సందడిగా కార్తీక వన భోజనాలు | karthika vana bhojanalu | Sakshi
Sakshi News home page

సందడిగా కార్తీక వన భోజనాలు

Published Sun, Nov 27 2016 9:58 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

karthika vana bhojanalu

అనంతపురం కల్చరల్‌ : నగరంలోని హెచ్చెల్సీకాలనీలోని రామకృష్ణ సేవా సమితి కార్యాలయ ఆవరణంలో  ఆదివారం వనభోజనాల సందడి సాగింది.  సమితి అధ్యక్షుడు శ్రీధరమూర్తి  నేతృత్వంలో ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ  సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి.

ఈ సందర్భంగా సంధ్యామూర్తి, నాగస్వరూప్‌ ప్రసాద్‌  బృందాలు ఆలపించిన రామకృష్ణ ఆధ్యాత్మిక గీతాలు భక్తిభావాన్ని పెంచాయి. అనంతరం వందలాది మంది భక్తులు తీర్థ ప్రసాదాలతో పాటు  వనభోజనాలారగించారు. అలాగే కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోపా మచ్చా నరసింహులు ఆధ్వర్యంలో దాదాపు 14 బస్సులలో ఆర్యవైశ్యులు కోటంక క్షేత్రానికి వనభోజనాలకు తరలి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement