సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. బుకిత్ పంజాంగ్ లోని శ్రీ మురుగన్ హిల్ ఆలయంలో పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ విళంబి నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 400 మంది ప్రవాసి తెలంగాణ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగస్వామ్యులైన వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణి చేశారు.
ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులు, ప్రసాద దాతలకు సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, ఉపాధ్యక్షులు నీలం మహేందర్, బూర్ల శ్రీనివాస్, పెద్ది శేఖర్ రెడ్డి, ముదం అశోక్, కోశాధికారి గడప రమేశ్, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, యెల్ల రామ్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు, గార్లపాటి లక్ష్మా రెడ్డి, నల్ల భాస్కర్ గుప్త, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివ రామ్ ప్రసాద్, ఆర్ సి రెడ్డి, మొగిలి సునీత, గోపగోని దాము, చిల్క సురేశ్, చెట్టిపెల్లి మహేష్, పింగిలి భరత్‌లు ధన్యవాదాలు తెలిపారు. వీరితో పాటు గోనె నరేందర్, భగవాన్ రెడ్డి, సురేందర్, సంతోష్, ఆర్మూర్ నవీన్, నంగునూరి వెంకట్ రమణ, జయ లక్ష్మిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్టు సొసైటీ ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment