Telangana Cultural Society Provides Financial Assistance To Srinivas - Sakshi
Sakshi News home page

Telangana Cultural Society: పెద్దపల్లి వాసికి తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్‌)ఆర్థిక సహాయం

Published Fri, Aug 11 2023 12:10 PM | Last Updated on Fri, Aug 11 2023 12:52 PM

Telangana Cultural Society Provides Financial Help To Srinivas - Sakshi

ప్రమాదంతో మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఆపరేషన్‌కు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆర్థిక సహాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన గండికోట శ్రీనివాస్‌ గతేడాది ప్రమాదంలో గాయపడి కుడి చేతిని కోల్పోవడంతో పాటు కుడికాలికి అయిన గాయాలతో మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే శస్త్రచికిత్సకు కావల్సిన ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నాడని ఓ మిత్రుని ద్వారా తెలుసుకున్న తెలంగాణ కల్చరల్‌ సొసైటీ(సింగపూర్‌) మానవతా దృక్పథంతో డబ్బు సహాయం అందించారు. ఇటీవలె శ్రీనివాస్‌ తండ్రి మరణించడంతో పాటు, అతని తల్లి కూడా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారన్న విషయం తెలిసి తెలంగాణ కల్చరల్ సొసైటి ఇచ్చిన పిలుపు మేరకు కొందరు సభ్యులు, దాతలు ముందుకు వచ్చి రెండు లక్షల ఎనభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

సొసైటీ  అధ్యక్షుడు గడప రమేశ్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి సహా మిగతా సభ్యులు శ్రీనివాస్‌ కుటుంబంతో వీడియో కాల్‌లో మాట్లాడి పరామర్శించారు. ఈ సందర్భంగా క్లిష్ట పరిస్థితుల్లో తనకు సహాయం అందించిన సొసైటీ సభ్యులకు శ్రీనివాస్‌ ధన్యవాదాలు తెలియజేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement