hlc colony
-
రైలు కింద పడి వృద్ధురాలు మృతి
అనంతపురం న్యూసిటీ : అనంతపురంలోని హెచ్ఎల్సీ కాలువ సమీపంలో గల రైలు పట్టాలపై పడి గుర్తు తెలియని వృద్ధురాలు(65) ఆదివారం మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలికి కాలు, చేయి సరిగ్గా లేకపోవడంతో వికలాంగురాలిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సందడిగా కార్తీక వన భోజనాలు
అనంతపురం కల్చరల్ : నగరంలోని హెచ్చెల్సీకాలనీలోని రామకృష్ణ సేవా సమితి కార్యాలయ ఆవరణంలో ఆదివారం వనభోజనాల సందడి సాగింది. సమితి అధ్యక్షుడు శ్రీధరమూర్తి నేతృత్వంలో ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా సంధ్యామూర్తి, నాగస్వరూప్ ప్రసాద్ బృందాలు ఆలపించిన రామకృష్ణ ఆధ్యాత్మిక గీతాలు భక్తిభావాన్ని పెంచాయి. అనంతరం వందలాది మంది భక్తులు తీర్థ ప్రసాదాలతో పాటు వనభోజనాలారగించారు. అలాగే కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోపా మచ్చా నరసింహులు ఆధ్వర్యంలో దాదాపు 14 బస్సులలో ఆర్యవైశ్యులు కోటంక క్షేత్రానికి వనభోజనాలకు తరలి వెళ్లారు. -
ఆదమరిస్తే అంతే..
నార్పల : నార్పల మండలం బొందలవాడ సమీపంలోని హెచ్చెల్సీ ప్రధాన కాలువపై బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. కాలువపై రక్షణ గోడ ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కాలువలో నీళ్లు కూడా ప్రవహిస్తుండటంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కాలువలో పడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సి ఉంది.