ఓటమిపై కాంగ్రెస్ సమీక్ష కూడా లేదు: ఎన్సీపీ | Congress review does not have to give up: NCP | Sakshi
Sakshi News home page

ఓటమిపై కాంగ్రెస్ సమీక్ష కూడా లేదు: ఎన్సీపీ

Published Sat, May 24 2014 1:29 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress review does not have to give up: NCP

ముంబై: యూపీఏ మిత్ర పక్షాల పట్ల కాంగ్రెస్ నాయకత్వంలో సమాచార లోపం స్పష్టంగా కనిపిస్తోందని, తాజా ఎన్నికల్లో యూపీఏ పక్షాలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిన నేపథ్యంలో జయాపజయాలపై సమీక్ష చేపట్టేందుకు సైతం ఎవరినీ సంప్రదించ లేదని యూపీఏ మిత్రపక్షం ఎన్సీపీ విమర్శించింది.

ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టింది. ఈ మేరకు శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్‌లు పేర్కొన్నారు. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధిక స్థానాల నుంచి బరిలో దిగుతామని పేర్కొంటూ కాంగ్రెస్‌కు సంకేతాలు పంపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement