Ugadi celebrations
-
ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉగాది వేడుకలు
ఫ్రాంక్ఫర్ట్ లోని తెలుగు కమ్యూనిటీలు భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రదర్శిస్తూ తెలుగు నూతన సంవత్సరం ఉగాది స్ఫూర్తిని సరిహద్దులు దాటించారు. తెలుగు వెలుగు జర్మనీ (టివిజి) నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులలో కనిపించి ఉత్సవాలకు తెలుగు శోభను అద్దారు.స్థానిక తెలుగు వారి ప్రతిభను వెలికితీయడానికి, సంస్కృతి చైతన్యాన్ని ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భారత రాయబారి హరీష్ పర్వతనేని, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బి.ఎస్. ముబారక్ పాల్గొన్నారు. దాదాపు రోజంతా జరిగిన ఉత్సవాలలో సాయంత్రం నిర్వహించిన మ్యూజికల్ ఫెస్ట్ హైలైట్‌గా నిలిచింది.ఈ సంగీతోత్సవంలో భారతదేశానికి చెందిన ప్రముఖ గాయకులు పృథ్వీ చంద్ర, మనీషా ఎరా బత్ని, ఇతిపాడ్ బ్యాండ్‌కి చెందిన సాకేత్ కొమండూరి ల సంగీత ప్రదర్శనలు ఉత్సవ హోరును శిఖరాలకు చేర్చాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఫ్రాంక్ఫర్ట్ మేయర్ (బర్గర్మీస్టర్) డాక్టర్ నర్గెస్ ఎస్కందారి గ్రున్‌బర్గ్ హాజరయ్యారు. అతిథులలో.. యూరోపా యూనియన్ ఫ్రాంక్ఫర్ట్ చైర్పర్సన్, క్లాస్ క్లిప్, జవ్వాజి గ్రూప్ కంపెనీల ఛైర్మన్, జవాజి, విదేశీ మండలి సభ్యురాలు నందిని తదితరులున్నారు. -
Ugadi2024 అంజలి ‘పాప’ ఎంత ముద్దుగుందో..! (ఫోటోలు)
-
ప్రయత్నిస్తే మంచి ఫలితమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికార పక్షానికి కష్టతరంగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ భవన్లో పంచాంగ శ్రవణం సందర్భంగా పండితులు జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు ప్రయతి్నస్తే ఈ ఎన్నికల్లో విజయం పొందే అవకాశం ఉందన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రోధి నామ సంవత్సరంలో రాజు కుజుడుగా ఉన్నాడని, శని మంత్రిగా ఉన్నాడని పండితులు తెలిపారు. కుజుడు అధిపతిగా ఉండటం వల్ల వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడి పంటలు మంచిగా పడుతాయని చెప్పారు. అయితే ధరలు అధికమవుతాయన్నారు. ఈ ఏడాదంతా కేసీఆర్‌కు బాగుంటుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాశి కర్కాటకం అని.. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 గా, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉందని తెలిపారు. గురుడు మంచి స్థానంలో ఉన్నందున ఈ సంవత్సరమంతా కేసీఆర్‌కు బాగుంటుందని తెలిపారు. కర్కాటక రాశి వాళ్లు వేసే ఎత్తుగడలు ఫలిస్తాయని, వారి నిర్ణయాలకు ప్రజాబలం లభిస్తుందన్నారు. వ్యక్తిగతంగా కూడా మంచి ప్రతిష్ఠ ఉంటుందన్నారు. వారి మాటకు, గమనానికి ఈ ఏడాది అడ్డు ఉండదని చెప్పారు. అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలా ఉంటే కేటీఆర్ ప్రజాభిమానాన్ని పొందుతారు కేటీఆర్‌ది మకర రాశి అని, ఈ రాశి వారు ఏ పనిచేసినా బ్యాలెన్స్‌గా చేయాలని సూచించారు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 ఉందని, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉందని పండితులు తెలిపారు. మాటను కట్టడి చేసుకొని మృదువుగా మాట్లాడం వల్ల , చక్కటి ఉపకారాన్ని, అభిమానాన్ని పొందగలుగుతారని అన్నారు. జాగ్రత్తగా ఉంటే ఎన్నికల్లో మంచి పట్టు సాధించే అవకాశం ఉందని పండితులు తెలిపారు. -
మళ్లీ బీజేపీదే అధికారం
సాక్షి, హైదరాబాద్: దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని పంచాంగ శ్రవణకర్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి జోస్యం చెప్పారు. –ఈ ఏడాది అంతా మంచే జరుగుతుందనీ, పార్టీ నాయకుల్లో ఐక్యత పెరుగుతుందనీ, సమష్టి విజయం సాధించాలనే సంకల్పం సిద్ధిస్తుందన్నారు. తమ శక్తి మేర ప్రజలకు వ్యయం చేస్తే నాయకులకు పేరు వస్తుందన్నారు. వృద్ధుల సహకారం ఉంటేనే యువకులు విజయం పొందుతారని తెలిపారు. ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తాను 14 ఏళ్ల క్రితం బీజేపీ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొని అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం తర్వాత మళ్లీ కలుసుకుందామని చెప్పినట్టు మూర్తి గుర్తుచేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దంపతులు హోమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డుసభ్యుడు డా.కె.లక్ష్మణ్ , ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీ‹Ùబాబు, రాష్ట్రపార్టీ ప్రధానకార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ పాల్గొన్నారు. మోదీ సర్కార్‌నే ప్రజలు కోరుకుంటున్నారు: కిషన్‌రెడ్డి పంచాంగ శ్రవణం అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ క్రోధి నామ సంవత్సరం చాలా ప్రాధాన్యత కలిగిన సంవత్సరమని, మోదీ నాయకత్వంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. మంచి వర్షాలతో, పాడిపంటలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. మోదీ నేతృత్వంలో మరింత సుస్థిర, స్థిరమైన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశం కోసం పనిచేస్తున్న మోదీ నాయకత్వానికి మద్దతు తెలిపి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
మరింత మంచి పాలన
సాక్షి, హైదరబాద్: క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం గాం«దీభవన్‌లో ఘనంగా జరిగాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, వర్కింగ్ ప్రెసిసెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుడు శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు. ప్రజాభీష్టం మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అద్భుతంగా పాలన సాగిస్తుందన్నారు. వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలు అమలు చేసి, ప్రజాదరణ పొందారని, రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా పాలన సాగుతుందని జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ ఈ క్రోది నామ సంవత్సరంలో కోపం తగ్గించుకొని కాంగ్రెస్ కార్యకర్తలు పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు కుమార్‌రావ్, నిరంజన్, చల్లా నర్సింహారెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నవ వసంతంలో అందరికీ మేలు జరగాలి
గన్¸పౌండ్రీ (హైదరాబాద్): క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో క్రోధినామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబాలలో పున్నమి వెన్నెలను నింపడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో భాగంగా బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాగ పఠనం చేశారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి ఆలయంలో వేడుకగా ఉగాది ఆస్థానం
తిరుమల/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/కాణిపాకం(చిత్తూరు రూరల్)/శ్రీశైలం టెంపుల్: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి అర్చకులు విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై, ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై శ్రీ విష్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. శ్రీవారి మూలవిరాట్‌కు, ఉత్సవమూర్తులకు నూతన వ్రస్తాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఆలయంలో టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్ ఫ్లవర్స్‌తో ఏర్పాటు చేసిన ఫల–పుష్ప అలంకరణలు ఆకట్టుకున్నాయి. అయోధ్య రామాలయం, బాలరాముడి సెట్టింగ్, నవధాన్యాలతో రూపొందించిన మత్స్య అవతారము మైమరిపించింది. టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 150 మంది పుష్పాలంకరణ కళాకారులు, 100 మంది టీటీడీ గార్డెన్ సిబ్బంది 2 రోజులు శ్రమించి ఈ ఆకృతులను రూపొందించారు. వైభవంగా దుర్గమ్మకు పుష్పార్చన.. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవి ఈ నెల 18 వరకు జరుగుతాయి. మంగళవారం తెల్లవారుజామున అంతరాలయంలో మూలవిరాట్‌కు స్నపనాభిషేకం నిర్వహించారు. దేవస్థానం రూపొందించిన పంచాంగాన్ని దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆవిష్కరించారు. అమ్మవారి ప్రధానాలయం, ఉపాలయాలను పుష్పాలతో అలంకరించారు. దుర్గమ్మకు విశేష పుష్పార్చన చేపట్టారు. ఉగాది సందర్భంగా ధర్మపథం వేదికపై కప్పగంతుల సోమయాజుల సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. సాయంత్రం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు వెండి రథంపై నగరోత్సవాన్ని నిర్వహించారు. కాణిపాకంలో అంగరంగ వైభవంగా.. కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాన్ని పలు రకాల పుష్పాలు, మామిడి తోరణాలు, అరటి బోదెలతో శోభాయమానంగా అలంకరించారు. వేకువజామున స్వామికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈవో వెంకటేశు స్వామి వారికి పట్టువ్రస్తాలను సమరి్పంచారు. శివకుమార్ శర్మ రచించిన కాణిపాక దేవస్థానం పంచాంగాన్ని ఆవిష్కరించారు. పురోహితులు మోహన్, రామలింగం పంచాంగ శ్రవణం చేశారు. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ విగ్రహాలను కాణిపాకం పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. శ్రీశైలంలో వేడుకగా రథోత్సవం... శ్రీశైలంలో మల్లన్న రథోత్సవం వైభవంగా సాగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులను చేయించి ఊరేగింపుగా రథశాల వద్దకు తోడ్కొనివచ్చి రథంపై అధిష్టింపజేశారు. అర్చకులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక హారతులిచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ రథోత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సాగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని రమావాణీ సేవిత రాజరాజేశ్వరీ అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ ఏడాది దేశం పారిశ్రామికరంగంలో అభివృద్ధి చెందుతుందని శ్రీశైలం దేవస్థాన ఆస్థాన సిద్దాంతి పండిత బుట్టే దైవజ్ఞ తెలిపారు. ఉగాది సందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. -
ఉగాది వేడుకల్లో మెగాస్టార్ మనవరాలు నవిష్క (ఫొటోలు)
-
Ugadi 2024: సెలబ్రిటీల సంబరాలు
-
ఇంద్రకీలాద్రి పై ఘనంగా వసంత నవరాత్రి ఉగాది మహోత్సవాలు
-
కన్య రాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి..
-
ములుగు శివజ్యోతి ఉగాది రాశి ఫలాలు
-
వృషభ రాశి ఫలితాలు ములుగు శివజ్యోతి
-
అంతా సమానమే..
-
వారు ఆ విషయంలో జాగ్రత్త పాటించాలి
-
అదృష్టాన్ని నమ్ముకోవచ్చు..
-
రాజకీయ నాయకులకు అండదండలు.. కానీ
-
అన్నీ ఎక్కువే..
-
చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో ఉగాది వేడుకలు
-
విశాఖలో ఘనంగా ఉగాది ఉత్సవాలు
-
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
-
సత్యసాయి నిగమంలో ఉగాది ఉత్సవాలు
-
‘తాల్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఉగాది వేడుకలు-2023 ఘనంగా జరిగాయి. లండన్‌లోని సత్తావిస్ పటిదార్ సెంటర్లో ఏప్రిల్ 22న ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో లండన్, పరిసర ప్రాంతాలకుచెందిన సుమారు వెయ్యి మంది తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. తాల్ కల్చరల్ సెంటర్ (TCC) విద్యార్థులచే గణపతి పాట, భరతనాట్యం, కర్ణాటక సంగీత ప్రదర్శనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉగాది కోసం ప్రత్యేకంగా మూడు నెలలపాటు నిర్వహించిన సినీ నృత్య శిక్షణ శిబిరాలలో సుమారు వంద మంది చిన్నారులు, గృహిణులు, భార్య భర్తలు పాల్గొని, ఆ నృత్యాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. అవి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ, సినీ సంగీత నృత్యాలతో, విభిన్న కార్యక్రమాలతో వేదిక హోరెత్తింది. హాజరైన వారికి తెలుగు సాంప్రదాయ పద్ధతిలో ఉగాది మిఠాయిలు, రుచికరమైన వంటకాలు అరిటాకులో వడ్డించారు. తాల్ చైర్పర్సన్ భారతి కందుకూరి, వైస్-చైర్మన్ , కోశాధికారి రాజేష్ తోలేటి, ఇతర ట్రస్టీలు గిరిధర్ పుట్లూరు, అనిత నోముల, అనిల్ అనంతుల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, నవీన్ గాదంసేతి మరియు కిషోర్ కస్తూరి పాల్గొన్నారు. 'తాల్' ఉగాది-2023 కన్వీనర్ శ్రీదేవి అల్లెద్దుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నటుడు, హీరో, డబ్బింగ్ కళాకారుడు సాయి కుమార్ తన 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని, తన జీవిత విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన సినిమాలలో ప్రేక్షకాదరణ పొందిన డైలాగులు చెప్పి తెలుగువారిని, ప్రేక్షకుల్లో ఉన్న కొందరు కన్నడ వారికోసం కన్నడ డైలాగులు చెప్పి వారిని కూడా కేరింతలు కొట్టించారు. యూకేలో తెలుగు సంస్కృతిని పరిరక్షించడంలో, ప్రోత్సహించడంలో 'తాల్' చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. 'తాల్' వార్షిక పత్రిక “మా తెలుగు”ను సాయి కుమార్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తాల్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, పద్మశ్రీ , బ్రిటన్ ఓబీఈ గ్రహీత, KIMS ఉషా లక్ష్మీ సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘురాం పిల్లరిశెట్టికి అందించి సత్కరించారు. డాక్టర్ రఘురాం మాట్లాడుతూ ఈ పురస్కారం తన జీవితంలో ఎప్పటికీ మంచి జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని అన్నారు. అలాగే 'తాల్' చేస్తున్న సేవా సాంస్కృతిక కార్యక్రమాలను కొనియాడారు. లండన్‌లోని హై కమిషన్ ఆఫ్ ఇండియా మినిస్టర్ (కోఆర్డినేషన్) దీపక్ చౌదరి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా విచ్చేసి, లండన్‌లో 'తాల్' తెలుగువారి కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. అలాగే తెలుగు వారికి భారత దౌత్య కార్యాలయం 'తాల్' సమన్వయంతో సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని గుర్తు చేశారు. ప్రముఖ పర్వతారోహకుడు, ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అన్మిష్ వర్మ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా భారతదేశం నుంచి విచ్చేశారు. తన ఎవరెస్టు శిఖరం ఎక్కినప్పటి అనుభవాలను, రణ విద్యలలో తను గెలుచుకున్న ప్రపంచ స్థాయి పథకాల ప్రక్రియలో ఎదుర్కొన్న సవాళ్లను వివరించి ప్రేక్షకులలో ముఖ్యంగా యువతలో స్ఫూర్తి నింపారు. ప్రముఖ యాంకర్, నటి శ్యామల, కెవ్వు కార్తీక్, ఆర్జే శ్రీవల్లి తమదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. నేపథ్య గాయకులు హారిక నారాయన్, అరుణ్ కౌండిన్యలు తమ ప్రసిద్ధ తెలుగు పాటలతో మైమరిపించడమే కాకుండా ఉర్రూతలూగించే పాటలతో ప్రేక్షకులుమైమరచిపోయారు. లండన్ బారో ఆఫ్ హన్స్లో మేయర్ రఘువీందర్ సింగ్ అతిథిగా విచ్చేసి, 'తాల్' క్రీడల పట్ల చేస్తున్న కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. ప్రతి సంవత్సరం 'తాల్' ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 20-20 క్రికెట్ పోటీలు, 'తాల్' ప్రీమియర్ లీగ్ (TPL), ఈ సంవత్సరం ప్రైమ్ నార్త్ టీపీఎల్ 2023గా, మే 6 నుంచి మూడు నెలల పాటు నిర్వహించబోతున్నట్టు తెలియజేస్తూ టోర్నీకి సంబంధించిన పోస్టర్ని TPL కమిటీ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రేక్షకులకు, నిర్వాహక కమిటీకి, కళాకారులకు, వాలంటీర్లకు, తోటి సంస్థలు, తోడ్పాటు అందించిన స్పాన్సర్లందరికీ 'తాల్' చైర్పర్సన్ భారతి కందుకూరి ధన్యవాదాలు తెలిపారు. -
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు మరియు పంచాంగ శ్రవణం తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో లో మర్చి 22న ఘనంగా జరిగాయి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినా న సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. వేడుకల్లో బాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు సింగపూర్‌లో తొలిసారి స్థానిక కాలమాన ప్రకారం ప్రత్యేక గంటల పంచాంగాన్ని సభ్యులకు అందించారు. జోతిష పండితులు పంచాంగకర్తలు కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు , మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మ దీన్ని రూపొందించారు. ఈ వేడుకల్లో సుమారు 200-250 మంది ప్రవాసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులతో పాటు కర్ణాటక తదితర రాష్ట్రాల వారు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి, భక్షాలు, పులిహోర ప్రసాదం పంపిణి చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ నిర్వహిస్తున్నపలు భక్తి, స్వచ్చంద సేవా కార్యక్రమాలు అభినందనీయమని భక్తులు కొనియాడారు. సాంస్కృతిక నృత్యాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా శశిధర్ రెడ్డి, నంగునూరి వెంకట రమణ, కాసర్ల శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల మరియు సతీష్ పెసరు వ్యవరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా జరుగుటకు మరియు ప్రసాదానికి సహాయం అందించిన దాత లకు, స్పాన్సర్స్ కు సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి , కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి,కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, నడికట్ల భాస్కర్, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి కృష్ణ విజాపూర్, సదానందం అందె, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యం గా ఈ వేడుకలకు ఘనంగా జరగడానికి చేయూతనందించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
తాడేపల్లి: సీఎం జగన్ నివాసంలో శోభకృత్ నామ ఉగాది వేడుకలు (ఫొటోలు)
-
సీఎం జగన్ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం
-
ఉగాది పచ్చడి సేవించిన సీఎం జగన్ దంపతులు
-
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పూలమాల వేసిన సీఎం జగన్
-
సతీసమేతంగా ఉగాది సంబరాల్లో సీఎం జగన్
-
తాడేపల్లిలో శోభకృత్ నామ ఉగాది వేడుకలు.. హాజరైన సీఎం జగన్ దంపతులు
-
సీఎం జగన్ నివాసంలో ఘనంగా ఉగాది వేడుకలు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టి పడే విధంగా ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. వేడుకలకు ముందు శ్రీవెంకటేశ్వర ఆలయంలో సీఎం జగన్ దంపతులు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పంచాంగాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ‘‘రైతులకు మేలు జరగాలి. అక్క చెల్లెమ్మలు, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ అన్నారు. కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. శ్రీశోభకృత్ నామ సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని సుబ్బరామ సోమయాజి అన్నారు. పంచాంగ పఠనం చేసిన సుబ్బరామ సోమయాజిని సీఎం జగన్ సన్మానించారు. తిరుమల ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి వచ్చిన పండితులు.. సీఎం జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం ఇచ్చారు. సీఎం జగన్ దంపతులకు మంత్రి ఆర్కే రోజా మెమెంటో అందజేశారు. సాంస్కృతిక శాఖ రూపొందించిన క్యాలెండర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ దంపతులు వీక్షించారు. ఉద్యోగులు, శ్రామికులు, కర్షకులకు మంచి ఫలితాలు ఉంటాయన్నారు. పాడి పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉంటుందన్నారు. ఆహార ఉత్పతులతో ముడిపడిన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాలు ఏర్పాటు చేశారు. మండలంలోని గోడలకు దశావతారాల బొమ్మలు ఆకట్టుకున్నాయి. -
Ugadi 2023: కొత్త కాంతుల శోభకృత్.. తెలుగు రాష్ట్రాల్లో తొలి పండగ సందడి (ఫొటోలు)
-
ఘనంగా టాస్ ఉగాది సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (టాస్) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడేళ్ల తర్వాత జరుగుతున్న వేడుకలు కావడంతో టాస్ కన్నుల పండువగా ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. సినీ నేపథ్య గాయని ఉషా పాటలు అలరించాయి. టాస్ సాంస్కృతిక కార్యదర్శి నిరంజన్ నూక ఆధ్వర్యంలో టాస్ ప్రస్తుత, పూర్వ కార్యనిర్వాహాక సభ్యుల జ్యోతి ప్రజ్వాలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను చూసి ఇండో, స్కాటీష్ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఉగాది వేడుకలను పురస్కరించుకుని టాస్ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. టాస్ చైర్‌పర్సన్‌గా మైథిలీ కెంటూరీ, అధ్యక్షుడిగా శివ చింపిరి, ప్రధాన కార్యదర్శిగా ఉదయ్ కుమార్ కూదాడి, సంయుక్త కార్యదర్శిగా వెంకటేష్ గడ్డం, కోశాధికారిగా నిరంజన్ నూక, సాంస్కృతిక కార్యదర్శిగా మర్రి విజయ్‌కుమార్, మహిళా కార్యదర్శిగా మాధవీలత, క్రీడా కార్యదర్శిగా జాకీర్షేక్, ఐటీ, మీడియా కార్యదర్శిగా పండరీ జైన్ పొలిశెట్టి, యువజన కార్యదర్శిగా నరేశ్ దీకొండ, అసోసియేట్స్ ప్రాజెక్ట్ కార్యదర్శిగా కర్నాటి బాలాజీ, అసోసియేట్స్ క్రీడా కార్యదర్శిగా సాంబ రాజశేఖర్‌లు ఎన్నికయ్యారు. -
స్విట్జర్లాండ్‌లో ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ (సీహెచ్) జ్యూరీచ్లో ఉగాది వేడుకలు వైభవంగా జరిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కనువిందుగా ఈ వేడుక సాగింది. స్విట్జర్లాండ్‌లో స్థిర పడిన 200 మంది తెలుగు ప్రజలు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ ఉగాది వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విటర్లాండ్ ప్రెసిడెంట్ గనికాంబ కడలి, జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గారావు కారంకి, ట్రెజరర్ మాధురి ముళ్ళపూడి , కల్చరల్ సెక్రెటరీ మాణిక్యవల్లి చాగంటి, స్పోర్ట్స్ సెక్రెటరీ రామచంద్ర వుట్టిలతో పాటు ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యుల సహకారంతో నిర్వహించారు. -
సీజేఐ నివాసంలో ఉగాది వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నివాసంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. శనివారం సాయంత్రం జరిగిన వేడుకలకు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హిమా కోహ్లీ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి, తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, వేద ఆశీర్వచనం, సినీ గాయకులు కారుణ్య, సాహితీల సంగీత విభావరి జరిగింది. తెలుగు వంటకాలతో ఘనంగా విందు ఏర్పాటు చేశారు. -
ఇది ప్రజాసంగ్రామ సంవత్సరం
సాక్షి, హైదరాబాద్: ‘ఈ ఏడాది ప్రజాసంగ్రామ సంవత్సరం.. ధర్మ విజయ సంవత్సరం’అని శ్రీ శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ చెప్పారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది పండుగను పురస్కరించుకొని ఆయన పంచాంగ శ్రవణం నిర్వహించారు. కొత్త ఏడాదిలోనైనా రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వస్తుందా అని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధా కర్‌రెడ్డి పంచాంగ ప్రవచనకర్త శర్మను అడగ్గా ప్రతిపక్షాల బలం వల్ల ప్రభుత్వం కాస్త గుణపాఠం నేర్చుకోకతప్పదని ఆయన బదులిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘దే శం, రాష్ట్రంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉం డాలని దేవుడిని కోరుకుంటున్నా. అందరూ అనుకున్న లక్ష్యాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలి’అని అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ‘కేసీఆర్ కుటుంబ, నియంత, అవినీతి పాలనలో ప్రజలపై మోపిన భారాలు కొత్త సంవత్సరంలో తొలగిపోవాలి. ప్రజలకు మేలు జరగాలి. బీజేపీ శాంతియుత మార్గంలో చేపట్టే పోరాటాలకు ప్రజలు అండగా నిలవాలి’అని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, విజయశాంతి, కె.స్వామిగౌడ్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మంత్రి శ్రీనివాస్, బంగారు శ్రుతి, ఆలె భాస్కర్, గీతామూర్తి పాల్గొన్నారు. -
ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది గ్రహస్థితుల ప్రకారం శని రాజుగా ఉన్నాడని, దీంతో రాష్ట్రంలో పంటలు సంతృప్తిగా పండి, ప్రజలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని జ్యోతిష పండితుడు చిలుకూరి శ్రీనివాసమూర్తి చెప్పారు. శుభకృత్ నామ ఉగాది పర్వదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నాయకులు దామోదర రాజనర్సింహ, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మల్లు రవి, గోపిశెట్టి నిరంజన్, కుమారరావు, హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం చేసిన చిలుకూరి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు. తెలంగాణలో ఆర్థికాభివృద్ధి ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం వైద్యంపై ఎక్కువగా ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది అమెరికాతో భారతదేశ సంబంధాలు బాగుంటాయని, పాకిస్తాన్, చైనాలతో వైరం ఉంటుందని అన్నారు. నదుల అనుసంధానం కోసం చర్చలు జరుగుతాయని, కేంద్రంలో ఓ ముఖ్య నాయకుడి మరణ వార్త వింటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుందని, తెలుగుదేశం పార్టీ విచిత్రమైన పొత్తులకు ప్రయత్నిస్తుందని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారని, అక్టోబర్‌లో రేవంత్‌రెడ్డి మరింత విజృంభిస్తారని శ్రీనివాసమూర్తి జోస్యం చెప్పారు. -
సింగపూర్‌లో తొలి తెలుగు పండుగ “ఉగాది” వేడుకలు
-
సింగపూర్‌లో ఉగాది సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు సింగపూర్‌లోని సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో ఘనంగా జరిగాయి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినా న సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ వేడుకల్లో సుమారు 200 మంది ప్రవాసి తెలుగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సమన్వయకర్తలుగా దీప నల్ల, నంగునూరి వెంకట రమణ, కాసర్ల శ్రీనివాస్ మరియు గోనె నరేందర్ రెడ్డి వ్యవరించారు. అదే విధంగా సంబరాలు విజయవంతంగా జరిగేందుకు సహయం అందించిన దాతలకు టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్రాజులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సొసైటీ ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్, రోజా రమణి, మరియు కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, శ్రీధర్ కొల్లూరి, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్, మరియు ప్రవీణ్ మామిడాల గార్లు సంబరాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు (ఫోటోలు)
-
సీఎం జగన్ దంపతులకు పట్టువస్త్రాలు సమర్పణ
-
రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు కలగాలి: సీఎం జగన్
-
విశాఖ శారదపీఠంలో ఉగాది వేడుకలు
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు
-
ప్రగతి భవన్ లో ఉగాది వేడుకలు
-
పిల్లలతో సీఎం వైఎస్ జగన్ ఇంటరాక్ట్
-
వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్
-
ఉగాది వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు
-
AP: శుభకృత్‌లో అన్నీ శుభాలే
సాక్షి, అమరావతి: శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు జరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పంచకట్టులో సీఎం వైఎస్ జగన్, సతీమణి భారతితో కలిసి ఈ వేడుకలకు ముఖ్య అతి«థులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ రోజు శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని, పంచాంగాలన్నీ ఈ పేరులోనే శుభం అన్న మాట కనిపిస్తోందని చెబుతున్నాయని తెలిపారు. సతీమణి భారతీరెడ్డికి కంకణం కడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో విప్ చెవిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి తదితరులు ఈ సంవత్సరం అంతా రాష్ట్ర ప్రజలందరికీ శుభం జరుగుతుందని చెబుతున్న నేపథ్యంలో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి ఇంకా బలాన్నివ్వాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సంవత్సరం అంతా ప్రజలందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. ఇక్కడ ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, మిత్రులే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు, ప్రతి తాతకు, అవ్వకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. క్యాలెండర్లు, పుస్తకాలు ఆవిష్కరించారు. సీఎం దంపతులకు ఘన స్వాగతం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన సీఎం దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, సాంస్కృతిక, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. పంచాంగ శ్రవణ వేదిక వద్దకు వస్తున్న సమయంలో సీఎం వైఎస్ జగన్ నుదిటిపై తిలకం దిద్దుతున్న ఆయన సతీమణి వైఎస్ భారతి ప్రత్యేక వేదిక వద్ద ఏర్పాటు చేసిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం దంపతులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సంప్రదాయ పంచకట్టులో వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుదిటిపై సతీమణి భారతి తిలకం దిద్దగా, ఆమె నుదిటిపై సీఎం కుంకుమ అద్దడంఅక్కడున్న వారందరినీ ఆకర్షించింది. వేద పండితులు సీఎం చేతికి కంకణ ధారణ చేయగా, భారతి చేతికి సీఎం కంకణ ధారణ చేశారు. అనంతరం వారు వేదం నేర్చుకుంటున్న చిన్నారులతో కలిసి ప్రాంగణమంతా కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ పేరుపేరున పలకరిస్తూ సభా వేదికపైకి చేరుకున్నారు. వైఎస్ భారతి నుదిటిపై తిలకం అద్దుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాలెండర్ల ఆవిష్కరణ సమాచార శాఖ రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్, వ్యవసాయ పంచాంగం 2022–23, ఉద్యానవన పంచాంగం 2022–23, సాంస్కృతిక శాఖ రూపొందించిన శిల్పారామం క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు జయశ్రీ రచించిన ‘ఆమెకు తోడుగా న్యాయదేవత’, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘తెలుగు సాహిత్యం, సమాజం చరిత్ర – రెండువేల సంవత్సరాలు’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రంలో వివిధ దేవస్థానాలకు చెందిన వేద పండితులను సీఎం సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలపై చిన్నారుల నృత్య రూపకాన్ని తిలకించి, వారితో కలసి ఫొటోలు దిగారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్.మల్లిఖార్జునరావు రూపొందించిన డీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చిత్రపటాన్ని సీఎం ఆవిష్కరించారు. ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్ రూపంలో విరాళం అందజేశారు. ఈ కార్యక్రమాలను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆద్యంతం దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం సీఎం దంపతులకు శ్రీవారి దశావతార కళారూపం అందజేశారు. శుభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని సిద్ధాంతి సోమయాజులుకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి (ప్రజా వ్యవహారాలు), జీవీడీ కృష్ణమోహన్ (కమ్యూనికేషన్స్), పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజలు హాయిగా ఉంటారు.. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు పంచాంగ పఠనం చేశారు. పేరుకు తగ్గట్లుగానే శుభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలే జరుగుతాయని సిద్ధాంతి చెప్పారు. ప్రభువుల చల్లని పాలనకు తగ్గట్లే ప్రజలూ హాయిగా ఉంటారని, చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుందన్నారు. ఓర్పుగా అవాంతరాలను ఎదుర్కొంటూ మంచి పాలన అందిస్తారని సీఎం జగన్‌ను సిద్ధాంతి ఆశీర్వదించారు. ఉగాది పచ్చడిని స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు శుభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని సీఎం ఆవిష్కరించి, కప్పగన్తు సుబ్బరామ సోమయాజులకు అందజేశారు. అనంతరం ఆయన సీఎం దంపతులకు ఉగాది పచ్చడి అందించారు. సిద్ధాంతిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం సత్కరించారు. పంచాంగ శ్రవణం అనంతరం ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం స్థానాచార్యులు, అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. ఉట్టిపడిన గ్రామీణ వాతావరణం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లతో ఒక గ్రామ నమూనా ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయంలో ఒక అరుగు మీద సీఎం దంపతులు కూర్చోగా, వారికి ఎదురుగా మరో అరుగుపై సిద్ధాంతి కూర్చొన్నారు. సచివాలయం ఎదురుగా ఆహుతులు కూర్చొని తిలకించేలా ఏర్పాట్లు చేశారు. పంచాంగ శ్రవణం, ఇతర కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Ugadi 2022: మనమే మార్గదర్శి
విద్య, విద్యుత్తు, విద్వత్తు, తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం.. ఇలా చదివితే చాంతాడంత లిస్టు అయ్యేన్ని రంగాల్లో తెలంగాణ ముందుంది. కొన్ని దుష్టశక్తులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా.. తెలంగాణ ప్రజలు ఏకోన్ముఖంగా ముందుకు కలిసిరావటం వల్లనే ఈ పురోగతి సాధ్యమైంది. ప్రజల అండ, భగవంతుడి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కలగటం వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతృప్తి నిచ్చింది. మనకు జాతి, కులం, మతం భేదం లేదు. తెలంగాణ జాతి అంతా ఒకటే. అందరూ సుఖసంతోషాలతో ఉండాలి. మన బంగారు తెలంగాణ స్వప్నం నిజం కావాలి. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం సాధించనంత అద్భుత ఫలితాలు ఎన్నిం టినో తెలంగాణ సాధించి చూపిందని సీఎం కె.చంద్రశేఖరరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో కరెంటు కష్టాలు, తాగునీరు, సాగునీటి వసతి.. తదితరాలపై ఎన్నో సందేహాలు, అనుమానాలు రేకెత్తించారన్నారు. వాటన్నింటినీ అధిగమించి తెలంగాణ దేశంలోనే వేగంగా ప్రగతిపథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధి పథంలో ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లాంటి రాష్ట్రాల కంటే ముందు వరసలో ఉండి అభివృద్ధి దిశలో పరుగుపెడుతోందన్నారు. కుల, మత, వర్గ భేదాలకతీతంగా, అన్ని వర్గాల సహకారంతో తెలం గాణ గొప్పగా రాణిస్తోందని, ఎలాంటి పథకంలోనైనా యావత్తు దేశం తెలంగాణను చూసి నేర్చుకోవాల్సిన స్థితికి చేరిందని చెప్పారు. శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం ప్రగతి భవన్లో ఘనంగా జరిగాయి. శృంగేరీ ఆస్థాన పౌరాణికులు బాచంపల్లి సంతోష్‌కుమారశాస్త్రి పంచాంగాన్ని పఠించారు. అనంతరం సీఎం యావత్తు తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగానికి ఉపక్రమించగానే ‘లాంగ్‌లివ్ కేసీఆర్’ అంటూ నేతలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. సమైక్య రాష్ట్రాన్ని మించి ఆదాయం ‘పంచాంగ పఠనం సందర్భంలో పౌరాణికులు కొన్ని మంచి మాటలు చెప్పారు. ఇక మాస్కుల్లేవు, ఆర్టీపీసీఆర్ లేదు, పీసీఆర్ లేదు.. వాటి గొడవే లేదంటూ శుభం పలికారు. చాలా సంతోషం. సర్వజనులకు శుభకృత్ నామ సంవత్సరంలో సుఖ శాంతి ఐశ్వర్యాలు కలగాలని భగవంతుడిని నిండు మనసుతో ప్రార్థిస్తున్నాను. అపోహలు, అనుమానాలు, అసహాయతలు, నిస్సహాయతలు, ఔతుందా కాదా అన్న సందిగ్ధం, చర్చోప చర్చల మధ్య 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రస్తుతం అన్నిరంగాల్లో ముందున్నాం. గత ఏడాది రాష్ట్రం రూ.1,77,630 కోట్ల ఆదాయాన్ని సాధించినట్టుగా రిజర్వు బ్యాంకు తేల్చిందని అధికారులు చెప్పారు. 23 జిల్లాల సమైక్య రాష్ట్రాన్ని మనం ఎప్పుడో దాటిపోయామని, అంతకుమించిన ఆదాయాన్ని సాధిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ కలిసి రావడం వల్లే ఈ విధంగా ఎంతో సంపద సృష్టించాం. ఇప్పుడు తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి పోయి పరిశీలించినా ఎకరం రూ.25 లక్షలు, రూ.30 లక్షల లోపు లేదు. మరి ఈ సంపద ఎలా సృష్టించగలిగాం. ఇది ఒక్క అధికారుల ఘనతే కాదు, అనేక అంశాలు కలిసి రావటంతోనే ఇది సాధ్యమైంది..’అని కేసీఆర్ చెప్పారు. దళిత బంధుతో అద్భుతాలు ‘దళితుల జీవితాలు మార్చేందుకు తెచ్చిన దళిత బంధు అద్భుతాలు ఆవిష్కరించబోతోంది. దళిత జాతి వజ్రాలు అద్భుత ఫలితాలు సాధించబోతున్నారు. దేశానికే కొత్త మార్గనిర్దేశం ఇచ్చే దిశగా తెలంగాణ నిలవబోతోందని శుభకృత్ సంవత్సరం తొలిరోజు నేను సంకల్పిస్తున్నాను. ఎన్నికల కోసం, రాజకీయ స్టంట్ల కోసం కాకుండా ఈ విషయంలో ఎవరూ చేయని సాహసాన్ని మనస్ఫూర్తిగా చేశాను. దళితుల సంక్షేమం విషయంలో ఇప్పుడు యావత్తు దేశం తెలంగాణ నుంచే నేర్చుకునే పరిస్థితి కల్పించాం. ఇదొక్కటే కాదు.. ఏ పథకం అయినా దేశం మొత్తం తెలంగాణ నుంచే నేర్చుకునేలా చేశాం..’అని అన్నారు. అన్ని వర్గాల సమున్నతికి కృషి ‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి బడ్జెట్ ఏనాడూ రూ.10 వేల కోట్లు కూడా దాటలేదు. తాజా బడ్జెట్‌ను మనం రూ.రెండున్నర లక్షల కోట్లుగా పెట్టుకున్నాం. 95 శాతం ఉద్యోగాలు మనకే వచ్చేలా కొత్త విధానాన్ని ఇటీవలే ఆవిష్కరించుకున్నాం. వివక్ష లేకుండా అన్ని వర్గాల సమున్నతి కోసం యత్నిస్తున్నాం. అద్భుత, అపురూప, ఆర్థిక సౌష్టవంతో, సంస్కారంతో, సర్వమత సామరస్యంతో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తోంది. దీనికి ఎక్కడా అపశృతి రాకుండా ఇంకా గొప్పగా, ఉజ్వలంగా దేశానికే అన్నంపెట్టే విధంగా ముందుకు సాగాలని, తెలంగాణ రైతుల కష్టం ఫలించాలని, అద్భుతంగా పంటలు పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, మన సామూహిక స్వప్నం బంగారు తెలంగాణ నిజం కావాలని కోరుకుంటున్నా..’అని సీఎం చెప్పారు. బ్రాహ్మణులకు సత్కారాలు, వసతులు ‘బ్రాహ్మణులు దేశంలో ఎక్కడా లేనివిధంగా వారి స్థాయికి తగ్గట్టు సత్కారాలు, వసతులు తెలంగాణలో పొందుతున్నారని కాలర్ ఎగరేసి చెప్పగలను. బంజారాహిల్స్‌లో కట్టిన బ్రాహ్మణ సదనాన్ని త్వరలో ప్రారంభిస్తాం. ఆధ్యాత్మిక రంగంలో తెలంగాణ దేనికీ తీసిపోదు. యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దాం. సర్వజనుల సంక్షేమం కోసం పరితప్పిస్తున్న మనకు దేవుడి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరి అభ్యుదయం మనందరి అభిమతం అయ్యేలా ఆశీర్వదించాలని దేవదేవుడిని కోరుకుంటున్నా..’అని కేసీఆర్ తెలిపారు. పంచాంగం ఆవిష్కరణ కాగా కృష్ణమాచార్య రూపొందించిన పంచాంగాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించారు. వారిని ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువరించిన ‘మా తెలంగాణం కోటి ఎకరాల మాగాణం’పుస్తకాన్ని కూడా సీఎం ఆవిష్కరించారు. -
ఉగాది వేడుకల్లో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు
-
సకల శుభారంభం
చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది పర్వదినం. ఆబాలగోపాలం ఆనందంగా చేసుకునే పండుగ ఉగాది. కాలగమన సౌ«ధానికి తొలి వాకిలి. పౌర్ణమిరోజున చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ మాసానికి అదే పేరు ఉంటుంది. చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉండటం వలన ఈ మాసావికి చైత్రమాసం అని పేరు. అన్ని ఋతువులకన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు. కోకిల పాటలు, సన్నజాజి, మల్లెల పరిమళాలు, చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో ప్రకృతిమాత కొత్త అందాలు సంతరించుకుంటుంది. మనిషిని, మనస్సును, బుద్ధిని వికసింపజేసే అహ్లాదభరిత వాతావరణంలో ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. అంటే నిన్నటి వరకు ఉన్న ప్లవనామ సంవత్సరం నుంచి నేటితో శుభకృతు నామ సంవత్సర ఉగాదిలోకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా ఉగాది విశిష్టతతోపాటు ఈ రోజున ఏమేం చేయాలో తెలుసుకుందాం... చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి , వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి. చైత్రమాసానికి శిశిర ఋతువు పోయి వసంత ఋతువు... అంటే ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి. పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం, పగుళ్ళు, పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత, పిందెలు, పండ్లు – ఇలా అంతా ఫలవంతంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం ఉల్లాసాన్ని, ఉత్సాహాన్నీ ఇస్తుంది. చలికాలంలో, వర్షాకాలంలో ఉండే మందకొడితనం వసంతఋతువు నుంచి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం. ఎలా జరుపుకోవాలి? ఉగాది పండుగ జరుపుకునే విధానాన్ని అత్యంత ప్రామాణిక గ్రంథమైన ‘ధర్మసింధు’’పంచవిధుల సమన్వితం’గా సూచిస్తోంది. అవి 1. తైలాభ్యంగనం, 2. నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), 4. ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), ç5. పంచాంగ శ్రవణం... తైలాభ్యంగనం తైలాభ్యంగనం అంటే తల మొదలుకొని ఒళ్లంతా నువ్వుల నూనె పట్టించి నలుగుపెట్టి తలస్నానం చేయడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను నివసిస్తారని, అందుకే నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన వారికి లక్ష్మి, గంగాదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. నూతన సంవత్సర స్తోత్రం అభ్యంగ స్నానానంతరం దీపధూపాది పూజాదికాలు చేసిన తర్వాత మామిడి ఆకులతో, పూలతోరణాలతో అలంకరించిన పూజామందిరంలో నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించాలి. ఉగాడి పచ్చడి సేవనం ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ సేవించాలి. ఉగాది నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా షడ్రుచుల సమ్మేళనంతో ఉంటుందని చెబుతారు. పురాణ కాలం నుంచి... చారిత్రకాల వరకు... ► అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుమూర్తి మత్సా్యవతారం ఎత్తింది చైత్ర శుద్ధ పాడ్యమి నాడే. ► బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించింది ఉగాదినాడే. ► ఈ కారణంగానే ఉగాది నాడు కొత్త లెక్కలు ప్రారంభించే ఆచారం వచ్చింది. ► వనవాసానంతరం సీతారాములు అయోధ్యకు తిరిగి వచ్చింది ఈనాడే. ► వసు చక్రవర్తి తపస్సు చేసి ఈనాడే రాజ్యాధికారం సాధించాడు. అందుకే ఉగాదికి అంత ప్రాశస్త్యం. ► చరిత్రలో అత్యంత పరాక్రమశాలి విక్రమార్కుడు. ఆ తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యింది చైత్ర శుద్ధ పాడ్యమినాడే. అదేవిధంగా మరో శకకారుడైన శాలివాహన శకం కూడా ఉగాదిరోజునే ఆరంభమైంది. వీరిద్దరినీ ఉగాదిరోజున స్మరించుకోవడం ఆచారం. ► చైత్ర శుక్ల పాడ్యమి నాడు నూతన సంవత్సరాది. ఈ సంప్రదాయం కన్నడ, మహారాష్ట్రులకు కూడ ఉంది. పంచాంగ శ్రవణం ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి గంగాస్నాన ఫలితం లభిస్తుందని పురాణోక్తి. ఏమిటీ పంచాంగం? మనకు తెలుగు సంవత్సరాలు ‘ప్రభవ’ తో మొదలుపెట్టి ‘అక్షయ’ నామ సంవత్సరం వరకు గల 60 సంవత్సరాలలో తాము జన్మించిన నామ సంవత్సరాన్ని జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చూస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరాలకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి ‘షష్టిపూర్తి’ ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు. పంచాంగంలో ఏముంటుంది? నిత్య వ్యవహారాల కోసం అందరూ ఇంగ్లీషు క్యాలెండర్‌ని ఉపయోగిస్తున్నప్పటికీ... శుభకార్యాలు, పూజాపురస్కారాలు, పితృ దేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికి ‘పంచాంగం’ చూడటమే ఆచారం. ఇది మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం. ‘పంచాంగం’ అంటే... తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంగాలు కలది అని అర్థం. పాడ్యమి నుంచి పూర్ణిమ లేదా అమావాస్య వరకు 15 తిథులు, ఆదివారం నుంచి శనివారం వరకు ఏడు వారాలు, అశ్వని మొదలు రేవతి వరకు 27 నక్షత్రాలు, విష్కంభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగాలు, బవ మొదలుకొని కిం స్తుఘ్నం వరకు11 కర ణాలు ఉన్నాయి. వీటన్నిటినీ తెలిపేదే పంచాంగం. ‘పంచాంగ శ్రవణం’ ఉగాది విధుల్లో ఒకటి. నేడు పల్లెటూళ్లు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము . ఇప్పుడంటే పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి కానీ ఇంతకుమునుపు ఇలా దొరికేవి కాదు. తాళపత్రాల మీద రాసినవి మాత్రమే... అదీ కొందరు పండితులవద్ద మాత్రమే ఉండేవి కాబట్టి వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేసేవారు. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పం చాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏయే గ్రహాలకు ఏయే అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి. ఎవరిని ధ్యానించాలి? ఈ పండుగకు అధిదేవత రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి లేదా వినాయకుడు వంటి దేవతలు కారు. కాలపురుషుడు ఈ పర్వపు అధిదేవత. ‘ఓం కాలాయనమః’ అనే నమక మంత్రం గాని విష్ణు సహస్రం గాని పఠించాలి. భగవంతుడే కాలపురుషుడని, నిత్యం అతణ్ణి ధ్యానించాలని శాస్త్రం చెబుతోంది. మానవ జీవితం అంతా కాలం పైననే ఆధారపడి ఉండుట వలన కాలపురుషుని ఆరాధించాలి. మనం చేసే పంచాంగ శ్రవణమే ఈ ఆరాధన. విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో చెప్పినట్లు మనం ఏ రూపంలో స్తుతించినా అది పరమాత్మునికే చెందుతుంది. ఈ దృష్టితో కాలపురుషుని పంచాంగ శ్రవణ రూపాన స్తుతించాలి. ఇంకనూ సత్కర్మానుష్టానానికి కావలసిన కాల విశేషణాలను తెలుసుకోవడమే పంచాంగం ప్రయోజనం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనేవి పంచాంగాలు. ఒక శుభ కార్యం గాని ఒక ధర్మకార్యం గాని చేయడానికి పంచాంగమే మనకు మార్గదర్శనం చేస్తుంది. ఈ చైత్రమాసపు శుద్ధ పాడ్యమి నుంచి వసంతరాత్రులు జరుపుకుంటారు. అంతేకాదు, తెలుగువారి ప్రీతికరమైన శ్రీ రామనవమి కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ శ్రీ శుభకృత్‌నామ సంవత్సర ఉగాది మన దేశమంతటికీ శుభాలను చేకూరుస్తుందనీ, సకల జీవులకు సుఖశాంతులు ప్రసాదించగలదనీ ఆకాంక్షిద్దాం. – డి.వి.ఆర్. -
రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు.. సీఎం కేసీఆర్ దూరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ మధ్య దూరం మరింత రోజురోజుకీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలకు కేసీఆర్‌తో పాటు మంత్రులు కూడా హాజరుకాలేదు. కాగా రాజ్‌భవన్‌లో శుక్రవారం శ్రీ శుభకృత్ నామ ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాంలో పాల్గొనాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్‌ను ఆహ్వానించారు. ప్రగతి భవన్‌కు ఆహ్వానం కూడా పంపారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు కూడా గైర్హాజరయ్యారు. స్టేజ్‌పై ఉన్న ఫ్లెక్సీలోనూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఫ్లైక్సీలో కేసీఆర్ ఫోటో కనిపించలేదు. రాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలకు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు , ఈటెల రాజేందర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చడా వెంకట్ రెడ్డి, టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శినం మొగులయ్య, పలువురు జడ్జీలు, ప్రముఖులు హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వేడుకల్లో పాల్గొన్నారు. చదవండి: ‘తెలంగాణ సర్కార్ ఏం చేస్తోందో వచ్చి చూడండి’ -
ఉగాది వేడుకల్లో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు
సాక్షి, అమరావతి: శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా రేపు(శనివారం) తాడేపల్లిలో జరగనున్న వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు పాల్గొననున్నారు. ఉదయం 10.36కి పంచాంగ పఠనంలో సీఎం దంపతులు పాల్గొంటారు. పంచాంగ పఠనం కోసం గ్రామీణ వాతావరణంలో ఏర్పాటు పూర్తి చేశారు. చదవండి: శుభకృత్‌లో అన్నీ శుభాలు కలగాలి: సీఎం జగన్ శ్రీ శుభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, సమృద్ధిగా వానలు కురవాలని; పంటలు బాగా పండాలని, రైతులకు మేలు జరగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు. -
సీఎం కేసీఆర్ సారొస్తారొస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉగాది రాజకీయాలు రంజుగా మారాయి. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు రాజ్‌భవన్‌లో ముందస్తు ఉగాది వేడుకలను తలపెట్టిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆహ్వానించడం ఆసక్తి రేపుతోంది. సీఎంతోపాటు రాష్ట్ర మంత్రులు, విపక్షాల ముఖ్య నేతలు, ఇతర రంగాల ప్రముఖులకు కూడా రాజ్‌భవన్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. అయితే విభేదాల కారణంగా చాలా కాలంగా రాజ్‌భవన్ గడప తొక్కని సీఎం కేసీఆర్.. ఇప్పుడు గవర్నర్ ఆహ్వా నం మేరకు వెళతారా, లేదా అన్నదానిపై చర్చ జరుగుతోంది. ‘నూతన సంవత్సరం సందర్భంగా పాత చేదు జ్ఞాపకాలను మరిచి కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని పెద్దలు అంటుంటా రని.. పరస్పరం ఆరోపణలు చేసుకునే స్థాయికి వెళ్లిన గవర్నర్, సీఎం మధ్య విభేదాలు ఉగాదితో సమసిపోతాయా?, కొనసాగుతాయా? అన్నది శుక్రవారం తేలిపోతుంద’ని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాజ్‌భవన్ ఉత్సవాలకు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఒకరిపై ఒకరు నిత్యం విమర్శలు చేసుకునే నేతలంతా ఎదురుపడే నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొంది. మరోవైపు సీఎం కేసీఆర్ శనివారం ప్రత్యేకంగా ప్రగతిభవన్‌లోని జనహితలో ఉగాది వేడుకలను తలపెట్టారు. దానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. దానికి ఎవరెవరు హాజరువుతారనే దానిపై చర్చ జరుగుతోంది. విభేదాలకు చెక్ పడేనా? గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని, బీజేపీ రాజకీయాలకు రాజ్‌భవన్ అడ్డాగా మారిందని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వమే గవర్నర్‌గా తనకు అందాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదని తమిళిసై అంటున్నారు. ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినప్పుడు గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచడంతో రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య విభేదాలు మొదటిసారిగా బహిర్గతమయ్యాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడినప్పటి నుంచి దూరం పెరిగినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇక సామాన్యుల నుంచి విన్నపాలు స్వీకరించడానికి రాజ్‌భవన్ గేటు వద్ద గ్రివెన్స్ బాక్స్ ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి రుచించలేదు. ఇక గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రభుత్వం పంపే ప్రసంగాన్ని గవర్నర్ చదవాల్సి ఉంటుంది. కానీ కోవిడ్ నేపథ్యంలో గణతంత్ర దినాన్ని సాదాసీదాగా నిర్వహించాలని, గవర్నర్ ప్రసంగం అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్ ఇందుకు భిన్నంగా గణతంత్ర వేడుకల్లో సొంతంగా ప్రసంగించారు. అందులో రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపడాల్సి ఉందని గవర్నర్ పేర్కొనడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. ఈ క్రమంలోనే గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. దానిని గవర్నర్ తప్పుపట్టారు కూడా. మరోవైపు సమ్మక్క–సారక్క జాతరలో పాల్గొనడానికి హెలికాప్టర్ కావాలని గవర్నర్ కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య విభేదాలు ముదిరాయన్న అభిప్రాయం నెలకొంది. ఇలాంటి సమయంలో ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్‌ను గవర్నర్ ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. -
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ అధ్వర్యంలో ఉగాది వేడుకలు
లండన్: ప్లవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ అధ్వర్యంలో ఆన్లైన్లో ఈ నెల 18 న “ఉగాది సంబరాలు 2021” వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అంతేకాకుండా అసోసియేషన్ 19 వ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్నారు. కాగా లాక్డౌన్ కారణంగా ఈసారి కూడా వేడుకలను ఆన్లైన్లో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రముఖ రాజకీయ నేత, నటుడు డాక్టర్ బాబు మోహన్ హాజరయ్యారు. స్కాట్లాండ్, యూకేలోని తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా తన రాజకీయ అనుభవాలు, సినీ ప్రస్థానం గురించి తెలుగు ప్రజలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ పర్రి మాట్లాడుతూ.. తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ తరపున ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా మదర్స్‌డే సందర్భంగా మహిళలను ఉద్ధేశించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. అంతేకాకుండా భారత్ నుంచి యూకే, స్కాట్లాండ్కు ఇంటర్నేషనల్ స్టడీస్ కోసం వస్తోన్న విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నామనీ ప్రకటించారు. ఉగాదిపర్వదినం సందర్భంగా అందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని తెలుపుతూ అందరికీ శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శివ చింపిరి, చైర్మన్ మైధిలి కెంబూరి, సాంస్కృతిక కార్యదర్శి నిరంజన్, విజయ్‌కుమార్, మాధవి లత, ఉదయ్‌కుమార్ తదితరలు హజరయ్యారు. చదవండి: సింగపూర్‌లో వైభవంగా సంగీత రాఘవధాన కార్యక్రమం.. -
ఫిన్లాండ్ తెలుగు అసోషియేషన్ ఉగాది పండగ శుభాకాంక్షలు
హెల్సింకి: ఫిన్లాండ్ దేశంలో ‘ఫిన్లాండ్ తెలుగు అసోషియేషన్’ రెండు తెలుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల అభివృద్దికి ఎంతో కృషి చేస్తోంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు తెలుగు పండగలను నిర్వహిస్తోంది. తెలుగు పండగల గొప్పదనాన్ని నేటి తరాలకు తెలియజేస్తోంది. ఫిన్లాండ్ దేశంలో సుమారు వెయ్యికి పైగా తెలుగు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. ఈ ఏడాది రఘునాథ్ పర్లపల్లి ఫిన్లాండ్ తెలుగు అసోషియేషన్(ఎఫ్ఐటీఏ)కి నూతన అధ్యక్షుడిగా నియమించడ్డారు. ఆయన ఈ పదవిలో మర్చి 2023 వరకు కొనసాగుతారు. ఉగాది పండగ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిన్లాండ్లో నివసించే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ‘శ్రీ ప్లవ నామ తెలుగు నూతన సంవత్సరం( ఉగాది) పండగ’ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేసే ఓ ప్రత్యేక వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. ఈ వీడియోలో చిన్నారులు శ్రీ ప్లవ నామ సంవత్సర(ఉగాది) శుభాకాంక్షలు తెలియజేశారు. ఎఫ్ఐటీఏ నిర్వహించిన పలు కార్యక్రమాలకు సహకారం అందించిన న్యూస్‌పేపర్లు, టీవీ చానళ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎప్ఐటీఏ తరపున తెలుగు ప్రజలందరికీ ఈ ఉగాది పండగ నుంచి శుభం జరగాలని కోరుకుంటున్నాని పేర్కొన్నారు. చదవండి: ఉగాదిరోజున సింగపూర్‌లో ఘనంగా శ్రీవారి కల్యాణం -
ఉగాదిరోజున సింగపూర్‌లో ఘనంగా శ్రీవారి కల్యాణం
సింగపూర్: లోక కల్యాణార్థం శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది రోజున (ఏప్రిల్ 13) సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సింగపూర్‌లోని సెరంగూన్ రోడ్డులో ఉన్న శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. శ్రీవారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకంతో పాటు మహా గణపతి, విష్ణుదుర్గ, మహాలక్ష్మి, ఆంజనేయస్వామి వార్లకు అభిషేకం మొదలగు విశేష పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం శ్రీవారి ఆస్ధానంలో బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం పఠించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హిందూ ఎండోమెంట్స్ బోర్డ్ నిర్దేశించిన మార్గదర్శకాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయానికి వచ్చే భక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించడం, భక్తుల వివరాల సేకరించడంతో పాటు భక్తులు భౌతిక దూరాన్ని పాటించేలా వివిధ ఏర్పాట్లు చేశారు. కలియుగ దైవం కృప అందరికీ కలగాలనే సత్సంకల్పంతో భక్తులు ఇంటి నుంచే శ్రీనివాస కల్యాణోత్సవం వీక్షించేలా ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని ప్రత్యేక ప్యాకెట్లో సుమారు 2000 మందికి అందించారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి తెలుగువారందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాంగ పఠనం చేసిన నాగఫణి శర్మకు, బండారు దత్తాత్రేయ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ పోలిశెట్టి, కార్యదర్శి సత్యచిర్ల పాల్గొన్నారు. చదవండి: ఉగాది.. కాలగమన సౌధానికి తొలి వాకిలి -
ప్రతి ఇల్లూ సుభిక్షం.. ప్రతి ఒక్కరిలో ఆనందం
ప్లవ అంటే ఒక నావ అని అర్థం. ఈ సంవత్సరం బాగుంటుందని సిద్ధాంతి కూడా చెప్పారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని, రైతులందరికీ మంచి జరగాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కోవిడ్‌పై జరిపే యుద్ధంలో మనం గెలవాలని ఆకాంక్షిçస్తున్నా. ప్రతి ఒక్కరికి ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతి ఇల్లు సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరిగి ఆనందంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారికంగా నిర్వహించిన పండుగ కార్యక్రమంలో సీఎం జగన్ సంప్రదాయ బద్ధంగా పంచె కట్టుకుని పాల్గొన్నారు. శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి.. తొలి ప్రతిని ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతుల సుబ్బరామ సోమయాజులుకు అందజేశారు. ఈ సందర్భంగా సోమయాజుల పంచాంగ పఠనాన్ని సీఎం జగన్ ఆసాంతం ఆలకించారు. అనంతరం సిద్ధాంతి అందజేసిన ఉగాది పచ్చడి స్వీకరించారు. అనంతరం సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అర్చకుల బృందం సీఎం జగన్‌కు స్వామి వారి ప్రసాదాలు అందజేసి, ఆశీర్వదించింది. ఉగాది పండుగ సందర్భంగా శారదా పీఠం పంపిన శేషవస్త్రాలను పండితులు సీఎం జగన్‌కు అందజేశారు. ఉగాది సందర్భంగా నూతన పంచాంగం తొలి ప్రతిని సుబ్బరామ సోమయాజులుకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, అధికారులు ఈ ఏడాది చాలా అనుకూల పరిస్థితులు సిద్ధాంతి సోమయాజులు ఆధ్వర్యంలో జరిగిన పంచాంగ పఠనంలో..ప్లవ నామ సంవత్సరంలో రాష్ట్రమంతటా అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పారు. పాలన చేసే సీఎం వ్యక్తిగత జాతక రీత్యా గురువు సంచారంతో చాలా అనుకూలంగా ఉందని తెలిపారు. పంచాంగ ప్రభావానికి తోడు పరిపాలన చేసే వారి జాతకం బావుండటం మూలంగా గ్రహాలు రాష్ట్ర ప్రజలందరికీ అనుకూలిస్తాయన్నారు. ► ఈ ఏడాది మేఘాలు అన్ని ప్రాంతాల్లో చక్కగా వర్షిస్తాయి. వ్యాపారాలకు మంచి అనుకూలత ఉంది. ఈ ఏడాది అంతా బాగుంటుంది. ధన ధాన్యం సమృద్ధిగా చేకూరుతుంది. సుభిక్షం, సంక్షేమం, ఆర్యోగంతో రాష్ట్రమంతా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ► గురు, శుక్రుల ప్రభావంతో మంత్రి మండలి చాలా చక్కటి ఆలోచనలు చేయడంతో పాటు వాటి అమలును దిగ్విజయంగా కొనసాగిస్తుంది. ఈ కారణంతో ప్రభుత్వం, ప్రజలు చక్కటి ఫలితాలతో ముందుకెళ్లే పరిస్థితి. ఈ సంవత్సరం వాతావరణం సమతూకంగా నడుస్తుంది. ► గురువు ప్రభావంతో భూమి సస్యశ్యామలం అవుతుంది. పంటలు బాగా పండుతాయి. వర్షాలు బాగా కురవడం వల్ల చెరువులు, నదులు నీళ్లతో నిండుతాయి. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి అనుకూల అవకాశాలు పెరుగుతాయి. రైతులు, రైతు కూలీలు, శ్రామికులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ పాలన కొనసాగడానికి అనుకూలత ఉంది. ► ఈ ఏడాది విద్య, వ్యవసాయం, ఆర్థిక రంగాలు అన్నీ బాగుంటాయి. గతేడాది కంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. అన్ని అనుకూల పరిస్థితులతో ప్రజలందరూ వ్యక్తిగతంగా, ఆర్థికంగా బలపడే అవకాశాలుంటాయి. ► వ్యవస్థాపరంగా ఆర్థిక పరిస్థితులు పుంజుకునే అవకాశం ఉంది. ఆనందంగా ఉన్నామని ప్రతి వారు అనుకునేలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం రాష్ట్రం ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విద్యా విధానంలో కొత్త మార్పులు తీసుకొస్తారు. మంచి ప్రణాళికలు చేసే అవకాశం ఉంది. ► కరోనాను జయించడమే కాకుండా, ప్రజలందరికీ చక్కటి ఆరోగ్యం అందేలా ముందుకు సాగే పరిస్థితులు ఉంటాయి. రాబోయే కాలంలో అందరి మన్ననలు పొందేలా సీఎం వ్యక్తిగత జాతకం ఉంది. అందరితో స్నేహ భావంతో వ్యవహరిస్తూ రాష్ట్రం విజయాలు సాధిస్తుంది. ప్రభుత్వ పథకాల వివరాలతో క్యాలెండర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా రూపొందించిన తెలుగు సంవత్సర క్యాలెండర్‌లోనూ ఈ ఏడాది ఎప్పుడు ఏయే పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తారన్నది పొందుపర్చారు. క్యాలెండర్ తొలి పేజీలో అన్ని పథకాల వివరాలను, రెండో పేజీలో గత 22 నెలల కాలంలో అంటే, 2019 జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఏయే పథకాలలో ఎంత మందికి, ఎన్ని కోట్ల మేర ప్రయోజనం కల్పించారన్న వివరాలను ఇచ్చారు. మూడో పేజీలో అవ్వాతాతలకు ఆసరాగా అందిస్తున్న వైఎస్సార్ పింఛన్ కానుక వివరాలను ప్రచురించారు. ఆ తర్వాత వరుసగా ఏనెల, ఏయే పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తారన్నది వివరించారు. వేద పండితులు, అర్చకులకు సీఎం సత్కారం ► ప్రభుత్వ సిద్ధాంతి కప్పగంతుల సుబ్బరామ సోమయాజులుతో పాటు పలువురు అర్చకులు, వేద పండితులను సీఎం సత్కరించారు. ► విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు లింగంభట్ల దుర్గాప్రసాద్, ప్రకాశం జిల్లా మార్కాపురం అర్చకులు ఏవీకే నరసింహాచార్యులు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అర్చకులు మామిళ్లపల్లి మృత్యుంజయప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు కోట రవికుమార్, వేద పండితులు ఆర్వీఎస్ యాజులు సీఎం జగన్ చేతుల మీదగా సత్కారం పొందారు. ► ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన వ్యవసాయ పంచాంగంతో పాటు, ప్రభుత్వ క్యాలెండర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ ఫోటోలు
-
సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉగాది వేడుకలు
-
ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సీఎం క్యాంప్ కార్యాలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులను సీఎం వైఎస్ జగన్ సన్మానించారు. కప్పగంతుల సుబ్బరామ సోమయాజుల శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. సంక్షేమం దిశగా సీఎం జగన్ పాలన ఉంటుందని శాస్త్రి తెలిపారు. విద్యా విధానాల్లో కొత్త మార్పులు వస్తాయన్నారు. కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలను సీఎం జగన్ సమర్ధవంతంగా అమలు చేస్తారని అన్నారు. ఈ ఏడాది ఎన్నో విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు. ప్లవనామ సంవత్సరంలో కూడా వరుణుడి అనుగ్రహం ఉంటుందని.. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. పాడిపరిశ్రమ చక్కని ఫలితాలు అందుకుంటుందన్నారు. ఈ ఏడాది రైతులకు లాభదాయకంగా ఉంటుందని శాస్త్రి తెలిపారు. తెలుగు ప్రజలకు సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు ప్రజలకు శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది కూడా వానలు కురిసి పంటలు బాగా పండాలని, కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేద పండితులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపాలని సీఎం వైఎస్ జగన్ తపన పడుతున్నారని పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
షడ్రుచులు దేనికి సంకేతం అంటే..
తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ వచ్చిందంటే చాలు.. మనవాళ్ళు.. ముఖ్యంగా మన తెలుగు వారు.. మామిడాకులతో తోరణాలు, రకరకాల రంగవళ్లులు, పిల్లల అల్లరి చేష్టలు, పెద్దల హడావుడి, కొత్త బట్టలతో ఇంచుమించు అందరి ఇళ్లు కళకళలాడుతూ ఉంటాయి. పల్లెటూళ్లలో అయితే ఇక చెప్పనవసరం లేదు. ఉగాది పండుగ రోజు నుంచి, శ్రీరామనవమి వరకు ఏడు రోజుల పాటు చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుతుంటారు. ఉగాది పండుగకే ప్రత్యేకంగా నిలిచేది ఉగాది పచ్చడి. షడ్రుచుల మేళవింపుతో తయారు చేసే ఈ పచ్చడి మనిషి జీవితంలోని అనేక జ్ఞాపకాలకు ప్రతీక అని చెప్పవచ్చు. మానవ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, సంతోషం, బాధ, అవమానాలు అన్ని ఉంటాయి. వీటిన్నంటిని ఒక్కో రుచితో మేళవించారు పెద్దలు. షడ్రుచుల మిళితమైన శ్రేష్ట పదార్ధమే ఉగాది పచ్చడి. ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత కలదో.. ఆహార, ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్యనిపుణుల మాట. మన పుర్వీకులు గ్రంధాల్లో ప్రస్తావించిన ఆ షడ్రుచులు.. పేరు వినటమే గాని, ఆ రుచులేమిటో చాలా మందికి నిజంగా తెలియదు. ఇక ప్రస్తుత కాలంలో ఉగాది పచ్చడి కూడా నూతన పోకడలు పోతుంది. అసలు ఉగాది పచ్చడిని తయారు చేసే పదర్థాలు ఏవి అంటే బెల్లం, చింతపండు, మిరియాలు, వేప పువ్వు, ఉప్పు, మామిడి. ఈ పదార్థాలన్నింటిని కొత్త కుండలో కలిపి.. అచ్చమైన ఉగాది పచ్చడి తయారు చేస్తారు. షడ్రుచులు దేనికి సంకేతం అంటే.. బెల్లం తీపి - ఆనందానికి సంకేతం ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం వేప పువ్వు - చేదు -బాధకలిగించే అనుభవాలు చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు మిరియాలు - కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు -
ఉగాది నాడు ఏం చేయాలో తెలుసా?
ఉగాది పండుగ మన పంచాంగం ప్రకారం మొదటి పండుగ. యుగప్రారంభాన్ని యుగాది అంటారు. ఈ యుగాది శబ్దం ఉగాది అనే కొత్త శబ్దాన్ని ఉత్పత్తి చేసింది. ఇక్కడ ఉగాది అంటే సంవత్సరానికి ప్రథమ దినం. మనకు నాలుగు యుగాలు ఉన్నాయి ఇవి చక్రంలా తిరుగుతూ ఒకదాని తరువాత వేరొకటి వస్తూ వుంటాయి. ఈ యుగాలు వరుసగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, చివరిది కలియుగం. ఇప్పుడు మనం కలియు గంలో ఉన్నాము. వైవస్వత మన్వంతరంలో ఇప్పటివరకు ఇరవై ఏడు మహాయుగాలు జరిగిపోయాయి. ఇరవై ఎనిమిదవ యుగం జరుగుతోంది. ఈ మహాయుగంలో కృత, త్రేతా, ద్వాపర యుగాలు గడచిపోయాయి. ఇప్పటికి కలియుగంలో 5120 సంవత్సరాలు పూర్తయ్యాయి. శార్వరి నామ సంవత్సరం సెలవు తీసుకుని13 ఏప్రిల్‌న శ్రీ ప్లవనామ సంవత్సరం ప్రవేశిస్తోంది. చైత్రశుద్ధ పాడ్యమి అనగా ఉగాది పర్వదినం. కాలగమన సౌధానికి తొలి వాకిలి. ఋతు సంబంధ ప్రథమ ఆరోగ్యకోకిల గానం నూతన సంవత్సరానికి శ్రీకారం. ప్రజల మధ్య పెంపొందించే మమకారం. బహు సాంప్రదాయాలకు సాకార క్రియారూపం. ఆబాలగోపాలం ఆనందంగా చేసుకునే పండుగ ఉగాది. పౌర్ణమిరోజున చంద్రుడు ఏ నక్షత్రంలోఉంటాడో ఆ మాసానికి అదే పేరు ఉంటుంది. చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసి ఉండటం వలన ఈ మాసావికి చైత్రమాసం అని పేరు. అన్ని ఋతువులకన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు. ఋతూనాం కుసుమాకరః– ఋతువుల్లో చెట్లు చిగిర్చి పూవులు పూయు వసంత ఋతువును నేనే అని తన ముఖ్య విభూతులు చెప్తూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. కోకిల పాటలు, సన్నజాజి, మల్లెల పరిమళాలు, చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో ప్రకృతిమాత కొత్త అందాలు సంతరించు కుంటుంది. వసంత ఋతువు చైత్రమాసంతో మొదలవుతుంది. మనిషిని, మనస్సును, బుద్ధిని వికసింపజేసే అహ్లాదభరిత వాతావరణంలో ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. ఉగాది నాడు ఏం చేయాలి? ఈనాడు మనమేం చేయాలో మన పెద్దలు నిర్దేశించారు. నూతన సంవత్సర కీర్తనలు చేస్తూ, తలంటు పోసుకుని నూతన వస్త్రాలు ధరించి, ధ్వజారోహణ చేయాలి. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినాలి. వేపపూత, కొత్త బెల్లం, మామిడి పిందెలు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు. దీని సేవనం వల్ల వాత, కఫ దోషాలు తొలగుతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఈ పచ్చడిని సంవత్సరానికి ఒకమారు ఉగాది నాడు తింటే దీని ప్రభావం తిరిగి ఉగాది వచ్చేవరకు ఉంటుందని నమ్మకం. ఈ రోజు పంచాంగం వినాలి కాలగతిని లెక్కించడానికి చంద్రుని గమనాన్ని అనుసరించడం సులభమైన విధానం. అందువల్ల చైత్రమాసంలో కూడా శుద్ధపాడ్యమినే, అంటే చంద్రుడి కళలు వృద్ధి చెందడం మొదలయ్యే సమయమే ‘ఉగాది ’ అని కమలాకరభట్టు ప్రతిపాదించారు. ‘చతుర్వర్గ చింతామణి’ అను గ్రంథంలో బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజే మనం ప్రతి సంవత్సరం జరుపుకునే ఉగాది అని ఆ గ్రంధకర్త హేమాద్రి పండితుడు తెలియజేసారు. అయితే ఈ పండుగ ఏ దేవుడి/దేవత ప్రీతి కొరకు చేస్తున్నాము, ఎవరిని ధ్యానించాలి? ఈ పండుగకు అధిదేవత రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి లేదా వినాయకుడు వంటి దేవతలు కారు. కాలపురుషుడు ఈ పర్వపు అధిదేవత. ‘ఓం కాలాయనమః’ అనే నమక మంత్రం గాని విష్ణు సహస్రం గాని పఠించాలి. భగవంతుడే కాలపురుషుడని, నిత్యం అతణ్ణి ధ్యానించాలని శాస్త్రం చెబుతోంది. మానవ జీవితం అంతా కాలం పైననే ఆధారపడి ఉండుట వలన కాలపురుషుని ఆరాధించాలి. మనం చేసే పంచాంగ శ్రవణమే ఈ ఆరాధన. విష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో చెప్పబడినట్లు మనం ఏ రూపంలో స్తుతించినా అది పరమాత్మునికే చెందుతుంది. ఈ దృష్టితో కాలపురుషుని పంచాంగ శ్రవణ రూపాన స్తుతించాలి. ఇంకనూ సత్కర్మానుష్టానానికి కావలసిన కాల విశేషణాలను తెలుసుకోవడమే పంచాంగం పరమ ప్రయోజనం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనేవి పంచాంగాలు. ఒక శుభ కార్యం గాని ఒక ధర్మకార్యం గాని చేయడానికి పంచాంగమే మనకు మార్గదర్శనం చేస్తుంది. ఈ చైత్రమాసపు శుద్ధ పాడ్యమి నుంచి వసంతరాత్రులు జరుపుకుంటారు. అంతేకాదు, తెలుగువారి ప్రీతికరమైన శ్రీ రామనవమి కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది విశ్వ మానవ సౌభ్రాభృత్వాన్ని, సకల జీవులకు సుఖశాంతులు ప్రసాదించగలదని ఆకాంక్షిద్దాం. – గుమ్మా ప్రసాదరావు చదవండి: పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి -
టెక్సాస్‌లో ఉగాది ఉత్సవాలు
టెక్సాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఉగాదిని ఘనంగా జరుపుకున్నారు. వికారినామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ.. సంబరాల్లో మునిగితేలారు. యూలెస్లోని ట్రినిటి హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొన్నారు. 150కి పైగా పిల్లలు, పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ అలరించారు. టాంటెక్స్ 2019 ‘ఉగాది పురస్కారాల’ను ఈ సంవత్సరం సాహిత్యం, సంగీతం, నాట్యం, సమాజ సేవ, సాంకేతిక, వైద్య రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు ప్రకటించారు. తెలుగు సాహిత్య రంగంలో కిరణ్ ప్రభ , సంగీతం రంగంలో శ్రీనివాస్ ప్రభల, నాట్యం రంగంలో శ్రీమతి శ్రీలత సూరి, సమాజ సేవ రంగంలో శ్రీకాంత్ పోలవరపు . సాంకేతిక రంగంలో డా. సాంబారెడ్డి, వైద్యరంగంలో డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి , డా. కోసూరి రాజు మొదలైన వారికి ఈ పురస్కారాలను అందజేశారు. వివిధ కార్యక్రమాలలో తమదైన శైలిలో సేవలను అందిస్తున్న, అవినాష్ వెల్లంపాటి, కిరణ్మయి వేములలకు ‘ఉత్తమ స్వచ్ఛంద సేవకుడు (బెస్ట్ వాలంటీర్) ’ పురస్కారంతో సత్కరించి వారి సేవా ధృక్పదాన్ని పలువురికి చాటారు. జీవన సాఫల్య పురస్కారం డా. ప్రేమ్‌రెడ్డికి ఇచ్చారు. ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ట్రినిటీ హైస్కూల్ సూపరింటెండెంట్ డా. స్టీవ్ చాప్మన్ మాట్లాడుతూ తెలుగు వారి విశిష్టత మరియు సేవా కార్యక్రమాలను కొనియాడారు. తరువాత డా. స్టీవ్ చాప్‌మన్‌ను ఘనంగా సత్కరించారు. సంస్థ అధ్యక్షులు చినసత్యం వీర్నపు.. ట్రినిటీ హైస్కూల్ ఆడిటోరియంను ఉచితంగా ఇప్పించిన డా. తోటకూర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కళాకారుల సన్మాన కార్యక్రమంలో భాగంగా గాయకులు సుమంగళి, నరేంద్ర, మిమిక్రి ఆర్టిస్ట్ కళారత్నమల్లం రమేష్, వ్యాఖ్యాత రఘు వేముల లకు జ్ఞాపికలతో టాంటెక్స్ సంస్థ కార్యవర్గబృందం సభ్యులు సత్కరించారు. -
దక్షిణ కొరియాలో ఘనంగా ఉగాది సంబరాలు
సియోల్ : దక్షిణ కొరియాలో సుంగ్క్యున్ క్వాన్ విశ్వవిద్యాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. దక్షిణ కొరియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈ జరిగిన ఉగాది వేడుకలకు 100మందికి పైగా హాజరు అయ్యారు. ఉగాదిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించి, అతిథులకు ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్లాసికల్ డ్యాన్స్‌లు, పిల్లల ఫ్యాషన్ షో కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డా. సుశ్రుత కొప్పుల, డా.వేణు నూలు, డా.అనిల్ కావాలా, తరుణ్, డా. కొప్పల్లి స్పందన రాజేంద్ర, సంపత్ కుమార్, సాయి కృష్ణ చిగురుపాటిల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. -
వైఎస్సార్సీపీకి అధికారం ఖాయం
శ్రీకాళహస్తి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కడం ఖాయమని, ఏపీలో అత్యధిక ఎంపీ స్ధానాలను కూడా ఆ పార్టీనే దక్కించుకుంటుందని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగ వర ప్రసాదు వెల్లడించారు. వికారి నామ సంవత్సర ఉగాదిని పురష్కరించుకుని శనివారం ఆయన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో పంచాంగ పఠనం నిర్వహించారు. అందులో భాగంగా ఈ ఏడాది జరగనున్న పలు అంశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపడతారని చెప్పారు. రాష్ట్రంలోని మెజారీటీ ఎంపీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. కేంద్రంలోని భారతీయ జనతాపార్టీకి ఈ ఏడాది ఎదురుదెబ్బ తగలనుందని, ప్రధాని మోదీకి ఈ సంవత్సరం అంతగా కలిసిరాదని చెప్పారు. తమిళనాడులో అన్నాడీఎంకే బలమైన పార్టీగా నిరూపించుకుంటుందని, కర్ణాటకలో కాంగ్రెస్ కూటమి బలపడుతుందని చెప్పారు. అలాగే అంతర్జాతీయస్థాయిలో ట్రంప్‌కు ఎదురుగాలి, భారతీయులకు ప్రతి మూడు మాసాలకోసారి ఇబ్బందులు ఉంటాయన్నారు. ఈ పంచాంగ పఠనం కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీరామరామస్వామి, పలువురు ఆలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం
-
రాజ్‌భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
-
19న మిచిగాన్‌లో ఉగాది వేడుకలు
మిచిగాన్ : అమెరికాలోని మిచిగాన్‌లో విళంబి నామ సంవత్సర ఉగాది సంబారాలను నిర్వహించడానికి ట్రాయ్ తెలుగు అసోసియేషన్(టీటీఏ) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఉగాది సంబరాలను టీటీఏ మహిళ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 19న రొచెస్టర్ హిల్స్ లోని రొచెస్టర్ అడమ్స్ హై స్కూల్లో జరపనున్నారు. ఈ వేడుకల్లో ఆట పాటలు, నాటకాలు, మాటల చమత్కారాలు అథితులను అలరిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ లీడ్ జ్యోత్స్న కంకటాల, కల్చరల్ కమిటీ లీడ్ దీపా కనకపల్లి, స్టాల్స్ కమిటీ లీడ్ సంధ్య చొలవేటి, ఫుడ్ కమిటీ లీడ్ శశికళ తియ్యారి, పబ్లిసిటీ కమిటీ లీడ్ గాయత్రి గంగిసెట్టి, రిసిప్షన్ కమిటీ లీడ్ సీతాల పసుల, డెకరేషన్ కమిటీ లీడ్ రూప గండ్రలు ఉగాది వేడుకల పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున తెలుగువారు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
న్యూ జెర్సీ : స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. సేవా కార్యక్రమాల నిధుల సేకరణ కోసం స్పందన ఫౌండేషన్ ఈ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన విరాళాలతో ఖమ్మంలోని స్పందన మేఫి మానసిక వికలాంగుల గృహంకి నూతన భవన సముదాయం కోసం ఖర్చు చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 1300 మందికి పైగా అతిథులు పాల్గొన్న ఈ ఉగాది వేడుకల్లో 450 మంది వివిధ సంస్కృతికి ప్రదర్శనలతో అతిథులను అలరించారని నిర్వాహకులు నాగరాజు రెడ్డి తెలిపారు. చిత్రలేఖనం, చదరంగం పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. వివిధ రంగాల్లో విశేషంగా రాణిస్తున్న వారికి ఇచ్చే అవార్డును ఈ ఏడాదికిగానూ, స్పందన స్టార్ అవార్డు సంజన మల్ల, సాహితి తోలేటిలకు స్పందన సర్వీస్ అవార్డు ఇందిర శ్రీరాంలకు బహుకరించినట్టు స్పందన ప్రతినిధి ప్రశాంతి మదుపూరు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వాలంటీర్లకు శ్రీధర్ పొందూరి కృతజ్ఞతలు తెలిపారు. స్పందన ఫౌండేషన్ భారత్‌లోని ప్రభుత్వ పాఠశాలలకు-విద్యాలయ, పేద విద్యార్థులకు-ప్రతిభ, నిరాశ్రయులకు-ఆశ్రయ, క్లిష్టమైన అనారోగ్య సమస్యలున్న వారికి-చేయూత వంటి కార్యక్రమాలతో తమ వంతు సహాయం అందిస్తోంది. -
టెన్నెస్సీలో ఘనంగా ఉగాది వేడుకలు
నాష్విల్ (అమెరికా) : టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో నాష్విల్ లో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఫాదర్ ర్యాన్ ఆడిటోరియంలో టెన్నెస్సీ తెలుగు సమితి అధ్యక్షులు దీప్తి రెడ్డి దొడ్ల నాయకత్వంలో నిర్వహించిన ఈ ఉగాది సంబరాలకు డాక్టర్ దీపక్ రెడ్డి, జితేందర్ కట్కూరి, శారద కట్కూరి సమర్పకులుగా వ్యవహరించారు. స్థానిక తెలుగు వారు సుమారు 600 మందికి పైగా ఈ సంబరాలలో పాల్గొనడం విశేషం. టెన్నెస్సీ లోని నాష్విల్ సంగీత నగరంగా పేరొందడం అందరికీ తెలిసిందే. మరి ఆ సంగీత నగరంలో ప్రముఖ తెలుగు సినీ కోయిల సునీత అడుగెడితే, రాగం అందుకుంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరంలేదు. సునీతతో పాటు మాటీవీ సూపర్ సింగర్ ఫేమ్ గాయకులు దినకర్ కూడా ఈ సంగీత విభావరిలో పాల్గొన్నారు. ముందుగా దీప్తి రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ అందరికి శ్రీ విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పంచాంగ శ్రవణంతో కార్యక్రమం మొదలవగా, స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చేసిన భరతనాట్యం, సినీ నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సునీత, దినకర్లు క్లాసిక్ పాటలతో మొదలుపెట్టి జానపద, సాంఘీక, ఫాస్ట్ బీట్ పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రేక్షకుల అరుపులు, చప్పట్లతో వేదిక ప్రాంగణం మార్మోగిపోయింది. తర్వాత స్పాన్సర్స్ ని, సునీత, దినకర్ లను పుష్ప గుచ్ఛం, శాలువా, జ్ఞాపికలతో టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గం ఘనంగా సన్మానించారు. మధ్య మధ్యలో రాఫుల్ డ్రాల్లో విజేతలకు ఉప్పాడ పట్టుచీరలు, ముత్యాల నగలు వంటి విలువైన బహుమతులు గాయని సునీత చేతులమీదుగా అందజేశారు. దీప్తి రెడ్డి దొడ్ల మాట్లాడుతూ ఈ ఉగాది సంబరాలకు వెన్నంటి ఉండి తమ పూర్తి సహకారం అందించిన కార్యదర్శి కిరణ్ కామతం, సాంస్కృతిక కార్యదర్శి ప్రశాంతి చిగురుపాటి, ఫుడ్ కమిటీ లీడ్ నిషిత కాకాని, రిజిస్ట్రేషన్ కమిటీ లీడ్ రజని కాకి తదితర అడ్వైసరీ కమిటీ, యూత్ కమిటి సభ్యులు, అలాగే విజయవంతంచేసిన ప్రేక్షకులు, స్పాన్సర్స్, తమ పాటలతో అందరిని ఆహ్లాదపరచిన సునీత, దినకర్, ఆడియో & లైటింగ్ అందించిన డి.జె. శ్రీనివాస్ దుర్గం, ఫోటోగ్రఫీ సేవలందించిన సందీప్ జానర్, వేదికనందించిన ఫాదర్ ర్యాన్ ఆడిటోరియం యాజమాన్యం, వేదికను చక్కగా అలంకరించిన డాజిల్ ఈవెంట్స్, రుచికరమైన విందు బోజనాలను అందించిన పారడైస్ బిర్యానీ ఇలా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి ఉగాది సంబరాలను ముగించారు. -
మలేషియాలో ఘనంగా ఉగాది వేడుకలు
కౌలాలంపూర్, మలేసియా : తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు మలేషియాలోని మరిడేక స్క్వేర్‌లో అట్టహాసంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా(టామ్) ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలేషియా ప్రధాని నజీబ్ రజాక్, ఫెడరల్ టెరిటోరిస్ మంత్రి తంకూ అద్నాన్ మన్సూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకల సందర్భంగా చిన్నారుల ఆట పాటలు, హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు అందర్ని ఆకట్టుకున్నాయి. టామ్ అధ్యక్షులు డీఆర్ అచ్చయ్య కుమార్ మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగు వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాపర్ ప్రణవ్ చాగంటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
జర్మనీలో ఘనంగా ఉగాది వేడుకలు
ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ : నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ వేడుకలు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఘనంగా నిర్వహించారు. జర్మనీ తెలుగు వెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సోస్సెన్ హైం ఆడిటోరియంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ ఎంబసీ కాన్సులేట్ జనరల్ ప్రతిభ పార్కర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఫ్రాంక్ఫర్ట్ నగర పురపాలక ప్రతినిధి మోబిస్ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగువెలుగు సంస్థ కమిటీని, వారు చేసే వివిధ సాంస్కృతిక సేవలను కొనియాడారు. గాయకులు ధనుంజయ్, సాయి శిల్పలు వారి ప్రదర్శనలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. భూషణ సాయి హేమంత్ కృష్ణ తన నాసికా వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. నదియా నృత్య ప్రదర్శన తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇండియన్ మ్యూజిక్ అకాడమీ, ఇండియన్ డాన్స్ అకాడమీ, ఉజ్వల డాన్స్ గ్రూప్, ఫ్రాంక్ఫర్ట్ గర్ల్స్ ఎంతో ఉత్సాహంగా వారి కళలను ప్రదర్శించారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులకు రుచి రెస్టారెంట్ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసింది. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన రుచి రెస్టారెంట్, ఎయిర్ ఇండియా, హెక్స్డ్ సాఫ్ట్వేర్, జవాజి సాఫ్ట్వేర్, జస్ట్ 1 బజార్, స్పూన్స్ అండ్ ఫోక్స్, వాట్సమన్ కన్సల్టింగ్, పిజె ఈవెంట్స్ వారికి సంస్థ అధ్యక్షుల సాయి రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
బ్రిస్టల్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
బ్రిస్టల్: శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు బ్రిస్టల్‌లో ఘనంగా నిర్వహించారు. బ్రిస్టల్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున తెలుగు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. శ్రీ విళంబి నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 250 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగస్వామ్యులైన వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, బూరెలు, కమ్మని తెలుగు వంటకాలు పంపిణి చేశారు. దిలీప్ మెరుగుమల్లి, వంశి మూల ఆధ్వర్యంలో సంప్రదాయ నృత్యాలు, లలితకళల ప్రదర్శనలు, తెలుగు సాహితీ అభిమానులను కూడా అలరించే పద్యాలతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు . తెలుగు సినిమా సంగీత నృత్యాలు, నాటికలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి రాజేంద్రప్రసాద్, శ్రావ్య వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. శ్రీనివాస కిరీటి బోయినపల్లి బ్రిస్టల్ తెలుగు సంఘం తరుపున మాట్లాడుతూ తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని, ఐక్యతను, సంస్కృతిని కాపాడటానికి బ్రిస్టల్ తెలుగు సంఘం ఏర్పడిందని తెలిపారు. ఈ ఉగాది సంబరాలు విజయవంతం కావడానికి విద్యాసాగర్ రెడ్డి, ప్రసాద్ పచ్చాల, సతీష్, శివ కొండపర్తి, హరి బాబు, రవి వింజమూరి, శ్రీనివాస మూర్తి, శివాంజనేయులు, ప్రసాద్ బత్తల, గిరీష్ బిందు మాధవ్, సుధాకర్, చిరంజీవి మాదాల, శ్రీదేవి, జ్ఞాని, శ్రావణి, భవాని కెంచే, డా. దీప సునీల్ రెడ్డి, రోహిణి మాటూరి, బిందు కొణిదలు ఎంతగానో కృషి చేశారు. మరిన్ని ఫోటోలు.. -
సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
-
సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. బుకిత్ పంజాంగ్ లోని శ్రీ మురుగన్ హిల్ ఆలయంలో పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ విళంబి నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 400 మంది ప్రవాసి తెలంగాణ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగస్వామ్యులైన వారందరికి సంప్రదాయ ఉగాది పచ్చడి, ప్రసాదం పంపిణి చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులు, ప్రసాద దాతలకు సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, ఉపాధ్యక్షులు నీలం మహేందర్, బూర్ల శ్రీనివాస్, పెద్ది శేఖర్ రెడ్డి, ముదం అశోక్, కోశాధికారి గడప రమేశ్, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, యెల్ల రామ్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు, గార్లపాటి లక్ష్మా రెడ్డి, నల్ల భాస్కర్ గుప్త, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివ రామ్ ప్రసాద్, ఆర్ సి రెడ్డి, మొగిలి సునీత, గోపగోని దాము, చిల్క సురేశ్, చెట్టిపెల్లి మహేష్, పింగిలి భరత్‌లు ధన్యవాదాలు తెలిపారు. వీరితో పాటు గోనె నరేందర్, భగవాన్ రెడ్డి, సురేందర్, సంతోష్, ఆర్మూర్ నవీన్, నంగునూరి వెంకట్ రమణ, జయ లక్ష్మిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్టు సొసైటీ ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఆరుగురు అవుట్!
