్ ఈ ప్రాంతానికి సంబంధించిన ఐపీఎస్ అధికారి కావడం.. మంథనికి కలిసివస్తుందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది.చదవండి: ఇక్కడ చదివిన వారెవరూ ఖాళీగా ఉండరు! -
పదేళ్లలో కోటి మంది మహిళలు 'కోటీశ్వరులు': రేవంత్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాబోయే పదేళ్లలో ఆర్టీసీ, సోలార్ విద్యుత్ కేంద్రాలు, ఐకేపీ కేంద్రాలు తదితర అన్ని రంగాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా కోటిమందిని కోటీశ్వరు లుగా మార్చేవరకు తాము విశ్రమించబోమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఆడబిడ్డల ఓట్లతోనే విజయం సాధిస్తామన్నారు. గత పదేళ్లకాలంలో ఒక్క విమానాశ్రయం కట్టలేదని, కానీ తాము రామగుండం, వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను కడతామని తెలిపారు. గత ప్రభుత్వం యువతకు ఉద్యోగాలివ్వలేదు కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ ఉద్యోగాలొచ్చాయని విమర్శించారు. తమ ఇందిరమ్మ పాలనలో ఏడాదిలోనే 55,143 మందికి ఉద్యోగాలిచ్చామని, ఇదే వేదికపై 8,084 మందికి నియామక పత్రాలు అందజేస్తున్నామని వెల్లడించారు. డిసెంబర్ 10 వరకు తాము చేసిన పనులన్నీ చెప్పుకుంటామన్నారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసి చూపించామని, దీనిపై ప్రధాన మోదీ, కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి తమతో చర్చకు రావాలని సవాల్ చేశారు. కేటీఆర్, హరీశ్‌లను అచ్చోసిన ఆంబోతుల్లా సమాజంలోకి కేసీఆర్ వదిలిండని, తెల్లారిలేస్తే సోషల్ మీడియాలో తమపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా బుధవారం పెద్దపల్లిలో యువవికాసం పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.బలమైన కుర్రాడు ఒక్క రోజులో పిల్లాడిని కనలేడుగా..‘రూ.లక్ష కోట్లు వెచ్చించి కేసీఆర్ కాళేశ్వరం కడితే కూలింది. మేం 50 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్టులేవీ చెక్కు చెదరలేదు. కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క ఎత్తకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. అందులో పెద్దపల్లి అగ్రగామిగా నిలిచింది. గతంలో వర్సిటీలు నిరాదరణకు గురయ్యాయి. మేం 10 వర్సిటీలకు వీసీలను నియమించాం. శాతవాహన వర్సిటీకి లా, ఇంజనీరింగ్ కాలేజీలు మంజూరు చేస్తున్నాం. డీఎస్సీ పిలిచి 11 వేల టీచర్ కొలువులిచ్చాం. చెప్పినవన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఇందిరా పార్కు వద్ద మూసేసిన ధర్నా చౌక్ తెరిపించాం. మా ప్రమాణ స్వీకారం రోజునే ప్రగతిభవన్ ముళ్ల కంచెను తొలగించాం. ప్రగతిభవన్‌లో ప్రతివారం చిన్నారెడ్డి ప్రజల ఫిర్యాదులు తీసుకుని పరిష్కరిస్తున్నారు. పేద పిల్లలకు 40% కాస్మెటిక్, డైట్ చార్జీలు పెంచాం. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను పరిష్కరించుకుంటాం. ప్రతిదానికీ ఒక విధానం ఉంటుంది. బలమైన కుర్రాడికి పెళ్లి చేసినంత మాత్రాన.. ఒక్కరోజులో పిల్లాడిని కనలేడుగా..’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.పదేళ్లలో ఉద్యాగాలెందుకు ఇవ్వలేదు? ‘కవితమ్మ ఎంపీగా ఓడిపోతే 3 నెలల్లో ఎమ్మెల్సీని చేశారు. సంతోష్‌కు రాజ్యసభ, ఎంపీ ఎ్ననికల్లో ఓడిన వినోద్‌కు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ ఇచ్చారు. అదే పదేళ్లలో ఎందుకు ఉద్యోగాలివ్వలేదు. ఇందుకోసమేనా తెలంగాణ విద్యార్థులు బలిదానం చేసింది? కొలువుల్లేక దాదాపు 35 లక్షల మంది ఉపాధి కూలీలుగా, అడ్డా కూలీలుగా మారారు. వందలాది బలిదానాలు, లక్షలాదిమంది కేసులు ఒక్క కుటుంబం కోసమా? తెలంగాణ ప్రజల కోసమా? 80 వేల పుస్తకాలు చదివిన మీకు నిరుద్యోగుల కష్టం అర్థం కాలేదా? అందుకే మేం ఆలోచన చేసి 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఆత్మహత్యలు చేసుకోవద్దని యువ వికాసం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం..’ అని సీఎం పేర్కొన్నారు. కొందరు విష ప్రచారం చేస్తున్నారు..‘పెద్దపల్లి జిల్లా ప్రజల వెన్నుదన్నుల వల్లే ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం. కేసీఆర్ పదేళ్ల కాలంలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు. కనీసం తనలా ఎకరానికి రూ.కోటి ఆదాయం ఎలా తీయాలో నేర్పలేదు. నాడు ఎస్సారెస్పీ నీటి కోసం అరెస్టయిన విజయరమణారావు కల నేడు ఫలించింది. ఇవాళ ఆ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది. పెద్దపల్లి జిల్లాకు రూ.1,030 కోట్లతో ఆర్అండ్బీ, పీఆర్ పనులు, ఆర్టీసీ డిపో వచ్చాయంటే అందుకు కారణం మీ అభిమాన విజ్జన్న, శ్రీధర్‌బాబులే. వాస్తవానికి ఈ పనులు కావాలని మంత్రి శ్రీధర్‌బాబు మమ్మల్ని అడగలేదు..బెదిరించారు (నవ్వులు). తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి కరీంనగర్, ఆదిలాబాద్‌కు నీరిస్తాం. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాం. కొందరు తమకు భవిష్యత్తు లేదన్న భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారు చేసే విష ప్రచారాన్ని డిసెంబరు 10 వరకు తిప్పికొట్టి చరిత్ర తిరగరాస్తాం. నరేంద్ర మోదీ 14 ఏళ్లు గుజరాత్ సీఎంగా ఉన్నారు. 11 సంవత్సరాల నుంచి పీఎంగా ఉన్నారు. గుజరాత్లో తొలి ఏడాదిలో 55వేల ఉద్యోగాలు ఇచ్చారా? చర్చకు సిద్ధమా? మోదీకి ప్రత్యేక విమానం పెడతాం. సచివాలయంలో చర్చ పెడతాం..’ అని సీఎం సవాల్ చేశారు. మద్దతు ధర, బోనస్ ఇస్తున్నాం..‘రైతులకు ఎమ్మెస్పీ ఇవ్వడమే కాదు.. 66 లక్షల ఎకర్లాలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి మేం కట్టిన ప్రాజెక్టులతోనే సాధ్యమైంది. ఆనాడు ఐకేపీ కేంద్రాలు తెరవమంటే ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు.. వరి వేసుకుంటే ఉరే అని కేసీఆర్ చెప్పారు. నేడు ఇందిరమ్మ రాజ్యంలో మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నాం. రైతుబంధు రూ.7,625 కోట్లు ఇచ్చాం. రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీతో ఈ ప్రభుత్వం చరిత్రను తిరగరాసింది. గుజరాత్లో రైతు రుణమాఫీ చేశారా? చర్చకు సిద్ధమేనా?..’ అని రేవంత్ ప్రశ్నించారు.కులగణనలో కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదు?‘రాహుల్‌గాంధీ పిలుపుతో కులగుణన చేపట్టాం. 95 శాతం పూర్తి చేశాం. కులగణనలో కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదు? బీసీ దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కులగణన చేస్తుంటే.. కేసీఆర్ కుటుంబం ఎందుకు దూరంగా ఉంది. మేం ప్రతిపక్షంలో ఉన్నపుడు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనలేదా? బీసీ సంఘాలు ఆలోచించాలి. బీసీ కులగణనలో పాల్గొనని వారిని సామాజికంగా బహిష్కరించాలి..’ అని ముఖ్యమంత్రి అన్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
-
పెద్దపల్లి గూడ్స్ ప్రమాదం: వందేభారత్ సహా రద్దైన రైళ్ల వివరాలివే..
పెద్దపెల్లి, సాక్షి: గూడ్స్ రైలు ప్రమాదంతో కాజీపేట-బలార్ష రూట్(ఢిల్లీ–చెన్నై) రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ మార్గంలో ఎటువైపు రైలు అటువైపు నిలిచిపోయాయి. వందేభారత్ సహా పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇంకొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. పునరుద్ధరణకు ఒక్కరోజు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపట్టారు. క్లియరెన్స్‌కు మరో 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన రాఘవాపూర్ స్టేషన్ వద్దకు ఈ ఉదయం దక్షిణ మధ్య రైల్వే అధికారులు చేరుకుని పునరుద్ధరణ పనులను ముమ్మరం చేయించారు.ట్రాక్స్ పునరుద్ధరణకు ప్రత్యేక మిషనరీ తెప్పించారు. బల్లార్షా, కాజీపేట, సికింద్రాబాద్ నుంచి సుమారు 500 మంది సిబ్బందిని తీసుకొచ్చి రైల్వే ట్రాక్స్ పునరుద్ధరణ పనుల్లో స్పీడ్ పెంచారు. ట్రాక్స్ పై అదుపు తప్పి కిలోమీటర్ మేర చెల్లాచెదురుగా పడిన బోగీలను భారీ క్రేన్స్ సాయంతో తొలగిస్తున్నారు.రద్దు.. డైవర్షన్.. రీషెడ్యూల్ఇదిలా ఉంటే.. దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లు రద్దు చేయడంతో పాటు 10కి పైగా రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. ఇంకొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసింది. ప్రయాణికులంతా ఇది గమనించాలని.. ఏమైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని సూచించింది.నర్సాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-నాగ్‌పుర్, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-కాగజ్‌నగర్, కాజీపేట-సిర్పూర్ టౌన్, సిర్పూర్ టౌన్-కరీంనగర్, కరీంనగర్-బోధన్, సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-బల్లార్షా, బల్లార్షా-కాజీపేట, యశ్వంత్‌పూర్-ముజఫర్‌పూర్ రైళ్లను రద్దు చేశారు.అలాగే.. రామగిరి ఎక్స్ ప్రెస్, సింగరేణి ఎక్స్ ప్రెస్, వందే భారత్ ఎక్స్ ప్రెస్, బీదర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్‌లను రద్దు చేశారు.దారి మళ్లించిన రైల్వే వివరాలు జీటీ, కేరళ, ఏపీ, గోరఖ్ పూర్, సంఘమిత్ర, దక్షిణ్, పూణే, దర్భంగా ఎక్స్ ప్రెస్ SCR PR No.610 dt.13.11.2024 on "Railway Helpline Numbers provided in View of Accident Of Goods Train" @drmsecunderabad pic.twitter.com/M7pjbq4GXP— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024 Bulletin No.2 SCR PR No.611 dt.13.11.2024 on "Cancellation/Diversion of Trains due to Goods Train Derailment" @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/cMrk7XTS9d— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024 "Cancellation/PartialCancellation/Diversion/Reschedule of Trains due to Goods Train Derailment" @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/vfOqjCyLvR— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024ఏం జరిగిందంటే..మంగళవారం నిజామాబాద్ నుంచి ఘజియాబాద్ వైపు 43 వ్యాగన్లతో ఐరన్ కాయల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలులోని 11 వ్యాగన్లు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్–కన్నాల గేట్ మధ్యలో 282/35 పోల్ వద్ద పట్టాలు తప్పాయి. రైలు ఇంజిన్, గార్డ్ వ్యాగన్ పట్టాలు తప్పలేదు. దీంతో.. ఈ ప్రమాదం నుంచి లోకోపైలెట్లు ఇద్దరు, గార్డు సురక్షితంగా బయటపడ్డారు. రైలు ఇంజిన్‌వైపు ఉన్న 8 వ్యాగన్లతోసహా గూడ్స్‌ను రామగుండంకు తరలించారు. ప్రమాద తీవ్రతకు పట్టాలు విరిగిపోయి చెల్లాచెదురయ్యాయి. కరెంట్ పోల్స్ సైతం విరిగిపోయాయి. వ్యాగన్లు ఒక్కదానిపైకి ఒక్కటి ఎక్కడంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు కష్టంగా మారాయి. భాగ్యనగర్ రైలు రాఘవాపూర్‌కు చేరుకోగా, దానిని వెనుకకు మళ్లించి పెద్దపల్లిలో ప్రయాణికులను దింపివేశారు. దీంతో మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, ఓదెల, జమ్మికుంట తదితర రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పటికప్పుడు.. వరంగల్ వైపు వెళ్లే మరికొన్ని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రామగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్లలో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. -
పెద్దపల్లిలో ఘోరం.. మహిళలపై దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి
పెద్దపల్లి, సాక్షి: పెద్దపల్లి పట్టణ శివారులోని రంగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళలపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన కుక్క పద్మను స్థానికులు.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతులు పెద్దపల్లి పట్టణం ఉదయ నగర్‌కు చెందిన కుక్క అమృత, కుక్క భాగ్యగా పోలీసులు గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రామగుండం ఓపెన్‌కాస్ట్‌లో ప్రమాదం, ఇద్దరు మృతి
పెద్దపల్లి, సాక్షి: రామగుండంలోని ఓపెన్ కాస్ట్ గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఓసీపీ-2లో పైప్‌లైన్ లీకేజీని అరికట్టేందుకు నలుగురు కార్మికులు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు మీదపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు ఊపిరి ఆడక మృతి చెందారు. మృతులు ఫిట్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ విద్యాసాగర్‌గా గుర్తించారు. మృతదేహాలను గోదావరి ఖని ఆస్పత్రికి తరలించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ప్రమాదం గురించి తెలియగానే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రామగుండం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ -2 గనిలో పైప్‌లైన్ మరమ్మత్తులు చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కార్మికులు మృతిచెందిన ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఒక ప్రకటన విడుదల చేశారాయన. .. వర్షాకాలం గనుల్లో నిలిచిపోయే నీటిని తోడి వేసేందుకు అవసరమైన పంపులు, వాటర్ పైప్లైన్ల మరమ్మత్తుల సందర్భంగా ఈ ఘటన జరిగిందని తెలిసింది. కార్మికుల భద్రత విషయంలో అలసత్వానికి తావు లేకుండా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులకు సూచిస్తున్నాను’’ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. -
పెద్దపల్లి జిల్లా ఓడేడులో కూలిన మానేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి
-
గాలివానకు మళ్లీ కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, సాక్షి: ముత్తారం మండలం ఓడేడ్ వద్ద జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై గిడ్డర్లు మరోసారి కూలాయి. దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యతలోపం మరోసారి వెల్లడైంది. మంగళవారం సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17, 18 నంబరు పిల్లర్లపై ఐదు గడ్డర్లు పెద్ద శబ్దంతో కింద పడ్డాయని స్థానికులు తెలిపారు. గాలి దుమారం రావడంతోనే గడ్డర్లు కూలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పెద్దపల్లి జిల్లా ఆర్అండ్బీ ఇన్‌ఛార్జి అధికారి, ఈఈ నర్సింహాచారి పేర్కొన్నారు. అధికారులను క్షేత్రస్థాయికి పంపి ఘటనకు గల కారణాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. 2016 ఆగస్టులో సుమారు రూ.49 కోట్ల అంచనా వ్యయంతో వంతెన పనులు ప్రారంభించారు. నిర్మాణ సమయంలో పలుమార్లు వచ్చిన వరదలకు సామగ్రి దెబ్బతినడం, గుత్తేదారులు మారడంతో పనులు ఆలస్యమయ్యాయి. రెండేళ్లుగా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గడ్డర్లకు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1, 2 నంబరు పిల్లర్లలో మూడు గడ్డర్లు కింద పడ్డాయి.భూపాలపల్లి మీదుగా పెద్దపళ్లి జిల్లాకు వెళ్లాలంటే సుమారు 100కిలోమీటర్లు ప్రయాణించాలి. అలా కాకుండా బ్రిడ్జి గనుక పూర్తైతే కేవలం 30 కిలోమీటర్ల దూరానికి తగ్గిపోతుంది. ప్రత్యామ్నాయంగా వాగు గుండా మట్టి రోడ్డు నుంచి ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నా.. వర్షాకాలం ఆ రోడ్డు కొట్టుకుపోతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. -
రైతు వర్సెస్ యూట్యూబర్.. పీఎస్‌కు చేరిన పంచాయితీ
పెద్దపల్లి, సాక్షి: వాడలో మొదలైన చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివానగా మారింది. హైవే మీదకు చేరి ఆందోళన చేపట్టే దాకా పోయింది. చివరకు పోలీసుల ఎంట్రీతో ఆ పంచాయితీ.. పోలీస్ స్టేషన్‌కు చేరింది. పెద్దపల్లి పట్టణంలో గౌరెడ్డిపేటకు చెందిన ఓ రైతు తన ఎడ్లబండిని రోడ్డుపై ఉంచాడు. దీంతో అక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈలోపు స్థానికంగా ఉండే ఓ యూట్యూబర్ ఆవేశంతో ఊగిపోతూ అక్కడికి వచ్చాడు. సదరు రైతును దుర్భాషలాడుతూ కొట్టాడు. అది భరించలేకపోయిన ఆ రైతు.. ఆ ఎడ్ల బండితో రాజీవ్ రహదారిపై చేరి ఆందోళన చేపట్టాడు. ఈ క్రమంలో అక్కడా ట్రాఫిక్ జామ్ అయ్యింది.విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. రైతుతో పాటు సదరు యూట్యూబర్‌ను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు తరలించి పంచాయితీ నిర్వహించారు. అయితే ఈ వివాదం ఎలా ముగిసిందన్నది మాత్రం తెలియాల్సి ఉంది. -
బొలేరో, ఆర్టీసీ బస్సు ఢీ: ఇద్దరి మృతి..
కరీంనగర్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ బస్టాండ్ సమీపంలో మంగళవారం సాయంత్రం బొలేరో వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్ని ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 21 మంది ప్రయాణికులతో ధర్మారం నుంచి కరీంనగర్ వైపు వెళ్తోంది.ఇదే సమయంలో కరీంనగర్ నుంచి ధర్మారం వైపు వస్తున్న బొలేరో ట్రాలీ అదుపుతప్పి ఢీకొన్నాయి. ట్రాలీ నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ అన్వర్(25), అందులో ప్రయాణిస్తున్న అఫ్జల్(55) క్యాబిన్లో ఇరుక్కుని మరణించారు. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో ట్రాలీలోని ఆవు కొవ్వు డబ్బాలు, చర్మం రోడ్డుపై పడిపోయాయి.పెద్దపల్లి సీఐ కృష్ణ, ధర్మారం ఎస్సై సత్యనారాయణలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కున్న మృతదేహాలను కట్టర్ల సాయంతో బయటకు తీశారు. అన్వర్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికాగా, అఫ్జల్ గోదావరిఖని ప్రాంతానికి చెందిన వాడని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు రమాదేవి, ఆగవ్వకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు.ఆవు కొవ్వు ఎందుకోసం?బొలేరో ట్రాలీలో ఆవు కొవ్వు, చర్మం తరలింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? రావాణాకు అనుమతి ఉందా? లేదా? ఆవు కొవ్వు, చర్మం దేనికి వినియోగిస్తారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ, మృతుల బంధువులు వస్తే పూర్తిసమాచారం తెలుస్తుందన్నారు. -
పెద్దపల్లి: ఆరేళ్ల బాలిక హత్యాచారం.. నిందితుడి అరెస్ట్
పెద్దపల్లి, సాక్షి: జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలిక అత్యాచారం.. ఆపై హత్యకు గురైంది. నిందితుడిని గాలించి పట్టుకున్న పోలీసులు.. అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని మమతా రైస్ మిల్లో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాన్ని శవ పరీక్ష కోసం తరలించారు. ఉత్తరప్రదేశ్ చెందిన బలరాం అనే కూలీ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అంచనాకి వచ్చారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టి.. అరెస్ట్ చేశారు. బలరాంపై పోక్సో యాక్ట్, హత్యానేరం కింద కేసులు నమోదు చేశారు. హత్యాచారానికి గురైన బాలిక కుటుంబం ఆసిఫాబాద్ జిల్లా దాయిగాం గ్రామంగా తెలుస్తోంది. -
ఆ నాలుగు ఎంపీ స్థానాల్లో విజయంపై బీఆర్ఎస్ ధీమా..
పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? ఏయే అంశాలు ఆ పార్టీకి కలిసొస్తాయని భావిస్తున్నారు? అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి మారిన తర్వాత బీఆర్ఎస్ బలం పెరిగిందా? మరింత తగ్గిందా? అసలు గులాబీ శ్రేణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం..అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై మాత్రం చాలా ఆశలే పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను లోక్ సభకు చేయకుండా చర్యలు తీసుకుంది. పోటీ చేసే అభ్యర్థులను దాదాపు మెజార్టీ స్థానాల్లో మార్చింది. ముఖ్యంగా నాగర్ కర్నూల్, పెద్దపల్లి, మెదక్, సికింద్రాబాద్ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తోంది. అసలెందుకు ఈ స్థానాల్లో ఆ పార్టీ ఆశలు పెట్టుకుందంటే అందుకు రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయంటోంది ఆపార్టీ. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో కాస్ట్ ఈక్వేషన్ ఎక్కువగా పనిచేస్తుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆర్ ఎస్ ప్రవీణ్ మాజీ పోలీస్ అధికారి స్థానికంగా బలం ఉంది. అదీకాక నియోజకవర్గంపై పట్టుకుంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వ్యక్తి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గెలిచే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. సికింద్రాబాద్ విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఉద్యమ నాయకుడు మాత్రమే కాదు స్థానికంగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి పద్మారావు గౌడ్. అంతే కాకుండా బీజేపీఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం, అభివృద్ది సరిగా చేయలేదన్న విమర్శలు బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలని ఆపార్టీ అంచనా వేస్తోంది.పెద్దపల్లి లో కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని గులాబీ పార్టీ అంచనాలు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుండి పోటీ చేసి ఓడిన కొప్పుల ఈశ్వర్ కచ్చితంగా ఇక్కడ గెలుస్తారని భావిస్తోంది. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వడం పై కొంత జనంలో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అందుకే పెద్దపల్లిలో పార్టీ గెలుస్తుందని ఆశలు పెట్టుకుంది. మెదక్పాలో ర్టీ సంస్థాగతంగా బలంగా ఉండటం తో పాటు, ఇక్కడ కొన్ని సిట్టింగ్ స్థానాలు ఉండటం పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిద్దిపేట గజ్వేల్ లో భారీగా ఓట్లు పడి మెజారిటీ ఎక్కువ వస్తుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి అవకాశం కూడా ఉందని అంచనా వేస్తోంది. గెలవక పోయిన వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్ గిరిలో రెండో స్థానంలో ఉండే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. అసెంబ్లీ ఫలితాలపై ఇలానే లెక్కలేసుకున్న బీఆర్ ఎస్ పార్టీకి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ని స్థానాలు తెలంగాణ ప్రజలు కట్టబెడతారన్నది జూన్ 4న తేలనుంది. -
ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
సుల్తానాబాద్‌రూరల్: డ్రైవర్ సీటు కింది స్ప్రింగ్ ఊడిపోవడంతో ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడడంతో ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రావణ్‌కుమార్, మృతుల కుటుంబసభ్యుల కథనం ప్రకారం..సుల్తానాబాద్ మండలం చిన్న కూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ మల్యాల వెంకటేశ్ మియాపూర్ గ్రామ పరిధిలో చేను కౌలుకు తీసుకొని మొక్కజొ న్న సాగు చేశాడు. పంట చేతికి రావడంతో తన భార్య మల్యాల వైష్ణవి(35)తోపాటు పోచంపల్లి రాజమ్మ(61), బేతి లక్ష్మి(50), పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మి ని ట్రాక్టర్లో తీసుకొని ఆదివారం ఉదయం 7గంటల సమయంలో చేను వద్దకు వెళ్లాడు. మొక్కజొన్న కంకులు కోసి ట్రాక్టర్లో లోడ్ చేసుకున్నాడు. తిరుగుప్రయాణంలో వారిని ట్రాక్టర్ ట్రాలీ పై ఎక్కించుకొని కాలువ వెంట ఉన్న దారి నుంచి వస్తున్నాడు. మధ్యాహ్నం 12గంటల సమయంలో డ్రైవర్ సీటు కింద ఉన్న స్ప్రింగ్ ఊడిపోయింది. దీంతో ఒక్కసారిగా డ్రైవర్ కుప్పకూలిపోయాడు. స్టీరింగ్ చేజారి ట్రాక్టర్ అదుపు తప్పింది. వేగంగా కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో ట్రాలీ కింద మహిళా కూలీలు నలిగిపోయారు. ఇందులో మల్యాల వైష్ణవి, పోచంపల్లి రాజమ్మ, బేతి లక్ష్మి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, పోచంపల్లి లక్ష్మికి తీవ్ర గాయాలు సమీపంలోని రైతులు వెంటనే కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ వెంకటేశ్‌కు స్వల్ప గాయాలు కావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు ఎస్సై కేసు నమోదు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు. -
అన్నదాతల నుంచి ఆటో డ్రైవర్ల దాకా సర్కార్‌పై ఆగ్రహం: కేటీఆర్
సాక్షి, వరంగల్/ పెద్దపల్లి: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లిలో భారీ మెజారిటీతో గెలుస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరంగల్‌లో వంద శాతం విజయం బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌తో పాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో కేటీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటు కాంగ్రెస్‌కు.. అటు బీజేపీకి రాష్ట్రంలో ఒకేసారి ఎదురుదెబ్బ తగలబోతోందని అన్నారు. అధికార కాంగ్రెస్‌పై ప్రజాగ్రహం పెరుగుతోందని తెలిపారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదని విమర్శించారు. వరంగల్‌లో చివరి క్షణంలో కడియం శ్రీహరి కుటుంబం పార్టీకి మోసం చేసిన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని అన్నారు కొందరు నాయకులు వలస వెళ్లినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. వరంగల్ నుంచి బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ అభ్యర్థిత్వంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. అందరి ఏకాభిప్రాయంతో అభ్యర్థి ఎంపిక జరిగిందని తెలిపారు. 2001 నుంచి కేసీఆర్‌తో కలిసి నడిచిన సుధీర్ కుమార్ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చైతన్యానికి ప్రతీకైన వరంగల్ ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మచ్చలేని నాయకుడు కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లిలో కూడా గులాబీ గెలుపు ఖాయమై పోయిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మచ్చలేని నాయకుడిగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొప్పుల ఈశ్వర్ లాంటి ఉద్యమ గొంతుకను ఎన్నుకుంటేనే పార్లమెంట్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించగలుగుతారని పేర్కొన్నారు. అన్నదాతల నుంచి మొదలుకొని ఆటో డ్రైవర్ల దాకా ప్రజలంతా కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని వెల్లడించారు. ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో చెప్పుకోవడానికి బీజేపీకి ఎజెండానే లేదని, అందుకే మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి గట్టెక్కాలని చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా అసలైన సమస్యలు చర్చకు రాకుండా ప్రజల దృష్టిని మరల్చే ఇలాంటి కుట్రలను క్షేత్రస్థాయిలో తిప్పి కొట్టాలని సూచించారు. -
మూడేళ్లుగా ముందుకుసాగని పథకం.. విత్తనోత్పత్తికి అంతరాయం!
రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి ఉద్దేశించిన గ్రామ విత్తనోత్పత్తి పథకానికి మంగళం పాడినట్లే కనపడుతోంది. 50శాతం సబ్సిడీపై రైతుకు ఫౌండేషన్ సీడ్ (మూల విత్తనం) అందించి నాణ్యమైన విత్తనాలు రైతులే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇక లేకుండా పోయింది. మూడేళ్లుగా ఈ పథకం ఊసే లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. వానాకాలానికి సంబంధించి 5.80లక్షలు ఎకరాల్లో పంటలు సాగవుతుంటాయి. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలు ఉంటాయి. యాసంగికి సంబంధించిన వివిధ రకాల పంటలు 3.5లక్షల ఎకరాలకుపైగా సాగులోకి వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరికీ నాణ్యమైన విత్తనం అందించడం ప్రభుత్వానికి కష్టతరంగా మారుతోంది. ఈ దుస్థితిని నివారించి రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి గతంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి పథకాన్ని అమలు చేశారు. సిద్దిపేట జిల్లాను విత్తన హబ్‌గా తయారు చేయాలనే సంకల్పంతో పనిచేశారు. ప్రతిసారి ఏదో పంటను ఎంచుకొని ఈ పథకం అమలు చేసేవారు. ఏటా జిల్లాలోని పలు గ్రామాల్లో వానాకాలానికి సంబంధించి వరి, కంది, మొక్కజొన్న, యాసంగిలో శనగ పంటల్లో విత్తనోత్పత్తి చేసేవారు. దీని ద్వారా రైతులకు 50శాతం సబ్సిడీపై మూల విత్తనం అందిస్తారు. పరిశోధనా స్థానాల నుంచి నేరుగా వచ్చే వీటి వల్ల విత్తనోత్పత్తికి అవకాశముంటుంది. విత్తనాలు అందించిన తర్వాత వ్యవసాయశాఖ విత్తనం వేసింది మొదలు.. పంట చేతికొచ్చేసరికి మూడుసార్లు శిక్షణ అందించి నాణ్యమైన విత్తన ఉత్పత్తికి బాటలు వేసేవారు. ఉత్పత్తిగా వచ్చిన విత్తనాలను రైతులే స్వయంగా తెలిసిన రైతులకు అమ్ముకోవడం, లేదా ప్రభుత్వమే విత్తన కంపెనీలతో అగ్రిమెంట్ చేయించి మార్కెటింగ్ చేసేవారు. కొంత కాలం ఈ పథకం సత్ఫలితాలనిచ్చింది. క్రమేపి ఈ విధానం వల్ల ఆశించిన ఫలితాలు రాక మొగ్గుబడిగా సాగింది. రైతులు ఉత్పత్తి చేసిన విత్తనాలు నాణ్యాత ప్రమాణాలు కలిగి ఉన్నాయా? లేదా అనే విషయం తెలియక కొనుగోలు చేయడానికి చుట్టు పక్కల గ్రామాల రైతులు ఆసక్తి చూపలేదు. కంపెనీలతో అగ్రిమెంట్ చేయించే విషయంలో వ్యవసాయ శాఖ చొరవ చూపలేదు. మరీ మూడేళ్ల నుంచి అయితే పథకం ఊసే కరువైంది. ఫలితంగా ఆసక్తి ఉన్న రైతులకు ఫౌండేషన్ సీడ్‌ను కూడా అందలేదు. దీనిని బట్టి చూస్తే ఈ పథకానికి నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొత్త ప్రభుత్వం చొరవపైనే ఆశలు.. కొత్త ప్రభుత్వం చొరవ చూపితేనే ఈ గ్రామ విత్తనోత్పత్తి పథకం సమర్థవంతంగా అమలయ్యే అవకాశముంది. ప్రధానంగా రైతులకు నాణ్యమైన విత్తన సబ్సిడీతోపాటు ఎరువులు, క్రిమిసంహారకాలను సబ్సిడీపై అందించాల్సి ఉంది. దీంతోపాటు రైతులు ఉత్పత్తి చేసే విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసేలా రైతులకు ఒప్పందం కుదిరిస్తే.. రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభించి భారీ ప్రయోజనం జరిగే అవకాశముంది. ఇవేకాకుండా ఆత్మకమిటీల పనితీరు మెరుగుపరచడం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పథకాలను సైతం పునరుద్ధరించాల్సి ఉంది. ఇవి చదవండి: కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నిర్వహణకు ఏపీ,తెలంగాణ అంగీకారం! -
వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు, ఒకరి మృతి
-
త్వరలోనే జిల్లాల పర్యటనకు కేసీఆర్: హరీష్ రావు
సాక్షి, పెద్దపల్లి: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు హరీష్ రావు. కాగా, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గం పరిధిలోని నేతలు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..‘కేసీఆర్ కోలుకుంటున్నారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్‌కి వచ్చి ప్రతీ రోజూ కార్యకర్తలను కలుస్తారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయి. కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ గుర్తును కాంగ్రెస్ ప్రభుత్వం చెరిపేస్తోంది. కేసీఆర్ గుర్తును కేసీఆర్ కిట్ నుంచి తొలిగిస్తారేమో కానీ.. తెలంగాణ ప్రజల గుండెల నుంచి తొలగించలేరు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దులు, వాయిదాలు అన్నట్టుగా నడుస్తోంది. కాంగ్రెస్ విపరీత చర్యలపై ఉద్యమిస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేమంతా బస్సు పట్టుకుని బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. తెలంగాణ కోసం ఉద్యమంలో రాజీనామాలు చేశాం తప్ప రాజీ పడలేదు. ఈ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
‘సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తాం’
సాక్షి, పెద్దపల్లి: ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్టీయూసీ) కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సోమవారం సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సింగరేణి ఆర్జీ 3 పరిధిలోని ఏఎల్పీ, ఓసీపీ 1, ఓసీపీ 2 బొగ్గుగనుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరుపున మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం శ్రీధర్‌బాబు మీడియాతో మట్లాడారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని తెలపారు. నూతన అండర్ గ్రౌండ్ బొగ్గుగనులను ఏర్పాటు చేస్తామన్నారు. డిపెండెంట్ కార్మికులకు డబ్బులు ఖర్చు కాకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిస్కారానికి హైపవర్ కమిటీ నియమిస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు. -
ఘోరం.. పెద్దపల్లిలో రైలు ఢీకొని ఇద్దరి మృతి
సాక్షి, కరీంనగర్: గురువారం పెద్దపల్లి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి రైల్వేస్టేషన్ వద్ద తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతుల వివరాలు.. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది. -
'ఎస్ఆర్ఆర్ నుంచే నా రాజకీయ జీవితం' : పొన్నం ప్రభాకర్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోనే ఉమ్మడి కరీంనగర్‌ను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల అని, రాజకీయ ఉద్ధండులు వైఎస్ రాజశేఖరరెడ్డి, జువ్వాడి చొక్కారావు, ఎమ్మెస్సార్, జి.వెంకటస్వామి, జైపాల్‌రెడ్డి నుంచి అక్షరాలు నేర్చుకున్నానని చెప్పా రు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బుధవారం పొన్నం ప్రభాకర్ కరీంనగర్ వచ్చారు. నగరంలోని ఇందిరాచౌక్‌లో ఏర్పాటు చేసిన వి జయభేరి సభలో ఆయన మాట్లాడుతూ సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి టి.జీ వన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సహకారంతో ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళుతామన్నారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, తమది చేతల ప్రభుత్వమన్నారు. ప్రభుత్వం మారిందని, అధికారులు కూడా వ్యవస్థను మార్చుకోవాలని సూచించారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని, తాను కరీంనగర్ బిడ్డనన్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాల అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, ఎన్ఎస్యూఐ జిల్లా, రాష్ట్ర అ ధ్యక్షుడిగా, మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా పనిచేశానన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో కరీంనగర్ ఎంపీ అయ్యానన్నారు. తన రాజకీయ గురువు జువ్వాడి చొక్కారావు 1973లో రవాణా శా ఖ మంత్రి అయితే, చొక్కారావు శిష్యుడినైన తాను 2023లో రవాణాశాఖ మంత్రి అయ్యానన్నారు. తా ను 1987లో రాజకీయ జీవితం ప్రారంభించానని, ఈ 36 ఏళ్లలో ఎక్కడా అవినీతికి తావులేదని, ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. కొంతమంది చేతగాక పార్టీలు మారినోళ్లు తనను విమర్శిస్తే, భగవంతుడు ఒక్క అవకాశం ఇస్తాడని చెప్పానంటూ గుర్తు చేసుకున్నారు. తాను పార్టీ మారలేదని కాంగ్రెస్ అంటే పొన్నం, పొన్నం అంటేనే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. తనకు ప్రజల ఆశీర్వాదమే టానిక్ అ ని, కేసీఆర్ వాడే టానిక్ కాదంటూ చమత్కరించా రు. ఎంపీగా తాను పార్లమెంట్లో తెలంగాణ కో సం కొట్లాడి, మా ఎంపీ పొన్నం అని ప్రజలు గర్వంగా చెప్పుకునేలా చేశానన్నారు. మానకొండూరు ఎ మ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించి ప్రజల ఆశలు నెరవేర్చిన నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. తన పార్లమెంట్ పరిధిలో నాలుగు స్థానాలు గెలిపించుకున్నానని తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి స త్యం మాట్లాడుతూ నియంతృత్వ ప్రభుత్వం కూలి పోయి, ప్రజాప్రభుత్వం వచ్చిందన్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పొన్నం ప్రభాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం శుభసూచకమన్నారు. కార్యక్రమంలో కరీంనగర్, హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీలు పురుమల్ల శ్రీనివాస్, వొడితెల ప్రణవ్, నాయకులు వైద్యుల అంజన్‌కుమార్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మెనేని రోహిత్‌రావు, మంజులారెడ్డి, కటకం వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. దారిపొడవునా నీరాజనం! మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్, అనుబంధ విభాగాలు, పొన్నం అభిమానులు, కుల, బీసీ సంఘాలు ఘనస్వాగతం పలికా యి. ఎమ్మెల్యేలు క వ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి ఓపెన్‌టాప్ వాహనంలో నగరానికి చేరుకున్న పొన్నం ప్రభాకర్‌కు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన స్వాగత వేదికల వద్ద పూలవర్షంతో నీరాజనం పట్టారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి కోతిరాంపూర్, కమాన్‌చౌరస్తా, సిక్వాడీ, శ్రీపాదచౌక్ మీదుగా ఇందిరాచౌక్ వరకు అడుగడుగునా స్వాగతం పలికారు. కోలాటాలు, నృత్యాలు, డప్పు వాయిద్యాలతో మ హిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గొల్లకురుమలు గొంగడితో సత్కరించారు. సిక్లు కరవాలం బహుకరించారు. ఆర్టీసీ కార్మికులు గజ మాలతో సన్మానించారు. ఇందిరాచౌక్ వద్ద విజయభేరి సభ ముగిసిన తరువాత పొన్నం ప్రభాకర్ ర్యాలీగా డీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నాయకులతో సమావేశమయ్యారు. నాయకులు కట్ల సతీశ్, కొడూరి రవీందర్‌గౌడ్, మునిగంటి అనిల్, దన్ను సింగ్, ఖమర్, సిరాజొద్దిన్, మొహమ్మద్ అమీర్, బోనాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇవి చదవండి: రెగ్యులర్ కమిటీ లేనట్టేనా? ఇంతకీ చైర్మన్ ఎవరు? -
కేటీఆర్: 55 ఏళ్ల ఏమీ చేయని వారు ఇప్పుడు ఏం చేస్తారు?
-
ఎన్నికల వేళ.. ఖమ్మం, పెద్దపల్లిలో రూ.11 కోట్లు పట్టివేత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరాయి. మరో మూడు రోజుల్లో పోలింగ్ జరగనుంది. రేపటితో(నవంబర్ 28) ఎన్నికల ప్రచారానికి గడువు ముగియనుండటంతో అన్నీ పార్టీల నేతలు సభలు, రోడ్‌షోలతో హోరెత్తిస్తున్నారు. కాలంతో పరుగెడుతూ ఎన్నికల కుస్తీ పడుతున్నారు. బిజీ షెడ్యూల్‌తో అభ్యర్థులకు నెలరోజుల నుంచి కంటినిండ నిద్ర కరువైంది. గెలుపు కోసం ఎంత ఖర్చు పెట్టేందుకుకైనా ప్రధాన పార్టీల అభ్యర్థులు సిద్దమయ్యారు. ఇందుకోసం భారీ నగదును సమకూర్చుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఐటీ, రాష్ట్ర పోలీసులు, ఈసీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా ఖమ్మం, పెద్దపల్లిలో మొత్తం రూ. 11 కోట్లకు పైగా నగదుపట్టుబడింది. ఖమ్మం జిల్లాలో రెండు చోట్ల భారీగా నగదు పట్టుబడింది. జిల్లా ముత్తగూడెంలో 6 కోట్ల నగదును అధికారులు పట్టుకున్నారు. పాలేరులో చేపట్టినతనిఖీల్లో రూ, 3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు, ఐటీ, ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు. కాంగ్రెస్ అభ్యర్థిగా చెందిన డబ్బుగా అధికారులు భావిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 2 కోట్ల 18 లక్షల రూపాయలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో కాంగ్రెస్ సంబంధిత ప్రచార కార్యాలయంలో నిల్వ ఉంచిన ఈ నగదును ఎస్ఎస్టీ, ఎలక్షన్స్ స్క్వాడ్ సీజ్ చేశారు. పట్టుబడిన నగదు రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చెందిన నగదుగా అనుమానిస్తున్నారు. చదవండి: ఐటీ పార్కుల్లో మతం ఎక్కడిది?.. కేటీఆర్‌పై కిషన్ రెడ్డి ఫైర్ -
మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు
-
పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయభేరీ సభ
-
కేసీఆర్ సీఎంలా కాదు.. రాజులా వ్యవహరిస్తున్నారు: రాహుల్ గాంధీ
సాక్షి, పెద్దపల్లి: బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కైందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ఇక్కడ బీఆర్ఎస్ను, కేంద్రంలో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంత అవినీతి చేసిన విచారణ జరగలేదని అన్నారు. కులగణన చేయడానికి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఇకపై మీ ప్రభుత్వం ఉండదని.. ప్రజా ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబానికే ముఖ్యశాఖలు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ 2004లో హామీ ఇచ్చిందని రాహుల్ పేర్కొన్నారు. రాజకీయ నష్టం జరిగినా సోనియా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 10 ఏళ్ల తర్వాత కూడా సోనియా కల, తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ నెరవేర్చలేదని మండిపడ్డారు. సీఎం కుటుంబ సభ్యులే ప్రభుత్వంలోని ముఖ్యశాఖలను కంట్రోల్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మేం అబద్ధాలు చెప్పం.. కొన్ని రోజుల క్రితం పార్లమెంట్లో కులగణన గురించి మాట్లాడినట్లు రాహుల్ తెలిపారు. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారని, తన ఇల్లు కూడా లాక్కున్నారని ప్రస్తావించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని భరోసా ఇచ్చారు. తాము అబద్ధాలు చెప్పామని, ఆరు గ్యారెంటీలను మొదటి కేబినెట్లోనే ఆమోదిస్తామని అన్నారు. రైతు భరోసా ద్వారా ఎకరాకు 15 వేలు ఇస్తామని, సింగరేణి గనులను ప్రవేటే పరం కానివ్వమని హామీ ఇచ్చారు. చదవండి: అబ్రహంకు బీఫామ్ ఇవ్వని కేసీఆర్.. కలవకుండా కారెక్కి వెళ్లిపోయిన కేటీఆర్ చెప్పిన హామీలు అమలు చేస్తాం ‘కర్ణాటక.. రాజస్థాన్‌లో అమలు చేశాం. తెలంగాణలోనూ మేము చెప్పిన హామీలు అమలు చేస్తాం. తెలంగాణ మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తారు. వంట గ్యాస్ రూ. 500కే ఇస్తాం. రైతులకు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలు కూడా చేస్తాం. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు సింహాల్లాంటివారు. కేసీఆర్ సీఎంలా కాదు రాజులా వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరంతో కాంట్రాక్టర్లకే లాభం రైతు బంధుతో భూస్వాములకే లాభం. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎంతమందికి వచ్చాయి?. కాళేశ్వరంలో అనినీతికి పాల్పడి లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారు. కాళేశ్వరంతో మీకు లాభం చేకూరిందా?. కేవలం కాంట్రాక్టర్లకే లాభం చేకూరింది. ధరణి పోర్టల్‌తో మీకు లాభం చేకూరిందా?. ధరణిలో భూముల రికార్డు మార్చారు. పేదల భూములు లాక్కున్నారు. కేసీఆర్ మూడెకరాలు దళితులకు ఇస్తాం అన్నారు ఇవ్వలేదు. మోదీ 15 లక్షలు మీ అకౌంట్లో వేస్తా అన్నారు ఇవ్వలేదు. దేశ బడ్జెట్ రూ. 44 లక్షల కోట్లు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్లాలన్నది 90 మంది కార్యదర్శులు నిర్ణయిస్తారు. 90 మంది కార్యదర్శులల్లో ముగ్గురు మాత్రమే ఓబీసీ వారు ఉన్నారు. తెలంగాణకు వస్తే ఎంతో సంతోషంగా ఉంది. తెలంగాణతో నాకున్న సంబంధం రాజకీయపరమైనది కాదు. మీ అందరితో నాకు ప్రేమ, కుటుంబ అనుబంధం ఉంది. -
ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్..
