sarad pawar
-
అది వాళ్లకు అనవసరం.. రాజకీయాలకు స్వస్తి పలకడంపై శరద్ పవార్
ముంబై: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఘోర పరాజయంపై ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఊహించలేదని, ఇది ప్రజలు తీసుకున్న నిర్ణయమని అన్నారు .మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శరద్ పవార్ మాట్లాడారు. 288 అసెంబ్లీ స్థానాల్లో అజిత్ పవార్ 41 స్థానాల్ని గెలిచారని ప్రస్తావించారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. ఈ ఫలితాల్ని మేం ఊహించలేదు. ఇది ప్రజలు తీసుకున్న నిర్ణయం. నాకంటే అజిత్ పవార్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయనే విషయాన్ని మేం అంగీకరిస్తున్నాం. అయితే ఎన్సీపీ వ్యవస్థాపకుడు ఎవరో మహరాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ స్థాపించిన నాటి నుంచి తొలిసారి శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది.ఈ తరుణంలో పలువురు ఎన్సీపీ నేతలు.. శరద్ పవార్ రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. నేను ఏం చేయాలో వాళ్లకు అనవసరం నేను ఏం చేయాలో నేను, నా సహచరులు నిర్ణయిస్తారు’ అని వ్యాఖ్యానించారు. -
మరో సంచలనం : అజిత్ పవార్‌పై శరద్ పవార్ మనవడు పోటీ
ముంబై: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బారామతిలో నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ పోటీ చేస్తుండగా..ఆయనపై శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్‌ను పోటీకి దించుతున్నట్లు ప్రకటించారు. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయతి కూటమి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ-ఎస్పీ) పోటీచేస్తున్న 45 మంది అభ్యర్థుల జాబితాను గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఈ 45 మంది అభ్యర్థుల జాబితాలో బారామతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న 32ఏళ్ల యుగేంద్ర పవార్ పేరు సైతం ఉంది. పవార్ కుటుంబానికి కంచుకోట బారమతి నియోజకవర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో మరో వర్గం అధినేత, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ పోటీ చేస్తుండడం చర్చనీయంశంగా మారింది. Pune | On Baramati candidate selection, Maharashtra State President of the NCP (Sharadchandra Pawar faction), Jayant Patil says, "Baramati candidate selection is based on the demand from the local people of Baramati...I had the interaction with them...They have suggested he is… pic.twitter.com/Fi2mClnFrr— ANI (@ANI) October 24, 2024లోక్‌సభ ఎన్నికల్లో బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఆయన భార్య సునేత్ర పవార్‌ను బరిలోకి దింపగా.. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఎన్సీపీ(ఎస్పీ) తరఫున పోటీ చేశారు. సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజార్టీతో సుప్రియా గెలుపొందడం శరద్ పవార్ వర్గానికి భారీ ఊరటనిచ్చింది. ఈ క్రమంలోనే సుప్రియా సూలేపై తన సతీమణి సునేత్రను నిలబెట్టి తప్పు చేశానని అజిత్ పవార్ అంగీకరించారు. ఇది తన కుటుంబంలో గొడవలు సృష్టించిందని పలుమార్లు మీడియా ఎదుట వెల్లడించారు. ఇప్పుడు తాజా అజిత్ పవార్‌పై తన మనవడు శరద్‌పవార్‌ను పోటీకి దించడం సంచలనంగా మారింది. -
సీఎం అభ్యర్థిపై ఫడ్నవిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే సీఎం పదవి చేపట్టబోయేది ఎవరో బీజేపీ కీలక నేత,డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హింట్ ఇచ్చారు. శివసేనకు చెందిన వ్యక్తే తమ కూటమి తరపునన సీఎం అయ్యే అవకాశాలున్నాయని చెప్పకనే చెప్పారు. బుధవారం(అక్టోబర్16) ముంబయిలో ఎన్డీఏ ప్రభుత్వ రిపోర్డు కార్డు విడుదల చేస్తూ ఫడ్నవిస్ మాట్లాడారు. తమ చీఫ్ మినిస్టర్ ఇక్కడే ఉన్నారని,దమ్ముంటే మహావికాస్అఘాడీ(ఎంవీఏ) కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీ చీఫ్ శరద్‌పవార్‌కు సవాల్ విసిరారు. మాకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించాల్సిన అవసరం లేదు. మా సీఎం ఇక్కడే ఉన్నారు. ఎంవీఏ సీఎం అభ్యర్థిని ప్రకటించడం లేదు ఎందుకంటే వాళ్లకు గెలుస్తామన్న నమ్మకం లేదు. శరద్‌పవార్‌కు సవాల్ విసురుతున్నా. ఎంవీఏ కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించండి’అని ఫడ్నవిస్ శరద్‌పవార్‌ను కోరారు. కాగా, ఎన్డీఏ కూటమిలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా సీఎం పదవిని ఆశిస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఇదీ చదవండి: షిండే సీఎం కాదు.. కాంట్రాక్టర్ మంత్రి -
అజిత్ పవార్‌కు ఎదురు దెబ్బ.. శరద్ పవార్‌కు టచ్‌లోకి 15 మంది ఎమ్మెల్యేలు!
ముంబై : అసెంబ్లీ ఎన్నికలకు ముందే మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అజిత్ పవార్ వర్గంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 20 మంది నేతలు (అందులో 15మంది ఎమ్మెల్యేలు).. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి నేతృత్వం వహిస్తున్న అజిత్ పవార్‌కు గట్టి షాక్ తగిలింది. అజిత్ పవార్‌కు నేతృత్వంలోని ఎన్సీపీకి నలుగురు కీలక నేతలు రాజీనామా చేశారు. త్వరలోనే శరద్ పవార్‌తో జతకట్టనున్నారు.పింప్రి చించ్వాడ్ ఎన్సీపీ యూనిట్ అధ్యక్షుడు అజిత్ గవానే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను అజిత్ పవార్‌కు పంపించారు. గవానేతో పాటు స్టూడెండ్ వింగ్ అధ్యక్షుడు యష్ సానే,మాజీ కార్పొరేటర్లు రాహుల్ భోసలే,పంకజ్ భలేకర్ ఎన్సీపీకి గుడ్‌బై చెప్పారు.అజిత్ పవార్ వర్గంలో అలజడిపింప్రి చించ్వాడ్కు చెందిన నలుగురు కీలక నేతలు రాజీనామా చేయడంతో అజిత్ పవార్ వర్గంలో అలజడి మొదలైంది. మరికొందరు నేతలు సైతం అజిత్‌ను కాదని శరద్ పవార్‌తో టచ్‌లోకి వెళ్లారంటూ మహరాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు అందుకు ఊతం ఇచ్చేలా శరద్ పవార్ గత నెలలో ‘తన పార్టీ నాశనాన్ని కోరుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వారిని ఆహ్వానించం. కానీ పార్టీ పరువును దెబ్బతీయకుండా బలోపేతం చేసేందుకు కృషి చేసే నాయకుల్ని తిరిగి చేర్చుకుంటాం’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో పింప్రి చించ్వాడ్ అజిత్ పవార్ వర్గంలోని ఎన్సీపీ నేతలు తన రాజీనామాలు చేయడం మహా రాజకీయాలు మరోసారి చర్చకు దారి తీశాయి.షాక్‌లోకి అజిత్ పవార్ వర్గంఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహరాష్ట్ర అజిత్ పవార్ వర్గం 4 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒక స్థానంలో మాత్రమే గెలిచింది. ఈ ఊహించని ఫలితాలు తనని షాక్‌కి గురి చేశాయని, ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలుకాగా, ఈ ఏడాది నవంబర్‌లో మహరాష్ట్రలో 288 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో ఉద్దవ్‌ఠాక్రే నేతృత్వంలోని శివసేన 115 నుంచి 125 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుండగా.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ సైతం మెజార్టీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుండగా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలో డీలా పడ్డ అజిత్ పవార్ వర్గంలోని 15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్‌కు టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం.శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్గతేడాది మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ ఉద్ధండుడు శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నిట్టనిలువునా చీలింది. పార్టీ సీనియర్ నేత, పవార్‌కు స్వయానా అన్న కుమారుడైన అజిత్ పవారే పార్టీని చీల్చారు. ఎన్సీపీలో తనకు, తనకుమారుడు పార్థ్‌కు రాజకీయ భవిష్యత్ ఉండదనే ఆందోళనతో పార్టీని చీల్చి శరద్ పవార్ వర్గంలో నేతల్ని తనవైపుకు తిప్పుకున్నారు. వెంటనే ప్రభుత్వంలో చేరారు. వారిలో కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టారు. మహరాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టారు. -
అజిత్ పవార్, బీజేపీ నేతలపై.. ఎన్నికల సంఘానికి శరద్ పవార్ ఫిర్యాదు
ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ అజిత్ పవార్, ఇద్దరు బీజేపీ నాయకులపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్-ఎన్సీపీ వర్గం) ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తాము అధికారంలోకి వస్తే నిధుల్ని విడుదల చేస్తామంటూ ఓటర్లకు హామీ ఇవ్వడం ద్వారా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఆరోపించింది. అజిత్ పవార్, మంగేష్ చవాన్, చంద్రకాంత్ పాటిల్‌లు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 పదేపదే ఉల్లంఘించినందుకు భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాము అని ఎన్సీపీ శరద్ పవార్ వర్గం పేర్కొంది. తమ అభ్యర్థిని ఎన్నుకుంటేనే తమ అధికారిక పదవులను ఉపయోగించుకుని రాష్ట్ర ఆర్థిక నిధులను పంపిణీ చేస్తామని నేతలు పదేపదే వాగ్దానం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. మహరాష్ట్ర అధికార పార్టీ ప్రాథమికంగా లంచం,అవినీతి పద్ధతుల్ని అవలంభిస్తోందని ఆరోపిస్తోంది. సదరు నేతలపై తక్షణమే చర్యలు తీసుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక కలెక్టర్, డిప్యూటీ ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. మన ప్రజాస్వామ్య దేశంలో న్యాయబద్ధత, న్యాయం, చట్టబద్ధమైన పాలనను అందించేలా తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం తెలిపింది. -
మామ శరద్ పవర్ మాట.. బోరుమని ఏడ్చిన కోడలు
ముంబై: మహరాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో వదిన (సునేత్ర), మరదలు (సుప్రియా సూలే) మధ్య పోటీ నెలకొంది. కొద్ది రోజుల క్రితం ‘పవార్ కార్డ్’ ఉపయోగించి తన సతీమణి, లోక్‌సభ అభ్యర్ధి సునేత్రా పవార్‌ను గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విజ్ఞప్తి చేశారు. అయితే అజిత్ పవార్ వ్యాఖ్యల్ని శరద్ పవార్ ఖండించారు. సునేత్ర పవార్ బయటి వ్యక్తి అని శరద్ పవార్ అన్నారు. ఈ తరుణంలో మీడియా ప్రతినిధులు ఇదే అంశంపై సునేత్రా పవార్‌ను ప్రశ్నించారు. శరద్ పవార్ మిమ్మల్ని ‘బయటి పవార్’ అని అనడంపై సునేత్ర పవార్ కన్నీటి పర్యంతమయ్యారు. మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Pune: NCP candidate from Baramati, Sunetra Pawar gets emotional when asked about Sharad Pawar's remark calling her 'outsider Pawar' Sunetra Pawar is the wife of Maharashtra Deputy CM Ajit Pawar and is contesting LS elections against NCP-SCP MP Supriya Sule from… pic.twitter.com/sJauAJa2fg — ANI (@ANI) April 13, 2024 -
వదిన-మరదళ్ల సమరం : ‘బారామతి నేను.. నేను బారామతి’ని
ముంబై : మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికల పోరులో వదిన-మరదళ్ల సమరం ఆసక్తిని రేపుతోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండు ముక్కలైన ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న బారామతి లోక్‌సభ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలో నిలిచారు. వారిలో సుప్రియా సూలే తరుపున ఎన్నికల ప్రచారం చేస్తున్న శరద్ పవర్ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తుంటే.. భార్య సునేత్ర పవార్ తరుపున అజిత్ పవార్ ప్రచారంతో ప్రజా మద్దతు తమకే ఉందని నిరూపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ‘బారామతి అంటే నేను.. నేనే బారామతి’ ఈ తరుణంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ఏ వ్యక్తికి వ్యతిరేకంగా కాదని చెప్పారు. అంతేకాదు తాను బారామతిలో పుట్టి పెరిగానని, దాని మట్టితో కనెక్ట్ అయ్యానని అన్నారు. ‘బారామతి అంటే నేను.. నేనే బారామతి’ అని పేర్కొన్నారు. శరద్ పవార్ అంతం కోసం ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్ని ‘ప్రతీకార పోరాటం’గా మార్చారంటూ సుప్రియా సూలే మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌పై మండిపడ్డారు. పాటిల్ గత వారం బారామతికి వచ్చి ఈ యుద్ధం శరద్ పవార్‌ను అంతం చేయడం కోసమే అని వ్యాఖ్యానించారు. అభివృద్ది గురించి మాట్లాడితే ప్రజలు ఇష్టపడతారు. ఇలా మాట్లాడితే ఎలా? ఈ తరహా వ్యాఖ్యలతో పాటిల్ వ్యక్తిగత ఎన్నికలుగా మార్చారని చెప్పుకొచ్చారు. బారామతి మట్టికి రుణపడి ఉంటాం. 2009 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి సీటుతో తనకు ఉన్న అనుబంధం గురించి అడిగిన ప్రశ్నకు సులే మాట్లాడుతూ.. ‘బారామతి నేను, నేను బారామతిని.నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఈ రోజు నేను, నా కుటుంబం అంతా బారామతి మట్టికి రుణపడి ఉంటామని భావోద్వేగానికి గురయ్యారు. నా అనుకున్న వాళ్లు దూరమైతే అజిత్ పవార్ అభ్యర్ధిగా బరిలో దిగడంపై.. మన అనుకున్నవాళ్లు దూరమైనప్పుడు బాధగానే ఉంటుంది. నాక్కూడా అలాగే ఉంది. నేను బంధాలు, వ్యక్తులకు విలువ ఇస్తాను. కానీ నేను చేస్తున్న ఈ రాజకీయాలు మాత్రం కుటుంబం కోసం ప్రజలకు సేవ చేయడం కోసమేనంటూ ఎన్నికల ప్రచారంలో వడివడిగా అడుగులు ముందుకు వేశారు. -
శరద్ పవార్ పార్టీ గుర్తుగా 'మ్యాన్ బ్లోయింగ్ తుర్హా' ఫిక్స్
'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్' లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ చిహ్నంగా 'మ్యాన్ బ్లోయింగ్ తుర్హా'ను ఉపయోగించడానికి సుప్రీంకోర్టు మార్చి 19న అనుమతించింది. ఈ గుర్తును శరద్ పవార్ వర్గానికి రిజర్వ్ చేయాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)ని ఆదేశించిన సుప్రీంకోర్టు, అది ఏ ఇతర పార్టీ లేదా అభ్యర్థికి గుర్తును కేటాయించకూడదని పేర్కొంది. శరద్ పవార్ స్థాపించిన NCP గత ఏడాది జూలైలో అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన తర్వాత చీలిపోయింది. పార్టీ విడిపోయిన తరువాత కూడా లోగో, పేర్లను వాడుతున్నారని శరద్ పవార్ వర్గం పిటిషన్ వేసింది. అయితే ఇప్పుడు వారికి కొత్త గుర్తును కేటాయించడం వల్ల.. అజిత్ పవార్ గ్రూపును నిజమైన NCPగా ఎలక్షన్ కమీషన్ పేర్కొంది. కాబట్టి పార్టీ గుర్తును వారికే కేటాయించింది. -
బీజేపీకి ‘సపోర్టింగ్ పార్టీ’ ఈడీ : శరద్ పవార్
ఎన్సీపీ(ఎస్పి) అధినేత శరద్ పవార్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి ఏజెన్సీల సాయంతో ప్రతిపక్ష పార్టీల నాయకులలో భయాన్ని పుట్టించేందుకు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బీజేపీకి ఈడీ ‘సపోర్టింగ్ పార్టీ’ అని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్ పూణేలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శరద్ పవార్ మాట్లాడుతూ.. బీజేపీ..ఈడీ వంటి ఏజెన్సీల సహాయంతో ఎన్నికలను ప్రభావితం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని, ప్రతిపక్షం నుండి పోటీ చేయవద్దని అభ్యర్థులను బెదిరిస్తుందని వాపోయారు. ఈ సందర్భంగా 2005 - 2023 మధ్య ఈడీ తీసుకున్న చర్యలను ఉదహరిస్తూ.. 5,806 కేసులు నమోదు చేసిందని, వాటిల్లో కేవలం 25 మాత్రమే పరిష్కరించిందని తెలిపారు. ‘2005- 2023 మధ్య రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. యూపీఏ హయాంలో ఈడీ 26 మంది నాయకులను విచారించింది. వారిలో ఐదుగురు కాంగ్రెస్, ముగ్గురు బీజేపీకి చెందిన నేతలున్నారు. కానీ 2014 తర్వాత ఒక్క బీజేపీ నాయకుడిని కూడా ప్రశ్నించలేదన్న ఆయన... ఈడీ చర్యల గురించి బీజేపీ నేతలకు ముందే తెలుసు. బీజేపీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు కనిపిస్తోంది’ అని పవార్ పేర్కొన్నారు. -
వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో?
త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సొంత కుటుంబ సభ్యులే ప్రత్యర్ధులుగా మారి కయ్యానికి కాలుదువ్వనున్నారు. ముఖాముఖీ తలపడనున్నారు. గత 55 సంవత్సరాలుగా కుటుంబం హవా కొనసాగుతుండగా..రాజకీయ వైరంతో కుటుంబ సభ్యులే ఒకరిపై ఒకరు పోటీ పడనున్నారు. మరి ఈ ఎన్నికల పోరులో ప్రత్యర్ధులైన వదినా, మరదళ్లలో గెలుపెవరిదో ఎన్సీపీని చీల్చి బీజేపీ ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన అజిత్ పవర్..తన భార్యను రాజకీయ అరంగ్రేటం చేయిస్తున్నారు. అందులోనూ దిగ్గజ నేత, తన బాబాయ్ ఎన్సీపీ అధినేత శరద్‌పవర్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ సుప్రీయా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతి నుంచే బరిలో దింపుతున్నారు? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్‌పవార్ వర్గం)ల మధ్య లోక్‌సభ సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎన్సీపీ-అజిత్ పవర్ వర్గ కార్యకర్తలు బలమైన నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని అభిప్రాయపడ్డారు అని పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ సునీల్ తట్కరే అన్నారు. బారామతిలో అధికార కూటమి నుంచి పోటీ చేసేందుకు ఎన్సీపీ సిద్ధంగా ఉంది. కూటమి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత సునేత్ర పవార్ బారామతి నుండి పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని అన్నారు. 2009 నుంచి ప్రస్తుతం బారామతి లోక్‌సభ నుంచి గెలుస్తూ వస్తున్న శరద్ పవర్ కుమార్తె సుప్రీయా సూలే ప్రత్యర్ధిగా సునేత్ర పవార్ అవుతారు. పెదనాన్న కొడుకైన అజిత్.. సుప్రియాకు అన్నయ్య అవుతారు. ఆ లెక్కనా వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో చూడాలి మరి! బాబాయితో మనస్పర్థలు ఎందుకు? అజిత్ పవార్ తండ్రి అనంతరావు పవార్. ఈయన ప్రముఖ సినీ దర్శకుడు శాంతారారం వద్ద పని చేశారు. అయినా.. అజిత్ సినిమా రంగంవైపు మళ్లలేదు. రాజకీయాల్లో ఉన్న బాబాయ్ శరద్ పవార్ మార్గాన్ని ఎంచుకున్నారు. తన సొంత పట్టణమైన బారామతి నుంచి తొలిసారిగా 1991లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.అప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగతూ వచ్చారు. కానీ శరద్ పవర్ కుమార్తె సుప్రియా సూలే రాకతో అజిత్ పవర్ రాజకీయం మొత్తం మారిపోయింది. అంతా తానై శరద్ పవార్‌కు మగపిల్లలు లేరు. ఏకైక కుమార్తె సుప్రియా సూలే వివాహం చేసుకొని సింగపూర్‌లో స్థిరపడ్డారు. 2009 నుంచి బారామతి స్థానం లోక్‌సభ స్థానం నుంచి ఆమె ఎంపీగా గెలిచినా..ఢిల్లీకే పరిమితమయ్యారు. ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి రారని శరద్ పవార్ పలు సందర్భాల్లో చెప్పారు. దాంతో శరద్ రాజకీయ వారసుడు అజిత్ అని అందరూ భావించారు. పార్టీలోనూ ఆయనకు గౌరవం కూడా లభించింది. బాబాయ్‌పై తిరుగుబాటు అయితే, 2019లో జరిగిన వరుస పరిణామాలతో బాబాయి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌పై అజిత్ పవార్ తిరుగుబాటు ప్రకటించారు. నాటి ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీకి మద్దతు పలికి డిప్యూటీ సీఎం అయ్యారు. కాగా, త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో శరద్ పవార్ కుమార్తె సుప్రీయా సూలేను ఓడించాలనే ఉద్దేశంతో తన భార్య సునేత్రతో పోటీ చేయించేందుకు సిద్ధమయ్యారు అజిత్ పవర్ -
‘తండ్రిని చూస్తే వణుకు’... ‘ఆత్మకథ’లో శరద్ పవార్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ 83వ ఏట అడుగుపెట్టారు. 1940 డిసెంబర్ 12 న ఆయన జన్మించారు. శరద్ పవార్ తల్లి కూడా 1911లో డిసెంబర్ 12నే జన్మించడం విశేషం. పవార్ తండ్రి పేరు గోవింద్ రావ్. నీరా కెనాల్ కోఆపరేటివ్ సొసైటీ (బారామతి)లో సీనియర్ అధికారి. గోవింద్‌రావ్ ఎంతో నిజాయితీతో మెలిగేవారు. పవార్ తల్లి శారదా బాయి వామపక్ష భావాలు కలిగిన కలిగిన రాజకీయ, సామాజిక కార్యకర్త. పూణే లోకల్ బోర్డుకు ఎన్నికైన మొదటి మహిళ. రాజ్‌కమల్ ప్రచురించిన తన ఆత్మకథ ‘ఆన్ మై ఓన్ టర్మ్స్’లో శరద్ పవార్ తన తండ్రి క్రమశిక్షణ గల వ్యక్తి అని పేర్కొన్నారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి ఆరు గంటలకే ఆరోజు చేయాల్సిన పనులకు సిద్ధమయ్యేవారని తెలిపారు. క్రమం తప్పక వార్తాపత్రిక చదివేవారని, విధులు ముగించాక రాత్రి 8 గంటలకు నిద్రపోయేవారని, చాలా తక్కువ మాట్లాడేవారని శరద్ పవార్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. తన తండ్రి అనుసరించే కఠినమైన క్రమశిక్షణ కారణంగా పిల్లలు అతనికి దూరంగా ఉండేవారని పవార్ తెలిపారు. ‘మేము ఏదైనా తప్పు చేసినా లేదా చదువులో మంచి ఫలితాలు రాకపోయినా, నాన్నకు దూరంగా ఉండేవాళ్లం. చదువులో నా రికార్డు సరిగా లేదు. నెలవారీ రిపోర్ట్ కార్డ్‌పై నాన్న చేత సంతకం చేయించాలంటే చాలా భయం వేసేది. కానీ అమ్మ చేత సంతకం చేయించడం చాలా సులభం. అందుకే నేను రిపోర్టు కార్డుపై అమ్మ చేత సంతకం చేయించేవాడినని శరద్‌పవార్ తన ఆత్మకథలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మెట్రో రెయిలింగ్‌పై మహిళ హైడ్రామా.. మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి: -
శరద్ పవార్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ 83వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో శుభాకాంక్షలు చెప్పిన మోదీ.. ‘శరద్ పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నాను’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా దేశంలోనే అత్యంత అనుభవం కలిగిన రాజకీయ నేతలలో శరద్ పవార్ ఒకరు. శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు ఉన్నప్పటికీ పార్టీలకు అతీతంగా ఆయన పలువురు నేతలలో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తుంటారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ 1999లో ఈ పార్టీని స్థాపించారు. 27 ఏళ్ల పిన్నవయసులోనే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. నాలుగు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగానూ వ్యవహరించారు. సోనియా గాంధీ విదేశీయురాలంటూ శరద్‌పవార్ వ్యాఖ్యలు చేసిన దరమిలా పార్టీలో చీలికలు రావడంతో ఆయన ఎన్సీపీని స్థాపించారు. ఈ పార్టీ అనతి కాలంలోనే జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. అయితే ఇటీవలే ఈ ట్యాగ్‌ను కోల్పోయింది. శరద్ పవార్ మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన నేత. రాజకీయ వర్గాల్లో ఆయనను చాణక్యుడు అని కూడా పిలుస్తుంటారు. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీల మధ్య కూటమి ఏర్పాటులో శరద్‌పవార్ కీలక పాత్ర పోషించారు. ఇది కూడా చదవండి: శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు 60 గంటలపాటు పూజలు My best wishes to Shri Sharad Pawar Ji on his birthday. May he be blessed with a long and healthy life. @PawarSpeaks — Narendra Modi (@narendramodi) December 12, 2023 -
బీజేపీపై వ్యతిరేకత వస్తోందన్నారు..కానీ గడ్కరీపై ప్రశంసలు: శరద్ పవార్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ బీజేపీపై వ్యతిరేకత వస్తోందన్నారు. ఈ మేరకు ఆయన జౌరంగబాద్లో జరిగిన ప్రెస్మీట్లో మాట్లాడుతూ..కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటూ..ప్రజల్లో మార్పు వస్తుందన్నారు. మహారాష్ట్రలో చిన్న చిన్న సంఘటనలకు మత రంగు పులిముతున్నారని, ఇది మంచి సంకేతం కాదని అన్నారు. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఓటమిని చవిచూసిందన్నారు. ఈ దృష్టాంతాన్ని చూస్తుంటే బీజేపీపై వ్యతిరేకత ప్రారంభమైందని భావిస్తున్నానని చెప్పారు. ప్రజలు మనస్తత్వం ఇలానే కొనసాగితే దేశంలో జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని జ్యోతిష్కుడిని సంప్రదించాల్సిన పనిలేదన్నారు. లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం గురించి అడిగిన ప్రశ్నకు..ఎన్సీపీ చీఫ్ తన పార్టీ మిత్రపక్షాలు నుంచి చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఇలా జరగడం వల్ల పాలకులు గందరగోళంలో పడతారని తాను అనుకోవడం లేదని తేల్చి చెప్పారు. వారు లోక్‌సభ ఎన్నికలపై కూడా అంతే స్థాయిలో దృష్టి పెడతారని అన్నారు. అలాగే మహారాష్ట్రలో ప్రకటించిన తెలంగాణ మోడల్(రైతులకు ఆర్థిక సాయం)పై శరద్ పవార్ మాట్లాడుతూ..తెలంగాణ మోడల్‌కు గురించి తనిఖీ చేశానన్నారు. ఐతే తెలంగాణ చిన్న రాష్ట్రం, అలాంటి రాష్ట్రంలో ఇలాంటి సాయం ప్రకటించొచ్చు అన్నారు. అలాగే మహారాష్ట్రలో శాంతిభద్రతల పరిస్థితి, కొన్ని హింసాత్మక సంఘటనల గురించి ప్రశ్నించగా..శాంతిభద్రతలను నెలకొల్పాల్సిన బాధ్యత పాలకులపై ఉందని, కానీ అధికార పార్టీలు రోడ్డపైకి వచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టడం మంచి పరిణామం కాదన్నారు. అంతేగాదు రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత సమస్యలపై ఎన్సీపీ అధినేత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దృక్ఫథం కూడా అంత సానుకూలంగా లేదన్నారు. ఇదే క్రమంలో విలేకరులు నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో కేంద్రంలో మీకు ఇష్టమైన మంత్రి ఎవరు అని అడిగిన ప్రశ్నకు పవార్..కొంతమంది పని విషయమై వెళ్తే వివాదాస్పదంగా మాట్లాడతారు. ఉదాహరణకు నితిన్ గడ్కరీ వద్దకు వెళ్తే..అతను పార్టీ కోణంలో ఉండడు. అతను పని ప్రాముఖ్యతనే తనిఖీ చేస్తాడంటూ గడ్కరీపై ప్రశంసలు కురిపించారు శరద్ పవార్. (చదవండి: ఒడిశాలో దారుణం..డబ్బుకోసం ఆఖరికి మృతదేహాలను..) -
‘నాడు పవార్‌కు దక్కని ప్రధాని పదవి’
ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ (79)కు శనివారం పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ నేత రాహుల్ ఆయనకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపారు. 1990వ దశకంలో పవార్‌కు ప్రధానమంత్రి పదవి రెండుసార్లు అందినట్టే అంది దక్కకుండా పోయిందని ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కొన్ని పత్రికల్లో ప్రత్యేక వ్యాసాలు రాశారు. చదవండి: యూపీఏ చైర్మన్‌గా పవార్ మాకు ఓకే : సంజయ్‌రౌత్ కాంగ్రెస్‌లోని దర్బార్ రాజకీయాల వల్లే పవార్ ప్రధాని కాలేకపోయారని వెల్లడించారు. పవార్ తమ పార్టీకి విధేయుడు కాదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. దీనిపై శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పందించారు. ప్రతిభ లేని కొందరు వ్యక్తులకు పవార్ అంటే భయమని, ఆందుకే ప్రధాని పదవి దక్కకుండా చేశారని విమర్శించారు. -
మహా సర్కార్ మాదే : పవార్
ముంబై : ఎన్సీపీ చీలిక వర్గం తోడ్పాటుతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన క్రమంలో బీజేపీకి తగిన సంఖ్యాబలం లేదని, రాష్ట్రంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరుతుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. బీజేపీకి సహకరించిన పార్టీ నేత అజిత్ పవార్‌పై వేటును శరద్ పవార్ సమర్ధించుకున్నారు. ఇది ఏ ఒక్క వ్యక్తీ తీసుకున్న నిర్ణయం కాదని, ఇది పార్టీ నిర్ణయమని తేల్చి చెప్పారు. ఎన్సీపీ వైఖరికి విరుద్ధంగా అజిత్ పవార్ వ్యవహరించారని మండిపడ్డారు. ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయమని, పార్టీ తరపున ఏ వ్యక్తీ నిర్ణయం తీసుకోలేరని శరద్ పవార్ స్పష్టం చేశారు. మరోవైపు తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు సమర్పించేందుకు ఎన్సీపీ, శివసేన నేతలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఇక సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు తొలి రోజు నేడు తమ కార్యాలయాలకు హాజరవనున్నారు. -
ఈనెల 4న విపక్షనేతలతో సోనియా భేటీ
-
ఓవైపు అవార్డు ఇచ్చి.. మరోవైపు వేలెత్తిచూపడం సరికాదు
-
నేను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తా..
సాక్షి, పూణే : లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధతకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తెరదించారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి దిగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని మాధా లోక్‌సభ నియోజక వర్గం నుంచి శరద్ పవార్ బరిలో దిగనున్నారు. ఆయన మంగళవారం సాయంత్రం ఇక్కడ మాట్లాడుతూ...’ వచ్చే ఎన్నికల్లో నేను పార్లమెంట్‌కు పోటీ చేస్తా. నా మేనల్లుడు అజిత్ పవార్, అలాగే కుటుంబ సభ్యులు పార్థ్ పవార్, రోహిత్ పవార్ కానీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయరు. కేవలం శరద్ పవార్ మాత్రమే పోటీ చేస్తారు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్ కుమార్తే సుప్రియా సూలె ఇప్పటికే బారామతి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆయన మేనల్లుడు అజిత్ పవార్ కుమారుడు రోహిత్ పవార్ వచ్చేఎన్నికల్లో పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో శరద్ పవార్ స్పష్టతనిచ్చారు. కాగా తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని శరద్ పవార్.. 2012లో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2014లో మాధా స్థానం నుంచి ఆ పార్టీ నేత విజయసింహా మోహిత్ పాటిల్ గెలుపొందారు. -
మహారాష్ట్రలో సగం సీట్లు ఇవ్వాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్ధానాలకు గాను 50 శాతం సీట్లను తమ పార్టీకి కేటాయించాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. మహాకూటమిలో కీలక భాగస్వామి అయిన తమ పార్టీ చీఫ్ శరద్ పవార్ గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ సందర్భంగా ఈ ప్రతిపాదనను ముందుకుతెచ్చారని ఎన్సీపీ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమిని దీటుగా ఎదుర్కొనేందుకు ఏడెనిమిది పార్టీలతో మహాకూటమిగా ఏర్పడాలని కాంగ్రెస్,ఎన్సీపీలు నిర్ణయించాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్ధానాలకే పరిమితం కావడం, ఎన్సీపీ నాలుగు సీట్లలో గెలిచిన క్రమంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమకు 24 ఎంపీ స్ధానాలను కేటాయించాలని శరద్ పవార్ కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తున్నారు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ 26 స్ధానాల్లో పోటీ చేయగా, ఎన్సీపీ 21 స్ధానాల్లో బరిలో నిలిచింది. మహారాష్ట్రలోని లోకసభ స్ధానాల్లో సగం స్ధానాలను శరద్ పవార్ కోరుతున్నారని, సీట్ల సర్ధుబాటు చర్చలు సాగుతున్నాయని, త్వరలోనే సీట్ల కేటాయింపు ఖరారవుతుందని ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. -
రజనీకాంత్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ
న్యూఢిల్లీ: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మోడీ ఆకాంక్షించారు. భారత చలన చిత్ర పరిశ్రమలో రజనీ కాంత్ తనదైన ముద్ర వేసుకున్నారని మోదీ ప్రశంసించారు. శుక్రవారం రజనీకాంత్ 63వ జన్మదినోత్సవం. ఆయన నటించిన లింగ ప్రపంచవ్యాప్తంగా 2400 థియేటర్లలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు కూడా ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ శుక్రవారం రజనీ,శరద్ పవార్లకు ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల శరద్ పవార్ ఇంట్లో జారి పడి... కాలికి తీవ్ర గాయమైంది. దాంతో ఆయన కాలికి ముంబైలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం శరద్ పవార్ ముంబైలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం విదితమే. -
రాజకీయ కక్షతోనే బేనీవాల్ తొలగింపు:కాంగ్రెస్
జైపూర్:మిజోరం గవర్నర్ కమలా బేనివాల్ తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. మరో రెండు నెలల్లో కమలా బేనీవాల్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆమెను తొలగించడం రాజకీయ ప్రతీకార చర్యేనని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది నిజంగా రాజ్యాంగ విరుద్ధమని రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. మాజీ కేబినెట్ మంత్రి అయిన బేనీవాల్ భారతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారని అభిప్రాయపడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనంతరం గవర్నర్ గా బాధ్యతులు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నియమితురాలైన తొలగించడం వెనకు రాజకీయ కుట్ర ఉందని విమర్శించారు. ఆమె ప్రజా జీవితంతో పాటు గానీ, రాజకీయ జీవితం కూడా నిష్కల్మషమైనదని ఆయన తెలిపారు. ఇంకా బేనీవాల్ మరికొన్ని నెలలు గవర్నర్ గా సేవలు చేయాల్సి ఉండగా ఆకస్మికంగా తొలగించడం నిజంగా సిగ్గుచేటని పైలట్ తెలిపారు.ఇదిలా ఉండగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ఆమె తొలగింపును ఖండించారు. మరోవైపు బేనివాల్ తొలగింపులో ఎలాంటి రాజకీయాలు లేవని ఎన్డీఏ చెప్పుకొస్తోంది. బేనివాల్పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరించామని గురువారం పార్లమెంట్ వెలువల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. -
తొలగింపు రాజకీయ ప్రతీకారమే....
న్యూఢిల్లీ : మిజోరం గవర్నర్ కమలా బేనివాల్ తొలగింపు రాజకీయ ప్రతీకారమే అని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు. మరో రెండు నెలల్లో పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కమలా బేనివాల్పై వేటు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో బేనివాల్ తొలగింపుపై కారణాలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు బేనివాల్ తొలగింపులో ఎలాంటి రాజకీయాలు లేవని ఎన్డీఏ చెప్పుకొస్తోంది. బేనివాల్పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరించామని గురువారం పార్లమెంట్ వెలువల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. -
సోనియా గాంధీతో శరద్ పవార్ భేటీ
న్యూఢిల్లీ: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బుధవారం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీల పొత్తు గురించి పవార్ చర్చించారు. యూపీఏ మిత్రపక్షంగా ఉంటున్న ఎన్సీపీ.. కాంగ్రెస్‌తో కలసి గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగింది. మహారాష్ట్రలో ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్సీపీలు అధికారంలో ఉన్నాయి. -
మహారాష్ట్రలో బీజేపీకి పెద్ద దిక్కు
న్యూఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా వారం కిందట తొలిసారి పగ్గాలు చేపట్టిన గోపీనాథ్ ముండే మహారాష్ట్రలో బీజేపీకి పెద్దదిక్కుగా ఉండేవారు. మహారాష్ర్ట రాజకీయాలను శాసించే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను సైతం కంగు తినిపించేలా తన వ్యూహచతురతతో 1995లో బీజేపీ-శివసేన కూట మిని ఆయన అధికారంలోకి తెచ్చారు. రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతమైన మరాఠ్వాడాలో ఓ నిరుపేద బీసీ కుటుం బంలో జన్మించారు. దివంగత బీజేపీ నేత వసంత్‌రావు భాగవత్ చొరవతో రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉండే ప్రజానాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. మహారాష్ట్రలో ఆయనకున్న మాస్ ఇమేజి ఆ పార్టీలోని ఇతర కీలక నాయకులెవరికీ లేకపోవడం ముండేపై ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలిచింది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముండే డిప్యూటీ సీఎంగానూ పనిచేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి మహాకూటమిగా బరిలో నిలపడంలో ముండే కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లకుగానూ మహాకూటమి 42 సీట్లలో గెలుపొందింది. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొంది సీఎం పగ్గాలు చేపట్టాలని ఆకాంక్షించారు. 2009లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ముండే.. గతనెల 26న మోడీ కేబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖతోపాటు పంచాయతీ రాజ్, మంచినీరు-పారిశుద్ధ్య శాఖల బాధ్యతలు కూడా తీసుకున్నారు. వ్యక్తిగత జీవితం: ముండే పూర్తిపేరు గోపీనాథ్ పాండురంగ్ ముండే. 1949 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని బీడ్ జిల్లా నత్రాలో జన్మించారు. తల్లిదండ్రులు లింబాబాయి, పాండురంగ్ ముండే. ముండే బీకాం, లా పట్టాలు పుచ్చుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో జైల్లో ఉన్నారు. ముండే ముగ్గురు కుమార్తెల్లో ఒకరైన పంకజ ఎమ్మెల్యే. ఆమె బీడ్ జిల్లా పర్లీ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో కుమార్తె ప్రతిమ డాక్టర్ కాగా, చిన్న కుమార్తె యశశ్రీ న్యాయవిద్య అభ్యసిస్తున్నారు. -
ఓటమిపై కాంగ్రెస్ సమీక్ష కూడా లేదు: ఎన్సీపీ
ముంబై: యూపీఏ మిత్ర పక్షాల పట్ల కాంగ్రెస్ నాయకత్వంలో సమాచార లోపం స్పష్టంగా కనిపిస్తోందని, తాజా ఎన్నికల్లో యూపీఏ పక్షాలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిన నేపథ్యంలో జయాపజయాలపై సమీక్ష చేపట్టేందుకు సైతం ఎవరినీ సంప్రదించ లేదని యూపీఏ మిత్రపక్షం ఎన్సీపీ విమర్శించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టింది. ఈ మేరకు శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్‌లు పేర్కొన్నారు. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధిక స్థానాల నుంచి బరిలో దిగుతామని పేర్కొంటూ కాంగ్రెస్‌కు సంకేతాలు పంపారు. -
యూపీఏపై వ్యతిరేకత లేదు: శరద్ పవార్
ముంబై: యూపీఏ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న వార్తలను కేంద్ర వ్యవసాయ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌పవార్ కొట్టిపారేశారు. దేశంలో రాజకీయ పరిస్థితులపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు.. ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు, కొత్త ఓటర్లు కీలక పాత్ర వహించే అవకాశాలున్నాయని చెప్పారు. ఎన్సీపీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా శరద్‌పవార్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. 73 ఏళ్ల పవార్ ఇప్పటివరకు 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. -
రైతుకు లాభం చేకూర్చడంపై దృష్టిపెట్టండి: నాగిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తులకే ప్రాధాన్యమివ్వకుండా.. రైతుకు లాభం చేకూర్చడంపై దృష్టి పెట్టాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్) సభ్యుడు, వైఎస్సార్సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ దిగుబడుల్లో వృద్ధి ఉంటున్నా.. రైతుకు కనీస మద్దతు ధర లభించట్లేదని, రైతు కుటుంబానికి ఆహారం, వైద్యం, వారి పిల్లలకు విద్య అందక ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతును ఆదుకునేలా పరిశోధనలు జరగాలని విన్నవించారు. కేంద్ర వ్యవసాయమంత్రి శరద్ పవార్ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని వ్యవసాయ సంక్షోభంపై పలు అంశాలు లేవనెత్తారు. వ్యవసాయ పరిశోధన కేంద్రాలు లేకపోవడంతో రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని పవార్ దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ సంక్షోభ నివారణకు ప్రాంత పరిస్థితులు, పంటకు అనుగుణంగా యాంత్రీకరణ అవసరమని, ఆ దిశగా సదరన్ రీజియన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలోని మెట్టప్రాంతాల్లో సీతాఫలం, రేగు, నేరేడు సాగవుతుందని, వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెబుతూ... వీటి ఉత్పత్తికి పరిశోధన కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని సూచించారు. మత్స్య పరిశ్రమకు సంబంధించి దేశంలో 14 పరిశోధన కేంద్రాలుండగా, రాష్ట్రంలో ఒక్కటీ లేదన్నారు. చేపల ఉత్పత్తి బాగా జరిగే తూర్పుగోదావరి జిల్లాలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు లాభం చేకూర్చడానికి ఎగుమతులు, దిగుమతుల్ల విధానాల్లో మార్పులు తీసుకురావడానికి, పంట బీమా వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక విధానాల రూపకల్పనకు ఎకనామిక్ పాలసీ రీసెర్చ్ కేంద్రాన్ని 8 రీజియన్లలో పెట్టాలన్నారు. కాగా, ఐసీఏఆర్ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గైర్హాజరయ్యారు. -
పవార్ ప్రధాని అయితే సంతోషం: షిండే
షోలాపూర్: ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్‌పవార్ ప్రధాని అయితే సంతోషిస్తానని, అదే రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. పవార్ తన రాజకీయ గురువని.. ఆయనవల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. కానీ, తన వ్యాఖ్యల ప్రభావాన్ని ఆలస్యంగా గుర్తించిన షిండే వివాదం పెద్దది కాకుండా రాహుల్ గాంధీకి జైకొట్టారు. రాహుల్‌ను తదుపరి ప్రధానిని చేయడమే కాంగ్రెస్ ముఖ్య లక్ష్యమన్నారు. షిండే శనివారం మహారాష్ట్రలోని షోలాపూర్‌లో మరాఠీ పత్రికల ఎడిటర్లతో మాట్లాడారు. ప్రధాని కావాలన్న ఆశ ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. 1992 నుంచి పవార్ కూడా దాని కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారని తెలిపారు. కానీ, ఢిల్లీ రాజకీయాలకు ఆయన బాధితుడిగా మారారన్నారు. కాగా, షిండే వ్యాఖ్యలతో ప్రధాని మన్మోహన్ సింగ్ వారసుడు కాంగ్రెస్ అభ్యర్థి కాదని కాంగ్రెస్ అంగీకరించినట్లయిందని బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. పవార్ ప్రధాని కావడమన్నది షిండే పగటికల అని పేర్కొన్నారు. -
శరద్ పవార్ ప్రధాని అయితే సంతోషిస్తా: షిండే
-
పవార్ పీఎం అయితే సంతోషమే:షిండే
సోలాపూర్: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రధాని అయితే తనకన్నా సంతోషపడే వ్యక్తి ఎవరూ ఉండరని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. మరాఠా దినపత్రిక ఎడిటర్స్ తో సమావేశమైన షిండే ఈ మేరకు వ్యాఖ్యానించారు. 'నా రాజకీయ గురువు పవార్ ప్రధాని అయితే ఆనందపడే వ్యక్తుల్లో నేనే ప్రధముడ్ని. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రధాని అయితే బాగుంటుదనుకుంటారు. 1992 నుంచి ఆయన ప్రధాని కావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు' అని షిండే తెలిపారు. కాగా, కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తమ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ గట్టెక్కిస్తారన్నారు. రెండు విధానాలపై మాట్లాడానికి కారణాలు లేవని, ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత 20 సంవత్సరాల నుంచి పవార్ ప్రధాని అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీ రాజకీయాలు కారణంగా తన రాజకీయ గురువు భంగపడ్డారని షిండే పేర్కొన్నారు. -
యూపీఎ పక్షాలన్నీ ఆత్మపరిశీలన చేసుకోవాలి: శరద్‌పవార్
ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం వెలుబడిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మట్టికరిచింది. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఎన్నికలను సెమీఫైనల్స్ భావించినా తరుణంలో బీజేపీ ప్రభావానికి కాంగ్రెస్ విలవిలలాడింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూపీలో ముసలం పుట్టిందంటూ పవార్ మండిపడ్డారు. కాంగ్రెస్‌లో బలహీనమైన నాయకత్వం ఉందని, అందుచేత బలహీన నాయకత్వాన్ని ప్రజలు ఇష్టపడరన్నారు. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పరాజయం కావడంతో కాంగ్రెస్ ఇంకా బలహీనపడిపోయిందని చెప్పారు. తాజా ఫలితాల నుంచి కాంగ్రెస్ పాఠాలు నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రజలు మనపై ఎందుకు ఆగ్రహంగా ఉన్నారో కాంగ్రెస్ తెలుసుకోవాలన్నారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై యూపీఎ పక్షాలన్నీ ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ శరద్ పవార్ సూచించారు. -
పార్టీలో అంతర్గత విభేదాలు వీడండి: శరద్ పవార్
ముంబై: ఇటీవలి జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు ఎన్సీపీకి ఎంతమాత్రం మింగుడు పడడం లేదు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రతిష్ట దెబ్బతిందని ఆ పార్టీ అధిష్టానం గ్రహించింది. దీంతో మున్ముందు ఈ పరిస్థితి ఎదురుకాకుండా చేసేందుకుగాను ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ గురువారం సాయంత్రం నగరంలో ఓ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రులు, నాయకులకు ఆయన ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అంతర్గత విభేదాలు, అలసత్వం విడిచి ఇప్పటినుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఖాందేశ్, విదర్భ ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి మెరుగుపడేందుకు చొరవ తీసుకోవాలన్నారు. చెరకు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈవిధంగా ముందుకుసాగితేనే వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు పార్టీకి అనుకూలంగా వస్తాయని ఆయన హితబోధ చేశారు. గడచిన 14 సంవత్సరాల కాలంలో పార్టీ చేపట్టిన అభివృద్థి పనులను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ప్రజలు పార్టీకి దూరం కాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. మీడియాతోపాటు ఇతర సంస్థలు నిర్వహించే ఎగ్జిట్ పోల్స్‌పై ఆధార పడొద్దని, అభివృద్ధి పనులే గెలిపిస్తాయని సూచించారు. -
మా పోరుకు మద్దతివ్వండి: వైఎస్ జగన్మోహన్రెడ్డి
* ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకోవాలి: పవార్, ఠాక్రేలకు జగన్ వినతి * దేశంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగనిది ఏపీలో జరుగుతోంది * అసెంబ్లీ తీర్మానం లేకుండానే రాష్ట్ర విభజనకు కేంద్రం సిద్ధమైంది * దీన్ని అడ్డుకోకపోతే.. రేపు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాగే జరుగుతుంది * భాషాప్రయుక్త రాష్ట్రాల విభజనకు నిర్దిష్ట విధివిధానాలు ఉండాలి * ఏ రాష్ట్ర విభజనకైనా అసెంబ్లీలో, పార్లమెంటు ఉభయసభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ ఆమోదం తప్పనిసరి చేయాలి * ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్-3కు సవరణలు చేయాలి * ప్రజాస్వామ్య పరిరక్షణకు మా పోరాటానికి మద్దతు ఇవ్వాలి * ఎన్సీపీ, శివసేన అధినేతలతో భేటీల్లో విజ్ఞప్తి చేసిన జగన్ సాక్షి, ముంబై: ‘‘కేంద్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజిస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేయటమనే సంప్రదాయానికి నీళ్లొదిలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. దీనిని అడ్డుకోకపోతే రేపు ఏ రాష్ట్రాన్నైనా ఇలాగే విభజించే దుష్ట సంప్రదాయం మొదలవుతుంది. ఏ రాష్ట్ర విభజనకైనా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించటం తప్పనిసరి చేయాలి. ఏకగ్రీవ తీర్మానం కాకుంటే కనీసం మూడింట రెండొంతుల మెజారిటీ అయినా ఆమోదించాలి. శాసనసభతో పాటు పార్లమెంటు ఉభయసభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటేనే రాష్ట్ర విభజన చేపట్టాలి. ఈ దిశగా రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించాలి. ఇందుకు మీ సహకారం కావాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు చేపట్టిన మా పోరాటానికి అందరూ మద్దతివ్వాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం ముంబైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌కు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ఠాక్రేలను వేర్వేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు. అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు, ఏకపక్ష విభజనకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3ను సవరణ కోరుతూ జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తున్న జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం పార్టీ నేతలు దాడి వీరభద్రరావు, మైసూరారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్.పి.వై.రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, బాలశౌరిలతో కలిసి ముంబై చేరుకున్నారు. మధ్యాహ్నం 2:20 గంటలకు నారీమన్ పాయింట్‌లోని ైవె .బి.చవాన్ హాల్‌కు వెళ్లి శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. సుమారు గంట సేపు ఆయనతో చర్చించారు. అక్కడి నుంచి నేరుగా బాంద్రాలోని ఉద్ధవ్‌ఠాక్రే నివాసం మాతోశ్రీకి వెళ్లి శివసేన అధినేతతో జగన్ సమావేశమయ్యారు. సాయంత్రం 4:15 గంటల నుంచి దాదాపు 45 నిమిషాల పాటు ఠాక్రేతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఏకపక్ష, నిరంకుశ వైఖరి గురించి పవార్, ఠాక్రేలకు జగన్ వివరించారు. ఓట్లు, సీట్ల కోసం రాజ్యాంగంలోని మూడో అధికరణను దుర్వినియోగం చేస్తూ.. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారని నివేదించారు. దీనికి శరద్‌పవార్ స్పందిస్తూ.. ‘ముంగిట్లో ఎన్నికలు ఉండగా (రాష్ట్ర విభజనకు) కేంద్రానికి ఇంత తొందరపాటు ఎందుకు? రేపు ఎన్నికలు పూర్తయ్యాక ప్రజాభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు కదా!’ అన్న అభిప్రాయాన్ని జగన్ బృందం వద్ద వ్యక్తంచేసినట్లు తెలిసింది. అలాగే.. ఓట్లు, సీట్ల దృష్టితో రాయలసీమను కూడా నిలువునా చీల్చే క్షుద్ర రాజకీయాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని ఆ ప్రాంత సీనియర్ నాయకుడొకరు ప్రస్తావించినపుడు.. ‘అలా హేతుబద్ధత లేని విభజన సముచితం కాదు’ అని కూడా పవార్ అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఇక ఉద్ధవ్‌ఠాక్రే అయితే.. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను అన్యాయంగా విభజిస్తోందంటూ జగన్ బృందంతో ఏకీభవించారు. ఆయన పోరాటానికి పూర్తి మద్దతు తెలిపారు. ఈ భేటీల అనంతరం.. పవార్‌తో కలిసి వై.బి.చవాన్ హాల్ వద్ద, ఉద్ధవ్‌తో కలిసి మాతోశ్రీ వద్ద జగన్ మీడియాతో మాట్లాడారు. జగన్ చెప్పిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది... ‘‘ఈ దేశంలో ఎప్పుడూ జరగనిది మొదటిసారిగా జరుగుతోంది. ఎక్కడైనా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసేటప్పుడు సంబంధిత మాతృ రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానాలు ఆమోదించటం ఆనవాయితీ. ఇప్పటివరకూ అలాగే చేశారు. కానీ దేశంలో తొలిసారిగా.. అదీ ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయనగా.. ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తోంది. అసెంబ్లీలో తీర్మానం ఊసే లేకుండా విభజిస్తోంది. ఇంత అన్యాయం జరుగుతున్నపుడు పవార్ వంటి సీనియర్ రాజకీయవేత్తలు చూస్తూ ఊరుకుంటే.. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్తోనే ఆగిపోదు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే ఇదో దుష్ట సంప్రదాయానికి దారితీస్తుంది. మిగతా ప్రాంతాలకూ వ్యాపిస్తుంది. రేపు మహారాష్ట్ర కావచ్చు.. ఎల్లుండి కర్ణాటక కావచ్చు.. ఆ తర్వాత తమిళనాడు కావచ్చు.. ఇలా ఏ రాష్ట్రంలోనైనా అప్రజాస్వామిక విభజనకు కేంద్రం తెగబడవచ్చు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా 272 మంది సభ్యుల మద్దతుంటే చాలు ఇష్టానుసారం ఏ రాష్ట్రాన్నైనా విభజిస్తుంది. ఇక అధికారంలోకి రామని తెలిసిన ఏ పార్టీ అయినా ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాల విభజనకు పూనుకుంటుంది. మాతృ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా విభజనకు పూనుకుంటుంది. ప్రాంతీయంగా ఉన్న భావోద్వేగాలతో ఇలా చెలగాటమాడతారు. ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా ఖూనీ చేయటం తీవ్రమైన నేరం. విభజనకు విధివిధానాలు ఉండాలి... అరవై ఏళ్ల కిందట భాషాప్రయుక్త ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సిఫారసుల ద్వారా ఇవి ఏర్పడ్డాయి. ఇప్పుడు ఒకే భాష మాట్లాడే తెలుగు వారి రాష్ట్రాన్ని విడగొడుతున్నారు. అరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటే.. అందుకు ఒక పద్ధతి, నియమాలు, నిబంధనలు ఉండాలి. రాష్ట్ర విభజనకు అసెంబ్లీలో, పార్లమెంటులో తీర్మానం తప్పనిసరి చేయాలి. ఏకగ్రీవ తీర్మానం సాధ్యం కానపుడు కనీసం మూడింట రెండు వంతుల మెజారిటీతోనైనా ఆయా సభల్లో విభజన తీర్మానం నెగ్గాలనే నిబంధన తప్పక పెట్టాలి. ఈ మేరకు రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించాల్సిన అవసరముంది. ఈ విషయాన్ని శరద్‌పవార్‌కు బలంగా చెప్పాం. ఉద్దవ్‌ఠాక్రే సహా అందరి సహకారం కోరుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎలాంటి చర్యలు అవసరమో, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులేమిటో పవార్ అర్థం చేసుకున్నారు. విభజన ప్రక్రియను స్తంభింపజేసేలా పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభల్లో మద్దతివ్వాలని ఉద్ధవ్‌ను కోరాను. ఆయన అంగీకరించారు. అందుకు కృతజ్ఞతలు చెప్తున్నా. పొత్తులు, కూటములకన్నా విభజన అనేది చాలా పెద్ద విషయం. దయచేసి ఈ విషయాన్ని పక్కదారి పట్టించవద్దు. అందరూ ఆలోచించాల్సిన సమయమిది.’’ ముంబైలో జగన్‌కు అపూర్వ స్వాగతం... ఒక్క రోజు పర్యటన కోసం సోమవారం ముంబై చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి నగరంలో అపూర్వ స్వాగతం లభించింది. ఠాణే, నవీ ముంబైలతో పాటు నగరంలోని అనేక ప్రాంతాలకు చెందిన తెలుగు ప్రజలు ఉదయం శాంతాక్రజ్ విమానాశ్రయంతో పాటు వై.బి.చవాన్ ఆడిటోరియం వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. జగన్‌ను చూసేందుకు ఉదయం నుంచే తెలుగు ప్రజలు శాంతాక్రజ్ విమానాశ్రయం వద్ద బారులు తీరారు. ‘జగన్ జిందాబాద్, జై జగన్, జై సమైక్యాంధ్ర’ అంటూ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దపెట్టున నినదించారు. చెన్నై వెళ్లేందుకు జగన్‌కు అనుమతి సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చెన్నైకి వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు సీబీఐ కోర్టు ప్రధాన న్యాయాధికారి ఎన్.బాలయోగి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మద్దతు కోసం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసేందుకు అనుమతినివ్వాలని కోరుతూ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సోమవారం బాలయోగి విచారించారు. ఈ నెల 26 నుంచి 29వ తేదీ మధ్య ఏదో ఒక రోజు చెన్నై వెళ్లొచ్చునని, జయలలితతో అపాయింట్మెంట్ ఖరారయ్యాక, ఆ వివరాలన్నింటినీ సీబీఐకి తెలియచేయాలని బాలయోగి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ది విభజించు - పాలించు విధానం: ఉద్ధవ్ బ్రిటిష్ వారి తరహాలో కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ‘విభజించు - పాలించు’ అనే విధానాన్ని అమలు చేస్తోందని, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ విభజనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే తమ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తంచేస్తుందని స్పష్టంచేశారు. రాజ్యాంగంలోని మూడో అధికరణను దుర్వినియోగం చేయరాదన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు కోరుతూ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ నేతల బృందం తనతో భేటీ అయిన తర్వాత.. జగన్‌తో కలిసి ఠాక్రే మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్మోహన్రెడ్డి ముంబైకి ప్రత్యేక విషయమై వచ్చారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సర్వనాశనం చేయటానికి ప్రయత్నిస్తోంది. ఢిల్లీలోని పెద్దలు అక్కడ కూర్చుని ఏమైనా చేయవచ్చని భావిస్తున్నారు. వాళ్లకు ఎలా నచ్చితే అలా చేస్తున్నారు. చివరికి ఓట్ల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని మేం నిరసిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విభజనను మేం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క స్థానం కూడా లభించదని భావించిన కాంగ్రెస్ ఈ విధంగా ఎన్నికలకు ముందు ఓట్ల రాజకీయం ప్రారంభించింది. అధికారంలో ఉన్నవాళ్లు ‘విభజించు - పాలించు’ అనే రీతిలో చేస్తున్నారు. బ్రిటిష్ వారి విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానాలను మేం వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తే మేం నిరసన వ్యక్తంచేస్తాం. ఆర్టికల్-3ను కేంద్రం దుర్వినియోగం చేయకూడదు. రాష్ట్ర విభజన అవసరమైతేనే చేయాలి. జగన్మోహన్రెడ్డితో మేం ఏకీభవిస్తున్నాం. మూడో అధికరణలో సవరణలు చేయాలి. ఎక్కడైనా రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే.. తప్పనిసరిగా సంబంధిత రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. అసెంబ్లీలో తీర్మానాన్ని మెజారిటీతో ఆమోదించిన తర్వాతనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి’’ అని ఆయన స్పష్టంచేశారు. జగన్ లేవనెత్తిన అంశాలు చాలా కీలకమైనవి: పవార్ అసెంబ్లీ తీర్మానం లేకుండా ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజించటం, రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించాల్సిన అవసరంపై జగన్మోహన్రెడ్డి లేవనెత్తిన అంశాలు చాలా కీలకమైనవని తాము భావిస్తున్నామని ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ పేర్కొన్నారు. ఈ అంశాలపై తమ పార్టీ కార్యవర్గ భేటీలో నిశితంగా చర్చిస్తామని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ బృందం తనతో చర్చలు జరిపిన అనంతరం జగన్మోహన్రెడ్డితో కలిసి పవార్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని జగన్మోహన్రెడ్డి కోరారు. అయితే ఎన్సీపీ తొమ్మిది నెలల కిందటే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కానీ.. రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి జగన్ చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారు. కొన్ని న్యాయపరమైన విషయాలను ప్రస్తావించారు. ఏ రాష్ట్రాన్నైనా విభజించే ముందు రాష్ట్ర అసెంబ్లీని విశ్వాసం లోకి తీసుకోవాలన్న అంశాన్ని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీని విస్మరించి ముందుకెళ్లరాదని, అలా వెళ్తే అది తప్పుడు సంప్రదాయం అవుతుందని జగన్ నాతో అన్నారు. రాజ్యాంగంలోని మూడో అధికరణ విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఈ అధికరణను సవరించాలని, అందులో పునరాలోచనకు ఆస్కారం ఉండాలని చెప్పారు. జగన్ లేవనెత్తిన కీలకమైన ఈ రెండు అంశాలపై ఈ సమయంలో మా పార్టీ అభిప్రాయం కానీ, నిర్ణయం కానీ చెప్పలేను. కానీ మా పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుల ముందు ఈ రెండు అంశాలనూ ఉంచుతాను. వీటిపై సీరియస్‌గా చర్చిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు గల శాసనసభను, శాసనసభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్న కీలకమైన అంశాలపై నిశితంగా చర్చిస్తాం. అలా అభిప్రాయానికి వస్తాం. ఆ తర్వాత వెల్లడిస్తాం’’ అని ఆయన వివరించారు. జగన్‌తో భేటీ సందర్భంగా ఎన్నికల అవగాహనపై చర్చ జరగలేదని చెప్పారు. -
శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో వైఎస్ జగన్ భేటీ
ముంబై: రాష్ట్ర విభజన ప్రక్రియను స్తంభింపచేసేలా మద్దతు ఇచ్చేందుకు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అంగీకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కొత్త రాష్ట్రాలు ఏర్పడితే గతంలో అసెంబ్లీలో తీర్మానాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను, ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్-3ని సవరించడానికి ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపారు. లోక్‌సభలో 270 మంది మద్దతున్న ఏ పార్టీ అయినా వాళ్ల వాళ్ల ప్రయోజనాల కోసం ఏ రాష్ట్రాన్నైనా విభజిస్తారని తెలిపారు. అందుకనే ఆర్టికల్ -3ని సవరించాలని తాము ఒత్తిడి తెస్తున్నామన్నారు. మొదటిసారిగా దేశంలో ఎప్పుడూ సంభవించనిది ఇప్పుడు జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో తొలిసారిగా ఓట్లు, సీట్లకోసం కాంగ్రెస్‌పార్టీ విభజనకు పాల్పడుతోందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్ధవ్ సహా అందరి సహకారం కోరుతున్నామన్నారు. రేపు మహారాష్ట్ర, ఎల్లుండి కర్ణాటక, ఆ తర్వాత తమిళనాడునూ విభజిస్తారని మండిపడ్డారు. 2/3 మెజార్టీతో అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించడం తప్పనిసరి అవుతుందని జగన్ తెలిపారు. అధికారంలోకి రామని తెలిస్తే ఏ పార్టీ అయినా విభజనకు దిగడానికి పూనుకుంటుందని, ప్రాంతీయంగా ఉన్న భావోద్వేగాలతో ముడిపెట్టి ఇలాంటి ఆట ఆడటానికి ప్రతీ పార్టీ సిద్ధపడుతుందని తెలిపారు. -
ముంబై బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్ : జగన్మోహన్ రెడ్డి సోమవారం ముంబై బయల్దేరారు. ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజించేందుకు కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పలు రాజకీయ పక్షాల మద్దతును కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్‌తో భేటీ కానున్నారు. అలాగే మధ్యాహ్నం 3.30 గంటలకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అవుతారు. ముంబై వెళ్లిన పార్టీ ప్రతినిధి బృందంలో జగన్‌తో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎస్.పి.వై. రెడ్డి, మాజీ ఎంపీలు, ఎం.వి.మైసూరారెడ్డి, వి.బాలశౌరి, పార్టీ నేతలు దాడి వీరభద్రరావు, నల్లా సూర్యప్రకాష్లు ఉన్నారు. -
ఏకకాలంలో స్వపక్షం, విపక్షమూ అయిన పవార్‌తో జగన్ నెగ్గుకొస్తారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనని అడ్డుకోవడానికి, రాష్ట్రాల విభజన విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ దుర్వినియోగం చేయకుండా చూడటానికి జాతీయస్థాయిలో పార్టీ నేతల్ని కలిసి మద్దతు కూడగడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (సోమవారం) నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్‌ని ముంబైలో కలవనున్నారు. వామపక్ష, బీజేపీ పార్టీ నేతలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సహా ముఖ్యమైన నాయకుల్ని కలవడం ఒక ఎత్తైతే, శరద్ పవార్‌ని కలవడం ఒక్కటే మరో ఎత్తని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఎవరికి ఎప్పుడు మిత్రపక్షమో, ఎప్పుడు విపక్షమో అంతుచిక్కని శరద్ పవార్‌ని కలవడం నిజంగా అత్యంత కీలకమే. కేవలం 9 మంది ఎంపీల మద్దతుతో యుపిఏలో ముఖ్య భాగస్వామిగా కొనసాగుతున్న పవార్ కాంగ్రెస్‌కి పక్కలో బల్లెంగానే ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వేరు పడిన ఆయన, ఆ పార్టీనే ఎదిరించి నిలదొక్కుకుని మహారాష్ట్రలో మహాశక్తిగా ఎదిగారు. సోనియా విదేశీ వనిత అన్న ప్రధానమైన వాదనతో కాంగ్రెస్‌లో తిరుగుబాటు చేసి సొంత కుంపటి పెట్టుకున్న మరాఠా యోధుడిని చేరదీయడం కాంగ్రెస్‌కి తప్పలేదు. అయితే, మహారాష్ట్రలో తమ ఎన్సీపిని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని, అలాగే ఐపిఎల్ వివాదంలో ఇరికించి కావాలనే తనను ఇబ్బంది పెడుతోందన్న అభిప్రాయంతో పవార్ కాంగ్రెసు మీద ప్రచ్ఛన్న యుద్ధానికి దిగారు ఒక సమయంలో. ప్రధాని పీఠం మీద కన్నేసి మరో రకం రాజకీయ నడిపారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్థిగా యుపిఏ తరఫున బరిలోకి దిగినప్పుడు పవార్ కాంగ్రెసు పార్టీని తన డిమాండ్లతో చెమటలు కక్కించారు. కాంగ్రెసు ఒంటెత్తు పోకడ లు మానుకోవాలని, యుపిఏలోని భాగస్వామ్య పక్షాలన్నింటికీ ప్రాధాన్యత ఇవ్వాలని మరొక సందర్భంలో ఘాటైన విమర్శలు చేశారు. సీబీఐ కాంగ్రెస్ చేతిలో రాజకీయ అస్త్రం అని కామెంట్ చేయడంతో, కుటిల యంత్రాంగంలో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీయే ఆయన స్వపక్షమో, విపక్షమో అంతుపట్టక జుట్టు పీక్కొంది. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమనే ఏకైక ఎజండాతో కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తున్న నేపథ్యంలో, రాహుల్ అనుభవ శూన్యుడని వ్యాఖ్యానించి పవార్ మరోసారి తన మార్కు చాటుకున్నారు. ఇక ప్రత్యేక తెలంగాణ విషయానికొస్తే, ఆయన తమ పూర్తి మద్దతు ప్రకటించారు. తెలంగాణని ఆంధ్రప్రదేశ్ నుంచి విడగొట్టాలని భావిస్తున్న జాతీయ పార్టీలకి ఎవరి వ్యూహాలు వారికున్నాయి. కాంగ్రెస్సుకి సదా తలనొప్పిగా ఉండే పవార్ తెలంగాణాకి పూర్తి మద్దతునివ్వడం ఆశ్చర్య పరిచింది. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం అవసరంలేదంటూ వస్తున్నారు పవార్. శాసనసభ అభిప్రాయం తీసుకుంటారు గానీ, ఏకగ్రీవ తీర్మానం చేయాల్సిన అవసరం లేదంటారాయన. తెలంగాణ బిల్లుకు పార్లమెంట్లో సంపూర్ణ మద్దతు లభిస్తుందని ఆయన ధీమాగా ప్రకటిస్తూ, కాంగ్రెస్ అడ్డగోలు విభజన ప్రక్రియని గట్టిగా సమర్థిస్తున్నారు. అయితే, తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఒక పథకం వేస్తే, దానిని పవార్ మరోలా వాడుకోవడానికి సిద్ధమయ్యారని విశ్లేషకుల అంచనా. 2014 ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భను ఎజెండాగా చేసుకునేందుకు ఎన్సీపి సమాయత్తమైందని, అందుకే పవార్ ప్రత్యేక తెలంగాణాని అంతలా సమర్ధిస్తున్నారని భావిస్తున్నారు. పరస్పర విరుద్ధంగా అనిపించే అస్త్రాలని కూడా తన అమ్ములపొదిలో దాచుకుంటారని పేరున్న శరద్ పవార్‌తో జరిగే భేటీలో జగన్ ఏ వ్యూహం అనుసరిస్తారో, ఆయనుంచి అటువంటి హామీలు పొందుతారోనని రాజకీయ పరిశీలకులు వేచి చూస్తున్నారు. -
కర్షకుడి పేరు... కంపెనీల జోరు
సందర్భం: హైదరాబాద్ సదస్సులో ప్రధానోపన్యాసం బేయర్‌కంపెనీ ప్రతినిధి ఇవ్వబోతున్నాడు. ఈ కంపెనీతో మన రైతులు ఎందరో నష్టపోయారు. వారికి ఇప్పటికీ నష్ట పరిహారం రాలేదు. దీని ప్రతినిధి చిన్న రైతుల బాగు గురించి ప్రసంగించటం హాస్యాస్పదమే. ప్రపంచ వ్యవసాయ సదస్సు కు ఈసారి హైదరాబాద్ వేదిక కాబోతోంది. నవంబర్ 4-7 తేదీలలో జరిగే ఈ సదస్సు నిర్వ హణలో రాష్ర్ట ప్రభుత్వం కూడా భాగస్వామే. ఇంతకీ ఈ సదస్సు ఎవరి కోసం? ఇది మన రైతులకు ఉపయోగపడితే సంతోషమే. ఈ సదస్సులు ప్రపంచ వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో ప్రతి రెండేళ్లకు (గత పదేళ్లుగా) ఒకసారి జరుగుతున్నాయి. తొలి ఐదు అమెరికాలోనూ గత సదస్సు బెల్జియం (బ్రస్సెల్స్)లోను జరిగాయి. సదస్సులతో ప్రపంచ వ్యవసాయ అభివృద్ధికి దిశానిర్దేశనం చేయడం ఈ వేదిక ఉద్దేశం. పెరుగుతున్న ప్రపంచ జనాభాకు ఆహారం అందాలంటే అధిక ఉత్ప త్తితోనే సాధ్యమని ఇది స్పష్టం చేస్తున్నది. హరిత విప్లవా న్ని కొనసాగిస్తూ, వ్యవసాయాన్ని ఆధునీకరించాలని ఆశిం చే ప్రపంచ సంస్థలలో ఇది ఒకటి. ఇదే సూత్రాన్ని పాటించ మని ప్రైవేట్ కంపెనీలు కూడా మన ప్రభుత్వం మీద ఒత్తి డి తెస్తున్నాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ కూడా ఈ దిశగానే ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఆలోచ నలు కలిగిన వ్యక్తులు, సంస్థల కలయికే ఈ సదస్సు.చిన్న రైతులు, మహిళా రైతుల ప్రయోజనాల కోసం అని పత్రాలలో రాసుకున్నా ఆచరణలో వాటికి ప్రాధాన్యం కన పడదు. సదస్సు నిర్వాహక సంఘంలో ఒక్క మహిళ కూడా లేదు. పేరు గొప్ప... ఊరు దిబ్బ... చిన్న రైతులు లేదా వారి ప్రతినిధులకు కూడా ప్రాతినిధ్యం లేదు. నాణ్యమైన విత్తనాలు దొరక్క, వేసిన విత్తనాలు మొలకెత్తక, మొలక వచ్చినా కాయ రాక, వచ్చిన కాయకు సరైన మార్కెట్ ధర అందక రైతు ఇబ్బంది పడుతుంటే, ‘అధిక ఉత్పత్తి మా లక్ష్యం’ అనే నినాదంతో ఈ సదస్సు జరగబోతోంది. మరి సాగు సమ స్యలు ప్రస్తావించకుండా ఏం సాధిస్తారు? జన్యుమార్పిడి విత్తనాల వల్ల రైతుకు వచ్చే ప్రయోజ నం ఏమీ లేదని ఐదేళ్ల బిటీ పత్తి అనుభవంలో తేలింది. అలాంటి జన్యు మార్పిడి విత్తనాలను నెత్తికెత్తుకున్న డా॥కెన్నెత్ బేకర్ (చైర్మన్, ప్రపంచ వ్యవసాయ వేదిక) ఈ సదస్సును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం పెద్ద వ్యూహమే. డా॥కెన్నెత్ యూరోప్, ఆఫ్రికా ఖండాలలో మోన్శాంటో కంపెనీ ప్రతినిధి. మన పార్లమెంటులో, సుప్రీంకోర్టులో జన్యుమార్పిడి విత్తనాలను అనుమతిం చడం గురించి తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో ఈ సదస్సు ఏర్పాటయింది. దేశంలో విత్త నాల ఉత్పత్తిలో 90 శాతం మన రాష్ట్రంలోనే జరుగుతుంది. విత్తన కంపెనీలు, వారికి వత్తాసు పలికే రాజకీయ నాయ కులు, అధికారులు కలిసిపోయి జన్యుమార్పిడి విత్తనాల అనుమతులకు మార్గం సుగమం చేయడానికే ఈ సదస్సును తలపెట్టారు. ఈ సదస్సుకు పెట్టుబడి పెట్టే వాళ్లలో మోన్శాంటో, బెయిర్ లాంటి పెద్ద కంపెనీలు ఉండటం గమనార్హం. మొదటి ఐదు సదస్సులు అమెరికాలోని మిస్సోరీలో జరిగాయి. వాటి చర్చనీయాంశాలు ఇవి: ఒకటి (20-22 మే, 2001) వ్యవసాయంలో కొత్త శకం: ప్రపంచానికి ఆహారం. రెండు: (8-20 మే, 2003) వ్యవసాయంలో కొత్త శకం: కలిసి భవిష్యత్తు నిర్మాణం, అడ్డంకుల తొల గింపు. మూడు: (6-18 మే, 2005) శాంతి, రక్షణ, వృద్ధికి మార్గం: స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ వ్యవసాయ - ఆహార వ్యవస్థలు. నాలుగు: (8-10 మే, 2007) వ్యవ సాయ పెట్టుబడుల ద్వారా సంపద సృష్టి. ఐదు:(18-20 మే, 2009) వ్యవసాయానికి సవాళ్లు. బెల్జియంలో (29 నవంబర్ - 1 డిసెంబర్, 2011) జరిగిన ఆరో సదస్సులో అంశం ‘పెరుగుతున్న ప్రపంచ జనాభా పోషణకి వ్యవ సాయంపై పునరాలోచన. రాష్ట్రంలో జరగబోయే ఏడో సద స్సులో ‘సుస్థిర భవిష్యత్తుకు వ్యవసాయ స్వరూపాన్ని మార్చడం: చిన్న రైతుల మీద దృష్టి’ అన్న అంశాన్ని తీసుకుంటున్నారు. ఆది నుంచీ వివాదాస్పదమే 1997లో ప్రారంభమైన ప్రపంచ వ్యవసాయ వేదిక వ్యవ సాయ విధానాల మీద చర్చలను నిర్వహించే తటస్థ సంస్థ అని చెప్పుకుంటుంది. కానీ వ్యవహారంలో ఇదెక్కడా కన పడదు. వేదిక రైతుల కోసం ఏర్పాటయినది కూడా కాదు. ఇది ఏటా తమ మార్కెట్ వాటాలను పెంచుకుంటున్న బహుళజాతి కంపెనీల వ్యాపార వేదిక. ప్రపంచ వ్యవ సాయాన్ని వారి వ్యాపారాలకు అనుగుణంగా మార్చడమే ప్రధాన ధ్యేయంగా కనపడుతుంది. పెద్ద కమతాలలో ఆధునిక వనరులను పెద్ద ఎత్తున ఉపయోగించి చేసే సేద్యం గురించిన వ్యూహాలే కనిపిస్తాయి. జన్యుమార్పిడి పంటల పరిశోధన, ఉత్పత్తి, అను మతులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఉన్న వ్యాజ్యం కీలక దశకు చేరింది. కోర్టు నియమించిన టెన్నికల్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక జీవరక్షణ, భద్రత చర్యలు లేకుండా జన్యుమార్పిడి విత్తనాల క్షేత్ర పరీక్షలు నిర్వహిం చరాదని చెబుతున్నది. తీర్పు ఇంకా రావాల్సి ఉంది. అటు పార్లమెంటులో బీఆర్‌ఏఐ బిల్లు ప్రవేశపెట్టారు. దీనికి వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా అనేక అభిప్రాయాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఇది పార్లమెంటరీ స్థాయీ సం ఘం ముందుంది. ఈ సంఘం ఇప్పటికే జన్యుమార్పిడి పంటల అవసరం మన సేద్యానికి లేదని నివేదించింది. కేంద్ర వ్యవసాయ, పర్యావరణ మంత్రిత్వశాఖల మధ్య ఈ పంటలకు అనుమతి ఇవ్వడం గురించి ఏకాభిప్రాయం లేదు. ఈ తరుణంలో సదస్సు ఏర్పాటు చేయడమంటే మన వ్యవసాయ విధానాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికే. హైదరాబాద్ సదస్సులో ప్రధానోపన్యాసం బెయ ర్కంపెనీ ప్రతినిధి ఇవ్వబోతున్నాడు. ఈ కంపెనీతో మన రైతులు ఎందరో నష్టపోయారు. వారికి ఇప్పటికీ నష్ట పరి హారం రాలేదు. దీని ప్రతినిధి చిన్న రైతుల బాగు గురించి ప్రసంగించటం హాస్యాస్పదమే. తుపానులతో దెబ్బ తిన్న రైతాంగాన్ని చూడటానికి కూడా రాని కేంద్ర వ్యవసాయ మంత్రి ఈ సదస్సుకు రావాలని నిర్ణయించుకోవడం శోచ నీయం. 2011 సమావేశంలో జేమ్స్ బోల్గేర్, (చైర్మన్, అం తర్జాతీయ సలహా సంఘం) జన్యు మార్పిడి పంటల ఆవ శ్యకతను గుర్తు చేశారు. వ్యాట్ వెబ్సైట్ ప్రకారం వారి సహకారం అందించే సంస్థలలో ప్రపంచ బ్యాంకు, డబ్లు. కె.కెల్లోగ్ ఫౌండేషన్, మోన్శాంటో, టైసన్, డీఐ ఆయిల్స్, కార్పొరేట్ కౌన్సిల్ ఆన్ ఆఫ్రికా, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ద వరల్డ్ ఫుడ్ ప్రైస్ పార్టనర్షిప్ టు ఎండ్ హంగర్ ఇన్ ఆఫ్రికా. ఇవన్నీ కూడా మోన్శాంటో కంపెనీకి అనుగుణంగా పని చేస్తున్నవే. మేలు చేయని ఆలోచనలు గత సమావేశాలలో వేటిలోనూ రైతులు పాల్గొన్న దాఖ లాలులేవు. బ్రస్సెల్స్ సమావేశాలలో ప్రసంగించిన వారి లో ఎవరూ రైతులుకాదు. సమావేశాల తీరు, భాష కూడా అంతర్జాతీయమే. ఎక్కువగా, రౌండ్ టేబుల్ సమావేశాలే. వారి చర్చనీయాంశాలు ఇవి. వ్యవసాయంపైన పునరాలోచన- సమస్యలు: (వ్యవ సాయ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కడ నుంచి వస్తుం ది? ఇది నూతన ప్రపంచ ఒరవడికి దారితీస్తుందా? /రైతుల నుంచి సమాజం ఏమి ఆశిస్తుంది?/ వ్యవ సాయానికి ఆధునిక టెక్నాలజీ: సవాళ్లు./ప్రపంచ వాణిజ్య ఏర్పాటు ద్వారా ఆహార భద్రత. /గొలుసు కట్టు వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా నుంచి ఉప యోగాలు ఎలా రాబట్టాలి?) వ్యవసాయంపైన పునరాలోచన- సాధ్యమయ్యే పరి ష్కారాలు: (వ్యవసాయానికి ఒక నూతన దృష్టి: మార్కెట్ ఆధార పరిష్కారాలు./తక్కువ నుంచి ఎక్కువ: సమాజ వనరుల సుస్థిర ఉపయోగంలో మార్పులు. /వ్యవసాయంలో పెట్టుబడులకు సూత్రా లు. /వ్యవసాయంలో భవిష్యత్తు పెట్టుబడులకు ప్రోత్సాహం.) {పపంచ వ్యవసాయంపైన పునరాలోచన: భవిష్య త్తుకు అవసరమైన నిధులు, యాజమాన్యం (వ్యవ సాయ ఉత్పత్తుల మార్కెట్: నియంత్రణ అవస రమా?/వాణిజ్యం, ఆర్థిక అంశాలు.) ఈ శీర్షికలు, చర్చనీయాంశాలు సామాన్య రైతుకు కాదు, ఇది చూడగానే అర్థమవుతుంది. వ్యవసాయం మీద వ్యాపారం చేస్తున్న కంపెనీలకు ఉపయోగపడేవి మాత్రమే. ఒరిగేదేమీ లేదు... హైదరాబాద్ సదస్సులోను ఈ తరహా శీర్షిక లే ఉండబోతు న్నాయి. ఇందులో రాష్ట్రంలో పురుగు మందులు లేకుండా లక్షల ఎకరాలలో జరుగుతున్న వ్యవసాయం గురించి లేదు. చిన్న, సన్నకారు రైతులకు అవసరమైన పెట్టుబడుల ప్రస్తావన లేదు. వ్యవసాయం ద్వారా సాధ్యమయ్యే ఆహా ర భద్రత గురించీ లేదు. రైతులు ఇందులో పాల్గొనే అవకా శాలు తక్కువ. ప్రవేశ రుసుం రాష్ర్ట ప్రభుత్వం భరించినా, భాష ఒక సమస్య. అనువాదకులు ఉన్నా, సంబంధం లేని విషయాలు అర్థం చేసుకునే అవకాశం రైతులకు లేదు. ప్రపంచ వ్యవసాయ సదస్సు హైదరాబాద్‌లో నిర్వహిం చినా మనకు నష్టమే తప్ప లాభం లేదు. మన వ్యవసాయ సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. మన శాస్త్ర వేత్తలు, అధికారులు, రైతులు చర్చించుకోవాలి. ముఖ్యం గా రైతుల స్వాతంత్య్రాన్ని హరించే సదస్సులకు ప్రజా ధనం వినియోగపడరాదు. - డాక్టర్ డి.నరసింహారెడ్డి వ్యవసాయ విశ్లేషకులు -
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ?: విజయమ్మ
* భారీ వర్షాలు, వరదలతో రైతులు అల్లాడుతున్నా పట్టించుకోరా?: విజయమ్మ * వరుస విపత్తులతో అన్ని వర్గాల ప్రజలూ నష్టపోయారు * ప్రభుత్వం వారిని ఏనాడూ పట్టించుకోలేదు * రైతులను ఆదుకోవాలంటూ ప్రధానిని, కేంద్ర వ్యవ సాయశాఖ మంత్రిని కలుస్తాం * జగన్ అధికారంలోకి వస్తే రైతులను ఆదుకుంటాడని భరోసా సాక్షి, కాకినాడ/విశాఖపట్నం: ‘‘గత నాలుగేళ్లుగా వరుస తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులే కాదు అన్ని వర్గాల ప్రజలూ చితికిపోయారు. ప్రభుత్వం ఏనాడూ వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ రాష్ర్టంలో అసలు ప్రభుత్వం ఉందో.. లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల వల్ల సంభవించిన నష్టంపై ప్రధాన మంత్రికి, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌కు నివేదికలు అందజేస్తామని, రైతుల రుణమాఫీ కోసం ఒత్తిడి తెస్తామని చెప్పారు. రైతులను ఆదుకునేంతవరకూ వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుందని భరోసానిచ్చారు. జగన్ అధికారంలోకి వస్తే పోలవరంతో పాటు డెల్టా ఆధునికీకరణ పనులూ పూర్తి చేస్తారని, రైతులను అన్నివిధాలా ఆదుకుంటారని చెప్పారు. ఇటీవల భారీ వర్షాలతో నష్టపోయిన తూర్పుగోదావరి, విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో విజయమ్మ మంగళవారం పర్యటించారు. రైతులు, బాధితులను పరామర్శించారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే.. రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. తూర్పుగోదావరిలో పర్యటన అనంతరం కాకినాడలో తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘‘మూడు రోజులుగా వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించాను. రాష్ర్టంలో 42 మంది చనిపోయారు. పై-లీన్ తుపాను సమయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంవల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భారీ వర్షాల విషయంలో కూడా ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేది కాదు. మృతుల కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. ఇళ్లు కూలిపోయినవారికి ఇప్పటివరకూ ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని చెప్పడం కానీ, తక్షణ సాయం అందించడం కానీ చేయలేదు’’ అని అన్నారు. ఏడు రోజులుగా కురిసిన వర్షాలతో ప్రజలు అల్లాడుతున్నా ఒక్క అధికారి కూడా బాధితుల వద్దకు వెళ్లలేదని, ముఖ్యమంత్రి రావడానికే ఏడు రోజులు పట్టిందని దుయ్యబట్టారు. చేనేత మగ్గాల్లోకి నీళ్లు చేరి నేత కార్మికులు, వలలు, బోట్లు కొట్టుకుపోయి మత్స్యకార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘రైతులను పరామర్శించినప్పుడు ఎకరాకు రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకూ ఖర్చు పెట్టామని చెప్పారు. వీరంతా కౌలు రైతులు. పూర్తిగా నష్టపోయిన వీరిని తక్షణమే ఆదుకోవాలి. కానీ అలా జరగడం లేదు. నీలం తుపాను పరిహారం కూడా రైతులకు అందలేదు. ఏ తుపాను వచ్చినా, కరువు వచ్చినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. డెల్టా ఆధునీకరణకు రాజశేఖరరెడ్డి వందల కోట్లు కేటాయించారు. డెల్టా, డ్రెయిన్ల ఆధునీకరణ పూర్తయి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. ఎకరాకు రూ.10 వేల వ రకు నష్టపరిహారం ఇవ్వాలి. దీనితోపాటు పెట్టుబడికి తగ్గట్టుగా వారికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. వెంటనే ఇన్పుట్ సబ్సిడీ, విత్తనాలు ఇవ్వాలి. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి’’ అని డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరి తాము కబుర్లు చెప్పబోమని, ప్రధానిని, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కలిసి రైతులను ఆదుకోవాలని కోరతామని చెప్పారు. -
‘తెలంగాణ’తో ముందస్తు ఎన్నికలు: శరద్ పవార్
ముంబై: తెలంగాణ అంశంపై తాజాగా తలెత్తుతున్న పరిణామాల కారణంగా రానున్న రోజుల్లో పలువురు లోక్‌సభ ఎంపీలు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని, ఫలితంగా పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ అన్నారు. ‘ఎకనామిక్ టైమ్స్’ దినపత్రికతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, 2014 ఫిబ్రవరిలో రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో పోటీచేసి, రాజ్యసభకు వెళతానని అన్నారు. తెలంగాణ అంశం రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపగలదని, తనకు తెలిసి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలనుకుంటున్నారని చెప్పారు. వారు రాజీనామాలు చేసినట్లయితే, లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. -
ఆహార భద్రతపై శరద్ పవార్ హెచ్చరికలు
న్యూఢిల్లీ: ఆహార భద్రత బిల్లుపై శరద్ పవార్ మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు. దేశీయంగా ఆహార ఉత్పత్తులను పెంచుకోకపోతే పథకాన్ని నడపలేమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతోమాట్లాడిన ఆయన కేంద్ర వైఖరిపై విమర్శలు గుప్పించారు. ఎక్కడ నుంచో దిగుమతులు చేసుకుంటే పథకాన్ని ఎలా నడుపుతామని ఆయన మండిపడ్డారు. దిగుమతులు ఆధారంగా పథకాన్ని నడపలేమని తెలిపారు. సహాయమంత్రి కె.వి.థామస్ మాట్లాడుతూ.. ఆహార ధాన్యాలను నడపడం కష్టమైన పని అని పేర్కొన్నారు. నిజమైన లబ్ధిదారులను ఎంపికపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అసలైన లబ్ధిదారులను ఎంపిక చేస్తే భద్రత పథకానికి మేలు చేకూరుతుందని హితవు పలికారు. -
కాంగ్రెస్ ఎన్సీపీ మధ్య ముదురుతున్నవిభేదాలు
ముంబై: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య విభేదాలు ముసురుకుంటున్నాయి. ఎన్సీపీ అధిపతి శరద్ పవార్ గురువారం ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌పై నేరుగా దాడి చేయకుండా.. రాష్ట్రంలో పాలన నత్తనడకనసాగుతోందని విమర్శించారు. ‘పాలనా వ్యవహారాలు చూస్తున్న వారు సమర్థంగా వ్యవహరించక పోవడం వల్ల ఫైళ్లకు అనుమతులు మంజూరు కావడం లేదు. దీంతో పాలన స్తంభిస్తోంది. నెలలు గడుస్తున్నా ముఖ్యమైన పత్రాలపైనా సంతకాలు కావడం లేదు. ఏవైనా పనులు అనవసరం అనుకుంటే వాటిని వెంటనే తిరస్కరించాలి. నిర్ణయాలు త్వరగా తీసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌పై రచించిన ఈ పుస్తకాన్ని పవార్ ఆవిష్కరించాక మాట్లాడుతూ పైవిధంగా అన్నారు. దేశ్‌ముఖ్ సమర్థ ముఖ్యమంత్రని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టిచూస్తే చవాన్‌పై పవార్ అసంతృప్తితో ఉన్నారనే అభిప్రాయాలు వినిపించాయి. చవాన్ పాలన మందకొడిగా సాగుతోందని, కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయడం లేదని ఎన్సీపీతోపాటు కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. సీట్ల లొల్లే కారణమా ? రాబోయే ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలూ ఉమ్మడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి తమకు లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడం ఎన్సీపీకి నచ్చడం లేదని తెలుస్తోంది. ‘మారుతున్న రాజకీయ పరిస్థితులను పరిశీలించాలకే సీట్లను పెంచాలనే డిమాండ్‌ను లేవనెత్తాలని నిర్ణయించుకున్నాం’ అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు అన్నారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఎన్సీపీకి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. 2009లో ఇది 26 స్థానాల్లో పోటీ చేసింది. ‘2004లో మా పనితీరు ఆధారంగా 2009లో కాంగ్రెస్‌కు సీట్లు కేటాయించారు. ఇప్పుడు మా సామర్థ్యం మెరుగుపడింది కాబట్టి ఎంపీ స్థానాల సంఖ్య కూడా పెరగాలి. 2006లో మాకు 69 అసెంబ్లీ స్థానాలుంటే 2009లో అవి 82కు పెరిగాయి. ఎన్సీపీ స్థానాలు 71 నుంచి 62కు పడిపోయాయి’ అని సదరు నాయకుడు వివరించారు. హింగోలీ, కొల్హాపూర్, పర్భణి, అమరావతి, జల్గావ్లోని రెండు ఎంపీ సీట్లలో ఒకటిని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జల్గావ్లో ఒక ఎన్సీపీకి ఒక ఎంపీ ఉన్నాడు. ఇక ఎన్సీపీ యావత్మల్, జాల్నా, రాయిగఢ్, పాల్ఘర్ స్థానాలపై కన్నేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో ఉన్న పుణే ఎంపీ స్థానం కూడా మాకే కావాలని ఎన్సీపీ కోరుతోంది. అయితే ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే యావత్మల్కు చెందిన వారు కాగా, మాజీ సీఎం అబ్దుల్ రెహమాన్ రాయిగఢ్ సొంతస్థానం కావడ ం గమనార్హం. ఇక కాంగ్రెస్ డిమాండ్‌పై ఎన్సీపీ మండిపడుతోంది. ‘కాంగ్రెస్ మాతో పొత్తును రద్దు చేసుకొని మొత్తం 48 స్థానాల్లో పోటీ చేయొచ్చు! కొన్ని సీట్ల మార్పిడికి మాత్రం మేం సిద్ధం. మా అధిష్టానమే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని చెప్పారు. ఈసారి కేంద్రంలో అదృష్టం కలిసివస్తే పవార్‌ను ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దింపాలని ఎన్సీపీ కోరుకుంటోంది. అందుకే ఎంపీ స్థానాలపై పట్టువీడడం లేదు. దీనికితోడు ప్రతిపక్షాల ఎంపీలు కొందరు తమ పార్టీలో చేరే అవకాశం ఉండడంతో సీట్లను వదులుకోవడానికి ఎంతమాత్రమూ అంగీకరించడం లేదు. ఎన్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే నవాబ్ మాలిక్ ఈ విషయంపై స్పందిస్తూ ఢిల్లీలో జరిగిన ఒప్పందం ప్రకారం 26:22 నిష్పత్తిలో సీట్ల కేటాయింపు ఒప్పందానికి కాంగ్రెస్ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టీకరించారు. ఈ విషయమై త్వరలోనే కాంగ్రెస్‌తో చర్చిస్తామని వెల్లడించారు. ఇక చవాన్‌పై పవార్ చేసిన విమర్శలపై స్పందిస్తూ తమ అధినేత ఇంగ్లిష్ చేసిన వ్యాఖ్యలను మరాఠీలో తప్పుగా తర్జుమా చేయడం వల్ల ఇలా జరిగిందని, రెండు పార్టీల మధ్య విభేదాలేవీ లేవన్నారు. -
ఉల్లిగడ్డ ఉరుకులు!
సంపాదకీయం: పాలనలో దాదాపు పదేళ్ల అనుభవాన్ని గడించినా స్టాక్ మార్కెట్ పాతాళానికి ఎందుకు పరిగెడుతున్నదో, ఉల్లిగడ్డల ధర ఊహకందనంత వేగంగా ఎందుకు పెరుగుతున్నదో తెలియక యూపీఏ ప్రభుత్వం అయోమయంలో పడిపోయింది. ఉల్లిపాయే కాదు... కూరగాయల ధరలన్నీ గత కొంతకాలంగా పైపైకి పోతున్నాయి. పక్షం రోజుల క్రితం ధర పెరిగిన ఉల్లిగడ్డ తగ్గినట్టే తగ్గి మళ్లీ జోరందుకుంది. తన జోక్యం వల్లే పరిస్థితి చక్కబడిందని సర్కారు అనుకుంటుండగానే తిరిగి పరుగులు తీసింది. భగ్గునమండుతున్న ఉల్లి ధరను చల్లార్చడమెలాగో కేంద్రానికి తోచడంలేదు. ఢిల్లీ మొదలుకొని దేశంలోని ప్రధాన నగరాలన్నిటా ఉల్లి ధర హఠాత్తుగా కిలో రూ.60కి చేరుకున్నప్పుడు అందరిలాగే సర్కారూ ఆశ్చర్యపోయింది. అది తేరుకోకముందే అది రూ.80 వరకూ ఎగ బాకింది. ఉల్లి ఉత్పత్తి ఎక్కువుండే రాష్ట్రాల్లో అధిక వర్షాలు కురియడం, సరుకు రవాణాకు ఇబ్బందులేర్పడటంవల్ల ధరలిలా మండుతున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ సంజాయిషీ ఇస్తున్నారు. పైగా ఉల్లికి ప్రధాన మార్కెట్‌గా ఉన్న నాసిక్ ప్రాంతాన్ని కరువు చుట్టుముట్టి పంట దిగుబడి తగ్గడం కూడా ఇందుకు దోహదపడిందని ఆయన చెబుతున్నారు. ఏ సమస్యనైనా డిమాండు, సరఫరా చట్రంలో చూడటానికి అలవాటుపడి పోయిన సర్కారు ధోరణే నిత్యావసరాల ధరలను ఆకాశానికి ఎగదోస్తున్నది. ఒక ప్రాంతంలో వర్షాలు కురియవచ్చు... ఇంకోచోట కరువు కాటేయవచ్చు. కాదనలేం. కానీ, ఇప్పుడు ఉల్లి దిగుబడిపై ఆ రెండింటి ప్రభావమూ పెద్దగా లేదు. మొత్తంమీద చూస్తే దాని దిగుబడి స్థిరంగా ఉంది. ఇంకా చెప్పాలంటే గత రెండేళ్ల దిగుబడితో పోల్చినా ఈ ఏడాది అది చెక్కుచెదిరింది లేదు. దేశం మొత్తంమీద ఈ జూలై నెలాఖరుకు ఉల్లి దిగుబడి కోటీ 70 లక్షల టన్నులు. గత ఏడాది, అంతకు ముందూ కూడా ఈ సమయానికి ఇంచుమించు ఇదే దిగుబడి ఉంది. ఒక్క ఉల్లిపాయనే కాదు... ఆలుగడ్డలు, వంకాయ, టమాట వంటి దిగుబడులూ అంతే. అయినా, జూలై టోకు ధరల సూచీ చూస్తే గుండె గుభేలుమంటుంది. ఐదు నెలల గరిష్ట స్థాయికి అది చేరుకుంది. నిరుడు జూలైతో పోలిస్తే ధరలన్నీ టోకుగా 5.79 శాతం పెరిగాయి. నాసిక్ మార్కెట్లో ఉల్లి ధర క్వింటాలు రూ.5,000 దాటి పోయింది. మన రాష్ట్రంలో ఇది క్వింటాలుకు రూ.4,800 వరకూ వెళ్లింది. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో పెంచుతున్నారో, దిగుబడుల అంచనా ఎలా ఉన్నదో, తమ బాధ్యతగా చేయాల్సింది ఏమిటో ఆలోచించే యంత్రాంగం ఉన్నట్టయితే ధరల్లో ఉండగల హెచ్చుతగ్గుల విషయం ముందుగానే అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. వీటికి తోడు రవాణా సౌకర్యాలు సరిగాలేని కారణంగా వర్షాకాలంలో ఇబ్బందులేర్పడతాయని తెలియనిదేమీ కాదు. ఇలాంటి అంశాలన్నిటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అందుకు అనుగుణమైన వ్యూహాలు రూపొందించుకుని అమలుచేస్తే పరిస్థితులు ఇలా విషమించవు. కానీ, మన పాలకుల కంటే దళారులు చాలా చురుగ్గా, మెరుగ్గా ఉన్నారు. సరిగ్గా వానా కాలంలో రాబోయే సమస్యలను గమనించుకుని ముందే ఉల్లి నిల్వలను గోదాముల్లో భద్రం చేసుకున్నారు. కృత్రిమ కొరత సృష్టించి ధరలు ఆకాశాన్నంటేలా చేశారు. మన దేశంలో గోడౌన్ల కొరత తీవ్రంగా ఉంది. కూరగాయల పెంపకంలో మన దేశం రెండో స్థానం ఆక్రమిస్తుంటే, వీటిని నిల్వ ఉంచడానికి శీతల గిడ్డంగులు మాత్రం తగినంతగా లేవు. దేశం మొత్తంమీద మన గిడ్డంగుల సామర్ధ్యం 11 కోట్ల 30 లక్షల టన్నులు కాగా, అందులో కూరగాయలకిస్తున్న వాటా కేవలం 15 శాతం మాత్రమే. 1998లో ఉల్లి సంక్షోభం ఏర్పడి ఢిల్లీ, రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలు కూలిపోగా అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం భాభా అణు పరిశోధనా కేంద్రం సాయంతో నాసిక్ సమీపంలో రూ.8 కోట్లతో అత్యాధునిక యూనిట్‌కు శ్రీకారం చుట్టుంది. ఉల్లి, ఇతర దిగుబడులను ప్రాసెసింగ్ చేసి, వాటిల్లోని హానికారక బాక్టీరియాను, తేమను తొలగించడం ఈ యూనిట్ ప్రధానమైన పని. అలా చేసిన సరుకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది గనుక అందుకు అవసరమైన గిడ్డంగులను నిర్మించాలని కూడా నిర్ణయించారు. అయితే, ఆ యూనిట్ ప్రారంభమైందిగానీ అందులో ప్రాసెసింగ్ సరిగా సాగటం లేదు. గంటకు పది టన్నుల ఉల్లిని ప్రాసెస్ చేయగలిగే ఈ యూనిట్‌కు గత నాలుగేళ్లుగా ఉల్లిగడ్డలే రాలేదంటే పరిస్థితి ఎలా ఉన్నదో ఊహించుకోవచ్చు. ఇక గిడ్డంగుల నిర్మాణం సంగతి చెప్పనవసరం లేదు. ఇందిరాగాంధీ పాలనాకాలం నుంచి కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ఉల్లితో చాలా చేదు అనుభవాలున్నాయి. వాటి ధరలు పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలు పతనమవుతున్నాయి. అయినా, పాలకులెవరూ గుణపాఠాలు నేర్వడంలేదు. ధరలు పెరిగి, ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాక నిద్రలేచి కొన్ని విక్రయ కేంద్రాలను తెరవడం, హుటాహుటిన నాఫెడ్ వంటి సంస్థలను రంగంలోకి దించి, గ్లోబల్ టెండర్లు పిలిచి ఇరుగు పొరుగు దేశాల నుంచి సరుకు దిగుమతి చేసుకో వడం అలవాటైపోయింది. ఇప్పుడు ఢిల్లీలోనూ, మరికొన్ని నగరాల్లోనూ ప్రభు త్వం చేసింది ఇదే. మరో సంక్షోభం ఏర్పడినప్పుడూ ఇదే తంతు పునరావృతమవు తుంది. ఉల్లి అయినా, ఇతర కూరగాయలైనా నిల్వ ఉంచుకోవడానికి, మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి రైతులకు చేయూతనిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి. అటు రైతులూ బాగుపడతారు. ఇటు ప్రజలకు అధిక ధరల భారమూ తప్పుతుంది. కానీ, అనుభవాలెన్ని ఎదురవుతున్నా గుణపాఠాలు నేర్వని ప్రభు త్వాల వల్ల అటు రైతులు పంట దిగుబడులను తక్కువ రేటుకు విక్రయించి అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇటు సాధారణ ప్రజానీకం అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలో దళారుల పంట పండుతోంది. ఇప్పుడు ఏర్పడిన ఉల్లి సంక్షోభమైనా పాలకుల కళ్లు తెరిపిస్తుందా? అనుమానమే!