Telangana Cultural Society Singapore
-
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షునిగా గడప రమేష్ బాబు ఎన్నిక
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) అధ్యక్షుడిగా వరుసగా రెండోసారి గడపా రమేష్ బాబు ఎంపికయ్యారు. నవంబర్ 17వ తేదీన జరిగిన పదకొండో వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సభ ప్రారంభంలో సభ్యులందరు గోనె నరేందర్ రెడ్డి సొసైటీకి చేసిన సేవలను స్మరించుకుని నివాళులు అర్పించారు. అనంతరం 2023-2024 ఆర్థిక సంవత్సరపు రాబడి ఖర్చు వివరాలకు సభ ఆమోదం తెలిపింది.2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లు గార్లపాటి లక్ష్మా రెడ్డి, బండారు శ్రీధర్‌కు సభ్యులు కృతజ్ణతలు తెలిపారు. అలాగే రెండోసారి అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన గడప రమేశ్ బాబు, ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుండి నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారి దోర్నాల చంద్ర శేఖర్ ప్రకటించారు. తనకు రెండోసారి సేవచేసే అవకాశం ఇచ్చినందుకు గడప రమేష్ అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని అభివృద్ధి చేయడానికి మరింత కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా కార్య, కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దీనితో పాటు 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా కిరణ్ కైలాసపు , తెల్లదేవరపల్లి వెంకట కిషన్ రావును కొత్త ఆడిటర్లుగా ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో ముఖ్యమైన మార్పులు గత 8 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన బసిక ప్రశాంత్ కుమార్ ఈ సారి ఉపాధ్యక్షులుగా, ప్రాంతీయ కార్యదర్శులుగా సేవలు అందించిన బొందుగుల రాము, నంగునూరు వెంకట రమణ ఈ సారి ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారిగా, కోశాధికారిగా సేవలు అందించిన జూలూరి సంతోష్ కుమార్ ఈ సారి ఉపాధ్యక్షులుగా సేవలు అందించబోతున్నారు. దీంతో నూతన కార్యవర్గం మరియు కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకట రమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, దుర్గ ప్రసాద్ ఎం, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు, శశిధర్ రెడ్డి, బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, సంతోష్ వర్మ మాదారపు మరియు రవి కృష్ణ విజ్జాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్, శివ ప్రసాద్ ఆవుల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రవి చైతణ్య మైసా, చల్లా క్రిష్ణ మరియు సుగుణాకర్ రెడ్డి మొదలగు వారు ఉన్నట్టు తెలిపారు. సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్యవర్గ సభ్యులు గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, గింజల సురేందర్ రెడ్డి, ఆరూరి కవిత సంతోష్ రెడ్డి, నగమడ్ల దీప, కిరణ్ కుమార్ వీరమల్లు & రంగా పట్నాల గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
టీసీఎస్ఎస్ ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూత
తెలంగాణ కల్చరల్ సొసైటి (సింగపూర్) ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి (54) 11 సెప్టెంబర్ 2024 న తమ సొంత నివాసం లో తీవ్ర గుండెపోటు కు గురై స్థానిక ఎంగ్ టెంగ్ ఫాంగ్ జనరల్ హాస్పిటల్ లో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మృతి విషయం తెలుసుకున్న సింగపూర్ లో ఉన్న ఇరు తెలుగు రాష్ట్రాల వారితో పాటు స్థానిక మిత్రులందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు. సొసైటీ సభ్యులు ఈ బాధా సమయం లో నరేందర్ గారు సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సరిహద్దులు దాటి సింగపూరుకొచ్చి, తెలుగోల్లకు తోబుట్టువై, సాగరతీరంలో స్వాతి చినుకువై, సంస్కృతి సంప్రదాయానికి నిలువుటద్దమై, తంగేడుపువ్వుల జాడ చెప్పి, బతుకమ్మకు వన్నె తెచ్చి, పోత రాజుల పౌరుషం పులి రాజుల గాంభీర్యం మాకు పరిచయం చేసి, బోనం అంటే నరేంద్రుడు బతుకమ్మకు పెద్దకొడుకు అంటూ నరేందర్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. టీసీఎస్‌ఎస్‌కు అందించిన సేవలు చాలా గొప్పవంటు ఆయనకు జోహార్లు అర్పించారు. వందల సంఖ్యలో మిత్రులు సందర్శనకు వచ్చి ఆశ్రు నివాళి అర్పించారు. మృదు స్వభావి, ఎప్పుడు ప్రతి ఒక్కరిని చిరు నవ్వుతో పలకరించే వారనీ, సింగపూర్ లో ఉన్న తెలుగు వాసులకు చేసిన సేవలను కొనియాడారు. ఈ దుఃఖ సమయంలో తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ సభ్యులు ఆయన కుటుంబం వెన్నంటే ఉండి అన్ని విషయాలలో సహాయ సహకారాలు అందించి, ఆయన పార్థీవ దేహాన్ని ఇండియాకు తరలించారు. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు తోడుగా గోనె నరేందర్ సమీప బంధువు ఓరిగంటి శేఖర్ రెడ్డి గారు వారి వెంట ఇండియాకు తోడు వెళ్లారు.వెల్గటూర్ గ్రామం, కొత్తపేట్ మండలం, జగిత్యాల జిల్లా కు చెందిన గోనె నరేందర్ గారు గత 25 సంవత్సరాల క్రితం సింగపూర్‌కి వచ్చారు. ప్రస్తుతం కుటుంబంతో సహా శాశ్వత నివాస హోదాలో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఒక కూతురు , కుమారుడు. ఉన్నారు. -
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో జూమ్ ద్వారా ఉదయం శ్రీ వినాయక చవితి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈసందర్భంతగా బాల వినాయక పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు కుటుంబ సమేతంగా ప్రత్యక్ష పూజలో పాల్గొని, ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్‌కు పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ గారు అంతర్జాలం ద్వారా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి ,కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు , మణికంఠ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.అందరిపై వినాయకుని ఆశీస్సులుgడాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారికి చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలిపారు.ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ ,ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మై హోమ్ APAS బిల్డర్స్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, మకుట డెవలపర్స్ , జీ ఆర్ టి అర్ట్లాండ్స్ , లైవ్ స్పేస్ ఇంటీరియర్ & రేనోవేషన్స్ , SVS శ్రీవసుధ ట్రూ వెల్త్ ఇండియా మరియు ఎవోల్వ్ గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
సింగపూర్‌లో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో వైభవంగా అయోధ్య శ్రీరామ పవిత్ర అక్షింతల వితరణ మహోత్సవం జరిగింది. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) వారు భారత దేశం నుండి ప్రత్యేకంగా తెప్పించిన అయోధ్య శ్రీ రాముల వారి ప్రాణ ప్రతిష్ట అక్షింతలు సింగపూర్ లో నివసిసిస్తున్న భక్తులకు అందజేసే శుభకార్యాన్ని అదే రోజు జనవరి 22 న ఇక్కడి చాంగి విలేజ్ లో ఉన్న శ్రీ రాముని గుడిలో కన్నుల పండుగలా నిర్వహించారు. ఇటువంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఇక్కడి దేవాలయాల్లో నిర్వహించే అవకాశం దక్కడం సొసైటీకి దక్కిన పుణ్యం అని అక్కడి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులందరూ భక్తిశ్రద్ధలతో రామ నామ స్మరణ చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం, అందరూ ప్రసాదంతో పాటు అక్షింతలు కూడా స్వీకరించి శ్రీ రాముని ఆశీసులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా జై శ్రీ రామ్ అనే నామస్వరణతో మారుమ్రోగింది. ఈ వేడుకల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు ఆ రాముని సేవలో భక్తితో పరవశించి పోయారు. ఈ మహోత్సవంలో సుమారు 1000 మంది వరకు భక్తులు పాల్గొని అయోధ్య శ్రీరామ పవిత్ర అక్షింతలను స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న కొందరు భక్తులు మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాన్ని సింగపూర్‌లో నిర్వహించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపుతు అభినందించారు. దీంతో పాటు సొసైటీ స్థాపన నుండి ఎలాంటి ఆడంబరాలకు పోకుండా, లాభాపేక్ష లేకుండా విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న సొసైటీని స్థానికులు కొనియాడారు. తెలుగు వారితో పాటు ఇతర భక్తులు పెద్ద ఎత్తున రాముని సేవలో పాల్గొని విజయవంతంగా జరిగేందుకు తోడ్పడిన, సహాయ సహకారాలు అందించిన దాతలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున టీసీఎస్ఎస్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకటరమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి మొదలగు వారు భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. భారత్ నుండి ఈ పవిత్ర అక్షింతలను సింగపూర్‌కు చేర్చడంలో ముఖ్య పాత్ర పోషించిన గోనె నరేందర్ రెడ్డికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా శ్రీరామ ఆలయ అధికారులు మాట్లాడుతూ.. ఈ ఆలయంలో ఇటువంటి పుణ్య కార్యక్రమం నిర్వహించడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని తెలుపుతూ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన: డల్లాస్‌లో పండుగ వాతావరణం! ) -
ఆపరేషన్‌కు డబ్బులు లేక ఇబ్బంది.. ఆదుకున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ
ప్రమాదంతో మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఆపరేషన్‌కు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆర్థిక సహాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన గండికోట శ్రీనివాస్ గతేడాది ప్రమాదంలో గాయపడి కుడి చేతిని కోల్పోవడంతో పాటు కుడికాలికి అయిన గాయాలతో మంచానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే శస్త్రచికిత్సకు కావల్సిన ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్నాడని ఓ మిత్రుని ద్వారా తెలుసుకున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ(సింగపూర్) మానవతా దృక్పథంతో డబ్బు సహాయం అందించారు. ఇటీవలె శ్రీనివాస్ తండ్రి మరణించడంతో పాటు, అతని తల్లి కూడా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారన్న విషయం తెలిసి తెలంగాణ కల్చరల్ సొసైటి ఇచ్చిన పిలుపు మేరకు కొందరు సభ్యులు, దాతలు ముందుకు వచ్చి రెండు లక్షల ఎనభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. సొసైటీ అధ్యక్షుడు గడప రమేశ్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి సహా మిగతా సభ్యులు శ్రీనివాస్ కుటుంబంతో వీడియో కాల్లో మాట్లాడి పరామర్శించారు. ఈ సందర్భంగా క్లిష్ట పరిస్థితుల్లో తనకు సహాయం అందించిన సొసైటీ సభ్యులకు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశాడు. -
సింగపూర్‌లో తెలంగాణ బలగం అలయ్ బలయ్
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఫ్యామిలీ డేను తెలంగాణ బలగం అలయ్ బలయ్ -2023 పేరిట ఇక్కడి సింగపూర్ పుంగ్గోల్ పార్క్ లో ఆదివారం (జూన్ 4) ఉత్సాహంగా నిర్వహించారు. ఈ ఫ్యామిలీ డేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుమారు 400 మంది ప్రవాసులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని, ఆటలను భావి తరాలకు అందించడానికి TCSS సభ్యులు వివిధ రకాల భారతీయ సంప్రదాయ ఆటలైన సంచి దుంకుడు, అష్టాచెమ్మ, పచ్చీస్, కచ్చకాయలు, గోళీలాట, తొక్కుడు బిళ్ళ, చార్ పల్లి, కోకో, చిర్రగోనే వంటివి ఆడించి బహుమతులు అందజేశారు. ఈ అలయ్ బలయ్ లో సర్వపిండి, పచ్చి పులుసు, చల్ల చారు, బాగారా మొదలగు నోరూరించే తెలంగాణ వంటకాలను అందరికి రుచి చూపించారు. తెలంగాణ బలగం అలయ్ బలయ్ విజయవంతంగా జరగడానికి సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి TCSS అధ్యక్షుడు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, సదానందం అందె, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా శశిధర్ రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, రాధికా రెడ్డి నల్ల, కల్వ లక్ష్మణ్ రాజు, శ్రీకాంత్ కొక్కుల వ్యవహరించారు. కార్యక్రమంలో నాగ భూషణ్ రెడ్డి, రమాదేవి మల్లారెడ్డి, సందీప్. ఎమ్, ముశ్రమ్ మహేష్ తదితరులు తమ ఇంటి రుచులను అందరికీ రుచి చూపించారు. కార్యక్రమ స్పాన్సర్స్ ఏపిజే అభిరామీ జువెల్లర్స్, మై హోమ్ సయుక్, జోయాలుకాస్, ఎస్పీసిస్ నెట్, వైష్ణవి ఇన్ ఫ్, గరంటో ఎకాడమి వారికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
సింగపూర్ పూరమ్ ఉత్సవాల్లో బతుకమ్మ ఆట
సింగపూర్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళ త్రిసూర్ పూరమ్ వార్షిక సాంస్కృతిక ఉత్సవాలు ప్రేరణగా సింగపూర్‌లోని 'గార్డెన్స్ బై ది బే' లోని 'ది మీడోస్' లో ఆదివారం (28 మే) 'సింగపూర్ పూరమ్' పేరిట సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించారు. 2019 నుంచే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ కోవిడ్ నిబంధనల కారణంగా గత రెండు సంవత్సరాలుగా నిర్వహించడం లేదు. కోవిడ్ నిబంధనలు తొలగించిన అనంతరం ఈ ఏడాది వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. సింగపూర్ లో నివసిస్తున్న వివిధ భారతీయ రాష్ట్రాలకు చెందిన వారు తమ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ కళలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) మహిళా విభాగం ఈ అంతర్జాతీయ వేదికపై తెలంగాణ గుండె చప్పుడు బతుకమ్మ ఆట పాటలను ప్రదర్శించారు. ప్రపంచంలో అందరూ పూలతో పూజిస్తే ఆ పూలనే పూజించే తెలంగాణ ప్రత్యేక సంప్రదాయానికి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఈ వేడుకల్లో బతుకమ్మ ప్రదర్శనకు అవకాశం ఇచ్చిన సింగపూర్ పూరమ్ 2023 కార్యవర్గ సభ్యులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల్లో బతుకమ్మ ఆటను ప్రదర్శించిన వారిలో సొసైటీ ఉపాధ్యక్షురాలు సునీతా రెడ్డి, మహిళా విభాగ సభ్యులు గడప స్వాతి, బసిక అనితా రెడ్డి, జూలూరి పద్మజ, రాధికా రాణి నల్ల, దీప నల్లా, కాసర్ల వందన, నడికట్ల కళ్యాణి, సృజన వెంగళ, బొందుగుల ఉమా రాణి, సౌజన్య మాదారపు, గర్రెపల్లి కస్తూరి, కల్వ కవిత, రోహిణి గజ్జల, స్వప్న కైలాసపు, కీర్తి ముగ్దసాని, నాగుబండి శ్రీలత, మంచికంటి స్వప్న, బవిరిశెట్టి కృష్ణ చైతన్య, మడిచెట్టి సరిత, సుజాత తరిగొండ, శిల్ప రాజేష్ తదితరులు ఉన్నారు. పూరమ్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ సాంస్కృతిక పండుగలో పాల్గొని ఈ కొత్త సంప్రదాయాన్ని తోటి ప్రవాస భారతీయులతో పాటు, సింగపూర్ స్థానికులకు పరిచయం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులను అభినందించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథి సింగపూర్ దేశ ఆర్థిక, జాతీయ అభివృద్ధి శాఖలకు ద్వితీయ మంత్రిగా సేవలందిస్తున్న భారతీయ మూలాలున్న ఇంద్రాణి రాజా పాల్గొని కార్యక్రమ నిర్వాహకులను, కళాకారులను అభినందించారు. -
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఏప్రిల్ 23 న ఇక్కడి హెల్త్ అండ్ సైన్సు అథారిటీ (HSA) సమక్షంలో, 11 ఔట్ రమ్ రోడ్ లో ఏర్పాటు చేసిన TCSS రక్త దాన శిబిరం విజయవంతం అయింది. వరుసగా గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఈ రక్తదాన శిబిరాన్ని TCSS నిర్వహిస్తుంది. సొసైటీ పిలుపు మేరకు ఎంతో మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ శిబిరం లో పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భంగా హెల్త్ అండ్ సైన్సు అథారిటీ ఆఫ్ సింగపూర్ అధికారులు మాట్లాడుతూ దశాబ్దానికి పైగా క్రమం తప్పకుండా ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం అన్నారు. మరియు ఎల్లప్పుడూ ఇలాంటి లాభాపేక్ష లేని సామాజిక కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ ని కొనియాడడం తో పాటు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా రవి చైతన్య మైస, సంతోష్ వర్మ మాదారపు , వెంకట రమణ వ్యవహరించారు. సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల , సంతోష్ వర్మ మాదారపు , ఇతర సభ్యులు ముక్కా కిషోర్, ముక్కా సతీష్, వినయ్ చంద్, నవీన్ కటకం, మల్లిక్ పల్లెపు, నవీన్ నోముల,సాయి బాలె తదితరులు రక్తదానం చేశారు. ఈ రక్తదాన సేవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వారందరికి సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, కమిటీ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల ధన్యవాదాలు తెలిపారు. -
సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ నూతన కార్యవర్గం
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) తొమ్మిదో వార్షిక సర్వ సభ్య సమావేశం నవంబర్ 27వ తేదీన స్థానిక ఆర్య సమాజ్‌లో జరిగింది. ఈ సమావేశంలో కమిటీ ఎనిమిదో సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2021-2022 ఆర్థిక సంవత్సరపు రాబడి, ఖర్చుల పట్టికను వివరించి, ఆమోదం పొందింది. 2021-2022 ఆర్థిక సంవత్సర ఆడిటర్లు కిరణ్ కుమార్ ఎర్రబోయిన, శివ రెడ్డి అద్దులకు కమిటీ కృతజ్ణతలు తెలిపింది. నూతన అధ్యక్షుడుగా గడప రమేశ్ బాబుతోపాటు, కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారులు పెద్దపల్లి వినయ్ కుమార్, ముద్రకోల నవీన్ ప్రకటించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించి ఇక్కడి తెలంగాణ వాసులకు సేవ చేసే అవకాశం ఇస్తున్నందుకు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానన్నారు. దీనితో పాటు 2022-2023ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా మద్దికుంట్ల రాజు, శేఖర్ రెడ్డి ఓరుగంటి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షులు నీలం మహేందర్ మాట్లాడుతు సొసైటీ చేసిన కార్యక్రమాలను వివరించారు. సొసైటీ సంస్థాగత అధ్యక్షులు బండా మాధవ రెడ్డి విలువైన సలహాలు అందించారు. సొసైటీకి ఇంతకాలం సేవలందించిన నీలం మహేందర్, గర్రెపల్లి శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్ చెన్నోజ్వల, గార్లపాటి లక్ష్మారెడ్డి, కొల్లూరి శ్రీధర్, గింజల సురేందర్ రెడ్డి, వినయ్ కుమార్ పెద్దపల్లి తదితరులకు జ్ఞాపిక అందజేశారు. నూతన కార్య వర్గం నూతన కార్య వర్గం, కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు, నల్ల భాస్కర్ గుప్త, గోనె నరేందర్ రెడ్డి, మిర్యాల సునీత రెడ్డి, దుర్గ ప్రసాద్ మంగలి ప్రాంతీయ కార్యదర్శులు, నంగునూరి వెంకట రమణ, బొండుగుల రాము, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజ్జాపూర్, కార్యవర్గ సభ్యులుగా పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, బొడ్ల రోజా రమణి, శివప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, రాధికా రెడ్డి, సదానందం అందె, రవి చైతణ్య మైసా, విజయ మోహన్ వెంగళ ఉన్నారు. -
డా.పద్మజా రెడ్డిని సత్కరించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)
నాలుగు దశాబ్దాలుగా కూచిపూడి సాంప్రదాయ నృత్యంతో కాకతీయ సాంప్రదాయ వారసత్వ కీర్తిని బావి తరాలకు అందించేందుకు ఎంత గానో కృషి చేస్తున్నారు పద్మశ్రీ గ్రహీత డా. పద్మజా రెడ్డి గడ్డం. ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సొసైటీ తరపున శాలువాతో ఆమెను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం పద్మజా రెడ్డి మాట్లాడుతూ.. తనను సత్కరించిన సొసైటీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని భావి తరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సన్మాన సభలో సొసైటీ తరపున అధ్యక్షులు నీలం మహేందర్, కోశాధికారి లక్ష్మణ్ రాజు కల్వ, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, ప్రాంతీయ కార్యదర్శులు, జూలూరి సంతోష్, కార్యవర్గ సభ్యులు కాసర్ల శ్రీనివాస రావు, రవి క్రిష్ణ విజ్జాపూర్, శశి ధర్ రెడ్డి, భాస్కర్ నడికట్ల ప్రాంతీయ కార్యదర్శి నంగునూరి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. -
TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ (TCSS-(సింగపూర్) ఆధ్వర్యంలో జూమ్ ద్వారా శ్రీ వినాయక చవితి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సకల విఘ్నాలు తొలగి అందరిపై వినాయకుని ఆశీస్సులు ఉండాలని, ప్రపంచాన్ని కరోనా నుండి కాపాడాలని కోరారు. ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్ కు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ అంతర్జాలం ద్వారా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా నడికట్ల భాస్కర్, నంగునూరి సౌజన్య, శివ ప్రసాద్ ఆవుల మరియు, రవి కృష్ణ విజాపూర్ వ్యవహరించారు. సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, సునీత రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్, రోజా రమణి, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, ప్రవీణ్ మామిడాల, శశిధర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ లు సంబరాల్లో పాల్గొన్న భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. అందరి పై శ్రీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారితో పాటు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియ జేశారు. -
singapore: తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్(టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో జూన్ 27 న ఇక్కడి హెల్త్ అండ్ సైన్సు అథారిటీ (హెచ్ఎస్ఏ) సమక్షంలో, 11 ఔట్ రమ్ రోడ్ లో ఏర్పాటు చేసిన టీసీఎస్ఎస్ రక్త దాన శిబిరం-2021 విజయవంతం అయ్యింది. వరుసగా గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ రక్తదాన శిబిరాన్ని టీసీఎస్ఎస్ నిర్వహిస్తుంది. సొసైటీ పిలుపు మేరకు ఎంతో మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ శిబిరం లో పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భంగా హెల్త్ అండ్ సైన్సు అథారిటీ ఆఫ్ సింగపూర్ అధికారులు మాట్లాడుతూ.. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సామాజిక దూరం పాటిస్తూ ఈ శిబిరం నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఎల్లప్పుడూ ఇలాంటి లాభాపేక్ష లేని సామాజిక కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ ని కొనియాడడం తో పాటు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా గోనె నరేందర్ రెడ్డి, శివ ప్రసాద్ ఆవుల మరియు ప్రవీణ్ మామిడాల వ్యవహరించారు. ఈ రక్తదాన సేవ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేసిన వారందరికి సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేశ్, ఉపాధ్యక్షులు భాస్కర్ గుప్త నల్లా మరియు ఇతర సభ్యులు, శశిధర్ రెడ్డి, ధన్యవాదాలు తెలియచేశారు. ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిస్తాయని తెలిపారు. చదవండి: అమెరికాలోనే ఉండనివ్వండి.. భారతీయ యువత అభ్యర్ధన -
సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ సంక్రాంతి సంబరాలు
సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు సంక్రాంతి సంబరాలను జూమ్ ద్వారా శనివారం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సొసైటీ సభ్యులు పండుగ ప్రాముఖ్యతను చక్కగా వివరించారు. పతంగి తయారీ, బొబ్బెమ్మల తయారీతో పాటు, చిత్ర లేఖనం, పాటలు, నృత్యాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. దీంతో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించి ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఎన్నుకున్న ముగ్గులకు బహుమతులు అందజేశారు. సంబరాల్లో భాగంగా చిన్నారులు వేసిన హరిదాసు వేష ధారణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్ కాలమాన ప్రకారం జ్యోతిష్యులచే ప్రత్యేకంగా ముద్రించిన క్యాలెండర్‌ను విడుదల చేశారు. పండుగలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భావితరాలకు మన పండుగల ప్రాముఖ్యతని తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా, సంబరాలకు చేయూత, సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి టీసీఎస్ఎస్ కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంబరాలను ఆన్లైన్లో వేలాది మంది వీక్షించారు. సంబరాలు విజయవంతంగా జరగటానికి సహయం అందించిన దాతలకు, స్పాన్సర్స్‌కు, ప్రతి ఒక్కరికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి మొదలగువారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా రోజా రమణి, సునీత రెడ్డి, రజిత గోనె, కల్వ లక్ష్మణ్ రాజు, ప్రవీణ్ మామిడాల, రవి కృష్ణ విజాపూర్, సహవ్యాఖ్యాతగా సంతోషి కూర వ్యవరించారు. ఈ సందర్భంగా సొసైటీ సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, గింజల సురేందర్ రెడ్డి, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ సంబరాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
టీసీఎస్ఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఏడవ వార్షిక సర్వ సభ్య సమావేశం ఆదివారం జూమ్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో టీసీఎస్ఎస్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. ప్రస్తుత అధ్యక్షుడు నీలం మహేందర్ని.. కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుండి నామినేషన్ రావడంతో ఎలాంటి పోటీ లేకుండానే మరోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో మరోసారి బాధ్యతను అప్పగించి, ఇక్కడి తెలంగాణ వాసులకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు. నూతన కార్యవర్గంలో సొసైటీ అధ్యక్షులుగా నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, నల్ల భాస్కర్ గుప్త, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్, బొడ్ల రోజారమణి, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, గింజల సురేందర్ రెడ్డి, శ్రీధర్ కొల్లూరి, చకిలం ఫణిభూషణ్, గజ్జి రమాదేవి, నగమడ్ల దీప, ఆరూరి కవిత, గర్రేపల్లి కస్తూరి, వీరమల్లు కిరణ్, రంగ పట్నాల ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక వర్గ సభ్యులుగా పెరుకు శివరామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల, పట్టూరి కిరణ్ కుమార్, రవి కృష్ణ కాసర్ల శ్రీనివాస్‌లను ప్రకటించారు. -
5న సంబవాంగ్ పార్క్‌లో సింగపూర్ బతుకమ్మ వేడుకలు
సంబవాంగ్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో సంబవాంగ్ పార్క్‌లో అక్టోబర్ 5న జరగబోయే సింగపూర్ బతుకమ్మ పండుగ సంబరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి టీసీఎస్ఎస్ సభ్యులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ బతుకమ్మ పండుగకు ప్రవేశం ఉచితమని, ఉత్తమ బతుకమ్మలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా, సంబరాలకు చేయూత, సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి టీసీఎస్ఎస్ కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. సింగపూర్‌లో ఉన్న తెలంగాణవాసులే కాకుండా తెలుగు వారందరితోపాటూ, మిగతా రాష్ట్రాల ప్రజలు కూడా ఈ సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీసీఎస్ఎస్ కోరింది. సంబరాలు విజయవంతంగా నిర్వహించడానికి సహయం అందిస్తున్న దాతలకు, ప్రతి ఒక్కరికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు బొడ్ల రోజా రమణి, అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి, కల్వ రాజు, దిలీప్, శివ ప్రసాద్ ఆవులలు కృతజ్ఞతలు తెలియజేశారు. -
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఉగాది 2019 వేడుకలు ఘనంగా జరిగాయి. సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిపారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 800 మంది ప్రవాసీ తెలంగాణ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి, ప్రసాదం దాతలకు సొసైటీ తరపున అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు నంగునూరి వెంకట్ రమణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, జూలూరి పద్మజ, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ, ఆవుల శివ ప్రసాద్‌లు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా నంగునూరి వెంకట్ రమణ, గోనె నరేంద్ర, కల్వ రాజు, రోజా రమణి, పద్మజ, ప్రసాద్‌లు వ్యవహరించారు. -
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో సింగపూర్‌లోని సంబవాంగ్ పార్క్‌లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు ఆటా పాటాలతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో సంబరాలు మిన్నంటాయి. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడారు. సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు వారందరికీ, స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేసి, గత పది సంవత్సరాలుగా పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా టీసీఎస్ఎస్ చరిత్రలో నిలిచిపోయిందని సొసైటీ సభ్యులు తెలిపారు. ఇది సొసైటీ స్వచ్చంద సేవకు, కృషి కి దక్కిన గొప్ప గౌరవం అని పేర్కొన్నారు. ఈ సంబురాల్లో ఉత్తమ బతుకమ్మ, ఉత్తమ సాంప్రదాయ వేషదారణకు బహుమతులు ఇచ్చారు. ఈ సంబురాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్ తెలిపారు. బతుకమ్మ వేడుకలు విజయవంతంగా జరుగుటకు సహాయం అందించిన దాతలకు, ప్రతి ఒక్కరికి ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చెన్నోజ్వాల ప్రవీణ్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్ రెడ్డి, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి మరియు కల్వ రాజు మొదలగు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. బతుకమ్మ పండుగ ఘనంగా జరగడానికి తోడ్పాటు అందించిన ప్రతీ ఒక్కరికి పేరు పేరున కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలకు సమన్వయ కర్తలుగా గోనె రజిత, నల్ల దీప, జూలూరి పద్మజ, భారతి, సుప్రిత, సారిక, దివ్య, రేణుక, రోజా రమణి, నరేష్ మరియు గంగాధర్‌లు వ్యవహరించారు. స్పాన్సర్స్ మలబార్ గోల్డ్ & డైమండ్స్, వాంగో, కుమార్ ప్రోపోనేక్స్, ఎన్ఆర్ఈ ఫ్యాషన్స్, సింగ్ ఎక్స్, రియో కాఫీ, గురు అకాడమి, ఏఎస్ఎమ్ ప్యూర్ సిల్వర్, రాయల్ రిట్రీట్, రవీందర్ గుజ్జుల, హేమ సుభాష్ రెడ్డి, ముద్దం విజేందర్, సతీష్ శివనాతుల, ఇతర దాతలకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతున్న సింగపూర్
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో అక్టోబర్ 13న సింగపూర్‌లోని సంబవాంగ్ పార్క్‌లో బతుకమ్మ పండుగ సంబరాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంబరాల్లో, ఉత్తమ బతుకమ్మలకు, ఉత్తమ సాంప్రదాయ వేషధారణలో వచ్చిన చిన్నారులకు ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయని, గ్రాండ్ లక్కీ డ్రాలో అదృష్ట విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలకు చేయూత, సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి టీసీఎస్ఎస్ కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే సంబరాల్లో పాల్గొనే వారందరికి సరిపడే ఆహారం, ఇతర ఏర్పాట్లు చేశామన్నారు. ఈ బతుకమ్మ పండుగకు ప్రవేశం ఉచితమని, సింగపూర్‌లోని తెలుగువారే కాకుండా మిగతా రాష్ట్రాలకుచెందినవారు పెద్ద ఎత్తున రావాలని టీసీఎస్ఎస్ కోరింది. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి అహర్నిశలు కష్టపడుతువారికి, దాతలకు టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, జింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి, కల్వ రాజులతోపాటూ పలువురికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల కరపత్రాలని టీసీఎస్ఎస్ సభ్యులు విడుదల చేశారు. -
29న సింగపూర్‌లో బోనాలు
సింగపూర్: విదేశాల్లో కూడా తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలు విరాజిల్లుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పండుగల్లో ఒక్కటైన బోనాల జాతరను సింగపూర్‌లో అంగరంగ వైభవంగా జరపడానికి తెలంగాణ కల్చరల్ సోసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) సిద్దమైంది. బోనాల జాతరను జులై 29(ఆదివారం) రోజున స్ధానిక శ్రీ అరకేసరి శివన్ టెంపుల్లో సాయంత్రం 05:30 నుంచి కన్నుల పండుగగా జరుపడానికి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాతరకు సింగపూర్‌లో ఉన్న తెలుగు వారందరూ పాల్గొనాల్సిందింగా కోరారు. రిజిస్ట్రేషన్ కోసం https://goo.gl/WJdPL4 లో లాగిన్ కావాల్సిందిగా నిర్వాహకులు తెలిపారు. బోనాల జాతర ఏర్పాట్లను లక్ష్మారెడ్డి, గోనే నాగెందర్, సురేందర్ రెడ్డి, రాము, ఉమేందర్, పద్మజ, కళ్యాణి, సృజన తదితరులు పర్యవేక్షిస్తున్నారు. -
శోక సముద్రంలో తెలంగాణ కల్చరల్ సొసైటి
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్(టీసీఎస్ఎస్) ఉపాధ్యక్షులు, వ్యవస్థాపక సభ్యులు బూర్ల శ్రీనివాస్ (42) స్థానిక చాంగి జనరల్ హాస్పిటల్లో సోమవారం మృతి చెందారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న సింగపూర్ లో ఉన్న ఇరు తెలుగు రాష్ట్రాల వారితో పాటు స్థానికులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బూర్ల శ్రీనివాస్ గత 15 సంవత్సరాల నుంచి తన కుటుంబంతో సహా శాశ్వత నివాస హోదాలో సింగపూర్‌లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ పార్థివదేహాన్ని మంగళవారం మిత్రుల సందర్శనార్థం ఉంచారు. వందల సంఖ్యలో సందర్శనకు వచ్చిన వారు ఆశ్రు నివాళులు అర్పించారు. శ్రీనివాస్ సింగపూర్ లో ఉన్న తెలంగాణ వాసులకు చేసిన సేవలను కొనియాడారు. ఆయన మృదు స్వభావి, మరియు ప్రతి ఒక్కరిని చిరు నవ్వుతో పలకరించే వారని గుర్తు చేసుకొన్నారు. ఈ దుఃఖ సమయంలో తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ సభ్యులు ఆయన కుటుంబం వెన్నంటే ఉండి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించి, ఆయన పార్థీవ దేహాన్ని ఇండియా కు తరలించారు. వారి కుటుంబానికి తెలంగాణ కల్చరల్ సొసైటి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఆయన కుటుంబ సభ్యులకు తోడుగా టీసీఎస్ఎస్ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి వారి వెంటే భారత్‌కు వచ్చారు. ఆదిలాబాద్‌లో కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. మంత్రి జోగు రామన్న శ్రీనివాస్ భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. -
సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
-
సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. బుకిత్ పంజాంగ్ లోని శ్రీ మురుగన్ హిల్ ఆలయంలో పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ విళంబి నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 400 మంది ప్రవాసి తెలంగాణ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగస్వామ్యులైన వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణి చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులు, ప్రసాద దాతలకు సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, ఉపాధ్యక్షులు నీలం మహేందర్, బూర్ల శ్రీనివాస్, పెద్ది శేఖర్ రెడ్డి, ముదం అశోక్, కోశాధికారి గడప రమేశ్, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, యెల్ల రామ్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు, గార్లపాటి లక్ష్మా రెడ్డి, నల్ల భాస్కర్ గుప్త, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివ రామ్ ప్రసాద్, ఆర్ సి రెడ్డి, మొగిలి సునీత, గోపగోని దాము, చిల్క సురేశ్, చెట్టిపెల్లి మహేష్, పింగిలి భరత్‌లు ధన్యవాదాలు తెలిపారు. వీరితో పాటు గోనె నరేందర్, భగవాన్ రెడ్డి, సురేందర్, సంతోష్, ఆర్మూర్ నవీన్, నంగునూరి వెంకట్ రమణ, జయ లక్ష్మిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్టు సొసైటీ ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
రాహుల్‌కి టీసీఎస్ఎస్ సభ్యుల సన్మానం
సింగపూర్ : గ్లోబల్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి సింగపూర్ వచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీని స్థానిక మరీనా బే సాండ్స్ హోటల్ లో తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్(టీసీఎస్ఎస్) కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్ర కళ సాకారం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీకి టీసీఎస్ఎస్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. క్షణం తీరిక లేకపోయినా తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ సభ్యులకు సమయం కేటాయించినందుకు గాను సొసైటీ సభ్యులు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రాహుల్ గాంధీతో సమావేశానికి సహకరించిన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మధు యాష్కికి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్. పి. శ్రావణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశం అనంతరం స్థానిక సన్ టెక్ కన్వెన్షన్ కేంద్రం లో జరిగిన చర్చాగోష్టి లో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశాలలో సొసైటీ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, ఉపాధ్యక్షులు, నీలం మహేందర్, పెద్ది చంద్ర శేఖర్ రెడ్డి, బూర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్, కోశాధికారి గడప రమేష్, ప్రాంతీయ కార్యదర్శి యేళ్ల రామ్ రెడ్డి, కమిటీ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మారెడ్డి, పింగ్లి భరత్, నల్ల భాస్కర్, ఇతర సభ్యులు అనుపురం శ్రీనివాస్, గోనె నరేందర్, దుంతుల సుభాష్, జూలూరు సంతోష్, పట్లురి రాములు పాల్గొన్నారు. -
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్
సింగపూర్ : సింగపూర్‌లోని వుడ్ లాండ్స్ లో గ్రీన్ వుడ్ ప్రైమరీ స్కూల్ స్పోర్ట్స్ హాల్ లో తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ - 2017 నిర్వహించారు. ఈ టోర్నీలో సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మొత్తం ఐదు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, ఉమెన్స్ సింగిల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్సుడ్ డబుల్స్ కేటగిరీ లలో టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. టీసీఎస్ఎస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2017 విజేతల వివరాలు: ఉమెన్స్ సింగిల్స్ : విన్నర్- రుద్రమదేవి రమేశ్ దగ్గుపాటి, రన్నర్ అప్- రాజేశ్వరి యెర్రం ఉమెన్స్ డబుల్స్: విన్నర్స్- రుద్రమదేవి రమేశ్ దగ్గుపాటి/పొట్టూరి తులసి గిరీష్, రన్నర్ అప్- కస్తూరి గర్రెపల్లి/రమ్య జానపతి మిక్స్డ్ డబుల్స్: విన్నర్స్- రుద్రమదేవి రమేశ్ దగ్గుపాటి / అన్నం పవన్ కుమార్, రన్నర్ అప్- రాజేశ్వరి యెర్రం/కులశేఖర్ రీగన్ మెన్స్ సింగిల్స్: విన్నర్- ఈసర్ల రమాపతి, రన్నర్ అప్- పొట్టూరి వర ప్రసాద రాజు మెన్స్ డబుల్స్: విన్నర్- భరద్వాజ్ కేసంసెట్టి / ద్వారకనాథ్ మిట్టా, రన్నర్ అప్- అన్నం పవన్ కుమార్ /లక్ష్మణ కుమార్ మంగెన ఈ టోర్నమెంట్ కు సమన్వయ కర్తలుగా నర్రా ఆర్ సి రెడ్డి, గార్లపాటి లక్ష్మా రెడ్డి, సురేశ్ చిల్క, ఏళ్ల రామ్, చెట్టిపల్లి మహేశ్, గడప రమేష్ బాబులు వ్యవహరించారు. ఈ సందర్భంగా సొసైటి సభ్యులు మాట్లాడుతూ, సింగపూర్ లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందజేయడం కొరకు వివిధ పండుగలను జరుపుకోవడమే కాకుండా సింగపూర్ లో నివసిస్తున్న ప్రవాస తెలుగు వారి లో క్రీడాస్పూర్తి ని పెంపొందించేందుకు వివిధ ఆటల పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నీలో పాల్గొని విజయ వంతం చేసిన క్రీడాకారులందరికి కృతజ్ఞతలు తెలిపి, విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోటీలను సొసైటి అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్, కార్యవర్గ సభ్యులు గర్రెపల్లి శ్రీనివాస్‌లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ విజయవంతం కావడానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి, అంపైర్లకు, ప్రత్యేకంగా అన్నే అన్నె వంశీ కృష్ణ (జానిక్), సునీల్ సుబద్ర రాజు, రవి కుమార్ నీరుడు (కుమార్ ప్రాపర్టీస్)లకు సొసైటి కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
సింగపూర్‌లో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో స్థానిక శ్రీ శివన్ టెంపుల్లో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. చంద్ర మాన క్యాలెండర్లో అత్యంత శుభప్రదమైన నెలలలో ఒకటి అయిన కార్తీక మాసంలో ఏర్పాటు చేసిన ఈ పవిత్ర వ్రతంలో సుమారు 30 వరకు జంటలు పాల్గొన్నాయి. ఈ వ్రతంను హైదరాబాదు నుండి ప్రత్యేకంగా విచ్చేసిన జగదాంబా త్రిశక్తి పీఠాధిపతులు, ప్రముఖ వాస్తు జ్యోతిష్య ప్రశ్నా పండితులు “శ్రీముఖ గ్రహీత” భక్తనిధి” బ్రహ్మశ్రీ తాళ్లూరి బెనారస్ బాబు చేతుల మీదుగా నిర్వహించారు. వ్రతంలో పాల్గొన్న జంటలకు సొసైటి వారు పూజ సామాగ్రితోపాటూ యదాద్రి నుండి తెప్పించిన శ్రీ లక్ష్మి నృసింహ స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందించారు. వ్రతానంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినందుకు టీసీఎస్‌ఎస్‌ను వ్రతములో పాల్గొన్న జంటలు అభినందించారు. బ్రహ్మశ్రీ తాళ్లూరి బెనారస్ బాబుని టీసీఎస్ఎస్ సభ్యులు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ వ్రతానికి సమన్వయకర్తలుగా నల్ల భాస్కర్ గుప్త, బూర్ల వాణి శ్రీనివాస్, గర్రేపల్లి కస్తూరి శ్రీనివాస్, గోపగొని పద్మ దామోదర్‌లు వ్యవహరించారు. ఈ వ్రత కార్యక్రమాన్ని సొసైటి అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, పెద్ది కవిత చంద్ర శేఖర్ రెడ్డి, ముదం స్వప్న అశోక్, కోశాధికారి గడప రమేష్ బాబు, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్, ఏళ్ల ప్రియాంక రాం రెడ్డి, దుర్గా ప్రసాద్, చిలుక సురేష్, గార్లపాటి లక్ష్మా రెడ్డి పర్యవేక్షించారు. తొలి సారి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వ్రతములో పాల్గొని విజయవంతం చేసినందుకు వ్రతము లో పాల్గొన్న జంటలకు కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు పిల్లి రంజిత్, రవికుమార్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.