ఉగాది వేడుకల్లో భాగంగా కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఆదివారం పిడకల సమరం ఉత్కంఠ భరితంగా సాగింది.
కర్నూలు: ఉగాది వేడుకల్లో భాగంగా కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఆదివారం పిడకల సమరం ఉత్కంఠ భరితంగా సాగింది. ప్రేమ వ్యవహరంలో వీరభద్ర స్వామి, కాళికాదేవి మధ్య ఏర్పడిన విభేదాలే పిడకల సమరానికి దారి తీసిందని గ్రామస్తులు చెబుతున్నారు.
పిడ కల సమరాన్ని(పెద్ద నుగ్గులాటను) చూడటానికి కర్నాటక, మహారాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. అలాగే కల్లూరులోని శ్రీచౌడేశ్వరిదేవి ఆలయం చుట్టూ బురదలో గార్ధబాలతో ప్రదక్షిణ నిర్వహించారు. రజకుల కుటుంబాలపై అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు భక్తులు చెప్పారు.