మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి | Major Train Accident in Maharashtra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం

Jan 22 2025 5:57 PM | Updated on Jan 22 2025 7:13 PM

Major Train Accident in Maharashtra

ముంబై : మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జల్‌గావ్‌ జిల్లా పరండా రైల్వేస్టేషన్‌ సమీపంలో ‍ట్రైన్‌ ప్రయాణికులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. 

ప్రమాదంపై ప్రయాణికుల తెలిపిన వివరాల మేరకు.. జల్‌గావ్‌ జిల్లా పరండా రైల్వేస్టేషన్‌ సమీపంలోని పాచోరా ప్రాంతంలో వేగంగా వెళ్తున్న పుప్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ లోకో పైలెట్‌ బ్రేకులు వేశారు. బ్రేకులు వేయడంతో ట్రైన్‌ చక్రాల నుంచి పొగ వ్యాపించింది. దీంతో ఆ పొగను చూసిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. 

పుప్పక్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయంటూ బిగ్గరగా అరుస్తూ ప్రాణభయంతో పరుగులు తీశారు. వారిలో 35-40 మంది ట్రైన్‌ నుంచి దూకారు. ట్రైన్‌ చైన్‌ లాగడంతో భారీ సంఖ్యలో ప్రయాణికులు పుష్పక్‌ ఎక్స్‌ ప్రెస్‌ ట్రైన్‌ నుంచి పట్టాలు దాటే ప్రయత్నం చేశారు. పట్టాలు దాటుతుండగా..ఎదురుగా వస్తున్న కర్నాటక ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులపై దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మరణించారని సమాచారం.    

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం

పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement