జర్మనీలో సందడిగా తెలుగు సాంస్కృతిక మహోత్సవం
ఫ్రాంక్‌ఫర్ట్ లోని తెలుగు కమ్యూనిటీలు భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రదర్శిస్తూ తెలుగు నూతన సంవత్సరం ఉగాది స్ఫూర్తిని సరిహద్దులు దాటించారు. తెలుగు వెలుగు జర్మనీ (టివిజి) నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులలో కనిపించి ఉత్సవాలకు తెలుగు శోభను అద్దారు.
స్థానిక తెలుగు వారి ప్రతిభను వెలికితీయడానికి, సంస్కృతి చైతన్యాన్ని ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భారత రాయబారి హరీష్ పర్వతనేని, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బి.ఎస్. ముబారక్ పాల్గొన్నారు. దాదాపు రోజంతా జరిగిన ఉత్సవాలలో సాయంత్రం నిర్వహించిన మ్యూజికల్ ఫెస్ట్ హైలైట్‌గా నిలిచింది.
ఈ సంగీతోత్సవంలో భారతదేశానికి చెందిన ప్రముఖ గాయకులు పృథ్వీ చంద్ర, మనీషా ఎరా బత్ని, ఇతిపాడ్ బ్యాండ్‌కి చెందిన సాకేత్ కొమండూరి ల సంగీత ప్రదర్శనలు ఉత్సవ హోరును శిఖరాలకు చేర్చాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఫ్రాంక్‌ఫర్ట్ మేయర్ (బర్గర్మీస్టర్) డాక్టర్ నర్గెస్ ఎస్కందారి గ్రున్‌బర్గ్ హాజరయ్యారు. అతిథులలో.. యూరోపా యూనియన్ ఫ్రాంక్ఫర్ట్ చైర్‌పర్సన్, క్లాస్ క్లిప్, జవ్వాజి గ్రూప్ కంపెనీల ఛైర్మన్, జవాజి, విదేశీ మండలి సభ్యురాలు నందిని తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment