ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ అజిత్ పవార్, ఇద్దరు బీజేపీ నాయకులపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్-ఎన్సీపీ వర్గం) ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తాము అధికారంలోకి వస్తే నిధుల్ని విడుదల చేస్తామంటూ ఓటర్లకు హామీ ఇవ్వడం ద్వారా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఆరోపించింది.
అజిత్ పవార్, మంగేష్ చవాన్, చంద్రకాంత్ పాటిల్‌లు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 పదేపదే ఉల్లంఘించినందుకు భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాము అని ఎన్సీపీ శరద్ పవార్ వర్గం పేర్కొంది.
తమ అభ్యర్థిని ఎన్నుకుంటేనే తమ అధికారిక పదవులను ఉపయోగించుకుని రాష్ట్ర ఆర్థిక నిధులను పంపిణీ చేస్తామని నేతలు పదేపదే వాగ్దానం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. మహరాష్ట్ర అధికార పార్టీ ప్రాథమికంగా లంచం,అవినీతి పద్ధతుల్ని అవలంభిస్తోందని ఆరోపిస్తోంది.
సదరు నేతలపై తక్షణమే చర్యలు తీసుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక కలెక్టర్, డిప్యూటీ ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. మన ప్రజాస్వామ్య దేశంలో న్యాయబద్ధత, న్యాయం, చట్టబద్ధమైన పాలనను అందించేలా తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment