అనంతపురం న్యూసిటీ : అనంతపురంలోని హెచ్‌ఎల్‌సీ కాలువ సమీపంలో గల రైలు పట్టాలపై పడి గుర్తు తెలియని వృద్ధురాలు(65) ఆదివారం మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలికి కాలు, చేయి సరిగ్గా లేకపోవడంతో వికలాంగురాలిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.