Ajit Pawar
-
మీరూ ఏదో ఒకరోజు సీఎం అవుతారు
నాగ్‌పూర్: మీరు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్నుద్దేశిస్తూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యా ఖ్యానించారు. గురువారం నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలనుద్దేశిస్తూ గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం ఫడ్నవిస్ మాట్లాడారు. సభలో ఉన్న అజిత్ పవార్, మరో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలనుద్దేశిస్తూ ప్రసంగించారు. ‘‘ తెల్లవారుజామునే నిద్రలేచే అజిత్ పవార్ అప్పట్నుంచే ప్రజాసేవకు అంకితమవుతారు. ఫైళ్లు తిరగేస్తారు. నేను మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి పని మొదలుపెడతా. అయితే ఏక్నాథ్ షిండే మాత్రం అర్ధరాత్రిదాకా పనిచేస్తారు. చాన్నాళ్లుగా డిప్యూటీ సీఎం పదవిలో ఉంటూ అజిత్ పవార్‌కు ‘శాశ్వత ఉపముఖ్యమంత్రి’ పేరు స్థిరపడిపోయింది. కానీ నేను మాత్రం ఒక్కటే ఆశిస్తున్నా. అజిత్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటారు’’ అని ఫడ్నవిస్ అన్నారు. ఎన్సీపీ చీఫ్ అయిన అజిత్ పవార్ ఈనెల ఐదో తేదీన ఆరోసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం తెల్సిందే. ఎప్పట్నుంచో ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసిన అజిత్ ఆ లక్ష్యసాధనలో భాగంగా బాబాయి శరద్‌పవార్ సారథ్యంలోని ఎన్సీపీని చీల్చి బీజేపీతో చేతులు కలిపిన విషయం విదితమే. పార్టీని చీల్చినా సరే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తనవైపే రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో ఎన్సీపీ పార్టీ గుర్తు, ఎన్నికల చిహ్నం రెండూ అజిత్‌కే దక్కాయి. ఇటీవల లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అజిత్ వర్గమే అత్యధిక స్థానాల్లో గెలిచి తమదే అసలైన ఎన్సీపీ అని నిరూపించుకుంది. -
ఇండియా కూటమి కథ కంచికేనా?
నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని 2029 వరకు సవాలు చేయగలిగే సుస్థిరమైన, సమర్థవంతమైన ప్రతిపక్షంగా ఇండియా కూటమి పని చేయగలదని 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రారంభంలో సూచించాయి. అయితే, సంవత్సరాంతానికే ఇండియా కూటమి అకాల మరణం వైపు వెళుతున్నట్లు కనబడుతోంది. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్ థాకరే), సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌తో సహా అనేక ఇండియా కూటమి పార్టీలకు ఒక విషయం అర్థం చేయించినట్లు కనిపి స్తోంది. అదేమిటంటే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ దేనికీ పనికిరాదు!కాంగ్రెస్‌కు పెద్ద సవాలుఎంతో ఆలోచించి తీసుకున్న వ్యూహంలా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీకి సీట్లు కల్పించేది లేదని ప్రక టిస్తూ ఆప్ మొదటగా బయటకు వచ్చింది. బిహార్‌లో 2025 అసెంబ్లీ ఎన్నికల కోసం ‘మహాగఠ్‌బంధన్’లో కాంగ్రెస్‌ను కోరుకోవడం లేదని లాలూ యాదవ్, ఆయన కుమారుడు తేజస్విల వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. 2026లో కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడులో వరుసగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే,అస్సాంను బీజేపీ నుండి, కేరళను ఎల్డీఎఫ్ నుండి కైవసం చేసుకోవడం, హిమాచల్‌ను నిలుపుకోవడంలో కాంగ్రెస్ అత్యంత కష్టసాధ్యమైన సవాలును ఎదుర్కోనుంది. మిగి లిన రాష్ట్రాల్లో, అంటే తమిళనాడులో డీఎంకే, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ వంటి మిత్రపక్షాల మీద భారీగా ఆధార పడటమో, లేక ప్రాసంగికత లేకుండా ఉండిపోవడమో మాత్రమే కాంగ్రెస్ చేయగలిగేది!కాంగ్రెస్‌ను ముంచే కేజ్రీవాల్ ఫార్ములాఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకం విషయంలో సింగిల్ డిజిట్ సీట్లకు కాంగ్రెస్ సిద్ధపడినప్పటికీ, అరవింద్ కేజ్రీవాల్ కఠినంగా వ్యవహరించారు. ఢిల్లీకి సంబంధించినంతవరకు మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ నుండి ఆప్‌కి మారడం ఖాయమని కేజ్రీవాల్ అంచనా. అలాంటప్పుడు కాంగ్రెస్ తనకు బరువుగా మారుతుంది. దీంతో దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో మూడోసారి కూడా ఖాళీ సీట్లతో కాంగ్రెస్ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయి పొత్తుల నుంచి కాంగ్రెస్‌ను తప్పించాలనే ‘కేజ్రీవాల్ ఫార్ములా’ తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే వంటి వారికి ధైర్యం కలిగిస్తోంది.దురదృష్టవశాత్తూ, 2026లో జరిగే అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌కు తన సత్తాను నిరూపించుకునే అవకాశం వస్తుంది. కూటమి నేతల వ్యాఖ్య లపై స్పందించవద్దని పార్టీ సీనియర్ నేతలకు, సహచరులకు రాహుల్ గాంధీ సూచించారు. కూటమిని కొనసాగించడానికి ఇది బలహీనమైన ప్రయత్నమనే చెప్పాలి.కూటముల వైఫల్యం వెనుక...కూటమిలోని అనేక ప్రాంతీయ పార్టీలు కూటమి నాయకత్వ సమస్యను నిరంతరం లేవనెత్తుతున్నాయి. వాస్తవానికి, కాంగ్రెస్ మినహా, కూటమిలోని దాదాపు అందరూ మమ తను అధిపతిగా సిఫార్సు చేశారు లేదా మద్దతు ఇచ్చారు. ఆమె కూడా బాధ్యతను ‘ఒప్పుకునే’ స్థాయిదాకా వెళ్లారు. కానీ కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం ఈ ఎత్తు గడను పురోగమించకుండా చేస్తోంది. ఇండియా కూటమి భాగస్వాములు ‘సహ– సమాన’ హోదాను కోరుకుంటున్నాయని బహుశా కాంగ్రెస్‌కు తెలుసు. కానీ ఒక ఆధిపత్య భాగస్వామి, అనేక మంది మైనర్ ప్లేయర్లు ఉన్నప్పుడల్లా పొత్తులు పని చేశాయి, వృద్ధి చెందాయి. ఉదాహ రణకు, కేరళలో వరుసగా కాంగ్రెస్, సీపీఎం నేతృత్వంలోని యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పొత్తులు లేదా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే. 1977 నాటి జనతా పార్టీ ప్రయోగం, నేషనల్ ఫ్రంట్ (1989), యునైటెడ్ ఫ్రంట్ (1996) కేవలం ‘సహ–సమాన’ వంటకంపై ఆధార పడినందుకే నాశనమైనాయి. అయితే లోక్‌సభలో ఓ వంద స్థానాలు ఉన్న కారణంగా, కాంగ్రెస్ తనను సమానులలో మొదటి స్థానంలో ఉంచుకుంటోంది.ఆసక్తికరమైన విషయమేమిటంటే, గతంలో కూటమికి నాయకత్వ సమస్య అరుదుగానే ఉండేది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారంటే, ఆయన ఉత్తముడు లేదా గట్టి పోటీదారు కావడం వల్ల కాదు, చరణ్ సింగ్‌ను అదుపులో ఉంచడానికి. దేవీలాల్ నామినేషన్ వేసిన పదవికి పోటీదారు కాదు కాబట్టే 1988–89లో ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ అయ్యారు. తరువాత, ప్రతిష్ఠాత్మకమైన ఆ పదవిని వీపీ సింగ్‌కు కట్టబెట్టారు. హెచ్డి దేవెగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్ రోజులలో, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు స్వల్పకాలిక యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా, కింగ్‌మేకర్‌గా వ్యవహరించారు. అస్థిర కూటమి రాజకీయాల వాజ్‌పేయి కాలంలో, జార్జ్ ఫెర్నాండెజ్ ఎన్డీయే కన్వీనర్‌గా ఎంపికయ్యారు. రామారావుగానీ, నాయుడుగానీ, ఫెర్నాండెజ్గానీ తమకిచ్చిన పదవి కోసం తహతహలాడటం విన బడలేదు. మొరార్జీ, దేవీలాల్, గౌడ, గుజ్రాల్‌లకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ విషయాన్ని మమత కూడా తెలుసుకోవాలని కాంగ్రెస్ అనుకుంటుండవచ్చు.చదవండి: మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగేదెప్పుడు?కూటమిలో అందరితోనూ సమాచారం పంచుకోగల దిగ్గజం శరద్ పవార్. కానీ నవంబర్ 23 మహారాష్ట్ర తీర్పు తర్వాత, పవార్ రాజ్యం లేని రాజుగా ఒంటరివాడయ్యారు. మహారాష్ట్రలో తన పార్టీ ఘోర ప్రదర్శనకు ఆయన ఒక బలిపశువును వెతుకుతున్నారు. కాంగ్రెస్ దానికి సరిగ్గా సరిపోతుంది. అన్న కొడుకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో అవమానకరమైన విలీనం కోసం శరద్ పవార్ చూస్తుండటమే కాకుండా, కాంగ్రెస్‌పై నిందలు వేయడానికి మమత, కేజ్రీవాల్లతో కలిసి పన్నాగం పన్నుతున్నారు. ఎదురుదాడి లేదా గట్టి వ్యూహాన్ని ప్రారంభించడానికి అహ్మద్ పటేల్ వంటి సమర్థవంతమైన మేనేజర్‌ను కాంగ్రెస్ కోల్పోయింది. ముగ్గురు గాంధీలు, ఖర్గే శక్తిమంతంగా కని పించవచ్చు. కానీ మమత, కేజ్రీవాల్, లాలూ, పవార్ వంటి స్వతంత్ర ఆలోచనాపరులను చేరుకోలేని బలహీనులుగా వారు మిగిలిపోతున్నారు. కూటమి పుట్టుక ఆర్భాటంగా జరిగింది. కానీ దాని మరణం చడీచప్పుడు లేకుండా సంభ విస్తోంది. జనతా పార్టీ నుంచి యూపీఏ దాకా ఏనాడూ కూటముల ముగింపు గురించి బహిరంగ ప్రకటన రాలేదు.- రషీద్ కిద్వాయి సీనియర్ జర్నలిస్ట్, రచయిత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘మీరు చెప్పిందల్లా చేయడానికి కీలు బొమ్మను కాను!’
ముంబై: ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు భారీ షాక్ తగిలింది. మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్.. బహిరంగంగా అసంతృప్తి వెల్లగక్కారు. ఇప్పుడు ఈ అంశం మహా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఛగన్(77) ఓబీసీ సామాజిక వర్గపు బలమైన నేత. మొన్నటి ఎన్నికల్లో యోలా నుంచి ఘన విజయం సాధించారాయన. ఇక మహాయుతి కూటమిలో ఎన్సీపీ-అజిత్ వర్గం తరఫున ఆయనకు మంత్రి పదవి దక్కవచ్చనే ఖాయమని చర్చ నడిచింది. అయితే అలా జరగలేదు. పైగా రాజ్యసభకు పంపిస్తాం.. రాజీనామా చేయండి అంటూ ఓ ప్రతిపాదన చేశారు. దీంతో అవమాన భారంతో రగిలిపోతున్నారాయన.నాసిక్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను మంత్రివర్గంలో ఉండాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా కోరుకున్నారు. కానీ, కొందరి వల్ల అది జరగలేదు. మంత్రి పదవి దక్కకపోవడం కంటే.. నాకు ఎదురైన అవమానమే నన్ను ఎక్కువగా బాధిస్తోంది’’ అని ఆవేదనపూరితంగా మాట్లాడారాయన.ఈ క్రమంలో పార్టీలో ఇంతకు ముందు ఎదురైన చేదు అనుభవాలను ఆయన ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల్లో నాసిక్ నుంచి నేను పోటీ చేయాలని మోదీ, అమిత్ షా పట్టుబట్టారు. అందుకు నెలపాటు ప్రిపేర్ అయ్యాను. తీరా ఎన్నికలొచ్చేసరికి.. నాకు సీటు ఇవ్వలేదు. రాజ్యసభ సీటు ఇవ్వమని కోరాను. కానీ, సునేత్రా.. నితిన్ పాటిల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నా అనుభవం రాజ్యసభలో పనికి వస్తుందని చెబితే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. తీరా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక ఇప్పుడు రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. అందుకోసం నితిన్ పాటిల్‌ను రాజీనామా చేయిస్తారట... నేనేం వాళ్ల చేతుల్లో కీలు బొమ్మను అనుకుంటున్నారా?. వాళ్లు నిల్చోమంటే నిల్చుని.. కూర్చోమంటే కూర్చోని.. రాజీనామా చేయమంటే రాజీనామా చేస్తే నా నియోజకవర్గ కార్యకర్తలు నా గురించి ఏమనుకుంటారు?’’ అని మండిపడ్డారాయన. అయితే ఈ క్రమంలో ఎక్కడా ఆయన అజిత్ పవార్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.బుధవారం తన నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారాయన. అయితే రెండు, మూడేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన తర్వాతే రాజ్యసభ సభ్యత్వం గురించి ఆలోచిస్తానని ఆయన చివర్లో చెప్పడం కొసమెరుపు. రాజకీయాల్లోకి రాకముందు ఛగన్ భుజ్‌బల్.. మార్కెట్లో కూరగాయలు, పండ్లు అమ్ముకునే చిరువ్యాపారి. శివసేన ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి, బాల్ థాక్రే సిద్ధాంతాలకు ఆకర్షితుడై అందులో చేరాడు. కార్పొరేటర్ స్థాయి నుంచి మేయర్ స్థాయికి ఎదిగారు. ఆపై శివసేన తరఫున ఎమ్మెల్యేగానూ రెండుసార్లు నెగ్గారు. కాంగ్రెస్ వేటు వేయడంతో శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించగా.. భుజ్‌బల్ అందులో చేరారు. గతంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా, పలు శాఖలకు మంత్రిగానూ ఆయన పని చేశారు. -
‘మహా’ కేబినెట్ విస్తరణ.. మంత్రులకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వార్నింగ్!
ముంబై : మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొత్తగా మంత్రివర్గంలో చేరిన కేబినెట్ సభ్యులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన 39 మంది సభ్యులు పనితీరు ఆధారంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వన్నట్లు తెలిపారు. బీజేపీ సారధ్యంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం కేబినెట్‌ను విస్తరించింది. కొత్తగా మంత్రివర్గంలోని చేరిన 39 మంది ఆదివారం రాష్ట్ర రెండో రాజధాని నాగ్‌పూర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ 39 మందిలో 16 మంది కొత్త వారు కాగా, 10 మంది మాజీ మంత్రులకు ఉద్వాసన పలికారు. మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన మంత్రులకు రెండు, మూడు రోజుల్లో శాఖ కేటాయింపు ఉంటుందని తెలిపారు. అయితే, కేబినెట్ విస్తరణ అనంతరం మంత్రుల పనితీరుపై సమీక్షలు జరుపుతామని, కూటమిలోని మిత్రపక్షాలైన ఎన్సీపీ (అజిత్ పవర్), శివసేన(ఏక్‌నాథ్‌షిండే)తో కేబినెట్ సభ్యులతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని సీఎం ఫడ్నవీస్ తెలిపారు. Devendra Fadnavis's HUGE statement on ministers🔥Fadnavis⚡️: We are going to audit the performance of all the ministers.If it is found in the audit that any minister is not doing the right work then that minister will be reconsidered ↩️pic.twitter.com/qAS0TpKe3u— Political Views (@PoliticalViewsO) December 15, 2024కేబినెట్ విస్తరణ అనంతరం మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలపై మహాయుతి కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫడ్నవీస్ మాట్లాడుతూ, మహాయుతి మిత్రపక్షాలు తమ పదవీకాలంలో మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను తయారు చేసేందుకు అంగీకరించినట్లు తెలిపారు. బీజేపీ మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేందుకు ఎంత సమయం తీసుకుంటారనే దానిపై ఫడ్నవీస్ స్పష్టత ఇవ్వలేదు. కానీ డిప్యూటీ సీఎం, శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే తన పార్టీ మంత్రులకు రెండున్నరేళ్ల సమయం ఇచ్చారు. పనితీరు ఆధారంగా వారి రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం ఉంటుందన్నారు. అజిత్ పవార్ మాత్రం రెండున్నరేళ్ల సమయంలో మంత్రుల పనితీరు బాగుంటే కొనసాగుతారని, లేదంటే భర్తీ చేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకుంది. దీంతో కేబినెట్ విస్తరణలో బీజేపీకి 19 మంత్రి పదవులు దక్కగా, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 11,డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి 9 మంత్రి పదవులు దక్కాయి. -
మహారాష్ట్రలో కొలువుదీరనున్న కేబినెట్.. శివసేన నుంచి ముగ్గరు ఔట్!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా.. షిండే, పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. కాగా, నేడు మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏయే శాఖలు దక్కుతాయనే సస్పెన్స్ నెలకొంది.మహారాష్ట్రలోని నాగపూర్‌లో నేడు మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్న పార్టీలకు ఏయే శాఖలు దక్కుతాయనే ఉత్కంఠ నేతల్లో నెలకొంది. కేబినెట్లో ఎక్కువ స్థానాలు బీజేపీకి దక్కే అవకాశం ఉంది. ఇక, శివసేన నుంచి 13 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ నడుస్తోంది.ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి పలువురు కొత్త ముఖాలు మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. సంజయ్ శిర్సత్, భరత్ గోగావాలే, ప్రకాష్ అబిత్కర్, యోగేష్ కదమ్, ఆశిష్ జైస్వాల్, ప్రతాప్ సర్నాయక్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో శివసేన నుంచి మంత్రులుగా ఉన్న దీపక్ కేసర్కర్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్‌తో సహా కొంత మందికి కేబినెట్లో స్థానం లేనట్టుగా సమాచారం.మరోవైపు.. కూటమిలోని ఎన్సీపీకి చెందిన అదితి తట్కరే, బాబాసాహెబ్ పాటిల్, దత్తాత్రే భరణే, హసన్ ముష్రిఫ్, నరహరి జిర్వాల్లు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇక, బీజేపీ నుంచి నితేష్ రాణే, శివేంద్ర రాజే, గిరీష్ మహాజన్, మేఘనా బోర్దికర్, పంకజా ముండే, జయకుమార్ రావల్, మంగళ్ ప్రభాత్ లోధాకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది.ఇక, మహాయుతి ప్రభుత్వంలో కాషాయ పార్టీకి 20 కేబినెట్ బెర్త్‌లు కేటాయించబడినప్పటికీ అన్ని స్థానాలను భర్తీ చేయడంలేదని తెలుస్తోంది. రానున్న రోజుల్లో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చేందుకు ఆయా స్థానాలను వదిలేస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. మహారాష్ట్ర కేబినెట్ విస్తరణలో భాగంగా బీజేపీకి హోంశాఖ.. శివసేనకు హౌసింగ్ మంత్రిత్వ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ఆ 35 నిమిషాలు : సాధారణమా? రాజకీయమా?
సాక్షి, ముంబై: ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ జన్మదినోత్సవాలను ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు ఘనంగా జరుపు కున్నారు. పవార్ 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం ముంబైతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అనేక మంది ప్రముఖులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా జన్మదినోత్సవం రోజున శరద్ పవార్ ఢిల్లీలోనే ఉండటంతో ఎన్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు అనేక పార్టీల నేతలు ఢిల్లీలోని ఆయన నివాసంలో స్వయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా కలిసి..శుభాకాంక్షలు శరద్ పవార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెంట అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్, కుమారుడు పార్థ్ పవార్‌లతోపాటు ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, సునీల్ తట్కరే తదితరులున్నారు. వీరందరూ పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సమయంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా అక్కడే ఉన్నారు. ఎన్సీపీ రెండుపార్టీలుగా చీలిపోయిన తర్వాత శరద్ పవార్‌తో అజిత్‌పవార్ భేటీ కావడం ఇదే తొలిసారి. మంచి చెడులు మాత్రమే చర్చించాం: అజిత్‌పవార్ అజిత్ పవార్‌తోపాటు అనేక మంది ఎన్సీపీ (ఏపీ) సీనియర్ నేతలు శరద్ పవార్‌తో భేటీ కావడం అనేక చర్చలకు ఊతమిచ్చింది మళ్లీ వీరిద్దరూ ఒకటికానున్నారా అనే అంశంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే అలాంటిదేమిలేదని తమ కుటుంబ పెద్ద అయిన శరద్‌పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకే వెళ్లామని మంచిచెడులు, బాగోగుల గురించి మాత్రమే మాట్లాడుకున్నామని చెప్పారు. అయితే సుమారు 35 నిమిషాలపాటు అజిత్ పవార్, శరద్ పవార్ల మధ్య చర్చలు కొనసాగాయని, ఈ చర్చల్లో రాజకీయ అంశాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా చర్చలు జరిగి ఉండవచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా అయిదు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవంతో రాజకీయ చాణక్యుడిగా గుర్తింపుపొందిన శరద్ పవార్ జీవిత విశేషాలను గురించి క్లుప్తంగా..... తల్లినుంచే రాజకీయ వారసత్వం పవార్, ఆయన కుటుంబీకులు రెండుతరాలుగా రాజకీయాల్లో కొన సాగుతున్నారు. ప్రస్తుతం మూడో తరం కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజాదరణతో రాజకీయాలను కొనసాగిస్తున్నారు. మొదటగా శరద్ పవార్ తల్లి శారదాబాయి పవార్ పుణే జిల్లా లోకల్బోర్డ్ సభ్యురాలుగా ఎన్నికవ్వడంతో పవార్ కుటుంబ రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. ఆ విధంగా తల్లి నుంచే శరద్‌పవార్‌కు రాజకీయ వారసత్వం లభించింది. అనంతరం ఇంతింతై అన్నట్లుగా పవార్ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలలో కీలకపాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. బారామతి ఎంపీగా ఏడు సార్లు...శరద్‌పవార్ బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు విజయం సాధించారు. దీంతో ఆయనకు ఈ నియోజకవర్గం కంచుకోటలా మారింది. 1984 నుంచి 1991, 1995, 1997, 1998, 1999తో పాటు 2004లోనూ ఈ నియోజకవర్గంలో పవార్‌దే విజయం. దీంతో ఆయన ఈ లోక్‌సభ నియోజకవర్గానికి మకుటంలేని మహారాజుగా మారారు. కాగా 2009లో పవార్ తన కుమార్తై సుప్రియా సూలేను బారామతి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయించారు. ఆయన మాడా లోక్‌సభ సెగ్మెంట్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. కేంద్రరాజకీయాల్లోకి... పవార్ 1991లో రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇటు రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తూనే అటు కేంద్రంలో ఒక్కో మెట్టు ఎక్కసాగారు. ఈ నేపథ్యంలో 1993లో మరోమారు ఆయన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరించింది. తదనంతరం 1995లో మరోసారి అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుని పాత్రను పోషించారు. ఆ తరువాత కేంద్రరాజకీయాలలో చురుకుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 1998 మార్చి 22న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్‌పై తిరుగుబాటు ప్రకటించి 1999 మే 20న పార్టీని వీడారు. నెలరోజుల్లోనే 1999 జూన్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. అనంతరం 1999 అక్టోబరు ఏడవ తేదీన మరోసారి ఎంపీగా విజయం సాధించారు. 2004 ఎన్నికల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. లక్ష మెజార్టీతో అజిత్ పవార్ గెలుపు... ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన లోకసభ ఎన్నికల్లో ఎన్సీపీ(ఎస్పీ)తరపున బారామతి ఎంపీగా సుప్రియా సూలే గెలిచారు. ఎరద్పవార్ కుమార్తై ఎన్సీపీ (ఎస్పీ) పార్టీ నుంచి విజయం సాధించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యంగా అజిత్‌పవార్ లక్షకుపైగా ఓట్లతో విజయం సాధించి బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో శరద్‌పవార్ ప్రాభవానికి చెక్‌పెట్టారు. 50 ఏళ్లకుపైగా రాజకీయాల్లో.. మొట్టమొదటిసారిగా 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బారామతి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పటినుంచి వెనుతిరిగి చూడలేదు. తరువాత తరువాత అసెంబ్లీతో పాటు లోక్‌సభ నియోజకవర్గంపై కూడా పట్టుసాధించారు. 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. ఇదే సంవత్సరం ఆయనకు మంత్రి మండలిలో స్థానం లభించింది. 1978 జూలై 12వ తేదీన నలుగురు మంత్రులతో కలసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జూలై 17వ తేదీన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇతర పార్టీలతో కలిసి ‘పురోగామి లోక్‌షాహీ ఆఘాడీ’(పులోద్)ను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో అతి పిన్నవయసు ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. రెండేళ్ల అనంతరం 1980లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలై 1981 జులై 31 వరకు ప్రతిపక్షనాయకుని పాత్రకు పరిమితమయ్యారు. 1984లో మొట్టమొదటి సారిగా బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1986లో మరోసారి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం 1988లో జూన్ 25వ తేదీన రెండోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1991 జూన్ వరకూ ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. -
మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ ట్విస్ట్..?
-
చంద్రబాబుకు క్లీన్చిట్ ఎలా ఇస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు క్లీన్చిట్ ఇవ్వడంపై వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ సోమవారం లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. చంద్రబాబుతోపాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు క్లీన్చిట్ ఇవ్వడాన్ని ఆయన ప్రశి్నంచారు. ‘హై ప్రొఫైల్ కేసుల్లో చంద్రబాబు, అజిత్ పవార్లకు కేంద్ర సంస్థలు క్లీన్ చిట్ ఇవ్వడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాను.పవార్‌కు సంబంధించి రూ.1,000 కోట్ల ఐటీ బినామీ ఆస్తుల కేసు, రూ.371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబులకు క్లీన్చిట్ అంశం సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల న్యాయబద్ధతపై సందేహాలను రేకెత్తిస్తోంది. మోదీ ప్రభుత్వం పవార్ పేరును క్లియర్ చేస్తే, ఈడీ చంద్రబాబుకు క్లీన్చిట్ ఇచి్చంది. ఈ కేసుల్లో కేంద్ర సంస్థలు తగిన ప్రమాణాల మేరకు పనిచేశాయా? తగిన ప్రక్రియను అనుసరించాయా? అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ రెండు కేసుల్లో తగిన సాక్ష్యాధారాలు లేవని దర్యాప్తు సంస్థలు చెప్పడం వాటి విశ్వసనీయతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఈ నిర్ణయాలపై ప్రభుత్వం సమగ్ర వివరణ ఇవ్వాలి’ అని నోటీసులో పేర్కొన్నారు. సభ మంగళవారానికి వాయిదా పడటంతో దీనిపై చర్చ జరుగలేదు. ఇదే అంశంపై ఓ వార్తా ఏజెన్సీతో మాట్లాడిన మాణిక్కం ఠాగూర్... ‘ఈడీ, సీబీఐల పారదర్శక విచారణ, పనితీరుపై విచారణ జరగాలని మేము కోరుకుంటున్నాం’ అని చెప్పారు. -
అజిత్ పవార్ కు భారీ ఊరట..
-
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ -ఉపముఖ్యమంత్రులుగా షిండే, పవార్
-
మహారాష్ట్రలో ట్విస్ట్.. శివసేన ఎమ్మెల్యే వ్యాఖ్యల అర్థమేంటి?
ముంబై: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటైంది. మహారాష్ట్రలో 11 రోజుల ఉత్కంఠకు తెరదీస్తూ ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.శివసేన ఎమ్మెల్యే భరత్ గోగవాలే తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముందే డిసెంబరు 11-16 మధ్య క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. శివసేన నేతలకు కీలక శాఖలు వచ్చే అవకాశం ఉంది. మహాయుతి ప్రభుత్వంలో తనకు హోంశాఖను అప్పగించాలని మాజీ సీఎం ఏక్నాథ్ షిండే డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనిపై ఆలోచన చేస్తోంది. షిండే సీఎంగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ అప్పగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, ఎమ్మెల్యే భరత్.. షిండేకు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం.ఇక, గత మహాయుతి ప్రభుత్వంలో శివసేనకు ఉన్న శాఖలను మార్చేందుకు కూటమిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని మరో శివసేన ఎమ్మెల్యే ఆరోపించారు. కాగా శిందే నేతృత్వంలోని మునుపటి ప్రభుత్వంలో మాదిరిగానే ఎన్సీపీ తమ దగ్గరున్న ఆర్థికశాఖను, బీజేపీ హోంశాఖను నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శివసేనకు పట్టణాభివృద్ధి, రెవెన్యూ శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జరిగిన మహాయుతి తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి బీజేపీ నుంచి ఉండేందుకు షిండే అంగీకరించారని ఫడ్నవీస్ పేర్కొన్న విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా షిండేతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అయితే, గత ప్రభుత్వంలో రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగిన షిండే.. డిప్యూటీ సీఎం బాధ్యతలను తీసుకునేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. -
కొలువుదీరిన ప్రభుత్వం.. మంత్రి పదవులపై కొనసాగుతున్న సస్పెన్స్
సాక్షి ముంబై: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్.. ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవాల వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా సహా.. బీజేపీ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు, బాలీవుడ్ నటీనటుటు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో ఎవరెవరిని మంత్రి పదవులు వరించనున్నాయనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఇలా ముగ్గురే ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రి పదవులపై సస్సెన్స్ కొనసాగుతోంది. అయితే అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకి సుమారు 20 నుంచి 25 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండగా.. శివసేన (షిండేే) పార్టీకి సుమారు 10 నుంచి 12 అదేవిదంగా ఎన్సీపీ (ఏపీ)కి 8 నుంచి 10 మంత్రి పదవులు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల ఆశిస్తున్న వారందరు లాబీ యింగ్ ప్రారంభించారు.ఇదిలా ఉండగా తాను ముఖ్య మంత్రిని కానందుకు మనస్తాపానికి గుర య్యానన్న మాటలను మహారాష్ట్ర ఉప ముఖ్య మంత్రి షిండే కొట్టిపారేశారు. 2022లో శివసేనను నుంచి బయటకు వచ్చినపుడు తనవెంట ఉన్నది 39 మంది ఎమ్మెల్యేలని, నేడు, పార్టీకి 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అసలు శివసేన ఎవరిదో దీన్ని బట్టే తెలి సిపోతోందని ఎద్దేవా చేశారు. ప్రమాణ స్వీకా రోత్సవం అనంతరం శివసేన ప్రధాన కార్యా లయం ఆనంద్ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. వందలాది మంది పార్టీ కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని నినాదాలు చేస్తూ ఆయన్ను స్వాగతించారు.< -
దేవేంద్ర ఫడ్నవీస్ అనే నేను..
ముంబై: మహారాష్ట్రలో ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్కంఠకు తెరదించుతూ ఉప ముఖ్యమంత్రులుగా శివసేన (షిండే) నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ(అజిత్ పవార్) నాయకుడు అజిత్ పవార్ ప్రమాణం చేశారు. వారితో గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముంబై ఆజాద్ మైదాన్‌లో గురువారం సాయంత్రం అశేష జనవాహిని సమక్షంలో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం, డిప్యూటీ సీఎంలు మినహా మంత్రులెవరూ ప్రమాణం చేయలేదు. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణం చేయడం ఇది మూడోసారి. వచ్చే వారం మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు మహాయుతి వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో నవంబర్ 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా, 15 రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి పదవిపై ప్రతిష్టంభన తొలగకపోవడం, కీలక శాఖలపై మిత్రపక్షాలు పట్టుబట్టడంతో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరిగింది. బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకొని మిత్రపక్షాలను ఒప్పించడంతో కథ సుఖాంతమైంది. మరోసారి ముఖ్యమంత్రి పదవి ఆశించిన ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేయడం పట్ల ఆయన భార్య, గాయకురాలు అమృత ఆనందం వ్యక్తం చేశారు. ఇదొక అద్భుతమైన రోజు అని చెప్పారు. ఫడ్నవీస్‌పై బాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. #WATCH | Shiv Sena's Eknath Shinde takes oath as Deputy CM of Maharashtra pic.twitter.com/G33WOBOLbw— ANI (@ANI) December 5, 2024హాజరైన ప్రముఖులు కేంద్ర మంత్రులు అమిత్ షా, జె.పి.నడ్డా, రాజ్‌నాథ్æ, గడ్కరీ, శివరాజ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్వినీ వైష్ణవ్, ఎస్.జైశంకర్ హాజరయ్యారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్(ఉత్తరప్రదేశ్), పుష్కర్‌సింగ్ ధామీ(ఉత్తరాఖండ్), నాయబ్‌సింగ్ సైనీ(హరియాణా), భూపేంద్ర పటేల్(గుజరాత్), ప్రమోద్ సావంత్(గోవా), హిమంతబిశ్వ శర్మ(అస్సాం), విష్ణుదేవ్ సాయి(ఛత్తీస్‌గఢ్), భజన్‌లాల్ శర్మ(రాజస్తాన్), మోహన్ యాదవ్(మధ్యప్రదేశ్), మోహన్‌చరణ్ మాఝీ(ఒడిశా), పెమా ఖండూ(అరుణాచల్‌ప్రదేశ్), ఎన్.బీరేన్‌సింగ్(మణిపూర్), మాణిక్ సాహా(త్రిపుర), నితీశ్ కుమార్(బిహార్), కాన్రాడ్ సంగ్మా(మేఘాలయా), నిఫియూ రియో(నాగాలాండ్), ప్రేమ్‌సింగ్ తమాంగ్(సిక్కిం), ఎన్.రంగస్వామి(పుదుచ్చేరి), ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ, నోయల్ టాటా, కుమార మంగళం బిర్లా, బాలీవుడ్ సినీ ప్రముఖులు షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, విద్యా బాలన్, క్రికెట్ దిగ్గజం టెండూల్కర్‌తోపాటు వివిధ దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు. శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, మహా నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఆహా్వనించినప్పటికీ హాజరు కాలేదు. కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలకు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో అభినందనలు తెలియజేశారు. #WATCH | PM Narendra Modi congratulates Shiv Sena chief Eknath Shinde on taking oath as Maharashtra Deputy CM(Source: DD News) pic.twitter.com/dHQEzx4KFM— ANI (@ANI) December 5, 2024స్థిరమైన ప్రభుత్వం అందిస్తాంరాబోయే ఐదేళ్లపాటు స్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తామని సీఎం ఫడ్నవీస్ చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన నేతృత్వంలో రాజకీయాల్లో ఇకపై స్పష్టమైన మార్పును చూస్తారని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు తమకు భారీ మెజార్టీ కట్టబెట్టారని, వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. సామాజిక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగాల్లో వేగవంతమైన అభివృద్ధిని కొనసాగిస్తామని వివరించారు. ఈ నెల 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయని, 9న స్పీకర్‌ను ఎన్నుకుంటామని ఫడ్నవీస్ వెల్లడించారు. #WATCH | PM Modi congratulates Devendra Fadnavis on taking oath as Maharashtra CM pic.twitter.com/LNVURj7pBQ— ANI (@ANI) December 5, 2024బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం సాయంత్రం వారు రాష్ట్ర సచివాలయం ‘మంత్రాలయ’కు చేరుకొని సంబంధిత ద్రస్తాలపై సంతకాలు చేశారు. అధికార బాధ్యతలు చేపట్టారు. ఓ రోగికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ఫడ్నవీస్ సీఎం హోదాలో తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. #WATCH | Maharashtra CM-designate Devendra Fadnvais arrives at Shree Mumbadevi Temple in Mumbai, ahead of his swearing-in ceremony later today. pic.twitter.com/Rt2HsJjeDd— ANI (@ANI) December 5, 2024షిండే రాజకీయ ప్రసంగం ప్రమాణ స్వీకార వేదికపై రాజకీయ ప్రసంగాలు చేయడం సంప్రదాయ విరుద్ధం. కానీ, షిండే మాత్రం ఆ సంప్రదాయాన్ని లెక్కచేయలేదు. గవర్నర్ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించడం ప్రారంభించగానే, ఫార్మాట్లోని ‘నేను’ అని చదివి వెంటనే రాజకీయ ప్రసంగం మొదలుపెట్టారు. మోదీ, బాల్ ఠాక్రే, రాష్ట్ర ప్రజలను పొగడడం ప్రారంభించారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకొని షిండేను అప్రమత్తం చేశారు. దాంతో ఆయన ఫార్మాట్ ప్రకారం ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ పత్రాన్ని చదివారు. -
ఫలించిన బీజేపీ ప్లాన్.. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం
నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం.. ఈ కార్యక్రమానికి.. -
Maha Yuti: మీడియా ముందే సెటైర్లు.. ఇంతలోనే సర్దుకుపోయారా?!
ముంబై : మహా రాజకీయంలో మరో సస్పెన్స్‌కు శుభం కార్డు పడింది. ‘నేను డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానో? లేదో?’ అంటూ బాంబు పేల్చిన ఏక్నాథ్ షిండే మళ్లీ వెనక్కి తగ్గారు. రేపు (డిసెంబర్5) మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని శివసేన నేతలు ప్రకటించారు.మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనం విజయం సాధించింది. అనంతరం, మహా ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. సీఎం పదవి కోసం చివరి నిమిషం వరకు శివసేన నుంచి షిండే, బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ పోటీ పడ్డారు. అయితే బీజేపీ అధిష్టానం తమ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుంది. ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించింది. బీజేపీ అధిష్టానం బుధవారం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ వరుస పరిణామలపై అలబూనిన షిండే.. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తారా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. అందుకు బుధవారం మహాయుతి కూటమి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం వేదికైంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుకై గవర్నర్ రాధాకృష్ణన్‌ను ఆహ్వానించారు. అనంతరం మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్,ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ల మధ్య జరిగిన చర్చ అనేక అనుమానాలకు దారి తీసింది. సీఎం పదవికి నేనే సిపారసు చేశాప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏక్నాథ్ సిండే మాట్లాడుతూ.. ‘‘సీఎం పదవికి ఫడ్నవీస్‌ను నేనే సిపారసు చేశా. గతంలో నన్ను సీఎంగా ఫడ్నవీస్ సిఫారసు చేశారు. మహాయుతిలో ఎవరూ ఎక్కువా కాదు..తక్కువా కాదు. మహారాష్ట్ర కోసం మేమందరం కలిసి పనిచేస్తున్నాం’’ అని షిండే వ్యాఖ్యానించారు. బాంబు పేల్చిన షిండేఅనంతరం, రేపు మీరు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు షిండే బదులిస్తూ.. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారో, లేదో చెప్పకుండా..సాయంత్ర వరకు వేచి ఉండండి ’ అంటూ బాంబు పేల్చారు.అజిత్ పవార్‌పై షిండే సెటైర్లు షిండే అలా మాట్లాడడంతో పక్కనే ఉన్న అజిత్ పవార్ కలగ జేసుకుని సాయంత్రం నాటికి షిండే గురించి మాకు తెలుస్తుంది. కానీ నేను ఎదురు చూడను. రేపే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ చమత్కరించారు. దీంతో అప్పటి వరకు సీరియస్‌గా సాగిన మీడియా కాన్ఫరెన్స్ కాస్తా.. అజిత్ పవార్ వ్యాఖ్యలతో ఉన్న వారంతా ఒక్కసారిగా భళ్లున నవ్వడంతో వాతావరణం సందడిగా మారింది. అయితే.. అజిత్ కామెంట్లకు షిండే సెటైర్లు వేశారు. అజిత్ దా(అజిత్ పవార్)కి ఉదయం, సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన అనుభవం ఉంది.. రెండు సార్లు ఎలా ప్రమాణం చేయాలో ఆయనకు తెలుసు అని అన్నారు. షిండే అలా అనడంతో అక్కడున్న వారంతా పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. #WATCH | Mumbai: When asked if he and NCP chief Ajit Pawar will also take oath as Deputy CMs tomorrow, Shiv Sena chief Eknath Shinde says, "Wait till evening..."Replying to Shinde, NCP chief Ajit Pawar says, "Sham tak unka samaj aayega, I will take it (oath), I will not wait."… pic.twitter.com/ZPfgg6Knco— ANI (@ANI) December 4, 2024 -
‘మహా’ పాలిటిక్స్‌లో మరో ట్విస్ట్.. మంత్రి పదవుల కోసం కొత్త ఫార్ములా!
ముంబై: మహారాష్ట్రలో పొలిటికల్ సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండగా.. మంత్రి పదవులపై చర్చ నడుస్తోంది. మహాయుతి కూటమిలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో గెలిచిన సీట్ల ప్రకారం.. ప్రతీ ఆరుగురు ఎమ్మెల్యేలకు గాను ఒక మంత్రి దక్కే అవకాశం ఉన్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది.మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా బీజేపీ, శివసేన, ఎన్సీపీలకు ఎన్ని మంత్రి పదవులు వస్తాయనే చర్చ నడుస్తోంది. పార్టీ వర్గాల ప్రకారం.. 6-1 ఫార్ములాను అమలు చేసే యోచనలో పార్టీ పెద్దలు ఉన్నారని సమాచారం. మూడు పార్టీల నుంచి ప్రతీ ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది.ఈ లెక్క ప్రకారం మహారాష్ట్రలో అత్యధిక స్థానాల్లో(132) బీజేపీ విజయం సాధించడంతో కాషాయ పార్టీలో 20-22 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఏక్నాథ్ షిండే శివసేనకు 12, అజిత్ పవార్ ఎన్సీపీకి 9-10 పదవులు దక్కే చాన్స్ ఉన్నట్టు సమాచారం. అయితే, శాఖలపై కూడా చర్చ జరుగుతోందని సమాచారం. కీలక శాఖలు బీజేపీకే దక్కే చాన్స్ ఉంది. దీంతో, శివసేన, ఎన్సీపీలకు ఏయే శాఖలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. -
‘మహా’ కేబినెట్.. షిండే, అజిత్ పవార్ వాటాకు ఎన్ని మంత్రి పదవులంటే?
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అలకబూనిన షిండే.. ఎట్టకేలకు ముంబై చేరుకున్నారు. దీంతో.. మహాయుతి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇక.. బీజేపీ నేతృత్వంలోనే ఏర్పాటు కాబోతున్న ప్రభుత్వంలో షిండే, అజిత్ పవార్లు డిప్యూటీ సీఎంలుగా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖరారైంది. దీనిపై రేపు కచ్చితంగా అధికారిక ప్రకటన వెలువడుతుందని కూటమి నేతలు చెప్తున్నారు.మహారాష్ట్ర నూతన సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముంబైలోని ఆజాద్ మైదాన్ వేదిక కానుంది. అయితే మహాయుతి కూటమిలో.. ఏ పార్టీ ఎన్ని పోర్టుపోలియోలు ఆశిస్తుందనే అంచనాలతో జాతీయ మీడియా సంస్థలు, అక్కడి మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తున్నాయి.బీజేపీ(132 సంఖ్యా బలం) : ముఖ్యమంత్రితో పాటు హోం,రెవెన్యూ వంటి కీలక శాఖలతో సహా 21-22 మంత్రిత్వ శాఖలను దక్కించుకునే అవకాశం ఉంది. స్పీకర్,శాసనమండలి చైర్మన్ పదవులను కూడా ఆశిస్తోంది. శివసేన(57): ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన.. తమకు 16 మంత్రిత్వ శాఖలను కేటాయించాలని పట్టుబడుతోందంట. వాటిల్లో పట్టణాభివృద్ధితో సహా 12 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అయితే వీటిలో ఎన్నింటికి బీజేపీ ఓకే చెబుతుందో చూడాలి. మరోవైపు.. గత అసెంబ్లీలో శాసనసభ డిప్యూటీ చైర్మన్ పదవి శివసేన చేతుల్లో ఉండగా.. ఈసారి శాసనమండలి చైర్మన్ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం.ఎన్సీపీ(41): అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం.. తాము సీఎం సీటును త్యాగం చేశామనే ప్రకటనలు ఇచ్చుకుంది. వాటి ఆధారంగా కీలక శాఖలనే కోరే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ, శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌తో సహా 9 నుంచి 10 మంత్రిత్వ శాఖలు కావాలని పట్టుబడుతున్నట్లు స్థానిక మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి.బుధవారమైనా తేలుస్తారా?ఆరు రోజులుగా మహారాష్ట్ర సీఎం పంచాయితీ ఎడతెగకుండా నడుస్తోంది. అయితే.. మహాయుతిలో ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాకు మరోసారి ఓకే అయినట్లు సంకేతాలు అందుతున్నాయి. వీటిపై బుధవారం ఉదయం స్పష్టత రానుంది. ఎందుకంటే.. శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు బీజేపీ శాసన సభా పక్షం బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటిస్తారన్నది ఆ కథనాల సారాంశం.ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారంమహరాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముంబైలోని ఆజాద్ మైదాన్ ముస్తాబవుతోంది. డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మహాయుతి కూటమి నేతలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అయితే మంత్రి వర్గ కూర్పునకు మరికొంత సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. -
Maharashtra: సీఎం పదవి బీజేపీకే
ముంబై/పుణే: మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో సీఎం పదవిపై పడ్డ పీటముడి క్రమంగా వీడుతోంది. వారం రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడ్డట్టే కన్పిస్తోంది. ముఖ్యమంత్రిగా తననే కొనసాగించాలని పట్టుబడుతూ వచ్చిన శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ఎట్టకేలకు అలకపాన్పు వీడి డిప్యూటీ సీఎం పదవికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కూటమి భాగస్వామి అయిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తాజా వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. సీఎం పదవి బీజేపీదేనని ఆయన శనివారం తేల్చేశారు. శివసేన, ఎన్సీపీ నుంచి చెరో ఉప ముఖ్యమంత్రి ఉంటారన్నారు. ఇటీవల ఢిల్లీలో బీజేపీ అధిష్టానం సమక్షంలో జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులన్నది త్వరలో తేలుతుందన్నారు. డిసెంబర్ 5న కొత్త సర్కారు కొలువుదీరే అవకాశముందని ఆయన వివరించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోందన్న విపక్షాల విమర్శలను అజిత్ కొట్టిపారేశారు. ‘‘మహారాష్ట్రలో ఇలా జరగడం కొత్త కాదు, అనూహ్యమూ కాదు. 1999లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏకంగా నెల రోజులు పట్టింది’’ అని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార తేదీని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే కూడా ధ్రువీకరించారు. 5న సాయంత్రం ఐదింటికి సౌత్ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కార్యక్రమం జరుగుతుందంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ దిగ్గజం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావడం లాంఛనమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన గతంలో రెండుసార్లు సీఎంగా చేయడం తెలిసిందే. మహాయుతి సర్కారులో ఫడ్నవీస్, అజిత్ పవార్ ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగిన విషయం తెలిసిందే. నవంబర్ 23న వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించడం తెలిసిందే. 288 స్థానాలకు గాను మహాయుతికి ఏకంగా 233 వచ్చాయి. బీజేపీ 132. శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు నెగ్గాయి. అయితే సీఎం ఎవరు కావాలన్న దానిపై అప్పటినుంచీ ప్రతిష్టంభన నెలకొంది. సీఎం అభ్యరి్థ, ప్రభుత్వ కూర్పు తదితరాలపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఫడ్నవీస్, షిండే, పవార్ చర్చలు జరిపారు. అంతకుముందు షిండే మీడియాతో మాట్లాడుతూ సీఎంగా ఎవరుండాలన్న దానిపై నిర్ణయాధికారాన్ని బీజేపీకే వదిలేసినట్టు చెప్పడం తెలిసిందే. కానీ ఢిల్లీ భేటీ అనంతరం ముంబై రావాల్సిన ఆయన నేరుగా సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోవడం, శుక్రవారం ముంబైలో జరగాల్సిన మహాయుతి భేటీ రద్దవడం అనుమానాలకు తావిచ్చింది. షిండే అలకపాన్పు ఎక్కినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకారం తదితరాలపై అ టు అజిత్, ఇటు బావంకులే నుంచి తాజాగా స్పష్ట త రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అ యినట్టేనని భావిస్తున్నారు. మహాయుతి భేటీ ఆదివారం జరుగుతుందని తాజా సమాచారం.సేనలో అసంతృప్తి! తాజా పరిణామాలపై శివసేన నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. రెండేళ్లకు పైగా సీ ఎంగా చేసిన షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వ డమంటే స్థాయిని తగ్గించడమేనని వారంటున్నా రు. షిండేను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన సన్నిహితుడు, పార్టీ సీనియర్ నేత సంజయ్ సిర్సత్ ఆరోపించారు. తమకు హోం శాఖ ఇచ్చి తీరాలని శనివారం పీటీఐతో మాట్లాడుతూ ఆయనన్నారు. షిండే దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టతనిచ్చాయి. మహాయుతి కూటమి సాధించిన అనూ హ్య, అసహజ విజయమే ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యానికి దారి తీస్తోందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. కూటమిలో కీచులాటలతో విసిగే షిండే సొంతూరి బాట పట్టారని ఎద్దే వా చేశారు. ‘‘2019లో ఎంవీఏ ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయకుండా అడ్డుకునేందుకు మోదీ రాష్ట్రపతి పాలన విధించారు. ఈసారి ఫలితాలు వెల్లడైన వారం దాటినా ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. అయినా రాష్ట్రపతి పాలన ఊసే లేదు’’ అంటూ దుయ్యబట్టారు. -
మహారాష్ట్రలో ప్రతిష్టంభన.. ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త పేరు!
ముంబై: మహారాష్ట్ర మహాయుతి కూటమిలో కొత్త ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది. కూటమి నుంచి ముఖ్యమంత్రి ఎవరు? మంత్రుల స్థానాలపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో, ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో బీజేపీ సీఎం అభ్యర్థిగా తెరపైకి కొత్త పేరు వచ్చినట్టు తెలుస్తోంది. మురళీధర్ మోహోల్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రతిపాదన చేసినట్టు సమాచారం. మరోవైపు.. మహాయుతి కూటమిలో శివనసే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, 24 గంటల్లో షిండే కీలక ప్రకచేస్తారనే చర్చ మహారాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో షిండే అనారోగ్యంతో ఉన్నారని మరికొందరు నేతలు చెబుతున్నారు. కాగా, షిండే మాత్రం ఆయన స్వగ్రామం సతారాకు వెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, షిండే ఎలాంటి ప్రకటన చేస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది.Baby , don't say may be...Is Murlidhar Mool going to be new CM of maharashtra ...? pic.twitter.com/RDneu9aQC5— amit (@GandhiSoul2) November 30, 2024మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదన ఇలా ఉండవచ్చని తెలుస్తోంది. బీజేపీ-132+ షిండే సేన-57+ అజిత్ పవార్-41+ ఇతరులు= 235. ప్రభుత్వం ఏర్పాటైతే బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పదవి, కూటమి నుంచి ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు అనే ప్రతిపాదన ఇప్పటి వరకు వినిపిస్తోంది. ఇక, కూటమి ప్రభుత్వం షిండే హోం మంత్రి పదవి అడిగారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా, ఇందుకు బీజేపీ ఒప్పకోలేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
‘మహా’ రాజకీయం: ఏక్నాథ్ షిండే అలకపాన్పు
ముంబై: మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెరపడడం లేదు. ఎన్నికల ఫలితాలు విడుదలై వారం రోజులవుతున్నా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రావడం లేదు. శుక్రవారం జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం అనూహ్యంగా రద్దయ్యింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అడుగులు చర్చనీయాంశంగా మారాయి. సతారా జిల్లాలోని తన సొంత గ్రామానికి ఆయన చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన(షిండే) నాయకుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ(అజిత్) నేత అజిత్ పవార్ గురువారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రి జె.పి.నడ్డాతో సమావేశమయ్యారు. మంత్రివర్గం కూర్పు, మంత్రి పదవుల పంపకంపై వారు చర్చించినట్లు వార్తలొచ్చాయి. ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం ఉదయం ముంబైకి చేరుకున్నారు. శుక్రవారం ముగ్గురు నేతల మధ్య కీలక సమావేశం జరగాల్సి ఉంది. నూతన ముఖ్యమంత్రి ఎంపికతోపాటు మంత్రి పదవుల పంపకాన్ని ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఏక్నాథ్ షిండే ఆకస్మికంగా తన సొంత గ్రామానికి వెళ్లిపోవడంతో చర్చలు ఆగిపోయాయి. తాజా పరిణామాల పట్ల షిండే అసంతృప్తితో ఉన్నారని, అందుకే అలకబూని మిత్రపక్షాలతో చర్చలు కొనసాగించడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ మరింత పెరిగిపోయింది. మహాయుతి సమావేశం ఆదివారం జరుగనున్నట్లు శివసేన(షిండే) వర్గాలు తెలియజేశాయి. కొత్త ముఖ్యమంత్రి వచ్చేవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వివరించాయి. తమ పార్టీ నేత ఏక్నాథ్ షిండేలో ఎలాంటి అసంతృప్తి లేదని, ఆయన శనివారం ముంబైకి తిరిగి వస్తారని శివసేన నాయకుడు ఉదయ్ సామంత్ చెప్పారు. ఢిల్లీలో షిండే తమ పార్టీ డిమాండ్లను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. దీనిపై అమిత్ షా అతిత్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చిస్తారని వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్) పారీ్టలు మహాయుతి పేరిట కూటమిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్సీపీ(అజిత్) 41 సీట్లు గెలుచుకున్నాయి. సీఎం కుర్చీ కోసం మూడు పార్టీల ముఖ్యనేతలు పోటీపడ్డారు. కానీ, మిత్రపక్షాలకు సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించడం లేదు. దాంతో కనీసం మంత్రి పదవుల్లోనైనా ఎక్కువ వాటా సొంతం చేసుకోవాలని శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్) ఆరాటపడుతున్నాయి. మిత్రపక్షాలకు 20 మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ పెద్దలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో తమకే ఎక్కువ పదవులు కావాలని ఎన్సీపీ(అజిత్) పట్టుబడుతోంది. మరోవైపు బీజేపీ శాసనసభాపక్షం ఇప్పటికీ సమావేశం కాలేదు. తమ నాయకుడిని ఎన్నుకోలేదు. షిండే అడుగులు ఎటువైపు? మరోసారి సీఎం పదవి తనకే ఇవ్వాలని ఏక్నాథ్ షిండే తొలుత డిమాండ్ చేశారు. బీజేపీ అగ్రనాయకత్వం బుజ్జగించడంతో మెత్తబడ్డారు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి అంగీకరించినట్లు తెలిసింది. కానీ, కీలకమైన హోంశాఖను తనకే అప్పగించాలని షరతు పెట్టారు. షిండే మనసు మార్చుకుంటున్నట్లు ఆయన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదని అంటున్నాయి. ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి పోస్టుపై శివసేన(షిండే)లో రెండు రకాల వాదనలు వినిపిస్తాయి. ఈ పదవి తీసుకోవాలని ఒక వర్గం చెబుతుండగా, అవసరం లేదని మరో వర్గం వ్యతిరేకిస్తోంది. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నాయకుడు ఉప ముఖ్యమంత్రి కావడం ఏమిటని శివసేన(షిండే) ఎమ్మెల్యే సంజయ్ సిర్సాత్ ప్రశ్నించడం గమనార్హం. పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి చిన్న పదవిలో ఇమడలేరని ఆయన చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో షిండే కూర్చొనే అవకాశం లేదని అన్నారు. కూటమి ధర్మాన్ని తన తండ్రి గౌరవిస్తారని, వ్యక్తిగత ఆకాంక్షలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోరని ఏక్నాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే స్పష్టంచేశారు. ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఎటువైపు అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీతో జట్టుకట్టినా ప్రభుత్వ ఏర్పాటుకు వారి బలం సరిపోదు. రెండు రోజుల్లో సీఎం ఎంపిక: షిండే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అమిత్ షా, జె.పి.నడ్డాతో సానుకూల చర్చలు జరిగాయని ఏక్నాథ్ షిండే చెప్పారు. ఆయన శుక్రవారం ఉదయం ఢిల్లీలో ముంబైకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. కొత్త సీఎం ఎంపికపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ముంబైలో మహాయుతి కీలక సమావేశం జరగబోతోందని, చర్చలు కొనసాగుతాయని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాను అవరోధం కాబోనని, ప్రధాని మోదీ, అమిత్ షాల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. మహాయుతి కూటమి పారీ్టల మధ్య చక్కటి సమన్వయం ఉందని వివరించారు. అతి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏక్నాథ్ షిండే ప్రకటించారు. పదవుల వెంట పడడం తమకు ఇష్టం లేదన్నారు. -
‘మహా’ సీఎంకు లైన్ క్లియర్.. మిగిలింది అధికారిక ప్రకటనే!
ఢిల్లీ: మహాయుతి కూటమి నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ దాదాపు వీడిపోయింది. సీఎం పదవిపై తనకు ఎలాంటి ఆశలు లేవని.. బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా చేతుల్లోనే తుది నిర్ణయం ఉందని ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. దీంతో తొలి నుంచి రేసులో ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్‌కు దాదాపు లైన్ క్లియర్ అయ్యింది.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇక మిగిలింది అధికార ప్రకటనే!. రేపు(గురువారం) ఎన్డీయే కీలక సమావేశం జరగనుంది. దీనికి ఫడ్నవిస్, షిండే, అజిత్ పవార్లకు ఆహ్వానం అందింది. కుదిరితే ఈ భేటీ అనంతరం లేకుంటే సాయంత్రం మహారాష్ట్ర సీఎంపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.ఇదీ చదవండి: మోదీ చెప్పాల్సింది చెప్పా.. నిర్ణయం ఆయనదే!షిండే ఫిట్టింగ్తోనే..నవంబర్ 23వ తేదీన వెలువడిన ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. 288 స్థానాలకుగానూ.. 237 సీట్లు గెల్చుకుంది. ఇందులో బీజేపీ 132, షిండే శివసేన 57, ఎన్సీపీ(అజిత్ పవార్) 41, ఇతరులు 7 సీట్లు ఉన్నాయి. ఫలితాలు వెలువడిన టైంలో.. ఫడ్నవిస్ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపించింది. ఆ వెంటనే షిండే, అజిత్ పవార్లు తామూ రేసులో ఉన్నామంటూ ముందుకొచ్చారు. సంఖ్యా బలానికి, సీఎం పదవికి సంబంధం లేదని, ఎవరు సీఎం అవుతారనేది చర్చించాకే ప్రకటిస్తామని ఏక్నాథ్ షిండే సైతం అన్నారు. దీంతో అసెంబ్లీ గడువు ముగిసినా.. సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఈలోపు ఢిల్లీ పెద్దలు మూడు పార్టీల నేలతో చర్చలు జరిపారు. డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ అంగీకారం తెలిపి.. ఫడ్నవిస్‌కు మద్దతుగా నిలిచారు. అయితే షిండే మాత్రం ఈ విషయంలో అస్సలు తగ్గలేదు. ఫడ్నవిస్‌ను బీజేపీ సీఎంగా ఎంచుకోవడంపై అసంతృప్తితో రగిలిపోయారు. అందుకు తగ్గట్లే.. ఆయన వర్గీయులు కూడా షిండేనే సీఎంగా ప్రకటించాలంటూ పెద్ద ఎత్తున్న సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడిపించారు. ఈలోపే బీజేపీ అగ్రనేతల సంప్రదింపులతో షిండే మెత్తబడ్డారు. ఫలితంగానే.. బీజేపీ సీఎం పదవి తీసుకుంటే తనకేం అభ్యంతరం లేదని ఆయన చెప్పడంతో ఫడ్నవిస్‌కు లైన్ క్లియర్ అయినట్లైంది. -
‘మహా’ సీఎం పదవి.. ఫడ్నవీస్ ఆసక్తికర కామెంట్స్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే కూటమి మహారాష్ట్రలో 288 స్థానాల్లో ఏకంగా 233 చోట్ల విజయాన్ని అందుకుంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ మహా సీఎం ఎవరు? అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కూటమిలో ఎవరికి వారే తామే సీఎం రేసులో ఉన్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవరు అనేది త్వరలోనే చెబుతామని చెప్పారాయన.తాజాగా సీఎం పదవిపై ఫడ్నవీస్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై మహాయుతిలోని మూడు పార్టీలు చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై సమాధానం చెబుతాం. మూడు పార్టీలు నేతలు కలిసి సీఎంను ఎంపిక జరుగుతుంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో తొందరపాటు ఏమీ లేదు. గతంలో ఉత్తరప్రదేశ్ సీఎం పదవి విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఫలితాలు వెలువడిన రెండు వారాల తర్వాత సీఎంను ఎంపిక చేసినట్టు గుర్తు చేశారు.మరోవైపు.. మహాయుతి కూటమి నేతలు ముఖ్యమంత్రి పదవితో సహా మంత్రి పదవులపై కూడా ఫోకస్ పెట్టారు. మూడు పార్టీల నేతలు తమకు మంత్రి పదవులు కావాలని ఆశిస్తున్నారు. దీనిపై కూడా ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. అయితే, మహారాష్ట్రలో సీఎంతో పాటు 43 మంది మంత్రులు ఉండే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో 132 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో మంత్రి పదవుల్లో సగం వరకు కాషాయ పార్టీకే దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన పదవులను శివసేన, ఎన్సీపీ పంచుకునే ఛాన్స్ ఉంది.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎవరు? అనేది తేలకపోవడంతో ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సీటుపై పోటీ నెలకొందని ఎద్దేవా చేస్తున్నారు. కూటమిలో సీఎం ఎవరో తేల్చుకోలేకపోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. -
మామా అల్లుళ్ల సవాల్, నువ్వా..నేనా? అంటూ కూతురు, చివరికి!
మహారాష్ట్రలో ఇటీవల 288 అసెంబ్లీ నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో అనేక చోట్ల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బడా నాయకులు తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపారు. వార్డుల పునర్విభజన తరువాత తమకు ఓటు బ్యాంకు ఉన్న నియోజక వర్గాలు పక్కనున్న నియోజక వర్గాల్లోకి వెళ్లిపోవడం, కొన్ని నియోజక వర్గాలు వివిధ కులాలకు, మహిళలకు రిజర్వుడు కావడంతో రాజకీయ అనుభమున్న సీనియర్ నేతలకు పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో గత్యంతరం లేక అనేక మంది నేతలు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ భార్యలను లేదా కుటుంబ సభ్యులను బరిలోకి దింపాల్సి వచ్చింది. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన పలువురు అభ్యర్ధులు విజయ ఢంకా మోగించారు.అనేక చోట్ల భార్యలు, కూతుళ్లు, సొంత సోదరులు, సోదరీమణులు, మామా, అల్లుడు, కోడళ్లు ఇలా దగ్గరి బంధువులు వివిధ పార్టీల టికెట్లపై లేదా ఇండి పెండెంట్లుగా బరిలోకి దిగారు. కొన్ని చోట్ల ఓడిపోయినప్పటికీ అనేక చోట్ల గెలిచారు. ఓటమి బాధించినా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఎమ్మెల్యే కావడం వారిలో సంతోషాన్ని నింపింది. మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత జరిగే మంత్రివర్గ విస్తరణలో వీరిలో కొంతమందికి చోటు దక్కే అవకాశముండటంతో తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ప్రభుత్వంలో కొనసాగుతారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బారామతిలో మామా అల్లుళ్ల పోటీకాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఇద్దరు అన్నదమ్ముల్లో అమిత్ దేశ్‌ముఖ్ విజయం సాధించగా, లాతూర్ రూరల్ నియోజక వర్గంలో పోటీచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ధీరజ్ దేశ్‌ముఖ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా ముంబై రీజియన్ బీజేపీ అధ్యక్షుడు ఆశీష్ శేలార్ పశ్చిమమ బాంద్రా నియోజక వర్గంలో గెలిచారు. కానీ ఆయన సోదరుడు వినోద్ శేలార్ పశ్చిమ మలాడ్ నియోజక వర్గంలో ఓడిపోయారు. మాజీ మంత్రి అనీల్ దేశ్‌ముఖ్ తనయుడు సలిల్ దేశ్‌ముఖ్ కాటోల్ నియోజక వర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. కానీ ఆయన సోదరుడి కొడుకు ఆశీష్ దేశ్‌ముఖ్ సావనేర్ నియోజక వర్గంలో గెలిచారు. అనీల్ దేశ్‌ముఖ్ సొంత మేనల్లుడు, ఎంపీ అమర్ కాళే సతీమణి మయురా కాళే ఆర్వీ నియోజక వర్గంలో ఓటమిని చవిచూశారు. మంత్రి ఛగన్ భుజబల్ యేవలాలో గెలిచారు. కానీ ఆయన మేనల్లుడు సమీర్ భుజబల్ నాంద్గావ్లో పరాజయం పాలయ్యారు. బహుజన్ వికాస్ ఆఘాడి నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే హితేంద్ర ఠాకూర్ వసాయ్‌లో, ఆయన తనయుడు క్షితిజ్ ఠాకూర్ నాలాసోపారాలో ఓడిపోయారు. అదేవిధంగా అజిత్ పవార్ వర్గానికి చెందిన ఇంద్రనీల్ నాయిక్ పుసద్ నియోజక వర్గంలో గెలిచారు. కానీ ఆయన సోదరుడు యయాతీ (ఇండిపెండెంట్) కారంజాలో ఓడిపోయారు. ఇక బారామతిలో మేనమామ, మేనల్లుడు మధ్య పోరు జరిగింది. వీరిలో మామ అజిత్ పవార్ గెలుపొందగా, మేనల్లుడు యుగేంద్ర పరాజయం పాలయ్యారు. న్యూ ముంబైలోని ఏరోలీలో తండ్రి, కొడుకుల మధ్య పోరు జరిగింది. వీరిలో తండ్రి, మాజీ మంత్రి గణేశ్ నాయిక్ (బీజేపీ) గెలుపొందగా, తనయుడు సందీప్ నాయిక్ బేలాపూర్‌లో ఎస్పీ వర్గం టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. ఆయన్ని బీజేపీ అభ్యర్ధి మందా మాత్రే ఓడించారు. బోకర్‌లో తండ్రిపై కుమార్తె విజయంగడ్చిరోలీ జిల్లా అహేరీ నియోజక వర్గం ఎన్సీపీ(ఏపీ) అభ్యర్థి, మంత్రి ధర్మరావ్బాబా ఆత్రం తన సొంత కూతురు భాగ్యశ్రీ ఆత్రంను ఓడించారు. భాగ్యశ్రీ ఇండిపెండెంట్‌గా, తండ్రికి ప్రత్యర్ధిగా పోటీ చేశారు. భాగశ్రీతోపాటు ఆయన మేనల్లుడైన అంబరీష్ రాజే ఆత్రం కూడా ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయారు. అయినప్పటికీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే కావడం విశేషం. మరోవైపు నాందేడ్ జిల్లా లోహా నియోజక వర్గం నుంచి ఎన్సీపీ(ఏపీ) తరపున పోటీచేసిన మాజీ ఎంపీ ప్రతాప్‌రావ్ పాటిల్ చిఖిలీకర్ స్వయాన తన సోదరి ఆశా శిందేను ఓడించారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను ఆయన సొంత కూతురు శ్రీజయ బోకర్ నియోజక వర్గంలో ఓడించారు. ఆమె బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. బోకర్ నియోజక వర్గం అశోక్ చవాన్‌కు గట్టిపట్టున్న ప్రాంతంగా పేరు పొందింది. పారంపర్యంగా వస్తున్న గెలుపును మళ్లీ చేజిక్కించుకునేందుకు ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. కానీ కూతురు చేతిలో చవాన్ ఓడిపోక తప్పలేదు. అయినప్పటికీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే అయ్యారు. ఎన్సీపీ(ఏపీ) ప్రదేశ్ అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తట్కరే కుమార్తై, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అదితీ తట్కరే శ్రీవర్ధన్ నియోజక వర్గంలో ఆయన్ని ఓడించారు. చదవండి: ఈవీఎంలపై కట్టలు తెంచుకున్న జనాగ్రహం.. కరెక్టేనా?కాగా బోకర్, శ్రీవర్ధన్ రెండు చోట్ల కుమార్తైలు తండ్రులను ఓడించడం విశేషం. మరోవైపు ఆదివాసి సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌కుమార్ గావిత్ నందుర్బార్ నియోజక వర్గంలో భారీ మెజారిటీతో గెలిచారు. కాని ఆయన ఇద్దరు సొంత సోదరులైన రాజేంద్రకుమార్ గావిత్ (కాంగ్రెస్) శహదా నియోజక వర్గంలో, శరద్ గావిత్ (ఇండిపెండెంట్) నవాపూర్ నియోజక వర్గంలో ఓడిపోయారు. అదేవిధంగా విజయ్‌కుమార్ గావిత్ కుమార్తై హినా గావిత్ అక్కల్కువా నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో గావిత్ కుటుంబంలో ఒక్కరికే ఎమ్మెల్యే అయ్యే అవకాశం దక్కింది. ఇక మాజీ కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావ్‌సాహెబ్ దానవే తనయుడు సంతోష్ దానవే బోకర్ నియోజక వర్గంలో మరోసారి గెలిచారు. కన్నడ్ నియోజక వర్గం నుంచి శివసేన ఏక్నాథ్ శిందే వర్గం టికెట్‌పై పోటీచేసిన రావ్‌సాహెబ్ కుమార్తై సంజనా విజయకేతనం ఎగురవేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో స్వయంగా రావ్‌సాహెబ్ ఓటమి పాలయ్యారు. కానీ పిల్లలిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఆయనకు డబుల్ గిఫ్ట్ లభించినట్లైంది. లాతూర్‌లో మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఇద్దరు తనయుల్లో ఒకరు ఓడిపోయారు.తండ్రి ఎంపీ.. కుమారులిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నిక మహారాష్ట్ర చరిత్రలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కొడుకులు, తండ్రి ఇలా ముగ్గురూ అధికారంలో కొనసాగడం చర్చనీయాంశమైంది. మాజీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఇద్దరు కొడుకుల్లో ఒకరైన నితేష్ రాణే కంకావలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి, రెండో కొడుకు నిలేష్ రాణే కుడాల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారీ్టతో గెలిచారు. దీంతో వారిద్దరూ శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే నారాయణ్ రాణే ఎంపీగా కొనసాగుతున్నారు. అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ రత్నగిరి నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరుడు కిరణ్ సామంత్ రత్నగిరి జిల్లా రాజాపూర్ నియోజక వర్గం నుంచి గెలిచారు. ఇరువురూ ఏక్నాథ్ శిందే వర్గం తరపున పోటీ చేశారు. అలాగే తూర్పుబాంద్రా నియోజక వర్గంలో వరుణ్ సర్దేశాయ్ విజయఢంకా మోగించారు. వరుణ్ సర్దేశాయ్, ఉద్ధవ్ ఠాక్రే సతీమణీ రష్మీ ఠాక్రేకు స్వయానా చెల్లెలి కుమారుడు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే వర్లీ నియోజక వర్గం నుంచి గెలిచారు. దీంతో వరుస సోదరులిద్దరూ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అదేవిధంగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి దిలీప్ వల్సే పాటిల్ ఎన్సీపీ(ఏపీ) తరపున పుణేలోని అంబేగావ్ నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరి సాయితాయి డహాకే కరాంజ నియోజక వర్గంలో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన సోదరుడు, సోదరి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. -
