29న సింగపూర్‌లో బోనాలు | Telangana Bonalu Festival In Singapre On 29th July | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 21 2018 9:05 PM | Last Updated on Sat, Jul 21 2018 9:15 PM

Telangana Bonalu Festival In Singapre On 29th July - Sakshi

తెలంగాణ బోనాలు జాతర (ఫైల్‌ ఫోటో)

సింగపూర్‌: విదేశాల్లో కూడా తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలు విరాజిల్లుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పండుగల్లో ఒక్కటైన బోనాల జాతరను సింగపూర్‌లో అంగరంగ వైభవంగా జరపడానికి తెలంగాణ కల్చరల్‌ సోసైటీ సింగపూర్‌ (టీసీఎస్‌ఎస్‌) సిద్దమైంది. బోనాల జాతరను జులై 29(ఆదివారం) రోజున స్ధానిక శ్రీ అరకేసరి శివన్‌ టెంపుల్‌లో సాయంత్రం 05:30 నుంచి కన్నుల పండుగగా జరుపడానికి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాతరకు సింగపూర్‌లో ఉన్న తెలుగు వారందరూ పాల్గొనాల్సిందింగా కోరారు. రిజిస్ట్రేషన్‌ కోసం https://goo.gl/WJdPL4 లో లాగిన్‌ కావాల్సిందిగా నిర్వాహకులు తెలిపారు. బోనాల జాతర ఏర్పాట్లను లక్ష్మారెడ్డి, గోనే నాగెందర్‌, సురేందర్‌ రెడ్డి, రాము, ఉమేందర్‌, పద్మజ, కళ్యాణి, సృజన తదితరులు పర్యవేక్షిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement