
ముంబై : నువ్వు పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గంలో నేను పోటీ చేసి ఉండి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదంటూ బాబాయ్ అజిత్ పవార్, అబ్బాయి రోహిత్ పవార్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రస్తుతం, ఆ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) తరుఫున అహల్య జిల్లా ఖజరత్ జమ్‌ఖేడ్ నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ సోదరుడి కుమారుడు రోహిత్ పవార్.. బీజేపీ అభ్యర్థిపై స్వల్ప తేడాతో విజయం సాధించారు.
ఈ తరుణంలో సోమవారం(నవంబర్ 25) మహారాష్ట్ర తొలి సీఎం వైబీ చవాన్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అజిత్ పవార్, ఆయన సోదరుడి కుమారుడు రోహిత్ పవార్ ఒకరికొకరు ఎదురుపడ్డారు.
‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచావుగా. రా.. వచ్చి నా ఆశీర్వాదం తీసుకో. ఒకవేళ నేనే ఖజరత్ జమ్‌ఖేడ్‌లో ఎన్నికల ప్రచారం చేసి ఉంటే ఏమి జరిగి ఉండేది?’’ అని రోహిత్ పవార్‌ను ఉద్దేశిస్తూ అజిత్ పవార్ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడారు. ఆ మాటతో రోహిత్ పవార్.. అజిత్ పవార్ కాళ్లకు నమస్కరించారు.
స్వల్ప తేడాది విజయం
ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ అహల్యానగర్ జిల్లాలోని ఖజరత్ జమ్‌ఖేడ్ నియోజకవర్గంలో తన ప్రత్యర్థి బీజేపీ నేత రామ్ షిండేపై 1,243 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు.
41 అసెంబ్లీ స్థానాల్లో అజిత్ పవార్ గెలుపు
గత వారం మహరాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికలలో శరత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)10 స్థానాల్ని కైవసం చేసుకోగా.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.
स्व. यशवंतराव चव्हाण साहेबांची समाधी प्रितीसंगम म्हणजे पवित्र स्थळ. चव्हाण साहेबांनीच एक सुसंस्कृत अशी राजकीय संस्कृती जपण्याचे संस्कार महाराष्ट्रावर केले. त्यानुसारच आज प्रितीसंगमावर आदरणीय अजितदादांची भेट झाली. त्यांची राजकीय वाटचाल स्वतंत्र दिशेने सुरु असली तरी त्यांचा राजकीय… pic.twitter.com/Oc8eQYdwfN
— Rohit Pawar (@RRPSpeaks) November 25, 2024