మహారాష్ట్రలో నరాలు తెగే సస్పెన్స్ .. కౌన్ బనేగా సీఎం
ముంబై: మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరన్న దానిపై నరాలు తెగే సస్పెన్స్ కొనసాగుతోంది. శనివారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని పాలక మహాయుతి కూటమి అఖండ విజయంతో అధికారాన్ని నిలబెట్టుకోవడం తెలిసిందే. ఆ పార్టీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి సీఎం అవడం లాంఛనమేనని, సోమవారం నూతన సర్కారు కొలువుదీరుతుందనివార్తలొచ్చాయి. కానీ ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండేనే కొనసాగించాలని కూటమి భాగస్వామి శివసేన (షిండే) పట్టుబడుతోంది. బిహార్ మోడల్‌ను మహారాష్ట్రలో కూడా బీజేపీ అమలు చేయాలని శివసేన (షిండే) అధికార ప్రతినిధి నరేశ్ మస్కే సోమవారం డిమాండ్ చేశారు. బీజేపీకి ఎక్కువ సీట్లున్నా సంకీర్ణంలోని మైనారిటీ భాగస్వామి జేడీ(యూ) అధినేత నితీశ్‌కుమార్‌ను సీఎం చేశారని గుర్తు చేశారు. ‘‘సీఎంగా మహాయుతి కూటమిని షిండే ముందుండి నడిపి ఘనవిజయంలో కీలక పాత్ర పోషించారు. కనుక ఆయన్నే కొనసాగించడం సబబు’’ అన్నారు. బీజేపీ నేతలు మాత్రం ఈసారి ఫడ్నవీస్‌ను సీఎం చేయాల్సిందేనంటున్నారు. కూటమిలోని మూడో పార్టీ ఎన్సీపీ అధినేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా అందుకు మద్దతిస్తున్నట్టు సమాచారం. దాంతో సీఎంపై పీటముడి వీడక కొత్త ప్రభుత్వ ఏర్పాటు కసరత్తు కొలిక్కి రావడం లేదు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇంట్లో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ సోమవారం ఢిల్లీ వెళ్లారు. సీఎం అభ్యర్థిని నిర్ణయించేందుకు వారితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్ర నేత అమిత్ షా సమావేశమవుతారంటూ తొలుత వార్తలొచ్చాయి. దాంతో రాత్రికల్లా సస్పెన్స్ వీడుతుందని భావించినా అలాంటిదేమీ జరగలేదు. దాంతోప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఫడ్నవీసే సీఎం అవడం ఖాయమని, అజిత్‌తో పాటు షిండే ఉప ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు. షిండే సేనకు 12, పవార్ ఎన్సీపీకి 10 మంత్రి పదవులు దక్కుతాయని సమాచారం. ఫడ్నవీస్ తొలిసారి 2014 నుంచి 2019 దాకా ఐదేళ్లపాటు సీఎంగా ఉన్నారు. 2019లో మళ్లీ సీఎం అయినా అజిత్ పవార్ మద్దతు ఉపసంహరణతో ఆయన ప్రభుత్వం 80 గంటల్లోనే పడిపోయింది. ‘మంగళవారం డెడ్‌లైన్’ అవాస్తవం మహారాష్ట్ర ప్రస్తుత శాసనసభ గడువు మంగళవారంతో ముగుస్తున్నందున ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటవకపోతే రాష్ట్రపతి పాలన తప్పదన్న వాదనను అసెంబ్లీ వర్గాలు తోసిపుచ్చాయి. ‘‘మంగళవారం డెడ్‌లైన్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. కొత్త ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితాను నోటిఫై చేస్తూ ఎన్నికల సంఘం శనివారమే గవర్నర్‌కు గెజిట్ కాపీ సమరి్పంచింది. కనుక ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 73వ సెక్షన్ ప్రకారం కొత్త అసెంబ్లీ ఇప్పటికే పూర్తిస్థాయిలో కొలువుదీరినట్టే లెక్క. రాష్ట్రపతి పాలన వచ్చేందుకు అవకాశమే లేదు’’ అని అసెంబ్లీ అధికారి ఒకరు వివరించారు. -
మరికొద్ది గంటలే.. షిండే వెనక్కి తగ్గకుంటే.. 2019 సీన్ రిపీట్?
మహారాష్ట్రలో మహాయుతి కూటమి గ్రాండ్ విక్టరీ సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మహారాష్ట్ర సింగిల్ డిజిట్ లార్డెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ.. ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేక మిత్రపక్షాల మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ..సీఎం పదవికి, సంఖ్యా బలానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అంటున్నారు. కూర్చొని చర్చించి సీఎంను ఎంపిక చేస్తామని చెప్పారు. అదే టైంలో దేవేంద్ర ఫడ్నవిస్‌ను ముఖ్యమంత్రి ఛాయిస్‌గా బీజేపీ దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. మరోవైపు.. మొదట సీఎం రేసులో ఉన్నట్లు కనిపించిన అజిత్ పవార్.. ఇప్పుడు బీజేపీకే మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో..మహా సీఎం పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఫడ్నవిస్-షిండే-అజిత్ పవార్లు ఇవాళ బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. అమిత్ షాతో కీలక భేటీ జరగనుంది. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. ప్రస్తుత సీఎం షిండే రేపు రాజీనామా చేస్తారని.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని శివసేన ప్రకటించింది. ఆ పార్టీ లెజిస్లేచర్ నేతగా షిండేను ఎన్నుకుంది కూడా. అయితే..మహారాష్ట్ర అసెంబ్లీ గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆ లోగానే కొత్త అసెంబ్లీ కొలువుదీరాల్సి ఉంది. అంటే.. సీఎం ప్రమాణం జరగాలి. అలాంటిదేమీ జరగలేదు కాబట్టి.. పరిస్థితుల దృష్ట్యా కచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే.. మహారాష్ట్రలో వరుసగా రెండోసారి ఎన్నికల తర్వాత రాష్ట్రపతి పాలన విధించినట్లు అవుతుంది. 2019 ఎన్నికల అనంతరం కూడా ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్ఠంభన నెలకొనడంతో రాష్ట్రపతి పాలన విధించారు. సుమారు 33 రోజుల పాటు ఆ టైంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రతిష్టంభన కొనసాగింది. ఇక.. 2014లోనూ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీతో 15 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ). మద్దతు ఉపసంహరించడంతో.. పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడడం, తదనంతరం సీఎం పదవికి చవాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇంతకు ముందులా లేదుగా.. ..మహారాష్ట్రలో 2019లో జరిగిన ఎన్నికల్లోనూ 105 సీట్లను బీజేపీ దక్కించుకుంది. నాడు ఉమ్మడి శివసేన 56 స్థానాలు గెలుచుకుని.. బీజేపీ కూటమిగా(161 సీట్లతో) సంపూర్ణ మెజారిటీ సాధించాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిపై ఉమ్మడి శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే పేచీ పెట్టడంతో రాజకీయం మారిపోయింది. చెరో రెండున్నరేళ్ల సీఎం పదవి కోసం డిమాండ్ చేశారాయన. కుదరకపోవడంతో.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఆపై కలిసొచ్చిన అవకాశం అందిపుచ్చుకుని కాంగ్రెస్, ఉమ్మడి ఎన్సీపీలతో కలిసి మహా వికాస్ అఘాడీ కూటమిని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. ఇక..2022లో ఏక్ నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చి.. బీజేపీతో కలిసి సీఎం అయ్యారు. ఆ టైంలోనూ ఫడ్నవిస్ సీఎం పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగారు. మరోవైపు.. 2023లో ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ వచ్చి చేరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఫడ్నవిస్ సీఎంగా ఉండి.. షిండే, పవార్లు డిప్యూటీ సీఎంలుగా కొనసాగడమే సబబని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మరి అందుకు షిండే అంగీకరిస్తారో లేదో? అనేది ఈ రాత్రికల్లా తేలిపోవాల్సి ఉంది. లేకుంటే.. రాష్ట్రపతి పాలన తప్పదు!.