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ ఉన్నారు. ఈ సందర్బంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. పాలమూరులో ప్రధాని మోదీ చేసిన కామెంట్స్‌కు కేటీఆర్ కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణపై ప్రధానికి ప్రేమ లేదు. మోదీ ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వచ్చారు?. వడ్లు కొనమంటే నూకలు తినమన్నది కేంద్రమే కదా?. మోదీ ఎన్ని అబద్ధాలు చెప్పినా తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు దక్కవు. దేశంలో ఎక్కడైనా బీజేపీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందా? అని ప్రశ్నించారు. మేము ఇచ్చినట్టు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వండి. గుజరాత్ బుద్ధి మాకు నేర్పకండి. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారు. తెలంగాణకు మోదీ ఏం చేశారో చెప్పాలి. గుజరాత్‌కు ఒక నీతి.. తెలంగాణకు మరో నీతా?. ప్రధానికి స్పీచ్ ఎవరు రాస్తున్నారో తెలియదు. రుణమాఫీ పేరుతో కేసీఆర్ మోసం అంటూ మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను మోదీ ఉపసంహరించుకోవాలి. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబ సభ్యుడే అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు కౌంటర్.. ఇదే సమయంలో తెలంగాణకు మళ్లీ కేసీఆర్ సీఎం కాబోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ దొందు దొందే. పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డిని గెలిపించండి. పెద్దపల్లిని ఒక జిల్లా కేంద్రంగా మార్చాం. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ రూ.200 దాటి పెన్షన్ ఇవ్వలేదు. తాగునీరు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్‌కు ఎప్పుడూ రాలేదు. గత ప్రభుత్వ హయాంలో నీళ్ల కోసం ఎప్పుడూ గొడవలే జరిగేవి. కరెంట్ కోసం గతంలో ఎన్నో తిప్పలు ఉండేవి. 24 గంటల కరెంట్‌పై కాంగ్రెస్ నేతలకు నేను సవాల్ చేస్తున్నాను. మేమే బస్సులు పెడతాం.. ఎక్కడికైనా వచ్చి చూసుకోండి. కాంగ్రెస్ నేతలు వచ్చి కరెంట్ తీగలు పట్టుకోమని కోరుతున్నా. ఆరు గ్యారెంటీలు అంటూ కొత్త పాట మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి వారెంటీ ఉందా?. వారెంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారెంటీని నమ్ముదామా?. రైతులను ఏరోజైనా కాంగ్రెస్ పార్టీ పట్టించుకుందా?. కేసీఆర్ అంటే అమ్మకం.. మోదీ అంటే అమ్మకం.. అంతకుముందు కేటీఆర్ రామగుండంలో మాట్లాడుతూ.. మరోసారి ఎమ్మెల్యేగా కోరుకంటి చందర్‌ను గెలిపిస్తే రామగుండంను నేను దత్తత తీసుకుంటాను. కానీ, భారీ మెజారిటీ రావాలన్నదే నా కండీషన్. తెలంగాణ సాధనలో ఆర్టీసీతో పాటు.. సింగరేణి కార్మికులది కీలకపాత్ర. నవరత్నాలు, మహారత్నాలకు ధీటుగా సింగరేణి రికార్డులను బద్ధలు కొడుతోంది. నాడు 419 కోట్లు లాభాలుంటే... నేడు 2,222 కోట్ల లాభాల్లో ఉంది సింగరేణి. కార్మికులకు ఆ లాభాల్లో వాటా 32 శాతం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ అంటే నమ్మకం, మోదీ అంటే అమ్మకం’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణకు మోదీ వరాలు.. ఫుల్ జోష్‌లో బీజేపీ కేడర్ -
బీజేపీకి సోమారపు రాజీనామా!
సాక్షి, పెద్దపల్లి: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీకి రోజురోజుకూ తగ్గుతున్న ఆదరణ, కార్యకర్తల ఒత్తిడి మేరకు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ టికెట్ ఇస్తే.. ఆ పార్టీ తరపున పోటీకి సోమారపు ఆసక్తి చూపుతుండగా, కార్యకర్తలు, అనుచరులు ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు.. నామినేడ్ పోస్టు ఇస్తామని బీఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సోమా రపు ఏ పార్టీలో చేరతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయమై సోమా రపు సత్యనారాయణను ఫోన్లో సంప్రదించగా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేద న్నారు. బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా ఇన్చార్జిగా పార్థసారథి సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా ఇన్చార్జిగా ఏపీకి చెందిన డాక్టర్ పార్థసారథి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్య దర్శిగా వ్యవహరిస్తున్నారు. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ ప్రత్యేక బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. తనపై నమ్మకం ఉంచి నూతన బాధ్యతలు అప్పగించిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సంఘటనా కార్యదర్శి మధుకర్‌కు పార్థసారథి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: HYD: ట్యూషన్‌కు వెళ్లమన్నందుకు బాలిక ఆత్మహత్య -
ఆత్మహత్యకు యత్నించి.. చివరికి..
పెద్దపల్లి: స్థానిక తిలక్‌నగర్‌లో నివాసముంటూ జీడీకే–1వ గనిలో పనిచేస్తున్న సింగరేణి కార్మికుడు తాటికొండ సంజీవ్(30) ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. ఈనెల 23న సంజీవ్ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. సంజీవ్‌కు ఆరునెలల కిత్రం ములుగుకు చెందిన అమ్మాయితో వివాహం కాగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిగా ఉంటున్నారు. మృతుడి తల్లి విజయ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్ఐ సుగుణాకర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
TS Crime News: .. ఘోర రోడ్డు ప్రమాదం.. సజీవ దహనమైన డ్రైవర్..!
కరీంనగర్: సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి. మంటల్లో డ్రైవర్ సజీవ దహనం కాగా క్లీనర్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఎస్సై విజేందర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియానా రాష్ట్రం పాల్వల్ జిల్లా, హతిని తాలుకాకు చెందిన అన్నదమ్ములు ఫర్వీద్(25), ఇంజిమామ్ లారీ డ్రైవర్, క్లీనర్‌గా ఏలూరులో పని చేస్తున్నారు. ఏలూరు నుంచి ఏపీ 37టీఈ 5831 లారీలో టైల్స్ లోడ్ చేసుకొని మంచిర్యాల బయలుదేరారు. ఈక్రమంలో సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి పరిధిలో ఏపీ 29 టీబీ2382 నంబర్‌గల లారీ రాజీవ్ రహదారి పక్కనే ఉన్న మారుతి రైస్‌మిల్ నుంచి ధాన్యం లోడ్‌తో రోడ్డుపైకి వస్తున్న క్రమంలో టైల్స్ లోడ్‌తో ఉన్న లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఇంజిన్ నుంచి మంటల చెలరేగాయి. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న ఫర్వీద్ మంటల్లోనే సజీవ దహనం కాగా, క్లీనర్ ప్రమాదాన్ని గుర్తించి కిందకు దూకి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈప్రమాదంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి ఏసీపీ ఏడ్ల మహేశ్, సీఐ జగదీశ్‌లు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అమ్మ ప్రేమకు బహుమతిగా చంద్రుడిపై స్థలం కొన్న కూతురు..
సాక్షి, పెద్దపెల్లి జిల్లా: పెద్దపల్లికి చెందిన ఓ మహిళ తన తల్లి మీద ఉన్న ప్రేమతో చంద్రుడిపై స్థల కొనుగోలు చేసి గిఫ్ట్‌గా అందించారు. గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచంద్ర, వకుళాదేవి దంపతుల పెద్ద కుమార్తె సాయి విజ్ఞత.. తల్లి వకుళాదేవి పేరిట చంద్రుడిపై 2022లో లూనార్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకుంది. ఆగస్టు 23న వకుళాదేవి, ఆమె మనువరాలు ఆర్త సుద్దాల పేర్ల మీద చంద్రుడిపై ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యింది. కాగా సాయి విజ్ఞత అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో గవర్నర్ కిమ్ రెనాల్డ్స్ వద్ద ప్రాజెక్ట్ మేనేజర్‌గ, ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. ఇకచంద్రుడిపై భూమిని కొనుగోలు చేయాలి అనుకునే వారు లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్‌ను సందర్శించి, భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ సహా పలు ప్రాంతాలు ఉంటాయి. ముందుగా మీకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను పొందాలి. చదవండి: చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ అడుగుపెట్టిన దృశ్యాలు చంద్రుడిపై ఎకరానికి రూ. 35 లక్షలకుపైనే ధర ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి అక్కడ జీవరాశి బతికే అవకాశం ఉందా? లేదా? అనే విషయంలో ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, చాలా మంది తమ ప్రెస్టేజీ కోసం అక్కడ భూమిని కొనుగోలు చేస్తున్నారు. చంద్రుడి మీద కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇప్పటికే అక్కడ భూమిని కొన్నారు. మరోవైపు చంద్రయాన్–3 మిషన్ విజయవంతం అయిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ బుధవారంచంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై అడుగుపెట్టింది. అందులో నుంచి రోవర్ బయటకు వచ్చిది. వాస్తవానికి రోవర్ జీవితకాలం ఒక లూనార్ డే. అంటే 14 రోజులు. 14 రోజులపాటు రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండింగ్ సైట్ నుంచి అటూఇటూ సంచరిస్తూ పరిశోధనలు చేయనుంది. అయితే, రోవర్ జీవితకాలం 14 రోజులు మాత్రమే కాదని, మరింత పెరిగే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. దక్షిణ ధ్రువంపై 14 రోజులు చీకటి, 14 రోజులు వెలుగు ఉంటుంది. -
TS Election 2023: మూడు పార్టీలు కుట్ర పన్నుతున్నాయి.. : పుట్ట మధు
పెద్దపల్లి: పేద కుటుంబం నుంచి వచ్చిన తాను పేదల కష్టాలు తీర్చుతుంటే ఓర్వలేని కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి తనపై కుట్ర చేస్తోందని, అయినా ప్రజల్లో తనపై విశ్వాసం ఉందని మంథని బీఆర్ఎస్ అభ్యర్థి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. ఆయన బుధవారం మంథనికి రాగా.. కమాన్‌పూర్ మండలం గొల్లపల్లి నుంచి మంథని వరకు మంగళహారతులు, బైక్‌ర్యాలీతో స్వాగతం పలికారు. మంథని వద్ద భారీ గజమాలతో సన్మానించారు. అంబేద్కర్ కూడలిలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ పార్టీలోని కొందరు అసమ్మతివాదులతో కలిసి తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు కసాయి కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోతారని తెలిపారు. ఆత్మగౌరవం, పేదల ఆకలితీర్చేందుకు అనేకమంది అడవిబాట పడితే ఈ ప్రాంత నాయకత్వం కారణంగా వందలాది మంది నేలకొరిగారని గుర్తు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటానని, 2014 కంటే రెట్టింపు ఉత్సాహం కార్యకర్తలో కనిపిస్తోందని, వంద రోజులు తన కోసం కష్టపడితే ఐదేళ్లు కడుపులో పెట్టుకొని చూసుకుంటానని మధు తెలిపారు. జయశశంకర్భూపాలపల్లి జెడ్పీ చైర్మన్ జక్కుశ్రీహర్షిణి, మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
మధ్యప్రదేశ్ బాలిక మృతి.. కేసులో మరో మలుపు! ఇంతకీ ఏం జరిగింది ?
కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన పెద్దపల్లి జిల్లాలో మధ్యప్రదేశ్ బాలిక కేసు మరో మలుపు తిరిగింది. ఆగస్టు 14వ తేదీ రాత్రి బాలికపై సామూహిక లైంగికదాడి జరిగిందని, దాంతో అమ్మాయి అనారోగ్యం పాలై, మరణించిందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా బాలిక ఒంటిపై గాయాలున్న మాట వాస్తవమే గానీ, లైంగికదాడి జరిగినట్లుగా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్న విషయం సంచలనం రేపుతోంది. ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే రామగుండం పోలీసులు స్పందించారు. గోదావరిఖని, పెద్దపల్లి ఏసీపీలు, పెద్దపల్లి డీసీపీలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన సీపీ రెమా రాజేశ్వరి కేసును స్వయంగా పర్యవేక్షించారు. అసలు అనారోగ్యంతో ఉన్న బాలికను గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు తరలించాల్సి వచ్చింది? వీరికి వాహనం ఎవరు సమకూర్చారు? తనపై కొందరు లైంగికదాడి జరిపారు.. అంటూ బాలిక చెబుతున్న ఆడియోలో వాస్తవమెంత? తదితర విషయాలపై దాదాపు 48 గంటల సుదీర్ఘ సాంకేతిక, శాసీ్త్రయ దర్యాప్తు తర్వాత రామగుండం పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలిసింది. ఇంట్లో వారే కొట్టారా? విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట శివారులోని అక్కాబావల వద్దకు మధ్యప్రదేశ్ నుంచి బాలిక వచ్చింది. ఆమె మరణానికి ముందు ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. ఇవి ఎవ రు చేశారు? అన్నదానిపై స్పష్టత లేదు. బాలికను కుటుంబసభ్యులు లేదా తెలిసినవారే తీవ్రంగా కొట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆరోజు తనను తీవ్రంగా కొట్టడంపై బాలిక మనస్తాపానికి గురైంది. అది తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనుకుందేమోనని అనుమానిస్తున్నారు. బాలిక చివరిసారిగా కనిపించిన పరిస్థితులు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆమె ఆగస్టు 14 మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇంట్లో లేదు. ఆ సమయంలో ఏం చేసింది? అన్నదాని పై పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో బాలిక పురుగుల మందు షాపుల ముందు, రాత్రి 8 గంటల ప్రాంతంలో సమీపంలోని ఓ చెరువు వద్ద కూడా కనిపించిందని సమాచారం. అర్ధరాత్రి చెరువు వద్ద ఏం చేస్తున్నావని కొందరు మందలించడంతో అక్కడి నుంచి బస్టాండ్ వైపు వెళ్లినట్లు తెలిసింది. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది కాబట్టే.. ఈ రెండు ప్రాంతాల్లో కనిపించిందని పోలీసులు భావిస్తున్నారు. ఇంటి నుంచి బస్టాండ్ వద్దకు బాలిక సంచరించిన ప్రాంతాల్లో మొత్తం 15 మంది ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. రాత్రి 11 తర్వాత ఇంటికి చేరిన బాలిక.. అస్వస్థతకు గురైంది. వెంటనే బాలిక బంధువులు కారు మాట్లాడుకొని, ఆమెను హుటాహుటిన మధ్యప్రదేశ్‌లోని బాల్ఘాట్ జిల్లా కజ్రీ గ్రామానికి తరలించారు. మార్గమధ్యలో వాంతులు చేసుకుంది. విషయం తెలుసుకున్న రామగుండం పోలీసులు అక్కడి ఎస్పీని సంప్రదించారు. తొలుత బాలిక మరణించిన విషయాన్ని ధ్రువీకరించుకున్నాక అంత్యక్రియలు జరపకుండా ఆపగలిగారు. అంత్యక్రియలు ఆపేది లేదంటూ ఆమె బంధువులు వాదనకు దిగారు. ఎంతో శ్రమిస్తే గానీ.. వారు దారికి రాలేదు. ఎట్టకేలకు బాలిక మృతదేహానికి అక్కడ స్థానిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, తిరిగి సెకండ్ ఒపీనియన్ కోసం గాంధీ ఆస్పత్రికి మరోసారి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపరిచింది ఎవరు? బాలిక ఒంటిపై గాయాలున్నాయి తప్పితే, లైంగికదాడి జరిగినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లేవని తెలిసింది. మరి ఆమెను మరణించేంత స్థాయిలో గాయపరిచింది ఎవరు? అసలు ఆగస్టు 14 మధ్యాహ్నం ఏం జరిగింది? బాలిక ఎవరితో ఘర్షణ పడింది? ఆమైపై ఎవరు దాడి చేసి ఉంటారు? అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సామూహిక లైంగికదాడి జరిగిందని ప్రచారం కావడం, అందులోనూ బాధితురాలు మైనర్ కావడంతో విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. అన్ని బృందాల పోలీసులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఇంతవరకూ దర్యాప్తు పురోగతిలో ఏ విషయాన్ని మీడియాతో పంచుకోలేదు. ఈ క్రమంలోనే అమ్మాయి మాట్లాడిందని చెబుతున్న ఆడియో విడుదల చేసిన వారిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నించినట్లు తెలిసింది. వారు చెప్పే సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని సమాచారం. గాంధీ ఆస్పత్రి నుంచి నివేదిక వస్తేగానీ.. పోలీసులు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేసేలా లేరు. ఆ నివేదికలో ఏం ఉంటుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. -
పెద్దపల్లిలో దారుణం.. మైనర్ బాలికపై హత్యాచారం
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన మైనర్ బాలికపై నలుగురు యువకులు సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు... తీవ్ర గాయాలైన బాలికను.. చికిత్స కోసం ప్రైవేటు వాహనంలో మధ్యప్రదేశ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మూడు రోజుల క్రితం (ఆగస్టు 14) అప్పన్నపేట శివారులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ వెంచర్ పనులు పర్యవేక్షిస్తున్న సూపర్ వైజర్ ఫయాజ్.. బాలికను మాయమాటలు చెప్పి శివార్లలోకి తీసుకెళ్లాడు. అతడితోపాటు మరో ముగ్గురు కలిసి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ విషయం బిల్డింగ్ కాంట్రాక్టర్ గోపాల్‌కు తెలియడంతో.. ఈ సమస్య తనమెడకెక్కడ చుట్టుకుంటుందోనని బాలికను, ఆమె కుటుంబ సభ్యులను తిరిగి మధ్యప్రదేశ్‌కు పంపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో బాధితురాలు మృతిచెందింది. దీంతో మధ్యప్రదేశ్‌లోని కజరీకి తీసుకెళ్లి బాలిక అంత్యక్రియలు పూర్తి చేయాలని బిల్డింగ్ కాంట్రాక్టర్ ఆమె కుటుంబీకులను బలవంత పెట్టాడు. అయితే హైదరాబాద్‌లో పనిచేస్తున్న బాలిక సోదరుడి రాక కోసం కుటుంబీకులు అంత్యక్రియలు ఆపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ఫయాజ్‌తోపాటు మరో నిందితుడు హరీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పెద్దపెల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ నేతృత్వంలోని పోలీసుల బృందం. అప్పన్నపేటలో పనిచేస్తున్న తోటివారిని విచారించారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. సామూహిక అత్యాచారం తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే బెదిరించినట్లు బాలిక చివరి మాటలను బంధువులు ఆడియో రికార్డు చేశారు. చదవండి: మొదటి భార్యను ఒప్పించి, యువతితో యూట్యూబర్ రెండో పెళ్లి.. -
ఆపరేషన్‌కు డబ్బులు లేక ఇబ్బంది.. ఆదుకున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ
ప్రమాదంతో మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఆపరేషన్‌కు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆర్థిక సహాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన గండికోట శ్రీనివాస్ గతేడాది ప్రమాదంలో గాయపడి కుడి చేతిని కోల్పోవడంతో పాటు కుడికాలికి అయిన గాయాలతో మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే శస్త్రచికిత్సకు కావల్సిన ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నాడని ఓ మిత్రుని ద్వారా తెలుసుకున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ(సింగపూర్) మానవతా దృక్పథంతో డబ్బు సహాయం అందించారు. ఇటీవలె శ్రీనివాస్ తండ్రి మరణించడంతో పాటు, అతని తల్లి కూడా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారన్న విషయం తెలిసి తెలంగాణ కల్చరల్ సొసైటి ఇచ్చిన పిలుపు మేరకు కొందరు సభ్యులు, దాతలు ముందుకు వచ్చి రెండు లక్షల ఎనభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. సొసైటీ అధ్యక్షుడు గడప రమేశ్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి సహా మిగతా సభ్యులు శ్రీనివాస్ కుటుంబంతో వీడియో కాల్లో మాట్లాడి పరామర్శించారు. ఈ సందర్భంగా క్లిష్ట పరిస్థితుల్లో తనకు సహాయం అందించిన సొసైటీ సభ్యులకు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశాడు. -
కేటీఆర్ పేషీలో ‘రామగుండం’ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ.. టికెట్ల లొల్లి ముదురుతోంది. అధికార పక్షం బీఆర్ఎస్లో నిజయోకవర్గాల వారీగా అసమ్మతి సెగలు ఒక్కొక్కటి బయటపడతున్నాయి. రాజధానికి చేరి.. అధిష్టానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా రామగుండం అసమ్మతి నేతలు మంత్రి కేటీఆర్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. అసెంబ్లీ కేటీఆర్ పేషీలోనే గంటల తరబడి వీళ్ల సమావేశం జరిగింది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై అసమ్మతి నేతలు కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. కోరుగంటి చందర్‌కు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వొద్దని కేటీఆర్‌కు చెప్పారు వాళ్లు. కావాలనుకుంటే జిల్లా అధ్యక్షునిగా కోరుకంటి కొనసాగినా పర్వాలేదని.. కానీ, ఎమ్మెల్యే టికెట్ మాత్రం వేరేవాళ్లకు ఇవ్వాలని అసమ్మతి నేతలు కేటీఆర్‌ను కోరారు. ఈ తరుణంలో అధ్యక్షుడిగా కోరుకంటి ఉంటే మీకు ఓకేనా? అని అసమ్మతి నేతల్ని కేటీఆర్ అడగడం గమనార్హం. అయితే.. కలిసి పనిచేయాలా? వద్దా? అనేది కోరుకంటిపై ఆధారపడి ఉంటుందని అసమ్మతి నేతలు కేటీఆర్‌కు బదులిచ్చినట్లు సమాచారం. అంతేకాదు అధిష్టాన నిర్ణయంపైనే తమ రాజకీయ భవిష్యత్ ఉంటుందని కూడా వాళ్లు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘పార్టీకి నష్టం కలిగించే పనులు చేయొద్దంటూ అసంతృప్తి నేతలకు సూచిస్తూనే.. సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే టికెట్ ఇస్తాం. ఎమ్మెల్యే కాబట్టి ఆయనతో మాట్లాడితే నాకు ఆయన దగ్గర అనుకుంటే ఎలా?’’ అని అసమ్మతి నేతలను ఆయన ప్రశ్నించారు. అయితే.. ఎమ్మెల్యే తమపై కేసులు పెట్టి వేధించాడని నేతలు చెప్పగా.. సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే కేసులు పెట్టి వేధించిన విషయం తనకు తెలువదన్న కేటీఆర్ వాళ్లతో అన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్స్ పెట్టొద్దని ఆయన అసమ్మతి నేతలకు సూచించారు. ఇక.. అసమ్మతి నేతలతో పాటు ఎమ్మెల్యే కోరుకంటి చందర్తోనూ కేటీఆర్ భేటీ అయ్యి ఈ పరిణామాలపై చర్చించారు. ఆపై ‘‘నేను చెప్పాల్సింది చెప్పిన.. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసమే పనిచేస్తా.. అంటూ ఎమ్మెల్యే కోరుకంటి వ్యాఖ్యానించడం గమనార్హం. కేటీఆర్‌తో భేటీ అనంతరం.. మంత్రి కొప్పుల ఈశ్వర్తోనూ రామగుండం అసమ్మతి నేతలు భేటీ కావడం గమనార్హం. ఇదీ చదవండి: తెలంగాణలో కులగజ్జి, మతపిచ్చి లేదు -
విషాదం.. సబితం జలపాతం వద్ద జారిపడి విద్యార్థి మృతి
సాక్షి, పెద్దపల్లి: తెలంగాణలో గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలపాతాలు జలకళను సంతరించుకోవడంతో వీటిని తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అయితే కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పలువురు ప్రమాదానికి గురై మృతి చెందుతున్నారు. తాజాగా అలాంటి ఘటనలోనే ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. పెద్దపల్లి మండలం సబితం జలపాతం(గౌరీ గుండాల జలపాతం) వద్ద బుధవారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ప్రవాహంలో జారిపడి యువకుడు మృతిచెందాడు. కరీంనగర్ టౌన్ కిసాన్ నగర్‌కు చెందిన మానుపాటి వెంకటేష్(23), స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ సందర్శనకు వచ్చారు. జలపాతం వద్ద ప్రమాదవశాత్తు రాళ్లపై జారీ పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, రెస్క్యూ బృందం సభ్యులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి స్నేహితులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. చదవండి: ముగ్గురి హత్యలతో విషాదంగా ముగిసిన లాక్డౌన్ ప్రేమ.. చంటి బిడ్డతో పోలీస్ స్టేషన్‌కు -
Sabitham Waterfalls Photos: ఉరకలేస్తున్న సబితం జలపాతం.. సందర్శకుల తాకిడి (ఫొటోలు)
-
పేదలులేని ‘పెద్ద’పల్లి
కరీంనగర్: పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. తాజాగా ‘జాతీయ బహుముఖ పేదరిక సూచి (ఎంపీఐ)– ఒక ప్రగతి సమీక్ష’ పేరిట నీతి ఆయోగ్ విడుదలచేసిన నివేదిక గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జాతీయస్థాయిలో నిర్వహించిన ఈసర్వేలో పలుఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా దేశంలో పేదరికం తగ్గి, ఆర్థిక అంతరాలు క్రమంగా సమసిపోతున్నాయని నివేదిక పునరుద్ఘాటించింది. నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే (ఎన్హెచ్ఎఫ్ఎస్)–4తో ఎన్హచ్ఎఫ్ఎస్–5తో పోల్చి ఈ సర్వే వివరాలను నీతి ఆయోగ్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఉమ్మడి జిల్లాలోనూ పేదరికం తగ్గింది. జగిత్యాలలో 4.77 శాతం, రాజన్న సిరిసిల్లలో 3.68 శాతం, కరీంనగర్లో 2.50 శాతం, పెద్దపల్లిలో 2.17 శాతంగా నమోదైంది. ఇందులో పెద్దపల్లి అతితక్కువ 2.17 శాతం పేదరికంతో రాష్ట్రంలో అత్యంత తక్కువ సంఖ్యలో పేదలు ఉన్న జిల్లాగా రికార్డు సృష్టించింది. జిల్లాలో అధికశాతం పారిశ్రామిక ప్రాంతం కావడం, రోడ్డు రవాణా, రైల్వే కనెక్టివిటీ, విద్యా, వైద్యం తదితర సదుపాయాల దృష్ట్యా మొదటి నుంచి పెద్దపల్లి జిల్లా ముందువరుసలో నిలిచింది. తాజాగా నీతిఆయోగ్ విడుదలచేసిన నివేదికలోనూ ఇదే విషయం పునరావృతం కావడం గమనార్హం. -
‘ఓ దేవుడా.. ఎంత పని చేశావయ్యా.. నీకు మేము ఏం అన్యాయం చేశాం..
పెద్దపల్లి : ‘ఓ దేవుడా.. ఎంత పని చేశావయ్యా.. నీకు మేము ఏం అన్యాయం చేశాం.. మా ఇంటి దిక్కును మాకు శాశ్వతంగా దూరం చేశావా.. ఇక మాకు దిక్కెవరు తండ్రీ.. అంటూ ఆ కుటుంబసభ్యులు రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధి మల్యాలపల్లె సమీపంలోని రాజీవ్ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రామగుండం శివాజీనగర్‌కు చెందిన గుంజపడుగ శంకర్(33) రైల్వేస్టేషన్ ప్రాంతంలో సెలూన్ నిర్వహిస్తున్నాడు. మంగళవారం సెలవు దినం కావడంతో పనిమీద బైక్‌పై గోదావరిఖని వెళ్లాడు. తిరిగి వస్తూ కుందనపల్లి పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించేందుకు వెళ్తుండగా వాహనం అదుపుతప్పి, రోడ్డు పక్కనున్న సిమెంట్ పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతిచెందాడు. అదే దారిలో వస్తున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన వాహనాన్ని ఆపి, మృతుడి వివరాలు ఆరా తీశారు. అనంతరం ఎన్టీపీసీ ఎస్సై బి.జీవన్‌కు సమాచారం అందించారు. మృతుడికి భార్య అనూష, ఇద్దరు కుమారులు ఉన్నారు. శంకర్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకొని, కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అందరితో కలిసిమెలిసి ఉండే శంకర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రైల్వేస్టేషన్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సెలవు రోజున శాశ్వతంగా వెళ్లి పోయావా శంకరన్నా అని చాలా మంది కంటతడి పెట్టారు. -
కూతురు పెళ్లి చూసి..పెళ్లి పందిట్లోనే కుప్పకూలిన తండ్రి
సాక్షి, పెద్దపల్లి: కూతురి పెళ్లిని కళ్లారా చూసిన కాసేపటికే.. ఒక తండ్రి కుప్పకూలి కన్నుమూశాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ సంఘటనపై స్థానికుల కథనం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన ఎలిగేటి శంకర్ (55) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన కూతురు వివాహాన్ని బుధవారం స్థానిక సింగరేణి కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిపించారు. పెళ్లితంతు ముగిసిన కొద్దిసేపటికే ఒక్కసారిగా కుప్పకూలారు. బంధువులు అతన్ని హుటాహుటిన గోదావరిఖనిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. వివిధ పత్రికల్లో పాత్రికేయునిగా పనిచేసిన శంకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. పెళ్లిబాజాలు మోగిన ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. చదవండి: కూతురికి కానుకగా వచ్చిన బంగారంతో పుస్తెలు చేయించి.. -
ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, పెద్దపల్లి:ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పెద్దపల్లిలో ఓ రెస్టారెంట్‌లోని లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌కు వెళ్తున్న మంత్రి.. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి జిల్లాకేంద్రంలోని కూనారం చౌరస్తాలో తన అనుచరుని రెస్టారెంట్‌కు వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు లిఫ్ట్‌ను ఆశ్రయించారు. సామర్థ్యం మించిపోవడంతో లిఫ్ట్ తలుపులు మూసుకున్నా.. ఎటూ కదల్లేదు.తలుపు తెరుచుకోకపోవడంతో మంత్రి కాసేపు లిఫ్ట్‌లోనే ఉండిపోయారు. దీంతో పోలీసులు, హోటల్ నిర్వాహకులు కాసేపు శ్రమించి తలుపులు తెరిచారు. అనంతరం మంత్రి నవ్వుకుంటూ బయటికొచ్చి ‘పెద్దపల్లి ఎప్పటికీ గుర్తుండిపోతుంది..’ అంటూ చెన్నూర్ పయనమయ్యారు. చదవండి: ముఖం చూశాకే ముందుకు! -
పెద్దనాన్న దగ్గరుంటే బతికేది..
మంథని: పట్టుమని పదేళ్లు కూడా లేవు. ఆడుతూ పాడాల్సిన వయసులో తల్లిప్రేమకు దూరమైనా.. తండ్రి, అన్నకు ఇంటి సపర్యలు చేస్తూ వచ్చింది. గ్రామంలోని అందరినీ తనవాళ్లే అనుకుంటూ.. వరుసపెట్టి పిలిచే చిన్నారి ఇక లేదంటూ భట్టుపల్లి ఘోల్లుమంది. మద్యానికి బానిసై సైకోగా మారిన తండ్రి గొడ్డలివేటుకు కానరాని లోకాలకు వెళ్లిపోయిన రజితను తలుచుకుంటూ గ్రామస్తులు కన్నీరు పెడుతున్నారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని ఆరుగంటల పాటు ఆందోళనకు దిగారు. తల్లిమరణంతో పెద్దనాన్న చెంతకు.. మంథని మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల సదానందం మద్యానికి బానిసై సైకోగా మారి ఏ పని లేకుండా తిరుగుతున్నాడు. భార్య శ్రీలత కూలీనాలి చేసి కొడుకు అంజి, కూతురు రజిత(10)ను పోషించుకుంటూ వచ్చింది. సదానందం ఆగడాలు మితిమీరిపోవడంతో తట్టుకోలేక ఎనిమిది నెలల క్రితం ఉరివేసుకుని శ్రీలత తనవు చాలింది. అంజి గ్రామంలో దొరికిన పని చేసుకుంటూ బతుకుతున్నాడు. ఇంట్లో ఆడదిక్కు లేకపోవడంతో రజితను ఆమె పెద్దనాన్న సాదుకుంటానని తీసుకెళ్లాడు. కొద్దిరోజుల పాటు అతని దగ్గరే ఉంది. ఇటీవలే తండ్రి దగ్గరకు వచ్చింది. పెద్దనాన్న ఇంట్లో ఉంటే రజిత ప్రాణాలు దక్కేవని గ్రామస్తులు చెబు తున్నారు. తల్లి మరణం తర్వాత కూతురు రజిత ఇంటి పనులు చక్కగా చేసేదని, పనులు ముగించుకొని బడికి వెళ్లేదని, చదువులో చురుగ్గా ఉండే రజిత ఐదోతరగతి చదువుతోందని, పదేళ్లకే నూరేళ్లు నిండాయని గుర్తు చేసుకున్నారు. మద్యం ఇవ్వనందుకే దాడి గురువారం ఉదయం మద్యం మత్తులో సదానందం ఇంటికి వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. కూతురు రజితను గొడ్డలితో నరికి చంపాడు. అదే గొడ్డలితో గ్రామంలోని దూపం శ్రీనివాస్ ఇంటికి వెళ్లాడు. బెల్ట్దుకాణం నిర్వహించే శ్రీనివాస్‌ను మద్యం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆయన నిరాకరించడంతో గొడ్డలితో దాడి చేశాడు. తప్పించుకునే క్రమంలో ముక్కు, కన్ను పక్క భాగం, నొసలుపై గొడ్డలివేటు పడింది. కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌కు 15కుట్లు పడ్డాయి. ఊరంతా ఒక్కటై.. సదానందం గతంలోనూ గ్రామానికి చెందిన రెడ్డి రాజేశం అనే వ్యక్తితో పాటు చాలామందిపై దాడి చేశాడు. ఈ క్రమంలో కన్న కూతురునే చంపిన సదానందంను తమ కళ్లముందే ఉరితీయాలని గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. పోలీసులకు ఎదురు తిరిగారు. పలువురిపై దాడికి సైతం దిగారు. మా కళ్ల ముందే చంపాలే ఊళ్లే ఎంతో మంది మీద దాడి చేసిండు. ఎందరో ఆడోళ్ల మీద అఘాయిత్యం చేయబోయిండు. గిప్పు డు కన్న కూతురును చంపిండు. అట్లాంటోడు బతికిఉండొద్దు. మా కళ్ల ముందే ఎన్కౌంటర్ చేయాలే. లేకుంటే మాకు వదిలిపెట్టాలే. – ఊటుకూరి సరోజన, భట్టుపల్లి -
మద్యానికి బానిసై సైకోగా మారి.. కూతుర్ని గొడ్డలితో నరికిచంపిన తండ్రి..
సాక్షి, పెద్దపల్లి: తండ్రి మద్యం మత్తు, రాక్షసత్వానికి పదేళ్ల చిన్నారి బలైపోయింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల సదానందం భార్య పదినెలల క్రితం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరికి కొడుకు అంజి, కూతురు రజిత(10) ఉన్నారు. రజిత ప్రస్తుతం ఐదోతరగతి చదువుతోంది. సదానందం కొన్నాళ్లుగా మద్యానికి బానిసై, గ్రామంలో సైకోగా ప్రవర్తిస్తున్నాడు. పలువురిపై దాడికి సైతం దిగాడు. గురువారం ఉదయం మద్యంమత్తులో ఇంటికి వచ్చిన సదానందం కూతురు రజితపై దాడి చేశాడు. గొడ్డలితో చిన్నారి మెడపై వేటువేయడంతో అక్కడికక్కడే చనిపోయింది. రక్తపు మరకలతో ఉన్న గొడ్డలిని తీసుకుని సమీపంలోని కిరాణాదుకాణానికి వెళ్లాడు. దుకాణ యజమాని దూపం శ్రీనివాస్‌పై దాడి చేయగా తీవ్రగాయమైంది. అనంతరం సదానందం ఇంటికి వెళ్లిపోయాడు. కొడుకు అంజి ఇంటికి రాగా.. రక్తపుమడుగులో ఉన్న తన సోదరి మృతదేహాన్ని చూసి కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితుడిని పోలీసువాహనంలో స్టేషన్‌కు తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. నిందితుడు బండరాళ్లు అడ్డుపెట్టి.. కారంతో దాడిచేసి పోలీస్‌వాహనం ముందుకెళ్లకుండా కర్రలు, బండరాళ్లు అడ్డుపెట్టారు. వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. హంతకుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మంథని సీఐ సతీశ్, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఎంత చెప్పినా వినలేదు. ఈ క్రమంలో కొందరు పోలీసులపై కారంపొడి చల్లి దాడికి దిగారు. మూడుగంటలపాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అదనపు బలగాలను దింపారు. గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ అక్కడికి చేరుకొని నిందితుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు శాంతించారు. బాలిక మేనమామ కొత్తపల్లి సుమన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. చదవండి: పుట్టగానే తండ్రి వదిలేశాడు.. టెన్త్‌లో 10 జీపీఏతో సత్తాచాటిన కవలలు -
పెద్దపల్లి: సాగర్ రోడ్డులో పేలిన కియా కారు
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణంలోని సాగర్ రోడ్లో మాజీ మున్సిపల్ చైర్మన్ ఏలువాక రాజయ్య ఫాం హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కియా కారు సెంట్రల్ లాకింగ్ చేస్తుండగా హఠాత్తుగా వాహనంలోంచి భారీ శబ్దం రావడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న రెండు కార్లకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందడంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. -
జిల్లా కోర్టుల్లో తెలుగులో ప్రొసీడింగ్స్
సాక్షి, పెద్దపల్లి: కోర్టుల్లో వాడే భాష స్థానిక ప్రజలకు అర్థమయ్యేలా ఉంటే న్యాయవ్యవస్థ మరింత చేరువగా పనిచేయగలుగుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయిలోని కోర్టుల్లో తెలుగులో ప్రొసీడింగ్స్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి. నవీన్‌రావు, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ సహా 14 మంది హైకోర్టు జడ్జీలతో కలసి సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజే మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని రక్షించే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. తనకు తెలుగు భాషపై మక్కువ ఉందని, చిన్నతనంలో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రసంగం విన్నానని గుర్తుచేసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ ఇటీవల నిర్వహించిన సమావేశంలో న్యాయ పుస్తకాలను తెలుగులో ముద్రించడం, తెలుగు భాషలో న్యాయ కోర్సులు, బోధనకు గల ఆవశ్యకత గురించి వివరించారని పేర్కొన్నారు. బాంబే హైకోర్టులో మరాఠీలో కోర్టు ప్రొసీడింగ్స్ అందిస్తే అదనపు ఫలితాలు వచ్చాయన్నారు. న్యాయవ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని, సమాజంలోని ప్రతి పౌరుడికి, వెనుకబడిన వర్గాలకు సమాంతర న్యాయసేవలు అందాలని తెలిపారు. కోర్టులో న్యాయవాదులు, జడీ్జలు మర్యాదపూర్వకంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి ఎం.నాగరాజు, కలెక్టర్ సంగీత, రామగుండం సీపీ రెమా రాజేశ్వరి, పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.సురేష్‌బాబు, సెక్రటరీ భాస్కర్, ప్రజాప్రతినిధులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
రామగుండం బొగ్గుగనిలో ప్రమాదం.. సింగరేణి కార్మికుడు మృతి!
సాక్షి, పెద్దపల్లి: రామగుండంలోని బొగ్గుగనిలో ప్రమాదం చోటుచేసుకుంది. వెల్డింగ్ పనులు చేస్తుండగా సిలిండర్ పేలి కార్మికుడు మృతిచెందాడు. వివరాల ప్రకారం.. రామగుండం ఆర్జీ3 పరిధిలోని ఓసీపీ-1 గనిలో పేలుడు సంభవించింది. గనిలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో సింగరేణి కార్మికుడు జయంత్ కుమార్ మృతి చెందినట్టు సమాచారం. దీంతో, మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. -
రూట్లు రెడీ.. నాగ్‌పూర్– సికింద్రాబాద్ మార్గంలో వందే భారత్ రైలు?
సాక్షి, కరీంనగర్: దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన ‘వందే భారత్ రైలు’ను పూర్తిస్థాయిలో నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. జనవరి 15వ తేదీన సికింద్రాబాద్– విశాఖపట్నం రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పట్టాలపైనా వందేభారత్ పరుగులు తీస్తుందా? అన్న సామాన్యుల అనుమానాలకు దక్షిణ మధ్య రైల్వే తెరదించింది. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలో రైల్వే లైను ఉంది. సిరిసిల్లకు రూటు ప్రగతిలో ఉంది. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారులు వందేభారత్‌కు అనుగుణంగా ఈ రూట్లలో వేగాన్ని పెంచారు. పెద్దపల్లి– కరీంనగర్, కరీంనగర్– జగిత్యాల, జగిత్యాల–నిజామాబాద్ రూట్లలో ఈ రైలును నడపగలిగితే.. పొరుగున ఉన్న మహారాష్ట్రకు కేవలం మూడు నాలుగు గంటల్లోనే చేరుకునే వీలుంది. ముఖ్యంగా సిరిసిల్ల, జగిత్యాలలోని నేత, వలస కార్మికులకు ఇది ఎంతో అనువుగా ఉంటుంది. అన్ని డివిజన్లలో.. దక్షిణ మధ్యరైల్వే పరిధిలో మొత్తం ఆరు డివిజన్లు సికింద్రాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, హైదరాబాద్ ఉన్నాయి. అన్ని రూట్లలోనూ గరిష్ట వేగంతో వెళ్లేలా ఇటీవలే రైల్వేలైన్లను ఆధునీకరించారు. విభజన అనంతరం సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు తెలంగాణలో ఉన్నాయి. వందేభారత్ రైలు గరిష్ట వేగం 160 నుంచి 180 కి.మీలతో ప్రయాణించగలదు. అందుకు అనుగుణంగా రైలు పట్టాల సామర్థ్యం పెరగాలి. దక్షిణ మధ్య రైల్వే ఇటీవల చేపట్టిన అప్‌గ్రేడేషన్ పనులతో ఇక్కడ గరిష్ట వేగం 130 కి.మీలకు చేరుకుంది. తెలంగాణలోని మూడు డివిజన్లలో వందే భారత్ రైలును నడపాల్సి వస్తే.. చాలా సెక్షన్లలో 130 కి.మీ గరిష్ట వేగంతో నడిపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. గరిష్ట వేగం 130 కి.మీ.. కనిష్టవేగం 30.కి.మీ ఈ రైలును మూడు డివిజన్లలోని పలు సెక్షన్లను పరిశీలిస్తే.. సామర్థ్యాన్ని బట్టి వేగం మారుతోంది. ఖాజీపేట– బల్లార్షా సెక్షన్లో 130 కి.మీ గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదని అధికారులు తెలిపారు. అదే సమయంలో అతి తక్కువగా మల్కాజిగిరి– మౌలాలి సెక్షన్లో కేవలం 30.కి.మీ స్పీడుకే పరిమితం కావడం గమనార్హం. అయితే, వేగంపై లైన్ అప్‌గ్రేడేషన్‌తోపాటు లెవెల్ క్రాసింగ్స్, రైల్ ట్రాఫిక్ కూడా ప్రభావం చూపుతుంది. అత్యాధునిక సౌకర్యాలు.. ఆటోమేటిక్ డోర్స్, స్మోక్ అలారం, సీసీ టీవీ కెమెరాలు, బయో వ్యాక్యూమ్ టాయ్‌లెట్స్, సెన్సార్‌తో పనిచేసే నల్లాలు, ఫుట్‌రెస్ట్‌లు వంటి ఆధునిక సదుపాయాలున్నాయి. మిగిలిన రైళ్లతో పోలిస్తే.. దీని నిర్వహణ పూర్తిగా భిన్నం. తొలి వందే భారత్ రైలు సర్వీసు 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ– వారణాసి మధ్య ప్రారంభమైంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా మొత్తం ఏడు సర్వీసులు నడుస్తుండగా.. సికింద్రాబాద్– విజయవాడ మధ్య సర్వీసు ప్రారంభమైతే ఆ సంఖ్య ఎనిమిదికి చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా దాదాపు 20కిపైగా ప్రాంతాల నడుమ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడపాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో హైదరాబాద్– తిరుపతి, హైదరాబాద్– బెంగళూరు, హైదరాబాద్– నాగ్‌పూర్ మార్గాలు ఉండటం విశేషం. రూటు స్పీడు ►సికింద్రాబాద్– బల్లార్షా 130 కి.మీ. ►ఖాజీపేట–కొండపల్లి 130 కి.మీ. ►సికింద్రాబాద్– ఖాజీపేట 130 కి.మీ. ►మానిక్‌నగర్– విరూర్ (3వలైన్) 110 కి.మీ. ►మందమర్రి– మంచిర్యాల కి.మీ(3వలైన్) 110 కి.మీ. ►మంచిర్యాల– పెద్దంపేట (3వలైన్) 100 కి.మీ. ►పెద్దంపేట– రాఘవపురం (3వ లైన్) 110 కి.మీ. ►రాఘవపురం– కొలనూరు–పొత్కపల్లి (3వలైన్) 90 కి.మీ. ►బిజిగిరి షరీఫ్– ఉప్పల్ (3వలైన్) 100 కి.మీ. ►పెద్దపల్లి– కరీంనగర్ 100 కి.మీ. ►కరీంనగర్– జగిత్యాల(లింగంపేట) 90 కి.మీ. ►జగిత్యాల(లింగంపేట)– నిజామాబాద్ 100 కి.మీ మేడ్చల్– మనోహరాబాద్ 110 కి.మీ మల్కాజిగిరి– మౌలాలి కార్డ్‌లైన్ సెక్షన్లలో 30 కి.మీ. ఈ ప్రాంతానికి ఎంతో మేలు ‘వందేభారత్’ రైలును బల్లార్షా– కాజీపేట మార్గంలో నడపాలి. నాగ్‌పూర్– సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్ రైలు ప్రస్తుతం ప్రతిపాదనలో ఉంది. ఈ మార్గంలో రైలు వస్తే.. రామగుండం లేదా మంచిర్యా లకు హాల్టింగ్ కల్పిస్తే.. కోల్‌బెల్ట్ పారిశ్రామిక ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. – కామని శ్రీనివాస్, సామాజిక కార్యకర్త రవాణా సదుపాయాలకు పెద్దపీట కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రవాణా సదుపాయాలకు, మౌలిక వసతులకు పెద్దపీట వేస్తుందనడానికి వందేభారత్ రైలే పెద్ద ఉదాహరణ. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలు దేశంలోనే అత్యధిక వేగంతో వెళ్లడం విశేషం. భవిష్యత్తులో దేశంలోని ముఖ్యప్రాంతాలకు దీని సేవలు అందుబాటులోకి వస్తాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు సైతం త్వరలో దీని సేవలు అందుతాయి. – బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ -
బంగారు తెలంగాణ దొరలకే పరిమితమైంది
సాక్షి, పెద్దపల్లి: బంగారు తెలంగాణ దొరల ఇంటికే పరిమితమైందని, పేదలకు ఇళ్లు లేవు, ఇంటికి తలుపులు లేవని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మంగళవారం పెద్దపల్లి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ దోచుకోడానికే అధికారంలోకి వచ్చాయని, అందుకే దొరల పాలన అంతం చేసి పేదల రాజ్యం తెచ్చుకోవాలన్నారు. ఒకవైపు మహిళల రక్షణ కోసం షీ టీమ్‌లు అని డబ్బాలు కొడుతున్నారని.. మరోవైపు బాలికలపై అధికార పార్టీ నేతలు అత్యాచారాలు చేస్తున్నారని ఆరోపించారు. -
‘అమ్మా నన్ను క్షమించండి.. వెళ్లాలని లేకున్నా వెళ్తున్నా’
సాక్షి. పెద్దపల్లి: ‘అమ్మా నన్ను క్షమించండి.. నేను మళ్లీ మీ కడుపున పుడతా. కానీ మళ్లీ వాడికిచ్చి పెళ్లి చేయకండి. వాడి వేధింపులు భరించలేకపోతున్న.. వెళ్లాలని లేదు కానీ తప్పదు వెళ్తున్నా. వెళ్తున్న అంటే బతకడానికి కాదు వెతకండి మీకు దగ్గరలో కనపడతా. మీరు అందరూ నాకు కావాలి.’ అంటూ ఓ వివాహిత భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి ఒడ్డెరకాలనీలో జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాలు.. గ్రామానికి చెందిన ఒల్లపు సోని(21)కి మూడేళ్ల క్రితం ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి అలమకుంట రమేశ్‌తో వివాహం జరిగింది. వివాహం అయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల మళ్లీ గొడవ జరుగగా ఐదు రోజుల క్రితం పుట్టిల్లు పెగడపల్లికి వచ్చింది. ఈక్రమంలో శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సోని తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. సమీపంలోని ఓ రైతు వ్యవసాయ బావిలో శవమై తేలింది. తన ఆత్మహత్యకు సంబంధించిన సూసైడ్ నోటు బావి ఒడ్డున లభించింది. సూసైడ్ లెటరు చూసి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఘొల్లుమంటూ రోదించారు. అత్తింటి వేధింపులు, అల్లుడు రమేశ్ కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజవర్ధన్ తెలిపారు. -
వెంటాడిన విధి: నాడు తండ్రి, చెల్లి, తమ్ముడు.. ఇప్పుడేమో
సాక్షి, కరీంనగర్: మండలంలోని ఊటూరు గ్రామానికి చెందిన దూడం ప్రకాశ్ (30) కుటుంబాన్ని విధి వెంటాడుతోంది. కుటుంబంలో ఒకరి తరువాత ఒకరి మరణం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కష్టాలకు ఎదురొడ్డిన ఆ యువకుడు కుంగిపోకుండా ధైర్యంగా నిలిచి కుటుంబానికి అండగా నిలిచాడు. యథావిధిగా పనిచేసుకుంటుండగా ఆ యువకుడిని సైతం రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. ఇప్పటికే ముగ్గురిని కోల్పోయి ఇంటి వద్ద ఉంటున్న తల్లి, భార్య, పిల్లలకు అండగా ఉంటున్న అతడిని రోడ్డు ప్రమాదంలో మృత్యువు వెంటాడింది. ప్రకాశ్ ఫెస్టిసైడ్, ఫర్టిలైజర్‌లో పది సంవత్సరాలుగా మార్కెటింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తండ్రి గత కొన్నేళ్ల క్రితం చనిపోగా, ఆ తర్వాత చెల్లి, తమ్ముడు కూడా వివిధ కారణాలతో చనిపోయారు. అమ్మ ప్రమీల, భార్య స్వరూప, 5 సంవత్సరాలలోపు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అన్నీ తానై కుటుంబ భారం మోస్తున్నాడు. ఎప్పటిలాగే తన ద్విచక్రవాహనంపై సోమవారం ఇంటి నుంచి పెద్దపల్లికి వెళ్లిన అతడు తిరుగు ప్రయాణంలో సాయంత్రం వేళ పెద్దపల్లి జిల్లా రంగంపల్లి వద్ద రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. -
ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం.. మూడు నేషనల్ హైవేలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, పెద్దపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. రూ.6,338 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగింది. ఈ క్రమంలోనే భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వేలైన్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. కాగా, రూ.990 కోట్లతో 54.10 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టారు. అలాగే, మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి, బోధన్-బాసర-భైంసా, సిరోంచా-మహదేవ్పూర్ హైవే విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇక, రూ.2,268 కోట్లతో మూడు జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగనున్నాయి. -
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వాహనం
సాక్షి, పెద్దపల్లి(పాలకుర్తి): ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణిస్తున్న కారు పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్‌రోడ్డు వద్ద శనివారం రాత్రి ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు తీవ్రంగా.. మరో ఇద్దరు స్వల్వంగా గాయపడ్డారు. ఈ సంఘటనలో సజ్జనార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. రామగుండం మండలం మల్యాలపల్లికి చెందిన ఎగ్గె నాగరాజు (38), అతని భార్య లక్ష్మి, అంతర్గాం మండలం రాయదండికి చెందిన నూనె భూమయ్య, నూనె లక్ష్మి వారి సొంత ఆటోలో కరీంనగర్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించి రామగుండంకు తిరుగుపయనమయ్యారు. ధర్మారం క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే వీరి ఆటోను వెనుక నుంచి వచ్చిన సజ్జనార్ కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నాగరాజు, లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. భూమయ్య, నూనె లక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని హైవే అంబులెన్స్ ద్వారా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. ఈ సంఘటనలో సజ్జనార్ కుడిచేతికి స్వల్పంగా గాయమైంది. ఫోర్‌లైన్ రహదారిపై ఆటో ఒక్కసారిగా అడ్డు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న బసంత్‌నగర్ ఎస్సై శివాణిరెడ్డి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదవండి: (నల్లగొండ డీఈఓ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తం) -
పెద్దపల్లి జిల్లాలో మావోల కలకలం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో తిరిగి పట్టు సాధించేందుకు మావోయిస్టులు మళ్లీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న మావోయిస్టు వారోత్సవాల్లో పాల్గొంటున్న తెలంగాణ మావోయిస్టు నేతల్లో కొందరు రాష్ట్రంలోకి వచ్చారన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, యాక్షన్ కమిటీ సభ్యుడు మంగులు అలియాస్ పాండు ఆగస్టులో రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు ధ్రువీకరించగా తాజాగా పెద్దపల్లి జిల్లాలోకి మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ అలియాస్ ధర్మన్న వచ్చి వెళ్లాడన్న వార్త పోలీసు శాఖలో చర్చానీయాంశంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి)లోని శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన కంకణాల.. కొందరు అనుచరులతో కలసి పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల్లో పర్యటించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందుకుగల కారణాలపై ఆరా తీస్తున్నాయి. ఈ ప్రాంతంలోని పలువురు కాంట్రాక్టర్ల నుంచి రాజిరెడ్డి భారీగా నిధులు రాబట్టాడన్న వార్తల్లో నిజానిజాలను నిర్ధారించుకొనే పనిలో ఉన్నాయి. కొందరు అనుమానితులు, కొరియర్లపై నిఘా పెట్టాయి. కంకణాలతోపాటు ఆయనతోపాటు వచ్చిన యాక్షన్ టీం సభ్యులు కుంజం మనీశ్, చెన్నూరి శ్రీను అలియాస్ హరీశ్, కొవ్వాసి రాము, రోషన్, నందు అలియాస్ వికాస్ ఫొటోలతో కూడిన పోస్టర్‌ను రామగుండం కమిషనరేట్ పోలీసులు విడుదల చేశారు. వారి సమాచారం అందిస్తే రూ. 5 లక్షల నగదు రివార్డు ఇస్తామని ప్రకటించారు. ‘రామగుండం’స్కాం నిందితుల హత్యకు రెక్కీ? 2020 అక్టోబర్‌లో ములుగు జిల్లాలోని ముసలమ్మ గుట్టలో మావోయిస్టు పార్టీలో కొత్తగా చేరిన పలువురు యువకులకు శిక్షణ ఇస్తున్న రాజిరెడ్డి బృందం.. కూంబింగ్ చేస్తున్న టీఎస్ఎస్పీ దళానికి ఎదురైంది. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో రాజిరెడ్డి తృటిలో తప్పించుకున్నారు. దాదాపు 24 నెలల విరామం తరువాత రాజిరెడ్డి రాష్ట్రానికి రావడం.. అందులోనూ ఆయనకు నిధులు సమకూరుతున్నాయన్న సమాచారంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం కొలువుల కుంభకోణంలో నిందితులను హతమార్చేందుకు కంకణాల బృందం రెక్కీ చేసినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల కూలీలు నివసించే కాలనీలపై నిఘా పెట్టినట్లు సమాచారం. -
పెద్దపల్లి: రైలు ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ నుంచి బెంగుళూరు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు దుర్మరణం చెందారు. చీకురాయి, కొత్తపల్లి గ్రామాల మధ్య రైలు పట్టాలపై మరమత్తులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఒకరు పర్మినెంట్ ఉద్యోగి మొకద్దం దుర్గయ్య కాగా.. ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు శ్రీనివాస్, వేణుగా గుర్తించారు. రైల్వే ఉద్యోగుల మరణంతో బాధితుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. చదవండి: జనగామ: కిడ్నాపైన బాలుడు షబ్బీర్ హత్య -
నాకెందుకు అన్యాయం చేశావ్.. కరెంట్ పోల్‌కు కట్టేసి చితకబాదింది!
సాక్షి, పెద్దపల్లి: తన భర్త రెండో వివాహం చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న భార్య.. అతడికి దేహశుద్ధి చేసింది. భర్తను ఓ కరెంట్ స్థంభానికి కట్టేసి చితకబాదింది. చెప్పుల దండ మెడలో వేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ షాకింగ్ ఘటన మంథనిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన అఖిలను శ్రీకాంత్ రెడ్డి వివాహం చేస్తున్నాడు. నాలుగేళ్ల కిందట వీరికి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అఖిల పేరెంట్స్ శ్రీకాంత్ రెడ్డికి కట్నంగా 20 లక్షలు ఇచ్చారు. అయితే, వీరిద్దరికీ కొడుకు జన్మించిన అనంతరం.. శ్రీకాంత్ భార్యను వదిలిపెట్టి వెళ్లాడు. అనంతరం, వరంగల్‌లో మరో మహిళను వివాహం చేసుకున్నట్టు తెలుసుకున్న అఖిల.. కుటుంబ సభ్యుల సాయంతో శ్రీకాంత్ రెడ్డిని హన్మకొండ నుంచి స్వర్ణపల్లికి తీసుకువచ్చారు. అనంతరం, శ్రీకాంత్‌ను కరెంట్ పోల్‌కు కట్టేసి.. భార్య అతడిని చితకబాదింది. చెప్పులతో కొట్టింది. ఈ క్రమంలో చెప్పుల దండ మెడలో వేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. -
‘సింగరేణి’ సమస్యల పరిష్కారానికి రాజీనామాకు సిద్ధం
సాక్షి, పెద్దపల్లి: సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి రాజీనామాకు సిద్ధమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సింగరేణిలో 8 రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన జీఎం కార్యాలయం ముట్టడిలో చందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఎమ్మెల్యే పదవి గొప్పదేమీ కాదు. మీరందరూ మద్దతిస్తే గెలిచిన వ్యక్తిని. ఈ రోజు చెప్తే ఈ రోజే రాజీనామా చేసేవాడిని. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి అవసరమైతే ఎమ్మెల్యే పదవిని అయినా త్యాగం చేస్తా. కార్మికులు చేస్తున్న ఉద్యమానికి అండగా నిలబడతా’ అని ప్రకటించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లు చట్టబద్ధమైనవని, ఈ ఉద్యమానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కార్మికులు విధుల్లోకి వెళ్లవద్దని చందర్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపఎన్నికల ప్రభావం కొనసాగుతున్న సందర్భంలో ఎమ్మెల్యే రాజీనామా ప్రకటన నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. -
Peddapalli: బసంత్‌నగర్ ఎయిర్‌పోర్టుకు మహర్దశ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లావాసుల దశాబ్దాల కల నెరవేరనుంది. ఇంతకాలం బసంత్‌నగర్‌లో విమానాశ్రయం ఉంటుందా? ఉండదా? అన్న ఊహాగానాలకు ఇకపై తెరపడనుంది. తాజాగా ఉడాన్ పథకం 5.0లో భాగంగా రాష్ట్రంలోని రెండు పాత విమానాశ్రయాలను గుర్తించగా.. అందులో మొదటిది వరంగల్ కాగా.. రెండోది బసంత్‌నగర్ విమానాశ్రయం కావడం విశేషం. విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తలపెట్టిన పథకం ఉడాన్. ఉడాన్ అంటే ఉడో దేశ్‌కీ ఆమ్ నాగరిక్.. దీన్నే సంక్షిప్తంగా ఉడాన్ అని వ్యవహరిస్తున్నారు. దేశంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు, చిన్న నగరాలను రాష్ట్ర రాజధానులు, దేశ రాజధానులతో కలిపేందుకు కేంద్రం 2016లో ఉడాన్ పథకం ప్రారంభించినప్పటి నుంచి బసంత్‌నగర్, వరంగల్ ఎయిర్‌పోర్టులను పరిశీలించాలని రాష్ట్రం విన్నవించింది. అంతేకాకుండా పలుమార్లు ఇక్కడి సాధ్యాసాధ్యాలు, ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భౌగోళికంగా ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలు, ఆటంకాలు, అందుబాటులో ఉన్న రన్‌వే తదితరాలపై ప్రైవేటు కన్సెల్టెన్సీ ద్వారా సర్వే చేయించి కేంద్రానికి పంపారు. ప్రజల ఆర్థిక స్థితిగతులు, పెద్దపల్లి పారిశ్రామిక ప్రాంత ప్రజలతోపాటు, ఉమ్మడి జిల్లాకు ఎయిర్‌పోర్టు ఆవశ్యకత, తదితరాలను సైతం వివరించారు. దేశంలో 54 ఎయిర్‌స్ట్రిప్స్ గుర్తింపు పలుమార్లు రాష్ట్ర వినతిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం తొలిసారిగా ఈ విమానాశ్రయం విషయంలో సుముఖత వ్యక్తం చేసింది. ఉడాన్ పథకంలో భాగంగా దేశం మొత్తం మీద 54 పొటెన్షియల్ ఎయిర్‌స్ట్రిప్ (రన్‌వే)లను గుర్తించింది. అందులో మన రాష్ట్రం నుంచి వరంగల్, బసంత్నగర్లను కూడా భవిష్యత్తులో మనగలిగే సామర్థ్యమున్న ఎయిర్స్ట్రిప్లుగా నోటిఫై చేసింది. అసలు దేశంలోని అటవీ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు ఈ 54 ఎయిర్‌స్ట్రిప్ (రన్‌వే)లను కేంద్రం వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే బసంత్‌నగర్‌ను ‘పర్యాటక ప్రాంతాలకు సమీపంలో ఉన్న విమానాశ్రయాల’ జాబితాలో చోటు కలించింది. అంటే దీని ద్వారా విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు పరిసరాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను దేశంలోని నలమూలల నుంచి వచ్చే యాత్రికులకు పరిచయం చేయనుంది. ఈ పరిణామం శుభసూచమకమని, దేశంలోని వివిధ నగరాలతో కనెక్టివిటీ పెంచే క్రమంలో ఇది తొలి అడుగు అవుతుందని ఉమ్మడి జిల్లా ప్రముఖులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పర్యాటకానికి పెద్దపీట..! తాజాగా కేంద్రం ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు చొరవ తీసుకోవడం ఉమ్మడి జిల్లా అభివృద్ధికి దోహదపడనుంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న తలంపుతో అభివృద్ధి చేయనున్న ఈ విమానశ్రయానికి కాళేశ్వరం, ధర్మపురి, రామగిరి ఖిల్లా, కొండగట్టు, వేములవాడతోపాటు పక్కనే ఉన్న గోదావరి, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని టైగర్ రిజర్వ్, గిరిజన తదితర పర్యాటక ప్రాంతాలను పర్యాటకులకు చేరవవుతాయి. దీంతో యాత్రీకులకు ఆధ్మాత్మిక భావనను పంచడంతోపాటు పర్యాటకరంగం అభివృద్ధి చెందిన ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమంది ఉపాధి లభించనుంది. (క్లిక్: RRRకు భూసేకరణ వేగవంతం) ఇదీ.. చరిత్ర..! 1980వ దశకంలో స్థానిక కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత బీకే బిర్లా తాను ఇక్కడికి వచ్చేందుకు ఈ విమానాశ్రయం నిర్మాణం చేపట్టారు. 294 ఎకరాల విస్తీర్ణంలో ఏరాటు చేసిన ఈ విమానాశ్రయంలో ‘వాయుదూత్’ ఎయిర్‌లైన్స్ (21 సీట్ల సామర్ధ్యం) చిన్న విమానాలు మాత్రమే రాకపోకలు సాగించేవి. 2009 అక్టోబరులో ఇదే ఎయిర్‌పోర్టును రామగుండం ఎయిర్ పోర్టుగా 500 ఎకరాల విస్తీర్ణంతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు నడిచినా.. తరువాత అవి అటకెక్కాయి. తరువాత 2016లో ఉడాన్ పథకం రావడంతో 2020లో ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఆఫ్ఇండియా (ఏఏఐ) ఈ విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు తాను కూడా చేసిన పలు సాంకేతిక, భౌగోళిక సర్వేలను అధ్యయనం చేసింది. (క్లిక్: ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ.. నిర్మల్‌లో ఇదే మేటి!) -
హమ్మాయ్యా! టెన్షన్ పోయింది.. కేసీఆర్ హామీతో ఎమ్మెల్యేల్లో ఉత్సాహం
సాక్ష, కరీంనగర్: ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మనకు 90 సీట్లు పక్కా.. ఇప్పటికే నలభై, యాభై సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. ప్రజలతో, పార్టీ క్యాడర్‌తో మమేకమయ్యే వారికి ఎప్పుడూ ఢోకా ఉండదు. టికెట్ల విషయంలో బెంగ వద్దు, మనం గతంలోనూ పెద్దగా మార్చుకోలేదు. మార్చడం నాకు ఇష్టం ఉండదు. అలాగని గిట్లనే ఉంటం అంటే కుదరదు. ఏం చేసినా సరే అంటే కూడా చెల్లదు.. తప్పదంటే ఓ నాలుగైదు సీట్లు మార్చాల్సి వస్తదేమో’ అంటూ సీఎం కేసీఆర్ ఈనెల 3న తెలంగాణ భవన్లో జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశనం చేయడంతో తాజా ఎమ్మెల్యేల్లో ఆనందం వ్యక్తమవుతుండగా టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకు గుబులు పట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల హడావిడి నెలకొంటున్న తరుణంలో సీఎం కేసీఆర్ పాతవారికే టికెట్లు, పెద్దగా మార్పులేమి ఉండవంటూ ఇచ్చిన హామీతో కార్యకర్తల్లో నయా జోష్ నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యేల పరిస్థితి, బలబలాలు, విజయావకాశాలపై కొన్నాళ్లుగా ప్రశాంత్‌కిషోర్(పీకే) టీం సభ్యుల రకరకాల నివేదికలు అధిష్టానానికి అందాయనే ఊహగానాల నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉండగా మంథనిలో కాంగ్రెస్ నుంచి శ్రీధర్‌బాబు, హుజూరాబాద్‌లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం హామీతో మిగతా 11 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలకే టికెట్లు దక్కే అవకాశాలు మెండుగా ఉండడంతో వారి అనుయాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న చోటామోటా నేతలంతా తమకు మొండిచేయి తప్పదనే మీమాంసలో పడ్డారు. కరీంనగర్ నుంచి నామినేటెడ్ పదవి ఆశిస్తున్న మాజీ మేయర్ రవీందర్‌సింగ్ లాంటి ఆశావహులు గులాబీ బాస్ ప్రకటనతో డీలాపడ్డారు. కరీంనగర్ జిల్లా! కరీంనగర్: కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గంగుల కమలాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 2009లో టీడీపీ, 2014–2018లో టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కించుకుని, 2019లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చొప్పదండి: 2018లో అనూహ్యంగా తెరమీదకు వచ్చిన సుంకె రవిశంకర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా సీఎం హామీతో ఈయనకు రెండోసారి బెర్త్ ఖరారైంది. మానకొండూరు: సాంస్కృతిక సారథి చైర్మన్‌గా కొనసాగుతున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 2014 నుంచి వరుసగా గెలుపొందారు. ఈసారి కూడా ఇతన్నే అధిష్టానం బరిలో దించనుంది. హుస్నాబాద్: 2014 నుంచి ఇక్కడ వొడితెల సతీశ్‌బాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ ప్రకటనతో ఈసారి కూడా ఇక్కడ ఇతనే పోటీలోకి దిగుతారు. హుజురాబాద్: గతంలో ఇక్కడ టీఆరెఎస్ ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచిన ఈటల రాజేందర్ ఏడాది క్రితం బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆయనపై గులాబీ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పోటీ చేశారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా! సిరిసిల్ల: సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా 2004 నుంచి కేటీఆర్ విజయపరంపర కొనసాగిస్తున్నారు. 2014 నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన వైవిధ్యత, ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వేములవాడ: 2009 నుంచి ఇక్కడ చెన్నమనేని రమేశ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రమేశ్ భారతీయ పౌరుడు కాదంటూ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ ఈయనపై న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా! ధర్మపురి: టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న కొప్పుల ఈ శ్వర్ «2014 «నుంచి ధర్మపురి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఓట్ల లెక్కింపులో పారదర్శకత లేదని వేసిన కేసు న్యాయస్థానంలో నడుస్తోంది. జగిత్యాల: ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ 2014లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత 2018లో అతడిపైనే సంజయ్ విజయం సాధించారు. పార్టీ ప్రకటనతో ఈసారి కూడా ఆయనకే టికెట్ దక్కనుంది. కోరుట్ల: కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు 2009 నుంచి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ అధిష్టానం ఇతనికే టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. అయినా, ఈసారి ఇతని తరఫున ఆయన కుమారుడు సంజయ్ బరిలో దిగుతారంటూ ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి జిల్లా! పెద్దపల్లి: ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్‌రెడ్డి 2014 నుంచి కొనసాగుతున్నారు. ఈసారి ఆయన కోడలు, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి బరిలోకి దిగుతారన్న ప్రచారం సాగుతోంది. రామగుండం: ప్రస్తుత ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 2018లో ఏఐఎఫ్బీ నుంచి గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం పెద్దపల్లి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోరుకంటిపై ఇటీవల ఆర్ఎఫ్సీఎల్ కొలువుల స్కాంలో విమర్శలు వచ్చాయి. మంథని: పుట్ట మధుకర్ ఇక్కడ 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో సంచలనం రేపిన న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులో విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. -
అక్కడ పారాల్సింది నీరా, నెత్తురా? ఈ సమయంలో గుజరాత్ గజదొంగలు వచ్చి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘మోసపోతే.. గోసపడతాం. మనం బాగుపడే సమయంలో గుజరాత్ గజదొంగలు వచ్చి మతం పేరు మీద కొట్లాడాలని రెచ్చగొడుతున్నారు. శ్రీరాంసాగర్ కాలువల్లో స్వచ్ఛమైన నీరు పారాలా? మతకలహాల మంటలు చెలరేగి నెత్తురు పారాలా? ఆత్మగౌరవంతో ఉందాం. ఢిల్లీ ఏజెంట్లకు గులాములం కావొద్దు..’’ అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గౌరెడ్డిపేటలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పెద్దకల్వలలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. బీజేపీ, కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. ప్రసంగంలోని కీలక అంశాలు ఆయన మాటల్లోనే.. కేంద్రం ప్రజల ఉసురుపోసుకుంటోంది ‘‘గుజరాత్ మోడల్ అని చెప్పి దేశప్రజలను దగా చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఏం చేస్తోంది? అడ్డగోలుగా ధరలు పెంచడం, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం, శ్మశానాల మీద పన్ను, శవాల దహనాలకు పన్ను, పాల మీద, చేనేత ఉత్పత్తుల మీద జీఎస్టీ విధిస్తూ పేద ప్రజల ఉసురు పోసుకుంటోంది. ఎన్పీఏల పేరిట లక్షల కోట్ల ప్రజాధనాన్ని కుంభకోణాల రూపంలో మేస్తున్న బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తున్నాయి. గాంధీ పుట్టిన రాష్ట్రమైన గుజరాత్లో మద్యపాన నిషేధం చేశామని ప్రధాని గొప్పలు చెప్పుకునే చోట కల్తీ మద్యం ఏరులై పారుతోంది. అది తాగి దాదాపు 75 మంది మరణించారు. దీనికి మోదీ సమాధానం చెప్పాలి. తెలంగాణలో ఉన్న మంచి పథకాల్లో ఒక్కటి కూడా ప్రధాని రాష్ట్రమైన గుజరాత్లో లేదు. 24 గంటల కరెంటు, రూ.2,000 పింఛన్, పేదలకు ఆరోగ్యశ్రీ వంటి పథకాలేమీ లేవు. కానీ అక్కడి నుంచి వచ్చే గులాంగాళ్లు, దేశాన్ని దోచే దోపిడీ దొంగలు.. ఆ దొంగల బూట్లు మోసే సన్నాసులు మనకు కనబడుతున్నారు. 60 ఏళ్లు కొట్లాడి సాధించిన తెలంగాణలో ఆత్మగౌరవంతో ఉందామా? లేక ఢిల్లీ నుంచి వచ్చే ఏజెంట్లకు గులాములం అవుదామా? ప్రజలు ఆలోచించుకోవాలి. తెలివి తక్కువ ప్రధాని.. ప్రధానికి తెలివితేటల్లేవు. ధాన్యం కొనుగోలు చేయాలంటే ఎక్కడ పెట్టుకోవాలంటూ మాట్లాడుతారు. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం, నూకలు, గోధుమలకు కొరత ఉంది. కానీ తెలివితక్కువ కేంద్ర ప్రభుత్వం కారణంగా గోధుమలు, బియ్యం కూడా దిగుమతి చేసుకునే దుస్థితి ఏర్పడింది. ముందుచూపు లేక, పాలన చేతగాక, పిచ్చిపిచ్చి విధానాలతో ఆర్థిక స్థితి దిగజార్చి, రూపాయి విలువ పతనం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో దేశప్రతిష్టను దిగజార్చి, పేద కడగండ్లను కళ్లజూస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందో ఆలోచించాలి. మోసపోతే.. గోసపడతాం.. మనం ఒకసారి దెబ్బతింటే వెనుకపడతాం. మీ బిడ్డగా నేను ఒకటే వేడుకుంటున్నా. కూలగొట్టుడు చాలా సులువైన పని. కట్టడం చాలా కష్టమైన పని. ఇవాళ మనం బాగుపడే సమయంలో ఈ దుర్మార్గులు, గజదొంగలు, లంచగొండులు వచ్చి.. మతం పేరు మీద కొట్లాడాలని ఎలా చెబుతారు? శ్రీరాంసాగర్ కాలువల్లో స్వచ్ఛమైన నీరు పారాలా? మత కలహాల మంటలు చెలరేగి నెత్తురు పారాలా? ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచే ఈ పిశాచులకు ఎక్కడిక్కకడ బుద్ధి చెప్పాలి. ఈ దొంగల మాటలు నమ్మితే చాలా ప్రమాదం ఉంటుంది. కేంద్రంలో రాబోయేది రైతు సర్కారే.. రాష్ట్రంలో రైతులకు మేలు చేస్తుంటే.. రైతు కూలీలకు పింఛన్ ఇస్తుంటే.. కేంద్రం ఉచితాలని బంద్ పెట్టాలని అంటోంది. రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే.. మీటర్లు పెట్టాలంటోంది. ఎందుకు పెట్టాలి మీటర్లు? గోల్మాల్ ప్రధాన మంత్రి, కేంద్రం చెప్పేవన్నీ అబద్ధాలే. దేశంలోని రైతులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కలిపి వ్యవసాయానికి వినియోగించే విద్యుత్తు 20.8 శాతమే. దాని ఖర్చు రూ.1.45 లక్షల కోట్లే. ఒక కార్పొరేట్ దొంగకు దోచిపెట్టినంత కాదు కదా! ఈ విషయంలో ఎందుకు రైతుల ఉసురు పోసుకోవాలి? మీటర్లు లేని విద్యుత్తు కోసం పోరాడాలని రైతులంతా నన్ను ఆహ్వానించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్న నరేంద్ర మోదీకే మనమంతా మీటర్లు పెట్టాలి. అలా చేస్తే పీడ పోతుంది. మోదీ శ్రీలంకకు పోయి తన దోస్తులు, షావుకార్లకు బిజినెస్ ఇప్పించాడు. దీంతో అక్కడి ప్రజలు నరేంద్ర మోదీ గోబ్యాక్, ఇండియా పీఎం గోబ్యాక్ అని నినదించారు. ‘తలాపున పారుతోంది గోదారి.. నా చేను, నా చెలక ఎడారి’ అని కవి సదాశివ పాట రాసిన చైతన్యమున్న గడ్డ పెద్దపల్లి జిల్లా. కానీ ఇప్పుడు కేంద్రం ఇక్కడి సింగరేణి గనులను కూడా షావుకార్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా..? ‘‘నన్ను కలిసేందుకు 26 రాష్ట్రాల నుంచి దాదాపు 100 మంది రైతు నాయకులు వచ్చారు. ఇక్కడ అమలవుతున్న పథకాలు తమ వద్ద లేవని చెప్పారను. నన్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. మరి పోదామా జాతీయ రాజకీయాల్లోకి?..’’ అని సభికులను ఉద్దేశించి కేసీఆర్ ప్రశ్నించగా..‘వెళదాం.. వెళదాం’ అంటూ ప్రజల నుంచి స్పందన వ్యక్తమైంది. మున్సిపాలిటీలకు రూ.కోటి.. గ్రామాలకు రూ.10లక్షలు రాష్ట్రంలో మహిళలు, రైతులు, పేదలు కలలో కూడా ఊహించని అనేక మంచి కార్యక్రమాలతో ముందుకు పోతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌తోపాటు మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున.. గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ ప్రసంగం ప్రారంభమైన కాసేపటికి వాన మొదలవడంతో త్వరగా ముగించారు. కాగా.. సభలో తనకు సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదంటూ ఇల్లందకుంటకు చెందిన పెరుమాండ్ల రమేశ్ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకోగా.. పోలీసులు నిలువరించి రక్షించారు. -
సీఎం కేసీఆర్ సభలో కలకలం.. పోలీసుల అలర్ట్‌తో తప్పిన ప్రమాదం
సాక్షి, పెద్దపల్లి: తెలంగాణ సీఎం కేసీఆర్.. పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. కాగా, సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన రమేష్ అనే నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బీఈడీ చదివినా ఉద్యోగం రాలేదని మనస్థాపంతో అతను ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు సమాచారం. సభకు కిరోసిన్ బాటిల్ తెచ్చుకుని సీఎం ప్రసంగిస్తున్న సమయంలో ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. ఈ క్రమంలో వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అడ్డుకుని సభ నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం, పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే, బీఈడీ చదివినా తనకు ఉద్యోగం రాకపోవడం, ఇటీవలే తన తండ్రి చనిపోవడం, తన తల్లి మంచానపడటం, భార్యాపిల్లల పోషించే పరిస్థితి లేకపోవడంతో రమేష్ ఆత్మహత్యాయత్నం చేసినట్టు సమాచారం. కాగా, ఉద్యోగం విషయంలో తాను ప్రజా ప్రతినిధులతో విన్నవించుకున్నా ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురైన తెలుస్తోంది. ఇది కూడా చదవండి: గుజరాత్ బీజేపీ దొంగల బూట్లు మోసే సన్నాసులు తెలంగాణలో ఉన్నారు: కేసీఆర్ ఫైర్ -
పెద్దపల్లి జిల్లా: సీఎం కేసిఆర్ మాట్లాడుతుండగా ఆత్మహత్యకు యత్నించిన నిరుద్యోగి
-
2024లో బీజేపీలేని భారత దేశాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది: సీఎం కేసీఆర్
-
బీజేపీ దొంగల బూట్లు మోసే సన్నాసులు ఇక్కడున్నారు: కేసీఆర్ ఫైర్
సాక్షి, పెద్దపల్లి: తెలంగాణ సీఎం కేసీఆర్.. పెద్దపల్లి జిల్లా పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్.. సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘భారత దేశమే ఆశ్యర్చపడే విధంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నాము. తెలంగాణ ప్రగతిపై వివిధ రాష్ట్రాలు దృష్టిపెట్టాయి. 26 రాష్ట్రాల రైతు నాయకులు తెలంగాణ సాగు విధానంపై ఆరా తీశారు. రైతు నాయకులు నన్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచుతోంది. బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తున్నాయి. ప్రధాని మోదీ స్వరాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. గాంధీ మద్యపానం నిషేధించిన గుజరాత్ మద్యం ఏరులై పారుతోంది. కల్తీ మద్యానికి ఎందరో బలయ్యారు. దీంతో మీ సమాధానం ఏంటీ మోదీ. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది. మతం పేరుతో గొడవలు సృష్టిస్తున్నారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో దోపిడీ తప్ప మరేమీ లేదు. ఇక్కడ ఉండే నాయకులతో చెప్పులు మోయించుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చే దోపిడీ దొంగలు.. వాళ్ల బూట్లు మోసే సన్నాసులు ఇక్కడున్నారు. ఆత్మగౌరవంతో ఉందామా.. గులాంలుగా మారుదామా?. గుజరాత్ మోడల్ పేరుతో దేశాన్ని నాశనం చేశారు. నరేంద్ర మోదీ తీరు కారణంగా.. శ్రీలంకలో కూడా దేశ ప్రతిష్ట దెబ్బతింది. ప్రధాని మోదీ గో బ్యాక్ అంటూ లంకేయులు నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మళ్లీ రాదు. రైతులకు మీటర్ పెట్టాలంటున్న మోదీకే మీటర్ పెడుదామం. బీజేపీ ముక్త్ భారత్ అంతా కలిసి రావాలి. ధాన్యం కొనమంటే కేంద్రానికి కొనడం చేతకాదు. తెలివి తక్కువ కేంద్ర ప్రభుత్వం వల్ల గోధుమలు, బియ్యం దిగుమతి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గజదొంగలు, లంచగొండులు ఇక్కడికి వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. గోల్మాల్ ప్రధాని చెప్పేది అంతా అబద్దమే. బీజేపీని పారదోలి 2024లో రైతుల ప్రభుత్వం రాబోతోంది’ అని తెలిపారు. -
న్యాయం చేయలేకపోతే రాజీనామా చెయ్..
సాక్షి, పెద్దపల్లి: ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు న్యాయం చేయలేకపోతే ఎమ్మెల్యే పదవికి కోరుకంటి చందర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి మక్కాన్‌సింగ్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఆర్ఎఫ్ïసీఎల్ కాంట్రాక్టు కార్మికుని మృతికి నిరసనగా.. బాధితులకు న్యాయం చేయాలంటూ ఆదివారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. మృతుని కుటుంబానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులు ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చి మోసపోయారో తెలిపినప్పటికీ ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే కార్మికుడు హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు. దీనికి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్ పూర్తి బాధ్యత వహిస్తూ బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ఐదోసారికి కేటీఆర్ సిద్ధం.. వేములవాడ నుంచి బండి సంజయ్ బరిలోకి?
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా మూడు ప్రధాన పార్టీలు అప్పుడే నువ్వా నేనా అన్నట్టు ప్రచారబరిలోకి దిగాయి. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేలా అన్ని పార్టీలు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. కారు జోరుకు బ్రేకులు వేయాలని కాంగ్రెస్, కమలం పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. సింగరేణి కార్మికులే ఇక్కడ గెలుపోటములు డిసైడ్ చేస్తారు. ఎత్తుకు పై ఎత్తులు రామగుండం నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేసేలా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. మరోవైపు గులాబీ పార్టీ ఎత్తుకు బీజేపీ పై ఎత్తులు వేస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఈ సారి ఎలాగైనా సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకునేందుకు అప్పుడే ఇంటింటికి తిరుగుతూ ప్రచారం మొదలుపెట్టేశారు మూడు పార్టీల నాయకులు. టీఆర్ఎస్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కాంగ్రెస్‌లో రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ రానున్న ఎన్నికలు సవాల్తీగాసుకుని తమ పంతం నెగ్గించుకునేలా పావులు కదుపుతున్నారు. సింగరేణి కార్మికులదే రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని పట్టణం, రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలు ఉంటాయి. సింగరేణి కార్మికులు మొత్తం గోదావరిఖని 8 ఇంక్లైన్ కాలనీల్లో ఉంటారు. ఇక్కడ కార్మికుల కుటుంబాలు, మహిళా ఓటర్లు ఎక్కువ. సింగరేణి కార్మికులు యూనియన్ల పరంగా పోటాపోటీగా ఉంటాయి. కారుణ్య నియామకాలు, పేరు మార్పిడి జీఓ, బోనస్ లాంటి అంశాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. పింఛన్లు టీఆర్ఎస్కు అనుకూలమే. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే చందర్ అనుచరుల తీరు వల్ల కొంత ఇబ్బంది ఉంటుందనే చర్చ నడుస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ది కలిసి వస్తుందని బీజీపీ నేత సోమారపు భావిస్తున్నారు. చదవండి: పార్టీకి గుడ్‌బై! గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్ సీనియర్ నేతల సెటైర్లు ద్విముఖ పోటీనే మంథని నియోజకవర్గం పేరు వినగానే కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నియోజక వర్గంలోనిదే. మహాదేవ్ పూర్ ప్రాంతం భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లడంతో కాళేశ్వరం ఆలయం, మేడిగడ్డ బ్యారేజ్ లక్ష్మి పంపు హౌజ్ ఉన్న ప్రాంతాలు ఆ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. పార్వతీ బ్యారేజ్ సరస్వతీ పంపు హౌజ్ మంథని నియోజక వర్గంలోనే ఉన్నాయి. ఎన్నికలు మరో ఏడాదిలో జరిగే అవకాశాలు కన్పిస్తుడంతో రాజకీయ నాయకులు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. అనేక ఏండ్లుగా ఇక్కడ ద్విముఖ పోటీనే ఎక్కువగా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కొసాగుతోంది. కానీ ఈసారి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రీధర్‌బాబుపై అసంతృప్తి మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు కాంగ్రెస్ తరపున మూడు సార్లు ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై శ్రీధర్‌బాబు విజయం సాధించారు. నాటి నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నారు. అక్కడక్కడ అయనపై ఇంకా అసంతృప్తి కన్పిస్తోంది. కార్యకర్తల ఫోన్లు లిఫ్ట్ చేయరనే విమర్శలు ఎదుర్కొంటున్నారు శ్రీధర్‌బాబు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా చందుపట్ల సునీల్ రెడ్డి పేరు ఖరారు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన చందుపట్ల బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అధిష్టానం దృష్టిలో వడినట్లు సమాచారం. పుట్టమధుపై ఆరోపణలు న్యాయవాది వామన్ రావు హత్య విషయంలో టీఆర్ఎస్నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ వద్దే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తమకు ఇబ్బందులే తప్ప ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. ఈ రెండు అంశాలు గులాబీ పార్టీకి మైనస్‌అని భావిస్తున్నారు. పుట్ట మధు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సన్నిహితంగా ఉంటారనే టాక్ ఉంది. గులాబీ పార్టీ టికెట్ రాకపోతే పుట్ట మధు బీజేపీలోకి వెళ్ళవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. రెండుసార్లు పట్టం వరుసగా రెండుసార్లు ఏ పార్టీని ఆదరించని పెద్దపల్లి ప్రజలు ఒక్క టీఆర్ఎస్కు మాత్రమే రెండుసార్లు పట్టం కట్టారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నందున ఈసారి అధిష్టానం టికెట్ ఇవ్వదని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. టిక్కెట్ఇవ్వని పక్షంలో తాను ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని మనోహర్ రెడ్డి చెబుతున్నట్లు సమాచారం. బండి సంజయ్ వర్గీయుడికి టికెట్? ఇక కాంగ్రెస్ నుంచి ఒకసారి గెలిచి రెండుసార్లు ఓడిపోయిన చింతకుంట విజయరమణారావు ఈసారయినా గెలిచి తీరాలనే పట్టుదలగా ఉన్నారు. అయితే ఆయనకు జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, ఓదెల ఎంపిపి గంట రాములు పక్కలో బల్లెంలా తయారయ్యారని టాక్. పెద్దపల్లిలో పోటీలో ఉండే కమలనాధులెవరనే ప్రశ్న వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డికి ఈసారి టికెట్ అనుమానమేనంటున్నారు. బండి సంజయ్ వర్గీయుడు ప్రదీప్ రావుకు పెద్దపల్లి టికెట్ ఇవ్వచ్చని సమాచారం. 100 కోట్ల ఆదాయం వస్తున్నా అభివృద్ధి సున్నా దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ రాజ రాజేశ్వర స్వామి కొలువై ఉన్న నియోజక వర్గ కేంద్రం అది. ఏడాదికి 100 కోట్ల ఆదాయం వస్తున్నా రాజన్న ఆలయం అభివృద్ధి కాలేదు. నియోజక వర్గం కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. స్వయానా సీఎం కేసీఆర్ ప్రకటించిన టెంపుల్ మాస్టర్ ప్లాన్ కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ 2009 నుంచి చెన్నమనేని రమేష్ బాబు గెలుస్తూ వస్తున్నారు. రమేష్ బాబుకు జర్మనీ పౌరసత్వం ఉండేది. దీనిపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కోర్టులోను, కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలో కూడా విచారణ జరుగుతోంది. పోటీలోకి మాజీ గవర్నర్ కొడుకు! సీనియర్ కాంగ్రెస్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహా రావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వేములవాడ టీఆర్ఎస్ టికెట్ చల్మెడకే అనే టాక్ వినిపిస్తోంది. మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కొండ దేవయ్య కూడా టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన సీహెచ్. విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని సిరిసిల్ల అనగానే చేనేత.. సీనియర్ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరావు గుర్తుకు వస్తారు. ఇప్పుడు మంత్రి కేటీఆర్ పేరు వినగానే సిరిసిల్ల గుర్తుకు వచ్చే పరిస్తితి వచ్చింది. చెన్నమనేని రాజేశ్వరావు లాగే కేటీఆర్ కూడా సిరిసిల్లలో నాలుగు సార్లు గెలుపొందారు. ఐదోసారి కూడా విజయకేతనం ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు కేటీఆర్. కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్‌తోపాటు మంత్రి కావడం, ముఖ్యమంత్రి కుమారుడు కావడం సిరిసిల్లకు కలిసి వచ్చింది. ఎన్నడూ లేని విధంగా సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతోంది. సిరిసిల్లలో చాలా అభివృద్ధి పనులు కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈసారి కూడా కేకేనే సిరిసిల్ల టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో కుమ్ములాటలు జనాల్లో పార్టీకి చెడ్డపేరు తెస్తోంది.. నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. 2009లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కకేకే మహేందర్‌రెడ్డి 171 ఓట్ల స్వల్ప తేడాతో కేటీఆర్ చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్తరపున పోటీచేసినా ఓడారు. కేకేకు కాంగ్రెస్ నేతల నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతూనే ఉంది. ఈసారి కూడా కేకే మహేందర్ రెడ్డినే పోటీకి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఇక సిరిసిల్లలో బీజేపీ పుంజుకుంటోంది. ఈసారి బీజేపీ తరపున మృత్యుంజయం లేదా జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పోటీ చేస్తారని తెలుస్తోంది. -
అవినీతి నిరూపిస్తే మంథని చౌరస్తాలో ఉరేసుకుంటా
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గాన్ని ఎక్కువ కాలం పాలించిన బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే తనపై కక్షగట్టి నిరాధారమైన ఆరోపణలతో రాష్ట్ర మీడియా తనపై కుట్రలు చేస్తుందని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆరోపించారు. మధుకర్ హత్య మొదలు.. చికోటి ప్రవీణ్ హవాలా వ్యవహారం వరకు ఎక్కడా తప్పు చేయలేదని, రాష్ట్ర మీడియా మాత్రం తన ప్రమేయం ఉన్నట్లుగా దుష్ప్రచారం చేస్తోందని, తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే మంథని ప్రధాన చౌరస్తాలో ఉరేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంథనిలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు నాగరాజును ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరే పించానని కోర్టులో కేసు వేశారని, అది నిలువలే దని, తర్వాత మధూకర్ ఆత్మహత్యకు తానే కారణమంటూ హైదరాబాద్, ఢిల్లీ నుంచి ప్రతినిధులు వచ్చి రాద్దాంతం చేశారని, ఆ కేసు కోర్టులో ఉందని, దానిపై కథనాలు ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. తాను అక్రమంగా రూ.900 కోట్లు సంపాదించినట్లు మీడియా ప్రచారం చేస్తుందని అందులో వాస్తవం లేదని, చికోటి వ్యవహారంలో మీడియా నిజాలు వెలుగులోకి తీసుకురావాలన్నారు. (క్లిక్: మునుగోడులో బరిలోకి రేవంత్.. కాంగ్రెస్ ప్లాన్ ఫలిస్తుందా..?) -
పొలం బాట పట్టిన మంత్రి కొప్పుల ఈశ్వర్.. ఎరువు చల్లి, నారు వేసి
సాక్షి, పెద్దపల్లి: సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం పొలంబాట పట్టారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి శివారులో గాగిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి తన పొలంలో నాటు వేస్తుండగా.. అటుగా వెళ్తున్న మంత్రి నేరుగా ఆయన పొలంలో దిగారు. లుంగి ధరించి రైతుతో కలిసి గొర్రు (జంబూ) కొట్టారు. పొలం మడిలో రసాయన ఎరువు చల్లారు. నారును మహిళా కూలీలకు అందించారు. మహిళలతో కలిసి సుమారు అరగంటపాటు నాటు వేశారు. అప్పటికే మధ్యాహ్నం కావటంతో కూలీలతోనే కలిసి భోజనం చేశారు. అక్కడినుంచి ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన ఎర్రగుంటను పరిశీలించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ రైతుల కోసం రాష్ట్రప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తోందని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతోందని, పెట్టుబడి సాయం కింద రైతుబంధు అందిస్తున్నామని వెల్లడించారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఎంపీ అరెస్ట్ -
పెద్దపల్లి: రామగుండంలో నీటిపై తేలియాడే సోలార్ ప్రాజెక్ట్
-
‘కాళేశ్వరం’ అబద్ధాల ప్రాజెక్టు
కాళేశ్వరం/సాక్షి, పెద్దపల్లి: తెలంగాణ ప్రభుత్వం మహాద్భుతమన్న కాళేశ్వరం ప్రాజెక్టు, అబద్ధాల ప్రాజెక్టు.. అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం ఆమె జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజె క్టులో భాగమైన అన్నారం (సరస్వతీ) బ్యారేజీని పార్టీ కార్యకర్తలతో కలసి సందర్శించారు. తర్వాత కన్నెపల్లిలోని లక్ష్మీపంప్‌హౌస్ పరిశీలనకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారు దిగి లక్ష్మీపంప్‌హౌస్‌కు వెళ్లేందుకోసం సీఐ కిరణ్‌కుమార్‌తో మాట్లాడారు. ఆయన ససేమిరా అనడంతో వాగ్వాదం జరిగింది. షర్మిల, పార్టీ కార్యకర్తలను పోలీసులు రోప్ పార్టీలతో అడ్డుకున్నారు. తరువాత రోడ్డుపై షర్మిల, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్ రూ.లక్షా 50 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి ప్రజాధనాన్ని వృథాచేసి డబ్బులు సంపాదించారని ఆరోపించారు. కాగా, పెద్దపల్లి జిల్లా రామగుండంలోని న్యూపోరేడుపల్లి కాలనీవాసులను, మంథనిలో పంటలు నీటమునిగి ఇబ్బందులు పడుతున్న రైతులను ఆమె పరామర్శించారు. -
పరువు తీస్తానని భార్య బెదిరింపు.. భర్త ఆత్మహత్య
పెద్దపల్లి రూరల్: భార్య వివాహేతర సంబంధాన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్తను, ప్రియుడితో కలసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానంటూ బెదిరింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై రాజేశం కథనం ప్రకా రం.. అఫ్రోజ్ జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ప్రాం తంలో బిర్యానీ సెంటర్ నడుపుతున్నారు. ఈ క్రమంలో తనకు బంధువైన ఖాజాను పనిలో పెట్టుకున్నారు. అయితే ఖాజాతో అఫ్రోజ్ భార్యకు ఏర్పడిన సాన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారితీసింది. అఫ్రోజ్ వారిని పలుమార్లు పద్ధతి మార్చుకోవాలని చెప్పినా ఫలితం లేకపోయింది. కొద్ది రోజుల క్రితం వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అఫ్రోజ్ భా ర్యను పుట్టింటికి పంపి, ఖాజాను పని నుంచి తొలగించారు. అప్పటి నుంచి వారిద్దరూ కలసి దిగిన ఫొటోలను అఫ్రోజ్‌కు పంపించి.. వాటిని సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామంటూ బెదిరింపులకు గురిచేశారు. ఆ వేధింపులు తాళలేక మనస్తాపానికి గురై అఫ్రోజ్ (43) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఖాజా, అఫ్రోజ్ భార్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
క్షణికావేశం.. కలవరపెడుతున్న ప్రేమికుల ఆత్మహత్యలు
సుల్తానాబాద్ మండలం కనుకులకు చెందిన ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. పెద్దలు నిరాకరించడంతో అబ్బాయి పురుగుల మందు తాగి సోమవారం మృతిచెందగా.. అమ్మాయి మంగళవారం బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని గోదావరిఖని ప్రాంతానికి చెందిన 25ఏళ్ల యువకుడు ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. సాక్షి, పెద్దపల్లి: ‘తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష’ అనే సామెతను మరిచి క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతూ కుటుంబాలను విషాదంలో ముంచుతున్నారు కొందరు. సమస్యను ఇతరులతో పంచుకోకుండా.. పరిష్కారం కనుక్కోకుండా విలువైన ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ప్రేమలో వైఫల్యం, కుటుంబంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, సాగులో నష్టం, దీర్ఘకాలిక రోగాలు, క్షణికావేశం, మనస్పర్థలు, మానసిక సమస్యలతో లోకం విడిచి వెళ్లిపోతున్నారు. సమస్యలు అధిగమించలేక రకరకాల కారణాలతో జిల్లాలో ఏదో ఒకచోట ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 15 నుంచి 35 ఏళ్లలోపు యువత, మహిళలలే ఎక్కువగా ఉంటున్నారు. కన్నవారికి గుండెకోత.. సుల్తానాబాద్ రూరల్: మండలంలోని కనుకులకు చెందిన మైనర్లు ఆత్మహత్య చేసుకుని కన్నవారికి గుండెకోత మిగిల్చారు. ఇరుకుటుంబాల్లో తీరని శోకాన్ని కలిగించారు. ఇద్దరిదీ తెలిసీ తెలియని వయసు కావడం.. ప్రేమలో ఉన్నామని భ్రమపడి.. పెద్దలు ఎంత చెప్పినా వినకుండా ప్రాణాలు తీసుకున్నారు. గ్రామానికి చెందిన ఓ అబ్బాయి తొమ్మిదో తరగతి వరకు చదువుకుని ఇంటివద్దనే ఖాళీగా ఉంటున్నాడు. తండ్రి చనిపోవడంతో తల్లి అన్నీతానై పోషిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ కొడుకును అల్లారుముద్దుగా చూసుకుంటోంది. ఇంతలోనే ప్రేమ పేరిట అఘాయిత్యానికి పాల్పడడం ఆమెకు తీరని వేదన కలిగిస్తోంది. అదే గ్రామానికి చెందిన అమ్మాయి కూడా పదో తరగతి వరకు చదువుకుని ఇంటివద్దనే ఉంటోంది. వారి ఇద్దరి ఇళ్లు సమీపంలోనే ఉండడంతో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని అనుకున్నా.. కులం అడ్డురావడం.. పెద్దలు అంగీకరించకపోవడంతో ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు తీసుకున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఇలాంటి వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడుతారు ► ఆత్మవిశ్వాసం కోల్పోయిన వ్యక్తులు.. ► చదువులో వెనుకబడి.. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చలేకపోతున్నామనుకునేవారు. ► మత్తుపదార్థాలకు అలవాటుపడిన వ్యక్తులు.. ► సమాజంలో పరువు పోతుందని, ఎదుటివారు తప్పుగా మాట్లాడతారనుకునేవారు. ► కుటుంబం, ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య నమ్మకం లేని వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటారు. ఈ లక్షణాలుంటే అనుమానించాల్సిందే.. ► ఒకచోట కుదురుగా ఉండకుండా అటూఇటూ తిరుగుతుండటం.. ► ఏ పని మీదా ఆసక్తి చూపకపోవడం.. చేసే పనిమీద ఆసక్తి లేకపోవడం.. ► ప్రతి చిన్న విషయానికీ ఎదుటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం.. ► చీకటిలో ఎక్కువ సమయం గడపడం.. దిగాలుగా, దుఃఖంతో ఉండటం.. ► ఎవరిని కలువకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడటం.. అనుకున్నది సాధించలేకపోయామనే నిర్వేదం.. ► జీవించడం ద్వారా ఎవరికీ ఉపయోగం లేదనుకోవడం.. వంటి లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులను అనుమానించాలి. సంకేతాల్ని గుర్తించాలి ఎవరూ ఎటువంటి సంకేతాలు ఇవ్వకుండా ఆత్మహత్యలకు పాల్పడరు. వారి ప్రవర్తన, మాటల ద్వారా తమ ఆలోచనల్ని వ్యక్తీకరిస్తారు. వీటిని సైకాలజీలో ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలుగా చెబుతారు. ఈ సంకేతాలపై అవగాహన ఉంటే ఆత్మహత్య ఆలోచన ఉన్నవారిని గుర్తించి కాపాడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థులు వీటిపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. – కె.రామచంద్రం, సైకాలజీ కేయూ సదస్సులు నిర్వహిస్తాం ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. కోపం దరిచేరనివ్వకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే స మస్యలు దూరమవుతాయి. విలువైన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్పితే అర్ధాంతరంగా ముగించడం తగదు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు గ్రామాల్లో మండల లీ గల్ సర్వీస్ అథారటీల ద్వారా న్యాయ, విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తాం. కేసులు రాజీ చేసుకునేలా లోక్ అదాలత్ ద్వారా ప్రోత్సహిస్తున్నాం. – సురేష్‌బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, పెద్దపల్లి ఆత్మహత్యలు పరిష్కారం కాదు సమస్యలకు ఆత్మహత్యలు ప రిష్కారం కాదు. విపరీతమైన ఒ త్తిడి, కోపం, అసహనంలో పుట్టిన నిరాశ, నిస్పృహల ద్వారా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. కు టుంబ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు మెరుగు పర్చుకోవటం ద్వారా జీవితానికి భరోసా కలుగజే యవచ్చు. ఆ దిశగా స్నేహితులు, బంధువులు భరోసా ఇవ్వాలి. – పి.రవీందర్, డీసీపీ ►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
షూటింగ్ స్పాట్‌గా మారుతోన్న సింగరేణి.. ప్రభాస్ సలార్, నాని దసరా..ఇంకెన్నో
సాక్షి, పెద్దపల్లి/గోదావరిఖని: నల్లబంగారు నేల సింగరేణి షూటింగ్ స్పాట్‌గా మారుతోంది. ఎప్పుడూ ఎక్స్ప్లోజివ్ల మోతలు.. డంపర్ల హారన్లు.. అప్రమత్తత సైరన్లు వినిపించే గనులపై యాక్షన్.. కట్.. ప్యాకప్ మాటలు వినిపిస్తున్నాయి. సింగరేణి కార్మికులు, అధికారులతో బిజీగా ఉండే గనులు.. సినీ ప్రముఖులతో సందడిగా మారుతున్నాయి. మసి, బొగ్గు, దుమ్ముతో నిండిపోయిన మైనింగ్ ప్రాంతాలు మాస్ సినిమాలకు అందమైన లోకేషన్లుగా మారాయి. ఉద్యమ సినిమాల నుంచి కామెడీ.. ప్రేమకథ.. మాస్ సినిమాలు సైతం ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ‘సలార్’ యూనిట్ సందడి చేయగా.. ఇటీవల ‘దసరా’ టీం షూటింగ్ పూర్తిచేసుకుని వెళ్లింది. సింగరేణి గనులపై సినిమా షూటింగ్‌లపై సండే స్పెషల్. లొకేషన్స్‌కు ప్రత్యేకం కోల్‌బెల్ట్.. సినిమా షూటింగ్‌ల లొకేషన్‌కు కోల్‌బెల్ట్ ప్రాంతం పెట్టింది పేరు. సింగరేణి కార్మికుల ఇతి వృత్తాలతో పాటు పలు సినిమా షూటింగ్లో ఈప్రాంతంలో ఎక్కువగా జరిగాయి. భారీ బడ్జెట్ మొదలు కొన్ని చిన్న సినిమాల వరకు ఈప్రాంతం ఆదరిస్తూనే ఉంది. కళాకారులను అక్కున చేర్చుకుంటోంది. గోదావరిఖని పట్టణాన్ని ఆనుకుని ఉన్న జనగామ, సుందిళ్ల గ్రామాల్లో ఆర్.నారాయణమూర్తి అనేక సినిమా షూటింగ్‌లు చేశారు. ప్రధానంగా పదేళ్ల క్రితం సుందిళ్లలో పోరు తెలంగాణా చిత్ర సినిమా షూటింగ్ ఎక్కువ రోజులు జరిగింది. అలాగే కోవిడ్‌కు ముందు బిత్తిరి సత్తి నటించిన తుపాకీ రాముడు సినిమా షూటింగ్ జనగామలో చాలా రోజుల పాటు జరిగింది. ఆర్.నారాయణమూర్తి నటించి నిర్మించిన నిర్భయభారతం, దండకారణ్యం సినిమా షూటింగ్‌లు ఇక్కడే జరిగాయి. పిట్టగోడ సినిమా షూటింగ్ కూడా ఖని పారిశ్రామిక ప్రాంతంలో జరిగింది. స్థానికులే కళాకారులుగా నిర్మించిన అగ్లీఫేసెస్ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. గోదావరిఖని ప్రాంతంలోనే చిత్ర షూటింగ్ జరిగింది. ఓసీపీ–2 బేస్‌వర్క్ షాప్‌లో ‘సలార్’ షూటింగ్ (ఫైల్) సలార్.. దసరా సందడి సింగరేణి ప్రాంతంలో గత పదిహేనేళ్లుగా చాలా సినిమాలు, షార్ట్‌ఫిల్మ్‌లు చిత్రీకరిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసకు ప్రాముఖ్యం, దర్శకుల సంఖ్య పెరిగింది. ప్రభాస్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న “సలార్’ మొదటి షెడ్యూల్‌ను రామగిరిలోని ఆండ్రియాలా ప్రాజెక్టులో చిత్రీకరించారు. రామగిరి వాస్తవ్యుడు దర్శకుడిగా, నాని హీరోగా దసరా సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం కొంత షూటింగ్ పూర్తికాగా.. తదుపరి సినిమా షూటింగ్ కూడా ఇక్కడే తీసేందుకు షెడ్యూల్ రూపొందించారు. విజయ్‌దేవరకొండ తన తదుపరి చిత్రం షూటింగ్ గోదావరిఖని ప్రాంతంలోనే తీసేందుకు లోకేషన్స్ వెతుకుతున్నారు. చిత్ర బృందం ఇటీవల సింగరేణి ప్రాంతంలో పర్యటించి వెళ్లారు. ఎన్టీపీసీ, సింగరేణి గెస్టు హౌస్‌లో ఆధునిక సౌకర్యాలతో వసతి సౌకర్యాలు ఉండటంతో చిత్రీకరణ కోసం వచ్చిన నటినటులు సైతం ఆసక్తి చూపుతున్నారు. సలార్ సినిమా షూటింగ్ కోసం డమ్మీ ఆయుధాలను తయారు చేస్తున్న సిబ్బంది (ఫైల్) ప్రీవెడ్డింగ్ షూట్స్ మాస్ సినిమాల్లో వచ్చే ఫైట్స్, పాటలకు సింగరేణి గొగ్గు గనులు దర్శకులకు మొదటి చాయిస్‌గా కనిపిస్తున్నాయి. జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల, పార్వతీ బ్యారేజీ, శ్రీపాద ఎల్లంపల్లిలో జలకళ సంతరించుకుంది. ఈ ప్రాంతాల్లో పెళ్లిళ్లకు సంబంధించిన ప్రీవెడ్డింగ్ షూట్స్, సాంగ్స్, పుట్టినరోజు వేడుకలకు చెందిన పాటలను చిత్రీకరిస్తున్నారు. -
అవసరమే ఆవిష్కరణ..
బిడ్డా.. ఈ గోలీ ఎప్పుడు వేసుకోవాలి.. గిది చూసిపెట్టు... ఇది పరగడుపున వేసుకునేదా... పడుకునే ముందు వేసుకునే గోలీనా... ఇలా ప్రతినిత్యం అమ్మ టాబ్లెట్స్ టైమ్‌కు తీసుకోవడానికి çపక్క వారి సహాయం కోసం ఎదురు చూడటం నుంచే ఈ ఎకోఫ్రెండ్లీ మెడిసిన్స్ టైమ్ టేబుల్ బ్యాగ్ తయారు చేయాలనే ఆలోచన వచ్చేలా చేసింది. ఈ ఆలోచనే రాష్ట్రస్థాయిలో పెద్దపల్లి పిల్లలను రాష్ట్ర ఇన్నోవేషన్ చాలెంజ్ విజేతగా నిలిపింది. అలాగే మహిళలు పబ్లిక్ ప్రదేశాల్లో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారంగా పోర్టబుల్ అంబరిల్లా రూమ్‌ను ఆవిష్కరించిన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థినులు రెండవ బహుమతి అందుకున్నారు. మరిన్ని ఆవిష్కరణలు చేస్తా మేం తయారు చేసిన మినీ పోర్టబుల్ రూమ్, అంబరిల్లా టాయిలెట్స్ ఆవిష్కరణకు ఇంత మంచి స్పందన వస్తుందని అనుకోలేదు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచినందుకు సంతోషంగా ఉంది. పెద్ద పెద్ద సార్ల చేతుల మీదుగా బహుమతి అందుకున్నాం. ఇప్పుడు మరిన్ని అవిష్కరణలు తయారు చేయాలనే సంకల్పం కల్గింది. మా సార్లు కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని ప్రయోగాలు చేస్తాం. – రితిక, 10వ తరగతి, నెల్లికుదురు మోడల్‌స్కూల్, మహబూబాబాద్ సంతోషంగా ఉంది ఎగ్జిబిట్‌ను తయారు చేయడానికి వారం రోజులకు పైగా కష్టపడ్డాం. సార్లు మంచిగా చెప్పి తయారు చేయించారు. ఎగ్జిబిట్ గురించి చెప్పేటప్పుడు ముందుగా భయం వేసింది. తర్వాత వివరించడం సులువయ్యింది. ఇకనుంచి ప్రతి సంవత్సరం ఎగ్జిబిట్స్ తయారు చేస్తా. మా సార్లు, అమ్మానాన్న, మా ఊరిలోని వారు అందరూ మెచ్చుకుంటున్నారు. సంతోషంగా ఉంది. – కీర్తన, 6వ తరగతి, టీఎస్ మోడల్ స్కూల్, నెల్లికుదురు, మహబూబాబాద్ అమ్మ తిప్పలు చూడలేక... సైన్స్ ఇన్నోవేషన్స్ ఛాలెంజ్ కోసం ఐదు నెలల క్రితం నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు మెంటర్ శివకృష్ణ సర్ ఆధ్వర్యంలో తమన్నా, నేను సర్టిఫికేషన్ కోర్సు చేశాం. ఇందులో ఆన్లైన్లో 10 వీడియోలు చూసి, దానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు. వాటికి సరైన సమాధానం చెప్పిన వారికి సర్టిఫికేట్ ఇచ్చారు. అందులో గెలిచిన వారి నుంచి సమాజంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం కొన్ని సూచనలు చేయాలని చెప్పారు. దాని గురించి రెండు – మూడు ఆలోచనలు చేశాం. అందులో అమ్మ ప్రతిరోజూ టాబ్లెట్స్ వేసుకోవడానికి పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపితే బాగుంటుందని నా ఆలోచన గురించి చెప్పా. నాన్న గల్ఫ్‌లో పనిచేస్తున్నాడు. అమ్మ బీడీలు చుడుతుంది. నాకు చెల్లి, తమ్ముడు ఉన్నారు. అమ్మకు ఒంట్లో బాగుండదు. ప్రతి రోజూ మందులు తీసుకోవాలి. ఆమెకు ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలో తెలిసేది కాదు. నేను సహాయం చేస్తుంటాను. అమ్మలాంటి నిరక్షరాస్యులందరిదీ ఇదే సమస్య కదా అనిపించింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మందులు సులువుగా తెలుసుకోవడానికి అరలతో సంచి చేద్దాం అనుకున్నాను. ఇలాంటి సంచి ఉంటే ఒక సమయంలో వేసుకోవాల్సిన మందులను మరొక సమయంలో తీసుకోవటం వంటి పొరపాట్లు జరగవు. ఈ ఆలోచనను పైకి పంపించగా మా ప్రాజెక్టు సెలెక్టు అయ్యింది. – జి. శివాని అంధులకు సైతం ఉపయోగపడాలని... తెలంగాణ ఇన్నోవేషన్ చాలెంజ్ కోసం మేము అబ్దుల్ కలాం అనే గ్రూప్‌గా ఏర్పడి ఎకో ఫ్రెండ్లీ మెడిసిన్ టైమ్ టేబుల్ బ్యాగ్‌ను రూపొందించాం. మొదట కేవలం నిరక్షరాస్యుల కోసం బ్యాగ్ తయారు చేయాలనుకున్నాం. తర్వాత మనం తయారు చేసే ప్రాజెక్టు నిరక్షరాస్యులతోపాటు, అంధులు సైతం ఉపయోగించేలా పర్యావరణ హితంగా రూపకల్పన చేస్తే బాగుంటుందనిపించి, నా ఆలోచనను సార్‌తో పంచుకున్నాను. మా సర్ సహకరించారు. ఒక్కో పూటకు ఒక్కో బ్యాగ్ అనుకున్నాం. కానీ ఎక్కువ బ్యాగ్‌లు ఐతే ఇబ్బంది అవుతుందని ఒక్కటే బ్యాగ్‌గా తయారు చేసి ముందు వైపు నాలుగు పాకెట్లు, వెనుక రెండు పాకెట్లు ఉండేలా తయారు చేశాం. ఆ పాకెట్ల పై అందరూ సమయం గుర్తుపట్టేలా సింబల్స్ పెట్టాం. అంధుల కోసం ప్రత్యేకం గా బ్రెయిలీ లిపి గుర్తులు ఉంచాం. మందుల కోసం షాప్‌కి వెళ్లేటప్పుడు ఈ సంచిని తీసుకెళితే షాపు వాళ్లే ఏ పూట వేసుకోవాల్సిన మందులను ఆ అరలో సర్ది ఇవ్వగలుగుతారు. లేదంటే తర్వాత పిల్లలు కానీ తెలిసిన వాళ్ల సహాయం కానీ తీసుకోవచ్చు. నెలకోసారి ఇలా మెడికల్ టైమ్ టేబుల్ బ్యాగ్‌ను సర్దుకుంటే నెలంతా మరొకరి అవసరం లేకుండా సమయానికి మందులు వేసుకోవచ్చు. – బి. తమన్నా, 9వ తరగతి, తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, ధర్మారం, పెద్దపల్లి జిల్లా శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లి ఈరగాని బిక్షం, సాక్షి, మహబూబాబాద్ -
12 మీటర్ల లోతైన బ్లాస్టింగ్ హోల్లో పడిన శునకం.. సింగరేణి ఉద్యోగుల సాహసం
సాక్షి, గోదావరిఖని(పెద్దపల్లి): దారి తప్పి ఓసీపీ క్వారీ బ్లాస్టింగ్ ప్రాంతంలోకి శునకం పరుగెత్తుకొచ్చింది. బ్లాస్టింగ్ సిబ్బంది ఎక్స్‌ప్లో జివ్ నింపడంలో బిజీ అయ్యారు. అంతలోనే అటుగా వేగంగా వచ్చిన కుక్క 12 మీటర్ల లోతులో ఉన్న బ్లాస్టింగ్ హోల్లో పడిపోయింది. గమనించిన కార్మికులు కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో బ్లాస్టింగ్ ఇన్చార్జి డిప్యూటీ మేనేజర్ సంపత్‌కుమార్‌కు సమాచారం అందించారు. బ్లాస్టింగ్ హోల్లోకి పంపే తాడు చివరన ఐరన్ గొలుసు కట్టి లోపల ఉన్న కుక్క పట్టుకునేందుకు గొలుసుమధ్యలో కర్ర కట్టారు. దీంతో 12మీటర్ల లోతున ఉన్న కుక్క దాన్ని పట్టుకోవడంతో చాకచక్యంగా తాడుతో బయటకు లాగారు. బయటకు వచ్చిన శునకం బతుకు జీవుడా అంటూ పరుగుపెట్టింది. సింగరేణి ఉద్యోగులు, అధికారులను ఆర్జీ–2 జీఎం టీవీరావుతో పాటు పలువురు అభినందించారు. చదవండి: ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రెండేళ్లు కలిసి తిరిగాక.. -
అయ్యో కొడుకా.. ఎంత పనాయే..!
సాక్షి, పెద్దపల్లి(మంథని): ‘అయ్యో కొడుకా.. ఎంత పనాయే.. మీ నాన్న ఆరోగ్యం సహకరించకపోయినా కూలీనాలీ చేసుకుంట మిమ్మల్ని చదివిస్తున్న. రెక్కలు ముక్కలు చేసుకుని ముగ్గురిని సాదుకుంటున్న. మీరే సర్వస్వం అనుకుని మిమ్మల్ని చూసుకునే బతుకుతున్న. ఎంత కష్టమైనా భరించుకుంటున్న. ఇప్పుడు పుట్టెడు శోకంలో ముంచితివి కదా బిడ్డా..’ అంటూ ఆ తల్లి గుండలవిసేలా రోదించింది. రామగిరి మండలం రత్నాపూర్ పంచాయతీ పరిధి బేగంపేట క్రాస్ రోడ్డుకు చెందిన పదో తరగతి విద్యార్థి తంగళ్లపల్లి విష్ణువర్ధన్ సోమవారం ఈతకు వెళ్లి మృత్యువాతపడగా.. గ్రామస్తులు, కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. తంగళ్లపల్లి రామచంద్రం, రాజ్యలక్ష్మి దంపతులది స్వగ్రామం లద్నాపూర్ కాగా.. ఆ గ్రామాన్ని సింగరేణి సంస్థ స్వాధీనం చేసుకోవడంతో దాదాపు 20ఏళ్ల క్రితమే జీవనోపాధి నిమిత్తం ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు. రామచంద్రం మానసికస్థితి సరిగా లేకపోవడంతోపాటు పక్షవాతం బారిన పడ్డాడు. దీంతో రాజ్యలక్ష్మి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలతోపాటు భర్తను కాపాడుకుంటోంది. మొదటి కుమారుడు కేశవర్ధన్ ఐటీఐ చేస్తున్నాడు. విష్ణువర్ధన్ ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. చదవండి: హైకోర్టు ఉత్తర్వు కాపీలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్ ఏమన్నారంటే.. పాఠశాల ఆవరణంలోకి చేరిన ఎస్సారెస్పీ నీళ్లు ఎస్సారెస్పీ కాలువ నీరు పాఠశాల ఆవరణలోకి చేరడంతో యాజమాన్యం సెలవు ప్రకటించింది. దీంతో తోటి మిత్రులు ఫిరోజ్, శ్రీతరుణ్తో కలిసి ఈతకు వెళ్లాడు. ముగ్గురు కాలువలోకి దిగారు. అయితే విష్ణువర్ధన్ నీటిలో అడుగుభాగంలో ఉన్న పూడికలో దిగబడి మునిగిపోయాడు. పాఠశాల యథావిధిగా నిర్వహించి ఉంటే విష్ణువర్ధన్ ఈతకు వెళ్లేవాడే కాదని, సెలవు ఇవ్వడంతోనే సరదా కోసం ఈతకెళ్లి తిరిగి రాని లోకాలు చేరాడని స్థానికులు కంటతడి పెట్టారు. కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు సింగరేణి సంస్థ ఓసీపీ–2 ఓబీ యార్డును ఆనుకుని కాలువ పనులు నిర్వహిస్తున్న ఎన్టీపీసీకి చెందిన కాంట్రాక్టర్ పని స్థలంలో ఎలాంటి రక్షణ చర్యలూ తీసుకోకపోవడంతోనే తన కొడుకు చనిపోయాడని రాజ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ మేరకు కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై కటికె రవిప్రసాద్ తెలిపారు. -
విషాదం: సింగరేణి బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, పెద్దపల్లి/రామగిరి/గోదావరిఖని: మూడు రోజుల రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి పరిధిలోని ఏపీఏ అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏఎల్పీ)లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అసిస్టెంట్ మేనేజర్ తేజ, సెఫ్టీ ఆఫీసర్ జయరాజ్, కార్మికుడు శ్రీకాంత్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురిలో నలుగురు క్షేమంగా ఉన్నారని, ముగ్గురు మృతి మరణించారని అధికారులు తెలిపారు. ఏఎల్పీ బొగ్గుగనిలో 86వ లెవల్ వద్ద రూఫ్ బోల్డ్ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఏరియా సేఫ్టీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్‌సహా మరో ఐదుగురు కార్మికులు ప్రమాదంలో చిక్కుకోగా.. ముగ్గురిని సోమవారమే బయటకు తీసుకొచ్చారు. రవీందర్‌ను రెస్క్యూ టీం మంగళవారం కాపాడింది. సంబంధిత వార్త: ఆ ముగ్గురూ ఎక్కడ? -
సింగరేణిలో ప్రమాదం.. బొగ్గు గని పైకప్పు కూలి 8 మంది గల్లంతు?
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగరేణి ఆర్జీ-3 పరిధిలోని ఆడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గని పైకప్పు కూలడంతో రాళ్ళ కింద ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. వీరిలో నలుగురిని సహాయక సిబ్బంది కాపాడి ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన మరో నలుగురి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మీస వీరయ్య అనే కార్మికుడికి తీవ్ర గాయాలవ్వగా గోదావరిఖని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. చదవండి: అంగన్వాడీ ఆయా ప్రభుత్వ నౌకరా!.. ఎమ్మెల్యేను ప్రశ్నించిన వృద్ధురాలు గాయపడిన మీస వీరయ్య -
ప్రేమ పేరిట అమ్మాయిలకు ఎర.. నమ్మిన స్నేహితులను కూడా
సాక్షి, పెద్దపల్లి, ఖమ్మం : పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రీమోనీ సైట్లలో పరిచయమయ్యే మహిళలే కాకుండా స్నేహితులను మాయమాటలతో బురిడీ కొట్టించి రూ.కోటికి పైగా కొల్లగొట్టిన మోసగాడిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు... ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురానికి చెందిన రాహుల్ ప్రస్తుతం హైదరాబాద్ కూకట్‌పల్లిలో నివాసముంటున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో రెండో పెళ్లి కోసం వెబ్సైట్లో వివరాలు నమోదు చేసింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రాహుల్ రూ.15.5లక్షల నగదు, ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా మరికొంత డబ్బు తీసుకుంటూ, ఇచ్చేస్తున్న ఆయన అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.లక్షల్లో డబ్బు వసూలు చేశాడు. ఆ తర్వాత బంగారు ఆభరణాలు తీసుకుని ఫైనాన్స్ సంస్థలో కుదవపెట్టగా తనను మోసం చేసినట్లు తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ఉపేందర్ ప్రత్యేక బృందాలతో గాలించి రాహుల్‌ను అరెస్టు చేశారని ఏసీపీ తెలిపారు. అయితే, రాహుల్‌పై 2010లో ఖమ్మంలో, 2012లో హైదరాబాద్ ఎల్బీ.నగర్లో, 2013లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో చీటింగ్ కేసులు నమోదయ్యాయని ఏసీపీ సారంగపాణి వివరించారు. చదవండి: వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి ఇటీవల స్నేహితులను కూడా ఐటీ సమస్యలు ఉన్నాయని నమ్మించి రూ.లక్షల్లో అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదని తెలిపారు. మంగళగిరికి చెందిన జాస్తి వెంకటేశ్వర్లు నుంచి రూ.50లక్షలు, విజయవాడకు చెందిన బంగారి భాగ్యలక్ష్మి నుంచి రూ.1.80లక్షలు, షేక్‌ఖలీల్ నుంచి రూ.4.86లక్షలు, నాయుడు వెంకటేశ్ నుంచి రూ.1.20లక్షలు, హైదరాబాద్‌కు చెందిన ప్రసన్నలక్ష్మి నుంచి రూ.25లక్షలు, ప్రకాశంకు చెందిన కరీముల్లా నుంచి రూ.1.45లక్షలు, బాచు అప్పన్న నుంచి రూ. 2.5లక్షలు, ముప్పిరాజు మణికంఠ నుంచి రూ. 2లక్షలు తీసుకుని మోసగించాడని తేలిందని చెప్పారు. -
ఎరుపు కోసం రైతన్నపడిగాపులు
-
డిగ్రీ విద్యార్థి హత్య.. ఒంటిపై గాయాలు.. ప్రేమ వ్యవహారమే కారణం?
సాక్షి, కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. ఎస్సై వెంకటేశ్వర్, స్థానికుల కథనం ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన దామ తరుణ్ (19) డిగ్రీ చదువుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన నూనె శివ, అనిల్‌లు పని ఉందని చెప్పి, ఈ నెల 18న అతన్ని బైక్‌పై తీసుకెళ్లారు. తర్వాత తరుణ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఈ నెల 19న కాల్వశ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం వెన్నంపల్లి శివారులో ఓ యువకుడి మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు చెప్పడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. దామ పద్మ–మొండయ్య దంపతులకు సమాచారం అందించగా.. వచ్చి, తమ కుమారుడిదేనని గుర్తించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్యకు గురై ఉంటాడని వారు అనుమానం వ్యక్తం చేశారు. చదవండి: పాకెట్ మనీ కోసం.. మరో లోకంలో విహరించాలని.. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. తరుణ్ మృతికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోస్టుమార్టం రిపోర్టుతోపాటు పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
సంచలన వ్యాఖ్యలు.. డోర్ తెరిస్తే.. ‘దుద్దిళ్ల’ ‘కారు’ ఎక్కడం ఖాయం
సాక్షి, పెద్దపల్లి: సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తెలుపులు తెరిస్తే మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని, శ్రీధర్‌బాబు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. టీఆర్ఎస్లో చేరడానికి శ్రీధర్‌బాబు సిద్ధంగా ఉన్నా.. కేసీఆర్ గేట్లు తెరవడం లేదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికైనా నిజాలను గ్రహించి చెంచాగిరీ చేయడం మానుకోవాలని హితవు పలికారు. దీంతో మధు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. (చదవండి: ఆయన ఏం డిసైడ్ అయ్యారు, వెళ్తారా.. ఉంటారా?) -
సాక్షి కార్టూన్ 10-02-2022
చికెన్ బిర్యానీ తినొచ్చావా..! అయితే డబుల్ టికెట్ తీసుకో! -
కోడిపుంజుకు టికెట్.. స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ఆర్టీసీ బస్సులో కోడిపుంజుకు టికెట్.. అదీ ఫుల్ టికెట్ కొట్టిన ఘటన సోషల్ మీడియా ద్వారా వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. దీనిపై ఇంటర్నెట్లో సెటైర్లు పేలుతున్నాయి. అలా విషయం తన దాకా రావడంతో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్‌కు వెళ్తోంది. దారిలో రామగుండం బి పవర్‌హౌస్ వద్ద మహ్మద్ అలీ అనే ప్రయాణికుడు బస్సెక్కాడు. కూడా ఓ కోడిని సంచితో దాచిపెట్టుకుని వెళ్తున్నాడు. బస్సు సుల్తానాబాద్‌కు చేరుకోగానే బస్సు కుదుపులకు పుంజు ఒక్కసారిగా అరిచింది. గమనించిన కండక్టర్ తిరుపతి కోడిపుంజుకు కూడా రూ. 30 టికెట్ తీసుకోవాలని గద్దించాడు. దీంతో చేసేది లేక అలీ టికెట్ తీసుకున్నాడు. ఈ విషయం టికెట్ ద్వారా సామాజిక మాధ్యమాలకు ఎక్కింది. ఇది చూసిన నెటిజన్లు ఆర్టీసీపై దుమ్మెత్తి పోశారు. ఏం జరిగిందంటే.. ఈ ఘటనలో ఏం జరిగిందో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బస్సుల్లో పశుపక్ష్యాదులకు అనుమతి లేదు. సుల్తాన్‌బాద్ దగ్గర కోడిపుంజును గుర్తించాక కండక్టర్ ఆ ప్రయాణికుడ్ని ప్రశ్నించాడు. అయితే అదే బస్సులో ఉన్న శ్రీ కుమార్ అనే ఓ న్యూస్ రిపోర్టర్.. కండక్టర్‌ను టికెట్ కొట్టమని వుసిగొల్పాడట. హాట్ న్యూస్ కోసం ఆ రిపోర్టర్ అలా ప్రోత్సహించగా.. కండక్టర్ ఆ ప్రభావంతో కోడిపుంజుకు టికెట్ కొట్టాడు. కండక్టర్ ఆ రిపోర్టర్ చెప్పినట్లు.. అలా ప్రవర్తించాల్సింది కాదు. కండక్టర్ మీద చర్యలు తీసుకుంటాం అని ఆయన ఓ పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఘటనపై స్పందించిన డిపో మేనేజర్ వెంకటేశం చర్యలకు ఆదేశించినట్లు ప్రకటించగా.. ట్విటర్లో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సైతం ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. pic.twitter.com/kVdLhLzy86 — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) February 9, 2022 సంబంధిత వార్త: పదేళ్లు కూడా బతకని కోడికి ఫుల్ టికెట్?? -
సంక్రాంతి పండుగ మనవడితో సంతోషంగా చేసుకోవాలనుకున్నాడు.. అంతలోనే..
సాక్షి, కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): సంక్రాంతి పండుగకు తన మనవడిని తీసుకువస్తున్న ఓ వ్యక్తి మానేరు నదిలో ఆ చిన్నారితో సహా గల్లంతయ్యాడు.. బాబు మృతదేహం లభ్యమవగా తాత ఆచూకీ దొరకలేదు. ఈ ఘటన కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేటలో చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై వెంకటేశ్వర్ కథనం ప్రకారం.. మీర్జంపేటకు చెందిన మార్క దేవేందర్(45)కు ఇద్దరు భార్యలు ఇందిర, కొమురమ్మ, కుమారులు బాలు, సాయి, వెంకటేశ్, కూతురు మౌనిక, తల్లిదండ్రులు ఉన్నారు. కూతురు మౌనికకు వీణవంక మండలం కిష్టంపేటకు చెందిన కోల శ్రీనివాస్‌తో వివాహం జరిపించారు. ఈ దంపతులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. అక్కడ శ్రీనివాస్ కూలి పనులు చేస్తున్నాడు. వీరికి యశ్వంత్(9), ఏడాది వయసున్న ఒక పాప ఉన్నారు. స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో దేవేందర్ తన మనవడిని తీసుకువచ్చేందుకు హైదరాబాద్ వెళ్లాడు. సోమవారం యశ్వంత్‌ను తీసుకొని మీర్జంపేటకు బయలుదేరాడు. రైలెక్కి, జమ్మికుంటలో దిగి, ఆర్టీసీ బస్సులో వావిలాలకు వచ్చారు. అక్కడి నుంచి కాలినడకన మానేరు నది దాటుతూ స్వగ్రామం మీర్జంపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరూ జారి, నీటిలో పడ్డారు. కొంత దూరంలో ఉన్న రైతులు గమనించి, గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంకటేశ్వర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు. చదవండి: (‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’) గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టగా యశ్వంత్ మృతదేహం లభ్యమైంది. రాత్రి వరకు వెతికినా దేవేందర్ ఆచూకీ లభించలేదు. ప్రమాద విషయం తెలుసుకున్న యశ్వంత్ తల్లిదండ్రులు హైదరాబాద్ నుంచి బయలుదేరినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ దుర్ఘటనతో మీర్జంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎమ్మెల్యే మానేరు నదిలో గల్లంతై, మృతి చెందిన మార్క దేవేందర్, ఆయన మనవడు యశ్వంత్‌ల కుటుంబసభ్యులను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహార్ రెడ్డి పరామర్శించారు. ఈ సంఘటన దురదృష్టకరమని, ఇరు కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపీపీ నూనేటి సంపత్‌యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు వంగళ తిరుపతి రెడ్డి, సర్పంచ్ నాగార్జున్‌రావు, నాయకులు దేవేందర్, సదానందం, కొమురయ్య, ఓదెలు తదితరులున్నారు. -
ఇప్పుడే వస్తానమ్మా... అంటివి కదా కొడుకా!
సాక్షి, గోదావరిఖని(రామగుండం): ‘ఇప్పుడే వస్తానమ్మా.. అంటూ బండి తీసుకుని బైటికిపోయినవ్. చూసిచూసి అర్ధరాత్రి ఐతంది బిడ్డా.. ఎక్కడికి పోయినవ్ రా.. అని ఫోన్ చేసిన. అన్నం తినకుండా పోయినవ్.. బుక్కెడంత తిందువురారా అని బ్రతిమిలాడిన. దగ్గరనే ఉన్నా అంటివి. గంటలో ఇంటికాడుంటా అంటివి. వచ్చి పడుకున్నావనుకున్నా కొడుకా.. ఇట్లా.. నీ బతుకు తెల్లారుతదనుకోలేదు బిడ్డా.. అంటూ ఆ కన్నతల్లి కడుపు వేదన కన్నీరు పెట్టించింది. బైక్ ప్రమాదంలో చనిపోయిన బక్కతట్ల ఉమామహేశ్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు కాగా.. కొడుకు చదువుకుంటున్నాడని కూరగాయలు అమ్మిన పైసలతో బైక్ కొనిస్తే.. అదే అతడి ప్రాణాలు తీసిందని కన్నీరు మున్నీరయ్యారు. ప్రాణంతీసిన అతివేగం.. అర్ధరాత్రి.. అతివేగం.. ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. మరొకరు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్పోర్ట్స్ బైక్‌పై ముగ్గురు యువకులు మితిమీరిన వేగంతో ఓ షాపు గోడను బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గోదావరిఖనిలోని రాంనగర్‌కు చెందిన గొల్లెన శివరాం(19), మల్లికార్జునగర్‌కు చెందిన బక్కతట్ల ఉమామహేశ్(21), కొత్తకూరగాయల మార్కెట్‌కు చెందిన బీమ్ల సిద్దూ(17) స్నేహితులు.ముగ్గురు కలిసి సోమవారం రాత్రి తొమ్మిదిగంటలకు మహేశ్ బైక్‌పై బయటకు వెళ్లారు. పదకొండు గంటల సమయంలో ఉమామహేశ్‌కు తల్లిఫోన్చేసి త్వరగా ఇంటికి రమ్మని సూచించగా.. గంటలో వస్తానని వెళ్లలేదు. చదవండి: మైనేమ్ ఈజ్ సుజి, ఐ యామ్ సింగిల్.. అంటూ అందంగా మాట్లాడుతారు మంగళవారం వేకువజామున ముగ్గురూ కలిసి బైక్‌పై స్టేడియం వైపు నుంచి రమేశ్నగర్వైపు అతివేగంగా వెళ్తుండగా చౌరస్తా వద్ద అదుపు తప్పి వెంకటేశ్వర్ సైకిల్‌షాప్ గోడకు ఢీకొంది. బైక్ నడుపుతున్న శివరాం గోడకు అతుక్కుని అక్కడికక్కడే దుర్మణం పాలయ్యాడు. వెనకాల కూర్చున్న ఉమామహేశ్ తలకు బలమైన గాయాలు కాగా కరీంనగర్ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. బీమ్ల సిద్దూతలకు బలమైన గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఉమామహేశ్ తండ్రి పోచయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్‌టౌన్‌సీఐ రాజ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శివరాం, సిద్దూ పై గతంలో కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: అంబులెన్స్ లేదు.. పీహెచ్‌సీకి తాళం.. ఆటోలోనే ప్రసవించిన మహిళ రెండు కుటుంబాల్లో తీరని విషాదం ఉమామహేశ్ తండ్రి స్థానిక మల్లికార్జున్‌నగర్‌లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ఉమామహేశ్ వరంగల్‌లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. శివరాం తండ్రి సమ్మయ్య మున్సిపల్ కార్యాలయంలో స్వీపర్. ప్రమాదంలో ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడం ఆ కుటుంబంలోనూ అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిద్దూ కుటుంబం కూరగాయల మార్కెట్ సమీపంలో నివాసముంటున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో చికిత్సకు డబ్బులు లేకపోడంతో ఆర్థికసాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాణాలు తీస్తున్న నైట్రైడ్లు స్పోర్ట్స్‌బైక్‌లపై నైట్రైడ్లు యువకుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల కాలంలో యువతకు బైక్‌రైడింగ్ ఫ్యాషన్‌గా మారింది. కొత్త బైక్‌లకు తోడు తమకున్న అలవాట్లు ప్రాణాలు తీస్తున్నాయి. మూడేళ్ల కిందట ఇలాగే రామమందిర్ ఏరియా సమీపంలోని సబ్‌స్టేషన్ వద్ద అర్ధరాత్రి రోడ్డుపై ఉన్న పోల్‌ను ఢీకొని ఇద్దరు మృతి చెందారు. -
బాత్రూంలో ఉరివేసుకొని బాలింత ఆత్మహత్య
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాలింత బాత్రూంలో ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. కమాన్‌పూర్ మండలం రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమా(30) ఈ నెల 12న మగ శిశువు కు జన్మనిచ్చింది. మొదటి కాన్పు కావటంతో కుటుంబసభ్యులు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సిజరియన్ చేసిన తర్వాత ఐసియుసిలో ఉంచారు. వాస్తవానికి ఏడు రోజులకు డిశ్చార్జ్ చేయవలసి ఉండగా సర్జరీ వల్ల కుట్లు మానకపోవటంతో వైద్యులు మరోసారి కుట్లు వేస్తామని చెప్పినట్టు సమాచారం. దీంతో మరోసారి సర్జరీ, కుట్లు అతుక్కోపోవడంతో మనోవేదనకు గురై ఆమె బాత్ రూంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మూడుసార్లు కుట్లు వేశారని వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. చదవండి: రూ.5కేనాలుగు ఇడ్లీలు.. అక్కడ ఫుల్ డిమాండ్.. దీనికో ప్రత్యేకత ఉంది -
పోలీసు కొలువులకు కేరాఫ్ అడ్రస్‌గా ఆ గ్రామం.. ఇదంతా ఆయన స్ఫూర్తితోనే..
సాక్షి,ధర్మారం(పెద్దపల్లి): దొంగతుర్తి గ్రామం పోలీసులకు నెలవుగా మారింది. పోలీస్‌శాఖలో వివిధ హోదాల్లో 42 మంది యువకులు పని చేస్తున్నారు. మరో వంద మంది వరకు ఇతర శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మావోయిస్టు ప్రాబల్యం కలిగిన ఈ గ్రామం నుంచి 1995లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించిన పాలకుర్తి మల్లేశం కాటారం మండలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించారు. గ్రామంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పి, పోలీస్‌శాఖ ఏటా వేడుకలు నిర్వహిస్తోంది. మల్లేశంను ఆదర్శంగా తీసుకున్న గ్రామ యువత పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధిస్తోంది. ప్రస్తుతం గ్రామానికి చెందిన ముగ్గురు ఎస్సైలుగా, 31 మంది సివిల్ కానిస్టేబుళ్లుగా, ఇద్దరు ఆర్మీలో, ఇద్దరు బీఎస్ ఎఫ్‌లో, నలుగురు సీఐఎస్ఎఫ్లో, ఒకరు సీఆర్పీఎఫ్లో పని చేస్తున్నారు. చదవండి: Munawar Faruqui: స్టాండప్ కమెడియన్ రాకపై కాక,.. తగ్గేదెవరో.. నెగ్గేదెవరో? -
పెద్దపల్లి జిల్లాలో దున్నపోతు వీరంగం
-
చేపలకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలు... వీటిని మనుషులు తింటే భయంకరమైన వ్యాధులు
సాక్షి, గోదావరిఖని(కరీంనగర్): చెత్తలో కలిసిపోయే కోళ్ల వ్యర్థాలు కూడా కాసులు కురుపిస్తున్నాయి. కోళ్లను కోసిన అనంతరం వ్యర్థంగా పడేసే ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్కరోజు, రెండు రోజులు కాదు.. ఏడాదంతా ఇదే దందా. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక వాహనాల ద్వారా ఓ ముఠా ఈ వ్యర్థాలను రహస్యంగా పొరుగు జిల్లా మంచిర్యాలలోని చేపల చెరువులకు తరలిస్తోంది. ఈ వ్యర్థాలను తిన్న చేపలను మనుషులు తింటే క్యానర్స్వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ‘సాక్షి’ చేపట్టిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో మాఫియా దందా బయటపడింది. నమ్మలేని నిజాలు అనేకం వెలుగు చూశాయి. ఈ మాఫియా దందా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జోరుగా సాగుతుండడం గమనార్హం. ఇంత జరుగుతున్నా.. పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ, ఫిషరీష్ తదితర శాఖల అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రతినెలా మాఫియా ముట్టజెప్పే కాసులకు కక్కుర్తిపడి ఈ దందాపై కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. చికెన్ వ్యర్థాలను సేకరిస్తున్న యువకులు మాఫియాకు చికెన్ మార్కెట్ల అడ్డా... రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం, ఎఫ్‌సీఐ తదితర ప్రాంతాల్లోని చికెన్ మార్కెట్లు మాఫియాకు అడ్డాగా మారుతున్నాయి. పక్క జిల్లాకు సంబంధించిన ముఠా బహిరంగంగా ఈ దందా నిర్వహిస్తోంది. ఈ ముఠాకు బల్దియా అధికారులతోపాటు చికెన్ మార్కెట్ వ్యాపారులు సహకరిస్తున్నారు. చికెన్ వ్యర్థాల సేకరణే టార్గెట్.. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొందరు ముఠా సభ్యులు ప్రత్యేక వాహనాల్లో చికెన్ మార్కెట్లకు చేరుకుంటారు. వాహనంలో ముందుగానే ఏర్పాటు చేసుకున్న భారీ ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కోళ్ల నుంచి తీసిన పేగులు, తల, కాళ్లు, చర్మం, ఈకలు సేకరిస్తారు. ఇలా ఒక్కో ట్రిప్పుకు సుమారు నాలుగు టన్నుల వ్యర్థాలను సేకరిస్తున్నారు. పక్కా రూట్ మ్యాప్ ద్వారా సేకరణ చికెన్ వ్యర్థాలను సేకరించడానికి ఈ మాఫియా పక్కా రూట్ మ్యాప్ అమలు చేస్తోంది. ముందుగా గోదావరిఖని చికెన్మార్కెట్కు చేరుకుని హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల నుంచి భారీ ఎత్తున వ్యర్థాలను సేకరించిన అనంతరం ఎల్బీనగర్, తిలక్‌నగర్, మార్కండేయకాలనీ, ఫైవింక్లయిన్ మీదుగా యైటింక్లయిన్‌కాలనీ చేరుకుంటుంది. ఈరూట్ మ్యాప్‌లోని అన్ని చికెన్‌సెంటర్ల నుంచి వ్యర్థాలను ముఠా సేకరిస్తుంది. మాఫియాకు సహకరిస్తున్న వ్యాపారులు చికెన్ వ్యర్థాలను సేకరించే మాఫియాకు పారిశ్రామిక ప్రాంతంలోని చికెన్ సెంటర్ల వ్యాపారులు, అసోసియేషన్ నాయకులు సహకరిస్తున్నారని తెలుస్తోంది. గతంలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించేవారు. అయితే ఈ మాఫియా క్యాట్‌ఫిష్ పెంపకానికి సేకరించడంపై దృష్టి పెట్టడంతో వ్యాపారులు మున్సిపల్ సిబ్బందికి వ్యర్థాలను ఇచ్చేందుకు నిరాకరించారు. వ్యర్థాలను తరలించడానికి ఈ మాఫియా బడా వ్యాపారులు, నాయకులు, అధికారులకు ప్రతినెలా మామూళ్లు ముట్టజెప్పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యర్థాల అక్రమమార్గంతో ఆదాయానికి గండి రామగుండం నగరపాలక సంస్థకు వ్యర్థాలు కూడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా గతంలో నిబంధనలు రూపొందించారు. టన్ను వ్యర్థానికి రూ.వెయ్యి ఆదాయం వస్తుందని అంచనా వేసి వరంగల్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు చికెన్ వ్యర్థాలను సేకరించే పనిని అప్పగించారు. ఇందుకు సదరు కాంట్రాక్టర్ రూ.5వేలు బల్దియాకు ఫీజు రూపంలో చెల్లించారు. ఇలా సేకరించిన వ్యర్థాలను సదరు కాంట్రాక్టర్ రంగారెడ్డి జిల్లాలోని ఓ కంపెనీకి తరలిస్తామనేది ఒప్పందం. ఇలా కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజు సుమారు 2 మెట్రిక్ టన్నులకు పైగా కోళ్ల వ్యర్థాలు వెలువడుతాయి. ఈలెక్కన బల్దియాకు రోజుకు రూ.2వేల చొప్పున ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు సదరు కాంట్రాక్టర్‌కు వ్యర్థాలను మాత్రం ఇప్పటివరకు అప్పగించలేదు. పైగా కొందరు అధికారుల అండదండలతో ఈ వ్యర్థాలను కాంట్రాక్టర్‌కు కాకుండా అక్రమ మార్గాల్లో చేపల చెరువులకు తరలించడం వివాదాస్పదంగా మారుతోంది. -
పెద్దపల్లి, జగిత్యాలకు సీఎం కేసీఆర్..ఎప్పుడంటే!
సాక్షి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఈనెల 18 నుంచి 20వ తేదీల మధ్య ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని జగిత్యాలలో ఎస్సీ కార్యాలయం, పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతోపాటు రామగుండంలో కమిషనరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అయితే ఇందులో భాగంగానే బహిరంగ సభలను కూడా నిర్వహించి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు మరోసారి చెప్పేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: ఈసీఐఎల్ హైదరాబాద్‌లో టెక్నికల్ ఆఫీసర్లు -
ఆ ఇంటి నిండా మొక్కలే!... ఉద్యానవనాన్ని తలపించే గృహవనం!!
ఒకటి రెండు కాదు, వందలు వేలు పూలు, పండ్లు, ఔషధ మొక్కలతో నిండిపోయింది ఆఇల్లు. ఆహ్లాదంతో పాటు పచ్చదనం, చల్లదనంతో ఇల్లు ఉద్యానవనాన్ని తలపిస్తోంది. పందిరిలా వేలాడే పూల కుండీలతో అందమైన మొక్కలు ప్రకృతి ప్రేమికులను మురిపించటంతోపాటు ఔషధగుణాల మొక్కలు కాలుష్యరహితంగా మనిషి ఆయువు పెంచుతూ ఆందోళన, ఒత్తిడిల నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం అంటూ ఇంటిగుమ్మం మొదలు దాబాపై వరకు అడుగడుగునా అనేక రకాల మొక్కలతో నిండి ఉంది ఆఇల్లు. పెద్దపల్లిరూరల్: ఇంటి ఆవరణంతా ఆకర్షణీయమైన పూలు, పండ్లు, కూరగాయలు, ఔషధ వివిధ రకాల్లో మొక్కలు పెంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు పెద్దపల్లి పట్టణం ఫారెన్స్ట్రీట్కు చెందిన సయ్యద్ అతీఫ్. ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో పూల కుండీలు, గోడలు, దాబాపై వేలాడదీసిన మొక్కలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రకరకాల, రంగురంగుల మొక్కలు పచ్చటి ప్రకృతిని చూస్తున్నా అనుభూతిని కలిగిస్తుంది. (చదవండి: రిస్క్‌లో ‘కియోస్క్’లు!!) పార్కును తలపించేలా... అతీఫ్ ఇల్లు పార్కును తలపింపిస్తోంది. తన ఇంటి ఆవరణలో వందలాది రకాల మొక్కలను పెంచి పోషిస్తుండడం ప్రకృతిపై ఆయనకు ఉన్న మమకారాన్ని తెలియజేస్తోంది. అలాగే మొక్కలను కంటికి రెప్పలా సంరక్షిస్తున్నారు. అతీఫ్ పెంచుతున్న మొక్కలివీ... యాలకులు, ఆల్స్పైస్,ఆరెగాను, అల్లం, వెల్లుల్లితోపాటు ఆపిల్‌బేర్, వాటర్ యాపిల్, డ్రాగన్‌ప్రూట్, మామిడి, సపోట, నారింజ, గ్రేప్స్,స్టాబెర్రీ, జామలాంటి పండ్ల మొక్కలు, రణపాల, ఇన్సూలిన్, తిప్పతీగ, నల్లేరు, వాయు, రకరకాల తులసి, లెమన్‌గ్రాస్ లాంటి ఔషధ గుణాలున్న వాటిని పెంచుతున్నాడు. బీర, దొండ, చిక్కుడు, కాకరలాంటి తీగజాతి మొక్కలతో పాటు మిరప, పుదీన, పాలకూర, తోటకూర, వంకాయ, టమాట వంటి కూరగాయ మొక్కలున్నాయి. మల్లె, లిల్లీ, డాలియా, ఇంపేషంట్స్, జినియా, పింక్ట్రంపెట్, గులాబీ, మందారం, రుమెల్లా, చామంతి, మాస్రోజెస్, కలోంచె, జర్బెరా లాంటి పూలమొక్కలు, ఆగ్లోనెమ, ఫిలోడెండ్రాన్, సింగోనియమ్, మనీప్లాంట్, పోథీస్, స్పైడర్ప్లాంట్స్ కోలియస్, ఆర్నికపామ్, ఇంచ్ప్లాంట్, స్నేక్‌ప్లాంట్, కాక్టస్, డైఫెన్బాచియాలాంటి ఆకర్షణీయ మొక్కలు అతీఫ్ ఇంట్లో దర్శనమిస్తాయి. 800 రకాల మొక్కలు పెంచుతున్నా... మా తాత, తండ్రి తోటల పెంపకంలో ఉండడంతో చిన్నప్పటి నుంచి మొక్కలపై ఆసక్తి పెరిగింది. పచ్చదనమంటే నాకు ప్రాణం. మనసుకు ఎంతో హాయినిస్తుంది, ఇంటి ఆవరణలోని ఖాళీస్థలం, గోడలను ఆసరాగా తీసుకుని దాదాపు 800 వెరైటీల మొక్కలను కుండీల్లో పెంచుతున్నా. ఎక్కడికి వెళ్లినా నావద్ద లేని మొక్కలు కనిపిస్తే ఎంత ఖర్చయినా పెట్టి కొంటాను. ఇప్పటికే దాదాపు మూడు లక్షల దాకా వెచ్చించాను. ఎర్రమట్టి, ఇసుక, కిచెన్ వ్యర్థాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువు వాడతాను. షుగర్ పేషెంట్లకు అవసరమైన ఆకులను ఉచితంగా అందించటంతోపాటు కూరగాయలను పంచిపెట్టడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. – సయ్యద్ అతీఫ్, పెద్దపల్లి (చదవండి: మహిళలను బెదిరించి బంగారం చోరీ) -
కాపురానికి వెళ్లినా వేధింపులు తప్పవు.. పుట్టింట్లో నవవధువు..
సాక్షి, ముత్తారం (పెద్దపల్లి): అదనపు కట్నం వేధింపులకు నవవధువు పుట్టింట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని అడవి శ్రీరాంపూర్‌లో విషాదం నింపింది. కట్నం కింద రూ. 17లక్షలు ఇచ్చి.. ఇతర కానుకలు ముట్టజెప్పినా.. భర్త, అత్తామామల వేధింపులు ఆగలేదు. అదనపు కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళ్తానని పుట్టింట్లో వదిలేయడం.. తల్లిదండ్రుల ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో వారిపై భారం వేయొద్దని కానరాని లోకాలకు వెళ్లింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అడవిశ్రీరాంపూర్‌కు మారం వెంకన్న, సరోజనకు కూతురు పవిత్ర, కుమారుడు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పవితక్రు ఈ ఏడాది ఆగస్టు 21న మంథని మండలం గాజులపల్లికి చెందిన చిందం లక్ష్మి, ఓదెలు కుమారుడు నరేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.17లక్షలు, 17 తులాల బంగారం, ద్విచక్రవాహనం ఇచ్చారు. కాపురంలో పట్టుమని పది రోజులు కాకుండానే నరేశ్‌లో అదనపు కట్నమనే పిశాచి ఆవహించింది. చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్ చేసి..) వివాహం నాటి ఫొటో తనకు ఫర్టిలైజర్ దుకాణంలో నష్టం వచ్చిందని, మరో రూ.10లక్షలు అదనంగా తేవాలని పవిత్రను వేధించసాగాడు. దీనికి నరేశ్ తల్లిదండ్రులతోపాటు తమ్ముడు సురేశ్, బంధువులైన రమేశ్, రావుల చంద్రయ్య, పద్మ సహకరించారు. తనపై భర్త, అత్తామామలు, మరిది దాడి కూడా చేశారని పవిత్ర తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలపగా.. పెద్ద మనుషులను తీసుకెళ్లి పంచాయితీ పెట్టించారు. అందరికీ సర్దిచెప్పి వచ్చారు. అయితే దీపావళి పండుగ నిమిత్తం పవిత్రను పుట్టింట్లో వదిలివెళ్లిన నరేశ్.. అదనపు కట్నం తెస్తేనే కాపురానికి తీసుకెళ్తానని స్పష్టం చేశాడు. చదవండి: (భూత్ బంగ్లాలతో భయం భయం.. అసాంఘిక కార్యకలాపాలకు..) తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడం.. కాపురానికి వెళ్లినా నరేశ్ నుంచి వేధింపులు తప్పవని మనస్తాపానికి గురైన పవిత్ర (24) గురువారం వేకువజామున దూలానికి ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు చూసేసరికే చనిపోయింది. గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, సీఐ సతీశ్ సంఘటన స్థలంను పరిశీలించి వివరాలు సేకరించారు. కట్నం వేధింపులతోనే తన కూతురు చనిపోయిందని పవిత్ర తండ్రి ఫిర్యాదు మేరకు పవిత్ర భర్త చిందం నరేశ్, అత్తామామలు చిందం లక్ష్మీ, ఓదెలు, మరిది సురేశ్, రమేశ్, రావుల చంద్రయ్య, రావుల పద్మపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాములు తెలిపారు. చదవండి: (ఎస్సై నిర్వాకం: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. పెళ్లాడాడు.. చివరకు) -
సినిమా చూసి.. శవాన్ని ముక్కలుచేసి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇటీవల ఓటీటీలో రిలీజైన ‘కోల్డ్ కేస్’ అనే మలయాళీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసి.. అచ్చం అలాగే హత్యకు ప్లాన్ చేశాడు. పక్కా ప్లాన్‌తో యువకుడిని హతమార్చి, తల ఒకచోట.. ఇతర శరీర భాగాలు వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. ఇక పోలీసులకు దొరికేదే లేదనుకున్నాడు. కానీ, సదరు హంతకుడిని పోలీసులు పక్కాగా పట్టేశారని సమాచారం. అతడిని విచారించగా, సంచలన విషయాలు బయటపడ్డాయని తెలిసింది. కేసును సవాల్‌గా తీసుకున్న రామగుండం కమిషనరేట్ పోలీసులు కొందరిచ్చిన సమాచారంతో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారని తెలిసింది. ఈ క్రమంలో తానెలా హత్య చేసిందీ, శరీరభాగాలను ఎక్కడెక్కడ విసిరేసిందీ నిందితుడు చెప్పినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే.. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి ఖాజీపల్లికి చెందిన మీసేవ ఆపరేటర్ కాంపెల్లి శంకర్ శనివారం దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. అతడి మృతదేహాన్ని ముక్కలుచేసిన నిందితుడు గోదావరిఖని వన్‌టౌన్, టూటౌన్, ఎన్టీపీసీ, బసంత్‌నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో శరీరభాగాలు పడేశాడు. మృతుడి తల, చేయి రాజీవ్‌రహదారి సమీపంలోని మల్యాలపల్లి స్టేజీ వద్ద ఉన్న ముళ్లపొదల్లో లభించాయి. ఈ క్రమంలోనే అనుమానితుడైన రాజు ఉండే క్వార్టర్‌ను పోలీసులు పరిశీలించి ఆధారాలు సేకరించారు. హత్య సమయంలో ధరించిన దుస్తులు, ఉపయోగించిన వస్తువులను క్వార్టర్ ప్రాంగణంలోనే నిందితుడు కాల్చేసినట్లు గుర్తించారు. ‘కోల్డ్‌కేస్’ సినిమా చూసి.. ‘కోల్డ్‌కేస్’ సినిమాలోని లాయర్ పాత్రధారి.. తన క్లయింట్‌కు భరణం కింద వచ్చిన డబ్బును కాజేయాలనే అత్యాశతో సదరు క్లయింట్‌ను హత్యచేసి శరీరభాగాలను పాలిథిన్ కవర్లలో చుట్టి కేరళ, తమిళనాడుల్లోని పలు ప్రాంతాల్లో విసిరేస్తుంది. వేర్వేరు పోలీçస్స్టేషన్ల పరిధిలో శరీరభాగాలు దొరకడంతో అన్ని పోలీస్స్టేషన్లలోనూ కేసు మిస్టరీగానే మిగిలిపోతుంది. ఈ సినిమా ప్రేరణతోనే శంకర్ హత్యకు ప్లాన్ చేసినట్టు నిందితుడైన రాజు విచారణలో చెప్పినట్టు తెలిసింది. రాజు, శంకర్ భార్య, మరికొందరి ప్రమేయం హత్య వెనుక ఉన్నట్లు ప్రచారమవుతున్నా.. తానొక్కడినే ఈ పనిచేసినట్లు రాజు చెబుతున్నట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధంతో పాటు కొన్ని అభ్యంతరకర ఫొటోలను రాజు వాట్సాప్‌లో అప్లోడ్ చేయడంతో గొడవ జరిగిందని, ఈ క్రమంలోనే శంకర్ హత్యకు గురయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సైకోలా ప్రవర్తన కొన్నేళ్ల క్రితం భార్యతో గొడవపడిన రాజు ఒక్కడే ఎన్టీపీసీ టెంపరరీ టౌన్షిప్లో ఉంటున్నాడు. మద్యం, గంజాయికి అలవాటుపడిన అతడి ప్రవర్తన సైకోలా ఉంటుందని పలువురు చెబుతున్నారు. హత్య చేసినప్పటి దుస్తులతోనే మర్నాడు స్థానిక టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్లగా కొందరు వాసన గుర్తుపట్టి నిలదీయగా తాను వాంతులు చేసుకోవడం వల్ల వాసన వస్తోందని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడని సమాచారం. -
పెళ్లికి ఒప్పుకోలేదని హత్య
యైటింక్లయిన్‌కాలనీ: ప్రేమోన్మాదానికి మరో యువతి బలైపోయింది. తనకు దక్కని ప్రేమ మరొకరికి దక్కవద్దనే ఉన్మాదంతో ఓ యువకుడు పట్టపగలే ఓ యువతిని గొంతుకోసి చంపేశాడు. పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్‌కాలనీలో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల మేరకు.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వెంకట్రావుపల్లికి చెందిన గొడుగు అంజలి (20), యైటింక్లయిన్‌కాలనీలోని తారకరామానగర్‌కు చెందిన ట్రాక్టర్ కూలీ చాట్ల రాజు (21) గతంలో కొంతకాలం ప్రేమించుకున్నారు. ఇద్దరి సామాజికవర్గాలు వేరు కావడంతో పెద్దలు అభ్యంతరం తెలిపారు. ఇరువర్గాల మధ్య పంచాయితీ కూడా జరిగిందని, అప్పటినుంచి ఇద్దరు దూరంగా ఉంటున్నా.. అప్పుడప్పుడు సెల్ఫోన్లో చాటింగ్ చేసుకునే వారని స్థానికులు చెప్తున్నారు. అయితే అంజలి కొద్దిరోజులుగా రాజును పూర్తిగా దూరం పెట్టింది. తనను పెళ్లిచేసుకోవాలని రాజు పలుమార్లు ఒత్తిడి తీసుకురాగా.. కుదరదని స్పష్టం చేసింది. దీనితో ఆమెపై ఆగ్రహం పెంచుకున్న రాజు.. రెండు రోజులుగా ఆమెకు ఫోన్ చేస్తూ, తనను పెళ్లిచేసుకోవాలని లేకుంటే చంపేస్తానని బెదిరిస్తూ వచ్చాడు. మంగళవారం అంజలి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి వచ్చి.. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. కాసేపటికే ఆగ్రహం పట్టలేక తన వెంట తెచ్చుకున్న కత్తితో అంజలి గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న కత్తిపీటతో గొంతునరికి పరారయ్యాడు. కొంతసేపటి తర్వాత అదే ప్రాంతానికి వెంకటేశ్ అనే యువకుడు జాబ్‌కార్డు ఇచ్చేందుకు ఆ ఇంటికి వెళ్లగా.. రక్తపు మడుగులో అంజలి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, గోదావరిఖని టూటౌన్ సీఐ శ్రీనివాస్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. తనకు దక్కని అంజలి మరోవ్యక్తికి దక్కకూడదనే ఉద్దేశంతోనే రాజు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. అంజలి తండ్రి కొన్నాళ్ల క్రితమే చనిపోగా.. కుటుంబం ఆలనాపాలనా తల్లి లక్ష్మి చూసుకుంటోంది. కూతురు ఇలా హత్యకు గురికావడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. పోలీసుల అదుపులో నిందితుడు? నిందితుడు రాజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. స్థానికులు దీనిపై చర్చించుకుంటున్నారు. అయితే రాజు లొంగిపోయినట్టుగానీ, అరెస్టు చేసినట్టుగానీ పోలీసులు ధ్రువీకరించలేదు. -
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో స్వల్ప భూకంపం
జ్యోతినగర్(రామగుండం)/మంచిర్యాలటౌన్/మంచిర్యాలఅగ్రికల్చర్: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భూమి స్వల్పంగా కంపించింది. భూప్రకంపనలకు ఇంట్లో ఉన్నవారు భయపడి బయటకు పరుగులు తీశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఐదో డివిజన్ మల్కాపూర్, నర్రాశాలపల్లె, అన్నపూర్ణ కాలనీతోపాటు మేడిపల్లి ప్రాంతంలోని ఓపెన్‌కాస్ట్ గనిలో ప్రతిరోజు బొగ్గు వెలికితీయడానికి బాంబు పేలుళ్లు జరుగుతుంటాయి. ఈ క్రమంలో శనివారం సంభవించిన భూ ప్రకంపనలను బాంబుపేలుళ్లు కావచ్చని చాలామంది భావించారు. అయితే అది భూకంపమని తర్వాత తేలింది. భూకంప లేఖిని(రిక్టర్ స్కేల్)పై 4.0గా నమోదైనట్లు గుర్తించారు. మధ్యాహ్నం 2.03 గంటల ప్రాంతంలో కరీంనగర్‌కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో.. జిల్లా కేంద్రమైన మంచిర్యాలతోపాటు నస్పూర్, శ్రీరాంపూర్‌లోని పలు ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. మంచిర్యాల కలెక్టరేట్లో కుర్చీలు, టేబుళ్లు, బీరువాలు కదిలినట్లు అనిపించడంతో సిబ్బంది భయాందోళన చెందారు. శ్రీరాంపూర్, నస్పూర్ ప్రాంతాల్లోని ప్రజలు మొదట దీన్ని ఓసీపీ బ్లాస్టింగ్‌గా భావించారు. 2016 నవంబర్‌లో నస్పూర్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు పలువురు గుర్తు చేసుకున్నారు. మంచిర్యాల కలెక్టరేట్ నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు. భూకంపం వచ్చిన ప్రాంతం -
పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు, కారు
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ శివారులోని గాడుదుల గండి గుట్ట వద్ద మంథని-కాటారం ప్రధాన రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో బెల్లంపల్లి నుంచి హనుమకొండకు వెళుతున్న పరకాల డిపో బస్ ఏపీ 36జెడ్ 0161 మంథని వైపుకు వస్తున్న కారు టీఎస్ 04ఎఫ్ సీ 9774ను ఢీ కొట్టి బస్ లోయలో పడిపోయింది. దీంతో కారు డ్రైవర్ తాటి వినీత్(21) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 12మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ ప్రయాణికులను మంథని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. వీరిలో ఒక వృద్ధురాలు పరిస్థితి విషమంగా ఉంది. మంథని మండలం ఖాన్ సాయిపేట్ గ్రామానికి చెందిన మృతుడు వినీత్ మంథనిలో కార్ కేర్ సెంటర్లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. కారు డ్రైవర్ తాటి వినీత్ మంత్రి విచారం లోయలో పడిన బస్సు దుర్ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెల్లంపల్లి నుంచి హనుమకొండ వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడటం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్, వరంగల్ రీజినల్ మేనేజర్లకు మంత్రి ఆదేశించారు. క్షతగాత్రులకు కావల్సిన వైద్య సేవల కోసం సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. గాయాలకు గురైన ప్రయాణీకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ బాధిత కుటుంబసభ్యులకు తమ విచారం వ్యక్తం చేశారు. -
Photo Feature: కాషాయం మెరిసే.. నింగి మురిసే...
ఆకాశంలో ఏదో ప్రళయం వచ్చినట్లు మేఘాలు ఇలా కాషాయ వర్ణాన్ని సంతరించుకున్నాయి. ఆ వర్ణాన్ని ఇలా నీటిలో చూసుకుని నింగి మురిసిపోయింది. పెద్దపల్లి ఎల్లమ్మ చెరువుపై ఆకాశంలో శనివారం సాయంత్రం ఈ అద్భుతమైన దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి. పాలకు వరుస జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం పాలశీతలీకరణ కేంద్రం వద్ద పాలకోసం శనివారం ఉదయం ప్రజలు ఇలా చెంబులు, గ్లాసులు, టిఫిన్‌బాక్సులు, ప్లాస్టిక్ బాటిళ్లతో వరుస కట్టిన దృశ్యం. – సాక్షి ఫొటోగ్రాఫర్, దేవరుప్పల తెప్పలపై చేపల వేట.. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో ప్రాజెక్టు దిగువన మత్స్యకారులు పెద్ద సంఖ్యలో తెప్పలపై ఉత్సాహంగా చేపల వేట కొనసాగిస్తున్న దృశ్యాలను సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. – గెల్లు నర్సయ్య యాదవ్, సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల. పొలాల వద్దే వ్యాక్సినేషన్ తిరుమలగిరి (సాగర్)/పెద్దవూర: ప్రభుత్వం వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని సంకల్పించడంతో వైద్యాధికారులు కూడా నడుం బిగించారు. దీనిలో భాగంగానే ఆరోగ్యశాఖ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన తండాల్లో, గిరిజన గూడాల్లో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు. ప్రస్తుతం వ్యవసాయ పనుల సీజన్ ముమ్మరంగా కొనసాగుతుండటంతో గ్రామాల్లో ప్రజలెవరూ అందుబాటులో లేకపోవడంతో వైద్యాధికారులే పొలాల వద్దకు వెళ్లి వ్యాక్సిన్‌ను వేస్తున్నారు. శనివారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్), పెద్దవూర మండలాల్లోని పలు గ్రామాల్లో పొలాల వద్దకు వెళ్లి వ్యాక్సిన్ వేశారు. -
భార్యపై మంత్రి వేముల పీఆర్వో దాడి.. కేసు నమోదు, వీడియో వైరల్
మంథని(పెద్దపల్లి జిల్లా): భార్యాభర్తల వివాదంలో వ్యవసాయ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పీఆర్ఓగా చెప్పుకుంటున్న తోట శ్రీకాంత్‌పై మంథని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మంథని ఎస్సై చంద్రకుమార్ వివరాల ప్రకారం.. మంథని మండలం గాజులపల్లికి చెందిన కోమలతతో కాల్వశ్రీరాంపూర్ మండలం ఎదులాపూర్‌కు చెందిన శ్రీకాంత్‌తో వివాహమైంది. రెండేళ్లుగా శ్రీకాంత్ కోమలతను కాపురానికి తీసుకెళ్లడం లేదు. ఆదివారం ఎదులాపూర్‌లో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరగాల్సి ఉంది. కోమలత గ్రామ çసర్పంచ్ వద్దకు పిలిపిస్తే శ్రీకాంత్ రాలేదు. భర్తతో కలిసి వెళ్లేందుకు కోమలత సిద్ధంకాగా ఇద్దరిమధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రీకాంత్ కోమలతపై చేయి చేసుకున్నాడు. కోమలత మంథని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శ్రీకాంత్‌పై ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఇవీ చదవండి: అదృష్టం వీరికి పిల్లి రూపంలో వచ్చింది ! పగలంతా పెద్ద మనుషులు, రాత్రి అయితే..? -
సినీ నటి పాయల్ రాజపుత్ పై కేసు నమోదు
-
పాయల్ రాజ్‌పుత్‌పై కేసు నమోదు
సాక్షి, పెద్దపల్లి: సినీనటి పాయల్ రాజ్‌పుత్‌పై కేసు నమోదైంది. పెద్దపల్లి పట్టణంలో గత నెల 11న ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాయల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాస్కు ధరించకపోవడంతోపాటు కోవిడ్ నిబంధనలు పాటించలేదని పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్ పెద్దపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. జూనియర్ సివిల్ ఇన్చార్జి జడ్జి పార్థసారథి సిఫార్సు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానితోపాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. (చదవండి: జగిత్యాలలో పాయల్ రాజ్‌పుత్ సందడి) -
తీరనున్న ఎరువుల కొరత
సాక్షి పెద్దపల్లి: వ్యవసాయరంగంలో దూసుకుపోతున్న రాష్ట్రానికి ఎరువుల కొరత తీరనుంది. తెలంగాణ సిగలో మరో కలికితురాయిగా నిలవనున్న రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)తో ఎరువుల లభ్యత పెరగనుంది. ఈనెల 9న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ కర్మాగారాన్ని అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని మూతపడిన ఐదు ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించి మళ్లీ ఉత్పత్తి ప్రారంభించడానికి 2015లో పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రామగుండంలో మూతపడిన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) పేరుతో పునరుద్ధరించాలని నిర్ణయించింది. 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ప్లాంట్ నిర్మాణాన్ని తొలుత రూ.5,254 కోట్ల అంచనాలతో చేపట్టినా.. అది పూర్తయ్యేనాటికి రూ.6,120.55 కోట్లకు చేరుకుంది. ఈ కర్మాగారంలో నేషనల్ ఫెర్టిలైజర్స్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ భాగస్వామ్యులుగా ఉన్నాయి. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక ప్లాంట్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన లాంఛనంగా ఉత్పత్తి ప్రారంభించారు. అనంతరం మార్చి 22 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించారు. ఇందులో ఉత్పత్తి చేసిన యూరియా, అమ్మోనియాను ‘కిసాన్ బ్రాండ్’పేరుతో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ చేస్తోంది. తొలి ఉత్పత్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి చేసే 45 కిలోల యూరియా బస్తా ధరను రూ.266.50గా నిర్ణయించి వాణిజ్య అవసరాల నిమిత్తం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కర్మాగారం పునరుద్ధరణతో రాష్ట్రంలో యూరియా, అమ్మోనియా కొరత పూర్తిగా తీరిపోనుంది. తగ్గనున్న దిగుమతి భారం దేశవ్యాప్తంగా ఏటా 300 నుంచి 350 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరంకాగా.. 250 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగతా దాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎఫ్సీల్ ఉత్పత్తి ప్రారంభించడంతో ఈ కొరత చాలావరకు తీరనుంది. విదేశాలనుంచి దిగుమతి భారాన్ని తగ్గించడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూతపడిన ఐదు కర్మాగారాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆర్ఎఫ్సీఎల్ (అప్పటి ఎఫ్‌సీఐ), గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్), సింద్రీ (జార్ఖండ్), తాల్చేర్ (ఒడిశా), బరౌనీ(బిహార్) ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ చేపట్టింది. వీటిలో మొదట రాష్ట్రంలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్‌కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక గోరఖ్‌పూర్, సింద్రీ యూనిట్లలో 2022 మార్చి నాటికి, తాల్చేర్ ప్లాంట్‌లో 2023లో యూరియా ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్‌సీఐ ఏర్పడింది ఇలా.. ►1970 అక్టోబర్ 2న నాటి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి త్రిగున్సేన్ రామగుండంలో ఎఫ్‌సీఐ ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ►గడువు కంటే ఆరేళ్లు ఆలస్యంగా ప్రారంభమైన ఎఫ్‌సీఐ.. 1980 నవంబర్ ఒకటి నుంచి స్వస్తిక్ బ్రాండ్ పేరుతో యూరియాను మార్కెట్లోకి విడుదల చేసింది. ►అనంతర కాలంలో పలు కారణాలతో 1999 మార్చి 31న కంపెనీ మూతపడింది. నాడు బొగ్గు.. నేడు సహజవాయువు రామగుండంలో మూతపడిన ఎఫ్‌సీఐ కర్మాగారం అప్పట్లో బొగ్గు, విద్యుత్తు ఆధారంగా నడిచేది. ప్రస్తుతం కర్మాగారాన్ని పునరుద్ధరించాక సహజవాయువును ఇంధనంగా వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా మల్లవరం నుంచి రాజస్తాన్‌కు వెళ్లే గ్యాస్ పైప్‌లైన్ నుంచి రామగుండం వరకు 363 కిలోమీటర్ల మేర ప్రత్యేక గ్యాస్ పైప్లైన్లను నిర్మించారు. ఈ కర్మాగారంలో కిసాన్ బ్రాండ్ పేరిట యూరియా, అమ్మోనియా ఎరువులను ఉత్పత్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రానికి 50 శాతం యూరియూ ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారంలో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కావడంతో రాష్ట్రానికి 50 శాతం, మిగిలిన ఎరువులను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఐదు నెలలుగా ఇక్కడ ఉత్పత్తి అయిన యూరియాను తెలంగాణకే సరఫరా చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశీ సాంకేతికతతో ఉత్పత్తి ఆర్ఎఫ్సీఎల్లో అమ్మోనియాను డెన్మార్క్ దేశానికి చెందిన హల్డోర్ కంపెనీ, యూరియాను ఇటలీ దేశానికి చెందిన సాయ్‌పేమ్ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేస్తున్నారు. గ్యాస్‌ను ఇంధనంగా మార్చి నీటి నుంచి ఆవిరి ఉత్పత్తి చేయడం, ఆ నీటి ఆవిరినే యూరియా, అమ్మోనియా ఉత్పత్తి కోసం వినియోగించడం ఆర్ఎఫ్సీఎల్ ప్రత్యేకతల్లో ఒకటి. ప్లాంటుకు కావాల్సిన ఒక టీఎంసీ నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కేటాయించారు. -
పెద్దపల్లి: సరస్వతి బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు
-
రామగుండంలో విషాదం: పిల్లలతో రైలు కిందపడ్డ తల్లి
సాక్షి, పెద్దపల్లి : జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలుకింద పడి ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. రామగుండంలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. అరుణ అనే మహిళ గోదావరిఖని 8వ కాలనీకి చెందిన ప్రవీణ్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఏమైందో ఏమో.. శనివారం అరుణ.. కూతురు సాత్విక(2), కుమారుడు సాత్విక్(5)లతో కలిసి రైలు కింద పడింది. అరుణ, సాత్విక మరణించగా.. సాత్విక్ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని కరీంనగర్ ప్రభుత్వానికి తరలించారు. -
రైలు పట్టాల పక్కన తీవ్రగాయాలతో బాలిక.. పడేశారా?
సాక్షి, పెద్దపల్లి: పొద్దున్నే పొలం పనులకు వెళ్తున్న రైతులకు రైలుపట్టాల పక్కన ఐదేళ్ల బాలిక ఏడుపు వినిపించింది. అటుగా వెళ్లిన గమనించగా. తీవ్రగాయాలతో రెండుకాళ్లు విరిగి అచేతనస్థితిలో పడి ఉంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాకేంద్రానికి సమీపంలో ఉన్న గొల్లపల్లి గ్రామశివారులో శుక్రవారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. రైతులు రైల్వే గేట్మెన్ షామిమ్ సాయంతో పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. పెద్దపల్లి ఆస్పత్రికి తరలించగా.. బాలికకు రెండుకాళ్లు మూడుచోట్ల విరిగాయని, పరిస్థితి విషమంగా ఉందని ప్రథమ చికిత్స చేసిన అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పడిందా.. పడేశారా? అయితే ఈ ఘటనపై పలువురు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాలిక దివ్యాంగురా లని వైద్యులు తెలపగా.. రైలులో నుంచి ప్రమాదవశాత్తు జారిపడిందా..? లేదా ఎవరైనా తోసే శారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. రా మగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి ఘ టన స్థలాన్ని పరిశీలించారు. బల్లార్ష– కాజీపేట వైపు ఉదయాన్నే వెళ్లిన రైళ్లలోని ప్రయాణికులకు సమాచారం ఇచ్చేలా పోలీసులకు తెలిపారు. సాయంత్రం వరకు కూడా బాలికకోసం ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. -
లొంగిపో బిడ్డా.. ఇంటికి రా!
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): ‘పానం చేతనైతలేదు.. బొందిల జీవి పోకముందు ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది.. రా కొడుకా..’అంటూ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి తల్లి వీరమ్మ వేడుకుంటోంది. బుధవారం ఓఎస్డీ శరత్చంద్ర పవార్, డీసీపీ రవీందర్ రాజన్న స్వగ్రామం కిష్టంపేటను సందర్శించి వీరమ్మను పరామర్శించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి లొంగిపోతే అన్నివిధాల సహకరిస్తామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరమ్మ కంటతడి పెడుతూ తన కన్న కొడుకును చూడాలని ఆత్రంగా ఉందని, మీరన్నా రాజన్నకు విషయం చేర్చాలని మీడియా ముందు చేతులు జోడించింది. ‘పోలీసులే వచ్చి పానం మంచిగున్నదా అని అడిగి మందులు ఇస్తున్నరు. నేను కాటికి దగ్గరవుతున్న.. నిన్ను చివరి చూపు చూసి నీ చేతుల పానం ఇడువాలని ఉంది బిడ్డా’అంటూ కన్నీటి పర్యంతమైంది. ‘జంగళ్ల కూడా కరోనా వస్తుందంటున్నరు. ఎవరూ చూడని చావు నీకొద్దు. నిన్ను చూడకుండా నేను చావద్దు బిడ్డా. నీకు శాత కాకుండా అయిందని అంటున్నరు. కలోగంజో ఉన్నదే తిందాం బిడ్డా. ఇంటకి రా నాయన’అంటూ ప్రాధేయపడుతోంది. కాగా, రాజిరెడ్డి తల్లి వీరమ్మను పరామర్శించిన అనంతరం ఓఎస్డీ శరత్చంద్ర, డీసీపీ రవీందర్ మాట్లాడుతూ, మావోయిస్టులు అడవుల్లో ఇబ్బందులు పడుతున్నారని, వనం వీడి జనంలోకి వస్తే చికిత్సతోపాటు రివార్డు వారికే అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ కాసర్ల తిరుపతిరెడ్డి, పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
పార్వతీ బ్యారేజీ: డెలివరీ సిస్టర్న్ వద్ద కుంగిన భూమి
మంథని: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం సమీపంలో నిర్మించిన పార్వతీ బ్యారేజీ డెలివరీ సిస్టర్న్‌కు ఉన్న పైపులైన్లో నాల్గో మోటార్ పైపు వద్ద భూమి కుంగిపోయింది. పంపు మోటార్ నీటి ప్రవాహం తాకిడికి పైపు పైకి లేచింది. సుమారు 200 మీటర్ల మేర పైపుపై ఉన్న మట్టి కొట్టుకుపోయింది. మంథని మండలం గుంజపడుగు సమీపంలోని సరస్వతీ పంపుహౌస్ నుంచి 12 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయడానికి పార్వతీ బ్యారేజీకి పైపులైన్ నిర్మించారు. ఈనెల 18 నుంచి నీటి ఎత్తిపోత ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి వరదనీరు పైపులైన్ కిందకు చేరింది. పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోస్తున్న క్రమంలో పైపులైన్లో వేగంగా నీటి ప్రవాహం ఉండటంతో డెలివరీ సిస్టర్న్ నుంచి వచ్చే ప్రెషర్‌కు పైపు పైకి లేచింది. సుమారు మూడు మీటర్ల ఎత్తున పైపుపైకి లేచి వంకర తిరిగింది. ఎత్తిపోతలకు అంతరాయం ఏర్పడంతో తేరుకున్న నీటిపారుదల శాఖ అధికారులు మరమ్మతు చేపట్టారు. భూమి కుంగిన చోట మొరం పోస్తున్నారు. డెలివరీ సిస్టర్న్ వద్ద మట్టిని తవ్వడం, అటు తర్వాత నింపడంతో భూమి కుంగిపోయిందని, ఇలా జరగడం సర్వసాధారణమని అధికారులు అంటున్నారు. మంగళవారం ఐదు మోటార్ల ద్వారా 14,,650 క్యూసెక్కుల నీటిని పార్వతీ బ్యారేజీలో ఎత్తిపోశారు. -
పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళా ఏఎస్ఐ మృతి
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కమాన్‌పూర్ ఏఎస్ఐ భాగ్యలక్ష్మి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పెద్దపల్లిలోని తన నివాసం నుంచి కూతురుతో కలిసి భాగ్యలక్ష్మి బస్టాండ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో పెద్దపల్లి కమాన్ చౌరస్తా వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ.. భాగ్యలక్ష్మి వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ భాగ్యలక్ష్మి మీద నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె కూతురు ద్విచక్ర వాహనం నడుపుతుండగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజేశ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిథిలో రోడ్డు ప్రమాదం -
విశాఖ ఎన్కౌంటర్: పెద్దపల్లి జిల్లాలో విషాదం
-
విశాఖ ఎన్కౌంటర్: పెద్దపల్లి జిల్లాలో విషాదం
సాక్షి, పెద్దపల్లి: విశాఖ ఏజెన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో పెద్దపల్లి జిల్లాలో విషాదం అలుముకుంది. ఈ కాల్పుల్లో ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన మావోయిస్టు కీలక నేత సందె గంగయ్య మృతి చెందారు.కాగా విశాఖపట్నం జిల్లాలోని కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అందులో మావోయిస్టు పార్టీ డీసీఎంగా కొనసాగుతున్న అశోక్ అలియాస్ సందె గంగయ్య కూడా ఉన్నాడు. ఇతనికి తల్లి, నలుగురు సోదరులు ఉన్నారు. గంగయ్య సోదరుడు రాజయ్య సైతం 1996లో ఎన్కౌంటర్లో మరణించాడు. ఇక 1999లో నక్సల్ ఉద్యమంలో చేరిన గంగయ్య మావోయిస్ట్ డీసీఎం కమాండర్‌గా ఎదిగాడు. ఓదెల మండలంలోనే 7వ తరగతి వరకు చదువుకున్నాడు. తన కొడుకు గంగయ్య ఎన్కౌంటర్లో మృతిచెందాడన్న సమాచారం తల్లి అమృతమ్మకు తెలియడంతో ఆమె బోరున విలపించారు. ఇది వరకు రెండు మూడు సార్లు ఎన్కౌంటర్ అయినట్లు సమాచారం వచ్చినప్పటికీ నమ్మలేదని, ప్రస్తుతం పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఎన్కౌంటర్లో అమరుడైనట్లు భావిస్తున్నామని సోదరుడు తెలిపారు. మృతదేహాన్ని తీసుకురావడానికి వైజాగ్ వెళ్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: విశాఖలో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి మృతులను గుర్తించిన పోలీసులు కాగా తీగలమెట్ట అటవీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతులను పోలీసులు గుర్తించారు. వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. డిప్యూటీ కమాండర్ సందే గంగయ్య కూడా మృతుల్లో ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. మరో డీసీఎం రణ దేవ్, పైకే, లలితలను గుర్తించారు. మరో మహిళ మావోయిస్ట్‌ను గుర్తించాల్సి ఉంది. -
ఐదేళ్ల ప్రేమ.. వివాహం.. తీరాచూస్తే!
జ్యోతినగర్(పెద్దపల్లి): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రియురాలు మంగళవారం బైటాయించింది. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయనగర్‌కు చెందిన మానుపాటి నవీన్, భీమునిపట్నంకు చెందిన యువతి (22) ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఓ గుడిలో వివాహం కూడా చేసుకున్నామని బాధిత యువతి పేర్కొంది. తర్వాత అతను దుబాయికి వెళ్లి వచ్చాక ఇంటికి తీసుకెళతానని మాట ఇచ్చాడని, తీరా ఇప్పుడు తీసుకెళ్లడం లేదని ఆరోపించింది. ఎన్టీపీసీ పోలీసులు అక్కడకు చేరుకుని ఫిర్యాదు చేస్తే చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది. చదవండి: సగం కాలిన మృతదేహాలు.. పీక్కు తింటున్న కుక్కలు -
దాతృత్వం చాటుకున్న మంత్రి.. బ్లాక్ ఫంగస్ బాధితుడికి అండ
యైటింక్లయిన్‌కాలనీ(పెద్దపల్లి): యైటింక్లయిన్‌కాలనీకి చెందిన అహ్మద్ మోహినుద్దీన్ కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం గతనెల 27 హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బ్లాక్ ఫంగస్ వచ్చినట్లు తెలపడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచన మేరకు కేటీఆర్‌ను ట్విట్టర్లో వేడుకున్నారు. కేటీఆర్ వెంటనే స్పందించి తన కార్యాలయ సిబ్బందిని పంపించి మెరుగైన చికిత్స అందేలా ఏర్పాటు చేశారు. బ్లాక్ ఫంగస్ వైరస్ తగ్గడానికి సంబంధించిన ఇంజక్షన్ సైతం ఏర్పాటు చేసి అహ్మద్ కుటుంబానికి అండగా నిలిచినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు. చదవండి: కరోనా సోకిన భార్య.. భర్త చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. -
ఆక్సిజన్ ట్యాంకర్‌పై మంటలు
సాక్షి, పెద్దపల్లికమాన్: కరోనా బాధితులకు అందించేందుకు గూడ్స్‌లో తరలిస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్‌పై మంటలు చెలరేగాయి. ఈ ఘటన పెద్దపల్లి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నుంచి రాయ్‌పూర్‌కు ఆరు ఖాళీ ట్యాంకర్లతో బయల్దేరిన గూడ్స్ రైలు శనివారం పెద్దపల్లి రైల్వే జంక్షన్‌కు చేరుకుంది. ఉదయం 11.02 గంటలకు చీకురాయి సమీపంలోని ఎల్సీ గేట్ నంబర్ 38కి చేరుకోగానే ఓ ట్యాంకర్ నుంచి పెద్దగా శబ్ధం వచ్చి మంటలు చెలరేగాయి. గమనించిన గేట్‌మన్ రాజసాగర్ డ్యూటీలో ఉన్న పెద్దపల్లి స్టేషన్ మాస్టర్‌కు సమాచారమందించారు. స్పందించిన స్టేషన్‌మాస్టర్ వెంకట్ ఫైర్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. వెం టనే రైలును ఆపించి మంటలున్న ట్యాంకర్ నుంచి మిగతా బోగీలను వేరుచేశారు. సమయానికి సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ట్యాంకర్‌కున్న మంటలను అదుపులోకి తెచ్చారు. రైల్వే అధికారులు, లిండే ఆక్సిజన్ కంపెనీ ప్రతినిధులు ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. ట్యాంకర్ ఖాళీచేసిన తర్వాత కొంత ఆక్సిజన్ ట్యాంకర్‌లోనే ఉంటుందని, అది లీకై మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా తెలిపారు. చదవండి: అంబులెన్స్ ధరలు.. మోటారుసైకిల్‌పై మృతదేహం తరలింపు -
లాక్డౌన్ ఉల్లంఘిస్తే ఐసోలేషన్‌కే..!
పెద్దపల్లి/మంచిర్యాలక్రైం: ఎంత చెప్పినా వినకుండా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు కొత్త పద్ధతుల్ని అమలు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాతోపాటు మంచిర్యాలలో.. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని నేరుగా ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు. గురువారం జిల్లా కేంద్రంతోపాటు గోదావరిఖని, మంథని, మంచిర్యాలలో ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన ఆకతాయిలను సుల్తానాబాద్ ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. ఇక రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారి సెల్ఫోన్లు లాక్కొని ప్రత్యేక వాహనాల ద్వారా 79 మందిని బెల్లంపల్లిలోని ఐసోలేషన్‌కు తరలించారు. వారి కుటుంబసభ్యులను పిలిపించి కోవిడ్ కష్టాలు ఎలా ఉంటాయో వివరిస్తూ.. 4 గంటలపాటు కౌన్సెలింగ్ నిర్వహించి వదిలి పెట్టారు. ఇప్పటికైనా అనవసరంగా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. చదవండి: ఆర్టీసీ పొమ్మన్నా.. చేను చేరదీసింది.. -
3 నెలలు: అనేక మలుపులు తిరిగిన దంపతుల హత్య కేసు
సాక్షి, మంథని: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణి హత్య జరిగి నేటికి సరిగ్గా మూడు నెలలు గడిచింది. తాము చేపడుతున్న కార్యక్రమాలకు ఇబ్బంది సృష్టిస్తున్నారనే కోణంలో న్యాయవాద దంపతులను ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల సమీపంలోని మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై కొందరు పట్టపగలే కత్తులతో నరికి చంపిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోగలిగారు. గ్రామ కక్షలతోనే తాము హత్యలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. అయితే ఈ హత్యలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా న్యాయవాదులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని ఏకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు విన్నవించింది. హత్య జరిగిన సమయంలో కొందరు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితులను కనిపెట్టడం పోలీసులకు సులువుగా మారింది. తనపై కత్తులతో దాడి చేసింది కుంట శ్రీను అని హత్యకు గురైన వామన్‌రావు వెల్లడించిన విషయం కూడా వీడియోలో రికార్డు అయింది. హత్య చేసిన అనంతరం పారిపోయిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చూపించారు. అయితే ఈ జంట హత్యలకు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను సహకరించాడని పోలీసుల విచారణలో తేలింది. అప్పటినుంచే ఈ హత్యల్లో పుట్ట మధు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంట హత్యల వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు అనేక కోణాల్లో తీవ్రంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో కేసు పలుమలుపులు తిరుగుతూ వస్తోంది. ఒక దశలో జెడ్పీ చైర్మన్ మధు మెడకు చుట్టుకుంటుందా..? అనే ప్రచారం కూడా జరిగింది. చార్జీషీటు నమోదు గడువు సమీపిస్తున్న సమయంలో వామన్‌రావు తండ్రి కిషన్‌రావు వరంగల్ ఐజీ నాగిరెడ్డికి చేసిన ఫిర్యాదు అప్పట్లో సంచలనం రేపింది. అకస్మాత్తుగా జెడ్పీ చైర్మన్ అదృశ్యం కావడంతో కేసు మరింత జఠిలంగా మారింది. వారంరోజులపాటు మధు తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. పోలీసులు మధును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం వద్ద అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మధుతోపాటు ఆయన భార్య పుట్ట శైలజ, మరికొందరిని కూడా విచారించారు. విచారణపై హైకోర్టు పర్యవేక్షణ న్యాయవాద దంపతుల హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. నిందితులను కఠినంగా శిక్షించేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ కేసుపై హైకోర్టు ప్రత్యేక దృష్టి సారించింది. జంట హత్యల కేసును తామే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని, విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించింది కూడా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేసు విచారణ కోసం కరీంనగర్లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ఇటీవలే హైకోర్టుకు లేఖ రాసింది. చార్జీషీట్ సిద్ధం న్యాయవాద దంపతుల హత్య జరిగిన నేటికి 90 రోజులు కావస్తుండడంతో పోలీసులు కేసుకు సంబంధించిన చార్జీషీట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. అన్ని కోణాల్లో విచారణ జరిపి పకడ్బందీగా చార్జిషీట్‌ను తయారు చేసినట్లు తెలిసింది. అందులో ఇంకా ఎవరైనా నిందితుల పేర్లను చేర్చుతారా..? లేదా ఇప్పటివరకు ఉన్నవారినే చూపిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం హత్యల్లో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో రెండు మూడు రోజుల్లో కోర్టులో చార్జీషీట్ సమర్పించే అవకాశం ఉంది. చదవండి: లాయర్ల హత్య కేసు: ఏరోజు ఏం జరిగిందంటే..? -
Putta Madhu: పుట్ట మధును విడిచిపెట్టిన పోలీసులు!
సాక్షి, పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మంథనిలోని తన ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయనను కలిసేందుకు అభిమానులు తరలివచ్చారు. కాగా పది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనను మే 8న రామగుండం పోలీసులు భీమవరంలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వామనరావు- నాగమణి దంపతుల హత్య కేసులో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. మధుతో పాటు ఆయన భార్య శైలజను రెండు రోజుల పాటు విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ కుమారుడు ఆకాశ్‌ను సైతం పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల విచారణ అనంతరం సోమవారం రాత్రి మధును వదిలేసిన పోలీసులు.. నేడు బ్యాంక్స్టేట్మెంట్లతో హాజరుకావాలని ఆదేశించారు. కాగా హత్యకేసులో ప్రధాన నిందితులకు సుపారీ కింద రూ.2 కోట్లు ముట్ట జెప్పారని, ఏ 1 కుంట శ్రీను జైల్లో ఉన్నప్పటికీ అతని స్వగ్రామంలో ఇంటి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని ఆరోపిస్తూ వామన్‌రావు తండ్రి కిషన్‌రావు గత నెల 16న ఐజీ నాగిరెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధు, ఆయన కుటుంబసభ్యుల బ్యాంక్ స్టేట్మెంట్లపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది బ్యాంక్ అకౌంట్ల స్టేట్మెంట్లు తీసుకున్నారు. చదవండి: సంచలనం సృష్టించిన పుట్ట మధు అదృశ్యం కేసు -
లాయర్ల హత్య కేసు: ఏరోజు ఏం జరిగిందంటే..?
సాక్షి, హైదరాబాద్: న్యాయవాదులైన గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో అనుమానితుడిగా అరెస్టయిన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అదృశ్యం, అరెస్టు సంచలనంగా మారింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు బీజం మార్చిలోనే పడినట్లు అర్థమవుతుంది. పుట్ట, అతని అనుచరులకు సంబంధించి మార్చిలోనే బలమైన ఆధారాలు లభించాయి. సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న విషయంలో ఇద్దరు కీలక పోలీసు ఉన్నతాధికారులకు ఈ ఆధారాలు చేరడంతో మంథనిలో పరి ణామాలు వేగంగా మారాయి. అనేక ఆకస్మిక మా ర్పులు చోటు చేసుకున్నాయి. మార్చి నుంచి పరిణామాలను పరిశీలిస్తే ఇవన్నీ అవగతమవుతాయి. ఏరోజు ఏం జరిగిందంటే..? ► మార్చి 26: మంథని కోర్టులో బిట్టు శ్రీనుతో వీడియో కాల్ చేయించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలతో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజపై కేసు నమోదు. ► మార్చి 31: 2018లో కుంట శ్రీను ఓ హత్యకు రూ.60 లక్షల సుపారీ మాట్లాడిన ఆడియో టేపుపై ఫోరెన్సిక్ విచారణ కోసం పోలీసుల పిటిషన్ ► ఏప్రిల్ 3: మంథని ఇన్స్పెక్టర్గా ఉన్న మహేందర్ బదిలీ. ఆయన స్థానంలో మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ ► ఏప్రిల్ 16: ఐజీ నాగిరెడ్డికి గట్టు వామనరావు తండ్రి కిషన్ రావు లేఖ. పుట్ట మధు, పుట్ట శైలజ, పూదరి సత్యనారాయణల పాత్రలపై లోతుగా దర్యాప్తు జరపాలని వినతి. ► ఏప్రిల్ 29: మధు కీలక అనుచరుల్లో ఒకరి విచారణ ► ఏప్రిల్ 30: విచారణకు రావాలని మధుకు నోటీసులు. అదేరోజు రాత్రి నుంచి మధు అదృశ్యం. ► మే 1: మధు కోసం గాలింపు మొదలు. ► మే 6: మంథని నియోజకవర్గంలో ఉన్న రామగిరి, ముత్తారం, బసంత్‌నగర్, మంథని ఎస్సైల బదిలీ. ► మే 7: మంథని ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి బదిలీ ► మే 8: మధు ఏపీలోని రాజమండ్రి సమీపంలో ఉన్నట్లు గుర్తింపు. ► మే 9: భీమవరంలో పుట్ట మధును అదుపులోకి తీసుకున్న పోలీసులు, అదేరోజు సాయంత్రానికి రామగుండం కమిషనరేట్‌కు చేరుకున్నారు. ► మే10: మధును విచారించిన పోలీసులు. గుంజపడుగులో అక్రమ నిర్మాణాల వద్ద గ్రామపంచాయతీ అధికారులు సాంకేతిక ఆధారాలే కీలకం.. ఈ కేసులో మొదటి నుంచి పుట్ట మధు పేరు బలంగానే వినిపిస్తోంది. మార్చిలో దర్యాప్తు వేగం పుంజుకుంది. మే 17న చార్జిషీటు దాఖలు చేయాల్సిన సమయం దగ్గర పడుతున్న సమయంలోనే పుట్ట మధును విచారణకు పిలవడం గమనార్హం. ఈ క్రమంలో పుట్ట మధు, అతని భార్య పుట్ట శైలజ, మార్కెట్ కమిటీ చైర్మ¯Œ పూదరి సత్యనారాయణలు విచారణలో ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో పోలీసులు పలు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు. అవి ఏంటంటే..! ► ఫిబ్రవరి 17న గట్టు వామన్ రావు హత్య జరిగిన తరువాత.. నిందితులు కుంట శ్రీను, బిట్టు శ్రీనులు మాట్లాడిన కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) కీలకం కానుంది. ఈ వివరాలు పోలీసులు ఇప్పటికే సేకరించినట్లు తెలిసింది. ► వామన్‌రావు మరణవాంగ్మూలం వీడియోలు కూడా కీలకం కానున్నాయి. అందులో ఓ వీడియోలో పుట్ట మధు పేరునూ చెప్పినట్లు ఉంది. దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక పోలీసుల చేతిలో ఉన్నట్లు సమాచారం. ► కుంట శ్రీను రూ.60 లక్షలకు 2018లో సుపారీ ఎవరితో మాట్లాడాడు? అతడు దొరికితే ఎవరి హత్యకు సుపారీ మాట్లాడారు? అన్న విషయాలు వెలుగుచూస్తాయి. ► గుంజపడుగులో శ్రీను అక్రమ ఇంటి నిర్మాణానికి గ్రామపంచాయతీ గతంలో అభ్యంతరం తెలిపింది. అయినా పనులు ఆగలేదు. దీని వెనక ఎవరున్నారో తెలుసుకునే యత్నం చేస్తున్నారు. బిట్టు శ్రీను వాడిన కారు వివరాలు ఏడాదైనా నంబర్‌ప్లేటు ఏదీ? బిట్టు శ్రీను హత్యకు ఉపయోగించిన కారు విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మారుతీ బ్రిజా కారును 2020 ఫిబ్రవరిలో కొన్నారు. అదే నెల 24న టీఎస్22ఈ1288 నంబరుతో పర్మినెంటు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ వాహనం బిట్టు శ్రీను భార్య తులసిగారి స్వరూప పేరు మీద ఉంది. ఏడాది కిందటేరిజిస్ట్రేషన్ చేసినా హత్య జరిగేరోజు వరకు టెంపరరీ రిజిస్ట్రేషన్ తోనే బిట్టు శ్రీను సంచరించాడు. అదే విధంగా కారుకు ఉన్న నల్ల అద్దాల షీట్ కూడా తీయలేదు. వాస్తవానికి వాహనం అద్దాలకు నల్లఫిల్మ్ ఉంటే పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఈ కారు కొనుగోలు వెనక ఎవరున్నారు? ఎవరు సమకూర్చారు? అన్న విషయాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
Putta Madhu: అదే జరిగితే పెద్దపల్లి జెడ్పీ కుర్చీ ఎవరికో..?!
మంథని: న్యాయవాద దంపతుల హత్య నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పాత్రపై విచారణ జరుగుతున్న సమయంలో ఈ పీఠంపై పలువురు కన్ను పడింది. మొదటి జిల్లా పరిషత్ చైర్మన్‌గా తామంటే తాము అవుతామని ఊహల లోకంలో తేలినవారికి స్వయానా సీఎం కేసీఆర్ పుట్ట మధు పేరు ప్రస్తావించడంతో మిన్నకుండిపోయారు. తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మధు పోలీసుల అదుపులో ఉండడంతో ఆయన పదవికి గండం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రస్తుతం పుట్ట మధును పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే జరిగితే మధు చైర్మన్ పదవి ఊడుతుందని, ఆ స్థానంలో తాము సిద్ధంగా ఉన్నామని పలువురు జెడ్పీటీసీలు అధిష్టానం ఎదుట బారులు తీరినట్లు సమాచారం. వీరిలో పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మొదటి నుంచి పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. అటు మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మద్దతుతో జెడ్పీ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈమెతోపాటు జిల్లాలోని మరో ముగ్గురు జెడ్పీటీసీలు సైతం చైర్మన్‌గిరి కోసం పోటీ పడుతున్నారు. పుట్ట మధును పోలీసులు విచారిస్తున్నా.. ఇప్పటివరకు ఆయనపై పార్టీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అయినా మధు పదవి ఎలాగైనా పోతుందనే ముందస్తు సమాచారంతో జెడ్పీటీసీలు చైర్మన్ గిరి కోసం పోటీ పడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. చదవండి: Etela, Putta Madhu: వాళ్లందరికీ షాక్..! -
Etela, Putta Madhu: వాళ్లందరికీ షాక్..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: యుద్ధంలో ఒక్క శత్రువును టార్గెట్ చేస్తే సరిపోదు.. అతని బలానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమైన మిగతా శక్తులను కూడా దెబ్బకొట్టడమే రాజనీతి. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్‌లోని హుజూరాబాద్, మంథని నియోజకవర్గాల్లో ఇదే జరుగుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈటల రాజేందర్, పుట్ట మధుకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్న అధికారులకు స్థానచలనం తప్పడం లేదు. హుజూరాబాద్‌లో ఇప్పటికే ఏసీపీ, ఆర్డీవో, ఓ తహసీల్దార్‌తోపాటు నలుగురు ఎంపీడీవోలను బదిలీ చేశారు. తాజాగా పోలీస్ ఇన్స్పెక్టర్లను టార్గెట్ చేశారు. నియోజకవర్గం పరిధిలోని హుజురాబాద్‌టౌన్, జమ్మికుంట, జమ్మికుంట రూరల్ సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇన్స్పెక్టర్లు జి.సదన్‌కుమార్, ఎ.రమేష్, సీహెచ్.విద్యాసాగర్‌కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా కరీంనగర్ డీఐజీకి అటాచ్డ్ చేస్తూ నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో హుజూరాబాద్‌కు వి.శ్రీనివాస్ (సీసీఎస్–3), జమ్మికుంటకు కె.రామచంద్రారావు (ధర్మపురి), జమ్మికుంట రూరల్‌కు జె.సురేష్ (సీసీ ఎస్)ను బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయి. హుజురాబాద్ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధి హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాలలో ఉండడంతో అక్కడ సీఐ బదిలీ కాలేదు. ఈ నియోజకవర్గంలోని ఎస్సైల బదిలీలు కూడా సోమవారం జరిగే అవకాశం ఉందని సమాచారం. మారుతున్న రాజకీయాలు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో తెగతెంపులు చేసుకున్న రీతిలోనే టీఆర్ఎస్ అధిష్టానం వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులు, నాయకులపై గురిపెట్టారు. ఇప్పటికే వీణవంక మండలం ఇప్పాలపల్లి పీఏసీఎస్‌లో 2015లో చోటు చేసుకున్న రూ.18.86 లక్షల అవకతవకలకు సంబంధించి ఈటల వర్గీయుడైన అప్పటి చైర్మన్ సాదవరెడ్డికి తాజాగా నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో నియోజకవర్గంలో ఈటల వర్గీయులుగా ఉన్న టీఆర్ఎస్ నేతలను ఆయన వైపు వెళ్లకుండా చూసే పనిలో పడ్డారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్‌కు హుజూరాబాద్ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో మంత్రి గంగుల హుజూరాబాద్‌లో మకాం వేసే అవకాశాలున్నాయి. ఇక్కడ ప్రత్యామ్నాయ నేతను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంథని సర్కిల్లో పోలీసుల బదిలీలు ఈ క్రమంలోనే ఇక్కడి పోలీసులను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వామన్‌రావు హత్యకు ముందు.. తరువాత జరిగిన పరిణామాల్లో మంథని సర్కిల్ పరిధిలోని పోలీసులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ విచారణను తిరగతోడడంలో భాగంగా మంథని సీఐ జి.మహేందర్ రెడ్డిని వరంగల్ కమిషనరేట్‌కు అటాచ్డ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఇటీవలే మంథని సర్కిల్‌కు సీఐగా బదిలీపై రావడం గమనార్హం. అంతకుముందు వామన్‌రావు దంపతుల హత్య జరిగినప్పుడు సీఐగా ఉన్న మహేందర్‌ను బదిలీ చేసి మహేందర్‌రెడ్డిని తీసుకొచ్చారు. తాజాగా అదే సమయంలో మంథని సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్సైలు అందరిని బదిలీ చేస్తూ రామగుండం కమిషనర్ వి.సత్యనారాయణ ఉత్తర్వులు ఇచ్చారు. జంట హత్యలు జరిగిన రామగిరి పోలీస్‌స్టేషన్ ఎస్సై ఎ.మహేందర్‌ను బసంత్‌నగర్‌కు బదిలీ చేశారు. మహేందర్ పుట్ట మధు వర్గీయులకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలను తీవ్రంగా ఎదుర్కొన్నారు. ఆయన స్థానంలో రామగుండం ఎస్బీకి అటాచ్డ్ అయిన ఎస్సై కె.రవిప్రసాద్‌కు పోస్టింగ్ ఇచ్చారు. ముత్తారం మండల ఎస్సై సి.నరసింహారావును టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేసి కాసిపేట (మంచిర్యాల జిల్లా) ఎస్సై బి. రాములును ముత్తారానికి పంపించారు. మంథని ఎస్సై ఓంకార్‌ను ములుగుకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో జూలపల్లి ఎస్సై పి.చంద్రకుమార్‌కు పోస్టింగ్ ఇచ్చారు. భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వెళ్లిన మహదేవ్పూర్, కాళేశ్వరం పరిధిలో కూడా బదిలీలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ బదిలీలన్నీ పదోన్నతులపై జరగడం గమనార్హం. మహదేవ్పూర్ సీఐ నర్సయ్య డీఎస్పీగా పదోన్నతి పొందడంతో ఆయన స్థానంలో రామగుండం టాస్క్‌ఫోర్స్ సీఐ తిలక్ నియమితులయ్యారు. కాళేశ్వరం, మహదేవ్పూర్ ఎస్సైలు సీఐలుగా పదోన్నతి పొంది బదిలీపై వెళ్లారు. మంథనిలో రాజకీయ మార్పులు తప్పవా..? అలాగే మంథనిలో కూడా రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు చెందిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబును టీఆర్ఎస్లోకి తీసుకునే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు సమాచారం. వామన్‌రావు దంపతుల హత్యలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మధుకు టీఆర్ఎస్లో అవకాశాలు తగ్గినట్టేనన్న ప్రచారం జరుగుతోంది. మంథనిలో మధు కనుసన్నల్లోనే పోస్టింగులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారుల పోస్టింగ్‌ల విషయంలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇన్స్పెక్టర్లు మొదలుకొని నియోజకవర్గంలో పనిచేసే ప్రతి అధికారి ఎమ్మెల్యే ద్వారానే పోస్టింగ్ పొందే పరిస్థితి. అయితే మంథని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ పోస్టింగ్‌లు, బదిలీలు అన్నీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. శ్రీధర్‌బాబు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కావడంతో టీఆర్ఎస్ ఇన్చార్జిగా మధు చెప్పిన వారికే పోస్టింగ్‌లు ఇవ్వడం జరుగుతోంది. దీనిపై పలుమార్లు శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ నేతలు విమర్శించడం తప్ప అడ్డుకోలేకపోయారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మధుకు సంబంధం లేకుండా నియామకాలు చోటు చేసుకోవడం గమనార్హం. మంథనిలోనూ బదిలీల పర్వం మాజీ మంత్రి ఈటల రాజేందర్ వర్గీయుడు, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన మంథని నియోజకవర్గంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. హత్యకు గురైన న్యాయవాది గట్టు వామన్‌రావు దంపతులకు సంబంధించి వామన్‌రావు తండ్రి తాజాగా ఐజీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును రీఓపెన్ చేశారు. ఇందులో భాగంగా పుట్ట మధును విచారణ కోసం రామగుండం కమిషనరేట్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. తాజాగా ఆయన సతీమణి, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజను కూడా విచారణ కోసం తీసుకొచ్చారు. ఇక మంథని నియోజకవర్గం పరిధిలో తహసీల్దార్లు, ఎంపీడీవోల బదిలీలపై కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. పుట్ట మధుతోపాటు మున్సిపల్ చైర్పర్సన్ శైలజకు అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆరోపణలున్న అధికారులను బదిలీ చేసి, కొత్త వారిని తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Putta Madhu: హత్యకు ముందు డ్రా చేసిన 2 కోట్లపై పోలీసుల ఆరా -
వామన్‌రావు దంపతుల హత్య కేసులో కీలక మలుపు
సాక్షి, కరీంనగర్ : వామన్‌రావు దంపతుల హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పుట్ట మధు సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండవ రోజు పుట్ట మధును పలు అంశాలపై విచారించారు. హత్యకు ముందు రూ.2 కోట్లు విత్‌డ్రా విషయం సహా.. ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ ఇంటి నిర్మాణంపైనా ఆరా తీశారు. వామన్‌రావు తండ్రి కిషన్‌రావునూ విచారించారు. హత్యలో పుట్ట మధు, భార్య శైలజ ప్రమేయం ఉందని కిషన్‌రావు చెప్పారు. కాగా, ఈ జంటహత్యల కేసులో ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను కీలకంగా ఉన్నారు. -
Putta Madhu: హత్యకు ముందు డ్రా చేసిన 2 కోట్లపై ఆరా
సాక్షి, పెద్దపల్లి: న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. లాయర్ల హత్య జరగడానికి ముందు పుట్టా మధు రూ. 2 కోట్లు డ్రా చేసిన వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్య కేసు ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ జైల్లో ఉండగా గుంజపడుగులో నిందితుడి ఇంటి నిర్మాణం శరవేగంగా సాగడంపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. అదేవిధంగా పుట్టా మధు అనుచరులు సత్యనారాయణ, సతీష్ పోలీసుల అదుపులో ఉన్నారు. గతంలో న్యాయవాద దంపతులు పుట్టా మధు దంపతులపై కోర్టులో కేసులు వేసిన విషయం తెలిసిందే. న్యాయవాది దంపతుల హత్య కేసులో పుట్టా శైలజను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక నాలుగు రాష్ట్రాల్లో 4 వాహనాలను మారుస్తూ పట్టా మధు 6 ఫోన్లు మార్చినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: Putta Madhu: అత్యంత పకడ్బందీగా అజ్ఞాతం చదవండి: సంచలనం సృష్టించిన పుట్ట మధు అదృశ్యం కేసు -
Putta Madhu: భీమవరం ఎపిసోడ్లో నిజమెంత?
సాక్షి, హైదరాబాద్: న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు.. తన ఆచూకీ పోలీసులకు చిక్కకుండా చాలా పకడ్బందీగా వ్యవహరించాడు. నిన్నమొన్నటి వరకు ఎక్కడా సెల్‌ఫోన్ వాడలేదు, కుటుంబ సభ్యులు, అనుచరులను ఫోన్లో సంప్రదించలేదు. సొంత వాహనం వాడలేదు. హోటళ్లు, లాడ్జిలలో కాకుండా తెలిసిన వారి వద్దే తలదాచుకున్నాడు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో తిరిగాడనే అనుమానాలున్నా, ఎక్కడా సొంత ఏటీఎం కార్డు కూడా వాడలేదంటే ఎంత పకడ్బందీగా వ్యవహరించాడో అర్థమవుతోంది. మధుకు ఆప్తుడైన కర్ణాటకకు చెందిన ఓ మిత్రుడికి ఏపీలోని రావులపాలెంలో ఉన్నవారితో సంబంధాలు ఉన్నాయని, ఆ పరిచయాల ఆధారంగా మధు భీమవరంలో ఆశ్రయం పొందినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. మధు ఆచూకీ కనిపెట్టాలని మధుకు దగ్గరగా ఉండే ఓ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు ఆదేశించారని, ఆ అధికారి సూచనల మేరకు ఇటీవల కుటుంబ సభ్యులు మధును సంప్రదించగా.. ఆ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా భీమవరంలో అతని జాడను కనిపెట్టారని చెబుతున్నారు. సుపారీ టేపులపై రెండున్నరేళ్ల తర్వాత కేసు! వామన్‌రావు దంపతుల హత్య కేసు నిందితుల్లో ఒకరైన కుంట శ్రీను పేరుతో, 2018 ఎన్నికలకు ముందు మధు పేరును ప్రస్తావిస్తూ ఓ హత్యకు సంబంధించి జరిగిన సుపారీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హత్యకు డీల్ రూ.60 లక్షలకు కుదిరింది. రెండున్నరేళ్ల తర్వాత, వామన్‌రావు హత్య అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు, ఇటీవల వాయిస్ టెస్టుకు అను మతి కోరుతూ మంథని కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇన్ని రోజులు కుంటశ్రీను ఎవరితో సుపారీ మాట్లాడాడు? అసలు ఆ గొంతు ఎవరిది? అన్న విషయాన్ని తేల్చకపోవడం గమనార్హం. చదవండి: లాయర్ల హత్య: ‘అప్పటి ఆరోగ్య మంత్రిపై అనుమానం’ -
సంచలనం సృష్టించిన పుట్ట మధు అదృశ్యం కేసు
సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు లాయర్ల జంట హత్యల కేసు చివరికి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మెడకు చుట్టుకుంటోంది. కేసు చార్జిషీటు దాఖలు చేసే సమయంలో గన్మెన్లను వదిలి వారం రోజులపాటు అదృశ్యం కావడంతో ఆయన ప్రమేయంపై పోలీసులు ఆరా తీసే పరిస్థితి తలెత్తింది. లాయర్ల హత్యకేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీను జైలులో ఉండగా.. అతని ఇంటి నిర్మాణానికి పుట్ట మధు సహకరిస్తున్నట్లు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదు చేశారు. వాటితోపాటు మరిన్ని అనుమానాస్పద అంశాలు జెడ్పీ చైర్మన్ మధుకు తలనొప్పిగా మారుతున్నాయి. వారం రోజుల క్రితం అదృశ్యమైన మధును శుక్రవారం రాత్రి ఏపీలోని భీమవరంలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పిన పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ.. వామన్‌రావు హత్య కేసులో ఆయన ప్రమేయంపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి ముగ్గురు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కేసు దర్యాప్తు సాగిస్తున్నారు. హత్య కేసు విచారణాధికారి అడిషనల్ డీసీపీ అశోక్‌కుమార్, ఓఎస్డీ శరత్‌చంద్రపవర్, రామగుండం పోలీసు కమిషనర్ వి.సత్యనారాయణ వేర్వేరుగా విచారించారు. పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకున్న అంశం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైది. రూ, 2 కోట్లు సుపారీ నిజమేనా..? హత్యకేసులో ప్రధాన నిందితులకు సుపారీ కింద రూ.2 కోట్లు ముట్ట జెప్పారని, ఏ 1 కుంట శ్రీను జైల్లో ఉన్నప్పటికీ అతని స్వగ్రామంలో ఇంటి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని ఆరోపిస్తూ వామన్‌రావు తండ్రి కిషన్‌రావు గత నెల 16న ఐజీ నాగిరెడ్డికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖనే పుట్ట మధుపై ఎంక్వైరీకి కారణమైంది. వామన్‌రావు దంపతుల హత్యకు రూ.2 కోట్లు డీల్ మాట్లాడిందెవరు? బిట్టు శ్రీనుకు కొత్త కారు కొనిచ్చింది ఎవరు? కుంట శ్రీను ఇంటికి ఎవరు డబ్బులు స్పాన్సర్ చేస్తున్నారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయలను ఏ బ్యాంకు నుంచి తెచ్చారు? విత్‌డ్రా చేసిందెవరు? తదితర కోణాలపై రామగుండం పోలీసులు దృష్టి పెట్టారు. హత్య జరగడానికి ముందు నుంచి తరువాత చోటు చేసుకున్న పరిణామాల వరకు పుట్ట మధు ఎవరెవరితో మాట్లాడారో కాల్‌డేటా కూడా తీసుకుని విచారిస్తున్నారు. చార్జిషీటు దాఖలుకు సమయం ఆసన్నమైన పరిస్థితుల్లో కోర్టుకు సమాధానం చెప్పుకొనేందుకు.. వామన్‌రావును అంతమొందించడం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందనే కోణంపై పోలీసులు దృష్టి పెట్టినట్లు సమాచారం. వారం రోజులు ఎందుకు అదృశ్యం..? జెడ్పీ చైర్మన్ పుట్ట మధు వారం రోజులు అదృశ్యం కావడానికి గల కారణాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ కోసం గన్మెన్లుగా వచ్చిన నలుగురు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. ప్రభుత్వ కారును వదిలేసి ఎందుకు అదృశ్యం కావలసి వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నారని సమాచారం. పోలీసుల కళ్లు కప్పి మహారాష్ట్ర, హైదరాబాద్, భీమవరం ప్రాంతాల్లో ఎవరెవరిని కలిశారనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ కేసుతో సంబంధం ఉందన్న కారణంగానే మధు గాయబ్ అయ్యాడా? ఇంకేమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అదృశ్యంపై గోప్యత ఎందుకు? గత నెల 29న రాత్రి హైదరాబాద్ నుంచి ఓ పోలీస్ అధికారి నుంచి ఫోన్ కాల్ రావడంతో అదేరోజు రాత్రి పుట్ట మధు అదృశ్యమయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మధు అదృశ్యమైన తరువాత మరుసటి రోజు ఉదయం గన్మెన్లు ఈ విషయాన్ని ఏఆర్ విభాగం చీఫ్‌కు తెలియజేయడం, ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిపోయాయి. గన్మెన్లు తమ ఆయుధాలను సరెండర్ చేసి, ఏఆర్‌కు అటాచ్డ్ అయ్యారు. ఆ వెంటనే రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం, మధు, ఆయన డ్రైవర్ సెల్ టవర్ సిగ్నల్స్ మేరకు మహారాష్ట్ర వెళ్లారు. ఈనెల 1న మహారాష్ట్రలోని వని పట్టణంలో మధు సోదరుని నివాసానికి వెళ్లి విచారణ జరపగా, మధు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తేలింది. అదే సమయంలో ఈటల రాజేందర్ వ్యవహారం తెరపైకి రావడంతో హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది. మధు కోసం జిల్లాకు చెందిన ఓ మంత్రి పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మూడు రోజుల క్రితం సదరు మంత్రికి ‘సాక్షి’ ఫోన్ చేయగా, మధు హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పడం గమనార్హం. సాక్షి కథనాలతో అప్రమత్తమైన పోలీసులు ‘భీమవరం’ నుంచి అదుపులోకి తీసుకోవడం కొసమెరుపు. ‘సాక్షి’ వరుస కథనాల సంచలనం పుట్ట మధు అదృశ్యమైన విషయంపై ఈనెల 6న ‘సాక్షి’ దినపత్రికలో ‘పుట్ట మధు ఎక్కడ..?’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. అప్పటివరకు పుకారుగా ప్రచారంలో ఉన్న ఈ అంశాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తేవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరుసటి రోజు 7న ‘అజ్ఞాతంలోనే మధు’ శీర్షికతో వారం రోజులుగా వీడని సస్పెన్స్‌ను హైలైట్ చేస్తూ కథనం ప్రచురించింది. మధు ఎక్కడికి వెళ్లలేదని, గన్‌మెన్ ఆయనతోనే ఉన్నారని, మిస్సింగ్ ఫిర్యాదులు ఏవీ అందలేదని రామగుండం పోలీస్ కమిషనర్ ఇచ్చిన వివరణతోపాటు జరుగుతున్న పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించడం జరిగింది. అదే సమయంలో తన భర్త ఆచూకీ తెలపాలని మధు సతీమణి, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని కలిసిన వివరాలను ప్రచురించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు పుట్ట మధును అదుపులోకి తీసుకున్న విషయాన్ని మీడియాకు వెల్లడించాలని నిర్ణయించారు. అదే సమయంలో శుక్రవారం పుట్ట శైలజ ‘సాక్షి’తో మాట్లాడుతూ పుట్ట మధు హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు 8న ‘అజ్ఞాతంలోకి పోలేదట..’ శీర్షికతో మరో కథనం ప్రచురితమైంది. చివరికి పుట్ట తమ అదుపులో ఉన్న విషయాన్ని పోలీసులు వెల్లడించక తప్పలేదు. -
లాయర్ల హత్య: ‘అప్పటి ఆరోగ్య మంత్రిపై అనుమానం’
సాక్షి, మంథని: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ రాష్ట్రం భీమవరంలో ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్న మధును తాము అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో విచారణ కోసం శనివారం ఆయనను రామగుండం తీసుకొచ్చారు. వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు గతనెల 16న ఐజీ నాగిరెడ్డికి చేసిన ఫిర్యాదులో పుట్ట మధు ప్రమేయంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘నా కొడుకు, కోడల్ని కత్తులతో పొడిచిన తరువాత పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో వారికి సకాలంలో వైద్య సేవలు అందలేదు. దీనికి అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కారణమని నాకు అనుమానం. మొదట ప్రైవేటు అంబులెన్స్ వచ్చినప్పటికీ దాన్ని కాదని 108 వాహనం వచ్చే దాకా కావాలనే ఆలస్యం చేశారు. ఆస్పత్రికి చేరిన తర్వాత తీవ్ర గాయాలతో ఉన్న వామన్‌రావుకు వైద్య సేవలు సకాలంలో అంది ఉంటే కొద్ది రోజులైనా బతికేవాడు’ అని తెలిపారు. ‘పుట్ట మధుకు, ఈటలకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే నా కుమారుడికి వైద్య సేవలు అందలేదు. పంచనామా పోస్టుమార్టం రిపోర్టు విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి. పెద్దపల్లి ప్రజాప్రతినిధి కూడా ఆసుపత్రికి వచ్చిన వామన్‌రావుకు మందులు ఇవ్వవద్దని చెప్పారు. నిందితులందరికీ చట్ట పరంగా శిక్షలు పడతాయనే విశ్వాసం ఉంది. మధు, ఆయన భార్య శైలజ, రామగిరికి చెందిన సత్యనారాయణ ప్రమేయం ఉన్నట్లు ఏప్రిల్ 16న ఐజీ నాగిరెడ్డికి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు పంపా. హత్యకు రెక్కీ నిర్వహించడం, అందులో పాల్గొన్న వ్యక్తి పేరును ఇతర వివరాలు తెలియజేశా. వీరందరినీ విచారిస్తే అనేక విషయాలు బయటకు వస్తాయి. న్యాయం జరగకపోతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తా’ అని తెలిపారు. చదవండి: వామన్‌రావు దంపతుల హత్య కేసుపై సర్కారు ఫోకస్ -
పోలీసుల అదుపులో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు
-
పుట్ట మధు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!?
సాక్షి, పెద్దపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసుపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ కేసు విచారణకై స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలంటూ హైకోర్టును కోరింది. కరీంనగర్ జిల్లాలోని ఒక కోర్టును కేసు విచారణకు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ న్యాయ శాఖ కార్యదర్శి హైకోర్టుకు లేఖ రాశారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పెద్దపల్లికి చెందిన గట్టు వామన్‌రావు-నాగమణి దారుణ హత్యకు గురైన విషయం విదితమే. ఈ కేసులో ఇప్పటికే కుంట శ్రీనివాస్(44), శివందుల చిరంజీవి(35), బిట్టు శ్రీను తదితరులను అరెస్టు చేసి, విచారణ చేపట్టారు. ఇక ఈ కేసులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించిన నేపథ్యంలో, పుట్ట మధు, ఆయన భార్య శైలజ తదితరులకు కూడా ఇందులో ప్రమేయం ఉందని వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు వరంగల్ ఐజీకి ఇదివరకే రాశారు. ఇదిలా ఉండగా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో.. గత వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్ట మధు ఆచూకీ లభించడం, వామనరావు హత్య కేసులో ఆయనను విచారించడం వంటి పరిణామాలు నేడు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు సైతం ఈ కేసుపై దృష్టి సారించడం గమనార్హం. దీంతో, పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హత్య వెనుక ఉన్నది వాళ్లే: కిషన్‌రావు హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసు నేపథ్యంలో మృతుడు గట్టు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు వరంగల్ ఐజీ నాగిరెడ్డికి గతంలో లేఖ రాశారు. పట్టపగలే తన కొడుకు, కోడలును దారుణంగా హతమార్చారని, నిందితులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు.. ‘‘హత్య వెనుక పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, ఆయన భార్య శైలజ, కమన్ పూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ ఉన్నారు. ఈ హత్యలకు గ్రామ కక్షలు, దేవాలయ విషయం కారణం కాదు. నిందితులతో ప్రమాదం పొంచి ఉందని జనవరి 28న రామగుండం పోలీస్ కమిషనర్, మంథని పోలీసులకు ఫిర్యాదు చేశాం. పుట్ట మధు ఎమ్మెల్యే గా ఓడిపోయినప్పటి నుంచి నా కొడుకుపై కక్ష పెంచుకున్నాడు. అంతేకాదు, ఈ హత్యలో స్థానిక నేతలు,అధికారుల తో పాటు పెద్ద తలకాయల పాత్ర ఉంది. జైలులో ఉన్న కుంట శ్రీనివాస్ గుంజపడుగులో నిర్మించే నూతన గృహం ఎవరు నిర్మిస్తున్నారు, డబ్బులు ఎవరు ఇస్తున్నారు. జైల్లో ఉన్న నిందితులతో గ్రామానికి చెందిన వారితో పాటు ఇతరులు కలిసిన విషయంలో విచారణ చేయాలి. లక్కేపురం విజయ బాస్కర్, గట్టు విజయ్ కుమార్ ఆయన కుమారుడు వినయ్, ఆటోడ్రైవర్ వేలాది రఘురాం కాల్ డాటా ను పరిశీలించాలి. నా కొడుకు ఆరోజు మంథనికి వస్తున్న విషయం ఎవరికి తెలియదు. కేవలం గ్రామ సర్పంచ్ రాజు మాత్రమే తెలుసు. నా కొడుకు, కోడలు హత్య తర్వాత సర్పంచ్ ఇప్పటి వరకు మమ్మల్ని పరామర్శించలేదు. నిందితుడు కుంట శ్రీను తమ్ముడు కుంట రాజు(సర్పంచ్)తో పాటు హత్య పథకంలో కొందరు అధికారుల పాత్ర కూడా ఉంది. ప్రైవేటు అంబులెన్స్ లో వైద్యం అందించలేదు, హత్యకు కారకులైన వారికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి’’అని ఆయన లేఖలో పేర్కొన్నారు. చదవండి: Putta Madhu: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు అరెస్ట్! -
Putta Madhu: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు అరెస్ట్!
-
Putta Madhu: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ రాష్ట్రం భీమవరంలో ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్న మధును తాము అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో విచారణ కోసం శనివారం ఆయనను రామగుండం తీసు కొచ్చారు. వామన్‌రావు తండ్రి కిషన్‌రావు గతనెల 16న ఐజీ నాగిరెడ్డికి చేసిన ఫిర్యాదులో పుట్ట మధు ప్రమేయంపై ఆరోపణలు చేశారు. దీనిపై రామగుండం పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని తొలుత ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. అలాగే పోలీసులు మధు అదృశ్యాన్ని ధ్రువీకరించకపోవడం, టీఆర్ఎస్ నేతల రాయబారాలు, మధు సతీమణి శైలజ స్పందన తదితర విషయాలతో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో శనివారం మధును అదుపులోకి తీసుకున్ననట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలో చిక్కని మధు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును తిరిగి తవ్వుతున్నారనే విషయం గత నెల 29న పుట్ట మధుకు తెలిసింది. దాంతో అదేరోజు రాత్రి ఆయన గన్మేన్లు లేకుండా, ప్రభుత్వ కారును ఇంట్లోనే వదిలేసి తన భార్య, మునిసిపల్ చైర్పర్సన్ శైలజ కారులో అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు మధు ‘గాయబ్’అయ్యారనే విషయాన్ని గోప్యంగా ఉంచి దర్యాప్తు ప్రారంభించారు. వివిధ వర్గాల ద్వారా సమాచారం సేకరించి ఎట్టకేలకు మధు ఆచూకీ కనుకొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా వని పట్టణంలోని తన సోదరుడి ఇంట్లో ఉన్నట్లు తెలుసుకొని ఈనెల 1న అక్కడి పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. అయితే మధు అక్కడ పోలీసులకు చిక్కలేదు. ఈ మేరకు మరాఠీ దినపత్రికలో వార్త ప్రచురితమైంది. అదే సమయంలో ఈటల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో అప్రమత్తమైన మధు హైదరాబాద్ వెళ్లారు. అక్కడ జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా టీఆర్ఎస్ అధిష్టానాన్ని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్మెంట్ లభించలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం వెళ్లి ఉంటారనేది ఓ కథనం.. కాగా మధు హైదరాబాద్‌లోనే ఉండి తన భార్య సహకారంతో ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించారని, అదే సమయంలో పత్రికల్లో వార్తా కథనాలు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ఉంటారనేది మరో కథనం. అయితే హైదరాబాద్‌లో పట్టుకున్నట్లు కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు సీన్ క్రియేట్ చేశారని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి భీమవరం వెళ్లి, శనివారం ఉదయాన్నే మధును అదుపులోకి తీసుకొని, మధ్యాహ్నానికల్లా జెట్ స్పీడ్‌లో రామగుండం తీసుకొచ్చి విచారణ ప్రారంభించడం ఈ సందేహానికి తావిస్తోంది. హైదరాబాద్‌లో ఉంటే ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే భీమవరం ఎపిసోడ్‌కు తెరతీశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిషన్‌రావు ఫిర్యాదుతోనే దర్యాప్తు వేగం ఈ జంట హత్యల కేసులో ప్రధాన నిందితులకు పుట్ట మధు రూ.2 కోట్లు సుపారీ ఇచ్చారని, ప్రధాన నిందితుడు కుంట శ్రీను జైల్లో ఉన్నప్పటికీ అతని స్వగ్రామంలో ఇంటి నిర్మాణం వేగంగా జరుగుతోందని, దీని వెనకాల జెడ్పీ చైర్మన్ ఉన్నారని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఈనెల 16న ఐజీ నాగిరెడ్డికి పిర్యాదు చేశారు. ఈ కేసును హైకోర్టు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న క్రమంలో కిషన్‌రావు ఫిర్యాదుపై ఐజీ నాగిరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎ–1 కుంట శ్రీను ఇంటి నిర్మాణం వెనక ఎవరెవరున్నారనే కోణంలో కూడా విచారణ జరిపారు. హత్య కోసం రూ.2 కోట్లు సుపారీ ఇచ్చారా? అంతమొత్తం ఎక్కడ నుంచి వచ్చింది..? దీని వల్ల ఎవరికి ప్రయోజనం అనే కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో పుట్ట మధు అదృశ్యం కావడంతో కేసు మలుపు తిరిగింది. హత్యల కేసులో పాత్ర తేల్చేందుకే.. హైకోర్టు లాయర్ల హత్య కేసులో పుట్ట మధు ప్రమేయం తేల్చేందుకు శనివారం ఆయన్ను ఇక్కడికి తీసుకువచ్చాం. ఇద్దరు అధికారుల పర్యవేక్షణలో విచా రణ కొనసాగుతోంది. హత్యకేసులో ప్రధాన నిందితుని ఇంటి పనులు వేగవంతం కావడం, వారం రోజుల పాటు మధు ఎందుకు అదృశ్యం అయ్యారు? తదితర వివరాలు విచారణలో తెలుస్తాయి. కిషన్‌రావు ద్వారా కూడా ఆధారాలు సేకరిస్తాం. అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. – వి.సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ దొరకని ‘పెద్దల’ అపాయింట్మెంట్ టీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం.. పుట్ట మధు మహారాష్ట్ర నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చాడు. ఈ కేసు నుంచి బయటకు తీసుకురావాలని ఆయన జిల్లాకు చెందిన ఓ మంత్రి సాయం కోరాడు. అయితే ఆయన టీఆర్ఎస్ పెద్దలతో మాట్లాడి పుట్ట మధుకు అపాయింట్మెంట్ ఇప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడం, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు రావడంతో పరిస్థితి మారింది. మధు సతీమణి పుట్ట శైలజ సీన్లోకి వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లినా వీలు కాలేదు. దీంతో మరో మంత్రిని కలిసి సాయం కోరారు. ఈ ప్రయత్నాలు ఇలా కొనసాగుతున్న క్రమంలోనే పోలీసులు మధును అదుపులోకి తీసుకొని రామగుండం తీసుకొచ్చి విచారణ ప్రారంభించారు. ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసి ఫైనల్ చార్జిషీట్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. చదవండి: Putta Madhu: వారం రోజులుగా వీడని సస్పెన్స్.. అసలేం జరిగింది? -
Putta Madhu: వారం రోజులుగా వీడని సస్పెన్స్.. అసలేం జరిగింది?
‘పుట్ట మధు వెంట నలుగురు గన్మెన్లు ఉన్నారు. ఆయన గన్మెన్లకు చెప్పకుండా వెళ్లాడనే సమాచారం ఏం లేదు. గన్‌మెన్ గానీ ఆయన కుటుంబ సభ్యులు గానీ మధు కనిపించడం లేదని ఫిర్యాదు చేయలేదు. ప్రజాప్రతినిధిగా ఆయన దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. గన్మెన్లు ఆయన వెంటే ఉంటారు.’ – ‘సాక్షి’తో రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ‘నా భర్త పుట్ట మధు ఐదు రోజులుగా కనిపించడం లేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేయాలని ప్రయత్నిస్తున్నాం. మాకు అవకాశం దొరకడం లేదు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిస్తే ఆరోగ్యం బాగాలేదన్నారు. మీరైనా సీఎంకు తెలియజేయండి’ – మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి కొడుకు, కోడలితో కలిసి మధు భార్య, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ విజ్ఞప్తి సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జాల వ్యవహారం వెలుగులోకి వచ్చిన గత శుక్రవారం నుంచే ‘గాయబ్’ అయిన పుట్ట మధు ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. జిల్లా పరిషత్ చైర్మన్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండగా, ఆయన ఎక్కడికి వెళ్లలేదని పోలీసులు చెపుతున్నారు. అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన మంథనిలో ఏం జరుగుతోందో కూడా పోలీసులకు తెలియకుండా ఉంది. నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లతో పుట్ట మధుకు రక్షణ కల్పిస్తున్న రామగుండం పోలీసులు ఇంత జరుగుతున్నా.. మధు ఎక్కడికి వెళ్లలేదని, దేశంలోనే ఉన్నారని చెబుతూ వచ్చారు. ఆయనకు రక్షణగా గన్మెన్లు కూడా వెంటే ఉన్నారని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ స్వయంగా ‘సాక్షి’తో చెప్పారు. రామగుండం ఏఆర్ ఏసీపీ సుందర్రావు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. ఎన్ని పుకార్లు షికార్లు చేసినా.. పోలీసులు చెపుతున్న దానిని బట్టి పుట్ట మధు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న తన బంధువుల దగ్గరో.. సన్నిహితుల వద్దో ఉంటారని భావించవచ్చు. అయితే ‘సాక్షి’లో ‘పుట్ట మధు ఎక్కడ..?’ అనే శీర్షికన గురువారం ప్రచురితమైన కథనం తరువాతే ఈ అదృశ్యం విషయంలో కదలిక మొదలైంది. పుట్ట మధు సతీమణి పుట్ట శైలజ, కుమారుడు, కోడలు నేరుగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎంను కలిసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. సీఎం అందుబాటులో లేకపోవడంతో ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని కలిసి తన భర్త ఆచూకీ కోసం తాము పడుతున్న బాధను సీఎంకు తెలియజేయాలని కోరినట్లు సమాచారం. వీడని సస్పెన్స్ ఎపిసోడ్.. సుమారు వారం రోజుల క్రితం పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లిన విషయాన్ని సాక్షాత్తూ టీఆర్ఎస్ నేతలే ధ్రువీకరిస్తున్నారు. అడ్వకేట్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూడడం, అదే సమయంలో రాష్ట్ర పోలీస్ శాఖలోని ఉన్నతాధికారి నుంచి ఫోన్ రావడంతో వారం క్రితమే ఆయన మంథని నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారని సమాచారం. హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పిన మధు.. తనకు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని మంథనిలోనే వదిలి, ఆయన భార్య శైలజ కారులో వెళ్లినట్లు తెలుస్తోంది. మ«ధు వాహనం ప్రస్తుతం ఆయన మామ ఇంట్లో పార్కింగ్ చేసి ఉంది. మంథని నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్లినట్లు సమాచారం. ఆయన సెల్ ఫోన్ సిగ్నిల్ చివరగా మహారాష్ట్రలోని సెల్ టవర్ క్యాచ్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. మహారాష్ట్రలోని ‘వని’ పట్టణంలో పుట్ట మధు సోదరుడు, మరో బంధువు ఇంట్లో అక్కడి జిల్లా పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి విచారణ జరిపినట్లు ఆ రాష్ట్రంలోని ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. కాగా.. మహారాష్ట్ర నుంచి వస్తున్న వాహనాలను ఆసిఫాబాద్‌లోని వాంకిడి వద్ద పట్టుకొని ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధు మంథని నుంచి నేరుగా మహారాష్ట్ర వెళ్లినట్లు స్పష్టమవుతోంది. అయితే.. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారనే ప్రచారం ఉంది. కానీ.. పోలీసులు దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. గన్మెన్లు ఎక్కడ..? పుట్ట మధు వెంటే గన్మెన్లు ఉన్నారని ఏఆర్ ఏసీపీతోపాటు రామగుండం పోలీస్ కమిషనర్ చెపుతుండగా.. పుట్ట మధు ఎక్కడున్నారనే విషయంలో ఇంత కథ ఎందుకు జరుగుతుందనేది ప్రశ్నగా మిగిలింది. నలుగురు గన్మెన్లు మధుతో ఉంటే ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినా.. వారం రోజులుగా గన్మెన్ల ఆచూకీ పోలీస్ ఉన్నతాధికారులు ఎందుకు కనుక్కోలేదా అని తెలియకుండా ఉంది. పుట్ట శైలజ తన భర్త ఆచూకీ చెప్పాలని ప్రభుత్వ పెద్దలను కలిసి కోరుతున్న వేళ ఇప్పటికీ గన్మెన్లు మధు వెంటే ఉన్నారని పోలీస్ కమిషనర్, ఏఆర్ ఏసీపీ సుందర్రావు చెప్తున్నారంటే.. వారి మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉందో ప్రభుత్వానికే తెలియాలి. ప్రస్తుతం పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన పుట్ట మధు వ్యవహారంలో నిజాలను బహిర్గత పరచాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది. మంత్రి కొప్పులతో టచ్‌లో.. అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్ట మధు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్ర నుంచి నేరుగా హైదరాబాద్‌కు వచ్చిన పుట్ట మధు టీఆర్ఎస్ అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. వామన్‌రావు హత్య కేసుతోపాటు ఈటల రాజేందర్ వ్యవహారంలో కూడా తన ప్రమేయం లేదని సీఎం కేసీఆర్‌కు చెప్పించేందుకు ఆయన ప్రయత్నించినట్లు తెలిసింది. రాష్ట్రానికి చెందిన మంత్రులు ఇద్దరు ఈ విషయాన్ని “సాక్షి’తో మాట్లాడుతూ ధ్రువీకరించారు. కాగా గురువారం పుట్ట మధు భార్య శైలజ, ఆమె కుమారుడు, కోడలితో కలిసి హైదరాబాద్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలువగా, తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన సూచన మేరకు వెనుదిరిగినట్లు సమాచారం. అదే క్రమంలో ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్‌ను కలిసి తన భర్త మధు ఆచూకీ ఐదు రోజులుగా దొరకడం లేదని.. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని కోరారు. కాగా.. ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన తరువాత ‘కేసీఆర్ వెంటే మేమూ.. మా నాయకుడు పుట్ట మధు’ అని మంథని నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం మంథనిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంథని టీఆర్ఎస్లో చీలికకు కొందరు కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: Putta Madhu: ఫోన్ స్విచ్ఛాఫ్.. పుట్ట మధు ఎక్కడ..? -
వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద డాక్టర్ హంగామా.. ఎందుకంటే..
సాక్షి, యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగిరి మండలం ముస్త్యాల ప్రభుత్వం పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద అదే గ్రామానికి చెందిన డాక్టర్ విజయ్‌కుమార్ హంగామా చేసినట్లు సర్పంచ్ లావణ్య తెలిపారు. సెంటర్ ఇక్కడ ఎందుకు పెట్టారు అంటూ ఏఎన్ఎం, ఆశ వర్కర్లను, మెడికల్ ఆఫీసర్‌ను, కార్యదర్శితో గొడవకు దిగినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ సెంటర్‌కు ప్రజలు రాకుండా ఇబ్బంది కలిగేలా తన బైక్‌ను అడ్డుగా పెట్టడంతో, బైక్ తీయాలని అడిగిన నాగరాజుపై చేయిచేసుకున్నట్లు తెలిపారు. దీనిపై గోదావరిఖని టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా కానిస్టేబుల్ రావడంతో గొడవ సద్దుమణిగినట్లు తెలిపారు. ఈ విషయంపై పెద్దపల్లి డీఎంహెచ్ఓ దృషికి తీసుకెళ్తామని తెలిపారు. కాగా విజయ్‌కుమార్ యైటింక్లయిన్‌కాలనీ అల్లూరు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
తోటి ఉద్యోగే ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. దీంతో ఆ మహిళ..
సాక్షి, పెద్దపల్లిరూరల్: తోటి ఉద్యోగే ప్రేమిస్తున్నానంటూ వెంటబడి వేధించడంతో భరించలేక పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామ వీఆర్ఏ దివ్య (33) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం నిమ్మనపల్లి గ్రామానికి చెందిన దివ్యకు సబ్బితం గ్రామానికి చెందిన శేఖర్‌తో వివాహమైంది. మనస్పర్ధల కారణంగా వారిద్దరూ విడిపోయి, విడాకులు పొందారు. నిమ్మనపల్లి వీఆర్ఎగా విధులు నిర్వహిస్తూ దివ్య ప్రస్తుతం పెద్దపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో డెప్యూటేషన్‌పై పనిచేస్తోంది. ఈ క్రమంలో కొత్తపల్లి గ్రామ వీఆర్ఏ పెర్క వెంకటేశ్ తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధిస్తుండడంతో మనస్తాపానికి గురై ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతురాలి సోదరుడు దిలీప్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి తల్లిదండ్రులు పోచమ్మ, నర్సయ్య సోదరులు దిలీప్, దినేశ్ ఉన్నారు. -
ఆ సంచీలో ఒక్క రూపాయి లేదు.. కిడ్నాప్ ఓ డ్రామా!
మంథని: భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ. 50 లక్షలతో వెళ్లిన తాము కిడ్నాప్‌కు గురయ్యామన్న ఇద్దరు వ్యక్తుల వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు అసలు గుట్టు రట్టు చేశారు. భూ సమస్య పరిష్కారం కోసం కిడ్నాప్ నాటకం ఆడినట్లు తేల్చి 24 గంటల్లోనే కేసును ఛేదించారు. మంథనిలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్ వివరాలు వెల్లడించారు. రామగిరి మండలం లద్నాపూర్‌కు చెందిన చిప్ప రాజేశం, ఉడుత మల్లయ్య కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన బిల్క్ ఉన్నిసాబేగం వద్ద కొనుగోలు చేసి న భూమి రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 17న రూ. 50లక్షలతో ఇంటి నుంచి బయలుదేరారు. తర్వాత వారు తిరిగి రాలేదని రాజేశం భార్య పుష్పలత రామగిరి పోలీస్‌స్టేషన్‌లో 18న ఫిర్యాదు చేశారు. వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ రవీందర్ మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ నెల 19న అర్ధరాత్రి రెండు గంటలకు రాజాపూర్ శివారులో మల్లయ్య, రాజేశంలను వదిలేసినట్లు సమాచారం రావడంతో పోలీసులు వారిని తీసుకెళ్లి విచారించారు. తమను గు ర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు బాధితులు వెల్లడించారు. అనంతరం మంథని సీఐ మహేందర్ రెడ్డి, రామగిరి ఎస్సై మహేందర్ తమ సిబ్బందితో కలిసి మంగళవారం సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అనుమానం వచ్చి, గట్టిగా మందలించడంతో కిడ్నాప్ డ్రామా ఆ డినట్లు ఒప్పుకున్నారు. తమకు భూమి అ మ్ముతానని ఉన్నిసాబేగం రూ.36లక్షలు తీసుకొని, రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతోందన్నారు. భూ సమస్య పరి ష్కారం కోసమే నాటకం ఆడినట్లు చెప్పారని డీసీపీ పేర్కొన్నారు. ఖాళీ సంచినే డబ్బులు ఉన్నట్లు నమ్మించినట్లు చెప్పారన్నారు. రాజేశం, మల్లయ్యలపై కేసు నమోదు చేసి, రిమాండ్ తరలించిన ట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు కిరణ్, సదానందంల కు నగదు పురస్కారం అందించి, మంథని సీఐ, రామగిరి ఎస్సైలను అభినందించారు. చదవండి: రూ.50 లక్షలతో ఇంటి నుంచి వెళ్లారు.. తిరిగి రాలేదు చెప్పిన కథనంలో అనుమానాలు.. అసలేం జరిగింది..? -
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో 17.4 ఫీట్ల జొన్న మొక్క
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): పెద్ద జొన్న మొక్కకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది. ఎన్టీపీసీ రామగుండం జ్యోతినగర్ ప్రాంతానికి చెందిన దొడ్డ రాంచెంద్రారెడ్డి–పార్వతి దంపతులు తమ ఇంటి ఆవరణలో జొన్న మొక్కను పెంచారు. అది కాస్తా 5.3 మీటర్ల ఎత్తు(17.4 ఫీట్ల ఎత్తు) పెరగడంతో 2018, ఆక్టోబర్ 16న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. పెద్దగా మొక్క పెరగడంతో పూర్తి వివరాలతో రాంచంద్రారెడ్డి దంపతులు లిమ్కా బుక్ రికార్డుకు పంపించారు. అవార్డు ఎంపిక పరిశీలన అనంతరం లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఎత్తయిన జొన్న మొక్కగా గుర్తించి అవార్డుకు ఎంపిక చేసి వారికి ప్రశంసాపత్రాన్ని పంపించారు. తమ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్క లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. చదవండి: పిట్టల్లా రాలిన జనం: పిడుగులతో 6 మంది దుర్మరణం -
లాయర్ దంపతుల హత్య: మే 17లోగా చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణి హత్య కేసులో మే 17 నాటికి 90 రోజులు పూర్తవుతుందని, ఆ లోగా అభియోగపత్రం (చార్జిషీట్) దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. న్యాయవాద దంపతుల దారుణహత్యపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా గత ఫిబ్రవరిలో సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా దర్యాప్తు పురోగతిని వివరిస్తూ ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదిక సమర్పిం చారు. ఈ కేసులో 32 మంది ప్రత్యక్ష సాక్షులను గుర్తించామని, వారిలో 26 మంది వాంగ్మూలాలను సీఆర్పీసీ సెక్షన్ 164 కింద న్యాయమూర్తి ఎదుట రికార్డు చేశామని, మిగిలినవారి వాంగ్మూలాలను త్వరలో నమోదు చేస్తామని తెలిపారు. అలాగే ఏడుగురు నిందితుల వాంగ్మూలాలను కూడా న్యాయమూర్తి ఎదుట రికార్డు చేశామని వివరించారు. నిందితులు లచ్చయ్య, వసంతరావు, అనిల్ మొబైల్ ఫోన్లు, సిమ్‌కార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని.. ఆ నివేదిక వచ్చేందుకు నాలుగు వారాల సమయం పట్టవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 17న హత్య జరిగిన నేపథ్యంలో మే 17 నాటికి 90 రోజులు అవుతుందని, 17లోగా సమగ్రంగా అన్ని ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం సమర్పించిన నివేదికను ఇస్తే.. తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు అవకాశం ఉంటుందని గట్టు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు తరఫు న్యాయవాది విజయభాస్కర్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. నివేదికపై హైకోర్టు సంతృప్తి.. దర్యాప్తు పురోగతికి సంబంధించి పోలీసుల నివేదిక సంతృప్తికరంగా ఉందని, దర్యాప్తు తీరుతెన్నులపై పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నదే తమ ఉద్దేశమని ధర్మాసనం పేర్కొంది. నిర్ణీత గడువులోగా అన్ని ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసేలా చూడాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో దర్యాప్తు నివేదికను ఇవ్వాలని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణలోగా దర్యాప్తుపై స్థాయీ నివేదిక సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. చదవండి: బిట్టు శ్రీనుకు ఫోన్ ఇచ్చిన పుట్ట శైలజ, కేసు నమోదు -
పరిచయం: మహిళ వేధింపులతో యువకుడి ఆత్మహత్య
సాక్షి, పెద్దపల్లి : ఒక పరిచయం నిండు ప్రాణాన్ని తీసింది. మహిళ వేధింపుల కారణంగా గోదావరిఖని కేకేనగర్‌కు చెందిన కొయ్యాడ రమేశ్(33) సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల మానేరు సమీపంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఉపేందర్‌రావు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గోదావరిఖని కేకేనగర్‌కు చెందిన కొయ్యాడ రమేశ్ ఫొటోగ్రాఫర్. ఏడాదిక్రితం ఓ వివాహ వేడుకలో పెద్దపల్లికి చెందిన చింతల రమాదేవితో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఇద్దరిమధ్య ఫోన్లు, సందేశాలు నడిచాయి. ఈ క్రమంలో రమేశ్ నుంచి రమాదేవి రూ.6లక్షలు, రెండు తులాల బంగారం తీసుకుంది. కొద్దిరోజుల క్రితం రమేశ్ బంగారం, నగదు తిరిగి ఇమ్మని అడిగాడు. దీంతో రమాదేవి ఫోన్‌కాల్స్, చాటింగ్ సందేశాలు బయటపెడతానని బ్లాక్మెయిల్ చేసింది. మార్చి 28న పెద్దపల్లి పోలీసుస్టేషన్లో రమేశ్‌పై కేసు పెట్టింది. తాను నివాసం ఉంటున్న చోట పరువుపోయిందని, వేరే ప్రాంతంలో అద్దెకు ఇళ్లు చూస్తానని భార్యకు చెప్పి మార్చి 30న రమేశ్ బయటకు వెళ్లాడు. సాయంత్రంవరకు రాకపోవడంతో అతడి భార్య లావణ్య ఫోన్ చేసింది. రమాదేవి వేధింపులు భరించలేక చనిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. వెంటనే లావణ్య తన భర్త కనిపించడం లేదని గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల తరువాత శుక్రవారం సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామ సమీపంలోని మానేరువాగు వద్ద రమేశ్ మృతదేహం కనిపించింది. లావణ్య ఫిర్యాదుతో రమాదేవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చదవండి: ప్రేమ పేరుతో మోసం; యువతిని లైంగికంగా వాడుకొని.. -
ఎలుకలు కొరికిన కర్బూజ తిని.. ఇద్దరు చిన్నారులు మృతి
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం విసంపేటలో కలుషిత ఆహారం కలకలం రేపింది. ఎలుకలకు పెట్టిన మందు కలుషితమై ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. దారబోయిన శ్రీశైలం-గుణావతి దంపతులు ఇంట్లో ఎలుకల కోసం మందు పెట్టగా ఎలుకలు మందుతోపాటు కర్జూజ తిన్నాయి. ఆ కర్జూజను కుటుంబంలోని అయిదుగురు తిన్నారు. దీంతో అస్వస్థతకు కుటుంబ సభ్యులు గురికాగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు కుమారులు దారబోయిన శివానంద్(10), శరణ్ మృతి చెందారు. తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పుచ్చకాయ తినని చిన్నారుల తాతకు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: గోదావరిలో ఏడుగురు గల్లంతు, ఆరుగురు మృతి -
స్కూళ్లో అదృశ్యం.. తండ్రి ఫోన్ నెంబర్ మార్చకపోవడంతో
సాక్షి, పెద్దపల్లి: ప్రైవేటు పాఠశాలలో చదువుతూ హాస్టల్లో ఉంటున్న కుమారుడు ఆ రోజు తిరిగి హాస్టల్‌కు చేరలేదు. ఎక్కడికి వెళ్లాడో తెలియక తల్లిదండ్రులు ఒకటి రెండ్రోజులు కాదు.. ఏకంగా 11 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు. ఫోన్ నంబరు మార్చకపోవడం ఆ తండ్రికి అదృష్టంగా మారింది. పాత నంబరునే జ్ఞాపకం పెట్టుకున్న కుమారుడు ఫోన్ చేసి మంగళవారం తల్లిదండ్రుల వద్దకు చేరాడు. ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన నోముల రాంచంద్రారెడ్డి, శ్రీలత దంపతులకు ముగ్గురు కుమారులు కిషన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రాజు ఉన్నారు. రెండో కుమారుడు రవీందర్‌రెడ్డి 11 ఏళ్ల క్రితం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతూ హాస్టల్లో ఉండేవాడు. ఏం జరిగిందో గానీ అదృశ్యమైపోయాడు. తల్లిదండ్రులు అన్నిచోట్ల వెతికి చివరకు జమ్మికుంట పోలీసుస్టేషన్లో అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కొడుకు ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు. రెండు మూడు రోజులుగా రవీందర్‌రెడ్డి తండ్రికి ఫోన్ చేసి తన అన్న కిషన్‌రెడ్డి స్నేహితుడినని, అతనితో మాట్లాడాలని సెల్ నంబరు తీసుకున్నాడు. కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి తన వివరాలు చెప్పాడు. దీంతో కిషన్‌రెడ్డి తన బావ, స్నేహితులతో కలిసి కారులో రవీందర్‌రెడ్డి ఉంటున్న వికారాబాద్‌కు వెళ్లాడు. రవీందర్‌రెడ్డిని గుర్తించిన కిషన్‌రెడ్డి అతడితో కలిసి కూకట్‌పల్లిలో ఉంటున్న తన తమ్ముడు రాజు వద్దకు చేరుకున్నారు. తల్లిదండ్రులు కూడా అక్కడే రవీందర్‌రెడ్డిని కలిసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. వికారాబాద్‌లో ఎగ్జిబిషన్ వర్క్‌పై వచ్చిన రవీందర్‌రెడ్డి ఇక్కడ ఉంటున్న తన వారిని కలుసుకోవాలని ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. మరాఠీ మాట్లాడుతుండడంతో మహారాష్ట్రలో ఇన్నాళ్లు ఉండి ఉండవచ్చని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. చదవండి: 'నాకు రిటైర్మెంట్ వయసు పెంపు వద్దు' బడి పంతులుగా మారిన సర్పంచ్ -
సీబీఐ దర్యాప్తు అవసరం లేదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: వామన్‌రావు దంపతుల హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వామన్‌రావు తండ్రి కిషన్‌రావు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసుల దర్యాప్తు సరైన దారిలోనే సాగుతోందని, తాము స్వయంగా పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేసింది. సీబీఐకి అప్పగించడం ద్వారా జాప్యం జరిగే అవకాశముందని పేర్కొంది. ఇక వామన్‌రావు, నాగమణిల హత్య జరిగిన సమయంలో.. అక్కడున్న మూడు ఆర్టీసీ బస్సుల జనంలో ఐదుగురిని మాత్రమే సాక్షులుగా గుర్తించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఎక్కువ మంది వాంగ్మూలాలు తీసుకుని, సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. ఎక్కువ సాక్ష్యాలు నమోదు చేయాలి వామన్‌రావు దంపతుల దారుణహత్యపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణకు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. హత్య కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ల వాంగ్మూ లాలను సీఆర్పీసీ సెక్షన్ 164 కింద న్యాయమూర్తి ఎదుట రికార్డు చేశామని.. బిట్టు శ్రీను, లచ్చయ్యల వాంగ్మూలాల నమోదు కోనం అనుమతి కోరామని ధర్మాసనానికి వివరించారు. మొత్తం 25 మంది సాక్షుల్లో 19 మంది వాంగ్మూలాలు నమోదు చేశామన్నారు. హత్య జరిగిన సమయంలో మూడు ఆర్టీసీ బస్సులు ఉన్నాయని.. ఆ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లతోపాటు ఐదుగురిని సాక్షులుగా గుర్తించా మని వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘పట్టపగలు నడిరోడ్డు మీద ట్రాఫిక్‌ను ఆపి వందల మంది ముందు దారుణంగా న్యాయవాద దంపతులను హత్య చేశారు. వారికి కఠిన శిక్ష పడాల్సిన అవసరముంది. అసలు ఆ 3 బస్సుల్లో ఎందరు ప్రయాణిస్తున్నారు, అందులో ఐదుగురినే సాక్షులుగా గుర్తించడం ఏమిటి?’అని ప్రశ్నించింది. దీనికి ఏజీ వివరణ ఇస్తూ.. సాక్ష్యం ఇచ్చేందుకు ముందుకొచ్చిన వారి వాంగ్మూలాలు నమోదు చేశామని, కేసును రుజువు చేసేందుకు ఏమేరకు అవసరమనే లెక్కన అధికారులు దర్యాప్తు చేస్తున్నా రని చెప్పారు. అయితే కీలక కేసుల ను నిరూపించేందుకు ఎక్కువ సాక్షులను గుర్తించాల్సిన అవసరముందని కోర్టు పేర్కొంది. ఇక ఈ కేసులో నిందితులందరి సెల్ఫోన్లు సీజ్ చేశామని, రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని.. నివేదిక రాగానే దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ వేస్తామని ఏజీ వివరించారు. అలా చేస్తే జాప్యం జరుగుతుంది న్యాయవాద దంపతుల హత్య కలచివేసిందని, బాధిత కుటుంబం ఆవేదనను అర్థం చేసుకోగలమ ని ధర్మాసనం పేర్కొంది. స్థానిక పోలీసుల దర్యాప్తుపై తాము సంతృప్తికరంగానే ఉన్నామని, ఈ దశ లో దర్యాప్తును సీబీఐకి అప్పగించడం ద్వారా జా ప్యం జరిగే అవకాశముందంది. ఈ మేరకు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ఇప్పటివరకు దర్యాప్తు సరైన మార్గంలోనే సాగుతోంది. ఈ దశలో దర్యాప్తును సీబీఐకి అప్పగించడం ద్వారా చార్జిïÙట్ దాఖలులో జాప్యం జరిగే అవకాశం ఉంది’ అని ధర్మాసనం పేర్కొంది. చదవండి: లాయర్ల హత్య కేసు: మధ్యంతర నివేదిక సిద్ధం! -
లాయర్ల హత్య కేసు: మధ్యంతర నివేదిక సిద్ధం!
గోదావరిఖని(రామగుండం): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు–నాగమణిల హత్య కేసు మధ్యంతర నివేదిక సిద్ధమైనట్లు తెలిసింది. కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు, ఈ నెల 15న పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించడంతోపాటు జడ్జి సమక్షంలో నిందితులు, సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో నెలరోజులు సుదీర్ఘ విచారణ చేపట్టిన రామగుండం కమిషనరేట్ పోలీసులు నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. కేసు వివరాలను సోమవారం హైకో ర్టుకు సమర్పించనున్నారు. చార్జిషీట్ దాఖలు కోసం సాక్ష్యాల సేకరణ, నిందితుల గుర్తింపు, ఆయుధాల సేకరణ కోసం పోలీసులు ఏ1, ఏ2, ఏ3, ఏ4 నిందితులను మంథని కోర్టు అనుమతితో 14 రోజులపా టు జ్యుడీషియల్ రిమాండ్‌కు తీసుకున్నారు. హైకోర్టు నియమించిన ప్రత్యేక బృందంతోపాటు రామగుండం కమిషనరేట్ పోలీసులు నిందితులను వేర్వేరుగా విచారించారు. ఆయుధాల స్వాధీనం కోసం రెండ్రోజులు ఏ1 కుంట శ్రీను, ఏ2 చిరంజీవిని సుందిళ్ల బ్యారేజీ వద్దకు తీసుకెళ్లారు. ఆయుధాలు పడేసిన స్థలంలో విశాఖ గజ ఈతగాళ్లతో గాలించి రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. దుస్తులు, ఫోన్ల విషయంపై ఇంకా స్పష్టత లేదు. హత్యకు ఆయుధాలు సమకూర్చిన ఏ4 నిందితుడు, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనివాస్ నుంచి కూడా పోలీసులు కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. వామన్‌రావు కోర్టుకు వచ్చిన విషయాన్ని ఫోన్ ద్వారా సమాచా రం అందించిన ఏ5 నిందితుడు ఊదరి లక్ష్మణ్ అలియాస్ లచ్చయ్యను గత నెల 17న రిమాండ్‌కు తరలించారు. బిట్టు శ్రీనుకు సహకరించిన ఏ6 కాపు అనిల్‌ను విచారించిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. 120 మంది స్టేట్మెంట్ రికార్డు 120 మందికిపైగా ప్రత్యక్ష, పరోక్ష సాక్షులతోపాటు నిందితులతో సంబంధాలు ఉన్నవారిని, హతుల కుటుంబీకులు, స్నేహితులు, వాట్సాప్‌గ్రూప్ సభ్యులను పోలీసులు విచారణకు పిలిచి వారి స్టేట్మెం ట్ నమోదు చేశారు. ఇటు గుంజపడుగు గ్రామస్తుల స్టేట్మెంట్ కూడా రికార్డు చేసినట్లు తెలిసింది. 11 మంది ప్రత్యక్ష సాక్షులు ఇక ఈ జంటహత్యలకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నవారితోపాటు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వా మన్రావు చివరి మాటలను సెల్ఫోన్లో వీడియో రికార్డు చేసిన వ్యక్తి, మరో ఆరుగురు ప్రత్యక్ష సా క్షులను పోలీసులు విచారించినట్లు తెలిసింది. వా మన్రావు తండ్రి, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికుల నుంచి జడ్జి సమక్షంలో వివరాలు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. జడ్జి ఎదుట నిందితులను సాక్షులు గుర్తుపట్టినట్లు సమాచారం. 40 మంది పరోక్ష సాక్షులు జంటహత్యల కేసుకు సంబంధించి పోలీసులు 40 మంది ఇతర సాక్షులను విచారించినట్లు తెలిసింది. ఇందులో గుంజపడుగు గ్రామస్తులతోపాటు రాజకీ య పార్టీల నేతలు, వామన్‌రావు అడ్మిన్‌గా ఉన్న వా ట్సాప్ గ్రూపుల సభ్యులు, బిట్టు శ్రీను, చిరంజీవి వాట్సాప్ గ్రూపు సభ్యులు, కొందరు రాజకీయ నేతలను కూడా విచారణ చేసి కొంత సమాచారం రాబట్టినట్లు తెలిసింది. విచారణలో కీలకమైన ప్రత్యక్ష సాక్షుల రక్షణకు హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మంథని పోలీసులు ఇప్పటికే వామన్‌రావు తల్లిదండ్రులకు రక్షణ కల్పించారు. ప్రత్యక్ష సాక్షులను ప్రభావితం చేసే అవకాశమున్న నేపథ్యంలో పోలీసులు వారి వివరాలు గోప్యంగా ఉంచుతూనే గట్టిభద్రత కల్పించారు. ఇక సుమారు 2 వేల పేజీలతో పోలీసులు ని వేదిక తయారు చేసినట్లు తెలిసింది. దీన్ని హై కోర్టుకు సమర్పించేందుకు కేసును పర్యవేక్షిస్తున్న రామగుండం కమిషనరేట్ అడిషనల్ డీసీపీ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. చదవండి: కుంట శ్రీనివాస్ ఆడియో క్లిప్.. గుడి కూలిపోతే -
న్యాయవాద దంపతుల హత్యపై సీన్ రీ కన్స్ట్రక్షన్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. రామగుండం డీసీపీ (అడ్మిన్) ఎన్.అశోక్‌కుమార్ ఆ«ధ్వర్యంలో బుధవారం నిందితులతో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయించారు. పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు నుంచి వామన్‌రావు దంపతులు బయలుదేరిన సమయంలో నిందితులు ఎక్కడ ఉన్నారు..? ఎలా వెళ్లారు..? మంథని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పూలే విగ్రహం, కోర్టు, ప్రధాన చౌరస్తా, పాత పెట్రోల్ బంక్ ప్రాంతాల్లో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. అనంతరం ముగ్గురు నిందితులను రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు. హత్యకు పాల్పడిన రోజు వాహనాలను ఎక్కడ నిలిపివేశారు.. న్యాయవాద దంపతుల వాహనాన్ని ఎక్కడ దాట వేశారు.. తెలంగాణ చౌరస్తా వద్ద వాహనాలు ప్రయాణించిన తీరును పరిశీలించారు. కాల్‌డేటా విశ్లేషణ హత్య జరిగిన రోజు నిందితులు కుంట శ్రీను, చిరంజీవి, అక్కపాక కుమార్, బిట్టు శ్రీను సెల్ఫోన్ల నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్లాయనే విషయంపై కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. వారి నుంచి కాల్ వచ్చిన ప్రతి ఒక్కరినీ రామగుండం కమిషనరేట్‌కు పిలిపించుకుని వాళ్ల స్టేట్మెంట్ను రికార్డు చేసుకుంటున్నారు. వారు ఎందుకు కాల్ చేశారు..ఈ హత్యలతో ఇతరులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. దీంతో సాధారణంగా నిందితుల నుంచి కాల్స్ వచ్చిన వారంతా బెంబేలెత్తిపోతున్నారు. ఈ కేసు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, పోలీసు కస్టడీలోకి తీసుకున్న ముగ్గురు ప్రధాన నిందితుల సమయం గురువారంతో ముగియనుంది. బిట్టు నోరు మెదిపేనా..! జంట హత్యలకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు తుల్సెగారి శ్రీనివాస్ ఉరఫ్ బిట్టు శ్రీను నోరు తెరిస్తే మరిన్ని నిజాలు వెల్లడి కానున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం రూ.30 వేల ఆదాయం కోల్పోయాననే కక్షతో ఈ దారుణానికి పూనుకున్నారా..? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతుండటంతో ఆ దిశగా పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఐదో నిందితుడి అరెస్టులో జాప్యం న్యాయవాద దంపతులు కోర్టు నుంచి బయలు దేరే సమాచారం ఐదో నిందితుడు లచ్చయ్య ఇచ్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే.. ఇతడిని అదుపులోకి తీసుకొని వారం గడిచినా అరెస్టు చూపించడంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. -
వింత వ్యాధితో 4వేల కోళ్లు మృతి!
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): వింతవ్యాధి సోకి 4వేల కోళ్లు మృతి చెందిన సంఘటన కాల్వశ్రీరాంపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. కాల్వశ్రీరాంపూర్‌లో పెద్దంపేట మాజీ సర్పంచ్ దాసరి స్వామి నాటుకోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. మార్కెట్లో అమ్మేందుకు ఎదురుచూస్తున్న తరుణంలో వింత వ్యాధి సోకి చనిపోతున్నట్లు బాధితుడు తెలిపాడు. వీటి విలువ రూ.8 లక్షలు ఉంటుందని పేర్కొన్నాడు. ఈ విషయమై వైద్యాధికారి డాక్టర్ సురేశ్‌గౌడ్‌ను సంప్రదించాడు. కాగా కోళ్లకు రానిఖేట్ వ్యాధి సోకిందని, మృతి చెందిన కోళ్లను గుంత తీయించి పూడ్చి పెట్టాలని సూచించామని చెప్పారు. మృతి చెందిన కోళ్ల శ్యాంపిల్‌ను ల్యాబ్‌కు పంపించినట్లు వివరించారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు. చదవండి: తెలంగాణ సచివాలయంలో నాగుపాము కలకలం -
న్యాయవాదుల హత్య: కీలక ఆధారాలు లభ్యం
సాక్షి, పెద్దపల్లి : హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసు నిందితులు ఉపయోగించిన ఆయుధాల వెలికితీత ఆపరేషన్ ముగిసింది. విశాఖపట్నం నుంచి వచ్చిన డైవర్స్ బృందం పెద్దపల్లి జిల్లా సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీలో 2 రోజులు సుమారు 10 నుంచి 15 మీటర్ల లోతున్న నీటిలో శ్రమించి రెండు కత్తులను బయటకు తీశారు. ఆదివారం ఆయుధాలు లభ్యం కాకపోవడంతో సోమవారం మళ్లీ ఇద్దరు నిందితులను బ్యారేజీ వద్దకు తీసుకొచ్చారు. ఓ పక్క డైవర్స్ గాలింపు చేస్తుండగానే, పోలీసులు 3 కిలోల బరువున్న 5 అయస్కాంతాలను తెప్పించారు. స్థానికుల సాయంతో నీటిలో వెతికించారు. సాయంత్రం సమయంలో 53–54వ పిల్లర్ల మధ్యలో రెండు కత్తులను డైవర్లు కనుగొని.. బయటికి తెచ్చారు. ఆ కత్తులను నిందితులకు చూపించగా అవేనని అంగీకరించారు. పంచనామా నిర్వహించిన తర్వాత కత్తులను రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు తరలించారు. జ్యుడీషియల్ కస్టడీకి బిట్టు శ్రీను మంథని: న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు బిట్టు శ్రీను జ్యుడీషియల్ కస్టడీకి పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు అనుమతి ఇచ్చింది. హత్య కేసులో శ్రీనును గత నెల 22న అరెస్టు చేసిన పోలీసులు 23న అర్ధరాత్రి దాటిన తర్వాత రిమాండ్‌కు తరలించారు. శ్రీనును తమ కస్టడీకి ఇవ్వాలని రామగిరి పోలీసులు శనివారం మంథని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం వాదనల అనంతరం ఏడు రోజుల కస్టడీకి మంథని జడ్జి అనుమతి ఇచ్చారు. ఇదే కేసులో ఏ1, ఏ2, ఏ3 నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్ల ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ గడువు ఈ నెల 4తో ముగుస్తుంది. చదవండి! న్యాయవాదుల హత్య: పోలీసుల తీరుపై హై కోర్టు ఆగ్రహం న్యాయవాదుల హత్య కేసు: వామన్‌రావు ఆడియో వైరల్ ‘కేసీఆర్‌కు పుట్టా మధు సన్నిహితుడు’ -
న్యాయవాదుల హత్య: పోలీసుల తీరుపై హై కోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది దంపతులు హత్యపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. న్యాయవాద దంపతులు గట్టు వామాన్ రావు, నాగమణి హత్యలపై ఇప్పటి వరకు పోలీసులు జరిపిన నివేదికను అధికారులు హైకోర్టుకు సమర్పించారు. విచారణ సందర్భంగా పోలీస్‌శాఖపై హైకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఎంతమందిని సెక్షన్ 164 కింద ఇన్వెస్టిగేషన్ చేశారు.. ఎంతమందిని మంథిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని హైకోర్టు అధికారులను ప్రశ్నించింది. ఏ2, ఏ3ల స్టేట్మెంట్ని ఎందుకు సెక్షన్ 164 కింద ఇంకా నమోదు చేయలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుల క్రిటికల్ స్టేట్మెంట్ని ఎందుకు రికార్డు చేయలేదని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు. బాధితులను అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నప్పుడు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు చేయలేదని అడిగారు. మెజిస్ట్రేట్‌ని తీసుకొచ్చి వారి ముందర స్టేట్మెంట్ తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. అయితే హత్య జరిగిన ప్రాంతం నుంచి పోలీసులు మొబైల్ ఫోన్స్, రక్తపు మరకలను, కాల్‌డాటాని, నిందితులు వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఏజీ తేలిపారు. హత్య చేసిన నేరస్తుల నుంచి సీఆర్పీపీసీ సెక్షన్ 164 క్రింద వాంగ్మూలం ఎందుకు సేకరించలేదన్న హైకోర్టు ప్రశ్నకు ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఏజీ తెలిపారు. రెండు బస్సుల డ్రైవర్లను కూడా సాక్షులుగా గుర్తించామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష సాక్షులకు ఎటువంటి రక్షణ కల్పించారో తెలపాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. పోలీసులు అన్ని రక్షణ కార్యక్రమాలు, తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఏజీ తెలిపారు. హత్య చేసిన నేరస్తుల నుంచి సీఆర్పీసీ సెక్షన్ 164 క్రింద వాంగ్మూలం ఎందుకు సేకరించలేదని హైకోర్ట్ ప్రశ్నించింది. ఇందుకు పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వారి స్టేట్మెంట్ రికార్డు చేశారని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షులు గుర్తించామని తెలిపిన ఏజీ.. త్వరలోనే వారి స్టేట్మెంట్లను మేజిస్ట్రేట్ వద్ద రికార్డ్ చేస్తామని కోర్టుకు తెలిపారు. నేరస్థుల నుంచి నుంచి ఇంకా కావాల్సిన సాక్షాలు సేకరించవలసి ఉందన్నారు. అందుకే సీఆర్పీసీ సెక్షన్ 161 కింద స్టేట్మెంట్ రికార్డు చేశామని తెలిపారు. పూర్తి సాక్ష్యాలు సేకరించడానికి గాను మరో రెండు వారాల సమయం కావాలని ఏజీ కోరడంతో తదుపరి విచారణను ధర్మాసనం మార్చ్ 15కు వాయిదా వేసింది. పెద్దపల్లిలో జరిగిన న్యాయవాదుల హత్య ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ దారుణంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని పేర్కొంది. చదవండి: న్యాయవాదుల హత్య కేసు: వామన్‌రావు ఆడియో వైరల్ న్యాయవాదుల హత్య: పోలీసులపై విమర్శలు -
ఆ తల్లిని ఓదార్చడం ఎవరితరము కాలే!
వెల్గటూరు(ధర్మపురి): ఓ డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం చిన్నారి ప్రాణాలను బలిగొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. మండలంలోని రాజారాంపల్లి గ్రామానికి చెందిన దాసరి హరీశ్(7) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఎస్సై ప్రేమ్‌కుమార్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి పోచయ్య–సత్తమ్మకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు హరీశ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. స్కూలు లేక పోవటం వల్ల హరీశ్ అతడి పెద్దనాన్న కొడుకు ఇద్దరూ తాతతో కలిసి గ్రామ శివారులో మేకల వద్దకు వెళ్లారు. ఈనేపథ్యంలో ఎండ బాగా కొడుతుందని, ఇంటికి వెళ్లండని తాత చెప్పడంతో ఇద్దరూ ఇంటికి బయలు దేరారు. గ్రామంలోని వరంగల్–రాయపట్నం హైవే రోడ్డుదాటే క్రమంలో ధర్మారం నుంచి లక్షెట్టిపేట వైపు వెళ్తున్న ఏపీ01ఎక్స్3483 నంబర్ గల తూఫాన్ వాహనం హరీశ్‌ను వేగంగా ఢీకొట్టంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకొని కొడుకు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: ప్రాంక్ వీడియో: బాలికలతో అసభ్య ప్రవర్తన -
కలకలం రేపుతున్న ఆడియో టేపు
-
న్యాయవాదుల హత్య కేసు: వామన్‌రావు ఆడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన న్యాయవాది గట్టు వామన్ రావు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం సృష్టిస్తుంది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై గట్టు వామన్ రావు మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శ్రీధర్ బాబు తనను అవమానపర్చాడని, నీతిలేని వ్యక్తి అని వేరే వ్యక్తితో వామన్ రావు చెప్పుకొచ్చాడు. 20 ఏళ్ళుగా దుద్దిళ్ల శ్రీపాద రావు కుటుంబానికి దూరంగా ఉన్నానని, నేనంటే ఏమిటో చూపిస్తానని తెలిపారు. నీవు పోటీ చేస్తే నాకు ఇబ్బంది అవుతుందని శ్రీధర్ బాబు శరణు కోరాడని, ఆయన అనుభవిస్తున్న పదవి తాను పెట్టిన బిక్షే అంటూ వామన్ రావు కామెంట్ చేశారు. పుట్ట మధు, శ్రీధర్ బాబు బాధితులు ఎందరో ఉన్నారని వారంతా మీకు అండగా నిలుస్తారని మరో వ్యక్తి వామన్ రావుతో చెప్పారు. చాలా రోజుల క్రితం రికార్డు అయిన ఆడియో ఇప్పుడు బయటికి రావడం అందరినీ ఆశ్చర్యానికి ఆందోళనకు గురిచేస్తోంది. చదవండి: న్యాయవాదుల హత్య: పోలీసులపై విమర్శలు సంచలన విషయాలు వెల్లడించిన బిట్టు శ్రీను! -
న్యాయవాదుల హత్య: పోలీసులపై విమర్శలు
సాక్షి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో పోలీసులు తీరుపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. జంట హత్యలు జరిగి పది రోజులు గడిచినా పురోగతి కనిపించట్లేదని దుయ్యబడుతున్నాయి. పోలీసులు మాత్రం తమకు లభించిన ఆధారాల మేరకే దర్యాప్తు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని గొడవలు, వ్యక్తిగత కక్షలే హత్యలకు కారణమనే కోణంలోనే కేసు దర్యాప్తు జరుగుతోందని ప్రతిపక్షాలు, న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ కోణం బహిర్గతం కాలేదని పోలీసులు చెబుతున్నారు. జెడ్పీ చైర్మన్ మేనల్లుడు బిట్టు శ్రీను హత్యకు సహకరించినా.. అది వ్యక్తిగత వైరంతోనే అని పోలీసులు చెబుతున్నారు. కాగా, భవిష్యత్తులో కేసును సీబీఐకి లేదా సిట్‌కు బదిలీ చేసినా, తమ దర్యాప్తును తోసిపుచ్చకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. జ్యుడీషియల్ రిమాండ్ నుంచి పోలీస్ కస్టడీకి వచ్చిన ముగ్గురు నిందితులు కూడా విచారణలో కొత్త విషయాలు వెల్లడించట్లేదని తెలుస్తోంది. అరెస్టయినప్పుడు చెప్పిన కారణాలనే పునరావృతం చేస్తున్నట్లు చెబుతున్నారు. గ్రామ కక్షలపైనే ఫోకస్ గట్టు వామన్‌రావు దంపతుల హత్యకు సొంత గ్రామం గుంజపడుగులో నాలుగు నెలల కిందటే ప్లాన్ వేసినా.. గ్రామంలో జనం ఎక్కువగా ఉండటంతో వీలు కాలేదని విచారణలో తేలినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గ్రామంలో తన సొంత సోదరుడి చేతిలో సర్పంచిగా ఓడిపోయిన తనను ఆర్థికంగా నష్టపరచడమే కాకుండా.. పెద్దమ్మ దేవాలయ నిర్మాణాన్ని, తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నాడనే కసి కుంట శ్రీనివాస్‌లో ఉంది. గ్రామంలోని శ్రీ రామస్వామి గోపాలస్వామి దేవాలయ కమిటీ విషయంలో ఏర్పడ్డ వివాదాలకు కూడా గట్టు వామన్‌రావు కారణమని భావించి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ మేనల్లుడు బిట్టు శ్రీనుతో కలసి హత్యకు ప్లాన్ చేశాడనేది పోలీసుల వాదన. ఇప్పటివరకు పోలీసులు సేకరించిన ఆధారాలు కూడా ఈ కోణంలోనే కన్పిస్తున్నాయి. గురువారం రామగుండం సీపీ కార్యాలయంలో ఆలయ కమిటీ వివాదంపై విచారణ జరిపారు. రెండు ఆలయాల్లో కమిటీ సభ్యుల్లో బ్రాహ్మణ, ముదిరాజ్, మున్నూరు కాపు, ఎస్సీ తదితర సామాజికవర్గాల వారు ఉన్నారు. గ్రామంలో నెలకొన్న మూడు వివాదాల చుట్టే పోలీసులు కేసును నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిట్టు శ్రీనుకు చంపించేంత కక్ష ఉందా? సోదరుడి చేతిలో అవమానాల పాలు కావడం, ఇల్లు, గుడి నిర్మాణాలను నిలిపివేయించడం, ఓ దేవాలయం కమిటీ విషయంలో అడ్డంకులు సృష్టించడం వంటి కారణాలతో గట్టు వామన్‌రావును చంపాలని కుంట శ్రీను కక్ష పెంచుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ హత్యలో పాలుపంచుకున్న బిట్టు శ్రీనుకు మాత్రం అంత కక్ష ఎందుకు పెంచుకున్నాడనే విషయంలో పోలీసులు చెబుతున్న కారణాలు అంత బలంగా లేవు. నెలకు రూ.30 వేల రాబడి వచ్చే చెత్త ట్రాక్టర్ కాంట్రాక్టు రద్దు, పుట్ట లింగమ్మ ట్రస్ట్‌లో అవకతవకలు జరిగాయని సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం, కేసులు వేయడంతోనే గట్టు వామన్‌రావుపై కక్ష పెంచుకున్నాడని బిట్టు శ్రీనుపై అభియోగాలు మోపారు. అయితే ఇక్కడే పోలీసులు విచారణ లోతుగా జరపట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుక క్వారీలు, ఇతరత్రా అక్రమాల్లో రూ.వందల కోట్లు ఆర్జించారని కోర్టుల్లో దావాలు వేసిన గట్టు వామన్‌రావు.. ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకున్నారు. దళిత యువకుడి హత్య కేసు అందులో ప్రధానమైంది. పుట్ట లింగమ్మ ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆదాయ మార్గాలేంటి? ఇందులో అవకతవకలు జరిగాయని హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వామనరావు ఫిర్యాదులు చేశారు. ఈ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న బిట్టు శ్రీనుకు ఇక్కడే కక్ష పెరిగిందని అర్థమవుతోంది. ఈ కోణంలో పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపితే కొత్త కోణాలు ఏవైనా బయటకు వస్తాయో చూడాలి. పోలీసుల కస్టడీలో ముగ్గురి విచారణ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ముగ్గురు ప్రధాన నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్‌లను తమ కస్టడీలోకి తీసుకొని రామగుండం కమిషనరేట్‌లో పోలీసులు విచారిస్తున్నారు. డీసీపీ అశోక్‌కుమార్ నేతృత్వంలో సీసీఎస్ పోలీసులు వివిధ కోణాల్లో వారి నుంచి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. కాగా, హత్యకు ఉపయోగించిన కత్తులను సుందిళ్ల బ్యారేజీలో పడవేసిన నేపథ్యంలో వాటిని స్వాధీనం చేసుకునేందుకు గజ ఈతగాళ్లను విశాఖపట్నం నుంచి రప్పించినట్లు తెలిసింది. వీరు శనివారం సుందిళ్ల బ్యారేజీలోకి దిగనున్నారు. -
న్యాయవాద దంపతుల హత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణిల దారుణహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ‘‘అధికార పార్టీ నేతలపై, పోలీసులపై, స్థానిక రాజకీయ నాయకుల అక్రమాలపై వామన్‌రావు, నాగమణి అనేక కేసులు వేశారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అక్రమాలపై కూడా హైకోర్టులో కేసులు వేశారు. దీంతో తన కుమారుడు, కోడలిపై పుట్ట మధుకర్, ఆయన అనుచరులు వ్యక్తిగత ద్వేషం పెంచుకున్నారు. పుట్ట మధుకర్‌కు నేరచరిత్ర ఉంది. గతంలో ఆయనపై రౌడీషీట్ ఉండటంతోపాటు అనేక క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయి. ఓ వివాదంలో పుట్ట మధుకర్‌పై వామన్‌రావు గోదావరిఖని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే మంథని మున్సిపల్ చైర్మన్, మధుకర్ భార్య శైలజ ఎన్నికను సవాల్ చేస్తూ పీవీ నాగమణి ఎన్నికల పిటిషన్ కూడా దాఖలు చేశారు. శీలం రంగయ్య అనే వ్యక్తి పోలీసు కస్టడీలో మృతి చెందిన ఘటనపై లాకప్‌డెత్‌గా పేర్కొంటూ నాగమణి రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించి దర్యాప్తునకు ఆదేశించింది. మైనింగ్, ఇసుక మాఫియాకు చెందిన వారే రంగయ్యను హత్య చేయించారని వామన్‌రావు నాకు చెప్పాడు. నా కుమారుడి హత్య వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ తన కుమారుడిపై గతంలో అవాస్తవాలను ప్రచారం చేశారు. ఆయన ఆధ్వర్యంలో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం లేదు. నిందితులు అధికార పార్టీకి చెందిన నేతలు. నిందితులతో స్థానిక పోలీసులకు సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ సహా స్థానిక పోలీసు అధికారులను వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయాలి. హత్య ఘటనపై పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈనెల 17న నమోదైన క్రైమ్ నంబర్ 21/2021 దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి’’అని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ ఒకటి, రెండ్రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, న్యాయవాద దంపతుల హత్యకు నిరసనగా బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
న్యాయవాదుల హత్య: నేడు కత్తుల వెలికితీత
గోదావరిఖని/వరంగల్: హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణిల హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ నెల 17న వారిద్దరూ హత్యకు గురైన విషయం తెలిసిందే. కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌ను రామగుండం కమిషనరేట్ పోలీసులు గురువారం జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం ఉదయం వరంగల్ జైలుకు వెళ్లి ప్రత్యేక ఎస్కార్ట్ మధ్య రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు తరలించారు. జైలు నుంచి నిందితులను రామగుండం తరలించేసరికి సాయంత్రం కావడంతో హత్యకు ఉపయోగించిన కత్తుల వెలికితీతను వాయిదా వేశారు. కత్తులను నిందితులు సుందిళ్ల బ్యారేజీలో పడేసిన విషయం తెలిసిందే. పది మీటర్ల లోతులో ఉన్న వీటిని శుక్రవారం వెలికితీయనున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు జంటహత్యల్లో ఎవరి పాత్ర ఏమిటి, సహకరించిందెవరనే దానిపై మరింత లోతుగా విచారించనున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జంట హత్యల కేసుపై హైకోర్టు, గవర్నర్ సైతం స్పందించడంతో పోలీసులు ప్రతీదీ సాక్ష్యాధారాలతో సహా సేకరిస్తున్నారు. చదవండి: ప్రశ్నించే గళాలకు ఇదా శిక్ష?! -
సంచలన విషయాలు వెల్లడించిన బిట్టు శ్రీను!
సాక్షి, పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వామన్‌రావు హత్యకు నాలుగు నెలల క్రితమే ప్లాన్ చేసినట్లు అతడు వెల్లడించాడు. అడ్వకేట్ వామన్‌రావు బతికి ఉంటే తమకు ఎన్నటికైనా సమస్యేనని భావించిన కుంట శీను, తాను హత్యకు పథకం రచించినట్లు పేర్కొన్నాడు. కాగా బిట్టు శ్రీనుకు సంబంధించిన పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టుపై వామన్‌రావు గతంలో అనేక కేసులు వేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం తమ స్వగ్రామం గుంజపడుగులోనే పాత స్కూల్ బిల్డింగ్ నుంచి రెక్కీ నిర్వహించిన శ్రీను గ్యాంగ్.. ఆయనను హత్య చేసేందుకు ప్రయత్నించింది. అయితే అక్కడ జనసమ్మర్ధం ఎక్కువగా ఉండటంతో వారి పన్నాగం విఫలమైంది. దీంతో ఈనెల 17వ తేదీన పక్కాగా ప్లాన్ చేసిన దుండగులు.. వామన్‌రావు ఒంటరిగా దొరకడంతో ఆయనతో పాటు భార్యను కూడా హతమార్చారు. వారిద్దరు చనిపోయారని నిర్దారించుకున్న తర్వాత కుంట శీను, బిట్టు శ్రీనుకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో అతడిని మహారాష్ట్రకు పారిపొమ్మని బిట్టు శ్రీను సలహా ఇచ్చాడు. తాను మాత్రం రెండు రోజులు ఇంట్లోనే మకాం వేశాడు. అంతేగాక హత్యకు ముందు వేరే సిమ్ కొనుగోలు చేసిన బిట్టు శ్రీను వాటి ద్వారానే తన భాగస్వాములతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ పెద్దపల్లి జంట హత్యల కేసును త్వరిగతిన ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. బిట్టు శ్రీనును అతడి ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు. చదవండి: 3 నిమిషాల ముందు వెళ్లి.. 5 నిమిషాల్లో హత్య చేసి.. -
3 నిమిషాల ముందు వెళ్లి.. 5 నిమిషాల్లో హత్య చేసి..
సాక్షి, కరీంనగర్: న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్యలకు నిందితులు రెండు గంటల్లోనే ప్లాన్ చేసి అమలు చేసినట్లు పోలీసులు తేల్చారు. హత్యకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలను నిందితుల ‘రిమాండ్ కేస్ డైరీ’లో వివరించారు. వామన్‌రావు దంపతుల కన్నా 3 నిమిషాల ముందు మాత్రమే నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి నల్ల బ్రీజా కారులో వెళ్లి కల్వచర్ల వద్ద మాటు వేసినట్లు వీడియో ఫుటేజీల్లో రికార్డు అయిన సమయాన్ని విశ్లేషిస్తే తెలుస్తోంది. హత్యాకాండను ఐదారు నిమిషాల్లోనే పూర్తిచేసి తిరిగి మంథని వైపు వెళ్లినట్టు తేలింది. 2.26 గంటల నుంచి... హత్య జరిగిన 17వ తేదీ మధ్యాహ్నం 2:26.38 గంటలకు నిందితులు ఉపయో గించిన నంబర్ లేని బ్రీజా కారు పొన్నూరు క్రాస్‌రోడ్స్‌లో కనిపించింది. 2:27 గంటలకు సెంటినరీ కాలనీలోని తెలంగాణ చౌరస్తా వద్దకు వచ్చింది. వీరి వెనుకే గట్టు వామన్‌రావు దంపతులు ప్రయాణిస్తున్న క్రెటా కారు 2:29 గంటలకు పొన్నూరు క్రాస్‌రోడ్స్ వద్ద పెద్దపల్లి వైపు వెళ్లగా 2:30.09 గంటలకు తెలంగాణ చౌరస్తా వద్ద క్రాస్ అయింది. అంటే, నిందితుల కారుకు, న్యాయవాద దంపతుల కారుకు మధ్య నున్న సమయ వ్యత్యాసం 3 నిమిషాలే. తెలంగాణ చౌరస్తా నుంచి హత్య జరిగిన ప్రాంతానికి రెండున్నర కి.మీ. దూరం ఉండగా కారులో 2 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంది. దీనిని బట్టి హత్య 2:32 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. ఐదారు నిమిషాల్లోనే హత్యలు చేసి నిందితులు తిరుగు ప్రయాణమై సీసీటీవీ ఫుటేజీల్లో చిక్కారు. 2:41 గంటలకు హత్యకు వాడిన బ్రీజా కారు తెలంగాణ చౌరస్తాలోకి చేరుకోగా, వీరిని వెంబడించిన కుంట శ్రీనివాస్‌కు చెందిన వైట్ క్రెటా కారు కూడా 2:42 గంటలకే తెలంగాణ చౌరస్తాలో కనిపించింది. బిట్టు శ్రీనుకు కుంట శ్రీను కాల్.. వామన్‌రావు దంపతులు మంథని కోర్టుకు రావడాన్ని కుంట శ్రీనివాస్ 17న మధ్యాహ్నం 12:45 గంటలకు బిట్టు శ్రీనుకు చెప్పినట్టు ఫోన్కాల్డేటాను బట్టి తెలుస్తోంది. దీన్ని నిర్ధారించుకోమని బిట్టు శ్రీను అనడంతో కుంట శ్రీనివాస్.. పూదరి లచ్చయ్యకి కాల్ చేసి వామన్‌రావు వచ్చాడో లేదో చెప్పాలన్నాడు. దీంతో 12:47 గంటలకు లచ్చయ్య కాల్ చేసి వామన్‌రావు రాకను నిర్ధారించాడు. అప్పుడు కుంట శ్రీనివాస్ మంథని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం లొకేషన్ నుంచి మాట్లాడినట్టు కాల్‌డేటా ఆధారంగా గుర్తించారు. అప్పటి నుంచి ఫోన్ కాల్స్ ద్వారానే కుంట శ్రీనివాస్(ఏ1), బిట్టు శ్రీను(ఏ4), పూదరి లచ్చయ్య(ఏ5), చిరంజీవి (ఏ2), కుమార్ (ఏ3)లు మాట్లాడుకుంటూ ఉన్నారు. హత్యకు ముందు 2:15 గంటలకు చిరంజీవికి చివరి ఫోన్‌కాల్ చేసిన కుంట శ్రీనివాస్.. అతడిని తీసుకుని కారులో 17 నిమిషాల్లోనే స్పాట్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. గుంజపడుగులో పోలీసుల విచారణ.. హత్యకు గ్రామంలోని కక్షలే కారణమని నిందితులు పేర్కొనడంతో మంథని మం డలం గుంజపడుగులో పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు ఉపయోగించిన కత్తులు తయారు చేసిన బాబు, రఘు, శ్రీనులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కరీంనగర్ జైలులో ఉన్న నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌లను భద్రతా పరమైన కారణాల నేపథ్యంలో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.