సాక్షి, హైదరాబాద్ : ‘పనితీరులో వైఫల్యాలరీత్యా ఐదారుగురు మంత్రులకు చిక్కులు తప్పవు.. వారికి మళ్లీ పదవులూ కష్టమే..’ ‘కుంభరాశివారికి మంచి యోగమే ఉంది. ఆ రాశిలో ఉన్నవారికి ఎన్నికల్లో టికెట్లు పొందడం ఇబ్బంది కాకపోవచ్చు!’ ‘విళంబినామ సంవత్సరం రాజు స్థానంలో సూర్యుడు ఉన్నాడు. మంత్రి స్థానంలో శని ఉన్నాడు. ఇద్దరి మధ్యా సహజ వైరం ఉంటుంది. మందగమనంలో ఉండే మంత్రి.. రాజు వేగాన్ని అందుకోలేడు. ఇది రాష్ట్ర పాలకుల్లో కనిపిస్తుంది’ ..ఎన్నికల ఏడాది సమీపిస్తున్న నేపథ్యంలో విళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ పఠనంలో కనిపించిన కొన్ని ఆసక్తికర చమక్కులివీ! సాధారణంగా పంచాంగంలో వర్షాలు, రైతులు, పంటలు, ప్రజల సుభిక్షం వంటి అంశాలే చర్చకు వస్తుండగా.. ఈసారి రాజకీయాంశాలే కీలకంగా మారాయి. ఆదివారం ప్రగతి భవన్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఉగాది వేడుకల్లో శృంగేరీ పీఠం ఆస్థాన పండితుడు బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం నిర్వహించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, భారీ సంఖ్యలో హాజరైన ఆహూతుల సమక్షంలో పంచాంగ పఠనం సాగింది. అనంతరం ముఖ్యమంత్రి తన ప్రసంగంలో కూడా టికెట్ల అంశాన్ని ఉటంకించడం, పంచాంగం ముందస్తుగానే పరిస్థితులను సూచనప్రాయంగా తెలుపుతుందని అనడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చిక్కులు ఎదుర్కోనున్న ఆ ఐదారుగురు మంత్రులు ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది. కేసీఆర్‌కు తిరుగుండదు.. రవి, శుక్ర, చంద్రుల సంచారం, లఘ్నాధిపతి బుధుడు కావటంతో రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన దిగ్విజయంగా కొనసాగుతుందని బాచంపల్లి వివరించారు. ఎన్ని విమర్శలు, ఒడిదొడుకులు ఎదురైనా రాజు ఆత్మకారక శక్తి చేత వాటన్నింటిని ఎదుర్కోగలరన్నారు. లఘ్నాన్ని శని వీక్షిస్తున్నందున మధ్యమధ్య కొన్ని చికాకులు తప్పవని, అయితే జగజ్జనని శక్తి చేత రాజే బలవంతుడవుతాడన్నారు. ఇక గురు బలం, సూర్య బలం చేత ఉన్నత యోగస్థానం ఉన్నందున రాష్ట్రంలోనే కాకుండా కేసీఆర్ ఎక్కడైనా చక్రం తిప్పగలరని పేర్కొన్నారు. కర్కాటక రాశిలో ఉన్నందున సీఎం ఆదాయం 8, వ్యయం 2గాను, రాజపూజ్యం 7 అవమానం 3గా ఉన్నందున ఆయనకు తిరుగు ఉండదన్నారు. ఇదే సమయంలో వృశ్చిక రాశిలో ఉన్నందున ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొన్ని ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రధాని మోదీని ఎదురించి మూడో కూటమి పేరుతో కేసీఆర్ సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ పోలిక ప్రాధాన్యం సంతరించుకుంది. దేవాదాయశాఖలో అవినీతి గురుడు, శుక్రుడి స్థితి వల్ల ధార్మిక కార్యక్రమాల్లో అటంకాలు ఏర్పడతాయని బాచంపల్లి వివరించారు. ఇదే కారణంతో దేవాదాయ శాఖను ఓ ప్రధాన అంశం తీవ్ర చికాకుకు గురిచేస్తుందని, అవినీతి వ్యవహారం బహిర్గతమవుతుందన్నారు. ఓ మఠాధిపతి తీవ్ర అనారోగ్యానికి గురయ్యే సూచన కనిపిస్తోందని, గతంలో ఉన్నత పదవిలో ఉన్న కీలక వ్యక్తికి అపమృత్యు భయం కలిగిస్తుందన్నారు. వానలకు ఢోకా లేదు గత సంవత్సరం తరహాలోనే విళంబి నామ సంవత్సరంలో కూడా సమృద్ధిగానే వానలు కురుస్తాయని బాచంపల్లి చెప్పారు. ద్రోణకం పేరుతో ఉండే మేఘం వానలు కురిపిస్తుందన్నారు. ఆ మేఘం ఆక్టోబరు నుంచి మంచి వానలు కురిపిస్తుందని, డిసెంబర్లో వరదలు సంభవిస్తాయని చెప్పారు. రైతులు ఆషాఢంలో నాట్లు వేసేప్పుడు ప్రకృతిని అనుసరించాల్సి ఉంటుందన్నారు. ఈ సంవత్సరం ప్రకృతి ఉపద్రవాలు కూడా పెరుగుతాయని చెప్పారు. పశు నష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. దేశీయ ఆవుకు ప్రాధాన్యమిచ్చి శక్తిమంతంగా మారిస్తే క్షీర రాబడి పెరుగుతుందన్నారు. పశు సంపదను రక్షించుకునేందుకు ప్రత్యే దృష్టి అవసరమని చెప్పారు. ‘ఎరుపు’ విప్లవం మకరంలో కుజుడు ఉన్నందున మే 2 నుంచి నవంబర్ 6 వరకు ఎరుపు రంగు నేలలు, ధాన్యాలు ఉత్పత్తి, ధరల్లో ఉన్నతంగా ఉంటాయని బాచంపల్లి పేర్కొన్నారు. ఎరుపు నేలల ధరలు బాగా పెరుగుతాయని, బంగారం, వెండి ధరలు కూడా పరుగు అందుకుంటాయని, ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ రంగం పైకి లేచేలా చైతన్య కదలిక వస్తుందని చెప్పారు. గోధుమలు, కందులు, మిరియాలు, గులాబీ రంగు వస్తువుల ధరలకూ రెక్కలొస్తాయని చెప్పారు. బ్యాంకుల ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. విడాకులు పెరుగుతాయి కుజుడు సంచరించే స్థితి వల్ల కుటుంబాల్లో కలహాలు బాగా పెరుగుతాయని, దంపతుల మధ్య మనస్పర్థలు ఎక్కువై విడాకులు తీసుకునే వారి సంఖ్య బాగా పెరుగుతుందన్నారు. ఇక మనసులు కలిసిన యువతీ, యువకులే పెళ్లి చేసుకోవాలని, వివాహ విషయంలో తొందరపాటు కూడదని హితవు పలికారు. పర్యాటక రంగం వృద్ధి చెందుతుందని, ఆర్టీసీలో నష్టాలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. వినోదం, మీడియా రంగంలో మంచి ఎదుగుదల కనిపిస్తుందని వివరించారు. పురపాలక, భూగర్భ శాఖలు, సాంఘిక సంక్షేమ శాఖ కూడా మంచి పనితీరు కనబరుస్తుందన్నారు. విమానయాన రంగం కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్నారు. క్రీడల్లో తెలంగాణ మరోసారి మంచి ప్రతిభ కనబరిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుందన్నారు. పోలీసు శాఖ బ్రహ్మాండంగా పనిచేస్తుందని, రక్షణ శాఖ ముందే ఉపద్రవాలను పసిగట్టి నిర్వీర్యం చేసే విషయంలో విజయం సాధిస్తుందన్నారు. మహిళదే ఆధిపత్యం సైన్యాధిపతి శుక్రుడు కావటం చేత ఈ సంవత్సరం మహిళలు కీలక పాత్ర పోషిస్తారని బాచంపల్లి తెలిపారు. పాలన, ఇంట్లో వారి ఆధిపత్యం కనిపిస్తుందని వెల్లడించారు. వెరసి దీన్ని స్త్రీనామ సంవత్సరంగా అభివర్ణించారు. ఆషాఢ పూర్ణిమ 27–7–2018న మకరరాశిలో శుభ ఫలితాన్ని ఇచ్చే చంద్రగ్రహణం సంభవిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం మాంసభక్షణ వద్దు. ఈ సంవత్సరం రాజు స్థానంలో సూర్యుడు ఉన్నందున ఆయనకు ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం కావటంతో ఆ రోజు మాంస భక్షణ క్షేమకరం కాదని బాచంపల్లి వివరించారు. రాష్ట్ర ప్రజల మంచిని కాంక్షించి ఆదివారం మాంస భక్షణకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. వేద పండితులకు సత్కారం పంచాంగ శ్రవణం అనంతరం పలువురు వేద పండితులు, పంచాంగ కర్తలను ముఖ్యమంత్రి సన్మానించారు. వేదికపైకి వెళ్లే పరిస్థితిలో లేని వెంకటరమణ శాస్త్రి అనే పండితుడిని సన్మానించేందుకు సీఎం వేదిక దిగి వెళ్లారు. అంతకుముందు భద్రాచల ఆలయ పండితుల ఆధ్వర్యంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. సీఎం, వేదికపైనున్నవారికి పట్టు వస్త్రాలు అందించారు. యాదగిరిగిగుట్ట పంచాంగాన్ని ఆవిష్కరించారు. భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. ‘తీయనైన తెలుగు తెలంగాణ వెలుగు’ ప్యాకెట్ పుస్తకాన్ని పంచారు. వచ్చిన ఆహూతులకు పట్టు కండువాలను అందించారు. ఇటీవల శాసనసభ సమావేశాల ప్రారంభం రోజున గాయపడిన మండలి చైర్మన్ స్వామిగౌడ్ నల్లటి అద్దాలు ధరించి వచ్చారు. మరోవైపు ఆహ్వాన పత్రాలు ఉన్నవారినే లోనికి అనుమతించటంతో వేడుకలు చూసేందుకు వచ్చిన సాధారణ ప్రజలు నిరాశగా వెనుదిరిగారు. -
డెన్మార్క్‌లో టాడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
కోపెన్ హాగెన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్) ఆధ్వర్యంలో డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్ హాగెన్‌లో శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంప్రదాయ పద్ధతులలో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, భక్షాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డెన్మార్క్‌లో ఉన్న ప్రవాస తెలుగు వారు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉగాది పర్వదినాన్ని జరుపుకొన్నారు. ఈ ఉత్సవాలు టాడ్ అధ్యక్షులు సామ సతీష్ రెడ్డి, ఉపాధ్యక్షులు సంగమేశ్వర్ రెడ్డి, సెక్రటరీ రమేష్ పగిళ్ళ, కోశాధికారి జయచందర్ రెడ్డి, టెక్నికల్ మేనేజర్ వెంకటేష్, కార్యవర్గ సభ్యులు వాసు, దాము, రాజారెడ్డి, శివసాగర్, శ్రీనివాస్, రఘు, కరుణాకర్, రాజు, నర్మద, ఉష, ప్రీమియం సభ్యులు, తదితరుల సహకారంతో వేడుక ఘనంగా జరిగింది. -
అమరావతి డిజైన్లపై పవన్ వ్యాఖ్యలు