పవార్ పీఎం అయితే సంతోషమే:షిండే
సోలాపూర్: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రధాని అయితే తనకన్నా సంతోషపడే వ్యక్తి ఎవరూ ఉండరని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. మరాఠా దినపత్రిక ఎడిటర్స్ తో సమావేశమైన షిండే ఈ మేరకు వ్యాఖ్యానించారు. 'నా రాజకీయ గురువు పవార్ ప్రధాని అయితే ఆనందపడే వ్యక్తుల్లో నేనే ప్రధముడ్ని. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రధాని అయితే బాగుంటుదనుకుంటారు. 1992 నుంచి ఆయన ప్రధాని కావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు' అని షిండే తెలిపారు. కాగా, కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తమ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ గట్టెక్కిస్తారన్నారు. రెండు విధానాలపై మాట్లాడానికి కారణాలు లేవని, ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత 20 సంవత్సరాల నుంచి పవార్ ప్రధాని అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీ రాజకీయాలు కారణంగా తన రాజకీయ గురువు భంగపడ్డారని షిండే పేర్కొన్నారు.