టీసీఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ | Bathukamma celebrations held in Singapore | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ

Published Sat, Oct 13 2018 8:41 PM | Last Updated on Sat, Oct 13 2018 10:36 PM

Bathukamma celebrations held in Singapore - Sakshi

సింగపూర్‌ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో సింగపూర్‌లోని సంబవాంగ్ పార్క్‌లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు ఆటా పాటాలతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో సంబరాలు మిన్నంటాయి. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడారు. 

సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగు వారందరికీ, స్థానికులకు  బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేసి, గత పది సంవత్సరాలుగా పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా టీసీఎస్‌ఎస్‌ చరిత్రలో నిలిచిపోయిందని సొసైటీ సభ్యులు తెలిపారు. ఇది సొసైటీ స్వచ్చంద సేవకు, కృషి కి దక్కిన గొప్ప గౌరవం అని పేర్కొన్నారు. ఈ సంబురాల్లో ఉత్తమ బతుకమ్మ, ఉత్తమ సాంప్రదాయ వేషదారణకు బహుమతులు ఇచ్చారు. ఈ సంబురాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షులు నీలం మహేందర్ తెలిపారు. బతుకమ్మ వేడుకలు విజయవంతంగా జరుగుటకు సహాయం అందించిన దాతలకు, ప్రతి ఒక్కరికి ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చెన్నోజ్వాల ప్రవీణ్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్ రెడ్డి, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి మరియు కల్వ రాజు మొదలగు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. బతుకమ్మ పండుగ ఘనంగా జరగడానికి తోడ్పాటు అందించిన ప్రతీ ఒక్కరికి  పేరు పేరున కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలకు సమన్వయ కర్తలుగా గోనె రజిత, నల్ల దీప, జూలూరి పద్మజ, భారతి, సుప్రిత, సారిక, దివ్య, రేణుక, రోజా రమణి, నరేష్ మరియు గంగాధర్‌లు వ్యవహరించారు. స్పాన్సర్స్ మలబార్ గోల్డ్ & డైమండ్స్, వాంగో, కుమార్ ప్రోపోనేక్స్, ఎన్‌ఆర్‌ఈ ఫ్యాషన్స్, సింగ్ ఎక్స్, రియో కాఫీ, గురు అకాడమి, ఏఎస్‌ఎమ్‌ ప్యూర్ సిల్వర్, రాయల్ రిట్రీట్, రవీందర్ గుజ్జుల, హేమ సుభాష్ రెడ్డి, ముద్దం విజేందర్, సతీష్ శివనాతుల, ఇతర దాతలకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement