maha rastra
-
అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు
న్యూఢిల్లీ: కేవలం అభివృద్ధి రాజకీయాలకే ప్రజలు పట్టం కట్టారని, అబద్ధాల రాజకీయాలను చిత్తుచిత్తుగా ఓడించారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రగిల్చిన విద్వేషాలను జనం తిప్పికొట్టారని అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో విభజన శక్తులను, ప్రతికూల రాజకీయాలను, వారసత్వ రాజకీయాలను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని తేల్చిచెప్పారు. మహారాష్ట్రలో స్థిరత్వానికే ఓటు వేశారని, సమాజాన్ని అస్థిరపర్చాలని చూసే వారికి తగిన గుణపాఠం నేర్పారని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికలు ఐక్య సందేశాన్ని ఇచ్చాయని, ఏక్ హై తో సేఫ్ హై నినాదాన్ని బలపర్చాయని వెల్లడించారు. జార్ఖండ్ ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నానని, రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత ఉత్సాహంగా పని చేస్తామని ప్రకటించారు. జార్ఖండ్ మరికొంత కష్టపడి పనిచేస్తే బీజేపీ గెలిచేదని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... విభజన శక్తులను ప్రజలు మట్టి కరిపించారు ‘‘ఏక్ హై తో సేఫ్ హై అనే నినాదం మొత్తం దేశానికి మహామంత్రంగా మారింది. దేశాన్ని కులం, మతం పేరిట ముక్కలు చేయాలని చూస్తున్న దుష్ట శక్తులను ఈ మంత్రం శిక్షించింది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి ఓటు వేసి ఆదరించారు. రాజ్యాంగం పేరిట అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను చిన్నచిన్న గ్రూప్‌లుగా విడదీసి లాభపడొచ్చని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు భావించాయి. కానీ, ప్రజలు ఆయా పారీ్టల చెంప చెళ్లుమనిపించారు. విభజన శక్తులను మట్టి కరిపించారు. దేశంలో మారుతున్న పరిస్థితులు, వాస్తవాలను గుర్తించడంలో కాంగ్రెస్ విఫలమైంది. అస్థిరతను ఓటర్లు కోరుకోవడం లేదు. దేశమే ప్రథమం(నేషన్ ఫస్టు) అనే సూత్రాన్ని నమ్ముతున్నారు. పదవే ప్రథమం(చైర్ ఫస్టు) అని కలలు కంటున్నవారిని ఎంతమాత్రం విశ్వసించడం లేదు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ హామీలను అమలు చేయ డం లేదు. ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పనితీరు ఆధారంగా మహారాష్ట్రలోనూ ఆ పార్టీపై ప్రజలు ఒక స్పష్టమైన అంచనాకు వచ్చారు. అందుకే ఎన్ని హామీలిచ్చి నా ఎన్నికల్లో గెలిపించలేదు. కాంగ్రెస్ తప్పుడు హామీలు, ప్రమాదకరమైన ఎజెండా మహారాష్ట్రలో పనిచేయలేదు. అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగం మాత్రమే పని చేస్తుందని మహారాష్ట్ర ఎన్నికలు తేటతెల్లం చేశాయి’’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను అస్సలు ఊహించలేదు.. ‘మహా’ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ
ఢిల్లీ : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని తాను ఊహించలేదని అన్నారు కాంగ్రెస్ అగనేత రాహుల్ గాంధీ. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. మహాయుతి కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ 288 స్థానాల్లో ఏకంగా 130 స్థానాల్లో విజయం సాధించింది. ఇతర మిత్ర పక్షాలతో కలిసి మెజార్టీని సాధించారు. దీంతో రెండోసారి మహాయతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ఈ తరుణంలో మహరాష్ట్ర ఎన్నికల ఫలితాలపై రాహుల్ ఎక్స్ వేదికగా స్పందించారు. మహరాష్ట ఫలితాల్ని నేను ఊహించలేదు. ఓటమిని అంగీకరిస్తున్నాం. ఓటమికి గల కారణాల్ని విశ్లేషిస్తామని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ పార్టీకి మద్దతిచ్చిన ఓటర్లకు, సోదరీమణులందరికీ, పార్టీ గెలుపుకోసం కృష్టి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు’అని అన్నారు. మరోవైపు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం రాజ్యాంగంతో పాటు నీరు, అటవీ, భూమి రక్షణ విజయం’అని రాహుల్ గాంధీ ట్వీట్లో పేర్కొన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వం వహిస్తున్న జేఎంఎం 34 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలించింది.झारखंड के लोगों का INDIA को विशाल जनादेश देने के लिए दिल से धन्यवाद। मुख्यमंत्री हेमंत सोरेन जी, कांग्रेस और झामुमो के सभी कार्यकर्ताओं को इस विजय के लिए हार्दिक बधाई और शुभकामनाएं।प्रदेश में गठबंधन की यह जीत संविधान के साथ जल-जंगल-ज़मीन की रक्षा की जीत है।महाराष्ट्र के नतीजे…— Rahul Gandhi (@RahulGandhi) November 23, 2024 -
థ్యాంక్యూ అమ్మ.. తల్లితో దేవేంద్ర ఫడ్నవీస్
ముంబై : మహరాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విజయ దుందుభి మోగించింది. మొత్తం 288 స్థానాల్లో అధికార బీజేపీ 229 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కేవలం 54 స్థానాలకే పరిమితమైందిఈ తరుణంలో కాబోయే మహరాష్ట్ర సీఎం ఎవరనేది ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే తమ కుమారుడే మహరాష్ట్ర సీఎం అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి సరితా ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ప్రజల కోసం తన కుమారుడు 24 గంటలూ కష్టపడుతున్నారని మీడియాతో పేర్కొన్నారు.మరోవైపు, మహరాష్ట్ర ఎన్నికల ఫలితాలపై నాగపూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గంలో దూసుకుపోతున్న దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆమె తల్లి సరితా ఫడ్నవీస్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోన్ కాల్లో ‘ఎన్నికల తతంగం పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వస్తా అమ్మా. మీతో అన్నీ మాట్లాడుతాను. మీరు నన్ను ఆశీర్వదించండి’ అని అన్నారనేది ఆ ఫోన్ కాల్ సారాంశం.కాగా,ప్రస్తుతం విడుదలైన మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 124 స్థానాల్లో ముందంజలో ఉంది. 144 స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. మహాయుతి కూటమిలోని ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 56, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 19 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. శివసేన(యూబీటీ) 18, శరద్ పవార్ ఎన్సీపీ 15 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. #WATCH | As Mahayuti is set to form govt in Maharashtra, Deputy CM Devendra Fadnavis' mother, #SaritaFadnavis says, "Of course, he will become the CM...It is a big day as my son has become a big leader in the state. He was working hard at all 24 hours..."#ElectionResults… pic.twitter.com/MV36KVSyJe— TIMES NOW (@TimesNow) November 23, 2024 -
మహారాష్ట్రలో వేల కోట్ల బిట్‌కాయిన్ స్కాం కలకలం.. సుప్రీం కీలక ఆదేశాలు
ముంబై : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూ.6,600 కోట్ల బిట్ కాయిన్ స్కాం కలకలం రేపుతోంది. ఈ స్కాంలో పలువురి రాజకీయ నాయకుల హస్తం ఉందంటూ పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు సైతం కేసు విచారణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. అయితే, ఈ బిట్ కాయిన్ స్కాంలో మహరాష్ట్ర కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన జరిగిన లావాదేవీల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, ఎన్సీపీ (ఎస్పీ)ఎంపీ సుప్రియా సూలే బిట్కాయిన్లను ఉపయోగించారంటూ మాజీ పోలీసు అధికారి రవీంద్ర పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు.అందుకు ఊతం ఇచ్చేలా మహరాష్ట్ర పోలింగ్‌కు ఒక రోజు ముందు అంటే నిన్న (నవంబర్19) బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది ప్రెస్మీట్లో ఆధారాల్ని బహిర్ఘతం చేశారు. వాటిలో కాల్ రికార్డింగ్‌లు, వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి. తాను బహిర్ఘతం చేసిన ఆధారాల్లో ఒక ఆడియో క్లిప్‌లో సుప్రియా సూలే వాయిస్ బయటికి వచ్చిందని ఆరోపించారు. అంతేకాదు, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం ఆ ఆడియోలో ఉన్నది తన చెల్లెలు సుప్రియా సూలే వాయిస్ అని ధృవీకరించడం సంచలనం రేపుతోంది.కాగా, బిట్ కాయిన్ స్కాంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ బిట్ కాయిన్ స్కాం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. -
‘మహా’లో చీలికలు? మోదీ ప్రచారానికి అజిత్ పవార్ డుమ్మా!
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి మహరాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)చీఫ్ అజిత్ పవార్ డుమ్మా కొట్టారు.గురువారం మహరాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, పాన్వెల్లో ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు.అయితే ఈ సభకు అజిత్ పవార్‌తో పాటు అభ్యర్థులు సనా మాలిక్, నవాబ్ మాలిక్ జీషన్ సిద్దిక్ గైర్హాజరయ్యారు. శివసేన ఏకనాథ్ షిండే వర్గం, రాందాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు మాత్రమే పాల్గొన్నారు.ఇటీవల హర్యానా ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే, దెబ్బతింటాం) నినాదం వినిపించారు. ఆ నినాదం బీజేపీకి అనుకూల ఫలితాల్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే నినాదంతో మహాయుతి కూటమి మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తుంది. ఆ నినాదాన్ని అజిత్ పవార్ వ్యతిరేకించారు. ఉత్తరప్రదేశ్, జార్ఘండ్‌లలో ఈ నినాదం పనిచేస్తుందేమో.. ఇక్కడ పనిచేయదని వ్యాఖ్యానించారు.ఈ తరుణంలో తాజాగా,మోదీ ఎన్నికల ప్రచారానికి అజిత్ పవార్ రాకపోవడం మహ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. అజిత్ పవార్.. మోదీ ఎన్నికల ప్రచారంలో లేకపోవడాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకోనున్నాయి. తమ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది. చదవండి : 50 కోట్లు ఇస్తే ఈవీఎం హ్యాక్ చేస్తా -
మహారాష్ట్ర ఎన్నికలు.. సీఎం షిండే బ్యాగ్ తనిఖీ చేసిన అధికారులు
ముంబై: మహరాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు ప్రతిపక్షాలకు చెందిన నేతల బ్యాగుల్ని మాత్రమే తనిఖీ చేస్తారని, అధికార పార్టీ నేతల బ్యాగులను పరిశీలించరంటూ శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. అందుకు కౌంటర్‌గా బుధవారం ఎన్నికల అధికారులు మహరాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, కేంద్రమంత్రి రాందాస్ అథవాలే బ్యాగులను చెక్ చేశారు.నవంబర్ 20న మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో సీఏం ఏక్నాథ్ షిండే బుధవారం పాల్ఘర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పర్యటనలో భాగంగా పాల్ఘర్ పోలీస్ గ్రౌండ్‌కు తన హెలికాప్టర్‌తో వచ్చారు. ఆ సమయంలో ఎన్నికల అధికారులు హెలికాప్టర్లో ఉన్న ఏక్నాథ్ షిండే వ్యక్తిగత స్కూట్కేసును పరిశీలించేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న షిండే వ్యక్తి గత సిబ్బంది సూట్‌కేసులో దుస్తులు తప్ప ఏమిలేవని చెబుతుండగా.. మధ్యలో షిండే జోక్యం చేసుకుని వారి డ్యూటిని వారిని చేయనివ్వండి అంటూ ఎన్నికల అధికారులకు అనుమతి ఇచ్చారు. దీంతో షిండే సూట్‌కేసును పరిశీలించగా అందులో దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. హెలికాప్టర్లో పూణెకి వచ్చిన కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే బ్యాగును ఎన్నికల అధికారులు చెక్ చేశారు. హెలికాప్టర్లో పూణెకి వచ్చిన కేంద్ర మంత్రి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.#WATCH | Maharashtra: CM Eknath Shinde’s bags were checked at Palghar Police ground helipad where he reached for the election campaign.(Source: Shiv Sena) pic.twitter.com/44CnWiTYzG— ANI (@ANI) November 13, 2024 ప్రతిపక్షాల నేతలకేనా ఈ నిబంధనలుకాగా, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం యవత్మాల్కు వచ్చినప్పుడు ఎన్నికల అధికారులు తన బ్యాగ్‌ని తనిఖీ చేశారని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ప్రతిపక్షాలకు చెందిన నేతల ఇళ్లు,బ్యాగులు మాత్రమే పరిశీలిస్తున్నారని, అధికార కూటమి నేతల విషయంలో నిబంధనలు అమలు చేయడం లేదని ఆరోపించారు. అంతేకాదు, యావత్మాల్లో తన బ్యాగులను తనిఖీ చేసిన తర్వాత ఠాక్రే ఎన్నికల అధికారులను వారి పేరు, వారి పోస్టింగ్ గురించి అడిగారు. సదరు అధికారులు సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్, హోం మంత్రి అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీల బ్యాగ్‌లను తనిఖీ చేశారా అని ప్రశ్నించారు.అందుకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. ఎన్నికల నిబంధనల మేరకు దేశంలోని అగ్ర రాజకీయ నేతలకు సంబంధించిన హెలికాప్టర్లలో కూడా సోదాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల మేరకే ఠాక్రే బ్యాగును పరిశీలించామన్నారు. #WATCH | #MaharashtraElections2024: Uddhav Thackeray’s Bags Checked By EC Officials Again; Video Surfaces#ShivSenaUBT #UddhavThackeray #Latur #Maharashtra pic.twitter.com/FxMVWufcxY— Free Press Journal (@fpjindia) November 12, 2024 -
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తులు
నాందేడ్: ఇప్పటికే తెలంగాణా,కర్ణాటక రాష్ట్రాలలో సంచలన విజయాలు నమోదు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలోనూ భాగ స్వామ్య పక్షాలతో కలిసి విజయం సాధించి దక్షిణాదిలో బీజేపీ దూకుడుకు ముకుతాడు వేసేందుకు గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టింది.భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటు అంశంలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.ఈ మేరకు ఏఐసీసీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన సీనియర్ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సచిన్ పైలెట్లు బుధవారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించి నాయకులు, పార్టీ శ్రేణులకు ఎన్నికల రూట్ మ్యాప్‌పై దిశానిర్దేశం చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకునేలా కృషిచేయాలంటూ వారికి సూచించారు. -
సుందరీకరణ ప్రాజెక్ట్ : ఎన్నికల్ని బహిష్కరిస్తాం.. ఓటర్ల హెచ్చరిక
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శివాజీపార్క్ మైదానంలో పేరుకుపోయిన ఎర్రమట్టిని తొలగించే అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. పర్యావరణానికి అలాగే తమకు ఆరోగ్యపరమైన సమస్యలు, ఇబ్బందులు సృష్టిస్తున్న ఈ ఎర్రమట్టిని తొలగిస్తారా..? లేదా..? అని ప్రజలు స్ధానిక ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపకుంటే నవంబరు 20న జరిగే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో పోటీచేస్తున్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్ధులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు ఓటు వేయాలని తమను బలవంతం చేసినా లేదా ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చినా..? నన్ ఆఫ్ ఎబౌ (నోటా) మీటను నొక్కుతామని స్పష్టం చేశారు.శివాజీపార్క్ మైదానం బీఎంసీకి చెందిన జీ–ఉత్తర వార్డు పరిధిలోకి వస్తుంది. ఈ వార్డు అసిస్టెంట్ కమిషనర్ అజీత్‌కుమార్ ఆంబీని సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహానికి గురైన మైదానం చుట్టుపక్కల ప్రజలు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని, కుదరని పక్షంలో నోటాపై నొక్కాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధులు ఆందోళనలో పడ్డారు. సైలెన్స్ జోన్లో ఉన్నా...షరతులతో అనుమతి.. నగరం నడిబొడ్డున దాదర్ ప్రాంతంలో 98 వేల చదరపు మీటర్ల స్ధలంలో చారిత్రాత్మక శివాజీపార్క్ మైదానం విస్తరించి ఉంది. బ్రిటీష్ హయాంలో స్వాతంత్య్ర పోరాటం సహా అనేక పోరాటాలకు ఈ మైదానం వేదికైంది. అంతేకాదు గతంలో సునీల్ గవాస్కర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అనీల్ కాంబ్లే వంటి దిగ్గజాలు సహా అనేకమంది క్రికెటర్లు క్రికెట్ ఆటను ఈమైదానంలో సాధన చేసేవారు.ఇక లోక్‌సభ, అసెంబ్లీ, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు వచ్చాయంటే చాలు వివిధ రాజకీయ పార్టీలు ప్రచార సభలతో ఈ మైదానం హోరెత్తుతుంటుంది. ఈ మైదానం సైలెన్స్ జోన్లో ఉన్నప్పటికీ కొన్ని షరతులతో అనుమతి ఇవ్వక తప్పకపోవడంతో వీటన్నిటి నేపథ్యంలో మైదానంలో పెద్దఎత్తునఎర్రమట్టి పేరుకుపోతోంది. ఫలితంగా చుట్టపక్కల నివాసముంటున్న వేలాది కుటుంబాలు ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కుంటున్నాయి. తమ సమస్య పరిష్కరించాలని ఏళ్ల తరబడి బీఎంసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగలడంతో తమ సమస్యను పరిష్కరించాలని కాలుష్య నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేస్తూ పలుమార్లు లేఖలు కూడా రాశారు. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించకపోవడంతో అనేక ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఏడాది మే లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా స్ధానికులు ఈ అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చారు. తమ సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీంతో ఒక మెట్టు దిగివచ్చిన ప్రభుత్వం మైదానంలో పేరుకుపోయిన మట్టిని తొలగించడం ప్రారంభించింది.కానీ జూన్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి. దీంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది.మైదానంలో ఉదయం, సాయంత్రం అనేక మంది వ్యాయామం చేస్తారు. కొందరు మార్నింగ్, ఈవ్నింగ్ వాక్కు వస్తుంటారు. మరికొందరు పిల్లపాపలతో సరదాగా గడిపేందుకు, మరికొందరు కాలక్షేపం కోసం వస్తుంటారు. దీంతో స్ధానికులతోపాటు ఇక్కడకు వచ్చినవారంతా శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్‌ను అమల్లో ఉందంటూ బీఎంసీ అధికారులు పనుల కొనసాగింపును వ్యతిరేకిస్తున్నారు. కాగా మట్టిని తొలగించడానికి ఎన్నికల కోడ్‌కు సంబంధమేమిటని శివాజీపార్క్ రహివాసీ సంఘటన సభ్యులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
మరో సంచలనం : అజిత్ పవార్‌పై శరద్ పవార్ మనవడు పోటీ
ముంబై: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బారామతిలో నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ పోటీ చేస్తుండగా..ఆయనపై శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్‌ను పోటీకి దించుతున్నట్లు ప్రకటించారు. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయతి కూటమి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ-ఎస్పీ) పోటీచేస్తున్న 45 మంది అభ్యర్థుల జాబితాను గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఈ 45 మంది అభ్యర్థుల జాబితాలో బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న 32ఏళ్ల యుగేంద్ర పవార్ పేరు సైతం ఉంది. పవార్ కుటుంబానికి కంచుకోట బారమతి నియోజకవర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో మరో వర్గం అధినేత, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ పోటీ చేస్తుండడం చర్చనీయంశంగా మారింది. Pune | On Baramati candidate selection, Maharashtra State President of the NCP (Sharadchandra Pawar faction), Jayant Patil says, "Baramati candidate selection is based on the demand from the local people of Baramati...I had the interaction with them...They have suggested he is… pic.twitter.com/Fi2mClnFrr— ANI (@ANI) October 24, 2024లోక్‌సభ ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఆయన భార్య సునేత్ర పవార్‌ను బరిలోకి దింపగా.. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఎన్సీపీ(ఎస్పీ) తరఫున పోటీ చేశారు. సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజార్టీతో సుప్రియా గెలుపొందడం శరద్ పవార్ వర్గానికి భారీ ఊరటనిచ్చింది. ఈ క్రమంలోనే సుప్రియా సూలేపై తన సతీమణి సునేత్రను నిలబెట్టి తప్పు చేశానని అజిత్ పవార్ అంగీకరించారు. ఇది తన కుటుంబంలో గొడవలు సృష్టించిందని పలుమార్లు మీడియా ఎదుట వెల్లడించారు. ఇప్పుడు తాజా అజిత్ పవార్‌పై తన మనవడు శరద్‌పవార్‌ను పోటీకి దించడం సంచలనంగా మారింది. -
‘MVA’లో కొలిక్కి వచ్చిన సీట్ల పంచాయితీ .. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!
ముంబై : మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో సీట్ల పంచాయితీ కొలిక్కి వచ్చింది. కూటమిలోని ఒక్కో పార్టీ 85 సీట్లలో పోటీ చేస్తున్నట్లు కుటమి నేతలు బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు.మహరాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 20న జరగనున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ ఠాక్రే వర్గం),నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌పవార్ వర్గం)లోని మహా వికాస్ అఘాడీ కూటమి పోటీ చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎంవీఏలోని ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై స్పష్టత లేదు. సీట్ల పంపకాల విషయంలో కూటమి పార్టీల నేతల మధ్య ఫలు దఫాలుగా జరిగిన చర్చాలు జరిగాయి. తాజాగా బుధవారం జరిగిన చర్చల అనంతరం మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో మహా వికాస్ అఘాడీ కూటమి 255 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కూటమి నేతలు వెల్లడించారు. మిగిలిన 33 స్థానాలపై తర్వలో స్పష్టత ఇవ్వనున్నారు. బీజేపీ తొలి జాబితా విడుదల మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను 99 మందితో బీజేపీ మొదటి జాబితా విడుదల చేసింది. వీరిలో 71 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ఇందులో ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్‌కు చోటు దక్కింది. ఇంకా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులె, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్, మంత్రులు గిరీశ్ మహాజన్, సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ వంటి ప్రముఖులు ఉన్నారు. జాబితాలో మొత్తం 13 మహిళల పేర్లున్నాయి. చించ్వాడ్, కల్యాణ్ ఈస్ట్, శ్రీగొండ స్థానాల్లో మాత్రం సిట్టింగ్‌లకు బదులు కొత్త వారికి అవకాశమిచ్చింది. ముంబైలోని పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల్లో 14 మందిని మళ్లీ నామినేట్ చేసింది. సుమారు 150 సీట్లలో పోటీ చేసేందుకు మిత్రపక్షాలతో బీజేపీ మంతనాలు సాగిస్తోంది. -
ముంబైని మరోసారి ముంచెత్తనున్న భారీ వర్షాలు
ముంబై : మహరాష్ట్రకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండ్రోజుల క్రితం భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తాయి. ఫలితంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించి పోయింది. ఈ తరుణంలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణ శాఖ ముంబైకి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బలమైన పశ్చిమ గాలుల కారణంగా శుక్రవారం ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.ఈ సందర్భంగా పాల్ఘర్, రాయ్‌గఢ్ పరిసర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.👉చదవండి : సీఎం సార్.. కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా -
మహిళ ప్రాణం తీసిన మ్యాన్‌హోల్ గ్రిల్స్ దొంగతనం
మ్యాన్‌హోల్ గ్రిల్స్ (మెటల్స్) దొంగతనం 45 ఏళ్ల విమల్ అనిల్ గైక్వాడ్ ప్రాణం తీసింది. భారీ వర్షాలకు గైక్వాడ్ మ్యాన్‌హోల్‌లో పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే వర్షాల కారణంగా ఏర్పడే ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండేలా అధికారులు మ్యాన్‌హోల్స్‌ను మెటల్స్ను అమర్చారు. ఆ మెటల్స్ను అగంతకులు దొంగతనం చేశారు. ముంబైలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు విమల్ అనిల్ గైక్వాడ్ ప్రమాదవ శాత్తూ డ్రైనేజీలో పడి మరణించారు. ఈ ఘటనలో కుటుంబానికి ఆధారమైన తన భార్య మరణానికి కారణమైన ప్రభుత్వ ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలి భర్త పోలీసుల్ని ఆశ్రయించారు‘నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. నన్ను, నా ఇంటి బాధ్యతల్ని తన చూసుకునేది. ఇంటి బాధ్యతల్ని నా భార్యనే చూసుకునేది. ఆమె మరణంతో మేం సర్వం కోల్పోయాం ’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా తప్పు ఎవరిదైనా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అనిల్ గౌక్వాడ్ ఫిర్యాదుతో పోలీసులు..ఈ దర్ఘుటనలో నిర్లక్ష్యానికి పాల్పడినట్లు బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో మున్సిపల్ శాఖ.. డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, మూడు రోజుల్లో నివేదికను కోరింది. నిన్న కురిసిన భారీ వర్షం వల్ల ఆర్థిక రాజధానిలో రైలు పట్టాలు, రోడ్లు నీట మునిగాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది .14 విమానాలు దారి మళ్లించాయి. అయితే వర్షం బీభత్సం సమయంలో గైక్వాడ్ అంధేరీ ఈస్ట్‌లోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనం గేట్ నంబర్ 8 సమీపంలో పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోల్‌లో పడిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు,అగ్నిమాపక దళ సిబ్బంది ఆమెను కూపర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.కాగా, ఈ ఏడాది ముంబైలో వేర్వేరు మ్యాన్‌హోల్‌లో పడిన ఘటనల్లో కనీసం ఏడుగురు మరణించారు. నగరంలో మ్యాన్‌హోల్ మెటల్ దొంగతనాలు కూడా పెరుగుతున్నాయని, గతేడాది ముంబైలో 791 మ్యాన్‌హోల్ కవర్ దొంగతనాలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. -
ముంబైలో వర్ష బీభత్సం
ముంబై: మహరాష్ట్రలో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ముంబై రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. వర్షం కారణంగా స్పైస్‌జెట్, విస్తారాతో పాటు పలు సంస్థలు విమానాలను దారి మళ్లించాయి. వాతావరణ శాఖ బుధవారం ఉదయం ముంబైతో పాటు పొరుగు జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల అనంతరం మధ్యాహ్నం నుంచి ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో భారీ వర్ష పాతం నమోదైంది. ములుండ్ దాని పరిసరాల్లో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాతావరణ శాఖ అధికారి సుష్మా నాయర్ మాట్లాడుతూ, ఉత్తర కొంకణ్ నుండి దక్షిణ బంగ్లాదేశ్ వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాలలో తుఫాను ద్రోణి నడుస్తుందని చెప్పారు. ఫలితంగా ముంబై, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుందన్నారు. ఈ వారంలో కొంకణ్, గోవాలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని ఆమె వావాతవరణ శాఖ అధికారి సుష్మా నాయర్ చెప్పారు. -
పూటుగా మద్యం సేవించి.. బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సం
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే కుమారుడు సంకేత్ బవాన్కులే మద్య మత్తులో బీభత్సం సృష్టించారు. పూటుగా మద్యం సేవించి ఇతర వాహనాల్ని ఢీకొట్టారు. ఘటన అనంతరం సంకేత్ బవాన్‌కులేతో పాటు అతని స్నేహితులు పరారయ్యారు. సంకేత్ కారులో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నారని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..సోమవారం అర్ధరాత్రి 1 గంటకు మద్యం మత్తులో ఉన్న సంకేత్ బవాన్కులే ఆడి కారుతో మాన్కాపూర్ ప్రాంతం వైపు వెళుతున్నాడు. అదే సమయంలో ఎదురుగా ఉన్న వాహనాల్ని ఢీకొట్టాడు. నానా హంగామా చేశాడు. అయితే సంకేత్ తీరుతో కోపోద్రికులైన ఇతర వాహనదారులు.. అతని కారును వెంబడించారు. దీంతో మార్గం మద్యలోనే కారును వదిలేశాడు. అందులో ఉన్న ఇద్దర్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అరెస్ట్.. ఆపై బెయిల్ప్రమాదంలో తన కారుకు డ్యామేజీ జరిగిందంటూ జితేంద్ర సోన్కాంబ్లే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంకేత్ బవాన్కులే కారు డ్రైవర్ అర్జున్ హవ్రే, రోనిత్ చిట్టమ్‌వార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది సేపటికే బెయిల్‌పై విడుదలయ్యారు. చట్టం ముందు అందరూ సమానులేఈ సందర్భంగా కారు ప్రమాదంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే స్పందించారు. ఆ ఆడి కారు తన కుమారుడు సంకేత్ పేరిట రిజిస్టర్ అయినట్లు అంగీకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు ఎలాంటి పక్షపాతం లేకుండా క్షుణ్ణంగా,నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి.దోషులకు కఠిన శిక్ష విధించాలి.చట్టం ముందు అందరూ సమానమేనని వ్యాఖ్యానించారు. -
తండ్రికి వెన్నుపోటు పొడవడం తగదు : డిప్యూటీ సీఎం
మీ రాజకీయ లబ్ధి కోసం తండ్రికి వెన్నుపోటు పొడవడం తగదు అంటూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మరోసారి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా అజిత్ పవార్ జన సమ్మాన్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ యాత్రలో..రాష్ట్ర మంత్రి ధర్మారావు బాబా ఆత్రం, ఆయన కుమార్తె భాగ్యశ్రీ గురించి మాట్లాడారు. భాగ్యశ్రీ తండ్రి ప్రత్యర్ధి పార్టీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పి)లోకి వెళ్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతేకాదు తండ్రి ధర్మారావు బాబా ఆత్రంపై కుమార్తె భాగ్యశ్రీ పోటీ చేస్తుందన్న ప్రచారం మొదలైంది. ఆ ప్రచారంపై అజిత్ పవార్ స్పందించారు. ‘ తండ్రిపై కుమార్తె పోటీ చేయడం ఎంత వరకు కరెక్ట్. కూతురిని తన తండ్రి కంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించరు. పెళ్లి చేసుకుని భాగ్యశ్రీ బెల్గాం వెళ్లినప్పటికీ..గడ్చిరోలిలో ఆమెకు (తండ్రి ఆత్రం) అండగా నిలిచి జిల్లా పరిషత్ అధ్యక్షురాలిని చేశారు. ఇప్పుడు మీరు (భాగ్యశ్రీ) మీ తండ్రికి వెన్నుపోటు పొడిచి ఆయన మీదే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మీ నిర్ణయం సరైందేనా? అని ప్రశ్నించారు. ‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మీ తండ్రికి మద్దతు ఇవ్వండి. అతనిని గెలిపించండి. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం , సంకల్పం ఆయనకు మాత్రమే ఉంది. కుటుంబంలో చీలికలు రావడాన్ని సమాజం అంగీకరించదు. నా విషయంలోనూ ఇదే జరిగింది. లోక్ సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి తన సోదరి సుప్రియ సూలేపై తన భార్య సునేత్ర పవార్‌ను పోటీకి దింపి ఉండాల్సింది కాదు. నేను తప్పు చేశా. చేసిన తప్పును ఇప్పుడు ఒప్పుకుంటున్నా’ అని అన్నారు.అజిత్ పవార్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది రెండో సారి. కొద్ది రోజుల క్రితం ఇలాగే మాట్లాడారు. ఇటీవల మహరాష్ట్ర లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో శరద్ పవార్ తన అనుభవాన్ని రంగరించి, తన వర్గం ఎన్సీపీ (ఎస్పీ) పోటీ చేసిన 10 సీట్లలో ఎనిమిది స్థానాలను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఆ ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి శరద్ పవార్ ఎన్సీపీ తరుఫున సుప్రీయా సూలే బరిలో దిగగా..అదే స్థానంలో సుప్రియా సూలేపై అజిత్ పవార్ ఎన్సీపీ తరుఫున ఆయన భార్య సునేత్ర పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సునేత్ర రాజ్యసభకు నామినేట్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మహరాష్ట్ర అధికార కూటమి నుంచి అజిత్ పవార్‌ను బీజేపీ పక్కన పెట్టేస్తుందంటూ వ్యక్తమవుతున్న అభిప్రాయాల నడుమ అజిత్ పవార్ ఇలా మాట్లాడుతుండడం గమనార్హం. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం షురూ.. నేటి నుంచి ప్రజల్లోకి రాహుల్
ముంబై : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం షురూ చేశారు. త్వరలో మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ గురువారం ప్రారంభించనున్నారు. ప్రచారంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రచారంలో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ మధ్యాహ్నం 1 గంటకు వాంగిలో మాజీ రాష్ట్ర మంత్రి, దివంగత పతంగరావు కదమ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు, ఆ తర్వాత 1.45 గంటలకు కడేగావ్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు’ అని జాతీయ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.288 అసెంబ్లీ స్థానాల్లో 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి కూటమిగా పోటీ చేయనున్నాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ మహాయుతి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో భాజపా 160-170 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది.మహరాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో ఈ ఏడాది మహరాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. 48 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 23 స్థానాలు,శివసేన 18 స్థానాలు,నేషనలిస్ట్ కాంగ్రెస్ 4 స్థానాలు,కాంగ్రెస్ 2,స్వాభిమాని పక్ష ఒకస్థానంలో గెలిచింది. #WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi leaves from his residence. Rahul Gandhi will visit Maharashtra today, where he will hold a public meeting. pic.twitter.com/aysHPWuY9I— ANI (@ANI) September 5, 2024 -
ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన : నిందితుడు దొరికాడు
ముంబై : మహారాష్ట్రలో 35 అడుగుల మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిన ఘటనలో విగ్రహ తయారీ దారుడు జయదీప్ ఆప్టేను పోలీసులు అరెస్ట్ చేశారు. జయదీప్ ఆప్టే ప్రస్తుతం రాష్ట్ర డీసీపీ కార్యాలయంలో పోలీసు కస్టడీలో ఉన్నారు. గత నెల ఆగస్ట్ 26న సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో ఏర్పాటు చేసిన 35 అడుగుల శివాజీ విగ్రహం కూలిపోయింది. ఈ ఘటన జరిగిన అనంతరం ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరాఠా యోధుడి విగ్రహం ఏర్పాటులో అవినీతి జరిగిందని, నిందితుల్ని అరెస్ట్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో తనని పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంతో జయదీప్ పరారయ్యాడు. ఎట్టకేలకు కణ్యాణ్ ప్రాంతంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.అనుభవం లేకుండా విగ్రహం తయారీమహరాష్ట్రలో దుమారం రేపుతున్న శివాజీ విగ్రహం కూలిన ఘటనపై జయ్‌దీప్ గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. కల్యాణ్ ప్రాంతంలో విగ్రహాల తయారీ సంస్థను నిర్వహిస్తున్న జయ్‌దీప్‌కు అనుభవం లేదని పోలీసులు గుర్తించారు. చిన్న చిన్న విగ్రహాలు తయారు చేసిన అనుభవం ఉన్న జయ్‌దీప్ 30 అడుగుల భారీ విగ్రహాన్ని ఎలా తయారు చేశారనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. అనుభవం లేకపోవడం, ఫలితంగా విగ్రహం కూలిపోవడంపై పోలీసులు జయ్దీప్పై కఠిన చర్యలు తీసుకోనున్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ విగ్రహం కూలిపోవడంతో ఇప్పటికే మహరాష్ట్ర పోలీసులు జయదీప్ ఆప్టే, నిర్మాణ సలహాదారు చేతన్ పాటిల్‌పై భారతీయ న్యాయ సంహిత చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఆగస్టు 31న పాటిల్‌ను అరెస్టు చేయగా..ఆప్టేపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అనంతరం, సింధుదుర్గ్ పోలీసులు బృందాలుగా విడిపోయి జయ్దీపై కోసం ముంబై, థానే, కొల్హాపూర్‌తో సహా పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు అరెస్ట్ చేశారు. రాజకీయ దుమారంమరికొన్ని రోజుల్లో మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ కూలిపోవడంపై రాజకీయ దుమారం చెలరేగింది. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. విగ్రహ నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.236 కోట్లు కేటాయించినప్పటికీ కేవలం రూ.1.5 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇంత భారీ నిర్మాణాన్ని రూపొందించడంలో అనుభవం లేకపోయినా జయదీప్‌కు ఇంత ముఖ్యమైన కాంట్రాక్టు ఎలా ఇచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్కనారు. -
సీఎం అభ్యర్థి గురించి ఇప్పుడెందుకు? ముందు ఎన్నికల్లో గెలుద్దాం
మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) తరుఫు సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించాల్సిన అవసరం లేదని, కూటమి సమిష్టి నాయకత్వంలో పోటీ చేస్తుందని శరద్ పవార్ స్పష్టం చేశారు. అయితే విపక్ష కూటమికి సీఎం అభ్యర్థిగా శివసేన (యుబిటి)కి నేతృత్వం వహిస్తున్న ఉద్ధవ్ ఠాక్రేను ఖరారు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్న తరుణంలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా సీఎం అభ్యర్థి ఎవరు? అనేది సంఖ్యా బలాన్ని బట్టి నిర్ణయించాలి. ఎన్నికల ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని శరద్ పవార్ తెలిపారు. సీఎం అభ్యర్థి ఎవరు అని తేల్చకుండా ఎన్నికల ప్రచారం, గెలుపుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదంటూ నాటి ఎమర్జెన్సీ (1977) సమయంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల గురించి ప్రస్తావించారు.ఎమర్జెన్సీ సమయంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల తర్వాతనే ప్రధాని మొరార్జీ దేశాయ్‌ని జనతా పార్టీ ప్రకటించింది. ఆ ఎన్నికల ప్రచారంలో పీఎం అభ్యర్థి పేరు చెప్పి ఓట్లు అడగలేదు. ఇప్పుడు కూడా అంతే.. సీఎం ఎవరు? అనేది ఆలోచించాల్సిన సందర్భం కాదు. కలిసి ఎన్నికల బరిలోకి దిగుదాం. ప్రజల మద్దతు లభించిన తర్వాత.. సుస్థిర ప్రభుత్వాన్ని అందిందాం’ అని శరద్ పవార్ పిలుపునిచ్చారు. డైలమాలో కాంగ్రెస్రానున్న ఎన్నికల్లో మహావికాస్ అఘాడి కూటమికి సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చడంలో కాంగ్రెస్ సైతం డైలమాలో ఉంది. ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని శివసేన (యుబిటి) ఒత్తిడి చేస్తుండగా..అదే సమయంలో, ఉద్ధవ్‌ను సంకీర్ణ ప్రచార సారథిగా చేయాలని కాంగ్రెస్ యోచిస్తుందనే వార్తలు మహా పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కెర్లు కొడుతున్నాయి. 288 అసెంబ్లీ స్థానాల్లో 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి కూటమిగా పోటీ చేయనున్నాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ మహాయుతి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో భాజపా 160-170 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. -
ప్రధాని మోదీలో అహంకారాన్ని చూశారా? : ఉద్ధవ్ ఠాక్రే
ముంబై : ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై మహరాష్ట్రలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఇందులో భాగంగా హుతాత్మ చౌక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు విపక్ష నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మహారాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు.విగ్రహం కూలిపోవడంపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు. అయితే మోదీ క్షమాపణలపై మహరాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు.మోదీ క్షమాపణల్లో మీరు అహంకారాన్ని చూశారా? ప్రధాని ఎందుకు క్షమాపణలు చెబుతున్నారు. ఎనిమిది నెలల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం కూలిపోయినందుకా? లేదంటే విగ్రహం నిర్మాణంలో అవినీతి చోటు చేసుకున్నందుకా? అని ప్రశ్నలు కురిపించారు. శివాజీ మహారాజ్‌ను అవమానించిన శక్తులను ఓడించడానికి ఎంవీఏ క్యాడర్ కలిసి పనిచేయాలి అని పిలుపునిచ్చారు. ఇక శివాజీ విగ్రహం కూలిపోవడంపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని వ్యాఖ్యానించిన సీఎం ఏక్నాథ్ షిండే వ్యాఖ్యలపై ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. మేం రాజకీయాలు చేస్తున్నామని ప్రభుత్వం చేస్తుంది. మేం రాజకీయాలు చేయడం లేదు. రాష్ట్ర కీర్తి కోసం పోరాడుతున్నాం. మహాయుతి ప్రభుత్వానికి గెట్ అవుట్ చెప్పడానికి మేము గేట్‌వే ఆఫ్ ఇండియాకు వచ్చాము’అని హెచ్చరించారు. -
‘బాబోయ్ వాంతులు’.. కూటమిలో చిచ్చు పెట్టిన మంత్రి కామెంట్లు!
వీళ్ల పక్కన కూర్చోవాలంటేనే నాకు వాంతి వచ్చినట్లే అనిపిస్తుందంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావం పడుతుందోనని అధికార మహాయుతి కూటమి నేతలకు భయం పట్టకుంది. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు?సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మంత్రి తానాజీ సావంత్ ఎన్సీపీ (అజిత్‌పవార్), కాంగ్రెస్ పట్ల తనకున్న అయిష్టత గురించి బహిర్గతం చేశారు. ‘‘నేను హార్డ్‌కోర్ శివసైనికుడిని. నా జీవితంలో కాంగ్రెస్, ఎన్సీపీతో నేను ఎప్పుడూ స్నేహం చేయలేదు. విద్యార్థి దశ నుంచి ఆ రెండు పార్టీలకు నేనెప్పుడూ దూరమే. కానీ రాజకీయ పరిణామాల తర్వాత ఎన్సీపీ నేతలతో కలిసి కేబినెట్ సమావేశంలో కూర్చోక తప్పడం లేదు. కూర్చున్నప్పటికీ బయటకు వచ్చిన తర్వాత నాకు వాంతులు అవుతున్నట్లు అనిపిస్తుంది’’ అని మహరాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తానాజీ సావంత్ వ్యాఖ్యానించారు.STORY | Sit next to NCP ministers at cabinet meetings but it’s nauseating: Shiv Sena’s Tanaji SawantREAD: https://t.co/fMan6gEu4UVIDEO: (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/YQIlgm72Hf— Press Trust of India (@PTI_News) August 30, 2024 ధర్మాన్ని కాపాడేందుకే మౌనంమరోవైపు తానాజీ సావంత్ కామెంట్స్‌పై ఎన్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ అమోల్ మిత్కారీ ఓకింత అనుమానం, ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీనమైన సంకీర్ణాన్ని కొనసాగించడం తమ పార్టీ బాధ్యత మాత్రమేనా? అని ప్రశ్నించారు. సంకీర్ణ ధర్మాన్ని కాపాడుకోవడం కోసమే తాము మౌనంగా ఉన్నామని అన్నారు.బీజేపీకి అజిత్ పవార్ అవసరం తీరినట్లుందితానాజీ సావంత్ వ్యాఖ్యలపై ఎన్సీపీ(అజిత్ పవార్) వర్గం నేతలతో పాటు ఎన్సీపీ (శరద పవార్) వర్గం నేతలు సైతం స్పందిస్తున్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రతినిధి క్లైడ్ క్రాస్టో మాట్లాడుతూ..తానాజీ వ్యాఖ్యలు మహాయుతి సంకీర్ణానికి ఇకపై అజిత్ పవార్ ఎన్సీపీ అవసరం లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లైంది. ఆర్ఎస్ఎస్లో కూడా అజిత్ పవార్‌తో పొత్తుపై ఆందోళనలు తలెత్తాయని, ఇప్పుడు సావంత్ ప్రకటనతో ఆందోళనలు బహిర్గతం అయ్యాయని సూచించారు. బీజేపీ అజిత్ పవార్‌ను మహాయుతి నుండి బయటకు పంపే సమయం ఆసన్నమైంది. పరిస్థితులు బాగలేవని చెప్పారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిఅజిత్ పవార్ తన ఆత్మగౌరవాన్ని కోల్పోయారని, ఎన్సీపీతో పొత్తుపై ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేతల్లో అసంతృప్తి పెరుగుతోందని మరో ఎన్సీపీ (ఎస్పి) ప్రతినిధి మహేష్ తపసే పేర్కొన్నారు. ఒకప్పుడు ఎన్‌సిపిలో అపారమైన గౌరవాన్ని పొందిన అజిత్ పవార్ అధికారం కోసం తన ఆత్మగౌరవాన్ని రాజీ చేస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదన్నారు. మరి ఈ వరుస పరిణామాలపై మహాయుతి కూటిమి పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.తానాజీ సావంత్ వ్యాఖ్యలతో బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)మహారాష్ట్ర అధికార మహాయుతి కూటమి నేతల్లో గుబులు మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘శిరస్సు వంచి 100 సార్లు క్షమాపణ చెప్పేందుకు సిద్ధం’ : షిండే
ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఇటీవల 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంపై ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. గురువారం మరాఠా యోధుడి పాదాలపై శిరస్సు వంచి 100 సార్లు క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.అయితే, ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా కొత్త విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేయొచ్చనే అంశంపై ప్రభుత్వానికి తగు సలహాలు ఇవ్వొచ్చని సూచించారు. ‘రాజకీయం చేయడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ మనందరి దేవుడు. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు. ఆయన పాదాలకు శిరస్సు వంచి ఒక్కసారి కాదు వందసార్లు క్షమాపణలు చెబుతాను. మహాత్మున్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యవహారాల్ని చక్కబెడుతున్నాము’అని అన్నారు. ‘బుధవారం రాత్రి మేం ఐఐటీల ఇంజనీర్లు, నేవీ అధికారులతో భేటీ అయ్యాము. కొత్త విగ్రహం ఏర్పాటుపై రెండు కమిటీలను నియమించాం. ఆ స్థలంలో త్వరలో ఓ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ఏక్నాథ్ షిండే వెల్లడించారు. విగ్రహం కూలిపోవడానికి గల కారణాలను ఒక కమిటీ గుర్తించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఛత్రపతి శివాజీ విగ్రహాలను తయారు చేసిన అనుభవం ఉన్న శిల్పులు, నిపుణులతో పాటు ఇంజనీర్లు, నేవీ అధికారులతో మరో కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
‘నేరస్థులు ఎవ్వరైనా సరే.. వారిని విడిచి పెట్టం’
ముంబై : దేశంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రధాని మోదీ హెచ్చరికలు జారీ చేశారు. కోల్‌కతా ఆర్జీకార్, బద్లాపుర్ పాఠాశాల లైంగిక వేధింపుల ఘటనలపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్న వేళ మోదీ వ్యాఖ్యానించారు. మహరాష్ట్రలోని లఖ్పతి దీదీ కార్యక్రమంలో మహిలలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మోదీ ప్రసంగించారు. నేను అన్నీ రాష్ట్రాలకు చెబుతున్నా. మహిళలపై దారుణాలకు ఒడిగట్టే నేరస్థులు ఎవ్వరైనా సరే ఉపేక్షించవద్దు. త్వరలో చట్టాల్ని మరింత పటిష్టపరుస్తున్నాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. Jalgaon, Maharashtra: 'The security of women is also very important for our country. I will once again tell every state government that crimes against women are unforgivable. No matter who the culprit is, they should not be spared,' says PM Modi at the Lakhpati Didi Sammelan pic.twitter.com/6I1SSo9FOk— IANS (@ians_india) August 25, 2024 -
స్కూల్లో చిన్నారులపై దారుణం.. ఆందోళనలతో ఆగిన రైళ్ల రాకపోకలు
థానే: ఓ వైపు ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగిన ఉదంతంపై దేశ వ్యాప్తంగా ఆందోళలు కొనసాగుతున్న వేళ.. మరికొందరు చిన్నారుల పట్ల ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు.ఆగస్టు 16న మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ స్కూల్లో దారుణం జరిగింది. స్కూల్లో చదివే ఇద్దరు బాలికలపై అదే స్కూల్లో క్లీనింగ్ విభాగంలో పనిచేసే ఓ యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. ఈ దారుణం వెలుగులోకి రావడంతో థానే జిల్లా నిరసన కారుల ఆందోళనతో అట్టుడికిపోయింది. #Maharashtra l Parents & residents in #Badlapur protest over the sexual exploitation of 2 minor girls, blocking the railway tracks. The accused sweeper has been arrested & the school has suspended staff & closed for 5 days.#Crime #Thane #WomenSafety#Justice #Assault #Protest pic.twitter.com/RClqTFyvwx— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) August 20, 2024 బాధితుల తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. స్థానిక బద్లాపూర్ రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు. దీంతో రైల్వే రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ సంఘటనతో స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. క్లాస్ టీచర్ని తొలగించినప్పటికీ తల్లిదండ్రులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భద్రతకు పూర్తి బాధ్యత వహించడంలో పాఠశాల విఫలమైందని, పాఠశాల యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కాగా, బాధితుల ఆందోళనతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో పాఠశాల భద్రత విషయంలో లోపాలు బయటపడ్డాయి. బాలికల మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు మహిళా అటెండర్లు లేరని తేలింది. స్కూల్లో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. -
వెల్లుల్లిని కొంటున్నారా.. ఇది తెలిస్తే
ఘాటైన వాసన దాని సహజ లక్షణం. అందుకే దాన్ని చూడగానే చాలామంది ముక్కు చిట్లాస్తారు. కానీ అదిలేని వంటిల్లు సాధారణంగా ఉండదు. ఎందుకంటే ఆ ఘాటే నోరూరించే రుచికి కారణం. ఆ ఘాటే ఆరోగ్యానికి అద్భుతమైన ఔషదం. అందుకే పప్పు నుంచి చికెన్ దాకా ఏది వండాలన్నా వెల్లుల్ని ఉండాల్సిందే. అలాంటి దివ్య ఔషదాలున్న వెల్లుల్ని ధరలు విపరీతంగా ఉన్నాయి. ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు కాసుల కక్కుర్తికోసం అడ్డదార్లు తొక్కుతున్నారు.మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో సిమెంట్‌తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో వెల్లుల్ని పొట్టు ఒలిచిన తర్వాత రాయిలా గట్టిగా ఉండడం మనకు కనిపిస్తుంది. ఆ దృశ్యాలు ఇప్పుడు వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో కొన్ని కూరగాయల మార్కెట్లలో నకిలీ వెల్లుల్లిని విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తాజా వెలుగులోకి వచ్చిన కొనుగోలు దారులలో భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న వెల్లుల్ని స్వచ్ఛతపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.देशभर में लहसुन के दाम फिलहाल आसमान छू रहे हैं। इस बीच एक हैरान करने वाला मामला सामने आया है, जहां महाराष्ट्र के अकोला में कुछ फेरीवाले नागरिकों को सीमेंट से बना नकली लहसुन बेचकर धोखा दे रहे हैं। #Garlic #Maharashtra #Akola इनपुट्स: धनंजय साबले pic.twitter.com/Q4v1hZBhR9— सत्य सनातन भारत (Modi ka parivar)🚩🙏🕉️🙏🕉 (@NirdoshSha33274) August 18, 2024 -
అడవిలో అమెరికన్ మహిళ.. కేసులో కొత్త ట్విస్ట్
ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అమెరికాకు చెందిన ఓ మహిళను గొలుసులతో కట్టేసిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసుల వాంగ్మూలంలో అమెరికన్ మహిళ తనకు తాను సంకెళ్లు వేసుకున్నానని, మరెవరి ప్రమేయం లేదని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. జులై 27 న సింధుదుర్గ్ జిల్లాలోని అటవీ ప్రాంతమైన సోనుర్లి గ్రామ శివార్లలో ఇనుప గొలుసులతో మహిళను చెట్టుకు కట్టేశారు. అయితే ఆ ప్రాంతానికి వెళ్లిన పశువు కాపరికి మహిళ బిగ్గరగా కేకలు వేస్తూ కనిపించారు. దీంతో పశువుల కాపరి అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కట్టేసిన గొలుసుల్ని విడిపించారు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం (ఆగస్టు 3) సింధుదుర్గ్ పోలీసులు మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ సమయంలో ఆమె మూడు తాళాలు, ఇనుప గొలుసులతో ముంబై నుంచి 460 కిలోమీటర్ల దూరంలోని సోనుర్లి గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్లినట్లు, తాను అక్కడనున్న ఓ చెట్టుకు కట్టుకున్నట్లు తెలిపారు. ఆమెను ఎన్ని రోజులు చెట్టుకు కట్టివేసిందనే దానిపై ఇంకా స్పష్టత లేదని ఆయన చెప్పారు.ఇక మహిళ వద్ద ఉన్న బ్యాగ్‌ను పరిశీలించగా.. ఆమె బ్యాగ్‌లో అమెరికా పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, ఇతర డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆమెను తమిళనాడుకు చెందిన లలితా కయీగా గుర్తించిన పోలీసులు..తమిళనాడు పోలీసులకు సమాచారం అందించారు. తదిపరి విచారణ కొనసాగుతోంది.