karthika vana bhojanalu
-
దుబాయ్‌లో ఘనంగా కార్తీక వనభోజన మహూత్సవం
క్రోధి నామ సంవత్సర బ్రాహ్మణ కార్తిక వనసమారాధనన కార్తీక సమో మాసః న దేవః కేశవాత్పరమ్ న చ వేద సమం శాస్త్రం, న తీర్థం గంగాయాన్సమమ్మాసాలన్నిటిలో మహిమాన్వితమైనది కార్తీకమాసం. హరిహరులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనది ఈ మాసం. ఇటువంటి పవిత్ర కార్తీక మాసంలో, శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఉసిరి, రావి, తులసి, జమ్మి వంటి దేవతా వృక్షాల చెంత వనభోజనాలు, ఉసిరి కాయలతో దీపారాధన వంటివి భారతావనిలో సర్వసాధారణం. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అన్ని ఎమిరేట్స్ నుంచి వందలమంది ఉభయ రాష్ట్రాల తెలుగు బ్రాహ్మణులు అందరూ కలసి దుబాయిలోని అల్ మంజార్ బీచ్ పార్క్‌లో కార్తీక వనసమారాధనను నవంబర్ 17, ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.గాయత్రి మహిళల భక్తి గీతాలు, దీపాధనలతో ప్రారంభం అయిన కార్యక్రమాలు పిల్లలు పెద్దల ఆత్మీయ పలకరింపులు, పాటలు, కేరింతలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగాయి. సంప్రదాయ తెలుగు రుచుల కార్తిక వనభోజనాల సందర్భంగా జరిగిన ధార్మిక ప్రశ్నావళి, ఆటలు, తంబోల, కామేశ్వరరావు హాస్యభరిత సందేశ కార్య్రాక్రమం, ఆదిభట్ల కామేశ్వరశర్మ ఉపదేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలకు ఆత్మీయ సన్మానం చేసి జ్ఞాపికలను బాహూకరించారు. యుఎఈలో సనాతనం, సంఘటితం, సత్సంగం, సహకారం, సత్సంబంధం అనే పంచ సూత్రాల ఆధారంగా ఏర్పడిన గాయత్రీ కుటుంబం (తెలుగు బ్రాహ్మణ సంఘం) ఆధ్వర్యంలో వనసమారాధన ఆధ్యంతం కన్నులపండువగా జరిగింది. కుటుంబ సభ్యులు కల్లేపల్లి కుమార్ చంద్రశేఖర్ ఆకస్మిక మృతి పట్ల సభ్యులు అందరూ ప్రగాఢ సహానుభూతి ప్రకటించి నివాళులు అర్పించారు. -
ఉసిరితో వనభోజనం : ఇన్స్టంట్ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే!
దీపావళి వెళ్లింది...కార్తీక మాసం వచ్చింది. అంతకంటే ముందు ఉసిరికాయ వచ్చేసింది. ఊరగాయలు మెల్లగా పెట్టుకోవచ్చు. ఉసిరితో వనభోజనానికి సిద్ధమవుదాం. ఉసిరితో ఇన్‌స్టంట్‌గా ఇలా వండుదాం. రోటి పచ్చడి... వేడి వేడి చారు... ఈ వారానికి ఇవి చాలు. ఉసిరి చారుకావలసినవి: ఉసిరికాయ గుజ్జు – 5 లేదా 6 (100 గ్రాముల గుజ్జు రావాలి); కందిపప్పు – 2 టేబుల్ స్పూన్లు; మిరియాలు – 4–5 గింజలు; జీలకర్ర – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; నీరు – 2 కప్పులు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి.పోపు కోసం: నెయ్యి లేదా నూనె – టీ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; ఎండుమిర్చి – 2; పచ్చిమిర్చి–2; కరివేపాకు రెమ్మలు –2.తయారీ: ఉసిరి కాయలను కడిగి తరిగి గింజలు తొలగించాలి. ఆ ముక్కలను, మిరియాలు, జీలకర్ర మిక్సీలో వేసి పలుకుగా గ్రైండ్ చేయాలి. ప్రెషర్ కుకర్‌లో కందిపప్పును ఉడికించి, వేడి తగ్గిన తర్వాత మెదిపి పక్కన పెట్టాలి మందపాటి పాత్రను స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి నిమిషంపాటు వేయించాలి. వేగిన తర్వాత ఉసిరికాయ గుజ్జు వేసి రెండు నిమిషాలపాటు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు కందిపప్పు, పసుపు, ఉప్పు వేసి, ఆ తర్వాత నీటిని పోసి కలిపి మూత పెట్టాలి. నీళ్లు మరగడం మొదలైన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టి, ఐదు నిమిషాల సేపు కదిలించకుండా ఉంచాలి. ఈ రసం అన్నంలోకి రుచిగా ఉంటుంది. ఉసిరి రోటి పచ్చడి కావలసినవి: ఉసిరి కాయలు – 6; ఎండు మిర్చి– 10; జీలకర్ర – టీ స్పూన్; పచ్చి శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు; మినప్పప్పు– టేబుల్ స్పూన్; మెంతులు – అర టీ స్పూన్; వెల్లుల్లి రేకలు – 7; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; ధనియాలు – 2 టీ స్పూన్లు; నూనె టీ స్పూన్.పోపు కోసం: నూనె – టేబుల్ స్పూన్; ఆవాలు – అర టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; ఎండుమిర్చి– 2; కరివేపాకు– 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూన్.తయారీ: ఉసిరి కాయలను కడిగి తరిగి గింజలను తొలగించాలి ∙పెనంలో నూనె వేడి చేసి అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. అవి దోరగా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి అవి వేగుతుండగా స్టవ్ ఆపేయాలి. స్టవ్, పెనం వేడికి మెల్లగా వేగి అమరుతాయి. వేడి తగ్గిన తరవాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. ఆవపొడిలో వెల్లుల్లి రేకలు వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పోపు కోసం బాణలిలో నూనె వేడి చేసి పోపు దినుసులన్నీ వేసి వేయించాలి. అందులో గ్రైండ్ చేసిన ఉసిరి పచ్చడి వేసి కలిపి, స్టవ్ ఆపేయాలి. -
Hongkong: హాంకాంగ్ తెలుగు సామాఖ్య ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు
కార్తీకమాసం అనగానే వనభోజనాల హడావిడి మొదలౌతుంది. కార్తీక వనభోజనాలు స్నేహాన్ని, సమైక్యతను పెంపొందిస్తాయన్న మాట, ఆథ్యాత్మికం..ఆనందం..ఆరోగ్యం..సందేశం..కలగలిపి వడ్డించిన విందు భోజనం..వనభోజనం. దైనందిన జీవితంలో ఎదురయ్యే చిరాకులు, పరాకులకు దూరంగా అందరూ కలిసి వేడుక చేసుకోవడం వల్ల వత్తిళ్ళు, వేదనలు తీరతాయి. వనభోజనాలను పెద్దల కంటే పిల్లలు మరీమరీ ఆనందిస్తారు. హాంకాంగ్ తెలుగు సమాఖ్య తమ వార్షిక పిక్నిక్, కార్తీక మాసం ‘వనభోజనం’ హాంకాంగ్‌లోని అతిపెద్ద కంట్రీ పార్కులలో ఒకటైన ట్యూన్ మున్ కంట్రీ పార్క్‌లో జరుపుకున్నారు. సభ్యులు ఎంతో ఆనందంగా నీలి ఆకాశం క్రింద మరియు పార్క్ సహజ ఆవాసాలతో అందమైన పచ్చదనం మధ్య వారు సరదాగా ఆటలు ఆడారు మరియు రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించారు. ప్రతి సంవత్సరం, సభ్యులందరూ ఒకరినొకరు కలుసుకోవడానికి మరియు కనెక్ట్ అవ్వడానికి ఎదురుచూస్తున్నఆనంద సమయం అది. వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయపీసపాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తన సమర్ధవంతమైన బృందానికి మరియు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, హాంగ్ కాంగ్ లో ప్రజల ఆరోగ్య , ఆహ్లాదం మరియు శ్రేయస్సు కోసం అక్కడ వున్న కంట్రీ పార్క్స్ గురించి , తాము వనభోజనం కోసం వచ్చిన పార్క్ గురించి కొన్ని విశేషాలను తెలిపారు. హాంకాంగ్ కేవలం ఆకాశహర్మ్యాలు మరియు రద్దీగా ఉండే వీధులు మాత్రమే కాదు; నగరంలో చాలా పచ్చటి ప్రదేశాలు ఉన్నాయి, సుందరమైన ప్రదేశాలు, హైకింగ్ ట్రయల్స్, వన్యప్రాణులు, చారిత్రాత్మక ప్రదేశాలు మరియు అవుట్డోర్ అడ్వెంచర్ కోసం అంతులేని అవకాశాలు ఉన్నాయి. అటువంటి జనసాంద్రత కలిగిన మహానగరానికి విశేషమేమిటంటే, మొత్తం భూమిలో మూడొంతుల భూమి గ్రామీణ ప్రాంతాలు మరియు హాంకాంగ్ యొక్క మొత్తం భూభాగంలో 40 శాతం - 435 చదరపు కిలోమీటర్లు - 24 కంట్రీ పార్కుల సరిహద్దులలో రక్షించబడింది. వాటిలో అడవులు, గడ్డి భూములు మరియు 3,300 స్థానిక మొక్కల రకాలు మరియు చిరుతపులి మరియు సివెట్ పిల్లుల నుండి అడవి పందులు మరియు కొండచిలువల వరకు వన్యప్రాణులు ఉన్నాయి. పాంగోలిన్లు మరియు రోమర్స్ చెట్టు కప్పలు వంటి ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జాతులు కూడా స్వేచ్ఛగా తిరుగుతాయి, తద్వారా దేశ ఉద్యానవనాలు పరిరక్షణకు ముఖ్యమైనవి. ట్యూన్ మున్ పార్క్ మొత్తం 12.5 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది, ఇది కొత్త భూభాగాలలో విస్తృతమైన సౌకర్యాలను అందించే మొదటి ప్రధాన పార్క్. ఇది 3 దశలను కలిగి ఉంటుంది, ఫేజ్ I ఆగస్ట్ 1985లో, ఫేజ్ II ఆగస్ట్ 1988లో మరియు ఫేజ్ III ఫిబ్రవరి 1991లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ పార్క్ టుయెన్ మున్ జిల్లా పట్టణ కేంద్రంలో మరియు ట్యూన్ మున్ టౌన్ హాల్ పరిసరాల్లో ఉంది. పునరుద్ధరణ భూమిపై నిర్మించబడిన ఈ ఉద్యానవనం ట్యూన్ మున్ నివాసితులకు అలాగే భూభాగంలోని సందర్శకులకు పచ్చదనంతో కూడిన విశ్రాంతి స్థలాన్ని అందిస్తుంది. ఉద్యానవనంలో సుమారు 1500 చెట్లు మరియు 200 వివిధ జాతులకు చెందిన 100 000 పొదలు నాటబడ్డాయి. ల్యాండ్‌స్కేప్ ఫీచర్లు మరియు అందమైన వాతావరణంతో పాటు ఉల్లాసంగా మరియు రిలాక్స్‌గా అనిపించేలా, పార్క్‌లో దాదాపు 1 హెక్టారు విస్తీర్ణంలో కృత్రిమ సరస్సు ఉంది. పార్క్ యొక్క దక్షిణ భాగంలో ఉన్న రెప్టైల్ హౌస్ చాలా మంది సందర్శకులను ఆకర్షిస్తున్న మరొక ప్రధాన వాన్టేజ్ పాయింట్. పార్క్‌లోని ఇతర సౌకర్యాలు వాటర్ క్యాస్కేడ్, మోడల్ బోట్ పూల్, యాంఫీథియేటర్, రోలర్-స్కేటింగ్ రింక్, పిల్లల ప్లేగ్రౌండ్ మరియు మల్టీ-గేమ్ ఏరియా మొదలైనవి ఉన్నాయి. మొత్తం మీద, పార్క్ సందర్శకులకు ఒక రోజు సరదాగా గడిపేందుకు అనువైన విశ్రాంతి ప్రదేశం. 1999లో ప్రారంభించబడిన ఈ రెప్టైల్ హౌస్ విశ్రాంతి మరియు సాంస్కృతిక సేవల విభాగంలో ఇదే మొదటిది. ఇది పార్క్ యొక్క దక్షిణ భాగంలో టర్ఫెడ్ ప్రాంతం వద్ద ఉంది మరియు 245 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది, ఇది 2006లో మొత్తం 500 చదరపు మీటర్లకు విస్తరించబడింది. రెప్టైల్ హౌస్‌లోని సౌకర్యాలలో ఇండోర్ టెర్రేరియా మరియు ప్రాంగణంలో టెర్రిరియం ఉన్నాయి. ఇక్కడ వివిధ రకాల సరీసృపాలు ప్రదర్శించబడతాయి. ప్రస్తుతం, రెప్టైల్ హౌస్ లో 53 ప్రత్యక్ష ప్రదర్శనలతో కూడిన 33 జాతులు ఉన్నాయి, వీటిలో కార్పెట్ పైథాన్, వోమా పైథాన్, బాల్ పైథాన్, గ్రీన్ ట్రీ పైథాన్, పిగ్-నోస్డ్ టర్టిల్, రేడియేటెడ్ టార్టాయిస్ ఉన్నాయి. ఆసియాటిక్ లీఫ్ తాబేలు, స్పైడర్ తాబేలు, నల్ల చెరువు తాబేలు, స్పర్డ్ టార్టాయిస్, మడ అడవుల మానిటర్, నీలి నాలుకగల చర్మం, అలంకరించబడిన స్పైనీ-టెయిల్డ్ బల్లి, చిరుతపులి గెక్కో మరియు చైనీస్ వాటర్ డ్రాగన్. అంతేకాకుండా, సంబంధిత సమాచారం యొక్క గ్రాఫిక్ ప్రదర్శన మరియు 7 సరీసృపాల నమూనాలు కూడా అందించబడ్డాయి. 28 800 మంది సమూహ సందర్శకులతో సహా 360 000 వార్షిక ప్రోత్సాహంతో, సరీసృపాలు హౌస్ పార్క్‌లోని ప్రధాన వాన్టేజ్ పాయింట్లలో ఒకటిగా మారుతోంది. -
వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు
సింగపూర్ సింగపూర్‌లోని ఆర్యవైశ్యులు సమీపంలోని కూర్మ ద్వీపంలో (కుసు ఐలాండ్) కార్తికవనభోజనాలను నిర్వహించారు. స్వయంగా తయారుచేసుకున్న వంటకాలతో సామూహికంగా సముద్ర నౌక విహారంలొ కుసు ద్వీపాన్ని చేరుకొన్నారు. ఈసందర్భంగా సముద్ర ఇసుకతో విజయలక్ష్మి, ముక్క ఇంద్రయ్య అంజలి, చైతన్య కలిసి రూపొందించిన సైకత లింగం విశేష ఆకర్షణగా నిలిచింది. సామూహిక లింగాష్టకం, శ్రీమారియమ్మన్ ఆలయంనుండి తెచ్చిన అమ్మవారి విగ్రహానికి ప్రార్థనలు నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో సంయుక్తంగా సామూహిక కార్తీక దీప సమర్పణ చేసారు. ఆరంభంలో క్లబ్ సెక్రటరీ నరేంద్రకుమార్ నారంశెట్టి కార్తీకమాస వైభవాన్ని, కార్తీకమాస ప్రాముఖ్యతను, మహాశివుని విశిష్టతను సభ్యులకు వివరించారు, ఈ కార్యక్రమంలో చిరంజీవి మౌల్య కిషోర్,అమృత వాణి మానస నాట్య ప్రదర్శన ఆకట్టుకొంది. వినయ్, శిల్ప మకేష్, దివ్య మంజుల, స్వప్న మంచికంటి, నీమ ఆనంద్, శ్రావణి, హైందవి లు 80 కి పైగా కుటుంబాలతో 250 మంది సభ్యుల సమన్వయంతో షడ్రషోపేతమైన విందుభోజనాలు సమ కూర్చడం విశేషం. ఫ్లాష్ మాబ్, విగ్నేశ్వర్ రావ్ మానస సహకారంతో ఫ్యాషన్ వాక్ కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. అనంతరం విజేతలకు ప్రత్యేక బహుమతులు అందించారు. గత పది సంవత్సరాల్లో కమిటీ ఎంతో వైభవాన్ని సంతరించుకొందని క్లబ్ సహ వ్యవస్థాపకుడు మంచికంటి శ్రీధర్ ప్రశంసించారు. ఇంకా సీనియర్ సభ్యులు విజయ్ వల్లంకొండ, భాస్కర్ గుప్త, ప్రసాద్, దివ్య, గోపి కిషోర్, సతీష్ కోట తమ అనుభవాలను పంచుకున్నారు. సేవాదళ్ సభ్యులు శివ కిషన్, ఫణీష్, వినయ్ చంద్, శ్రీనివాస్ అమర, సతీష్ వుద్దగిరి, హైందవి, కొత్త హరింద్రబాబు, అనిల్ గాజులపల్లి, మణికంఠ, కిషోర్, నందన్, మానస్ తదితరులు కార్యక్రమం విజయవంతానికి తోడ్పడ్డారు. ముగింపు సభలో కిషోర్ శెట్టి పోషించిన కీలక పాత్రను క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి ,సీనియర్ కమిటీ సభ్యుడు ముక్కాకిషోర్ అభినందించారు గత తొమ్మిది సంవత్సరాలుగా నరేంద్రసేవలను గుర్తిస్తూ సీనియర్ సభ్యులందరు దంపతులకు ప్రత్యేకంగా సన్మానించారు. సింగపూర్‌లో కోవిడ్ పరిస్థితుల తరువాత మళ్లీ మూడేళ్లకు 250 మంది సభ్యులతో కుసు ద్వీపంలో ఈ కార్యక్రమం నిర్వహించడంపై నరేంద్ర సంతోషం వెలిబుచ్చారు. వైశ్యులు అన్ని ధార్మిక, సేవా కార్యక్రమాల్లో ఎప్పటిలాగే ముందుండి ఇక మీదట కూడా నడిపించాలని అభిలషించారు. -
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుమల: పలువురు ప్రముఖులు ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉడిపి పెజవర్ పీఠాధిపతి విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాధ్ రెడ్డి, మధ్యప్రదేశ్ మంత్రి ఆరవింద బహుదురియా, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, పోరుబందర్ ఎంపీ రమేష్ బాయి దుడుకు, జిల్లా నాయ్యమూర్తి రవీందర్ బాబు తదితరులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఏకాంతంగా కార్తీక వన భోజనం తిరుమలలోని పార్వేటి మండపంలో టీటీడీ అధికారులు నేడు ఏకాంతంగా కార్తీక వన భోజనం నిర్వహిస్తున్నారు. కోవిడ్-19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో(200 మందికి మించకుండా) అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. కార్తీక వనభోజనం కారణంగా ఇవాళ శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. -
పెద్దల సిద్ధాంతాలను కాపాడుకోవాలి
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలతో సుభిక్ష పాలన అందిస్తున్నారని తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఏపీ రాష్ట్ర చాత్తద శ్రీ వైష్ణవ సంఘ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, కార్తీక వన మహోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఐక్యమత్యం, అనుబంధంతో కార్తీక మహోత్సవం నిర్వహించడం శుభపరిణామన్నారు. పెద్దల సిద్ధాంతాలను కాపాడుకోవాలని లక్ష్మీపార్వతి పిలుపునిచ్చారు. రామానుజచార్యులు అష్టాక్షరీ మంత్రం అందరికీ అందించారన్నారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ, 13 జిల్లాల చాత్తాద శ్రీ వైష్ణవుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
సందడిగా కార్తీక వన భోజనాలు
అనంతపురం కల్చరల్ : నగరంలోని హెచ్చెల్సీకాలనీలోని రామకృష్ణ సేవా సమితి కార్యాలయ ఆవరణంలో ఆదివారం వనభోజనాల సందడి సాగింది. సమితి అధ్యక్షుడు శ్రీధరమూర్తి నేతృత్వంలో ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా సంధ్యామూర్తి, నాగస్వరూప్ ప్రసాద్ బృందాలు ఆలపించిన రామకృష్ణ ఆధ్యాత్మిక గీతాలు భక్తిభావాన్ని పెంచాయి. అనంతరం వందలాది మంది భక్తులు తీర్థ ప్రసాదాలతో పాటు వనభోజనాలారగించారు. అలాగే కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోపా మచ్చా నరసింహులు ఆధ్వర్యంలో దాదాపు 14 బస్సులలో ఆర్యవైశ్యులు కోటంక క్షేత్రానికి వనభోజనాలకు తరలి వెళ్లారు.