TCSS
-
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు మరియు పంచాంగ శ్రవణం తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో లో మర్చి 22న ఘనంగా జరిగాయి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినా న సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. వేడుకల్లో బాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు సింగపూర్‌లో తొలిసారి స్థానిక కాలమాన ప్రకారం ప్రత్యేక గంటల పంచాంగాన్ని సభ్యులకు అందించారు. జోతిష పండితులు పంచాంగకర్తలు కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు , మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మ దీన్ని రూపొందించారు. ఈ వేడుకల్లో సుమారు 200-250 మంది ప్రవాసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులతో పాటు కర్ణాటక తదితర రాష్ట్రాల వారు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి, భక్షాలు, పులిహోర ప్రసాదం పంపిణి చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ నిర్వహిస్తున్నపలు భక్తి, స్వచ్చంద సేవా కార్యక్రమాలు అభినందనీయమని భక్తులు కొనియాడారు. సాంస్కృతిక నృత్యాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా శశిధర్ రెడ్డి, నంగునూరి వెంకట రమణ, కాసర్ల శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల మరియు సతీష్ పెసరు వ్యవరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా జరుగుటకు మరియు ప్రసాదానికి సహాయం అందించిన దాత లకు, స్పాన్సర్స్ కు సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి , కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి,కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, నడికట్ల భాస్కర్, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి కృష్ణ విజాపూర్, సదానందం అందె, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యం గా ఈ వేడుకలకు ఘనంగా జరగడానికి చేయూతనందించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
విజయవంతంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ మెంబర్స్ మీట్ అండ్ గ్రీట్
తెలంగాణ కల్చరల్ సొసైటి (సింగపూర్) (TCSS) కార్యవర్గం సొసైటీ సభ్యులతో ఆత్మీయ విందు సమావేశాన్ని ఈ నెల 25 సెప్టెంబర్ న స్థానిక లిటిల్ ఇండియా లో ఉన్న ద్వారకా రెస్టారెంట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 60 మంది TCSS జీవిత కాల సభ్యులు హాజరయ్యారు. సొసైటి సభ్యులు మాట్లాడుతూ.. ఈ సమావేశంలో పాల్గొన్నందుకు సభ్యులందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్క సభ్యుడి సలహాలు TCSS అభివృద్ధి ఎంతో ఉపయోగ కరమైనవని, వాటన్నింటిని అమలు చేయడానికి తమ కార్యవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తామన్నారు. రాబోయే బతుకమ్మ సంబురాలకు సంబంధించిన కరపత్రిక, ప్రోమో ను సభ్యుల సమక్షంలో విడుదల చేశారు. సింగపూర్‌లో బతుకమ్మ వేడుకలను ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా స్థానిక సంబవాంగ్ పార్క్ లో అక్టోబర్ 1 వ తేదీన జరుపుటకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ సారి విడుదల చేసిన ప్రోమో ఎంతో ప్రత్యకమైనదిగా చెప్పారు. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు ప్రత్యకంగా రాసి పాడించారని అన్నారు. ఈ పాటను రచించి సాహిత్యం అందజేసిన కాసర్ల శ్రీనివాస రావుని సభ్యులందరూ అభినందించారు. ఈ సమావేశంలో అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి గడప రమేష్ బాబుతో పాటు మిగతా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న సభ్యులకు దాతలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. వీరితో పాటు ఇతర సభ్యులు ఎంతో మంది ముందుకు వచ్చి సహాయ సహకారం అందజేయడానికి ముందుకు రావడం సంతోషకరమన్నారు. -
సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు
సింగపూర్ : తెలంగాణ సంప్రదాయాన్ని సింగపూర్ లో కొనసాగించడం లో ఎల్లప్పుడు ముందుండే తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్)ఆధ్వర్యంలో 24 అక్టోబర్న సింగపూర్ బతుకమ్మ జూమ్ ద్వారా కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రతీ ఏడూ సుమారు రెండు నుండి మూడు వేల మంది పాల్గొనే ఈ వేడుకలు ఈ సారి కరోనా నిబంధనల కారణంగా ఇంచుమించు 50 చోట్ల ఐదుగురు సమూహంతో ఆన్లైన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై టీసీఎస్ఎస్ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి , కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంబురాలలో గడప స్వాతి రమేశ్, దీప నల్ల, నంగునూరి సౌజన్య, బొడ్ల రోజా రమణి, గోనె రజిత నరేందర్ రెడ్డి, కల్వ రాజు, దుర్గా ప్రసాద్, గర్రేపల్లి కస్తూరి శ్రీనివాస్, నర్రా నిర్మల ఆర్ సీ రెడ్డి, గార్లపాటి లక్ష్మ రెడ్డి, జూలూరి పద్మజ సంతోష్, బసిక అనిత రెడ్డి, సునీత రెడ్డి మిర్యాల, పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నిరాడంబరంగా బోనాల పండుగ
సింగపూర్: కోవిడ్–19 కారణంగా సింగపూర్ నగరంలో తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(టీసీఎస్ఎస్) ఆధ్వరంలో బోనాల ఉత్సవాలు నిరాండంబరంగా జరిగాయి. సుంగేకేడుట్లోని అరసకేసరి శివన్ దేవాలయంలో సింగపూర్ ప్రభుత్వం, ఆలయ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. సమస్త ప్రజలపై ఆ మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని, ప్రపంచాన్ని కరోనా కోరల నుండి కాపాడాలని ప్రత్యేక పూజలు చేసినట్టు సభ్యులు తెలిపారు. ఏటా జరిగే ఈ ఉత్సవాల్లో సుమారు 1000 మంది భక్తులు పాల్గొనేవారు. సంస్థకు చెందిన గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, గొనే రజిత నరేందర్ రెడ్డి, గడప స్వాతి రమేశ్, బండ శ్రీదేవి మాధవ రెడ్డి దంపతులు బోనాలు సమర్పించారు. సొసైటీ తరపున అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి ఇతర సభ్యులు నంగునూరి వెంకట్ రమణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ, ఆవుల శివ ప్రసాద్ తదితరులు అందరిపై ఉజ్జయనీ మహంకాళి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. -
సింగపూర్‌లో బతుకమ్మ సంబరాలు
-
సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. సింగపూర్‌లోని సంబవాంగ్ పార్క్‌లో శనివారం బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు జోరైన పాటలు ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలతో హోరెత్తించారు. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు భారీగా ఎన్నారైలు పాల్గొని బతుకమ్మ ఆడారు. సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు వారందరికి, స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తు సుమారు గత పది సంవత్సరాలుగా విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా టీసీఎస్ఎస్ చరిత్రలో నిలిచిపోయిందని సొసైటీ సభ్యులు అన్నారు. ఈ సంబురాల్లో అందంగా ముస్తాబైన బతుకమ్మలకు ఎన్ఆర్ఈ ఫ్యాషన్స్ వారు బహుమతులు అందజేశారు. ఈ వేడుకలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని, సంబరాలు విజయవంతంగా జరగడానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు బొడ్ల రోజా రమణి, అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి, కల్వ రాజు, దిలీప్, శివ ప్రసాద్ ఆవుల లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాలకు సమన్వయ కర్తలుగా గోనె రజిత, నల్ల దీప, కల్వ నికిత, నంగునూరి సౌజన్య, గర్రేపల్లి కస్తూరి, బసిక అనిత రెడ్డి, తోట గంగాధర్, మారుతి, శ్రీధర్ పోచంపల్లి, సాయిరాం మంత్రిలు వ్యవహరించారు. స్పాన్సర్స్ గురు అకాడమీ, ఆర్కా మీడియా, వేలన్ ట్రేడర్స్, ఎన్ఆర్ఈ ఫ్యాషన్స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, టింకర్ టోట్స్, ఆర్జిజి స్టోర్స్, చింతకింది రమేశ్, ముదం అశోక్, రవీందర్ గుజ్జుల, హేమ సుభాష్ రెడ్డి, ముద్దం విజేందర్, సతీష్ శివనాథుల నంగునూరి సౌజన్య రమణ, గర్రేపల్లి శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, నందగిరి శిల్పా అజయ్ ఇతర దాతలకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
5న సంబవాంగ్ పార్క్‌లో సింగపూర్ బతుకమ్మ వేడుకలు
సంబవాంగ్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో సంబవాంగ్ పార్క్‌లో అక్టోబర్ 5న జరగబోయే సింగపూర్ బతుకమ్మ పండుగ సంబరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి టీసీఎస్ఎస్ సభ్యులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ బతుకమ్మ పండుగకు ప్రవేశం ఉచితమని, ఉత్తమ బతుకమ్మలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా, సంబరాలకు చేయూత, సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి టీసీఎస్ఎస్ కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. సింగపూర్‌లో ఉన్న తెలంగాణవాసులే కాకుండా తెలుగు వారందరితోపాటూ, మిగతా రాష్ట్రాల ప్రజలు కూడా ఈ సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీసీఎస్ఎస్ కోరింది. సంబరాలు విజయవంతంగా నిర్వహించడానికి సహయం అందిస్తున్న దాతలకు, ప్రతి ఒక్కరికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు బొడ్ల రోజా రమణి, అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి, కల్వ రాజు, దిలీప్, శివ ప్రసాద్ ఆవులలు కృతజ్ఞతలు తెలియజేశారు. -
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ డే
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. సింగపూర్ పుంగ్గోల్ పార్క్‌లో జూన్2న ఫ్యామిలీ డే నిర్వహించారు. ఈ ఫ్యామిలీ డే లో భారీగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని భావి తరాలకు అందించడానికి టీసీఎస్ఎస్ సభ్యులు వివిధ రకాల సంప్రదాయ ఆటలైన సంచి దుంకుడు, చిర్ర గోనె, చార్ పత్తా మొదలగు ఆటలు ఆడించి బహుమతులు అందజేశారు. అలాగే, తెలంగాణ వంటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు, గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, కోశాధికారి భాస్కర్ గుప్త నల్ల, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్. ఎమ్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు నంగునూరి వెంకట్ రమణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ, ఆవుల శివ ప్రసాద్‌లు మాట్లాడుతూ.. సొసైటీకి సహాయ సహకారాలు అందిస్తున్న సింగపూర్‌లో ఉన్న తెలంగాణ వాసులకు, అందరూ తెలుగు వారికి స్పాన్సర్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా గర్రేపల్లి కస్తూరి, బసిక అనిత రెడ్డి, గోనె నరేందర్, అనుపురం శ్రీనివాస్, ఫణిభూషణ్, విక్రమ్ సంకిరెడ్డిపల్లి, పట్టూరి కిరణ్ కుమార్, టి. రవీందర్‌లు వ్యవహరించారు. -
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఉగాది 2019 వేడుకలు ఘనంగా జరిగాయి. సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిపారు. శ్రీ వికారి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 800 మంది ప్రవాసీ తెలంగాణ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి, ప్రసాదం దాతలకు సొసైటీ తరపున అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, కార్యనిర్వాహక సభ్యులు ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు నంగునూరి వెంకట్ రమణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, జూలూరి పద్మజ, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ, ఆవుల శివ ప్రసాద్‌లు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా నంగునూరి వెంకట్ రమణ, గోనె నరేంద్ర, కల్వ రాజు, రోజా రమణి, పద్మజ, ప్రసాద్‌లు వ్యవహరించారు. -
టీఆర్ఎస్కు శుభాకాంక్షలు తెలిపిన టీసీఎస్ఎస్
సింగపూర్ : తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ విజయం తెలంగాణ ప్రజల గుండె చప్పుడని పేర్కొన్నారు. గత 4 సంవత్సరాలుగా టీఆర్ఎస్ చేసిన ఎన్నో ప్రజా ఉపయోగ, సంక్షేమ కార్యక్రమాల ఫలితమే ఈ ఘనవిజయం అని తెలిపారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకృషిని కొనియాడారు. దీంతో పాటు అత్యధిక మెజారిటీ సాధించిన హరీష్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి, కల్వ రాజు, దిలీప్, కరుణాకర్ రావు మొదలగు వారు ఉన్నారు. -
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో సింగపూర్‌లోని సంబవాంగ్ పార్క్‌లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు ఆటా పాటాలతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో సంబరాలు మిన్నంటాయి. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడారు. సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు వారందరికీ, స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేసి, గత పది సంవత్సరాలుగా పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా టీసీఎస్ఎస్ చరిత్రలో నిలిచిపోయిందని సొసైటీ సభ్యులు తెలిపారు. ఇది సొసైటీ స్వచ్చంద సేవకు, కృషి కి దక్కిన గొప్ప గౌరవం అని పేర్కొన్నారు. ఈ సంబురాల్లో ఉత్తమ బతుకమ్మ, ఉత్తమ సాంప్రదాయ వేషదారణకు బహుమతులు ఇచ్చారు. ఈ సంబురాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్ తెలిపారు. బతుకమ్మ వేడుకలు విజయవంతంగా జరుగుటకు సహాయం అందించిన దాతలకు, ప్రతి ఒక్కరికి ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చెన్నోజ్వాల ప్రవీణ్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్ రెడ్డి, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి మరియు కల్వ రాజు మొదలగు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. బతుకమ్మ పండుగ ఘనంగా జరగడానికి తోడ్పాటు అందించిన ప్రతీ ఒక్కరికి పేరు పేరున కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలకు సమన్వయ కర్తలుగా గోనె రజిత, నల్ల దీప, జూలూరి పద్మజ, భారతి, సుప్రిత, సారిక, దివ్య, రేణుక, రోజా రమణి, నరేష్ మరియు గంగాధర్‌లు వ్యవహరించారు. స్పాన్సర్స్ మలబార్ గోల్డ్ & డైమండ్స్, వాంగో, కుమార్ ప్రోపోనేక్స్, ఎన్ఆర్ఈ ఫ్యాషన్స్, సింగ్ ఎక్స్, రియో కాఫీ, గురు అకాడమి, ఏఎస్ఎమ్ ప్యూర్ సిల్వర్, రాయల్ రిట్రీట్, రవీందర్ గుజ్జుల, హేమ సుభాష్ రెడ్డి, ముద్దం విజేందర్, సతీష్ శివనాతుల, ఇతర దాతలకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతున్న సింగపూర్
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో అక్టోబర్ 13న సింగపూర్‌లోని సంబవాంగ్ పార్క్‌లో బతుకమ్మ పండుగ సంబరాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంబరాల్లో, ఉత్తమ బతుకమ్మలకు, ఉత్తమ సాంప్రదాయ వేషధారణలో వచ్చిన చిన్నారులకు ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయని, గ్రాండ్ లక్కీ డ్రాలో అదృష్ట విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలకు చేయూత, సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి టీసీఎస్ఎస్ కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే సంబరాల్లో పాల్గొనే వారందరికి సరిపడే ఆహారం, ఇతర ఏర్పాట్లు చేశామన్నారు. ఈ బతుకమ్మ పండుగకు ప్రవేశం ఉచితమని, సింగపూర్‌లోని తెలుగువారే కాకుండా మిగతా రాష్ట్రాలకుచెందినవారు పెద్ద ఎత్తున రావాలని టీసీఎస్ఎస్ కోరింది. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి అహర్నిశలు కష్టపడుతువారికి, దాతలకు టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, జింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి, కల్వ రాజులతోపాటూ పలువురికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల కరపత్రాలని టీసీఎస్ఎస్ సభ్యులు విడుదల చేశారు. -
సింగపూర్‌లో ఘనంఘా బోనాలు
-
బోనమెత్తిన సింగపూర్
సింగపూర్ : నగరంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్ రెండోసారి బోనమెత్తింది. స్థానిక సుంగే కేడుట్‌లోని శ్రీ అరస కేసరి శివన్ టెంపుల్లో ఆదివారం ఎంతో కన్నుల పండుగగా జరుపుకున్నారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. బోనాల ఊరేగింపులో పోతరాజు వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలో సుమారు 500 మంది భక్తులు పాల్గొన్నారు. బోనాల పండుగను గత ఏడాది కూడా టీసీఎస్ఎస్ ఘనంగా నిర్వహించింది. రెండో ఏడాది కూడా విజయవంతంగా బోనాల పండుగను నిర్వహించడం సొసైటీకి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని కార్యవర్గ సభ్యులు తెలియ చేశారు. ప్రజలందరిపై ఆ మహంకాళి తల్లి ఆశిస్సులు ఉండాలని సభ్యులు ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. బోనాల పండుగలో పాల్గొని అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జరుపుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి సొసైటి అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు రమేష్ బాబు, శివ రామ్ ప్రసాద్, గర్రెపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్, ఇతర సభ్యులు నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, అనుపురం శ్రీనివాస్, కల్వ రాజులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకలకు సమన్వయ కర్తలుగా లక్ష్మా రెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్, బొండుగుల రాము, జుట్టు ఉమేందర్, జూలూరి పద్మజ, నడికట్ల కళ్యాణి, వెంగళ సృజన వ్యవహరించారు. -
29న సింగపూర్‌లో బోనాలు
సింగపూర్: విదేశాల్లో కూడా తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలు విరాజిల్లుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పండుగల్లో ఒక్కటైన బోనాల జాతరను సింగపూర్‌లో అంగరంగ వైభవంగా జరపడానికి తెలంగాణ కల్చరల్ సోసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) సిద్దమైంది. బోనాల జాతరను జులై 29(ఆదివారం) రోజున స్ధానిక శ్రీ అరకేసరి శివన్ టెంపుల్లో సాయంత్రం 05:30 నుంచి కన్నుల పండుగగా జరుపడానికి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాతరకు సింగపూర్‌లో ఉన్న తెలుగు వారందరూ పాల్గొనాల్సిందింగా కోరారు. రిజిస్ట్రేషన్ కోసం https://goo.gl/WJdPL4 లో లాగిన్ కావాల్సిందిగా నిర్వాహకులు తెలిపారు. బోనాల జాతర ఏర్పాట్లను లక్ష్మారెడ్డి, గోనే నాగెందర్, సురేందర్ రెడ్డి, రాము, ఉమేందర్, పద్మజ, కళ్యాణి, సృజన తదితరులు పర్యవేక్షిస్తున్నారు. -
సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
-
సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. బుకిత్ పంజాంగ్ లోని శ్రీ మురుగన్ హిల్ ఆలయంలో పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ విళంబి నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 400 మంది ప్రవాసి తెలంగాణ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగస్వామ్యులైన వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణి చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులు, ప్రసాద దాతలకు సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, ఉపాధ్యక్షులు నీలం మహేందర్, బూర్ల శ్రీనివాస్, పెద్ది శేఖర్ రెడ్డి, ముదం అశోక్, కోశాధికారి గడప రమేశ్, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, యెల్ల రామ్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు, గార్లపాటి లక్ష్మా రెడ్డి, నల్ల భాస్కర్ గుప్త, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివ రామ్ ప్రసాద్, ఆర్ సి రెడ్డి, మొగిలి సునీత, గోపగోని దాము, చిల్క సురేశ్, చెట్టిపెల్లి మహేష్, పింగిలి భరత్‌లు ధన్యవాదాలు తెలిపారు. వీరితో పాటు గోనె నరేందర్, భగవాన్ రెడ్డి, సురేందర్, సంతోష్, ఆర్మూర్ నవీన్, నంగునూరి వెంకట్ రమణ, జయ లక్ష్మిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్టు సొసైటీ ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
సింగపూర్‌లో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో స్థానిక శ్రీ శివన్ టెంపుల్లో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. చంద్ర మాన క్యాలెండర్లో అత్యంత శుభప్రదమైన నెలలలో ఒకటి అయిన కార్తీక మాసంలో ఏర్పాటు చేసిన ఈ పవిత్ర వ్రతంలో సుమారు 30 వరకు జంటలు పాల్గొన్నాయి. ఈ వ్రతంను హైదరాబాదు నుండి ప్రత్యేకంగా విచ్చేసిన జగదాంబా త్రిశక్తి పీఠాధిపతులు, ప్రముఖ వాస్తు జ్యోతిష్య ప్రశ్నా పండితులు “శ్రీముఖ గ్రహీత” భక్తనిధి” బ్రహ్మశ్రీ తాళ్లూరి బెనారస్ బాబు చేతుల మీదుగా నిర్వహించారు. వ్రతంలో పాల్గొన్న జంటలకు సొసైటి వారు పూజ సామాగ్రితోపాటూ యదాద్రి నుండి తెప్పించిన శ్రీ లక్ష్మి నృసింహ స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందించారు. వ్రతానంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినందుకు టీసీఎస్‌ఎస్‌ను వ్రతములో పాల్గొన్న జంటలు అభినందించారు. బ్రహ్మశ్రీ తాళ్లూరి బెనారస్ బాబుని టీసీఎస్ఎస్ సభ్యులు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ వ్రతానికి సమన్వయకర్తలుగా నల్ల భాస్కర్ గుప్త, బూర్ల వాణి శ్రీనివాస్, గర్రేపల్లి కస్తూరి శ్రీనివాస్, గోపగొని పద్మ దామోదర్‌లు వ్యవహరించారు. ఈ వ్రత కార్యక్రమాన్ని సొసైటి అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, పెద్ది కవిత చంద్ర శేఖర్ రెడ్డి, ముదం స్వప్న అశోక్, కోశాధికారి గడప రమేష్ బాబు, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్, ఏళ్ల ప్రియాంక రాం రెడ్డి, దుర్గా ప్రసాద్, చిలుక సురేష్, గార్లపాటి లక్ష్మా రెడ్డి పర్యవేక్షించారు. తొలి సారి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వ్రతములో పాల్గొని విజయవంతం చేసినందుకు వ్రతము లో పాల్గొన్న జంటలకు కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు పిల్లి రంజిత్, రవికుమార్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. -
సింగపూర్‌లో అలసాని క్రిష్ణారెడ్డికి సత్కారం
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) వ్యవస్థాపక సభ్యులు అలసాని క్రిష్ణా రెడ్డిని సింగపూర్‌లోని అమరావతి రెస్టారెంట్లో సొసైటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఆయన స్వస్థలం సిద్దిపేట జిల్లాలోని చిన్న కోడూరు మండల కేంద్రం. క్రిష్ణా రెడ్డి సింగపూర్‌లో గత 15 సంవత్సరాలుగా నివసిస్తూ స్వదేశానికి తిరిగి వెళుతున్నారు. అయితే టీసీఎస్ఎస్ ఆవిర్భావం నుండి సొసైటీ కార్యవర్గ సభ్యులుగా ఉంటూ సింగపూర్‌లోని తెలంగాణ వాసులకు, సొసైటీకి అందించిన సేవలకు గుర్తింపుగా సొసైటీ సభ్యులు వీడుకోలు విందును ఏర్పాటు చేసి అయన సేవలను కొనియాడారు. దాంతో పాటు సొసైటీ తరపున శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సన్మాన సభను ఏర్పాటు చేసి సత్కరించినందుకుగానూ క్రిష్ణా రెడ్డి సొసైటీకి ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్‌లోని తెలంగాణ వారికి టీసీఎస్ఎస్ ద్వార సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సింగపూర్‌లో గడిపిన సమయం మధుర స్మృతి అని, ఈ ప్రయాణంలో ఎంతో మంది మిత్రులు అయ్యారని తెలిపారు. ఎక్కడ ఉన్నా తెలంగాణ వాసులకు చేతనైన సహాయం చేస్తానన్నారు. సింగపూర్‌లో ఉన్న తెలంగాణ వారందరు టీసీఎస్ఎస్ సభ్యత్వం తీసుకొని సొసైటీ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. సింగపూర్‌లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందజేయడానికి కృషి చేస్తున్న టీసీఎస్‌ఎస్‌కు సహకారం అందజేయాలని కోరారు. ఈ సన్మాన సభలో ఉపాధ్యక్షులు నీలం మహేందర్, పెద్ది శేఖర్ రెడ్డి, బూర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి గడప రమేష్ బాబు, ఇతర కార్యవర్గ సభ్యులు చిల్క సురేశ్, దుర్గ ప్రసాద్, ఎల్లా రాం రెడ్డి, పెద్దపల్లి వినయ్ కుమార్, సీహెచ్ ప్రవీణ్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గర్రేపల్లి శ్రీనివాస్, ఆర్. సి రెడ్డి, నల్ల భాస్కర్, పెరుకు శివ రాంలు పాల్గొన్నారు. -
క్రికెట్ టోర్నీలో సత్తాచాటిన కొడిమ్యాల వెల్ విషర్స్
సాక్షి, సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో సింగపూర్‌లోని వుడ్ లాండ్స్ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ 2017 జరిగింది. ఈ టోర్నీలో కొడిమ్యాల వెల్ విషర్స్ జట్టు అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభకనభరిచి విజేతగా నిలిచింది. ఈ ఏడాది క్రికెట్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొన్నాయి. లీగ్స్‌లో గ్రూప్ “ఏ” లో తెలుగు రైడర్స్, స్వేచ్ఛా టీం, స్కై టీం, గ్రూప్ “బి” లో భాగ్యనగర్ రైడర్స్, 11 స్టార్స్, ఇండియన్ రోలర్స్, గ్రూప్ ‘సి’ లో ముత్యంపేట్ కింగ్స్, జగిత్యాల్ టైగర్స్, తెలంగాణ లెజెండ్స్, గ్రూప్ ‘డి’ లో కొడిమ్యాల వెల్ విషర్స్, క్రిక్ బుల్స్, రాయల్ స్టార్స్ తలపడ్డాయి. లీగ్స్ అనంతరం స్వేచ్ఛా టీం , కొడిమ్యాల వెల్ విషర్స్, జగిత్యాల్ టైగర్స్, ఇండియన్ రోలర్స్ సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. జగిత్యాల్ టైగర్స్, కొడిమ్యాల వెల్ విషర్స్ మధ్య జరిగిన ఫైనల్ పోరులో కొడిమ్యాల వెల్ విషర్స్ విజేతగా నిలిచింది. టోర్నమెంట్ బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్ మెన్ కూడా కొడిమ్యాల వెల్ విషర్స్ టీం చెందిన ఆటగాళ్లు గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్‌కు సమన్వయకర్తలుగా ప్రాంతీయ కార్యదర్శి అలసాని క్రిష్ణా రెడ్డి, చిల్క సురేశ్, ఆర్సిరెడ్డి, చెట్టిపల్లి మహేశ్, దామోదర్ గోపగోని, జుట్టు ఉమేందర్, బైరి రవి, పిల్లి రంజిత్‌లు వ్యవహరించారు. సొసైటి సభ్యలు మాట్లాడుతూ.. సింగపూర్‌లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందించడానికి వివిధ పండుగలను జరుపుకోవడమే కాకుండా క్రీడాస్పూర్తిని పెంపొందించడానికి క్రికెట్, బ్యాడ్మింటన్వంటి ఆటల పోటీలు ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న అన్ని జట్ల క్రీడాస్పూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలను సొసైటి ఉపాధ్యక్షులు పెద్ది చంద్ర శేఖర్ రెడ్డి, బూర్ల శ్రీనివాస్, నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు గార్లపాటి లక్ష్మా రెడ్డి, పెరుకు శివరామ్ ప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ విజయవంతం కావడానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా చిట్ల విక్రమ్, గొనె నరేందర్, గండ్ర సునీల్ కుమార్, దీరజ్ గౌడ్ కు సొసైటి కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
చేరుపల్లి వివేక్ తేజకు సింగపూర్‌లో సత్కారం
నల్గొండకు చెందిన ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ చేరపల్లి వివేక్ తేజను తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(టీసీఎస్ఎస్) కార్యవర్గ సభ్యులు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. వివేక్ తేజ మార్షల్ ఆర్ట్స్‌లో ఇప్పటి వరకు 27 బంగారు, 18 రజిత, 16 కాంస్య పతాకాలు గెలుపొందారు. ప్రపంచ స్థాయిలో ఇంకా రాణించి భారతదేశం పేరు మారు మ్రోగించాలని టీసీఎస్ఎస్ సభ్యులు ఆకాంక్షించారు. ఈ నెల 12న ఇండో నేషియాలో జరగబోయే మార్షల్ ఆర్ట్స్‌లో పాల్గొనడానికి వెళుతున్న సందర్భంగా అక్కడ విజయ కేతనం ఎగురవేసి తెలంగాణ కీర్తిని చాటాలని ఆకాక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పెద్ది శేఖర్ రెడ్డి, బూర్ల శ్రీను, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శి ఎల్లా రామ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు చిల్క సురేశ్, గార్లపాటి లక్ష్మారెడ్డి, శివ రామ్, చెట్టి పల్లి మహేష్, ఆర్.సి.రెడ్డి, దామోదర్ ఇతర సభ్యులు గొనె నరేందర్, అనుపురం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బోనమెత్తిన సింగపూర్
సుంగే కేడుట్(సింగపూర్) : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తొలిసారిగా బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఈ బోనాల జాతర స్థానిక సుంగే కేడుట్ లోని అరసకేసరి శివన్ టెంపుల్లో ఎంతో కన్నుల పండుగగా జరుపుకున్నారు. తెలంగాణ మహిళలు భక్తిశ్రద్ధలతో దుర్గా దేవికి బోనాలు సమర్పించారు. బోనాల ఊరేగింపులో పోతరాజు వేషాలు, తొట్టెలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ బోనాల వేడుకలో సింగపూర్‌లో ఉన్న తెలుగు వారితోపాటూ, ఇతరులు పెద్దమొత్తంలో పాల్గొన్నారు. ఈ బోనాల పండుగ ను తొలిసారిగా సింగపూర్ లో జరపడం ద్వారా టీసీఎస్ఎస్ పేరు చరిత్రలో నిలిచిపోవడం సొసైటీకి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. ప్రజలపై ఆ మహంకాళి తల్లి ఆశిస్సులు ఉండాలని సభ్యులు ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. వేడుక అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులకు సొసైటి అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, ఉపాధ్యక్షులు, నీలం మహేందర్, పెద్ది శేఖర్ రెడ్డి, బూర్ల శ్రీను, ముదాo అశోక్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి గడప రమేష్, కార్యవర్గ సభ్యులు అలసాని కృష్ణ, చిల్క సురేశ్, దుర్గ ప్రసాద్, మిర్యాల సునీత, ఎల్లా రాం, పెద్దపల్లి వినయ్, ప్రవీణ్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గరెపల్లి శ్రీనివాస్, శివ రామ్, చెట్టిపల్లి మహేష్, ఆర్. సి రెడ్డి, నల్ల భాస్కర్, దామోదర్, భరత్‌లు కృతజ్ఞతలు తెలిపారు. -
టీసీఎస్ఎస్ అధ్వర్యంలో తెలంగాణ అవతరణ ఉత్సవాలు
డోవర్: తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్(టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడి సింగపూర్ పాలిటెక్నిక్ కన్వెన్షన్ సెంటర్, డోవర్లో జూన్ 11న ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొననున్నారని టీసీఎస్ఎస్ కార్యవర్గ సభ్యులు వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2014 విదేశీ గడ్డ పై జరిగిన మొట్టమొదటి వేడుకలు టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో సింగపూర్ లోనే కావడం, ఆ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పాల్గొనడం గర్వకారణం అని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ద్వితీయ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరపు వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొనడానికి వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సొసైటీ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, ఉపాధ్యక్షులు నీలం మహేందర్, పెద్ది చంద్ర శేఖర్ రెడ్డి, బూర్ల శ్రీనివాస్, ముదం అశోక్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి గడప రమేష్, ఇతర కార్యవర్గ సభ్యులు తెలియ జేశారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసిఆర్ విదేశాల్లో పాల్గొన్న ఏకైక వేడుకలు టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలే అని ఈ సందర్భంగా గుర్తు చేసున్నారు. సింగపూర్ లో ఉంటున్న తెలంగాణ వారందరూ ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని టీసీఎస్ఎస్ సభ్యులు కోరారు. సింగపూర్ లో తెలంగాణ వాసుల భాష, యాస, సంస్కృతిని ని బావితరాలకు అందజేయడానికి స్థాపించిన టీసీఎస్‌ఎస్‌కు సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి ఈ సందర్భంగా అధ్యక్షుడు బండ మాధవ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. -
జగిత్యాల టైగర్స్‌కు టైటిల్
హైదరాబాద్: సింగపూర్ తెలంగాణ కల్చరర్ సొసైటీ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన వార్షిక క్రికెట్ టోర్నమెంట్లో జగిత్యాల టైగర్స్ జట్టు విజేతగా నిలిచింది. ఈ జట్టు ఫైనల్లో హీరోయిక్ బుల్స్‌ను ఓడించింది. విజేతలకు బతుకమ్మ సంబరాల్లో బహుమతులు అందించనున్నారు. మొత్తం ఈ టోర్నమెంట్లో 8 జట్లు తలపడ్డాయి. గ్రూప్-ఏలో తెలంగాణ లయన్స్, ఇండియన్ రూలర్స్, కరీంనగర్ నైట్ రైడర్స్, భాగ్యనగర్ రైడర్స్ జట్లు ఉండగా... గ్రూప్-బిలో హీరోయిక్ బుల్స్, జగిత్యాల టైగర్స్, 11 స్టార్స్, స్మాషర్స్ యునెటైడ్ జట్లు తలపడ్డాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించడంతో పాటు... తెలంగాణ వారందరినీ ఒకే తాటి మీదకు తెచ్చేందుకు ఏటా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని టీసీఎస్ఎస్ అధ్యక్షుడు బండ మాధవరెడ్డి అన్నారు.