క్రోధి నామ సంవత్సర బ్రాహ్మణ కార్తిక వనసమారాధన
న కార్తీక సమో మాసః న దేవః కేశవాత్పరమ్
న చ వేద సమం శాస్త్రం, న తీర్థం గంగాయాన్సమమ్
మాసాలన్నిటిలో మహిమాన్వితమైనది కార్తీకమాసం. హరిహరులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనది ఈ మాసం. ఇటువంటి పవిత్ర కార్తీక మాసంలో, శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఉసిరి, రావి, తులసి, జమ్మి వంటి దేవతా వృక్షాల చెంత వనభోజనాలు, ఉసిరి కాయలతో దీపారాధన వంటివి భారతావనిలో సర్వసాధారణం. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అన్ని ఎమిరేట్స్ నుంచి వందలమంది ఉభయ రాష్ట్రాల తెలుగు బ్రాహ్మణులు అందరూ కలసి దుబాయిలోని అల్ మంజార్ బీచ్ పార్క్‌లో కార్తీక వనసమారాధనను నవంబర్ 17, ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
గాయత్రి మహిళల భక్తి గీతాలు, దీపాధనలతో ప్రారంభం అయిన కార్యక్రమాలు పిల్లలు పెద్దల ఆత్మీయ పలకరింపులు, పాటలు, కేరింతలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగాయి. సంప్రదాయ తెలుగు రుచుల కార్తిక వనభోజనాల సందర్భంగా జరిగిన ధార్మిక ప్రశ్నావళి, ఆటలు, తంబోల, కామేశ్వరరావు హాస్యభరిత సందేశ కార్య్రాక్రమం, ఆదిభట్ల కామేశ్వరశర్మ ఉపదేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలకు ఆత్మీయ సన్మానం చేసి జ్ఞాపికలను బాహూకరించారు. యుఎఈలో సనాతనం, సంఘటితం, సత్సంగం, సహకారం, సత్సంబంధం అనే పంచ సూత్రాల ఆధారంగా ఏర్పడిన గాయత్రీ కుటుంబం (తెలుగు బ్రాహ్మణ సంఘం) ఆధ్వర్యంలో వనసమారాధన ఆధ్యంతం కన్నులపండువగా జరిగింది. కుటుంబ సభ్యులు కల్లేపల్లి కుమార్ చంద్రశేఖర్ ఆకస్మిక మృతి పట్ల సభ్యులు అందరూ ప్రగాఢ సహానుభూతి ప్రకటించి నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment