UPA
-
Lok sabha elections 2024: నేడే రెండో దశ.. 13 రాష్ట్రాలో 88 స్థానాలకు ఎన్నికలు
-
మోదీవి పచ్చి అబద్ధాలు: ఖర్గే
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలన్నీ పచ్చి అబద్ధాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పదేళ్ల పాలనలో ఆయన సర్కారు సాధించిందేమీ లేకపోవడం వల్లే ఇలా జనం దృష్టి మళ్లించేందుకు ప్రయతి్నస్తున్నారని విమర్శించారు. ‘‘కాంగ్రెస్‌పై పసలేని ఆరోపణలు, విమర్శలు తప్ప మంగళ, బుధవారాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో ఆయన చేసిన ప్రసంగంలో మరేమీ లేదు. ఎన్డీఏ అంటేనే నో డేటా అవేలబుల్ (ఏ గణాంకాలూ అందుబాటులో లేవు)! రాజ్యాంగంపై నమ్మకమే లేని వ్యక్తులు దేశ స్వాతంత్య్రం కోసం ముందుండి పోరాడిన కాంగ్రెస్‌కు దేశభక్తి గురించి నీతులు చెబుతున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. అసమర్థ పాలనతో అన్ని రంగాల్లోనూ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ మోదీపై నిప్పులు చెరిగారు. యూపీఏ హయాంలోని అభివృద్ధికి క్రెడిట్ కొట్టేస్తున్నారు. -
2004 - 2024 : కాంగ్రెస్ దింపుడు కల్లం ఆశలు
2004కు 2024కు లింకుందా? నాడు ఎన్డీయే వర్సెస్ యూపీఏ. నేడు ఎన్డీయే వర్సెస్ ‘ఇండియా’. నాటి ప్రత్యర్థులు వాజ్‌పేయి-సోనియా. నేటికీ సోనియా, ఆమె ప్రత్యర్థిగా నరేంద్ర మోదీ. ఇప్పుడు కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశలు ఎందుకు పెట్టుకుంది? మాయావతి పుట్టిన రోజైన జనవరి 15న సోనియా గాంధీ ఆమె ఇంటికి వెళ్లి మరీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడాన్ని ఒకసారి ఊహించండి. ఈ ఊహ 20 ఏళ్ల నాడు ఒక నమ్మలేని నిజం.. సోనియా ముభావి. ఎవరితోనూ కలవరు. కానీ ఆ రోజు మాయావతి ఇంటికి వెళ్లిన సోనియా గాంధీ ఆమెతో రెండు గంటల సేపు మాట్లాడారు. తర్వాత బయటికి వస్తూ.. ‘‘రానున్న ఎన్నికల్లో తమ పార్టీ బహుజన పార్టీతో పొత్తు కుదుర్చుకోబోతున్నది’’ అని ప్రకటించారు. అయితే ఆ మర్నాడే మాయావతి అలాంటి పొత్తేమీ ఉండబోదని స్పష్టం చేశారు! అందుకు ప్రతిస్పందనగా.. ‘‘మాతో పొత్తు పెట్టుకోనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని పార్టీల మీద ఒత్తిడి తెస్తోంది’’ అని సోనియా ఆరోపించారు. నాడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్నట్లే ఎన్డీయే. నాడు ప్రధానిగా ఉన్నది అటల్ బిహారి వాజ్‌పేయి. బహుజన పార్టీతో పొత్తుకోసం ప్రయత్నించినట్లే సోనియా గాంధీ నమాజ్వాది పార్టీ పొత్తు కోసం చేయిచాచారు. సోనియా ఏర్పాటు చేసిన ప్రతిపక్ష నాయకుల సమావేశానికి అమర్‌సింగ్ హాజరు అయ్యారు కానీ, ములాయం సింగ్ యాదవ్ మాత్రం పొత్తు వద్దు, 1999లో మాదిరిగా ఒంటరి పోరాటమే మేలని అన్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా పొత్తుకు ఆసక్తి చూపించలేదు. కానీ ఆయనపై కార్యకర్తల ఒత్తిడి కారణంగా కాంగ్రెస్‌తో చేయీచేయీ కలిపేందుకు బలవంతపు నవ్వులనే ఆనాడు ఆయన రువ్వారు. రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్కరు మాత్రం కాంగ్రెస్‌తో కలిసేందుకు సుముఖంగా ఉన్నారు. అయితే సీట్ల సర్దుబాటు దగ్గరే ఆయన గీచిగీచి బేరం ఆడారు. లాలూ 6 స్థానాలు మాత్రమే ఇస్తాం అంటే కాంగ్రెస్ కనీసం 10 అయినా కావాలని కోరింది. ఇక డీఎంకేతో పొత్తు. అప్పటికి (2004 నాటికి) 24 ఏళ్లుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న డీఎంకే కాంగ్రెస్‌తో కలిసి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ముందుకొచ్చింది. అయితే లాలూ మాదిరిగానే కరుణానిధి కూడా 5 లేదా 6 సీట్లు ఇవ్వగలం అన్నారు. ఆయన తరఫున టి.బాలు సోనియాతో చర్చలు జరిపారు. అవి విఫలం అయ్యాయి. అలాగే.. ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తేనే మీతో పొత్తుకు వస్తాం అని కేసీఆర్ తెగేసి చెప్పటంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గింది. జేఎంఎం కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లు కోరడంతో పొత్తుకు ముందుకు రాలేదు. ఏమైతేనేం ఆ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీయే కూటమిపై కాంగ్రెస్ యూపీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్డీయేకు 181 సీట్లు రాగా, యూపీఏకు 218 సీట్లు లభించాయి. ఎన్నికల పొత్తుకు ముందుకు రాని పార్టీలు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాయి! బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, కేరళ కాంగ్రెస్, లెఫ్ట ఫ్రంట్లకు వచ్చిన సీట్లు కూడా కలుపుకుని 543 సభ్యుల లోక్‌సభలో సౌకర్యవంతమైన 335 సభ్యుల బలంతో కాంగ్రెస్ పార్టీ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. విశేషం ఏమిటంటే.. 2004లో ఎవరి మధ్యనైతే పోటీ ఉందో వారి మధ్యనే ఈ 2024లోనూ పోటీ ఉండబోవటం. నాడు, నేడు అధికారంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే. నాడు నేడు ప్రతిపక్షంగా ఉన్నది యూపీఏ కూటమే. అయితే యూపీఏ కాస్తా ‘ఇండియా’ కూటమి అయింది. నాడు స్వయంగా సోనియాజీ వెళ్లి పొత్తు కోసం ప్రయత్నించినా పొత్తుకు ముందుకు వచ్చిన పార్టీలు తక్కువ. నేడూ ఇంచుమించుగా అదే పరిస్థితి. పొత్తుకు వచ్చిన పార్టీలు ఎక్కువే అయినా ఎన్నికల వరకు అవి కాంగ్రెస్‌తో నిలబడి ఉంటాయా అన్నది సందేహం. ఆ సందేహం కలిగించిన మొదటి వ్యక్తి నితీష్ కుమార్. మూడు రోజుల క్రితమే ఆయన ‘ఇండియా’ కూటమిని వీడిపోయి ఎన్డీయేలో కలిశారు. మమతా బెనర్జీ కూడా తాము విడిగానే పోటీ చేస్తామని అంటున్నారు. ‘ఆప్’ కూడా ఆమె బాటలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. నితీశ్ కమార్ బయటికి వెళ్లకముందు వరకు ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, ‘ఇండిపెండెంట్’ పార్టీతో కలిపి మొత్తం 28 పార్టీలు ఉండేవి. అవి: 1. కాంగ్రెస్, 2. డీఎంకే, 3. శివసేన (యు.బి.టి.), 4. సి.పి.ఐ (ఎం), 5. ఎన్.సి.పి., 6. ముస్లిం లీగ్, 7. నేషనల్ కాన్ఫరెన్స్, 8. సి.పి.ఐ., 9. ఆప్, 10. జె.ఎం.ఎం., 11. కేరళ కాంగ్రెస్, 12. కేరళ కాంగ్రెస్ (ఎం), 13. వీసీకె (విదుతలై చిరుతైగళ్ కచ్చి), 14. ఆర్.ఎస్.పి., 15. ఆర్.జె.డి., 16. ఆర్.ఎల్.డి., 17. డి.ఎం.కె., 18. సీపీఐ (ఎంఎల్) ఎల్., 19. అప్నా దళ్, 20. పీసెంట్స్ అండ్ 21. వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, 22. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, 23. పి.డి.పి., 24. ఎం.ఎం.కె., 25. కె.ఎం.డి.కె., 26. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, 27. ఇండిపెండెంట్, 28. జేడీయు. నాటి ఎన్నికల్లో వాజ్‌పేయి-సోనియా గాంధీ ప్రధాన ప్రత్యర్థులు. నేటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ-సోనియా గాంధీ ప్రధాన ప్రత్యర్థులు. ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అయినా పార్టీలో దింపుడు కళ్లెం ఆశలు మాత్రం అలాగే ఉన్నాయి. చదవండి: హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ సీఎం.. కల్పనా సోరెన్ ఎవరు? -
UPA కథ కంచికి.. పేరు మార్చుకోనున్న విపక్ష కూటమి!
ఏడు రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతున్న యునైటెడ్ ప్రొగెసివ్ అలయన్స్(UPA) (ఐక్య ప్రగతిశీల కూటమి) పేరు మార్చుకోబోతోందా?. బీజేపీపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో మరో పేరుతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో కూటమి నేతలు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు బెంగళూరు(కర్ణాటక) తాజ్ వెస్ట్ఎండ్ హోటల్ వేదిక సోమ, మంగళవారాల్లో జరగబోయే విపక్ష భేటీలో ఈ నిర్ణయమూ ఉండబోతుందనే సంకేతాలు అందుతున్నాయి. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి కూటమికి కొత్త పేరు ఉండాలనే యోచనలో ఉన్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ సహా టీఎంసీ, ఆమ్ఆద్మీ పార్టీలు పేరు మార్పుపై ఏకాభిప్రాయంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త పేరును మంగళవారం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2004-14 మధ్య రెండుసార్లు యూపీఏ కూటమి అధికారంలో కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇది కొనసాగుతోంది. సోనియా గాంధీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటికే కీలక నేతలు బెంగళూరు బాట పట్టారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఖర్గే ప్రసంగంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. 24 పార్టీల నేతలు ఈ రెండురోజుల కీలక భేటీకి హాజరు కానున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలు ఈ భేటీని నిర్వహిస్తున్నాయి. కామన్ మినిమమ్ ప్రొగ్రామ్‌తో పాటు రాష్ట్రాల వారీగా సీట్ షేరింగ్ గురించి కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. అలాగే.. సీఎంపీ కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ర్యాలీలు, నిరసనలు, సదస్సుల నిర్వహణతో పాటు ఈవీఎంల విషయంలో ఎన్నికల సంఘానికి తమ అభ్యంతరాలను సైతం విపక్ష నూతన కూటమి తెలియజేసే ఛాన్స్ ఉంది. యూపీఏ ప్రస్థానం ఇలా.. ► 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో.. ఐక్య ప్రగతిశీల కూటమి యూపీఏ కూటమి ఏర్పాటు అనివార్యమైంది. ► అప్పటికే అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి 181 సీట్లు గెల్చుకోగా.. యూపీఏ సంఖ్యాబలం 218కి చేరింది. ► అప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యా బలంలేని యూపీఏ బయటి పార్టీల మద్దతును కూడదీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ► లెఫ్ట్ ఫ్రంట్‌కు చెందిన 59 మంది ఎంపీలు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 39 ఎంపీలు, బహుజన్ సమాజ్ పార్టీ 19 మంది ఎమ్మెల్యేలు.. యూపీఏలో చేరకుండానే మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. ► గతంలో.. యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే కూటమి, పీవీ నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకు ముందూ వీపీ సింగ్, చంద్రశేఖర్‌ల నేతృత్వంలోని మైనార్టీ ప్రభుత్వాలు పాటించిన విధానాన్నే యూపీఏ పాటించి అధికారం చేపట్టింది. ► 2009-14 మధ్య కూడా.. యూపీఏ 2 కూటమి అధికారంలో కొనసాగింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమి 262 సీట్లు గెల్చుకోగా.. అందులో కాంగ్రెస్ 206 స్థానాలు దక్కించుకుంది. అయితే.. అప్పటికే కుంభకోణాలు యూపీఏ-2ను కుదిపేయడం ప్రారంభించాయి. ► అటుపై పలు రాజకీయ సమీకణాలు, ఇతరత్రా పరిణామాలు కూటమిని ఘోరంగా దెబ్బతీశాయి. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 60 సీట్లు మాత్రమే గెల్చుకోగలిగింది యూపీఏ కూటమి. అందులో ఒకే ఒక్క రాష్ట్రంలో అధికారం కైవసం దక్కించుకుంది. ► 2015-19 నడుమ.. యూపీఏ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. యూపీఏ కూటమి బలహీనపడుతూ వచ్చింది. ► ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఏకంగా 91 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అందునా కాంగ్రెస్ 52 స్థానాలను దక్కించకుంది. తద్వారా లోక్‌సభలో ప్రతిపక్ష హోదా(10 శాతం సీట్లు గెలిచి తీరాలి) కూడా దక్కించుకోలేని స్థితికి చేరుకుంది. ► ఆ తర్వాత కూటమి నుంచి కొన్ని పార్టీలు బయటకు వెళ్లడంతో.. యూపీఏ ఘోరంగా కుదేలు అయ్యింది. ► 2020 నుంచి యూపీఏలో మరిన్ని పార్టీలూ చేరుతూ వచ్చాయి. అయినప్పటికీ పలు రాష్ట్రాల ఎన్నికల్లో కూటమికి చేదు అనుభవమే ఎదురవుతూ వస్తోంది. ► అయితే తాజాగా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి ఘన విజయం సాధించింది యూపీఏను లీడ్ చేస్తున్న కాంగ్రెస్. ఈ ఉత్సహాంతో యూపీఏను సంస్కరించి.. కొత్త పేరుతో ముందుకు సాగాలని భావిస్తున్నట్లు సమాచారం. -
'అడ్డంకులు సృష్టిస్తున్నా ఆగని ప్రగతి.. కేంద్రం ఒత్తిళ్లకు తలొగ్గం'
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా రాష్ట్రాన్ని పురోభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం ఒత్తిడికి తలొగ్గబోమని, ప్రభుత్వ రంగ ఆస్తులు విక్రయించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆదివారం శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్రం ఇప్పటివరకు రూ.4.06 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు అమ్మిందని చెప్పారు. రాష్ట్రాలపై కూడా ఈ మేరకు ఒత్తిడి తెస్తోందని, అమ్మితే రాయితీలు ఇస్తామంటూ ప్రలోభ పెడుతోందని, అందుకు అంగీకరించకపోతే నిధులు రాకుండా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టాలని, రైతుల బోర్లకు మీటర్లు పెట్టాలని వెంటబడ్డా తాము అంగీకరించలేదన్నారు. అలా చేస్తేనే రుణ పరిమితిని పెంచుతామన్నా తలొగ్గలేదని స్పష్టం చేశారు. కేంద్రం చెప్పినట్టు వింటే రూ.30 వేల కోట్లు వచ్చేవని, కానీ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని భావించి తిరస్కరించామన్నారు. సీనియర్లు ఖండించాలి.. రాజకీయ పారీ్టల నేతలు ఇటీవల పేల్చేస్తాం, కూల్చేస్తామంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, ఆయా పారీ్టల్లో టి.జీవన్‌రెడ్డి వంటి సీనియర్ నేతలు అటువంటి వ్యాఖ్యలను ఖండించాలని హరీశ్‌రావు సూచించారు. ఆ పారీ్టల విధ్వంస భాషను తెలంగాణ ప్రజలు మన్నించరని, వారికి పడే ఓట్లు కూడా పడవని పేర్కొన్నారు. మిగిలిపోయిన దాదాపు 9.5 కి.మీ శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పని ప్రస్తుత పద్ధతుల్లోనే వచ్చే సంవత్సరంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ.. టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీనే ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే విద్యుత్ కొనుగోళ్లు వంటి వాటికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు. వడ్డీలేని రుణాల చెల్లింపునకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాగా ద్రవ్యవినిమయబిల్లుకు ఆమోదం తెలిపాక సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. యూపీఏనే నయం.. మోదీ సర్కార్ కన్నా అంతకుముందు పాలించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏనే కొంత నయమని హరీశ్‌రావు అన్నారు. మోదీ ఏలుబడిలో జీడీపీ తగ్గిందని, అప్పులు పెరిగాయని, ప్రైవేటీకరణతో ఉద్యోగాలు ఊడాయని చెప్పారు. మూలధనం పెంచడంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజల సొమ్మును అదాని దారి మళ్లించిన తీరుపై హిడెన్ బర్గ్ నివేదిక సృష్టించిన కలకలానికి మోదీ సమాధానం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తప్పు చేయబట్టే ప్రజలకు సమాధానం ఇవ్వడం లేదని అన్నారు. చదవండి: సభలో నవ్వులే నవ్వులు..ప్రధాని భజన బృందంపై పిట్ట కథను వినిపించిన సీఎం కేసీఆర్ -
యూపీఏ, ఎన్డీఏ.. తేడా అదే.. మోదీ ఏం చెప్పారంటే?
సాక్షి,న్యూఢిల్లీ: యూపీఏ, ఎన్డీఏ పాలన మధ్య వ్యత్యాసం ఏంటో చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. తమ ప్రభుత్వం స్థిరమైనదని, విధానాల రూపకల్పన, పరిపాలనతో స్థిరత్వం తీసుకొచ్చిందని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ మండీలో బీజేపీ శనివారం నిర్వహించిన యువ సంకల్ప్ ర్యాలీకీ మోదీ వర్చువల్‌గా హాజరై ఈమేరకు మాట్లాడారు. ప్రతికూల వాతావరణ పరిస్థితి కారణంగా తాను సభకు ప్రత్యక్షంగా రాలేకపోయినట్లు చెప్పారు. కొన్ని దశాబ్దాల పాటు దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. అందుకే సుపరిపాలన విషయంలో అస్థిరత ఉండేదని పేర్కొన్నారు. ఆ కారణంగానే ప్రపంచ దేశాలు భారత్‌పై సందేహాస్పదంగా ఉండేవన్నారు. కానీ 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ప్రధాని అన్నారు. విధానపరమైన నిర్ణయాలు, పరిపాలనలో స్థిరత్వం వచ్చిందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారేవని, కానీ బీజేపీ స్థిరమైన పాలన చూసి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తమకే పట్టంగట్టారని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వానికి స్థిరత్వం ముఖ్యమని ప్రజలు గుర్తించారని చెప్పారు. చదవండి: దారుణం.. ఉపాధ్యాయుడిపై పదో తరగతి విద్యార్థి కాల్పులు -
బలపరీక్షలో నెగ్గిన జార్ఖండ్ సీఎం
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష జరిగింది. సీఎం హేమంత్ సోరెన్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన వెంటనే సభలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సోరెన్. అనంతరం దీనిపై కాసేపు చర్చ జరిగింది. ఆ తర్వాత నిర్వహించిన ఓటింగ్‌లో సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌కు ముందే బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో మెజారిటీకి 42 సీట్లు అవసరం. విశ్వాస పరీక్ష సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సోరెన్. కమలం పార్టీ ప్రతిరోజు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఆ పార్టీ పని చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు గొడవలు సృష్టించి దేశంలో పౌర యుద్ధం తరహా పరిస్థితులు తీసుకురావాలని చూస్తోందని ధ్వజమెత్తారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా జార్ఖండ్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారని సోరెన్ ఆరోపించారు. జార్ఖండ్‌లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు బీజేపీ ప్రయత్నాలేవీ ఫలించవని స్పష్టం చేశారు. ఆ పార్టీకి రాజకీయంగా తగిన రీతిలో బదులిస్తామన్నారు. ముందు రోజు రాంచీకి వచ్చిన ఎమ్మెల్యేలు.. బలపరీక్ష నేపథ్యంలో అధికార యూపీఏకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు ఆదివారం ఛత్తీస్‌గఢ్ నుంచి తిరిగి రాంచీకి చేరుకున్నారు. ఆగస్ట్ 30 నుంచీ వీరు రాయ్‌పూర్‌లోని ఓ విలాసవంతమైన రిసార్టులో మకాం వేసిన విషయం తెలిసిందే. తమ సంకీర్ణాన్ని ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నిస్తుందన్న అనుమానాల మధ్య సీఎం హేమంత్ సోరెన్ ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం జార్ఖండ్ గవర్నర్‌కు లేఖ రాయడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి దారి తీసిన విషయం తెలిసిందే. చదవండి: ‘2024లో బీజేపీకి రెండే సీట్లు.. ఎక్కడ మొదలయ్యారో అక్కడికే’ -
బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీపై కేసు
రాంచీ: బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీలపై కేసు నమోదైంది. జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ విమానాశ్రయంలో సూర్యాస్తమయం తర్వాత వీరి చార్టెడ్ ఫ్లైట్‌ను టేకాఫ్ చేయమని అధికారులను బలవంతం చేశారనే ఆరోపణలతో ఈ ఇద్దరితో పాటు మరో ఏడుగురిపై అభియోగాలు మోపారు పోలీసులు. ఇప్పటికే రాజకీయ సంక్షోభంలో ఉన్న జార్ఖండ్‌లో తాజా పరిణామం చర్చనీయాంశమైంది. దేవ్‌ఘర్ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది జులైలోనే ప్రారంభించారు. అయితే ఈ ఎయిర్‌పోర్టులో సూర్యాస్తమయానికి అరగంట ముందు నుంచి కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి లేదు. కానీ అవేమీ పట్టించుకోకుండా బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబె, మనోజ్ తివారీ ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గదిలోకి వెళ్లి తమ చార్టెట్ ఫ్లైట్ క్లియరెన్స్‌కు అనుమతి ఇవ్వాలని బలవంతం చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారి ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఆగస్టు 31న సూర్యాస్తమయం తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ విషయంపై ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఇన్ఛార్జ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిశికాంత్ దూబె, దేవ్‌ఘర్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మంజునాథ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎంపీ నిశికాంత్ మంజునాథ్‌పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన పని తాను చేసుకుంటుంటే ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేసిన అనంతరం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సోరెన్ ఆరోపించారు. ముందు జాగ్రత్తగా యూపీఏ ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లోని రిసార్టుకు తరలించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు జార్ఖండ్‌లో పర్యటించడం, వారిపై కేసు నమోదు కావడం రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను మరింత పెంచింది. చదవండి: నితీశ్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకీ ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు -
జార్ఖండ్ సీఎంకు టెన్షన్ టెన్షన్.. బ్యాగ్‌లు ప్యాక్ చేసుకున్న ఎమ్మెల్యేలు
రాంఛీ: సీఎం హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేసిన నేపథ్యంలో జార్ఖండ్‌లో అస్థిరత నెలకొంది. యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని సోరెన్ ఆరోపించారు. ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యేలను శనివారం తన నివాసానికి పిలిపించారు. చాలా మంది ఎమ్మెల్యేలు లగేజీతో పాటు సీఎం ఇంటికి వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యేలను ఎవరూ ప్రలోభాలకు గురి చేసే వీలు లేకుండా అందరినీ కుంటీ జిల్లాలోని గెస్ట్ హౌస్‌కు తరలించారు సోరెన్. పటిష్ఠ భద్రత నడుమ రెండు బస్సుల్లో వీరిని అక్కడకు తీసుకెళ్లారు. ప్రయాణంలో వారితో పాటు బస్సులో సెల్ఫీ దిగారు. దీంతో రిసార్ట్ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వీరందరినీ గెస్ట్ హౌస్‌కు తరలించడానికి ముందు మూడు సార్లు సమావేశాలు నిర్వహించారు సోరెన్. Two buses, carrying Jharkhand MLAs, left from CM Hemant Soren's residence earlier this afternoon after a meeting of the UPA legislators. Pics from inside the buses. pic.twitter.com/nGodgPV7FY — ANI (@ANI) August 27, 2022 మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో యూపీఏ భాగస్వాములైన జేఎంఎంకు 30 , కాంగ్రెస్‌కు 18, ఆర్జేడీకి ఒక సభ్యుడితో కలిపి మొత్తం 49 మంది ఎమ్మెల్యేల బలముంది. ప్రతిపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రజల ఎన్నుకున్న తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని సీఎం సోరెన్ శనివారం ఓ సమావేశంలో ఆరోపించారు. ప్రజల మద్దతు తమకే ఉన్నందుకు ఎలాంటి ఆందోళనా లేదని చెప్పారు. తన చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘం చేసిన సూచన మేరకు గవర్నర్ ఆయన ఎమ్మెల్యే పదవిని శుక్రవారం రద్దు చేశారు. అయితే మిత్రపక్షాల మద్దతుతో సోరెన్ సీఎంగా కొనసాగవచ్చు. మరో ఆరు నెలల్లో తిరిగి శాసనసభకు ఎన్నికకావాల్సి ఉంటుంది. చదవండి: రాహుల్ పాన్ ఇండియా స్టార్.. అంత ఆదరణ కాంగ్రెస్‌లో ఎవరికీ లేదు -
ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం
-
ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ గెలుపు
Live Updates: ►ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ గెలుపు ►జగదీప్ ధన్కర్కు 528 ఓట్లు ►మార్గెరెట్ అల్వాకు 182 ఓట్లు ► చెల్లని ఓట్లు 15 ►పోలైన ఓట్లు 725 ► 92.9 శాతం పోలింగ్ ►ఉప రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 725 మంది ఎంపీలు ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్నారు. రాజ్యసభలో ఎనిమిది ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి ► ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ► పార్లమెంట్ హౌస్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగింపు దశకు చేరుకుంది. సాయంత్రం తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ► ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు 93శాతం పోలింగ్ నమోదైంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది. Discharged my absolute privilege as well as constitutional responsibility. Voted in the #VicePresidentialElection in the Parliament House. pic.twitter.com/exlafU8nYs— Kiren Rijiju (@KirenRijiju) August 6, 2022 ►ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీలు శశిథరూర్, జైరామ్ రమేశ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఓటేశారు. అదే విధంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ, బీజేపీ ఎంపీ హేమమాలిని, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. BJP MP Hema Malini casts her vote for the Vice Presidential election, at the Parliament in Delhi. pic.twitter.com/4wQyDFL5My— ANI (@ANI) August 6, 2022 ►ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు ఓటు వేశారు. ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్కర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. Delhi | Congress MP Rahul Gandhi casts his vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/NKV8JZhRvD— ANI (@ANI) August 6, 2022 ►ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఆప్ ఎంపీలు హర్బజన్ సింగ్, సంజయ్ సింగ్, డీఎంకే ఎంపీ కనిమొళి, బీజేపీ ఎంపీ రవికిషన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Delhi | AAP MPs Harbhajan Singh and Sanjay Singh, DMK MP Kanimozhi and BJP MP Ravi Kishan cast their votes for the Vice Presidential election. pic.twitter.com/SPs5bcSEl7— ANI (@ANI) August 6, 2022 ► కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. Delhi | Union ministers Nitin Gadkari and Dharmendra Pradhan cast votes for the Vice Presidential election at Parliament pic.twitter.com/Z5irlDxbWm— ANI (@ANI) August 6, 2022 ► కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్ రామ్ మెఘ్వాల్, వీ మురళీధరన్ ఓటు వేశారు. Delhi | Union Ministers Gajendra Singh Shekhawat, Arjun Ram Meghwal and V Muraleedharan cast their votes for the Vice Presidential election. pic.twitter.com/2roDcox6yi— ANI (@ANI) August 6, 2022 ► కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Delhi | Union Home Minister Amit Shah casts his vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/eH75fIzcRe— ANI (@ANI) August 6, 2022 ► మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ ఛైర్‌పై వచ్చి ఓటు వేశారు. Delhi | Former Prime Minister and Congress MP Dr Manmohan Singh arrives at the Parliament to cast his vote for the Vice Presidential election. pic.twitter.com/OK0GsY5npL— ANI (@ANI) August 6, 2022 ► ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi casts his vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/cJWlgGHea7— ANI (@ANI) August 6, 2022 ► ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ► ప్రస్తుత ఉప రాష్టపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగిసిపోనుంది. 80 ఏళ్ల వయసున్న మార్గరెట్ ఆల్వా కాంగ్రెస్‌లో సీనియర్ నాయకురాలు . రాజస్థాన్ గవర్నర్‌గా పని చేశారు. 71 ఏళ్ల వయసున్న జగ్దీప్ రాజస్థాన్‌కు చెందిన జాట్ నాయకుడు. ► మార్గరెట్ ఆల్వాకు కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, టీఆర్ఎస్, ఆప్ మద్దతు తెలుపుతున్నాయి. ► జేడీయూ, వైఎస్సార్సీపీ, బీఎస్పీ, ఏఐఏడీఎంకే, శివసేన వంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్డీయే అభ్యర్థికి 515 ఓట్లు పోలయ్యే అవకాశాలున్నాయి. ► టీఎంసీకి లోక్‌సభలో 23 మంది, రాజ్యసభలో 16 మంది సభ్యుల బలం ఉండడం, విపక్ష పార్టీల్లో నెలకొన్న అనైక్యతతో జగ్దీప్ విజయం దాదాపుగా ఖరారైపోయింది. ► తమతో మాట మాత్రంగానైనా సంప్రదించకుండా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీలు అభ్యర్థిని ఖరారు చేశారన్న ఆగ్రహంతో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించింది. ► నామినేటెడ్ సభ్యులకి కూడా ఓటు హక్కుంది. ఉభయ సభల్లోనూ 788 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అందరూ ఎంపీలే కావడంతో వారి ఓటు విలువ సమానంగా ఉంటుంది. ► పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్డీయే అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ నేతమార్గరెట్ ఆల్వా పోటీ పడుతున్నారు. పార్లమెంటు హౌస్‌లో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ వెంటనే ఓట్లులెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. -
Presidential election: బీజేపీ ‘ఏకాభిప్రాయ’ మంత్రం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలని బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మిత్రులతో పాటు వితిపక్ష యూపీఏ భాగస్వాములతోనూ, ప్రాంతీయ పార్టీలతోనూ సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నా«థ్సింగ్లకు ఈ బాధ్యత అప్పగించింది. అన్ని పార్టీ ల నేతలతో వారు చర్చలు జరుపుతారని ఆదివారం ప్రకటించింది. వారిద్దరూ త్వరలో రంగంలోకి దిగనున్నారు. రాజ్‌నాథ్‌కు పార్టీలకు అతీతంగా అందరు నేతలతోనూ సత్సంబంధాలున్నాయి. 2107 రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్‌ను అభ్యర్థిగా ఖరారు చేశాక చివరి క్షణాల్లో తమను సంప్రదించాయని విపక్షాలు ఆరోపించడం తెలిసిందే. ఈసారి వాటికా అవకాశం ఇవ్వరాదన్నదే బీజేపీ తాజా నిర్ణయం వెనక ఉద్దేశమని చెబుతున్నారు. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించడంపై 15న చర్చించుకుందామంటూ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు పలు పార్టీలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ లేఖ రాయడం తెలిసిందే. ఆ మర్నాడే బీజేపీ ఏకాభిప్రాయ సాధనకు తెర తీయడం ఆసక్తిగా మారింది. 2017లోనూ రాష్ట్రపతి ఎన్నికపై చర్చలు, సంప్రదింపులు జరిపిన బీజేపీ కమిటీలో అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడుతో పాటు ఆయన కూడా ఉన్నారు. ఆ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ బరిలో దిగడం తెలిసిందే. -
యూపీఏ చైర్మన్‌గిరీపై ఆసక్తి లేదు
పుణె: బీజేపీ వ్యతిరేక కూటమికి సారథ్యం వహించబోనని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. యూపీఏ కూటమికి చైర్మన్‌గా ఉండాలన్న ఆసక్తి కూడా తనకు లేదని ఆదివారం మీడియాతో అన్నారు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిర్మించే ఏ వేదికలోనైనా కాంగ్రెస్‌ను దూరంగా ఉంచలేమన్నారు. ‘‘బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తా. ఇప్పుడూ అదే ప్రయత్నాల్లో ఉన్నా. కూటమి కట్టాలంటే విపక్షాలు కొన్నింటిని మర్చిపోవాలి. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పశ్చిమబెంగాల్లో బలమైన పార్టీ. ఇతర ప్రాంతీయ పార్టీలూ తమ రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామంలోనూ ఆ పార్టీకి కార్యకర్తలున్నారన్నది వాస్తవం. అందుకే బీజేపీ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటులో కాంగ్రెస్‌ను కలుపుకుని పోవడం తప్పనిసరి. దేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం నెలకొనాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఒక్క పార్టీయే ఉంటే రష్యాలో పుతిన్ నాయకత్వంలా ఉంటుంది’’ అన్నారు. హిందువులే గాక ఇతర మతస్తులు కూడా ఆగ్రహావేశాలకు లోనయ్యేలా కశ్మీరీ ఫైల్స్ సినిమాను చిత్రీకరించారని విమర్శించారు. ‘‘పాక్ అనుకూల వర్గం అప్పట్లో కశ్మీర్ లోయలో హిందువులతోపాటు ముస్లింలపైనా అరాచకాలకు పాల్పడింది. కాపాడాల్సిన నాటి ప్రభుత్వం హిందువులను రాష్ట్రం వదిలి పొమ్మంది’’ అన్నారు. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం సామాన్యుడిపైనే గాక నిత్యావసరాల ధరలు, రవాణా ఖర్చులపైనా పడుతోందని పవార్ విమర్శించారు. -
మొత్తం మీరే చేశారు! టాటా చేతికి ఎయిర్ ఇండియా, లోక్ సభలో ఆసక్తికర చర్చ!
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్‌నకు విక్రయించడంపై ప్రతిపక్షాల విమర్శలను పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తిప్పికొట్టారు. లాభాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియా భారీ నష్టాల్లో కూరుకుపోవడానికి యూపీఏ పాలనా విధానాలే కారణమని అన్నారు. ప్రజా ధనం సంరక్షణే లక్ష్యంగా కేంద్రం ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. లోక్‌సభలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్‌పై ఎనిమిది గంటల పాటు జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇస్తూ... ఎయిర్ ఇండియా–ఇండియన్ ఎయిర్‌లైన్స్ విలీనం, 111 కొత్త విమానాల కొనుగోలు, ద్వైపాక్షిక హక్కుల సరళీకరణ, ఎయిర్ నష్టాలకు కారణాల వంటి అశాలను ప్రస్తావించారు. తప్పని పరిస్థితిలోనే... మంత్రి ప్రకటన ప్రకారం, 2005కి ముందు ఎయిర్ ఇండియా ఏడాదికి రూ.15 కోట్లు, ఇండియన్ ఎయిర్‌లైన్స్ రూ.50 కోట్ల లాభా లను ఆర్జించేవి. ఈ విమానయాన సంస్థలు దాదాపు రూ. 55,000 కోట్లతో 111 విమానాలను కొనుగోలు చేయడం సంస్థలను తీవ్ర నష్టాల్లోకి నెట్టాయి. 14 సంవత్సరాల్లో రూ.85,000 కోట్ల నష్టాలు, రూ.54,000 కోట్ల ప్రభుత్వ ఈక్విటీ ఇన్ఫ్యూషన్, రూ.50,000 గ్రాంట్లు, రూ.66,000 కోట్ల నికర అప్పులు వెరసి ఎయిరిండియాను దాదాపు రూ.2.5 లక్షల కోట్ల సంక్షోభంలోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లోనే ప్రధానమంత్రి ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్కు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఉద్యోగుల తొలగింపు ఉండదు మొదటి సంవత్సరంలో ఉద్యోగుల తొలగింపులు ఉండవని టాటాలతో షేర్‌హోల్డర్ ఒప్పందం స్పష్టంగా పేర్కొన్నదని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. మొదటి సంవత్సరం తర్వాత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అందజేయడం జరుగుతుందని, అలాగే పదవీ విరమణ పొందిన పొందిన ఉద్యోగులకు జీజీహెచ్ఎస్ కింద వైద్య ప్రయోజనాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. -
ఎన్నికలొస్తే... కేంద్రంలో మళ్లీ బీజేపీయే
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని, ప్రధానిగా వరుసగా మూడోసారి కూడా ప్రజలు నరేంద్ర మోదీనే కోరుకుంటున్నారని సీ ఓటర్– ఇండియా టుడే సంయుక్త సర్వే తేల్చింది. నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే) సీట్ల సంఖ్య 350 నుంచి 296కు పడిపోతుందని చెప్పింది. ఎంపీల సంఖ్య 303 నుంచి 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలోనే ఉందని తేల్చింది. అయితే జాతీయ స్థాయిలో మోదీకి, బీజేపీకి ఆదరణ చెక్కుచెదరకున్నా... రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ ఏ ఒక్క సీఎంకు పూర్తిస్థాయి ప్రజాదరణ కనిపించడం లేదు. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క సీఎం కూడా సంతృప్తకర పాలన అంశంలో సగం మార్కు అయిన 50 శాతాన్ని దాటలేకపోవడం గమనార్హం. అలాగే ఐదు రాష్ట్రాల సీఎంలపైనా 34 శాతం మంది ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉండటం గమనార్హం. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగింటిలో బీజేపీ సీఎంలే ఉన్నారు. పాలన సంతృప్తకర స్థాయిలో ఉందనే అంశంలో ఐదు రాష్ట్రాల్లో పోల్చినపుడు 49 శాతం అనుకూల ఓట్లతో అందరికంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌యే ఆధిక్యంలో ఉన్నారు. విశేషమేమిటంటే వ్యతిరేకతలోనూ ఆయనే టాప్. దేశంలో అన్నింటికంటే పెద్ద రాష్ట్రమైన యూపీ, 2.13 కోట్ల ఓటర్లున్న పంజాబ్‌లతో కలిపి మొత్తం ఐదు రాష్ట్రాల్లో 18.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సర్వే దేశ జనాభాలో మొత్తం 12.8 శాతం మంది అభిప్రాయాలను ప్రతిఫలిస్తుందనుకోవచ్చు. ► ఎవరు చేశారు: (మైక్, రిసీవర్ ఫోటోస్) సీ ఓటర్– ఇండియా టుడే టీవీ సంయుక్త సర్వే ► ఎక్కడ చేశారు: ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో. ► సర్వే శాంపిల్ (ఎంతమందిని ఇంటర్వ్యూ చేశారో చెప్పే సంఖ్య): 60,141 ► తొలిదశలో: 20,566 (ఆగస్టు 16, 2021– జనవరి 10– 2022 మధ్య) ► మలిదశలో: 39,575 (గత మూడు వారాల్లో) ఎలా చేశారు: కరోనా నేపథ్యంలో ప్రత్యక్షంగా చేయకుండా టెలి ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. ప్రేమించు లేదా ద్వేషించు ఐదు రాష్ట్రాల సీఎంలతో పోల్చిచూసినపుడు అనుకూలత– వ్యతిరేకతల్లో యూపీ సీఎం యోగియే టాప్‌లో ఉన్నారు. అంటే కరడుగట్టిన హిందూత్వ వాదిగా పేరుపడ్డ యోగిని ప్రేమించే వాళ్లు ఎంత అధికంగా ఉన్నారో... ద్వేషించే వాళ్లూ అధికాంగానే ఉన్నట్లు లెక్కని ఇండియా టుడే ఎడిటోరియల్ డైరెక్టర్ రాజ్ చెంగప్ప, ఇతరు నిపుణులు అభిప్రాయపడ్డారు. సామర్థ్యాన్ని శంకించే వారు సొంత పార్టీలోనే ఎక్కువ కాంగ్రెస్‌కు ఈ వైల్డ్‌కార్డ్ బాగానే పనిచేస్తోంది. అయితే పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సామర్థ్యాన్ని శంకించే వారిలో బయటివారికంటే సొంత పార్టీలోనే ఎక్కువగా ఉన్నారు. -
బెంగాల్ బెబ్బులి జాతీయ స్వప్నం
‘యూపీఏనా? అదెక్కడుంది? ఇప్పుడది గత చరిత్ర!’ ఇది కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ గురించి ఏ ప్రత్యర్థి బీజేపీనో అన్న మాట కాదు. బీజేపీకి బద్ధశత్రువుగా యూపీఏతో కలసి నడచిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్య. మహారాష్ట్రలో శరద్ పవార్‌తో బుధవారం నాటి భేటీ అనంతరం మమత వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం. కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దె దించడానికి కాంగ్రెస్ సత్తా సరిపోవట్లేదనేది ఈ బెంగాల్ బెబ్బులి మాటల సారాంశం. ఎనిమిది నెలల క్రితం మార్చి 31న బీజేపీపై ఐక్యపోరాటం అవసరమంటూ కాంగ్రెస్ సహా 15 ప్రతిపక్షాలకు లేఖలు రాసిన దీదీ ఇప్పుడు రూటు మార్చారు. జాతీయ స్థాయిలో పగ్గాలు పట్టాలని ఆమె భావిస్తున్నట్టు ఇటీవలి పరిణామాలతో తేటతెల్లమవుతోంది. శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేతలను కలుసుకొనేం దుకు 3 రోజుల ముంబయ్ పర్యటనకు వచ్చారు మమత. ‘దేశంలోని ఫాసిజమ్ వాతావరణాన్ని ఎదుర్కోవాలంటే, బలమైన ప్రత్యామ్నాయం అవసరం’ అన్నారామె. ‘పోరాడాల్సిన వారు (కాంగ్రెస్) సమర్థంగా పోరాడకపోతే ఏం చేయాలి’ అనడం ద్వారా కాంగ్రెస్‌తో సంబంధం లేని కొత్త ప్రతిపక్ష కూటమి వాదనను పరోక్షంగా తెరపైకి తెచ్చారు. మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో పొత్తున్న ఎన్సీపీ నేత పవార్ సైతం ప్రతిపక్షాలకు బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరమని పునరుద్ఘాటిం చారు. అంటే ఇప్పుడున్న నాయకత్వం బలంగా లేదనీ, దానికి బదులు మరొకటి రావాలనీ ఆయన కూడా స్థూలంగా అంగీకరించారన్న మాట. ఇన్నాళ్ళుగా ప్రతిపక్షాలకు పెద్దన్నలా ఉంటున్న కాంగ్రెస్‌కు ఇది ఊహించని ఎదురుదెబ్బ. ‘రాజకీయాల్లో నిరంతరం శ్రమించాలి. విదేశాల్లో రోజుల తరబడి గడిపితే కుదరదు’ అంటూ రాహుల్‌పై మమత బాణాలు సంధించడం గమనార్హం. కాంగ్రెస్, తృణమూల్ సంబంధాలు దెబ్బతిన్నాయనడానికి ఇలాంటి ఎన్నో సూచనలున్నాయి. ఈ నవంబర్‌లో మమత 4 రోజులు ఢిల్లీలో పర్యటించారు. అక్కడ మోదీని కలిశారే తప్ప, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాను కలుసుకోలేదు. సరికదా... అసంతృప్త కాంగ్రెస్ నేతల్ని కలిశారు. పైపెచ్చు, ఆమె ఢిల్లీలో ఉన్నప్పుడే మేఘాలయ కాంగ్రెస్ శాఖ నిట్టనిలువునా చీలింది. మాజీ సీఎం ముకుల్ సంగ్మా వచ్చి తృణమూల్ గూటిలో చేరారు. ఒక్క సంగ్మానే కాదు... ఇటీవల ఢిల్లీలో కీర్తీ ఆజాద్, అశోక్ తన్వార్, యూపీలో లలితేశ్ త్రిపాఠీ, గోవాలో లుయిజిన్హో ఫలీరో, అస్సామ్‌లో సుస్మితా దేవ్– ఇలా హస్తం వదిలేసి, దీదీ చేయి పట్టుకున్నవాళ్ళు సమీప గతంలో అనేకులున్నారు. వారిని ఆపి, అసంతృప్తిని తీర్చలేక కాంగ్రెస్ నిస్సహాయంగా మిగిలిపోయింది. భావసారూప్య శక్తులన్నీ జాతీయస్థాయిలో కలసివచ్చి, సమష్టి నాయకత్వం పెట్టుకోవడం మంచిదే. కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ పేరిట ఇంతకాలం జరిగింది ఒకరకంగా అదే. కానీ, ఇప్పుడు టీఎంసీ లాంటివి కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయంటే, అది కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యమే. దాదాపు 135 ఏళ్ళ వయసున్న కాంగ్రెస్‌కు ఏకంగా 18కి పైగా రాష్ట్రాల్లో బలమైన ఉనికి ఉంది. ఇప్పటికీ దేశంలో ప్రధాన ప్రతిపక్షం అదే. అయితే, ప్రస్తుతం పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ – ఈ 3 రాష్ట్రాల్లోనే ఆ పార్టీ అధికారంలో ఉంది. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలో, జార్ఖండ్‌లో ద్వితీయశ్రేణి భాగస్వామిగా కొనసాగుతుండడం చేదునిజం. దేశంలో 3 నుంచి 3.5 కోట్ల మంది కార్యకర్తలు ఇప్పటికీ కాంగ్రెస్‌కు ఉన్నారని లెక్క. జాతీయ స్థాయిలో అంత బలం, బలగం ఉన్నప్పటికీ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతోంది. నాయకత్వ లేమి, రాహుల్ అపరిపక్వత, పార్టీలో అసంతృప్తి దాన్ని బీజేపీకి దీటుగా నిలపలేకపోతున్నాయి. ఫలి తంగా ప్రతిపక్షంలో శూన్యత ఏర్పడింది. అదే ఇప్పుడు మమతకు కలిసొచ్చేలా ఉంది. రాగల మూడు నెలల్లో పార్టీ రాజ్యాంగాన్నీ, చివరకు పేరును కూడా జాతీయ స్థాయికి తగ్గట్టు మార్చే యోచనలో టీఎంసీ ఉంది. కానీ, జాతీయస్థాయి విస్తరణకు దీదీ వద్ద సమగ్రవ్యూహమే ఏమీ ఉన్నట్టు లేదు. ముప్పుతిప్పలు పెట్టిన బీజేపీపై వ్యక్తిగత లెక్కలు తేల్చుకోవడమే ధ్యేయంగా కనిపిస్తోంది. తగ్గట్టే ఇప్పుడు బీజేపీ పాలిత త్రిపుర, గోవాలలో సైతం తృణమూల్ బరిలోకి దిగింది. ఈ గందరగోళంలో బీజేపీ కన్నా కాంగ్రెస్‌కే దెబ్బ తగులుతోంది. 2016లో కేవలం 3 స్థానాలున్న బెంగాల్లో ఇవాళ బీజేపీ దాదాపు 70 సీట్లకు ఎదిగింది. కానీ, గత పదేళ్ళలో అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల్లో అధికభాగం దీదీ వైపు వచ్చేశారు. గతంలో బీజేపీతో, కాంగ్రెస్‌తో దోస్తీ మార్చిన తృణమూల్ నిజానికి సిద్ధాంతాల కన్నా దీదీ ఛరిష్మాపై ఆధారపడుతున్న సంగతీ మర్చిపోలేం. రెండు సార్లు ఎంపీ, వరుసగా మూడుసార్లు బెంగాల్ సీఎం అయిన దీదీకి కావాల్సినంత అనుభవం ఉంది. పోరాటానికి కావాల్సిన దూకుడూ ఉంది. బెంగాల్లో ఈ ఏటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించిన ఘనతా ఉంది. కానీ, మోదీకి, మమత పోటీ అవగలరా? అసలు కాంగ్రెస్ లేని ప్రతిపక్షం సాధ్యమా? అలాంటి కూటమి విజయం సాధిస్తుందా? బెంగాల్ బయట తృణమూల్ విస్తరణవాదం బీజేపీనేమో కానీ, ప్రతిపక్షాలనే దెబ్బతీసేలా ఉంది. అసలు జాతీయ స్థాయిలో 2014తో పోలిస్తే, 2019లో టీఎంసీకి సీట్లు తగ్గాయనీ, కాబట్టి జాతీయ వేదికపై దాని బలం ఏమంత గొప్పగా లేదనీ కొందరు గుర్తుచేస్తున్నారు. అయినా, పాలకపక్షంతో పోరాడాల్సిన ప్రతిపక్షాలు కొత్త నాయకత్వం కోసం కలహించుకుంటే ఏమవుతుంది? పిట్ట పోరు, పిట్ట పోరు... పిల్లి తీరుస్తుంది. -
దేశంలో యూపీఏ లేదు.. మరో కూటమి ప్రయత్నం: మమతా బెనర్జీ
ముంబై: ప్రస్తుతం యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ (యూపీఏ) లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ముంబై పర్యటనలో భాగంగా మమతా బెనర్జీ.. ఎన్సీపీ నేత శరద్ పవార్‌తో బుధవారం భేటీ అయ్యారు. భేటీ అనంతరం శరద్ పవార్ మాట్లాడుతూ.. తాము పలు కీలక అంశాలపై చర్చించామని, భావ సారుప్యత ఉన్న అన్ని పార్టీలు ఏకమైతే బీజేపీకి ప్రత్యామ్నయ కూటమిగా ఏర్పడి ఓడించవచ్చని పేర్కొన్నారు. చదవండి: చనిపోయిన రైతులకు సాయం చేయలేం: కేంద్రం భాగసామ్య కూటమికి ఎవరు అధ్యక్షత వహిస్తారనే విషయం చర్చకు రాలేదని తెలిపారు. బీజేపీ వ్యతిరేకంగా ఉన్న ప్రతి పార్టీని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అన్ని పార్టీలు కలిసికట్టు ఉండి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడదామని తెలిపారు. శరద్ పవార్‌ను యూపీఏ చైర్‌పర్సన్‌గా ప్రకటించాలా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ ప్రస్తుతం యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్(యూపీఏ) ఉందా? ఇప్పుడైతే దేశంలో యూపీఏ లేదని అన్నారు. యూపీఏ చైర్పర్సన్ కూర్చుకొని అక్కడ ఆయన ఏం చేస్తారు?అని అన్నారు. చదవండి: ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్ట్! జుకర్‌బర్గ్ ప్రమేయం లేదు, కానీ.. అయతే, తాము మరో ప్రత్యామ్నయ భాగాస్వామ్య కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మంగళవారం మమతా శివసేన నేతలు సంజయ్‌రౌత్, సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక మమతా బేనర్జీ 2024 ఎన్నికల్లో పలు పార్టీలను ఏకంచేసి బీజేపీ ఓడించాలని ప్రయత్నం చేస్తున్నసంగతి తెలిసిందే. -
భారతీయుడిగా విచారిస్తున్నా..వారిని జాతి ఎప్పటికీ క్షమించదు!
సాక్షి,ముంబై: ఎల్గార్ పరిషద్ కేసులో ఉపా చట్టం కింద అరెస్టై, జైలు జీవితం గడుపుతున్న ప్రముఖ ఆదివాసీ హక్కుల ఉద్యమకారుడు ఫాదర్ స్టాన్ స్వామి (84) కన్నుమూయడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు విచారం వ్యక్తం చేశారు. ఫాదర్ స్టాన్ స్వామి అస్తమయం హక్కుల ఉద్యమానికి తీరని లోటని పలువురు రాజకీయ నేతలు, ఉద్యమ నేతలు తమ సంతాపం తెలిపారు. ప్రధానంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వామి మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఆయన న్యాయానికి, మానవత్వానికి అర్హుడు అంటూ స్టాన్ మృతిపై సంతాపం తెలిపారు. స్వామి మరణం విచారకరం. గొప్ప మానవతావాది, దేవుడిలాంటి ఆయన పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించింది. ఒక భారతీయుగా చాలా బాధపడుతున్నానంటూ కాంగ్రెస్ ఎంపీ,సీనియర్ నేత శశిథరూర్ ట్వీట్ చేశారు. ఈ విషాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు?నిర్దోషిని, సామాజిక న్యాయం కోసం నిరంతరం తపించిన స్వామిని ప్రభుత్వమే హత్య చేసిందని జయరాం రమేష్ వ్యాఖ్యానించారు. స్వామి మరణంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర మనస్తాపాన్ని వ్యక్తం చేశారు.సమాజంలో అత్యంత అణగారినవారి కోసం జీవితాంతంపోరాడిన వ్యక్తి కస్టడీలో చనిపోవడం అత్యంత విచారకరమని ట్విట్ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో న్యాయం తీరని అపఖ్యాతికి గురవుతోందన్నారు. ఇంకా జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ , సీపీఎం (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ తదితరులు ట్విటర్ ద్వారా స్వామి మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఫాసిస్ట్ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడిన ధైర్యశాలి, ఉద్యమకారుడు స్వామికి మరణం లేదని, ఆయన తమ హృదయంలో ఎప్పటికీ జీవించే ఉంటారని దళిత యువనేత, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ట్వీట్ చేశారు. ఆ మహామనిషి రక్తంతో తమ చేతులను తడుపుకున్న మోదీ షాలను జాతి ఎప్పటికీ విస్మరించదంటూ మండిపడ్డారు. దారుణ ఉపా చట్టం ఆయనను బలి తీసుకుంది. త్వరలో విచారణ మొదలు కానుందనే ఆశ విఫలం కావడంతో న్యాయవాదులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు అందరూ మూగబోయారంటూ ప్రముఖ న్యాయవాది కబిల్ సిబల్ ట్వీట్ చేశారు. నోరెత్తిన వారినందరినీ "ఉగ్రవాదులు" గా ప్రభుత్వం ముద్ర వేస్తోందంటూ ఘాటుగా విమర్శించారు. కాగా కరోనా బారిన పడి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పరిస్థితి మరింత క్షీణించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నం 2.30 ఉండగా ఉదయం కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. 84 ఏళ్ల వయసులో పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ స్థిరంగా మంచినీళ్లు కూడా తాగలేని పరిస్థితుల్లో ఉన్న స్వామిని జైల్లో నిర్బంధించి, బెయిల్ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా పొట్టనపెట్టుకుందని బీజేపీ సర్కార్‌పై పలువురు సామాజిక సంఘ నేతలు మండిపడుతున్నారు. Heartfelt condolences on the passing of Father Stan Swamy. He deserved justice and humaneness. — Rahul Gandhi (@RahulGandhi) July 5, 2021 Sad to learn of Fr #StanSwamy's passing. A humanitarian & man of God whom our government could not treat with humanity. Deeply saddened as an Indian. RIP. https://t.co/aOB6T0iHU9 — Shashi Tharoor (@ShashiTharoor) July 5, 2021 Stan Smith (84) passes away The system sucks UAPA No bail Little hope of early trial Others too languish in jail Lawyers , Academics , Social Activists ....raise their voices for the voiceless They too are now “voiceless” The State calls them “ terrorists” — Kapil Sibal (@KapilSibal) July 5, 2021 Fr Stan Swamy shall never die. He will live in our hearts as a hero, the brave dissenter who stood against the fascist Modi government at the cost of his life. Modi & Shah have Fr. Stan Swamy's blood on their hands. The country will never forgive them. #StanSwamy — Jignesh Mevani (@jigneshmevani80) July 5, 2021 Deeply saddened by the passing of Fr. Stan Swamy. Unjustifiable that a man who fought all through his life for our society's most downtrodden, had to die in custody. Such travesty of justice should have no place in our democracy. Heartfelt condolences! — Pinarayi Vijayan (@vijayanpinarayi) July 5, 2021 -
డీఎంకే–కాంగ్రెస్ కూటమికి బీటలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకేతో వియ్యమందుకున్న కాంగ్రెస్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కయ్యానికి దిగింది. యూపీఏ కూటమిలో పదేళ్లకు పైగా కొనసాగిన డీఎంకేతో తెగదెంపులు చేసుకునేందుకు తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమైంది. తుది నిర్ణయం బాధ్యతను ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్‌గాంధీపై మోపింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో సయోధ్య కుదరక పోవడమే ఇందుకు కారణం. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ సీట్ల కేటాయింపుపై ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వలెనే ఈసారి కూడా 41 సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే 41లో కేవలం 8 సీట్లు గెలుపొందడం వల్లనే 2016 ఎన్నికల్లో అధికారం దక్కలేదని డీఎంకే గుర్రుగా ఉంది. ఈసారి 18 స్థానాలకు మించి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఆరంభంలో అలానే ఉంటుంది, రానురానూ డీఎంకే తమకు అనుకూలంగా మారుతుందని కాంగ్రెస్ అంచనా వేసింది. ప్రజాబలం, పెద్దగా ఓటు బ్యాంకు లేని కాంగ్రెస్‌కు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో సీట్లను కేటాయిస్తే మరోమారు నష్టపోతామని డీఎంకే పట్టుదలతో ఉంది. ఐ–ప్యాక్ అనే సంస్థతో సర్వే చేయించిన సర్వేలో కూడా కాంగ్రెస్ బలహీనం బయటపడడంతో డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ మెట్టుదిగనందున చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. మరీ తక్కువ సీట్లలో పోటీచేస్తే కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతింటుందని అగ్రనేతలు భావించారు. దీంతో నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను స్వీకరించాలని నిర్ణయించి అత్యవసరంగా సమావేశమయ్యారు. డీఎంకే చర్చల్లో తనకు ఎదురైన అనుభవాలను టీఎన్‌సీసీ అ«ధ్యక్షులు కేఎస్ అళగిరి పార్టీ శ్రేణులతో పంచుకుంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో పార్టీ నేతలు తల్లడిల్లిపోయారు. కూటమిలో కొనసాగడమా, వద్దా అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినపుడు ‘30 సీట్లిస్తే సరే లేకుంటే ఒంటరి పోటీకి దిగుదాం’అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు కమల్‌హాసన్ నేతృత్వంలోని ‘మక్కల్ నీది మయ్యం’తో కలిసి కూటమి ఏర్పాటు చేద్దామని సలహా ఇచ్చారు. దీంతో అగ్రనేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ‘కరుణానిధి కాలం నుంచి డీఎంకే కూటమిలో కొనసాగుతున్నాం, చర్చలకు వచ్చినపుడు కాంగ్రెస్ నేతలకు కరుణానిధి ఎంతో మర్యాద ఇచ్చేవారు. అయితే ఈసారి కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు ఉమన్‌చాందీ వస్తే కనీస స్థాయిలో ఎవ్వరూ పట్టించుకోలేదు. అంతేగాక చర్చల్లో తీవ్ర అవమానాలకు గురయ్యామ’ని కాంగ్రెస్ నేతలు బాధపడ్డారు. పైగా మలివిడత చర్చలకు రమ్మని డీఎంకే నుంచి ఆహ్వానం రాలేదని వాపోయారు. ఈ పరిస్థితులను రాహుల్‌గాంధీకి వివరించేందుకు కర్ణాటకు చెందిన కాంగ్రెస్ అగ్రనేత వీరప్పమెయిలీ శనివారం ఢిల్లీ పయనమయ్యారు. డీఎంకే కూటమిలో కొనసాగడం ఇష్టం లేదు, అయితే రాహుల్ ఆదేశాలను అనుసరించి నడుచుకుంటామని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ సీట్లు కేటాయిస్తే ఒప్పుకోవద్దని తమిళనాడులో ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలో రాహుల్‌గాంధీ చెప్పినట్లు సమాచారం. డీఎంకేతో వికటిస్తే కాంగ్రెస్‌ను కలుపుకుని పోయేందుకు కమల్‌హాసన్ సిద్ధంగా ఉన్నారు. తన పార్టీ నేతలను ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతల వద్దకు రాయబారం పంపారు. బీజేపీతో డీఎంకే రహస్య ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రాల వారీగా కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేస్తోందని, ఇందుకు ఇటీవల పుదుచ్చేరీలో కాంగ్రెస్ పతనం, తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలే నిదర్శనమని కమల్ శనివారం నాటి ప్రచారంలో కొత్త కోణాన్ని అందుకున్నారు. -
ఆ పదవిపై ఆసక్తి లేదు: శరద్ పవార్
న్యూఢిల్లీ : యూపీఏ(యునైడెట్ ప్రోగ్రెసివ్ అలియాన్సెస్) అధ్యక్షుడిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ బాధ్యతలు చేపట్టనున్నారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై శరద్ పవార్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ అధ్యక్ష బాధ్యతలు చేపట్టటానికి తనకు ఎలాంటి ఆసక్తి లేదని తేల్చిచెప్పారు. రైతుల ఉద్యమంపైనుంచి దృష్టిని మళ్లించటానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు. యూపీఏ అధ్యక్షుడిగా తన పేరు తెరపైకి రావటంపై ఆయన గతంలోనూ క్లారిటీ ఇచ్చారు. అయితే శివసేన మాత్రం శరద్ పవార్‌వైపే మొగ్గుచూపుతోంది. దీనిపై కూడా పవార్ స్పందించారు. ఒకవేళ శివనసేన తన పేరును సూచిస్తే అది ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయం మాత్రమేనని, తనది కాదని స్పష్టం చేశారు. ( మరో బాంబు పేల్చిన నితీష్ కుమార్..) దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ యూపీఏ అధ్యక్షుడిగా శరద్ పవార్ ఎన్నికవుతారని నేననుకోవటం లేదు. రెండు పార్టీలు కలిసి ఓ నిర్ణయం తీసుకుని అధ్యక్షుడ్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ యూపీఏ అధ్యక్షుడి ఎన్నిక మాత్రమే జరుగుతుంది, ప్రధాని అభ్యర్థి ఎన్నిక కాదు’’ అని అన్నారు. -
‘శరద్ పవార్ అధ్యక్షుడిగా ఎంపికైతే సంతోషం’
సాక్షి, ముంబై: యూపీఏ కూటమి చైర్పర్సన్ అభ్యర్ధి మార్పుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూపీఏ చైర్మన్‌గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిమమించబడితే సంతోషంగా ఆహ్వనిస్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిల్లో కాంగ్రెస్ ప్రతిపక్షాలతో జతకట్టడమే చాలా ఉత్తమైన మార్గమని అన్నారు. పవార్ యూపీఏ చైర్ పర్సన్ బరిలో ఉంటే తాము పూర్తి మద్దతిస్తామని తెలిపారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడు లేనంతంగా సంక్షోభంలో ఉందని, యూపీఏ కూటమి బలపడాలంటే దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టుకోవాలని రౌత్ పేర్కొన్నారు. కాగా, సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు శివసేన అధికార ప్రతినిధి మహేష్ స్పందిస్తూ.. శరద్ పవార్ యూపీఏ నాయకత్వం వహిస్తారన్న వార్తలు నిరాధారమైనవని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆందోళనలను దారి మళ్లించడానికి స్వార్ధ ప్రయోజనాల కోసం అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక శివసేన పార్టీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ భాగస్వామ్యంతో మహరాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
యూపీఏకు పవార్ సారథ్యం?
సాక్షి, న్యూఢిల్లీ: మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్‌ను యూపీఏకు సారథ్యం వహించే దిశగా అడుగులు పడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో శరద్ పవార్ విపక్ష బృందానికి సారథ్యం వహించి బుధవారం రాష్ట్రపతిని కలిసిన విషయం తెలిసిందే. ఈ భేటీకి ముందు రైతుల అభ్యంతరాల అధ్యయనం, విపక్షాలను ఏకం చేసేందుకు పవార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. శరద్ పవార్ నివాసంలో రైతుల సమస్యలపై విపక్ష నాయకులతో సమావేశాలు సైతం జరిగాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రపతితో భేటీ తర్వాత యూపీఏ అధ్యక్ష బాధ్యతల మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నారు? 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా మారారు. అయితే, వయోభారం కారణంగా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకొనేందుకు, యూపీఏ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగేందుకు సోనియా గాంధీ విముఖత చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, త్వరలోనే ఆ బాధ్యతలను అనుభవం కలిగిన నేతకు అప్పగించాలని చర్చ జరుగుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గతంలో సోనియా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినప్పటికీ, యూపీఏ చైర్‌పర్సన్‌గా, పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా కొనసాగారు. ఈసారి మాత్రం ఆమె రాజకీయాలకే రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధమయ్యారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో సోనియాగాంధీ స్థానాన్ని భర్తీ చేసేందుకు అనుభవజ్ఞుడైన, అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపగల చైర్పర్సన్ అవసరమని యూపీఏ భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన శరద్ పవార్, సోనియా గాంధీ తర్వాత తదుపరి యూపీఏ చైర్‌పర్సన్‌గా ఎంపిక విషయంలో ముందు వరుసలో ఉన్నారు. యూపీఏ అధ్యక్ష బాధ్యతలను అప్పగించే విషయంలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ వంటి ప్రాంతీయ పార్టీ నాయకులు ఉన్నప్పటికీ, రాజకీయంగా వారు ఇతర పార్టీ నాయకులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పవార్ ఎందుకంటే.. ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరాఠా యోధుడు శరద్ పవార్‌కు దాదాపు అన్ని పార్టీలతో కలిసి ముందుకు సాగే స్వభావం ఉంది. మహారాష్ట్రలో బీజేపీకి షాకిచ్చి ఎన్సీపీ–శివసేన–కాంగ్రెస్ కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పవార్ కీలక పాత్ర పోషించారు. రాజకీయ సూత్రధారిగా కూడా శరద్ పవార్ ఏడాదిగా సక్సెస్ అయ్యారు. ఇతర రాజకీయ పార్టీలతో కలుపుకొని ముందుకెళ్ళే స్వభావం, యూపీఏ చీఫ్‌గా పొత్తులను నిర్వహించేటప్పుడు కీలకం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాహుల్‌గాంధీతో మాట్లాడేందుకే ఇష్టపడని మమతా బెనర్జీతో పోలిస్తే, పవార్ వ్యవహార శైలి కారణంగా పొత్తు రాజకీయాలు కష్టం కాకపోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. అదంతా ఒట్టిదే: ఎన్సీపీ ముంబై: సోనియాగాంధీ వైదొలిగితే యూపీఏ సారథ్య బాధ్యతలను తమ నేత శరద్ పవార్ చేపట్టే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలను ఎన్సీపీ ఖండించింది. అవన్నీ మీడియా ఊహాగానాలేనని ఎన్సీపీ ప్రతినిధి మహేశ్ తపసే కొట్టిపారేశారు. ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, కొందరి స్వార్థం కోసం ఇటువంటి నిరాధార అంశాలను మీడియా బయటకు తెస్తోందని ఆయన ఆరోపించారు. శరద్ పవార్(80) జాతీయ స్థాయి పాత్ర సైతం పోషించగల సమర్థులు, జనం నాడి తెలిసిన వ్యక్తి అని శివసేన పేర్కొంది. -
మా అన్నకు ఎవ్వరూ తోడు రాలేదు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీలోని అగ్రనాయకులందరూ తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఒంటరివాడిని చేశారనీ, ఎవ్వరూ ఆయనకు తోడుగా నిలవలేదని రాహుల్ చెల్లెలు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించినట్లు సమాచారం. అలాగే రాహుల్ కూడా ముగ్గురు సీనియర్ నేతలు పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి, తాను వద్దని చెబుతున్న తమ కొడుకులను పోటీలోకి దింపారని ఆరోపించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని పి.చిదంబరం బెదిరించారనీ, ముఖ్యమంత్రి కొడుక్కే టికెట్ ఇవ్వకపోతే ఎలా అని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మాట్లాడారనీ, ఇక రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా తన కొడుక్కి టికెట్ తెప్పించుకుని, ఆ నియోజకవర్గంలోనే ప్రచారం చేసి మిగతా ప్రాంతాలను ఆయన విస్మరించా రని రాహుల్ ఆరోపించినట్లు సమాచారం. చిదంబరం, కమల్‌నాథ్ కుమారులు ఎన్నికల్లో గెలవగా, గెహ్లాట్ కొడుకు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తాజా లోక్‌సభ ఎన్నికల్లో భారీ అపజయాన్ని మూటగట్టుకోవడం తెలిసిందే. ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణాలను విశ్లేషించేందుకు అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ శనివారం జరిగింది. ఎన్నికల్లో తీవ్ర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేస్తాననీ, తమ కుటుంబ సభ్యులకు కాకుండా వేరే వాళ్లకు ఈ పదవి ఇవ్వాలని రాహుల్ ప్రతిపాదించగా, పలువురు నేతలు వ్యతిరేకించడం తెలిసిందే. సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్, ప్రియాంకలు నిర్మొహమాటంగా మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఓటమికి కారకులంతా ఇక్కడే ఉన్నారు.. సీడబ్ల్యూసీ భేటీలో ప్రియాంక మాట్లాడుతూ పార్టీ అగ్రనేతలెవరూ తన అన్నకి మద్దతుగా నిలవలేదనీ, మోదీపై ఆయన ఒంటరిగా పోరాడారని అన్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆమె మాట్లాడుతూ ‘పార్టీ ఓటమికి కారణమైన వాళ్లంతా ఈ గదిలో కూర్చున్నారు’ అని అన్నట్లు సమాచారం. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా రాహుల్‌ను కొందరు నేతలు ఒప్పిస్తుండగా ప్రియాంక కలగజేసుకుని, ‘మా అన్న ఒంటరిగా పోరాడుతున్నప్పుడు మీరంతా ఎక్కడికి పోయారు. రఫేల్ కుంభకోణం, కాపలాదారుడే దొంగ అన్న నినాదాన్ని రాహుల్ మినహా కాంగ్రెస్ నేతలెవరూ ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడికి మీరెవరూ మద్దతు తెలుపలేదు’ అని ప్రియాంక అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఉత్తరాది ఆధిపత్యం ప్రమాదకరం
ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య స్వాతంత్య్ర పూర్వ కాలం నుంచీ కొనసాగుతున్న అంతరాలు దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలపై ఎంతో ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఈ రెండు ప్రాంతాలమధ్య ఉన్న మత, సామాజికపరమైన వైవిధ్యాలను వైరుధ్యాలుగా చిత్రీకరిస్తూ ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. భాష, సంస్కృతి విషయంలో ఒక ప్రాంతానికి చెందిన కొన్ని వర్గాల ఆలోచనలు, అభిప్రాయాలను యావత్ దేశంపై బలవంతంగా రుద్దే పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారి తీయనుంది. ప్రత్యేకించి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో ఉత్తరాది ఆధిపత్య ధోరణి తారస్థాయికి చేరింది. అయితే దక్షిణ భారత దేశాన్ని చిన్నచూపు చూడటంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ దొందూ దొందే కావడం గమనార్హం. ‘‘భారతదేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఎంతో వైవిధ్యం ఉన్నది. ఉత్తర దేశం మూఢనమ్మకాలతో మునిగి ఉంటే, దక్షిణ ప్రాంతం హేతు దృక్పథంతో ఉన్నది. ఉత్తరం ఛాందసవాదంలో ఉంటే, దక్షిణం ప్రగతిశీలమైన బాటలో ఉన్నది. విద్య విషయంలో దక్షిణం ముందడుగు వేస్తుంటే, ఉత్తరభారతం వెనుకబడి ఉంది. సాంస్కృతిక పరంగా దక్షిణం ఆధుని కతను సంతరించుకుంటే, ఉత్తరం ప్రాచీన దశలోనే ఉంది’’ ఇవి 1955 లోనే బాబాసాహెబ్ అంబేడ్కర్ నోటివెంట దొర్లిన అక్షర సత్యాలు. భాషా ప్రయుక్తరాష్ట్రాల విషయమై రాష్ట్రాల పునర్వవ్యస్థీకరణ సంఘానికి అందజేసిన నివేదికలోని అంశమిది. భారతదేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఉన్న ఈ వ్యత్యాసం ఎన్నో ఇతర అంశాలను ప్రభా వితం చేస్తుందని అంబేడ్కర్ అంత ముందుగానే ఆలోచించగలిగారు. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంపైన ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందనీ, ఇది ప్రజాస్వామిక దృక్పథానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. దాదాపు ఆరు దశాబ్దాల క్రితమే అంబేడ్కర్ చెప్పిన మాటలు ఈ నాటికీ అక్షరసత్యాలుగా మనముందు సాక్షాత్కరిస్తు న్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య కొనసాగుతున్న ఈ అంతరాలు భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల మీద ఎంతో ప్రభా వాన్ని కలిగిస్తున్నాయి. ఒకరకంగా ఉత్తర భారతదేశంలో మొలకెత్తిన తిరోగమన భావజాలాలన్నింటినీ దక్షిణాదిపై రుద్దుతున్నట్టు చరిత్ర రుజువుచేస్తోంది. ముఖ్యంగా మతపరమైన, సామాజికపరమైన వైవి«ధ్యా లను వైరుధ్యాలుగా చిత్రీకరిస్తూ ప్రజల మధ్య ఒక ఘర్షణ వాతావర ణాన్ని సృష్టిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా దక్షిణాది మీద వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నారు. ముఖ్యంగా 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ అనుసరించిన విధా నాలు దక్షిణాదిని కలవరపరుస్తున్నాయి. ఒక ప్రాంతానికి చెందిన కొన్ని వర్గాల ఆలోచనలను, అభిప్రాయాలను యావత్ దేశంపై బలవం తంగా రుద్దే పరిస్థితి దీర్ఘకాలంలో తీవ్రపరిణామాలకు దారితీస్తుందనడా నికి అనేక ఉదాహరణలున్నాయి. ఉత్తరాదిలో ఒక వర్గం ఆలోచనలను, దేశం మొత్తం ఆచరించాలనే ధోరణిని ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నది. ఒక మతం ప్రాతిపదికగా దేశాన్ని పాలించాలనుకునే బీజేపీ ప్రభుత్వ విధానాలను దక్షిణ భారత దేశం ఏనాడూ ఆమోదించలేదు. కారణం ఈ నేలకున్న చారిత్రక చైతన్య లక్షణం కావచ్చు. లేదంటే ఈ ప్రాంతంలో ఉద్భవించిన అనేకానేక ఉద్య మాలు కావచ్చు. ఈ ప్రాంతాన్ని ఇవే నిత్యచైతన్యస్రవంతిలో ఓలలాడేలా చేశాయి. మూర్ఖత్వానికీ, మూఢత్వానికీ ఇక్కడ చోటు తక్కువనే చెప్పాలి. దక్షిణాదిలో సాగిన కుల వ్యతిరేక పోరాటాలూ, సాంఘిక సంస్కరణో ద్యమాలూ ఈ ప్రాంత ప్రజలను చైతన్యపథంలో నడిపాయి. హిందూ మతంలోని మూఢవిశ్వాసాలనూ, కుల అణచివేతనూ, వివక్షనూ ఈ ఉద్యమాలు తిప్పికొట్టాయి. అందులో ముఖ్యంగా తమిళనాడులో ఆయో తీదాస్, రామస్వామి నాయకన్, కేరళ అయ్యంకాలి, ఆనాటి హైదరా బాద్ సంస్థానంలో భాగ్యరెడ్డి వర్మ ఆంధ్రప్రాంతంలో త్రిపురనేని రామ స్వామి చౌదరి లాంటి వాళ్ళు ఎంతో స్ఫూర్తిని అందించారు. అయితే సరిగ్గా ఈ చైతన్యమే ఉత్తరాదిలో కొరవడిందని ఆనాడు అంబేడ్కర్ స్పష్టం చేశారు. సరిగ్గా అదే నేడు అడుగడుగునా రుజువ వుతూ వస్తున్నది. ప్రజాస్వామిక వ్యవస్థలో మత స్వేచ్ఛ అనేది ఒక ప్రాథమిక సూత్రం. కానీ బీజేపీ, దాని నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వ శక్తులూ హిందూ మత రక్షణకు బదులుగా, ఇతర మతాలను ధ్వంసం చేయాలనుకోవడం మనకు ఇటీవలికాలంలో అత్యంత ఆందో ళన కలిగించిన అంశం. ఇతర మతాల ప్రజల ఆహారపుటలవాట్ల మీద గోమాంసం పేరుతో వందల మందిపై దాడిచేయడం, కొందరిని హత్య చేయడం మొదలెట్టి దేశమంతటా ఇటువంటి దాడులు జరపాలని భావించారు. కానీ అదిసాధ్యం కాలేదు. దక్షిణ భారతీయులు హిందువు లైనప్పటికీ ఇతర మతాల ఆచార వ్యవహారాలను తక్కువగా చూడలేదు. ఈ ప్రాంత ప్రజల జీవనాధారం మీద దాడిచేయాలనుకోలేదు. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ఒకే అంశంపై ఉన్న వ్యత్యాసాన్ని వరల్డ్ వాల్యూ సర్వే బయటపెట్టింది. దీని ప్రకారం హిందూ మతం ఒక్కటే అనుసరిం చదగినదని ఉత్తరాది అధికంగా భావిస్తే, దక్షిణాదిలో దానిని అంగీక రించే వాళ్ళ శాతం తక్కువ. అదేవిధంగా అన్ని మతాలూ సమానమనే భావనలో కానీ, ఇరుగుపొరుగు వాళ్ళు ఇతర మతస్థులు ఉండకూడదనే విషయంలోగానీ, రెండు ప్రాంతాల మధ్య ఎంతో వ్యత్యాసమున్నది. ముఖ్యంగా ముస్లింల పట్ల అవలంబిస్తున్న వైఖరిలో రెండు ప్రాంతాలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని, ఈ సర్వే వెల్లడించింది. ఇటీవల ఎన్నికల సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ హిందూ మతం, హిందూత్వంపై చేసిన వ్యాఖ్యలు కూడా దక్షిణ, ఉత్తర ప్రాంతాల ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ హిందూ మత సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూనే, ముస్లిం ప్రజల సంక్షే మంపై దేశంలో ఏ ప్రభుత్వం చూపించని శ్రద్ధను కనబరుస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ముస్లింలకోసం అమలుచేస్తున్నది. అంతేకాకుండా 200కు పైగా రెసిడెన్షియల్ పాఠశాల లను ముస్లింల కోసం నిర్వహిస్తున్నదంటే ఇది దక్షిణ భారతదేశం అవలంభిస్తున్న మత సహనానికి నిదర్శనం. అట్లాగే కర్నాటక, కేరళ, తమిళనాడులలో తెలంగాణలో లాగా ఇంత ప్రాధాన్యత ఇవ్వకపో యినా, ద్వేషభావం కలిగించలేదు. దీనికి విరుద్ధమైన వైఖరిని బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో అనుసరిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లోగానీ, ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లోగానీ, ముస్లింలను కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం నుంచి కూడా పోటీకి నిలపలేకపోయింది. ఎందుకంటే అక్కడి హిందు వుల్లో కరుడుగట్టిన ముస్లిం వ్యతిరేకతను సొమ్ముచేసుకోవడానికి, ఇతర హిందువుల ఓట్లను రాబట్టుకోవడానికి ముస్లిం వ్యతిరేకతను రాజకీయం చేశారు. చేస్తున్నారు. అదేవిధంగా ఉత్తరభారతదేశ ప్రజాస్వామిక వ్యతి రేక ధోరణిని బాబాసాహెబ్ అంబేడ్కర్ గతంలోనే ఉదహరించారు. యావద్దేశానికి హిందీ అధికార భాషగా ఉండాలనే విషయంలో రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో సభ్యులు 78–78 అనే సంఖ్యతో సమం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆనాటి నాయకత్వం తమ పార్టీ సభ్యులతో చర్చలు జరిపి ఒప్పించి, వ్యతిరేకించే వారిలో ఒకరిని సభకు హాజరుకాకుండా చూడడంవల్ల 78–77 తేడాతో హిందీ భాష అధికార భాష కాగలిగింది. రాజకీయంగా కూడా దక్షిణ భారతదేశం ఎప్పుడూ ఉత్తర భారత దేశంపైన ఆధారపడే స్థితిని కల్పించారు. లోక్‌సభలో ఎక్కువ సీట్లు ఉత్తర భారతదేశంలో ఉండడం వల్ల ఇప్పటికే పీ.వీ.నరసింçహారావు మినహా మరే దక్షిణ భారత నేత కూడా పూర్తికాలం ప్రధానమంత్రిగా కొనసాగలేక పోయారు. దేవెగౌడ కొద్దికాలమే ప్రధాని పదవిలో ఉండగలిగారు. ప్రధానమైన మంత్రిత్వ శాఖలు కూడా ఉత్తర భారతీయులే ఎక్కువగా అధిష్టించారు. రాష్ట్రపతి పాలనగానీ, ప్రభుత్వాలను బర్తరఫ్ చేసే ప్రక్రియ కూడా దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా జరిగిందని రాజ కీయ పరిశీలకులు భావిస్తున్నారు. వీటన్నింటి ఫలితంగానే దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం జరిగిందని భావించక తప్పదు. తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ హయాంలో కేంద్రానికి వ్యతిరేకంగా ఏర్పడి, తెలుగు ఆత్మగౌరవమనే ప్రాతిపదిక మీద అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రజలు నినదిస్తే, స్పందించకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇమడక పోవడంవల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసర మైంది. తమిళనాడులో ఢిల్లీని ఎదిరించే రాజకీయాలతోనే అక్కడి పార్టీలైన డీఎంకే, అన్నాడిఎంకే పనిచేస్తున్నాయి. కర్నాటకలో కూడా జెడీఎస్ ఒక ప్రాంతీయ పార్టీగానే వ్యవహరిస్తున్నది. ఆ పార్టీ నాయకులు కూడా ఢిల్లీలో అవమానానికి గురవుతున్నారు. దేవెగౌడ ఒక సమయంలో ప్రత్యక్షంగా నాతో వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఇక్కడ చెప్పడం సందర్భోచితం అని భావిస్తున్నాను. ప్రధానిగా పదవికి రాజీనామా చేసిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఢిల్లీ ఒక నియంతల కుటీరం. అది రాజ కీయంగానూ, నివాసపరంగానూ, సమాజపరంగానూ రాజధానిగా సరిపోదు. దక్షిణాది నాయకులంటే, అక్కడి రాజకీయనాయకత్వానికి మాత్రమే కాదు, అధికార యంత్రాంగం కూడా చాలా చులకనగా చూస్తారు’’ అని వాపోయారు. ఇటువంటి సందర్భాలు దక్షిణాది నాయ కులందరికీ అనుభవమే తప్ప అబద్ధం కాదు. ఇటీవల ఈ ఆధిపత్య ధోరణి, దక్షిణాది రాష్ట్రాల పట్ల చిన్నచూపు మరింత ఎక్కువైందని స్పష్ట మౌతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు, నిధుల నుంచి పూర్తిగా దాటవేయడం మనం చూస్తూనే ఉన్నాం. కేరళ రాష్ట్రంలో ఘోరమైన వరదలు వచ్చి, వేల కోట్ల నష్టం వాటిల్లి, వంద లాది మంది మృత్యువాత పడితే ఆదుకోవడంలో చూపిన అలక్ష్యం ఎవ రినైనా కుంగదీయకపోదు. ఒకవైపు సామాజిక, సాంస్కృ తిక అంత రాలూ, రెండో వైపు వివక్ష, నియంతృత్వ పోకడలు భవి ష్యత్‌లో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య మరింత అగా«థాన్ని సృష్టించక మానవు. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, రాజ్యాంగ విలువలను పాలకులూ ప్రజలూ పాటిస్తే ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య; సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
నేడు ఢిల్లీలో యూపీఏ పక్షాల భేటీ
-
ఎగ్జిట్ పోల్స్ : కేంద్రంలో మళ్లీ ఎన్డీయే
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక సమరం ముగియడంతో అందరిలో ఉత్కంఠ పెంచిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు అధికార పగ్గాలు దక్కుతాయని పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మోదీకి వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీలు వీలైనన్ని చోట్ల కూటమి కట్టినా,యూపీలో ఎస్పీ-బీఎస్పీ చేతులు కలిపినా ఎన్డీయేకు విస్పష్ట మొగ్గు కనిపిస్తోందని స్పష్టం చేశాయి.2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే కాషాయ ప్రభ కాస్త మసకబారినా లోక్‌సభలో బీజేపీనే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, మిత్రుల తోడ్పాటుతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేశాయి. మీడియా సంస్థ ఎన్డీయే యూపీఏ ఇతరులు టైమ్స్‌నౌ 306 132 104 రిపబ్లిక్ టీవీ సీ ఓటర్ 287 128 127 రిపబ్లిక్ టీవీ జన్ కీ బాత్ 315 124 113 న్యూస్ ఎక్స్ 242 162 136 న్యూస్ నేషన్ 282-290 118-126 130-138 ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ 300 127 115 టుడేస్ చాణక్య 340 70 133 వీడీపీ అసోసియేట్స్ 333 115 94 యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమిలో కాంగ్రెస్ లేకపోవడం బీజేపీకి కలిసివచ్చినట్టుగా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయేకు పట్టం కట్టాయి. ఇక టైమ్స్‌నౌ ఎన్డీయేకు 306 స్ధానాలు, యూపీఏకు 132 స్ధానాలు, ఇతరులకు 104 స్ధానాలు దక్కుతాయని అంచనా వేసింది. రిపబ్లిక్ సీ ఓటర్ ఎన్డీయేకు 287 , యూపీఏకు 128 స్ధానాలు, ఇతరులకు 127 స్ధానాలు లభిస్తాయని పేర్కొంది. రిపబ్లిక్ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు 315 స్ధానాలు, యూపీఏకు 124 స్ధానాలు, ఇతరులకు 113 స్ధానాలు రావచ్చని అంచనా వేశాయి. మరోవైపు న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీయేకు 298 స్ధానాలు, యూపీఏకు 118 స్ధానాలు, ఇతరులకు 126 స్ధానాలు లభించనున్నాయి. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయేకు స్ధానాలు, యూపీఏకు స్ధానాలు, ఇతరులకు స్ధానాలు దక్కనున్నాయి. ఎన్డీటీవీ పోల్స్ ఆఫ్ పోల్స్‌లో ఎన్డీయేకు 300, యూపీఏకు 127, ఇతరులకు 115 స్ధానాలు రావచ్చని అంచనా వేసింది. -
లైవ్ అప్డేట్స్ : వీడీపీ సర్వేలో ఫ్యాన్‌కు భారీ మెజారిటీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏడువిడతలుగా జరిగిన లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ దిగ్విజయంగా ముగిసింది. దీంతో లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇవి.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలోనూ వైఎస్సార్సీపీకి విస్పష్టమైన మెజారిటీ లభించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 44శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ 111 నుంచి 121 సీట్లు సాధిస్తుందని, అధికార టీడీపీ 39.10 ఓట్లతో 54 నుంచి 60 స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది. 10. 6 శాతం ఓట్లతో జనసేన సున్నా నుంచి నాలుగు స్థానాలకు పరిమితం అవుతుందని ఈ సర్వే స్పష్టంచేసింది. ఉత్తరాదిలో తిరుగులేని మోదీ వివిధ సర్వే సంస్థలు ఇప్పటివరకు ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసుకుంటే.. పశ్చిమ బెంగాల్లో మరోసారి దీదీ కొనసాగనుందని స్పష్టమైంది. ఇక, ఉత్తరాది రాష్ట్రాల్లో నరేంద్రమోదీ ఛరిష్మాకు తిరుగులేదని స్పష్టమైంది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే వివిధ మీడియా సంస్థలు ఇప్పటివరకు ప్రకటించిన సర్వే ఫలితాలివి.. టైమ్స్ నౌ- వీఎమ్మార్ సర్వే ప్రకారం.. ఉత్తరప్రదేశ్.. మొత్తం 80 సీట్లు : బీజేపీ - 56, ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ - 20 సీట్లు, కాంగ్రెస్- 2 రాజస్థాన్.. మొత్తం 25 సీట్లు: బీజేపీ - 21, కాంగ్రెస్ - 4 న్యూస్-18 - ఐపీఎస్ ఓఎస్ సర్వే ప్రకారం.. పశ్చిమ బెంగాల్.. మొత్తం సీట్లు 42: తృణమూల్ కాంగ్రెస్ 25 - 28, బీజేపీ 3 -7, ఇతరులు 5 -7 కర్ణాటక.. మొత్తం సీట్లు 28: బీజేపీ 21-23, కాంగ్రెస్-జేడీఎస్ 5-3 ఇండియా టుడే యాక్సిస్ సర్వే ప్రకారం.. మహారాష్ట్ర.. మొత్తం సీట్లు 48: బీజేపీ 38 - 42, కాంగ్రెస్-ఎన్సీపీ 6 - 10 గుజరాత్.. మొత్తం సీట్లు 26 : బీజేపీ 20 - 26, కాంగ్రెస్ 0-6 ఇండియా టీవీ సర్వే ప్రకారం.. ఢిల్లీలోని ఏడు సీట్లను బీజేపీ క్లీన్‌స్వీప్ (చదవండి: కేంద్రంలో మళ్లీ ఎన్డీయే) న్యూస్-18 - ఐపీఎస్ ఓఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే : తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్దే పైచేయి అని ఈ సర్వే పేర్కొంది. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్కు 12-14 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 1 నుంచి 2 సీట్లు, బీజేపీకి 1 నుంచి 2 సీట్లు, ఎంఐఎంకు ఒక సీటు వస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వేలోనూ వైఎస్సార్సీపీ తిరుగులేనిరీతిలో సత్తా చాటింది. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి తిరుగులేని జనాదరణను చాటుతూ.. ఆయన నేతృత్వంలోని వైఎస్సార్సీపీకి 132 నుంచి 135 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. ఇక అధికార టీడీపీకి 37 నుంచి 40 సీట్లు వస్తాయని తెలిపింది. జనసేన సున్నా నుంచి ఒక స్థానం సాధిస్తుందని పేర్కొంది. రిపబ్లిక్ టీవీ - సీ ఓటర్ : కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్‌కు మరోసారి అవకాశం దక్కనుందని రిపబ్లిక్ టీవీ - సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఈ సర్వే అంచనాల ప్రకారం ఎన్డీయేకు 287, యూపీఏకు 128, ఇతరులకు 127 సీట్లు వస్తాయని పేర్కొంది. న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్ సర్వే: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి సాధారణ మెజారిటీ వస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. ఈ సర్వేలో ఎన్డీయేకు 282 నుంచి 290 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 118 నుంచి 120 సీట్లు, ఇతర ప్రాంతీయ, జాతీయ పార్టీలకు 130 నుంచి 138 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ సర్వేలో వైఎస్సార్సీపీ తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ సర్వేలో వైఎస్సార్సీపీకి 18 నుంచి 20 లోక్‌సభ స్థానాలు వస్తాయని, టీడీపీకి నాలుగు నుంచి ఆరు స్థానాలు మాత్రమే వస్తాయని, ఇతరులకు సీట్లేమీ రావని అంచనా వేసింది. టైమ్స్‌నౌ - వీఎమ్మార్ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎన్డీయే కూటమి ఆధిక్యాన్ని సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 272 కాగా, ఎన్డీయేకు 306 సీట్లు, యూపీఏకు 132 సీట్లు, ఇతరులకు 104 సీట్లు వస్తాయని పేర్కొంది. న్యూస్-18 చానెల్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో వైఎస్సార్సీపీకి 13 నుంచి 14 సీట్లు రాగా, టీడీపీకి 10 నుంచి 12 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులు సున్నా నుంచి ఒక సీటు గెలుస్తారని పేర్కొంది. -
ఆఖరి దశలో నువ్వా? నేనా?
ఏడో దశ లోక్‌సభ ఎన్నికలు పాలకపక్షమైన బీజేపీకి, ప్రతిపక్షాలకు కూడా కీలకమైనవి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలోని ఎన్డీఏకు ఈ దశలో అనుకూల పరిస్థితి ఉందని కొందరు చెబుతుంటే, బీజేపీ పాలనపై జనంలో వ్యతిరేకత వ్యక్తమౌతోందని రాజకీయ పండితులు మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ పూర్తయ్యే 542 సీట్లలో బీజేపీ సహా ఎన్డీఏకు 240 వరకూ వస్తాయని, కాంగ్రెస్‌కు వంద మించవని ఓ పక్కఅంచనాలు నడుస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకుగాని, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకు గాని మెజారిటీకి దగ్గరగా సీట్లు రాని పక్షంలో ఏ కూటమికీ చెందని ప్రాంతీయపక్షాలు కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కిందటి లోక్‌సభ ఎన్నికల తర్వాత 5 రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల్లో గణనీయ మార్పులు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారం కోల్పోయింది. ఈ రెండు చోట్లా కాంగ్రెస్ విజయం సాధించింది. ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. 2017లో జేడీయూ, ఆర్జేడీ కూటమి సర్కారు రాజీనామా చేశాక మళ్లీ నితీశ్‌కుమార్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ సర్కారులో జేడీయూతో బీజేపీ, ఎల్జేపీ చేతులు కలిపాయి. యూపీలో 13 సీట్లూ కీలకమే! ఇక్కడ ఆఖరి దశ పోలింగ్ జరిగే 13 సీట్లను గతంలో బీజేపీ గెలుచుకుంది. మీర్జాపూర్లో బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ నాయకురాలు అనుప్రియా పటేల్ విజయం సాధించారు. కిందటేడాది గోరఖ్‌పూర్ ఉప ఎన్నికలో సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో ఈ 13 సీట్లలో 8 చోట్ల మాయావతి నేతృత్వంలోని బహుజన్‌సమాజ్ పార్టీ(బీఎస్పీ) రెండో స్థానంలో నిలవగా, ఎస్పీ మూడు స్థానాల్లో ద్వితీయ స్థానం ఆక్రమించింది. కాంగ్రెస్, ఆప్ చెరొక స్థానంలో రెండో స్థానంలో నిలిచాయి. మిగిలిన దశల్లో మాదిరిగానే ఎస్పీ, బీఎస్పీ కూటమి అన్ని స్థానాల్లో కలిసి పోటీచేస్తూ బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది. కాంగ్రెస్ ఒంటరి పోరు సాగిస్తోంది. ఈ దశలో పోలింగ్ జరిగే సీట్లలో ప్రధాని మోదీ రెండోసారి పోటీచేస్తున్న వారణాసి మళ్లీ దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఇక్కడ ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఎస్పీ గట్టి అభ్యర్థులను బరిలో నిలపలేదు. మోదీ మెజారిటీ పెంచడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. బిహార్‌లో రెండు చోట్ల హోరాహోరీ చివరి దశలో పోలింగ్ జరిగే బిహార్‌లోని 8 నియోజకవర్గాలు: పట్నా సాహిబ్, పాటలీపుత్ర, ఆరా, జెహానాబాద్, కర్కట్, బుక్సర్, సాసారామ్, నలందాలో బీజేపీ కిందటిసారి తన పూర్వ మిత్రపక్షమైన రాష్ట్రీయలోక్‌సమతా పార్టీ(ఆరెలెస్పీ)తో కలిపి ఏడు సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీకి ఐదు, ఆరెలెస్పీకి రెండు దక్కాయి. జేడీయూ ఒక స్థానంలో విజయం సాధించింది. ఆర్ఎల్ఎస్పీ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ఆర్జేడీ కూటమిలో చేరింది. 2014లో బీజేపీ టికెట్‌పై పోటీచేసిన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ పట్నా సాహిబ్ బరిలోకి దిగారు. ఆయనపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో పాటలీపుత్రలో ఓడిపోయిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కూతురు మీసా భారతి(ఆర్జేడీ) మళ్లీ పోటీచేస్తున్నారు. గతంలో ఆమెను ఓడించిన ఆర్జేడీ మాజీ నేత రామ్‌కపాల్ యాదవ్ బీజేపీ టికెట్‌పై రెండోసారి పోటీకి దిగారు. కేంద్ర మాజీ మంత్రి, దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్ కూతురు, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ మళ్లీ సాసారామ్ నుంచి పోటీకి దిగారు. 2014లో ఆమెను ఓడించిన బీజేపీ అభ్యర్థి ఛేదీ పాస్వాన్ ఈసారి కూడా బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. సీఎం నితీశ్‌కుమార్ సొంతూరు కల్యాణ్బీఘా ఉన్న నలందా స్థానంలో మాత్రమే ఆయన పార్టీ గెలిచింది. కిందటిసారి పది వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచిన జేడీయూ నేత కౌశలేంద్ర కుమార్ మళ్లీ పోటీచేస్తుండగా, ఆయనకు మారిన పరిస్థితుల్లో బీజేపీ మద్దతు ఉంది. ఆయనకు ఆర్జేడీ కూటమిలోని హిందూస్థానీ ఆవామ్ మోర్చా(సెక్యులర్) అభ్యర్థి అశోక్ కుమార్ ఆజాద్ గట్టి పోటీ ఇస్తున్నారు. మిగిలిన అన్ని సీట్లలోనూ బీజేపీ–జేడీయూ కూటమి, మహా కూటమి మధ్య గట్టి పోటీ ఉంది. మధ్యప్రదేశ్‌లో ఎనిమిదీ బీజేపీ గెలిచిన సీట్లే ఈ రాష్ట్రంలో చివరి దశలో పోలింగ్ జరిగే 8 సీట్లు: దేవాస్, ఉజ్జయినీ, మంద్సోర్, రత్లామ్, ధార్, ఇండోర్, ఖర్గోన్, ఖండ్వా. 2014లో ఈ ఎనిమిది స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. ఈ సీట్లన్నీ మాల్వా–నిమాఢ్ ప్రాంతంలో ఉన్నాయి. 2015లో రత్లామ్(ఎస్టీ) స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కిందటేడాది చివర్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 66 స్థానాల్లో కాంగ్రెస్ 35, బీజేపీ 21 సీట్లు కైవసం చేసుకున్నాయి. దళితులు, ఆదివాసీలు గణనీయ సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలోని సీట్లలో రెండింటిని ఎస్సీలకు, మూడింటిని ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఎస్సీ స్థానమైన దేవాస్‌లో ప్రపంచ ప్రఖ్యాత కబీర్ దోహాల గాయకుడు ప్రహ్లాద్‌సింగ్ టిపానియా కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నారు. పద్మశ్రీ అవార్డు పొందిన టిపానియా ఎన్నికల ప్రచారంలో తన పాటలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. జనరల్ స్థానాలైన ఖండ్వా, ఇండోర్‌లో కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఖండ్వాలో కేంద్ర మాజీ మంత్రి, పీసీసీ మాజీ నేత అరుణ్ యాదవ్(కాంగ్రెస్) రెండోసారి పోటీచేస్తున్నారు. ఇండోర్ నుంచి గతంలో వరుసగా 8 సార్లు గెలిచిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీలో లేరు. మంద్సోర్ నుంచి 2009లో గెలిచిన యువజన కాంగ్రెస్ మాజీ నేత మీనాక్షీ నటరాజన్(కాంగ్రెస్) మూడోసారి బరిలోకి దిగారు. 2014లో ఆమె బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. బెంగాల్లో భీకర పోరు 2014లో మొత్తం 9 స్థానాలనూ పాలకపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. కోల్‌కతా దక్షిణ్, కోల్‌కతా ఉత్తర్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఈ దశ ఎన్నికల ప్రచారాన్ని తృణమూల్, బీజేపీ దూకుడుగా నిర్వహించాయి. అనేక చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో 21 కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో మోదీ–అమిత్‌షా ద్వయం బెంగాల్లో తృణమూల్ నాయకురాలు, సీఎం మమతా బెనర్జీతో ఢీ అంటే ఢీ అంటూ తీవ్ర స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దమ్‌దమ్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ తృణమూల్ సభ్యుడు, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మళ్లీ పోటీలో ఉన్నారు. చివరి దశలోని అన్ని సీట్లలోనూ తృణమూల్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. పంజాబ్‌లో కాంగ్రెస్, అకాలీ–బీజేపీ కూటమి రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాల్లో 2014లో ఆప్ 4 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది. అకాలీ–బీజేపీ కూటమి ఐదు, కాంగ్రెస్ నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. అయితే, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ప్రస్తుతం పోటీ కాంగ్రెస్, అకాలీదళ్–బీజేపీ కూటమి మధ్యనే ఉంది. అకాలీ మాజీ డెప్యూటీ సీఎం, మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ కొడుకు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఫిరోజ్‌పూర్ నుంచి, సుఖ్బీర్ భార్య, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బఠిండా నుంచి, కేంద్ర మాజీ మంత్రి హర్దీప్సింగ్ పురీ(బీజేపీ)అమత్సర్ నుంచి పోటీకి దిగారు. పదేళ్ల తర్వాత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన అకాలీదళ్ కనీసం మూడు సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉంది. వేడెక్కిన హిమాచల్ మొత్తం 4 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, కాం గ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంది. 2014లో నాలుగు సీట్లనూ(సిమ్లా, మండీ, హమీర్పూర్, కాంగ్ఢా) బీజేపీ కైవసం చేసుకుంది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. బీజేపీ పాలనలోని హిమాచల్‌లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వృద్ధ నేత సుఖ్రామ్ మనవడు ఆశ్రయ్శర్మ మండీ నుంచి పోటీచేస్తుండగా, మాజీ సీఎం ప్రేమ్‌కుమార్ ధూమల్ కొడుకు, బీజేపీ సిట్టింగ్ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ హమీర్పూర్ నుంచి మరోసారి పోటీకి దిగారు. ఝార్ఖండ్‌లో ఆదివాసీ సీట్లు రెండు ఈ రాష్ట్రంలోని 14 సీట్లలో చివరి 3 స్థానాలకు ఆఖరి దశలో పోలింగ్ జరుగుతోంది. రాజ్‌మహల్, దూమ్కా ఆదివాసీలకు రిజర్వ్ చేసిన స్థానాలు. మూడో సీటు గొడ్డా జనరల్ నియోజకవర్గం. 2014లో ఎస్టీ సీట్లు రెండింటిని మాజీ సీఎం శిబూ సోరెన్ నేతృత్వంలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కైవసం చేసుకుంది. గొడ్డాలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించి తొలిసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా బీజేపీ–ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కూటమి అన్ని సీట్లకూ పోటీచేస్తోంది. కాంగ్రెస్ కూటమిలో జేఎంఎం, ఆర్జేడీతో పాటు తొలి ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ నాయకత్వంలోని జేవీఎం(పీ) చేరింది. కూటమి తనకు కేటాయించని ఒక సీటులో ఆర్జేడీ పోటీకి దిగింది. చండీగఢ్‌లో కిరణ్ ఖేర్ ఎదురీత? 2014 ఎన్నికల్లో త్రిముఖ పోటీలో విజయం సాధించిన సినీనటి కిరణ్ ఖేర్(బీజేపీ) ప్రస్తుత ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ ఓటర్లలో, పార్టీ కార్యకర్తల్లో ఆమెపై అసంతృప్తి కారణంగా ఆమె గెలుపునకు బాగా కష్టపడాల్సి వస్తోంది. 2019లో కూడా త్రిముఖ పోటీ నెలకొంది. ఆమెపై కాంగ్రెస్ పాత ప్రత్యర్థి కేంద్ర మాజీ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ పోటీచేస్తున్నారు. ఆప్ తరఫున బలమైన అభ్యర్థి హర్మోహన్ ధవన్ బరిలోకి దిగారు. కిందటిసారి తన ప్రత్యర్థులిద్దరి మధ్య ఓట్లు చీలిపోవడంతో కిరణ్ 69 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. గతంలో నాలుగుసార్లు చండీగఢ్ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బన్సల్‌పై కూడా వ్యతిరేకత ఉంది. -
రంగస్థలంలో హేమాహేమీలు
ఆరో దశ ఎన్నికలు అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ విడత ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కింది. ఒకరిపై మరొకరు ఆధిక్యం సాధించడానికి మండుటెండల్లో చెమట్లు కక్కుకుంటూ మరీ ఓటర్లను ఆకర్షించడానికి విస్తృతంగా ప్రచారం చేశారు. కేవలం మరో దశ ఎన్నికలు మాత్రమే ఉండడంతో అత్యధిక సీట్లు గెలుచుకోవడానికి ఎన్డీయే, యూపీఏ కూటములతో పాటు ఇతర ప్రధాన పార్టీలూ అన్ని అస్త్ర శస్త్రాలను బయటకు తీశాయి. ఈసారి ప్రచార పర్వం కొత్త పుంతలు తొక్కింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల తూటాలు పేలాయి. మోదీ రాజీవ్ గాంధీని నంబర్ వన్ అవినీతిపరుడని ఆరోపించడం, 1984 సిక్కు అల్లర్లను ప్రస్తావించడంతో ప్రచారం హద్దులు మీరింది. నేతలు వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ఉన్న మోదీ, అమిత్ షాలు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రచారం నిర్వహించారు. ఈసారి బరిలో ఎందరో ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలుగా మారిన క్రీడాకారులు, నటులు, గాయకులు, వారసులు, కోట్లకు పడగలెత్తిన వాళ్లు, నేరచరితులు ఇలా ఎందరో ఉన్నారు. ధనబలం, కండబలం ఉన్నవారిదే ఎన్నికల్లో పై చేయి అని స్పష్టంగా తెలుస్తోంది. -
ఎన్డీయే 240 రనౌట్.. యూపీఏ 150 ఆలౌట్
లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించే అవకాశం ఉంది. ఎక్కువ స్థానాలు గెలుచుకునే కూటమిగా ఎన్డీయే అగ్రస్థానంలో ఉండొచ్చు. కానీ ఈ కూటమి మెజారిటీకి 25–40 సీట్ల దూరంలోనే ఆగిపోవచ్చు. యూపీయే పరిస్థితి కూడా మెరుగ్గా ఉండే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్కువంద సీట్లు దాటవని, యూపీయేకు ఎట్టి పరిస్థితుల్లోనూ 150 మించవన్నది పలువురి అభిప్రాయం. ఎన్డీయేతర, యూపీయేతర పార్టీలకు 150 అంతకంటే ఎక్కువ సీట్లు దక్కవచ్చని అంచనా. బీజేపీ, కాంగ్రెస్‌ను కాదని ‘ప్రత్యామ్నాయ’ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలూ ఉన్నాయి. (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ఈ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకో లేదా కూటమికో స్పష్టమైన ఆధిక్యత లభించే అవకాశమే కనిపించడం లేదు. ఐదు దశల ఎన్నికల (424 లోక్‌సభ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్) సరళిని పరిశీలించిన ప్రముఖ జర్నలిస్టులు, విశ్లేషకులు, ప్రజల నాడిని అంచనా వేసే నిపుణులు దాదాపుగా ఇదే చెబుతున్నారు. మొదటి దశ పోలింగ్‌కు ముందు వెలువడిన సర్వేల అంచనాలకు, ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత పరిణామాలకు తేడా బాగా కనిపిస్తోందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నా రు. ఎన్డీయే కూటమి మెజారిటీ సాధిస్తుందని అనేక సర్వే సంస్థలు పేర్కొనగా, మెజారిటీకి కొద్ది దూరంలో ఆ కూటమి ఆగిపోతుందని ఒకట్రెండు సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే, 5 దశల్లో 424 లోక్‌సభ నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్ సరళిని పరిశీలించిన విశ్లేషకులు, నిపుణులు ప్రీ–పోల్ అంచనాలు వాస్తవాన్ని ప్రతిబింబించేలా లేవంటున్నారు. లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించే అవకాశం ఉంది. అదే విధంగా ఎక్కువ స్థానాలు గెలుచుకునే కూటమిగా ఎన్డీఏ అగ్రస్థానంలో ఉండొచ్చు. కానీ ఈ కూటమి మెజారిటీకి 25–40 సీట్ల దూరంలోనే ఆగిపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎటొచ్చీ ఎన్డీయే 240 సీట్ల దగ్గరే ఆగిపోతుందన్నదే సట్టా బజారులో జరుగుతున్న ప్రచారం. మొదటి దశ నుంచి ఐదో దశ పోలింగ్ ముగిసేదాకా ఓటింగ్ సరళిని నిశితంగా పరిశీలించిన సీనియర్ జర్నలిస్టులు, ప్రఖ్యాత విశ్లేషకులు, సర్వే పండితులు సైతం ఏ కూటమికీ మెజారిటీ రాకపోవచ్చంటున్నారు. ఎన్డీయే మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచే అవకాశం ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపీయే పరిస్థితి కూడా మెరుగ్గా ఉండే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్‌కు వంద సీట్లు దాటవని, యుపీయేకు ఎట్టి పరిస్థితుల్లోనూ 150 మించవన్నది వారి అభిప్రాయం. కేంద్రంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు సమానదూరంలో ఉన్న ఇతర పార్టీలకు 150 అంతకంటే ఎక్కువ సీట్లు దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలను కాదని ఢిల్లీలో ప్రత్యామ్నాయ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేలా తెరవెనుక మంత్రాంగం ముమ్మరమైంది. రెండు కూటముల్లో ఉన్న భాగస్వామ్య పార్టీలను బయటకు తీసుకొచ్చి వారి సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు కూడా సాగుతున్నాయి. పసిగట్టిన బీజేపీ.. కాంగ్రెస్‌పై దూకుడు! పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు, తర్వాతి పరిస్థితుల్లో మార్పును పసిగట్టిన బీజేపీ 4దశల పోలింగ్ తరువాత ప్రతిపక్షాలపై విమర్శల దాడి పెంచింది. మాజీ ప్రధాన మంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హయాంలో అవినీతి కుంభకోణాలను తెరపైకి తెచ్చింది. కాంగ్రెస్ ప్రధానమంత్రుల వ్యక్తిగత వ్యవహారశైలిపైనా నేరుగా మోదీ విమర్శలకు దిగడం రాజకీయవర్గాల్లో సంచలనమైంది. బీజేపీ–కాంగ్రెస్ మాత్రమే పోటీ పడే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతోందన్న వార్తలే దీనికి కారణమని విశ్లేషకులంటున్నారు. అలాగని.. యుపీయే అధికారంలోకి వచ్చేంత బలమైన పవనాలు కూడా దేశంలో ఎక్కడా లేవని చెబుతున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ సొంతగా మెజారిటీ సాధించడంలో కీలకంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లోనూ.. ఈసారి సీట్లు గణనీయంగా తగ్గుతాయన్నది పోల్ పండితుల అంచనా. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి 35 సీట్లు వరకు మాత్రమే రావచ్చన్నది తాజా అంచనా. అదే జరిగితే ఆ ఒక్క రాష్ట్రం నుంచే బీజేపీకి 36 సీట్లు తగ్గుతాయి. అదే విధంగా ఎన్డీయే కూటమికి మెజారిటీ రావడానికి దోహదపడ్డ రాష్ట్రాల్లోనూ ఈసారి కొంత మేర సీట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ కొద్ది మేర సీట్లు గెలుచుకున్నా బీజేపీ బలం తగ్గినట్టే. మొత్తంగా ఈ ఐదు రాష్ట్రాల్లో ఆ పార్టీకి మునుపటి కంటే 15 నుంచి 20 సీట్లు తగ్గుతాయని తాజా అంచనా. ఢిల్లీలో బీజేపీ తన సొంత బలాన్ని నిలబెట్టుకునే అవకాశముంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య బెడిసికొట్టిన పొత్తు కమలదళానికి ఉపయోగపడే అవకాశముంది. ఉత్తరప్రదేశ్‌తో పాటు హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో తక్కువయ్యే సీట్లలో కొన్నింటినైనా.. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి సాధించాలనేది బీజేపీ నేతల ప్రయత్నం. దానిలో భాగంగానే మోదీ బెంగాల్‌పై ఎక్కువగా దృష్టి సారించారు. యూపీ తరువాత అత్యధిక సార్లు మోదీ, అమిత్‌షాలు ప్రచారం చేసిన రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటి. ఇక్కడ బీజేపీ 2014 ఎన్నికల్లో 2 సీట్లు సాధించగా ఈసారి 10–12 సీట్లు దక్కించుకోవచ్చన్నది పరిశీలకుల అంచనా. కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న ఒడిశాలో ఆరేడు సీట్లు దక్కొచ్చని అంటున్నారు. బీజేపీకి దక్షిణాదితో ఇక్కట్లే తూర్పు, పశ్చిమ, ఉత్తర భారతదేశ రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీ దక్షిణాదిన బాగా బలహీనపడింది. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెద్దగా లాభించే అవకాశాలే లేవు. జనతాదళ్ (ఎస్), కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పటికీ కర్నాటకలో గతంలో బలాన్ని నిలబెట్టుకునే అవకాశముంది. కేరళలో అయితే బీజేపీ ఖాతా ఓపెన్ చేసే పరిస్థితి లేదు. 2014 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో మూడు స్థానాలు గెలుచుకున్న బీజేపీకి.. ఈసారి ఒకటి లేదా రెండు స్థానాలు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన దక్షిణాదిన బీజేపీ దాదాపుగా పాతబలాన్నే నిలబెట్టుకోనుంది. ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చే ఆధిక్యతను కలుపుకున్నా ఎన్డీఏ కూటమి 240 సీట్ల దగ్గర ఆగిపోయే అవకాశం ఉంది. యుపీఏకు కొరవడిన నాయకత్వం ఎన్డీయేకు తాము ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ నాయకత్వంలోని యుపీఏ ప్రజలను ఒప్పించలేకపోయింది. 2014 నాటి పరిస్థితులతో పోల్చి చూస్తే ఈ పార్టీ కొంత బలపడ్డప్పటికీ ఆ పార్టీకి 100 సీట్లు దాటవని, కూటమికి వచ్చే మొత్తం సీట్లు 150 లోపేనని జోరుగా ప్రచారం సాగుతోంది. రాజకీయ విశ్లేషకులు, ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న నిపుణులు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలో యూడీఎఫ్ 16 సీట్లు గెలుచుకుంటుందని, తమిళనాడులో డీఎంకే ఫ్రంట్‌తో కలిసి 30కి పైగా స్థానాలు దక్కించుకుంటుందని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు. ఇక ఉత్తరాదిన గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో హస్తగతం చేసుకున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ల్లో.. ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే ఆ పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కే అవకాశం ఉంది. మిగిలిన రెండు రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతోందని విశ్లేషకులు చెపుతున్నారు. మహారాష్ట్రలో నేషనలిస్టు కాంగ్రెస్ (ఎన్సీపీ)తో జత కట్టిన కాంగ్రెస్ కూటమికి 10–15 సీట్లు లభించే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ 2 స్థానాలకు పరిమితం అవుతుందని, బిహార్‌లో పెద్దగా మార్పు కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులంటున్నారు. దక్షిణాది, ఉత్తరాదిన కలిపి ఆ పార్టీ 100 లోపు స్థానాలకే పరిమితం అవుతుందని సట్టా బజారు అంచనా వేస్తోంది. కాంగ్రెస్ కూటమిలో డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీఎస్, టీడీపీ, నేషనల్ కాన్ఫరెన్ప్ (ఎన్సీ) ఇతర చిన్నా చితక పార్టీలను కలుపుకుంటే 150 స్థానాలకు మించి రావన్నది తాజా అంచనా. కొత్త భాగస్వాముల కోసం వెతుకులాట ఎన్డీయే 240 సీట్లకు పరిమితం అవుతుందని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త భాగస్వాముల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేతలు.. కొందరు ప్రాంతీయ పార్టీల నేతలతో తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. ఎన్డీయేలో భాగస్వామ్యపక్షాలు కొన్నింటిని తమవైపునకు తిప్పుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే, మెజారిటీకి 120 కంటే ఎక్కువ సీట్ల దూరంలో ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్‌తో జత కట్టేందుకు ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు ఆసక్తి చూపకపోవచ్చన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. పైపెచ్చు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా ఒప్పుకోబోనని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇదివరకే ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రాహుల్ నాయకత్వానికి ఆమోదం తెలుపకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్‌కు కలిసివచ్చే మిత్రులు ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. రాహుల్, మోదీల్లో ఒకరిని ఎంపిక చేసుకోవాల్సి వస్తే.. ములాయంసింగ్ యాదవ్ కూడా మోదీనే సమర్థిస్తారన్న ప్రచారం ఉంది. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు ఎన్డీయేకు మెజారిటీ రాని పక్షంలో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటు కోసం కూడా తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు సంకేతాలు కనపడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ తరువాత అతిపెద్ద పార్టీలుగా అవతరించనున్న తృణమూల్, వైఎస్సార్సీపీ, ఎస్పీ, బీఎస్పీ, టీఆర్ఎస్, డీఎంకే (ప్రస్తుతం యుపీయేలో ఉంది), జనతాదళ్ యునైటెడ్ (ప్రస్తుతం ఎన్డీయేలో ఉంది) వంటి పార్టీలతో పాటు వామపక్షాలను కలుపుకుని పోయి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా అంచనాలు మొదలయ్యాయి. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో జరిపిన సమావేశం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశం కోసం చేసిన ప్రయత్నం ఇలాంటి ఆలోచనలకు తెరలేపింది. అటు ఎన్డీయే, ఇటు యుపీయేతో సంబంధం లేని పార్టీలు 150 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నదని సర్వే పండితులు అంచనా వేస్తున్నారు. తృణమూల్, వైఎస్సార్సీపీ, ఎస్పీ, బీఎస్పీ, టీఆర్ఎస్, బీజేడీ పార్టీలు 120–135 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సట్టా బజార్ అంచనా వేస్తోంది. ఒకవేళ ఎన్డీయే మెజారిటీకి చాలా దూరంలో ఆగిపోతే ఈ కూటమిలో డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ వంటి పార్టీలు వచ్చి చేరే అవకాశమూ లేకపోలేదు. ఒకవేళ ఎన్డీయేకు 250 దాటితే ఈ పక్షాల్లోనే కొన్ని పార్టీలు షరతులతో కూడిన మద్దతిచ్చే అవకాశాన్నీ కొట్టిపారేయలేం. అప్పుడు ఈ పార్టీలు కేంద్రంలో కీలకపాత్ర పోషించే అవకాశముంటుంది. రాష్ట్రాల ప్రయోజనాల పేరుతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ను తెరమీదకు తెచ్చారు. రాష్ట్రాలకు నిధుల మంజూరు విషయంలో వివక్షను విడనాడాలని తరచూ డిమాండ్ చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్. ఈ డిమాండ్‌ను నెరవేర్చడానికి ముందుకు వచ్చిన వారికే ఆయన మద్దతిస్తానని స్పష్టంచేశారు. దీంతో ఎన్డీయే మెజారిటీకి 20–30 సీట్ల మధ్య ఆగిపోతే దేశంలో అందరి చూపు ఈ పక్షాల వైపే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. -
పోటీ పసందు ఎవరో బిహార్ బంధు
బిహార్‌లో ఎన్నికల రాజకీయాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఎవరికి వారు సొంత ఎజెండాలు అమలు చేస్తూ అవతలి వారిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈసారి ఎన్డీయే, యూపీఏ.. రెండే కూటములు బరిలో ఉన్నాయి. ఎన్డీయే కూటమి బిహార్ సీఎం నితీశ్‌కుమార్ పరిపాలన, ప్రధాని మోదీ ఇమేజ్‌పై ఆధారపడితే, యూపీఏ కూటమి నితీశ్ కప్పదాటు వైఖరిని, కుల సమీకరణ లెక్కలనే అస్త్రాలుగా మార్చుకుంది. ‘ఇవాళ రేపు బిహార్‌లో మారుమూల పల్లెకు కూడా కరెంట్ ఉంది. ఇక లాంతర్ (లాలూప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీ గుర్తు) అవసరం ఎవరికుంది?’ – బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సూటి ప్రశ్న ‘అందితే జుట్టు. అందకపోతే కాళ్లు. నితీశ్ కుమార్ విధానమే అది. కొన్నేళ్లుగా ఆయన బట్టలు మార్చినంత సులువుగా కూటముల్ని మార్చేస్తున్నారు. ఇప్పుడు ఎవరితో జత కట్టారో అసలు ఆయనకైనా తెలుసా?’’ – జైలు నుంచి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కౌంటర్. రంగులు మారిన రాజకీయం 2014 ఎన్నికల్లో బీజేపీ.. రామ్‌విలాస్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ, ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్ సమతా పార్టీతో కలిసి ఎన్నికల్లో పాల్గొంది. 40 లోక్‌సభ స్థానాల్లో 31 గెలుచుకుంది. ఆర్జేడీ, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీచేసి ఏడు స్థానాల్లో నెగ్గాయి. ఇక వామపక్షాలతో కలిసి పోటీ చేసిన నితీశ్‌కుమార్ (జేడీయూ) రెండు స్థానాలకే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఏడాదికే 2015లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూటముల రంగు మారాయి. ఆర్జేడీ, జేడీ (యూ), కాంగ్రెస్ మహాగఠ్ బంధన్‌గా చేతులు కలిపాయి. బీజేపీ.. ఎల్జేపీ, ఆర్ఎస్ఎస్పీ, జేడీ (యూ)లో చీలిక వర్గమైన మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తాన్ అవామ్ మోచీ (సెక్యులర్) కలిసి పోటీ చేశాయి. యూపీఏ కూటమి మొత్తం 243 స్థానాలకు 178 సీట్లను గెలుచుకుంది. 41 శాతం ఓట్లు సాధించింది. ఎన్డీయే కూటమి 34 శాతం ఓట్లతో 58 సీట్లు సాధించింది. నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రిగా, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కానీ కూటమి కాపురం ఎన్నాళ్లో సాగలేదు. లాలూ కుమారులపై అవినీతి ఆరోపణలతో జేడీ (యూ), ఆర్జేడీ మధ్య చిచ్చు ఏర్పడింది. ప్రభుత్వం కొనసాగలేకపోయింది. బీజేపీ మద్దతుతో మళ్లీ నితీశ్‌కుమార్ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీని విమర్శించిన నితీశ్ ఈసారి కలిసి వేదిక పంచుకుంటూ కేంద్రం పాలనను ఆకాశానికెత్తేస్తున్నారు. అన్నిచోట్లా ముఖాముఖీ పోటీ బిహార్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముఖాముఖి పోరాటమే నెలకొంది. ఎన్డీయే, మహాగఠ్ బంధన్ మధ్య పోరు నెలకొంది. ఎన్డీయే (బీజేపీ, జేడీ–యూ, ఎల్జేపీ)– మహాగఠ్ బంధన్ (కాంగ్రెస్, ఆర్జేడీ, ఆర్ఎల్ఎస్పీ, హెచ్ఏఎం (ఎస్), జేఏపీ, ఎన్సీపీ) మధ్య 40 లోక్‌సభ స్థానాల్లో ముఖాముఖి పోరు నెలకొంది. వామపక్షాలు ఉనికి కోసం కొన్ని లోక్‌సభ స్థానాల్లోనే పోటీ చేస్తున్నాయి. జేఎన్‌యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ పోటీ చేస్తున్న బెగూసరాయ్ మినహా మరెక్కడా కమ్యూనిస్టుల ప్రభావం లేదు. మహాగఠ్ బంధన్‌లో సీట్ల సర్దుబాటు కారణంగా ఆర్జేడీ ఈసారి 19 సీట్లలోనే పోటీ చేస్తోంది. ఇప్పటివరకు ఆర్జేడీ చరిత్రలో ఇంత తక్కువ సీట్లలో ఎప్పుడూ పోటీ చేయలేదు. కాంగ్రెస్‌కు తొమ్మిది సీట్లు కేటాయించడం ఆ కూటమికి మైనస్ కావచ్చని అంచనా. నితీశ్ వర్సెస్ తేజస్వి ఈసారి లోక్‌సభ ఎన్నికలు నితీశ్ కుమార్ వర్సెస్ ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి మధ్య యుద్ధంలా మారాయి. నితీశ్‌కు ఓబీసీ వర్గాల్లో ఇప్పటికీ గట్టి పట్టుంది. ఇక లాలూ చిన్న కుమారుడు తేజస్వి చురుగ్గా పని చేస్తున్నారు. ఓబీసీ ఓటర్లలో యాదవులంతా ఇప్పటికే ఆర్జేడీకి మద్దతుగా ఉన్నారు. మిగిలిన వారినీ తమ గూటికి లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. నిరుద్యోగం అంశాన్ని గట్టిగా ప్రచారం చేస్తూ యువ ఓటర్లకు గాలం వేస్తున్నారు. కాగా, ఈసారి సర్వేలన్నీ మోదీ ఇమేజ్, నితీశ్ పాలనకు బిహారీ జనం జైకొడతారని అంచనా వేస్తున్నాయి. కుల సమీకరణలు, రంగులు మారే రాజకీయాల కంటే దేశ భద్రత, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా మారుతాయని అంటున్నాయి. ఇక కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో నితీశ్ పాలనపై బిహార్‌లో 43 శాతం మంది ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సీఎస్డీఎస్–లోక్‌నీతి సర్వే చెబుతోంది. లాలూ లేని ఎన్నికలు దాణా కేసులో జైలు పాలైన ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. ఆయన ఎన్నికల బరిలో ఉంటే, ప్రచారంలో పాల్గొంటే ఆ మజాయే వేరు. తన హాస్య చతురతతో ప్రత్యర్థి పార్టీలనూ నవ్విస్తారు. సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బిహార్‌లో లాలూ ఉంటారని ఒకప్పుడు సరదాగా చెప్పిన ఆయన తాను ఎన్నికల బరిలో లేని లోటు తెలియకుండా జైలు నుంచి కూడా ప్రకటనలు ఇస్తున్నారు. మోదీ సభలకు వచ్చే జనాన్ని చూసి ‘నేనలా సరదాగా నడుచుకుంటూ పాన్ షాప్‌కే వెళితే నా చుట్టూ అంతమంది గుమిగూడతారు’ అంటూ సెటైర్లు వేశారు. ఓటర్లు లాలూని మిస్ అవుతున్నప్పటికీ ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్‌గా మారుతున్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు దేశ భద్రత బిహార్ ఎన్నికల్లో దేశ భద్రత అనేది కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉరీ ఘటన తర్వాత పాక్‌పై సర్జికల్ స్ట్రయిక్స్, బాలాకోట్‌పై దాడులు, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో మోదీ అణచివేయడం వంటి చర్యలపై ఓటర్లలో ఎక్కువగా చర్చ నడుస్తోంది. పాక్ నక్కజిత్తుల్ని తిప్పికొడుతున్న మోదీకి మరో చాన్స్ ఇవ్వొచ్చని గయ పట్టణంలో అభిషేక్ కుమార్ అనే ఓటరు వ్యాఖ్యానించారు. అయితే సాసారాం నియోజకవర్గానికి చెందిన రవిదాస్ అనే ఓటరు మాత్రం ముఖాముఖి పోటీ ఉన్నప్పుడు ఇలాంటివేవీ పనిచేయవని, కులాలే ఎన్నికల్ని శాసిస్తాయని అంటున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఏసీ గదుల్లో కూర్చునే వారు దేశ భద్రతపై లెక్చర్లు దంచుతారేమో కానీ సామాన్యులకు అవేవీ పట్టవని అభిప్రాయపడ్డారు. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు అగ్రవర్ణాల్లో నిరుపేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ కూడా ఈసారి ఎన్నికల్లో ప్రధానాంశం కాబోతోంది. ఎందుకంటే బిహార్‌లో అగ్రవర్ణాలు 15 శాతం వరకు ఉన్నారు. వారంతా రిజర్వేషన్లపై హర్షం ప్రకటించారు. ఓబీసీ ఓటర్లపై ఆధారపడుతున్న యూపీఏ కూటమి దీనిని సమర్థంగా తిప్పికొట్టలేక పోతోంది. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికలకు దూరంగా ఉండడంతో ఆ పార్టీ వ్యూహాత్మకంగా ముందడుగు వేయడంలో విఫలమవుతోంది. నిరుద్యోగం, ప్రత్యేక హోదా ఈ రాష్ట్రంలో ఈ రెండు అంశాలే ప్రచారాస్త్రం కానున్నాయి. యూపీఏ ఎన్నికల ప్రచార సభల్లో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది. ప్రధానమంత్రి మోదీ గత ఎన్నికల్లో బిహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అది నెరవేర్చలేదు. దీనిపై యూపీఏ గట్టిగానే నిలదీస్తోంది. ఏ కూటమి వ్యూహాలేమిటి? యూపీఏ మేథమేటిక్స్ మహాగఠ్ బంధన్‌లో మొత్తం ఆరు పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, ఆర్ఎల్ఎస్పీ, హెచ్ఏఎం (ఎస్), జేఏపీ, ఎన్సీపీ.. ఇవన్నీ కుల సమీకరణలు, వాటి అంకెలు, లెక్కలపై ఆధారపడి ఎన్నికల బరిలోకి దిగాయి. రాష్ట్ర జనాభాలో 17 నుంచి 18 శాతం మంది ముస్లింలే ఉన్నారు. వీరంతా కాంగ్రెస్, ఆర్జేడీకి ఓటు వేయడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇక యాదవులు ఓట్లు 16 నుంచి 17 శాతం వరకు ఉంటాయి. సంప్రదాయంగా వాళ్ల మద్దతు ఆర్జేడీ వైపే. జనాభాలో 4 శాతం ఉన్న కొయిరి ఓటర్లు ఆర్ఎల్ఎస్పీ వైపే మొగ్గుతాయి. యూపీఏ కుల సమీకరణలకి ఇది ఊతమిచ్చేలా ఉంది. జీతన్ రామ్ మాంఝీకి చెందిన హెచ్ఏఎం పార్టీ కూడా యూపీఏలో భాగస్వామి కావడంతో దళిత ఓటర్లు యూపీఏ వైపు మొగ్గు చూపించే అవకాశాలైతే ఉన్నాయి. ఈ కుల సమీకరణలు కాకుండా అభివృద్ధి అంశంలో నితీశ్‌పై అస్త్రాలు సంధించడానికి ఏమీ లేక రోజుకొక కూటమి మార్చే ఊసరవెల్లిగానే నితీశ్‌ను యూపీఏ పక్షాలు ఏకి పారేస్తున్నాయి. ఇక బిహార్‌లో నిరుద్యోగం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాలను కూడా యూపీఏ ప్రచారంలో లేవనెత్తుతూ ఎన్డీయేని ఇరుకున పెట్టే వ్యూహాలను రచిస్తున్నాయి. ఎన్డీయే కెమిస్ట్రీ రాష్ట్రంలో కులసమీకరణలతో పాటుగా ఎన్డీయే అభివృద్ధి మంత్రాన్ని కూడా జపిస్తోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అందరికీ ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భవ, నిరుపేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఉజ్వల పథకం, టాయిలెట్ల నిర్మాణం వంటివి ప్రజల్లో ఆదరణ పొందాయి. ఇక బిహార్ అగ్రకులాల ఓట్లు 14 నుంచి 15 శాతం వరకు ఉన్నాయి. ఇవి సాధారణంగా బీజేపీకే పడతాయి. ఇక కుర్మీ ఓట్లు 4–5 శాతం ఉన్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ఆ ఓటర్లంతా ఆయన వెంట నడుస్తారు. గత లోక్‌సభ ఎన్నికల్లో జేడీ (యూ) ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ కాదు. కానీ ఈసారి ఎన్డీయేతో చేతులు కలపడంతో కూటమి బలోపేతమైంది. ఇక రామ్‌విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్‌జనశక్తి పార్టీ శక్తిని తక్కువగా అంచనా వేయలేం. జనంలో కరిష్మా కలిగి, ఓటర్లను ప్రభావితం చేయడంలో జీతాన్ రామ్ మాంఝీ కంటే శక్తిమంతమైన నాయకుడు పాశ్వాన్. దీంతో దళిత ఓటర్లు చాలామంది ఎన్డీయే వైపు కూడా నడిచే అవకాశం ఉంది. ఇది ఎన్డీయే కూటమికి కలిసొచ్చే అంశం. నితీశ్‌కుమార్ తరచూ కూటములు మారుస్తారన్న పేరైతే ఉంది కానీ, వెనుకబడిన బిహార్‌లో అభివృద్ధి వెలుగులు విరజిమ్మిన నాయకుడు. అవినీతి, బంధుప్రీతి లేకుండా సుపరిపాలన అందించడంలో నితీశ్‌ది ప్రత్యేక స్థానం. మారుమూల గ్రామాల్లోనూ విద్యుత్ వెలుగులు పూయించారు. రోడ్లు, తాగునీటి æ సౌకర్యాలు కల్పించారు. నేరాలను అదుపు చేశారు. అందుకే కులాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. మోదీ ఇమేజ్ కూడా కలిసి వచ్చి ఎన్డీయే జయకేతనం ఎగురవేయడం ఖాయమన్న అభిప్రాయాలు ఉన్నాయి. -
యుద్ధాలు అధికారానికి సోపానాలా?
ఉగ్రవాదుల ఏరివేతకు వైమానిక దళం బాలాకోట్‌పై జరిపిన దాడి నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ దాడితో లోక్‌సభ ఎన్నికల్లో తమకు మరో పాతిక సీట్లు ఎక్కువ వస్తాయని బీజేపీ నేత యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు వీరి ఆరోపణకు బలాన్నిచ్చాయి. అయితే, సైనిక ఘర్షణలు నిజంగానే పార్టీలు అధికారంలోకి రావడానికి దోహదపడతాయా అంటే కచ్చితంగా అవునని జవాబు చెప్పలేం. అయితే, వీటి వల్ల దేశంలో రాజకీయ ముఖ చిత్రంలో మార్పులు జరిగినట్టు గత యుద్ధాలు, సైనిక ఘర్షణల తదనంతర పరిణామాలు తెలియజేస్తున్నాయి. దేశ విభజన జరిగిననాటి నుంచి ఇంత వరకు భారత్ పాకిస్తాన్‌తో నాలుగుసార్లు, చైనాతో ఒకసారి యుద్ధానికి దిగింది. శ్రీలంకలో అంతర్యుద్ధం నివారణకు సైనిక జోక్యం చేసుకుంది. వీటి తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి మళ్లీ విజయం దక్కినా దక్కకపోయినా రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారాయి. ఉదాహరణకు భారత్ 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్‌తో తలపడింది. చైనా యుద్ధంలో ఓడిపోతే, పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఈ రెండు యుద్ధాలు కూడా 1962, 1967 సార్వత్రిక ఎన్నికల మధ్యనే జరిగాయి. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ యుద్ధాల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు, సీట్లు కూడా తగ్గాయి. 1971లో జరిగిన బంగ్లాదేశ్ కోసం భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది. ఇందిరా గాంధీ హయాంలో జరిగిన ఈ యుద్ధం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ బలం భారీగా పెరిగింది. వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్ యుద్ధం జరిగింది. దీంట్లో భారత్ విజయం సాధించింది. తర్వాత కొన్ని నెలలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారం కైవసం చేసుకుంది. అయితే, సీట్లు మాత్రం ఏమీ పెరగలేదు. కేవలం యుద్ధాల వల్లే రాజకీయ పార్టీల తలరాత మారిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఆర్థిక, సామాజికాంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మూడో భారత్–పాక్ యుద్ధం(1971) బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత్ గెలిచింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా ఈ యుద్ధం జరిగింది. 1971 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని నెలలకు ఈ యుద్ధం జరిగింది. తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 158 సీట్లు కోల్పోయింది. 1971 ఎన్నికల్లో 352 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి 154 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచింది. స్వాతంత్య్రం తర్వాత కేంద్రంలో ఏర్పడ్డ తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఇది. మొదటి భారత్–పాక్ యుద్ధం(1947) కశ్మీర్ యుద్ధంగా పేరొందిన ఇది 1947 అక్టోబర్– 1948 డిసెంబర్ల మధ్య జరిగింది. ఆ తర్వాత 1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. భారత్–చైనా యుద్ధం (1962) 1962, అక్టోబర్ 20 నుంచి 1962 నవంబర్ 21 వరకు జరిగింది. దీంట్లో భారత్ ఓడింది. యుద్ధం సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 361 సీట్లు సాధించింది. ఐపీకేఎఫ్ (1987) శ్రీలంకలో అంతర్యుద్ధాన్ని నివారించడం కోసం శాంతి పరిరక్షక దళాన్ని భారత్ అక్కడికి పంపి లంక సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంది. నాటి ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురయ్యారు. ఐపీకేఎఫ్‌ను పంపడానికి ముందు 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో 404 సీట్లు గెలుచుకుంది. ఈ జోక్యం తర్వాత జరిగిన (1989) ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. రెండో భారత్–పాక్ యుద్ధం(1965) లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉండగా, 1965లో ఈ యుద్ధం జరిగితే, రెండేళ్ల తర్వాత 1967లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి 283 సీట్లతో అధికారం దక్కించుకుంది. అయితే, అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే 78 సీట్లు తక్కువ వచ్చాయి. కార్గిల్ యుద్ధం(1999) బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కార్గిల్ యుద్ధం జరిగింది. 1999 మే నుంచి జూలై వరకు జరిగిన ఈ యుద్ధంలో భారత్‌దే గెలుపు.ఈ యుద్ధానికి ముందు 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కార్గిల్ యుద్ధం తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 138 సీట్లు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఇవి 44 తక్కువ. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా మెజారిటీ సీట్లు సాధించలేక పోయింది. అయినా కూడా ఇతర పార్టీలతో కలిసి యూపీఏ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
లూటీని అడ్డుకున్నందుకే ఏకమయ్యారు
న్యూఢిల్లీ: ప్రజాధనం దోపిడీని అడ్డుకున్నందుకే ప్రతిపక్షాలు ఏకమై తనను దూషిస్తున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో దాదాపు 8 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులు ప్రజల సొమ్మును లూటీ చేశారని ఆయన ఆరోపించారు. సోమవారం ఇక్కడ జరిగిన ‘న్యూస్ 18 నెట్వర్క్’ రైజింగ్ ఇండియా సమిట్‌లో ప్రధాని ప్రసంగించారు. ‘జన్‌ధన్ యోజన, ఆధార్ లింకింగ్ వంటి కార్యక్రమాలతో దాదాపు రూ.1.10లక్షల కోట్లను పక్క దారి పట్టకుండా మేం ఆపగలిగాం. దీంతో ప్రతిపక్షాల్లో ఉన్న ఆ నేతలంతా ఇప్పుడు ఏకమయ్యారు. దోచుకునేందుకు గల అన్ని దారులు మూసుకుపోవడంతో నన్ను దూషించడం మొదలుపెట్టారు’అని ఆరోపించారు. తనకు, ప్రతిపక్షాలకు మధ్య జరుగుతున్న పోరాటాన్ని జాతి హితం, రాజకీయాలకు జరుగుతున్న పోరుగా మోదీ అభివర్ణించారు. ఉద్యోగావకాశాలు కల్పించకుండా దేశ ఆర్థిక పురోగతి ఎలా సాధ్యమవుతుందని ప్రధాని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వేగంగా ఉద్యోగ కల్పన జరుగుతోందని అన్నారు. అయితే, ఎన్డీఏ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందంటోన్న విపక్షాల ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ‘దేశం వేగంగా అభివృద్ధి చెందుతుండగా ఉద్యోగాలు లేకపోవడం సాధ్యమా? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పేదరికం బాగా తగ్గింది. కీలక మౌలిక వసతులైన రోడ్డు, రైల్వే మార్గాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అలాంటప్పుడు దేశంలో ఉద్యోగాలు లేకపోవడం ఎలా సాధ్యం’ అని ఆయన ప్రశ్నించారు. 2012–18 సంవత్సరాల్లో 67 లక్షల ఉద్యోగాలను కల్పించగా గత ఏడాదిలోనే 9 లక్షల ఉద్యోగాలను సృష్టించినట్లు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇదే విధంగా కర్ణాటకలో కూడా. నేను చెప్పేది మీకు రుచించకపోవచ్చు. వాళ్లను కూడా మీరు నమ్మరా? ఈ రాష్ట్రాలు భారత్లోవి కావా? ఉద్యోగాలు కల్పిస్తుండగా నిరుద్యోగిత ఎలా పెరుగుతుంది?’ అని ఆయన అన్నారు. గత నాలుగేళ్లలో 6 లక్షల మంది నిపుణులకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. వీరు మరికొన్ని లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. రవాణా రంగం వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 7.5లక్షల కార్లు విక్రయించారు. ప్రధాన్‌మంత్రి ముద్రా యోజన కింద వ్యాపారాలు చేసుకునేందుకు రికార్డు స్థాయిలో 4 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగాలు లేకుండా ఇంతమంది రుణాలు తీసుకోవడం సాధ్యమేనా? 2017–19 సంవత్సరాల్లో ఈపీఎఫ్‌వో(ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ)లో 5 లక్షల మంది నమోదు చేయించుకున్నారు. కోట్లాది మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. గతంలో కంటే ఈ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు దొరుకుతున్నాయని అర్థం’ అని ప్రధాని అన్నారు. -
ఇదీ రఫేల్‌పై కాగ్ నివేదిక
రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తన నివేదికను బుధవారం పార్లమెంట్ ముందుకు తెచ్చింది. ఏడాదిన్నరకు పైగా కాలంపాటు కాగ్ రఫేల్ ఒప్పందాన్ని పరిశీలించి నివేదికను సిద్ధం చేశారు. విమానాల ధర, విక్రేతల ప్రతిపాదనల పరిశీలనతోపాటు ప్రపంచ వ్యాప్తంగా జెట్ యుద్ధ విమానాల ధరలను కూడా కాగ్ పరిశీలించారు. రక్షణ శాఖ ఐదేళ్లుగా జరిపిన లావాదేవీలపై కాగ్ నివేదిక వచ్చింది. ముసాయిదా నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. అయితే, ఎన్నికలకు ముందు ఈ నివేదిక ఖరారు కాకపోవచ్చు. రఫేల్ ఒప్పందంలోని ధర, సరఫరా, పూచీకత్తు తదితర పలు అంశాలను కాగ్ నివేదిక చర్చించింది. అందులోని ముఖ్యాంశాలు: ధర: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో పేర్కొన్న ధర అంతకు ముందు ఒప్పందంలోని సమీకృత ధర(మొత్తం ధర) కంటే 2.86 శాతం తక్కువ. 2007లో (యూపీఏ హయాం) కుదుర్చుకున్న ఒప్పందంలోని 36 విమానాల కొనుగోలు ధర కంటే 2016 నాటి ఎన్డీఏ ఒప్పందంలోని ధర 9 శాతం తక్కువంటూ రక్షణ శాఖ చేసిన వాదనను కాగ్ తోసిపుచ్చింది. ఒప్పందంలో మొత్తం 14 ఐటెమ్‌లతో కూడిన ఆరు వేర్వేరు ప్యాకేజీలు ఉన్నాయి. వీటిలో ఏడు ఐటెమ్‌ల ధర సమీకృత ధర కంటే చాలా ఎక్కువగా ఉంది. బేసిక్ విమానం సహా మూడు ఐటెమ్‌లను సమీకృత ధరకే కొన్నారు. 4 ఐటెమ్‌లను సమీకృత ధరకంటే తక్కువకు కొన్నారు. సరఫరా: పాత ఒప్పందంతో పోలిస్తే కొత్త ఒప్పందంలో పేర్కొన్న గడువు ప్రకారం యుద్ద విమానం ఒక నెల ముందే సరఫరా అవుతుంది. 2007 ఒప్పందం ప్రకారం నిర్దేశిత ప్రమాణాల మేరకు యుద్ధ విమానాలను ఒప్పందం నాటి నుంచి 72 నెలల్లోపు సరఫరా చేయాల్సి ఉండగా. 2016 ఒప్పందంలో ఈ గడువు 71 నెలలుగా పేర్కొన్నారు. 2007 ఒప్పందం ప్రకారం ఒప్పందపు నెల నుంచి 50 నెలల్లోగా 18 విమానాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. మిగతా 18 విమానాలను హెచ్ఏఎల్లో తయారు చేయాలి. వీటిని 49–72 నెలల్లోపు అందజేయాల్సి ఉంటుంది. 2016 ఒప్పందం ప్రకారం మొదటి విడత విమానాలను(18) ఒప్పందపు నెల నుంచి 36–53 నెలల మధ్య సరఫరా చేయాలి. మిగతా వాటిని 67 నెలల్లో అందజేయాల్సి ఉంటుంది. గ్యారెంటీ: న్యాయ మంత్రిత్వ శాఖ సలహా మేరకు ఈ ఒప్పందానికి సంబంధించి సార్వభౌమత్వ హామీ(ప్రభుత్వమే హామీ ఉండటం) ఇవ్వాల్సిందిగా రక్షణ మంత్రిత్వశాఖ ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఆ ప్రభుత్వం కేవలం లెటర్ ఆఫ్ కంఫర్ట్ ను మాత్రమే ఇచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ ఒప్పందానికి సంబంధించిన చెల్లింపుల కోసం ఎస్క్రో ఖాతా తెరవాలని రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన విజ్ఞప్తికి ఫ్రాన్స్ ప్రభుత్వం అంగీకరించలేదు. 2007నాటి ఒప్పందంలో విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్ ‘పనితీరు, ఆర్థిక హామీ(పెర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్) ఇచ్చింది. మొత్తం కాంట్రాక్టు విలువలో 25 శాతం మేరకు ఈ హామీ ఇచ్చింది. 2007నాటి ఒప్పందంలో అమ్మకందారు(డసో)ఈ హామీ విలువను బిడ్‌లో చేర్చారు. అయితే, 2016 ఒప్పందంలో ఇలాంటి హామీలు ఏమీ లేవు. దీనివల్ల డసో సంస్థకు బోలెడు ఆదా అయింది. -
ధర 2.86 శాతం తక్కువే
న్యూఢిల్లీ: నిత్యం వివాదాలతో వార్తల్లో ఉంటున్న రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఎట్టకేలకు కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక బుధవారం పార్లమెంటుకు చేరింది. రఫేల్ విమానాల కోసం 2007లో నాటి యూపీఏ ప్రభుత్వం ఖరారు చేసిన ధర కన్నా ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం కుదుర్చుకున్న ధర 2.86 శాతం తక్కువగానే ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. అయితే రఫేల్ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఉన్న ‘భారత్‌లో ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక’ అంశాన్ని కాగ్ ఈ నివేదికలో కనీసం ప్రస్తావించలేదు. యుద్ధ విమానాల పూర్తి, స్పష్టమైన ధరలను కూడా కాగ్ తన నివేదికలో పేర్కొనలేదు. కాంగ్రెస్ కుదుర్చుకున్న ధర కన్నా తమ ప్రభుత్వం రఫేల్ విమానాలను కొంటున్న ధర 9 శాతం తక్కువగా ఉందంటూ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటించగా, తాజాగా కాగ్ మాత్రం అది 2.86 శాతమే తక్కువని స్పష్టం చేయడం గమనార్హం. ఆ ప్యాకేజీకి 6.54 శాతం ఎక్కువ ధర రఫేల్ ధరల వివరాలను సంపూర్ణంగా బయటపెట్టకపోయినప్పటికీ, ఇంజనీరింగ్ సహాయక ప్యాకేజీ, వాయుసేనకు పనితీరు ఆధారిత లాజిస్టిక్స్ వరకు చూస్తే ప్రస్తుత ధర గతం కన్నా 6.54 శాతం ఎక్కువగా ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. 2007లో కుదుర్చుకున్న ధరలతో పోలిస్తే శిక్షణా వ్యయం కూడా ప్రస్తుతం 2.68 శాతం పెరిగిందంది. రఫేల్ విమానాల్లో భారత్ కోరిన సౌకర్యాలు తదితరాల్లో మాత్రం యూపీఏ ధర కన్నా ఎన్డీయే ధరలు 17.08 శాతం తక్కువగా ఉన్నాయంది. ఆయుధాల ప్యాకేజీ కూడా గతం కన్నా ప్రస్తుతం 1.05 శాతం తక్కువకే వచ్చిందని తన 157 పేజీల నివేదికలో కాగ్ వెల్లడించారు. మొత్తంగా చూస్తే యూపీఏ కన్నా ఏన్డీయే కుదుర్చుకున్న ధర 2.86 శాతం తక్కువగా ఉందన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం తాము ఒక్కో విమానాన్ని రూ. 520 కోట్లకు కొనేందుకు ఒప్పందం కుదుర్చుకుంటే ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఒక్కో విమానానికి రూ.1,600 కోట్లు ఖర్చు చేస్తోందని గతం నుంచీ ఆరోపిస్తోంది. డసో పోటీ సంస్థ యూరోపియన్ ఏరోనాటిక్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీ (ఈఏడీఎస్) విమానాల ధరపై 20 శాతం తగ్గింపు ఇస్తామనడంపై ప్రభుత్వ స్పందనను కూడా కాగ్ రాజీవ్ మహర్షి ఈ నివేదికలో ప్రస్తావించారు. 20 శాతం తగ్గింపును ఆ కంపెనీ భారత్ అడగకుండానే ఇచ్చిందనీ, అలాగే ఈఏడీఎస్ ప్రతిపాదనల్లో వాస్తవిక వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీని ఎంపిక చేయలేదని రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పినట్లు కాగ్ నివేదిక తెలిపింది. లెటర్ ఆఫ్ కంఫర్ట్తోనా? ఎన్డీయే ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలోని లోపాలనూ కాగ్ తన నివేదికలో ప్రస్తావించారు. ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి హామీ/పూచీ తీసుకోకుండా కేవలం లెటర్ ఆఫ్ కంఫర్ట్తోనే మోదీ ప్రభుత్వం సరిపెట్టుకుందనీ, దీనివల్ల రఫేల్ విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్‌కు లబ్ధి చేకూరిందని కాగ్ తెలిపారు. 2007లో కుదిరిన ఒప్పందం ప్రకారమైతే ముందస్తు చెల్లింపులకు 15 శాతం బ్యాంకు గ్యారంటీ కూడా ఉందనీ, ప్రస్తుత ఒప్పందంలో అలాంటిదేమీ లేదని కాగ్ నివేదిక వెల్లడించింది. ‘ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి పూచీకత్తు లేకుండా లెటర్ ఆఫ్ కంఫర్ట్‌తో సరిపెట్టుకోవడం వల్ల ఒకవేళ భవిష్యత్తులో డసో ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే భారత్‌కు తలనొప్పి తప్పదు. ఒప్పంద ఉల్లంఘన జరిగితే ముందుగా భారత్ మధ్యవర్తిత్వం ద్వారా డసోతోనే చర్చలు జరపాలి. ఈ చర్చల ఫలితం భారత్‌కు అనుకూలంగా ఉంటే, ఇందులో వచ్చిన తీర్పును/పరిష్కారాన్ని అనుసరించేందుకు కూడా డసో విముఖత చూపితే భారత్ మళ్లీ అందుబాటులో ఉన్న అన్ని న్యాయ పరిష్కారాలనూ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే డసో తరఫున ఫ్రాన్స్ ప్రభుత్వం భారత్‌కు డబ్బు తిరిగి చెల్లిస్తుంది’ అని నివేదిక వివరించింది. అబద్ధాలని తేలిపోయింది: జైట్లీ కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు రఫేల్‌పై చెబుతన్నవన్నీ అబద్ధాలేనని కాగ్ నివేదికతో తేటతెల్లమైందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆఫ్సెట్ భాగస్వామి ప్రస్తావనే లేని నివేదిక రఫేల్ వివాదంలో కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ ఆఫ్ ఎంపిక గురించే. డసో భారత్‌లో తనకు ఆఫ్సెట్ భాగస్వామిగా ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను కాకుండా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకుందనీ, ఈ రంగంలో ఏ అనుభవం లేని కొత్త కంపెనీ రిలయన్స్ డిఫెన్స్‌కు ఈ అవకాశం దక్కడానికి మోదీ ప్రభుత్వ అవినీతే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే కాగ్ నివేదికలో మాత్రం ఆఫ్సెట్ భాగస్వామి ఎంపిక అంశం గురించి కనీసం ప్రస్తావన కూడా లేదు. ఆ కాగితమంత విలువ కూడా లేదు: రాహుల్ రఫేల్ ఒప్పందం కుదుర్చుకునేందుకు జరిపిన చర్చల సమయంలో వచ్చిన అసమ్మతి గురించి అసలు ఈ నివేదికలో కాగ్ ప్రస్తావించలేదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగ్ నివేదికను ముద్రించిన కాగితాలకు ఉన్నంత విలువ కూడా అందులో పేర్కొన్న అంశాలకు లేదని విమర్శించారు. ‘కొత్త ఒప్పందం కుదుర్చుకోవడానికి మోదీ ప్రభుత్వం చెబుతున్న కారణాలు ధర, మరింత వేగంగా సరఫరా. కానీ ఈ ఆ రెండు వాదనలూ అవాస్తవాలేనని ద హిందూ పత్రిక తాజా కథనంతో తేలిపోయింది. కేవలం రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకీ రూ. 30 వేల కోట్లు అక్రమంగా ఇచ్చేందుకే ఈ కొత్త ఒప్పందం జరిగింది’ అని రాహుల్ మరోసారి ఆరోపించారు. రఫేల్ అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్, రాహుల్, సోనియా తదితరులు పార్లమెంటు భవనం వద్ద నిరసన చేపట్టారు. -
మ్యాజిక్ ఫిగర్‌కు ఎన్డీఏ దూరం
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్(ఎన్డీయే) కూటమి అధికారానికి 20 సీట్ల దూరంలో నిలవనుందని తాజా సర్వే ఒకటి తేల్చింది. ఎన్డీయేకు 252, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 147, ఈ రెండు కూటముల్లోనూ లేని ఇతర పార్టీలకు 144 సీట్లు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది. జనవరి నెలలో ఆంగ్ల వార్తాచానెల్ ‘టెమ్స్ నౌ’.. వీఎంఆర్ సంస్థతో కలిసి.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలపై సర్వే నిర్వహించింది. జనవరి 14 నుంచి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 15, 731 మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది. గతంలో ఇండియాటుడే, రిపబ్లిక్ చానెళ్లు ప్రకటించిన సర్వేల తరహాలోనే ఈ సర్వే సైతం ‘ఇతరులకు’ కీలక స్థానం కల్పించింది. మొత్తం 543 సీట్లలో మెజారిటీ మార్కు 272కి 20 సీట్ల దూరంలో ఎన్డీయే నిలవడం విశేషం. యూపీఏకు కేవలం 147 సీట్లు రానున్న నేపథ్యంలో.. ఇతర పార్టీలు సాధించిన 144 స్థానాలు అత్యంత కీలకం కానున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీకి 215, కాంగ్రెస్‌కు 96 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. 2014లో ఎన్డీయే 336 సీట్లు సాధించి అధికారంలోకి రాగా, అందులో మెజారిటీ మార్కు 272ను మించి 282 సీట్లు బీజేపీ గెల్చుకున్నవే కావడం గమనార్హం. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 44 సీట్లు సాధించగా, ఈ ఎన్నికల్లో కొంత పుంజుకున్నా.. సెంచరీ స్థానాలకు కొంత దూరంగానే నిలుస్తుందని సర్వే తేల్చింది. ఇతరుల్లో.. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ తమతమ రాష్ట్రాలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయని సర్వే పేర్కొంది. పశ్చిమబెంగాల్లోని మొత్తం 42 స్థానాల్లో 32 సీట్లను తృణమూల్ కాంగ్రెస్.. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 సీట్లలో అత్యధికంగా 23 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటాయంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో 10 సీట్లను తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్), 5 స్థానాలను కాంగ్రెస్, ఒక్కో సీటు చొప్పున బీజేపీ, ఎంఐఎం గెలుచుకుంటాయంది. ఒడిశాలో బీజేపీ బలం పుంజుకుంటుందని సర్వే అంచనా వేసింది. మొత్తం 21 సీట్లలో 13 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, బీజేడీ 8 సీట్లకు పరిమితమవుతుందని వెల్లడించింది. ఇక్కడ 2014లో బీజేడీ 20 సీట్లు గెలుచుకుంది. 2019లో ఈశాన్య రాష్ట్రాల్లోని 11 సీట్లలో బీజేపీ 9 స్థానాలు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ– వీఎంఆర్ సర్వే పేర్కొంది. యూపీలో.. కీలక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లోని మొత్తం 80 స్థానాల్లో ఎస్పీ– బీఎస్పీ కూటమికి 51, ఎన్డీయేకు 27 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమవుతుందని తేల్చింది. 2014లో వేర్వేరుగా పోటీ చేసి ఎస్పీ 5 సీట్లు గెలుచుకోగా, బీఎస్పీ బోణీ చేయకపోవడం గమనార్హం. ఆ ఎన్నికల్లో యూపీలో ఎన్డీయే 73 సీట్లు గెలుచుకుంది. ఇతర కీలక రాష్ట్రాల్లో.. రాజస్తాన్‌లో బీజేపీ గతంలో మొత్తం 25 సీట్లను గెలుచుకోగా, ఈసారి ఆ సంఖ్య 17కి తగ్గుతుందని, 8 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. 2014లో గుజరాత్‌లోని మొత్తం 26 సీట్లను క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ ఈ సారిఅందులోనుంచి రెండు సీట్లను కాంగ్రెస్‌కు కోల్పోనుంది. కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్‌లు చెరో 14 సీట్లు గెలుచుకుంటాయి. మధ్యప్రదేశ్‌లోని 29 సీట్లలో బీజేపీ 23, కాంగ్రెస్ 6 గెలుచుకోనున్నాయి. 2014లో బీజేపీ 27, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 48 సీట్లలో ఎన్డీయే 43 (2014 కన్నా ఒక సీటు ఎక్కువ), యూపీఏ 5 గెలుచుకుంటాయి. బిహార్‌లో(40) గత ఎన్నికల్లో ఎన్డీయే 30 సీట్లు గెలుచుకోగా.. ఈ సారి 25 కి పరిమితమవుతుంది. యూపీఏ బలం 15కి పెరుగుతుంది. మొత్తం సీట్లు: 543 ఎన్డీఏ: 252 యూపీఏ: 147 ఇతరులు: 144 కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాద్రా నగర్ హవేలీ (1), డామన్ డయ్యూ (1), అండమాన్ నికోబార్ దీవులు (1) లోక్‌సభ స్థానాలను ఎన్డీయే పార్టీలు, అటు చండీగఢ్ (1) స్థానాన్ని యూపీఏ గెలుస్తుంది. లక్షద్వీప్ (1)లో ఎన్సీపీ, సిక్కింలో ఉన్న ఒక్క స్థానాన్ని ఇతరులు గెలుచుకుంటారు. పుదుచ్చేరిలోనూ ఒక లోక్‌సభ సీటు ఉన్నప్పటికీ దాని గురించి సర్వే నివేదికలో ప్రస్తావించలేదు. -
2019 హంగ్!
-
రానున్నది ‘హంగ్’!
న్యూఢిల్లీ: మరో మూణ్నెళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ అధికార ఎన్డీయే కూటమికి చేదువార్త. ఇండియా టుడే– కార్వీ సంస్థలు సంయుక్తంగా మూడ్ ఆఫ్ ది నేషన్ (ఎంవోటీఎన్) పేరుతో నిర్వహించిన సర్వేలో.. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార కూటమికి 237 సీట్లు మాత్రమే వస్తాయనీ, గత ఎన్నికలతో పోలిస్తే ఆ కూటమి 99 సీట్లు కోల్పోనుందని తేలింది. అటు యూపీఏ కూటమి కూడా ఎన్డీయే కన్నా తక్కువ సీట్లే గెలుస్తుందనీ, అయితే గతంతో పోలిస్తే ఈ కూటమికి 106 సీట్లు అధికంగా, 166 సీట్లు వస్తాయని సర్వే అంటోంది. రెండు కూటముల్లో దేనికీ సాధారణ ఆధిక్యం (272 సీట్లు) రాదు కాబట్టి పార్లమెంటులో హంగ్ తప్పదని ఎంవోటీఎన్ సర్వే జోస్యం చెబుతోంది. పార్టీల వారీగా చూస్తే బీజేపీకి 202 స్థానాలు, కాంగ్రెస్‌కు 96 స్థానాలు వస్తాయని తేలింది. ఎన్డీయే, యూపీఏల్లో ఏ కూటమిలోనూ లేని ఇతర పార్టీలకు మాత్రం దాదాపు గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లే ఇప్పుడూ వచ్చే అవకాశముందంది. ఆ పార్టీలన్నీ కలిపి 140 సీట్ల వరకు గెలుస్తాయనీ, ప్రభుత్వ ఏర్పాటుకు వీటి మద్దతు తప్పనిసరని సర్వే పేర్కొంది. అంటే దాదాపు 100 సీట్లు ఈ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి చేజారి యూపీఏ ఖాతాలో చేరనున్నాయి. ప్రస్తుతం ఇరు కూటముల్లోనూ లేని ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి, తృణమూల్, పీడీపీలు యూపీఏలో చేరితే ఆ కూటమికి అధికారం వస్తుందని తెలిపింది. గత ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే 282 సీట్లు గెలవగా, ఎన్డీయే కూటమికి కలిపి 336 సీట్లు వచ్చాయి. ఎన్డీయేకు తగ్గనున్న ఓట్ల శాతం సీట్లతోపాటు ఎన్డీయే కూటమికి ఓట్ల శాతం కూడా తగ్గనుందని ఎంవోటీఎన్ సర్వే అంటోంది. ఎన్డీయేకు 35 శాతం, యూపీయేకు 33 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వేలో బీజేపీకి కాస్త ఉపశమనం కలిగించే అంశమేదైనా ఉందంటే.. యూపీఏ కన్నా ఆ కూటమికి ఎక్కువ సీట్లు, ఓట్లు వస్తుండటమే. ఈ అంచనాలన్నీ ఎన్డీయే, యూపీఏల్లో ప్రస్తుతం ఉన్న పార్టీల ఆధారంగా లెక్కించినవే. ఎన్నికల ముందు కూటముల్లో మార్పులు జరిగితే తామ అంచనాలు పూర్తిగా మారిపోయే అవకాశం కూడా ఉందని సర్వే స్పష్టం చేసింది. ఏ కూటమిలో ఏ పార్టీలు.. ఎన్డీయే: బీజేపీ, డీఎండీకే, పీఎంకే, ఆలిండియా రంగస్వామి కాంగ్రెస్, అప్నాదళ్, బోడో పీపుల్స్ ఫ్రంట్, జేడీ(యూ), ఎల్జేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆర్పీఐ(ఏ), శిరోమణి అకాలీ దళ్, సిక్కిం డెమోక్రటిక్ పార్టీ యూపీఏ: కాంగ్రెస్, డీఎంకే, జేడీ(ఎస్), కేరళ కాంగ్రెస్ (మణి), ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్సీపీ, ఆర్జేడీ, జేఎంఎం. ఇతరులు: వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, శివసేన, టీడీపీ, ఏఐఎంఐఎం, అన్నాడీఎంకే, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), ఆప్, ఏజీపీ, ఫార్వర్డ్ బ్లాక్, తృణమూల్, బీజేడీ, ఏఐయూడీఎఫ్, సీపీఐ, సీపీఎం, ఐఎన్ఎల్డీ, పీడీపీ, ఎంఎన్ఎస్, ఎన్ఎల్పీ, ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి. సర్వే జరిగిందిలా.. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో భాగంగా ఏపీ, తెలంగాణ, అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, యూపీ సహా 19 రాష్ట్రాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించారు. మొత్తం 97 లోక్‌సభ స్థానాలు, 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే సాగింది.ఓ ప్రశ్నావళిని రూపొందించి దాని ఆధారంగా ప్రజలను ర్యాండమ్‌గా ఇంటర్వ్యూ చేశారు. ఈ సర్వేలో 69 శాతం గ్రామీణ, 31 శాతం పట్టణ వాసులు పాల్గొన్నారు. ఈ సర్వేతో పాటు యూపీలోని 20 లోక్‌సభ స్థానాల్లో 1,103 ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రశ్నావళిని స్థానిక భాషల్లోకి అనువాదంచేసి అందించారు. ఈ సర్వేను 2018, డిసెంబర్ 28 నుంచి 2019, జనవరి 8 మధ్యకాలంలో నిర్వహించారు. ఈ సర్వేలో 19 రాష్ట్రాలకు చెందిన 13,179 మంది పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తున్న వేళ రెండు ప్రముఖ ఆంగ్ల వార్త చానెళ్లు ఎన్నికల ఫలితాలపై అంచనాలను వెలువరించాయి. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో కార్వీతో కలిసి ఇండియా టుడే టీవీ, ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరుతో సీ ఓటర్‌తో కలిసి రిపబ్లిక్ టీవీ.. దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సాధించే సీట్ల సంఖ్యలో స్వల్ప తేడాలున్నా.. రెండు సంస్థలు రానున్నది హంగేనని తేల్చాయి. ఎన్డీయే 2014 కన్నా 99 సీట్లు కోల్పోయి 237 స్థానాలు గెలుచుకుంటుందని ఇండియాటుడే.. 103 స్థానాలు కోల్పోయి 233 సీట్లను గెలుచుకుంటుందని రిపబ్లిక్ టీవీ తేల్చాయి. మరోవైపు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గతం కన్నా 106 సీట్లు పెంచుకుని 166 వద్ద నిలుస్తుందని ఇండియాటుడే.. 60 నుంచి 167 స్థానాలకు దూసుకుపోతుందని రిపబ్లిక్ టీవీ అంచనా వేశాయి. రెండు సంస్థలు కూడా రెండు కూటములకు చెందని ఇతర పార్టీలే కీలకమని తేల్చిచెబుతున్నాయి. రిపబ్లిక్ టీవీ అంచనా ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీలు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోనున్నాయి. తెలంగాణలోని మొత్తం 17 సీట్లలో 16 టీఆర్ఎస్, 1 ఏఐఎంఐఎం గెలుచుకోనున్నాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 సీట్లలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ 19 సీట్లలో, టీడీపీ 6 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. ఎన్డీయేకు మైనస్.. యూపీయేకు ప్లస్ కోల్‌కతాలో తృణమూల్ నేతృత్వంలో విపక్షాల మెగా ర్యాలీ, యూపీలో కాంగ్రెస్ లేకుండానే ఎస్పీ–బీఎస్పీ కూటమి ఏర్పాటు, క్రియాశీల రాజకీయాల్లోకి ప్రియాంక ఆగమనం తదితరాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో అంచనావేస్తూ రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ ఉమ్మడిగా జరిపిన సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. పలు మిత్ర పక్షాలు దూరం కావడంతో గతంతో పోలిస్తే ఎన్డీయేకు ఈసారి 103 స్థానాలు తగ్గే అవకాశాలున్నాయి. ఒక్క యూపీలోనే ఎస్పీ–బీఎస్పీ దెబ్బకు 45 సీట్లు కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు, ప్రధాన విపక్షం కాంగ్రెస్ గొప్పగా పుంజుకుని 160కి పైగా సీట్లు దక్కించుకోవచ్చు. హంగ్ ఏర్పడే నేపథ్యంలో 140 సీట్లు కైవసం చేసుకునే ఇతరులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల పార్టీలు టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లే. దక్షిణాదిలోనే యూపీయే మిగతా అన్ని చోట్లా ఎన్డీయేకే ఆధిక్యం ఎంవోటీఎన్ సర్వే ప్రాంతాలవారీ ఫలితాలను చూస్తే ఒక్క దక్షిణాదిలో తప్ప ఉత్తర, పశ్చిమ, తూర్పు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమికే అధిక ఓట్లు, సీట్లు వస్తున్నాయి. ఉత్తర భారతం: ఈ ప్రాంతంలోని ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, హరియాణ, ఢిల్లీ, పంజాబ్‌లలో ఎంవోటీఎన్ సర్వే జరిగింది. ఇక్కడ ఎన్డీయేకు 40% ఓట్లు, 66 సీట్లు వస్తాయనీ, అటు యూపీఏకు కేవలం 23% ఓట్లు, 20 సీట్లు సర్వే తెలిపింది. ఇక ఇతర పార్టీలకు 37% ఓట్లు, 65 సీట్లు వస్తాయంది. యూపీఏ కన్నా ఇతర పార్టీలకే ఇక్కడ అధిక సీట్లు రానున్నాయి. పశ్చిమ భారతం: గుజరాత్, మహారాష్ట్రలతోపాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లను కూడా ఈ సర్వే పశ్చిమ ప్రాంతంగా పేర్కొంది. ఇక్కడ ఇతరుల పాత్ర పెద్దగా ఉందనీ, యూపీఏ కన్నా ఎన్డీయేకు ఓట్ల శాతం కొంచెం ఎక్కువగా ఉంటున్నప్పటికీ సీట్ల సంఖ్యలో మాత్రం భారీ వ్యత్యాసం ఉంటుందని తెలిపింది. ఎన్డీయేకు 46% ఓట్లు, 76 సీట్లు, యూపీఏకు 42% ఓట్లు, 40 సీట్లు, ఇతరులకు 12 శాతం ఓట్లు తప్ప సీట్లేవీ రావని సర్వే అంటోంది. తూర్పు భారతం: బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, జార్ఖండ్‌ల్లో సర్వే జరిగింది. ఇక్కడా ఎన్డీయేదే పై చేయి. ఎన్డీయే కూటమికి 37% ఓట్లు, 69 సీట్లు, యూపీఏకు 25% ఓట్లు, 28 సీట్లు, ఇతర పార్టీలకు 38% ఓట్లు, 45 సీట్లు వస్తాయని ఎంవోటీఎన్ సర్వే పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ గతంలో కన్నా ఇప్పుడు బలపడినట్లుగా సర్వే తెలిపింది. దక్షిణ భారతం: యూపీఏకు ఆధిక్యం ఉన్న ప్రాంతం ఇదొక్కటే. అదే సమయంలో దక్షిణాదిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పరిస్థితి దారుణంగా ఉంది. బీజేపీ 18 శాతం ఓట్లతో 26 సీట్లు సాధిస్తుందనీ, ఇతర పార్టీలు 39 శాతం ఓట్లు తెచ్చుకుని 30 సీట్లు గెలుస్తాయని సర్వే తెలిపింది. యూపీఏకు 43 శాతం ఓట్లు, 78 సీట్లు వస్తాయంది. -
‘యూపీఏ-3 ఏర్పాటు చేస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే యూపీఏ-3ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ అన్నారు. తమతో కలిసి వచ్చేందుకు ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, వాటి మద్దతుతో కే్ంద్రంలో యూపీఏ-3ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.బీజేపీ కంటే ఎక్కువ స్థానాలనే కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాల్లో విజయం సాధించిందని, ఈసారి 160 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని థరూర్ జోస్యం చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ ఇదివరకే ప్రకటించిన విషయాన్ని థరూర్ గుర్తుచేశారు. శనివారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల మోదీపాలనలో దేశ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అచ్ఛేదీన్ అంటూ ప్రజలను మోసం చేసిన మోదీకి మరోసారి అధికారం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలు మోదీకి వ్యతిరేకంగా కలిసి పోరాడుతున్నాయని శశిథరూర్ పేర్కొన్నారు. -
కొత్త సంవత్సరంలో ప్రధాని ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయాలకు సంబంధించి 2018 సంవత్సరం అసంతృప్తిగానే ముగిసిపోయింది. 2019 సంవత్సరంలోకి అడుగుపెట్టే నాటికి పాలకపక్ష భారతీయ జనతా పార్టీ కొంత పతనమైంది. కాంగ్రెస్ పార్టీ కొంత బలం పుంజుకున్నా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 48 ఏళ్లకు కూడా పెద్దగా ఎదిగినట్లు కనిపించడం లేదు. దేశ ప్రయోజనాలకన్నా స్వీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుండడంతో ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. దేశ యవనికపై మంచుపొర కప్పేసినట్లు భవిష్యత్ రాజకీయాలు అస్పష్టంగానే ఉన్నాయి. 2013లో ఇదే కాలానికి రాజకీయ వాతావరణం ఎండలో చలికాచుకున్నట్లు వెచ్చగా, అతి స్పష్టంగా కనిపించింది. కొత్త సంవత్సరంలో ఏ పార్టీ కేక్ కట్ చేస్తుందో దాదాపు తేలిపోయింది. ఇప్పడు ఆ సీన్ గల్లంతయింది. అయోమయం నెలకొంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం హోరెత్తించిన రాజకీయ నాయకులు అలసిపోయారు. వారి ప్రసంగాలను వినీ వినీ ప్రజలకు బోరుకొట్టింది. నాటి ఎన్నికల వేడిని నేటికీ కొనసాగించేందుకు మీడియా ఒక్కటే పడరాని పాట్లు పడుతోంది. రోజువారి రాజకీయ విశ్లేషనల పేరిట టీఆర్పీ రేట్ల కోసం టీవీ ఛానళ్లు కుస్తీ పడుతున్నాయి. గడచిన ఐదేళ్ల కాలం ఇటీవలి రాజకీయ చరిత్రలో ఉద్రేకపూరిత ఉద్విగ్నమైనదని చెప్పవచ్చు. రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక ఘర్షణలు, సామాజిక సంఘర్షణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా గడచిన సంవత్సరం మూక హత్యలు, మూఢ నమ్మకాలు పెరిగాయి. అన్నింటికంటే నకిలీ వార్తల చెలామణి పెద్ద నోట్ల రద్దుకంటే సంచలనం సృష్టించాయి. 2018 సంవత్సరంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలనే వేడెక్కించాయి. ఆ ఎన్నికలు పాలకపక్ష బీజేపీని దాదాపు మోకాళ్లపై నిలబెట్టాయి. బ్రాహ్మణిజాన్ని వంట పట్టించుకున్న రాహుల్ గాంధీ గుజరాత్ ఫలితాలను చేపట్టబోయే అధ్యక్ష పదవికి ప్రతిఫలంగా అందించారు. అప్పటినుంచి రాహుల్ గాంధీ ‘వన్ మేన్ మిషన్’ లా రాజకీయ రంగంలో పరుగు మొదలు పెట్టారు. నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయమే లేదన్న రాజకీయ వాతావరణంలో ‘ఎవరైనా ఫర్వాలేదు, మోదీ తప్ప’ అన్న పరిస్థితిని తీసుకొచ్చారు. కనుక ఈ కొత్త సంవత్సరంలో కొత్త ప్రధాన మంత్రి ఎవరన్నది ప్రశ్న కాదు. మరోమారు నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా? లేదా? అన్నదే ప్రశ్న. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే, మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తే నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా మరో నాయకుడు తెరపైకి రావచ్చు. కార్యకర్తలే పునాదిగా ఎదిగిన బీజేపీ–ఆరెస్సెస్‌ల క్రమశిక్షణకు భిన్నంగా ఏకఛత్రాధిపత్యంగా చక్రం తిప్పుతున్న నరేంద్రమోదీ పట్ల పాలకపక్షంలోనే అసమ్మతి రాగాలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. గతంలో ఊహించినట్లుగా పాలకపక్ష ఎన్డీయే, కాంగ్రెస్ నేతత్వంలో మహా కూటమి మధ్యనే ప్రధాన పోటీ ఉండకపోవచ్చు. తెలంగాణలో టీఆర్ఎస్ అఖండ విజయంతో బీజేపీ, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. మహా కూటమికి బదులుగా పలు చిరుకూటములు ఏర్పడవచ్చు. పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు సమసిపోయిన నేటి రాజకీయాల్లో రాజకీయ శత్రువంటూ లేకుండా పోయారుకనుక ఏమైనా జరగవచ్చు! రాజకీయ వాతావరణం పట్ల స్పష్టత రావాలంటే మరికొంత కాలం నిరీక్షించాల్సిందే. ప్రస్తుతం వాతావరణం గురించి వర్ణించాలంటే బిజినెస్‌లో చెప్పే ‘వీయూసీఏ’ (అస్పష్టత, అనిశ్చిత, సంక్లిష్టత, సంధిగ్ధత)లా ఉంది. -
‘తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సోనియా’
సాక్షి, హైదరాబాద్: ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన మహనీయురాలు సోని యాగాంధీ అని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొనియాడారు. ఆదివారం గాంధీభవన్‌లో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సోని యాగాంధీకి భారత ప్రధాన మంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ తృణప్రాయంగా భావించి త్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. యూపీఏ అధికారంలో ఉన్న కాలంలో చైర్‌పర్సన్‌గా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. గ్రామీణ పేద ప్రజలకు ఉపాధి అందించాలనే జాతీయ ఉపాధిహామీ పథకం, ఆకలి చావుల నివారణకు ఆహార భద్రతా చట్టం, ప్రజలకు ప్రభుత్వాల మధ్య పారదర్శకత, జవాబుదారీతనం కోసం సమాచారహక్కు చట్టం తీసుకువచ్చారని వివరించారు. సమాజంలోని ప్రతి పేదవారికి చదువు అందించాలని విద్యాహక్కు చట్టాలతో పాటు, మరెన్నో చారిత్రాత్మక చట్టాలను చేయడంలో సోనియాగాంధీ కృషి మరవలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వీహెచ్, టీపీసీసీ కోశాధికారి గూడురు నారాయణరెడ్డి ,అధికార ప్రతి నిధులు నిరంజన్, ఇందిరా శోభన్ పాల్గొన్నారు. ఏఐసీసీలో సోనియా జన్మదిన వేడుకలు సాక్షి, న్యూఢిల్లీ: రాజీవ్ సద్భావన యాత్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ 72వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, యాత్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంతకు ముందు వారు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు ఆమె సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో సోనియాగాంధీదే కీలక పాత్ర అని పొంగులేటి పేర్కొన్నారు. -
రఫేల్ 'వార్'.. రాజకీయ యుద్ధం!
ఎప్పటికప్పుడు కొత్త కోణాలు వెలుగులోకి వస్తూ ఉండటంతో కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఆత్మరక్షణలో పడిపోయింది. రఫేల్ ఒప్పందం వివరాలు బయటకు తీసుకురావాలా ? వద్దా అనే అంశంపై త్వరలోనే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఆ వివరాలు బయటకు వస్తే పరిస్థితి ఎలా మారు తుంది ? సుప్రీంకోర్టు వాదనల సందర్భంగా కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశాలేంటి ? ఈ వ్యవహారం ఎందుకు రాజకీయ వేడిని రగులుస్తోంది? ధర.. దడ దడ రఫేల్ ఒప్పందానికి బీజం 2000 సంవత్సరం వాజ్‌పేయి హయాంలో పడినప్పటికీ యూపీఏ హయాంలోనే ఒక కొలిక్కి వచ్చింది. 2007లో యూపీఏ ఈ ఒప్పందంపై ప్రతిపాదనలు సిద్ధం చేసింది. చివరికి 2011లో ఫ్రాన్స్ నుంచి 126 విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీని కోసం ఒక్కో విమానానికి దాదాపుగా రూ.526 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. అయితే దీనిపై రెండు దేశాల ప్రభుత్వాలు ఒక అవగాహనకు రాకుండానే ఫ్రాన్స్‌లో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ఒప్పందం ముందుకు సాగలేదు. ఆ తర్వాత భారత్‌లో కూడా ఎన్నికలు జరిగి మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ ఒప్పందం పరుగులు తీసింది. 126కి బదులుగా 36 విమానాల కొనుగోలుకే కేంద్రం ఒప్పందం ఖరారు చేసుకుంది. అయితే ధర విషయంలో గోప్యత పాటించింది. ఈ ఒప్పందం వివరాలు, విమానం ధరల్ని బయటపెడితే శత్రుదేశాలకు ఆయుధాలు, పరికరాల వివరాలు తెలిసిపోయి దేశ భద్రత ప్రమాదంలో పడుతుందంటూ వాటి వివరాలు వెల్లడించడానికి నిరాకరించింది. యూపీఏతో పోల్చి చూస్తే తాము ఖజానాకు రూ.12,600 కోట్లు ఆదా చేశామని మోదీ సర్కార్ చెప్పుకుంది. కానీ 36 విమానాలకే రూ.59 వేల కోట్లు చెల్లించడానికి ఎన్డీయే ప్రభుత్వం అంగీకరించినట్టుగా వార్తలు వచ్చాయి. దీని ప్రకారం ఒక్కో విమానానికయ్యే ఖర్చు దాదాపు రూ.1,638 కోట్లు. రఫేల్ ఒప్పందంలో అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దీని విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ.. 2016 విదేశీ మారకద్రవ్య మార్పిడి లెక్క ప్రకారం ఒక్కో యుద్ధ విమానం ధర రూ.670 కోట్లు అని, అయితే పూర్తిస్థాయి ఆయుధాలు, ఏవియానిక్స్‌తో కూడిన ధరను వెల్లడిస్తే దేశ భద్రతకే ప్రమాదం అంటూ దాటవేశారు. ఇక పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఒక్కో యుద్ధ విమానం ధర 15.5 కోట్ల యూరో(దాదాపు రూ.1275 కోట్లు)లు ఉండేదని, ఇప్పుడు ఏకంగా 40 శాతం పెరిగిపోయి 27 కోట్ల యూరోలకు (దాదాపు రూ.2,219 కోట్లు) చేరుకుందని వాదించారు. ఇలా ఇరుపక్షాల మ«ధ్య రఫేల్ ధరల యుద్ధం రాజకీయ వివాదాన్ని మరింత రాజేసింది. ఆఫ్సెట్ కంపెనీ చేతులెత్తేస్తే? అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీని గట్టెక్కించడానికే కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఆఫ్సెట్ ఒప్పందానికి అనుమతిచ్చిందనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 2008లో రిలయన్స్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఆర్ఏటీఎల్) ఏర్పాటు చేశారు. ఆ కంపెనీకే రఫేల్ ఆఫ్సెట్ కాంట్రాక్ట్ అప్పగించాల్సి ఉంది. కానీ మోదీ హయాంలో సీన్ మారింది. ముఖేశ్ ఆర్ఏటీఎల్ కార్యకలాపాల్ని నిలిపివేశారు. అనిల్ రాత్రికి రాత్రి రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేనంత భారీ ఆఫ్సెట్ కాంట్రాక్ట్ ఆర్డీఎల్ దక్కించుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ హాల్‌ను కాదని మరీ ఆర్‌డీఎల్‌కు కాంట్రాక్ట్ అప్పగించడమేంటని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచి నిలదీస్తూ వచ్చింది. సుప్రీంకోర్టు వాదనల సమయంలో న్యాయమూర్తులు ఈ అంశంపైనే ప్రభుత్వ లాయర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. యుద్ధ విమానాల తయారీలో ఏ మాత్రం అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్ తమకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చలేకపోతే, విమానాల తయారీ చేపట్టలేకపోతే ఏం జరుగుతుంది? దేశ ప్రయోజనాల సంగతేంటి? అని న్యాయ మూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ ప్రశ్నించారు. నిజంగా ఆ పరిస్థితే వస్తే ఆఫ్సెట్ కంపెనీని ఒప్పందం నుంచి తప్పించవచ్చని దసో ఏవియేషన్‌కు జరిమానాలు కూడా విధించవచ్చని వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ చేతుల్లో ఏమీ ఉండదా ? రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగిందేనని ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. కానీ సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సమయంలో ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇది కేవలం భారత్‌కు, రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ ‘దసో ఏవియేషన్’కు కుదిరిన ఒప్పందం మాత్రమే. యుద్ధ విమానాల సరఫరాలో ఏమైనా తేడాలొచ్చినా, దసో ఏవియేషన్ యుద్ధ విమానాల తయారీలో నాణ్యతాప్రమాణాలు పాటించకపోయినా ఫ్రాన్స్ ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు వహించదు. ఎందుకంటే ఒప్పందం సమయంలో ఇవ్వాల్సిన సార్వభౌమ హామీ(సావరీన్ గ్యారంటీ) ఫ్రాన్స్ ఇవ్వలేదు. అయినా కూడా రక్షణ శాఖ ఏమీ పట్టకుండా ఒప్పందంపై ముందుకు వెళితే న్యాయశాఖ అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో భారత్ ఒత్తిడి మేరకు ఫ్రాన్స్ సర్కార్ కంఫర్ట్ లేఖ ఇచ్చింది. ఆ లేఖ ఇంచుమించుగా సావరీన్ గ్యారంటీతో సమానమని కేంద్రం పేర్కొంటోంది. కానీ భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురైతే ఆ లేఖకు చట్టబద్ధత ఉండదని, అంతర్జాతీయ న్యాయస్థానాల్లో అది చెల్లుబాటుకాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా ఆత్మరక్షణలో కేంద్రం అదే ఒప్పందం, అవే విమానాలు కానీ యూపీఏ నుంచి ఎన్డీయే హయాం వచ్చేసరికి ఎన్నో తేడాలు. ధర రెట్టింపు అయిందంటూ ఆరోపణలు. ప్రభుత్వ రంగ సంస్థ హాల్‌ను పక్కన పెట్టారంటూ విమర్శలు. అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చడానికే దేశ ప్రయోజనాలను కాలరాశారంటూ కాంగ్రెస్ గగ్గోలు పెడుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు దీటైన జవాబులివ్వలేక కేంద్ర మంత్రులు తడబడిపోతున్నారు. కేంద్ర మంత్రులు చేసిన వాదనలన్నీ తప్పుడువేనని ఎప్పటికప్పుడు తేలిపోతూ ఉండటంతో కేంద్రం ఇరుకున పడిపోతోంది. విమానం ధరలు వెల్లడిస్తామని తొలుత ప్రకటించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆ తర్వాత మాటమార్చి దేశ ప్రయోజనాల దృష్ట్యా గోప్యత తప్పదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ హాల్‌ను కాదని, అప్పటికప్పుడు హడావుడిగా ఏర్పాటు చేసిన రిలయన్స్ డిఫెన్స్‌ను సర్వీసు ప్రొవైడర్లుగా ఎందుకు ఎంపిక చేశారన్నదానికి, అది తమ పరిధిలో లేదని దసో ఏవియేషనే ఆ నిర్ణయం తీసుకుందని కేంద్రం వాదిస్తోంది. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలన్ రిలయెన్స్‌ను ఎంపిక చేసుకోవాలని మోదీ ప్రభుత్వమే తమకు సూచించిందని బహిరంగంగానే చెప్పడంతో బీజేపీ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. హాల్‌కి యుద్ధ విమానాలు చేసే సామర్థ్యమే లేదంటూ నిర్మలా సీతారామన్ వాదించడంపై రాజకీయంగా రచ్చ జరిగింది. ఆ తర్వాత హాల్ మాజీ చైర్పర్సన్ సువర్ణ సుఖోయ్–30 వంటి యుద్ధ విమానాలనే తాము తయారు చేశామని ఈ బాధ్యతను అప్పగించినా చేసేవాళ్లమని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడంతో కేంద్రం జవాబు చెప్పలేక నీళ్లు నమిలింది. దీన్ని ఆయుధంగా చేసుకొని రాహుల్ హాల్ సిబ్బందితో సమావేశమై నైతిక మద్దతుని ప్రకటించి రాజకీయ వేడిని మరింత పెంచారు. ఆ తర్వాత కోర్టులో కూడా న్యాయమూర్తుల నుంచి కేంద్రం గట్టి ప్రశ్నల్నే ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే ఈ ఒప్పందానికి ఫ్రాన్స్ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం లేదన్న విషయంపై కూడా ఇప్పడు తాజాగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తమ్మీద రఫేల్ ఒప్పందం అవకతవకలు కోర్టుకి చేరడంతో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ రేగుతోంది. ఒప్పందం వివరాలు బహిర్గతం చేయాలన్న నిర్ణయం కోర్టు తీసుకుంటే ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే రఫేల్ యుద్ధంలో కేంద్రంపై పైచేయి సాధించిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల సమయానికి ఈ ఒప్పందంలో లొసుగులన్నీ వెలుగులోకి వచ్చి తమకే లబ్ధి చేకూరుతుందనే ఆశతో ఉంది. యూపీఏ డీల్.. 2007 మధ్యతరహా బహుముఖ యుద్ధ విమానాలు(ఎంఎంఆర్సీఏ) కొను గోలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తం 126 యుద్ధ విమానాలు కొనుగోలుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఆగస్టు 28, 2007 ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ యుద్ధ విమానాల సంస్థ దసో ఏవియేషన్ బిడ్ వేసింది. దీంతో పాటు రష్యాకు చెందిన మిగ్–35, స్వీడన్సాబ్ జాస్–39 గ్రిపెన్, అమెరికా మార్టిన్ ఎఫ్–16, యూరో ఫైటర్ టైఫూన్ వంటి సంస్థలు కూడా బిడ్లు దాఖలు చేశాయి. సెప్టెంబర్ 4, 2008 రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఆర్ఏటీఎల్) పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేశారు. భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదిరితే దసో ఏవియేషన్, ఆర్ఏటీఎల్ సంయుక్తంగా యుద్ధ విమానాల తయారీ చేపట్టాలని ఒక అవగాహనకు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. మే 2011 భారత వాయుసేన చేసిన షార్ట్ లిస్ట్‌లో రఫేల్, యూరోఫైటర్ జెట్స్ నిలిచాయి. జనవరి 2012 బిడ్లను పరిశీలిస్తే దసో ఏవియేషన్ తక్కువ ధరని కోట్ చేసింది. మొత్తం 126 విమానాల్లో 18 విమానాలను అప్పటికప్పుడు పంపడానికి, మిగిలిన వాటిని దసో సహకారంతో హాల్ తయారు చేయాలని అంగీకారానికి వచ్చాయి. మార్చి 13, 2014 రఫేల్ ధరలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, దసో–హాల్ మధ్య పని విభజన వంటి అంశాలపై చర్చలు జరిగాయి. కానీ ఒక అవగాహనకు రాలేకపోవడంతో ఒప్పందం ముందుకు సాగలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్కో యుద్ధ విమానాన్ని రూ. 526 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడానికి నిర్ణయించినట్లుగా చెబుతోంది. ఎన్డీయే డీల్.. మార్చి 28, 2015 అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ అనే కొత్త కంపెనీ ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 10, 2015 ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌కు వెళ్లి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. జూన్ 2015 126 యుద్ధ విమానాల టెండర్లను రక్షణ శాఖ అధికారికంగా వెనక్కి తీసుకుంది. డిసెంబర్, 2015 అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలన్ సహచరి, నటి అయిన జూలీ గయె ప్రధాన పాత్రలో నటించే సినిమాల్లో రూ.1,300 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రకటించారు. రఫేల్ కాంట్రాక్ట్ తమకి దక్కడం కోసం క్విడ్‌ప్రోకో ఒప్పందంలో భాగంగానే ఈ పెట్టుబడులు పెట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. జనవరి 2016 ఫ్రాన్స్ అధ్యక్షుడి హోదాలో ఫ్రాన్సిస్ హోలన్ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రఫేల్ ఒప్పందంపై ఇరుపక్షాలు సంత కాలు చేశాయి. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విమానాలు సరఫరా చేయాల్సి ఉంది. అక్టోబర్ 3, 2016 అనిల్ అంబానీ ఆర్డీఎల్, దసో ఏవియేషన్ జాయింట్ వెంచర్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఒప్పందం ప్రకారం దసో ఏవియేషన్ ఒప్పందం విలువలో 50% పెట్టుబడుల్ని భారత్‌లో తప్పనిసరిగా పెట్టవలసి ఉంటుంది. ఫిబ్రవరి 2017 దసో రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ (డీఆర్ఎల్) అన్న పేరుతో సంయుక్త భాగస్వామ్య సంస్థ ఏర్పాటు. -
నేను అబద్ధం చెప్పలేదు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ముంగిట రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద వివాదం మరో మలుపు తిరిగింది. ఎన్డీయే హయాంలో కుదిరిన ఒప్పందం ‘క్లీన్‌డీల్’ అని ఫ్రెంచ్ తయారీ కంపెనీ డసో సీఈఓ ఎరిక్ ట్రాపియర్ స్పష్టం చేశారు. గత యూపీఏతో పోలిస్తే ఎన్డీయే ప్రభుత్వం 9 శాతం తక్కువ ధరకే ఒప్పందం చేసుకుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎరిక్ అబద్ధాలాడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. వార్తా సంస్థ ఏఎన్ఐకి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయంగా సున్నితమైన ఈ ఒప్పందానికి సంబంధించిన పలు విషయాల్ని ఎరిక్ బహిర్గతం చేశారు. సీఈఓ స్థానంలో ఉన్న తాను కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా అబద్ధాలు చెప్పడంలేదని అన్నారు. ఎరిక్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటలయుద్ధం తారస్థాయికి చేరింది. కేంద్ర ప్రభుత్వ ప్రోద్భలంతోనే ఎరిక్ కట్టుకథలు చెబుతున్నారన్న కాంగ్రెస్.. నిష్పాక్షిక విచారణతోనే నిజాలు బయటికొస్తాయని పేర్కొంది. కాంగ్రెస్ దుష్ప్రచారం ఎరిక్ వ్యాఖ్యలతో బట్టబయలైందని బీజేపీ తిప్పికొట్టింది. బేరసారాలతో తగ్గిన ధర: ‘ఎన్డీయే కొనే 36 విమానాలు యూపీఏ ఆర్డర్ ఇచ్చిన 18 విమానాలకు రెండు రెట్లు. దీని ప్రకారం ధర కూడా రెట్టింపు కావాలి. అంతర ప్రభుత్వ ఒప్పందం కావడంతో బేర సారాల అనంతరం ధరను 9 శాతం తగ్గించాం. ‘ఫ్లై అవే’ విధానంలో కొనుగోలుచేస్తున్నందున ఎన్డీయే ఒప్పందంలోని 36 విమానాల ధర.. యూపీఏ కుదుర్చుకున్న 126 విమానాల కన్నా తక్కువే’ అని ఎరిక్ తెలిపారు. యూపీఏ ఒప్పందంలో భాగంగా భారత్‌లో తయారుచేయాల్సిన విమానాలు ఏ రకమైనవి, ధరల మార్పులు తదితరాలను ఆయన వెల్లడించలేదు. రిలయన్స్ ఒక్కటే కాదు.. ఆఫ్సెట్ నిబంధనలు పాటించేందుకు తాము రిలయన్స్ డిఫెన్స్‌తో పాటు పలు ఇతర సంస్థల్ని కూడా భాగస్వామ్య సంస్థలుగా ఎంచుకున్నామని ఎరిక్ తెలిపారు. ‘ఈ మేరకు మొత్తం 30 కంపెనీలతో అవగాహన కుదుర్చుకున్నాం. ఒప్పందం మేరకు మొత్తం ఆఫ్సెట్ వ్యయంలో 40 శాతాన్ని ఈ కంపెనీలతో కలసి పంచుకుంటాం. అందులో రిలయన్స్ డిఫెన్స్ వాటా 10 శాతమే. మిగిలినదంతా డసో, ఆ కంపెనీల మధ్య నేరుగా కుదిరిన ఒప్పందంలో భాగం’ అని ఎరిక్ వెల్లడించారు. రిలయన్స్ డిఫెన్స్‌లో డసో ఎలాంటి పెట్టుబడులు పెట్టబోదని, కానీ 50:50 నిష్పత్తిలో రెండు కంపెనీలు జాయింట్ వెంచర్ ఏర్పాటుచేస్తాయని తెలిపారు. దీని మొత్తం విలువ రూ.800 కోట్లు ఉండొచ్చన్నారు. యూపీఏ అలా.. ఎన్డీయే ఇలా..: ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసేందుకు యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 126 విమానాల్ని కొనుగోలు చేయాలని నిర్ణయించిన యూపీఏ.. అందులో 18 విమానాల్ని ‘ఆఫ్ షెల్ఫ్’(అవసరాలతో నిమిత్తం లేకుండా అప్పటికే తయారైనవి) విధానంలో సేకరించడానికి అంగీకరించింది. మిగిలిన వాటిని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో స్వదేశంలోనే తయారుచేయించాలని ఒప్పందం చేసుకుంది. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ఈ ఒప్పం దాన్ని రద్దుచేసి, 36 విమానాల్ని ‘ఫ్లై అవే’(ఎగరడానికి సిద్ధంగా ఉన్న) షరతుతో కొనుగోలుచేసేందుకు తాజా డీల్ కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.58 వేల కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. -
యూపీఏలో చేరుతున్న టీడీపీకి స్వాగతం!
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మున్ముందు కాంగ్రెస్‌తో అంటకాగుతారని బాహాటంగా వెల్లడైంది. యూపీఏలో చేరుతున్న టీడీపీని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలపడం సంతోషమని, కేవలం తెలంగాణాలోనే కాకుండా టీడీపీతో తమ పొత్తు కొనసాగుతుందని పీటీఐ ఇంటర్వ్యూలో మొయిలీ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేస్తాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలపడం మంచి సంకేతమని, తెలుగుదేశం పార్టీతో మాకు మంచి అవగాహన ఉందని మొయిలీ చెప్పుకొచ్చారు. తెలంగాణలో మహాకూటమి పేరుతో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుకు దిగడంపై తెలుగు రాష్ట్రాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. టీడీపీ బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులుకలపడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీతో తమ పార్టీ పొత్తు భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని వీరప్ప మొయిలీ బాహాటంగా వెల్లడించారు. రాష్ట్ర విభజన చేపట్టిన కాంగ్రెస్‌పై నిన్నమొన్నటి వరకూ విరుచుకుపడ్డ చంద్రబాబు అదే పార్టీతో ఇప్పుడు పొత్తుకు పాకులాడటం సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలకు తావిస్తోంది. -
రాఫెల్ రగడ..
-
రాఫెల్‌పై రచ్చ రచ్చ..!
ఆరోపణలు, ప్రత్యారోపణలు.. విమర్శలు, ప్రతివిమర్శలతో రాఫెల్ రాజుకుంటోంది. భారత ప్రభుత్వం సూచనమేరకే రిలయన్స్ డిఫెన్స్‌ని ఒప్పందంలో భాగస్వామిగా చేసుకున్నట్టు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ తాజాగా పేల్చిన బాంబుతో రాజకీయ రచ్చ తారాస్థాయికి చేరుకుంది. మరోవైపు ఫ్రాన్స్ ప్రభుత్వం ఇలాంటి ఒప్పందాల్లో విమానాలు తయారు చేసే కంపెనీలకే పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, డసో ఏవియేషన్ కంపెనీ ఇష్టం ప్రకారమే భాగస్వామి ఎంపిక ఉంటుందని అంటోంది. అసలు ఏమిటీ ఒప్పందం ? కాంగ్రెస్ చేస్తున్న ప్రధాన ఆరోపణలు, లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్నలేంటి ? కేంద్రం చెబుతున్నదేంటి ? ఇరు పార్టీల మధ్య రాఫెల్ పరిణామాలు ఎందుకు వివాదాన్ని లేవనెత్తాయి ? యూపీఏ హయాంలో ఏం జరిగింది ? 126 మధ్య తరహా రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని 2007లో యూపీఏ ప్రభుత్వం భావించింది. కొన్నేళ్ల పాటు ఇరుపక్షాల మధ్య చర్చలు సాగాయి. చివరికి 18 విమానాలు ఫ్రాన్స్‌లో తయారు చేయాలని, మిగిలిన 108 విమానాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) భాగస్వామ్యంతో భారత్‌లో తయారు చేయాలని 2012లో కేంద్రప్రభుత్వం, విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్ ఒక అంగీకారానికి వచ్చాయి. ధర విషయంలో చర్చలు ఒక కొలిక్కి రాకుండానే ఇరు దేశాల్లో ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారాయి. దీంతో ఒప్పందం ముందుకు సాగలేదు. అయితే ఒక్కో యుద్ధవిమానానికి రూ. 526 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నామని కాంగ్రెస్ చెబుతోంది. ఎన్డీయే హయాంలో ఏం జరిగింది ? ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్‌తో చర్చలు జరిపారు.126కి బదులుగా 36 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నామని 2015లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ ధర విషయంలో మాత్రం గోప్యత పాటించింది. ఎన్ని కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందో, ఒక్కో విమానాన్ని ఎన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేస్తోందో అధికారికంగా వెల్లడించలేదు. అయితే 59 వేల కోట్లకు రాఫెల్ ఒప్పందం కుదిరిందని, 2019 సెప్టెంబర్ నుంచి 2022 ఏప్రిల్ మధ్య 36 యుద్ధ విమానాలను భారత్‌కు సరఫరా చేయడానికి ఫ్రాన్స్ అంగీకరించిందని వార్తలు వచ్చాయి. ఈ లెక్కన చూస్తే ఒక్కో విమానం కొనుగోలుకయ్యే ఖర్చు 1670 కోట్లు. ఇక యుద్ధ విమానాల తయారీకి భారత్ భాగస్వామిగా హెచ్ఏఎల్కు బదులుగా అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ డిఫెన్స్‌ను సర్వీస్ ప్రొవైడర్లుగా చేర్చింది. హాల్‌ను తప్పించడం యూపీఏ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ను రాఫెల్ యుద్ధ విమానాల తయారీ భాగస్వామిగా నియమిస్తే, దానిని తప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది కాంగ్రెస్ ప్రధానంగా లేవనెత్తిన అంశం. అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చడం కోసమే హెచ్ఏఎల్ను తప్పించారంటూ దాడికి దిగుతూ వచ్చింది. హాల్‌కి రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే సామర్థ్యం లేనే లేదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఎదురు దాడి చేశారు. అయితే హెచ్ఏఎల్ మాజీ చైర్ పర్సన్ టి. సువర్ణరాజు యుద్ధ విమానాలు చేసే సామర్థ్యం తమకు ఉందని స్పష్టం చేయడంతో ఎన్డీయే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. సుఖోయ్–30 విమానాలను తాము తయారు చేశామని, డసో ఏవియేషన్ తయారు చేసిన మిగ్–2000 విమానాల నిర్వహణ కూడా తామే చేస్తున్నామంటూ టి.ఎస్ రాజు మీడియా ఇంటర్వూ్యల్లో పేర్కొన్నారు. అయిదేళ్లుగా సాంకేతిక బృందానికి తాను నాయకత్వం వహించానని, రాఫెల్ విమానాలను కూడా తాము తయారు చేయగలిగి ఉండేవాళ్లమని రాజు వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలతో నిర్మలా సీతారామన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని రుజువైందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలకు దిగడంతో రాజకీయ వేడి పెరిగింది. వివాదం ఎలా ముదిరింది? రాఫెల్ ఒప్పందంలో భారీగా అవకతవకలు జరిగాయని, దేశ ప్రయోజనాలు కాలరాస్తూ అనిల్ అంబానీకి లబ్ధి చేకూరేలా మోదీ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుందని కాం గ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదట్నుంచీ ఆరో పణలు చేస్తున్నారు. రాఫెల్ ఒప్పందంలో అంశాలను రహస్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది ? విమానాల తయారీ భాగస్వామిగా హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)ను ఎందుకు తప్పించారు ? విమానాల తయారీ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేయాల్సిన అవసరమేంటి ? ఈ మూడు అంశాల చుట్టూ వివాదం తిరుగుతూ వస్తోంది. కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు బీజేపీ సూటిగా సమాధానాలు చెప్పకపోవడం, కొత్త కొత్త విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉండటంతో రాజకీయం రంగులు మారుతోంది. రాఫెల్ అంటే.. రెండు ఇంజిన్లు కలిగిన బహుముఖ యుద్ధవిమానాలను ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తుంది. రాఫెల్ పేరుతో తయారు చేసే ఈ యుద్ధవిమానాలు అత్యంత సమర్థంగా పనిచేస్తాయని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కాంగ్రెస్, కేంద్రం వాదప్రతివాదాలు జరిగిందిలా.. రాఫెల్ ఒప్పందంపై మొదట్నుంచి ఎన్డీయే ప్రభుత్వం గోప్యత పాటిస్తూ వస్తోంది. యూపీఏ చర్చించిన దాని కంటే తమ ఒప్పందమే ఉత్తమమైనదని యూపీఏతో పోల్చి చూస్తే తాము ఖజానాకు 12,600 కోట్లు ఆదా చేశామని మోదీ సర్కార్ చెబుతోంది. ఫ్రాన్స్, భారత్ మధ్య 2008లో కుదిరిన అవగాహన మేరకు ఈ ఒప్పందంలో అంశాలు బయటకు వెల్లడించలేమని అంటోంది. అయితే ఆ ఒప్పందం కుదిరిన సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న కాంగ్రెస్‌కు చెందిన ఏకే ఆంటోని బీజేపీ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, ఆ ఒప్పందం ప్రకారం సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలు వెల్లడి చేయకూడదనే ఉంది తప్ప, ధర కాదని అంటున్నారు. అలాంటప్పుడు రాఫెల్ యుద్ధ విమానం ధరలపై గోప్యత పాటించాల్సిన అవసరమేముందన్నది ఆయన వాదన. యూపీఏ ప్రభుత్వం ఒక్కో యుద్ధ విమానాన్ని రూ.526 కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్ధమైతే ఎన్డీయే ప్రభుత్వం ఒక్కో యుద్ధ విమానానికి రూ.1670 కోట్లు వెచ్చిస్తోందని, అందుకే బీజేపీ నోరు మెదపడం లేదన్నది కాంగ్రెస్ వాదన. రిలయన్స్ డిఫెన్స్ చేరడం ఒక వ్యాపారవేత్తకు లబ్ధి చేకూర్చడానికే మోదీ ప్రభుత్వం దేశ భద్రతనే పణంగా పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 2015, ఏప్రిల్ 10న రాఫెల్ ఒప్పందం కుదిరిందని మోదీ ప్రభుత్వం ప్రకటిస్తే, దానికి సరిగ్గా 12 రోజులు ముందే రిలయన్స్ డిఫెన్స్ కంపెనీ ఏర్పాటైందన్నది కాంగ్రెస్ ఆరోపణ. రాఫెల్ ఒప్పందం కుదుర్చుకోవడానికి అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ భారత్‌కు వచ్చిన సమయంలోనే అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ హోలన్ సహచరి, నటి జూలీ గయె ప్రధాన పాత్రలో రెండు సినిమాలు నిర్మించడానికి అంగీకరించింది. జూలీ గయె ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి తాము ఫ్రెంచ్ సినిమాలు తీస్తామంటూ అనిల్ అంబానీ అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు కూడా. క్విడ్ ప్రో కో ఒప్పందంలో భాగంగా రాఫెల్ కాంట్రాక్ట్ తమకి దక్కడం కోసమే రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సినీ రంగంలో పెట్టుబడులు పెట్టిందని కూడా కాంగ్రెస్ ఆరోపించింది. విమానాల తయారీ రంగంలో 70 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ హాల్‌ను కాదని విమాన తయారీ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించడం వల్ల దేశ భద్రతే ముప్పులో పడిందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఆరోపణల్నింటినీ తిప్పికొట్టిన కేంద్రం రిలయన్స్ డిఫెన్స్‌ను సర్వీసు ప్రొవైడర్లుగా తాము ఎంపిక చేయలేదని, డసో ఏవియేషన్ కంపెనీయే ఎంపిక చేసుకుందని ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చింది. ఇప్పుడు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ రిలయన్స్‌ను ఎంపిక చేసుకోవాలని మోదీ ప్రభుత్వం తమకు సూచించిందని వెల్లడించడంతో కాంగ్రెస్ చేతికి ఒక పెద్ద ఆయుధం దొరికినట్టయింది. కాంగ్రెస్ లేవనెత్తిన సందేహాలకు ఎన్డీయే ప్రభుత్వం సూటిగా సమాధానాలు చెప్పకపోవడం, ఎన్టీయే మంత్రులు చెబుతున్నదానికి విరుద్ధమైన ప్రకటనలు అవతల పక్షం నుంచి వస్తూ ఉండడంతో రాఫెల్ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ వస్తోంది. -
‘ఈ శతాబ్దపు అతి పెద్ద స్కాం’
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏ ప్రభుత్వం ఫ్రాన్స్‌తో చేసుకున్న రాఫెల్ ఒప్పందం 21వ శతాబ్దపు అతి పెద్ద కుంభకోణమని కాంగ్రెస్ జాతీయ నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్ ఆరోపించారు. బుధవారం గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో చర్చించకుండా, కనీసం రక్షణ శాఖ మంత్రికి కూడా తెలియకుండా తన ఇష్టానుసారంగా రాఫెల్ డీల్ చేశారని ఆరోపించారు. రాఫెల్ డీల్ గురించి అజాద్ చెప్పిన పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. నోరు మెదపని ప్రధాని ‘దేశంలో ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ కేంద్రప్రభుత్వాన్ని అనేక సార్లు ప్రశ్నిస్తున్నా రాఫెల్ పై సమాదానం లేదు. లోక్‌సభ, రాజ్యసభలో ఎక్కడైనా నో అన్సర్. గతంలో ఏ ప్రధానియైనా ఆరోపణలు వస్తే వాటిపై స్పందించారు. కానీ తొలిసారి ఈ ప్రధాని మాత్రం నోరు మెదపటం లేదు. హైదరబాద్ నా రెండవ ఇళ్లు. అందుకే ఇక్కడ మీడియాతో రాఫెల్ ఒప్పందం గురించి పూర్తి వివరాలు వివరిస్తున్నా. చైనా బలపడుతోంది, పాకిస్తాన్ మరింత వైరుధ్యం పెంచుకొంటోంది. ఈ రెండు ప్రమాదమే అందుకే యూపీఏ హయాంలో డిఫెన్స్ కౌన్సిల్ ఆయుదాలకొనుగోలు చేయాలని తెలిపింది. అందులో 126 యుద్ద విమానాల అవసరం అని తెలపగా టెండర్లకు 6 కంపెనీలు పాల్గొన్నాయి. 8 రెడీ గా ఉన్నవి, 108 మన దేశంలో తయారుచేసేలా ఫ్రెంచ్ కంపెనీతో ఒప్పందం జరిగింది. మేము ఒక్కో విమానానికి 523 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే.. 108 యుద్ద విమానాలు మన దేశంలో తయారు చేసేలా హిందుస్తాన్ ఏరో నాట్స్, ఫ్రెంచ్ కంపెనీల మధ్య ఒప్పందం కూడా జరిగి పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఏప్రిల్ 2015 లో మోదీ ఫ్రాన్స్ వెళ్లారు. అక్కడ మీడియాతో విమానాల కొనుగోళ్లపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. అయితే తర్వాత తేలిందేంటంటే పాత అగ్రీమెంట్ రద్దు చేసి కొత్త ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. అది డిఫెన్స్ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి ఇతరులెవరికీ తెలియదు. కేవలం మన ప్రధాని ఫ్రాన్స్ ప్రభుత్వానికి తప్ప ఎవరికి తెలియదు. మేం 523 కోట్లకు చేసిన డీల్ సేమ్ అదే విమానానికి 1670 కోట్లతో ఒప్పందం చేసుకున్నారు. హిందుస్తాన్ ఏయిర్ క్రాఫ్ట్ తో ఉన్న అగ్రిమెంట్ సైతం రద్దు చేసి మరో ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. యూపీఏ హయాంలో లక్ష రూపాయలు అవినీతి జరిగినా పెద్ద అంశమే.. డిఫెన్స్ కౌన్సిల్ నిర్ణయించిన 127 విమానాల కొనుగోలును అప్పుటి మన్మోహన్ ప్రభుత్వం అంగీకరిస్తే.. ఎవరినీ సంప్రదించకుండా మోడీ ఎలా వాటిని 36 చాలు అని నిర్ణయిస్తారు. కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు.. కనీసం ప్రకటించేంత వరకు దానిపై ప్రధాని సంతకం కూడా జరగలేదు. 36 యుద్దవిమానాలకు అధనంగా 41 వేల కోట్లు చెల్లించారు. 21 వ శతాబ్దంలో ఇది అత్యంత పెద్ద స్కాం. 4060 పైగా విమానాలు తయారు చేసిన ప్రభుత్వ సంస్థను కాదని, హెచ్ఈఎల్ కంపెనీని కాదని కనీసం రిజిస్ట్రేషన్ కూడా జరగని ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. టెండర్ దక్కిన తర్వాతే ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ జరిగింది. యూపీఏ హయాంలో లక్ష రూపాయాల అవినీతి చాలా పెద్ద అంశం.. అదే ఎన్డీఏ ప్రభుత్వంలో 25 వేల కోట్ల పై కూడా లెక్క లేకుండా పోయింది. వాళ్ల పొట్టలు పెద్దవి అందుకే బాగా తింటున్నారు’అంటూ నరేంద్ర మోదీ నియంతృత్వ ధోరణిపై ఆజాద్ నిప్పులు చెరిగారు. -
ఎన్పీఏల పాపం యూపీఏదే..
ముంబై: మొండిబాకీలు (ఎన్పీఏ) భారీగా పేరుకుపోవడానికి గత యూపీఏ ప్రభుత్వ హయాంలో విచక్షణారహితంగా రుణాలివ్వడమే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. 2008 నాటి అంతర్జాతీయ సంక్షోభానికి ముందు, ఆ తర్వాత అడ్డగోలుగా రుణాలివ్వడం జరిగిందని, వాటి ఆధారంగా యూపీఏ ప్రభుత్వం అధిక స్థాయిలో జీడీపీ వృద్ధిని చూపించుకుందని ఆయన విమర్శించారు. ‘ప్రతీ సంవత్సరం 28 లేదా 31 శాతం మేర రుణ వృద్ధిని ఆధారంగా చూపించి అధిక జీడీపీ రేటు సాధించామని చెప్పుకున్నారంటే... రాబోయే రోజుల్లో చరిత్ర దాన్ని కచ్చితంగా విచక్షణారహిత రుణాల వృద్ధిగానే పరిగణిస్తుంది. ఇది భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది‘ అని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్డీయే హయాంలో అధిక వృద్ధి గణాంకాలపై అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, మొండిబాకీలకు బ్యాంకర్లు కూడా కారణమేనని ఆయన వ్యాఖ్యానించారు. లాభసాటి కాని ప్రాజెక్టులకు కూడా యూపీఏ హయాంలో బ్యాంకర్లు రుణాలిచ్చారని, అవి సమస్యాత్మకంగా మారినా కూడా పట్టించుకోకుండా తోడ్పాటు అందించడం కొనసాగించారని జైట్లీ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ మొండిబాకీల రికవరీల కోసం కొత్త కొత్త మార్గాలు అన్వేషించాల్సి వస్తోందన్నారు. -
‘యూపీఏ’ రుణాలవల్లే అధోగతి!
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నియంత్రణలేని ద్రవ్యలోటు, నిర్లక్ష్యంతో బ్యాంకు రుణాల జారీ వంటివి ఆర్థిక క్షీణతకు దారితీశాయని నీతిఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. అలాగే రాజీవ్‌గాంధీ హయాంలో 10 శాతం వృద్ధి రుణాల వల్లేనని, ఇదే 1990–92 కాలంలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి దారితీసిందని, రుణ చెల్లింపుల కోసం బంగారం నిల్వలను విదేశాలకు తరలించి గట్టెక్కాల్సి వచ్చిందని వివరించారు. జీడీపీ వృద్ధికి సంబంధించి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ (ఎన్ఎస్సీ) విడుదల చేసిన గణాంకాలపై కుమార్ స్పందించారు. ఈ గణాంకాల ప్రకారం... మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న 2006–07లో నమోదైన జీడీపీ వృద్ధి రేటు 10.08 శాతం అన్నది... సరళీకృత ఆర్థిక విధానాలు మొదలైన 1991 తర్వాత అత్యధిక వృద్ధి రేటు. కాగా, కేంద్రంలో మోదీ సర్కారు నాలుగేళ్ల పాలనలో నమోదైన వృద్ధి రేటు అంతకుపూర్వం యూపీఏ సర్కారు చివరి నాలుగేళ్ల పాలనకంటే ఎక్కువే ఉందంటూ రాజీవ్‌కుమార్ తన ట్వీట్లలో పేర్కొన్నారు. ఎన్ఎస్సీ 2011–12 బేస్ ఆధారంగా వేసిన జీడీపీ వృద్ధి అంచనాలు అనధికారికమైనవిగా పేర్కొన్నారు. ‘‘అయినప్పటికీ ఈ వాస్తవ అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 2009–2011, అంతకుముందు సంవత్సరాల్లో అధిక వృద్ధి రేటు అన్నది అదుపులో లేని ద్రవ్యలోటు, వాణిజ్య బ్యాంకుల రుణాల వల్లే. అందుకే అది నిలబడలేదు. ఇదే యూపీఏ–2 సర్కారు చివరి మూడేళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థ పతనానికి, వృద్ధి అనూహ్యంగా తగ్గిపోయేందుకు కారణాలు’’ అని కుమార్ వివరించారు. 2013 ఏడాది మే–ఆగస్టు మధ్య నాలుగు నెలల్లోనే రూపాయి మారకం 25 శాతం పడిపోయినట్టు గుర్తు చేశారు. స్థిరమైన అధిక, సమ్మిళిత వృద్ధి భవిష్యత్తులో సాకారమయ్యేందుకు మోదీ సర్కారు నాలుగేళ్ల కాలంలో బలమైన పునాదులు పడ్డాయని చెప్పారు. ఇక వాజ్‌పేయి పాలనలో చేపట్టిన సంస్కరణలతో 2003–04లో వృద్ధి రేటు 8 శాతానికి పెరిగిందని, ఈ చర్యల వల్లే తర్వాతి యూపీఏ కాలంలో వృద్ధి రేటు పెరిగేందుకు దోహదపడినట్టు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ చెప్పారు. బ్యాక్‌సిరీస్ జీడీపీ గణాంకాలు అధికారికం కాదు: కేంద్రం బ్యాక్ సిరీస్ జీడీపీ గణాంకాలపై వివాదం నేపథ్యంలో అవి అధికారిక గణాంకాలు కాదని కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు విభాగం(ఎమ్‌వోఎస్‌పీఐ) పేర్కొంది. అధికారిక గణాంకాలను తర్వాత విడుదల చేయనున్నట్లు తెలిపింది. జీడీపీకి సంబంధించి నేషనల్ స్టాటిస్టిక్ కమిషన్ (ఎన్ఎస్సీ) గణాంకాల ప్రకారం 2006–07లో నమోదైన 10.08% వృద్ధి.. 1991 తర్వాత అధిక వృద్ధి రేటుగా తెలుస్తోంది. దీంతో ఇవి అధికారిక గణాంకాలు కావంటూ ఎమ్‌వోఎస్‌పీఐ పేర్కొంది. ఎన్ఎస్సీ సైతం బ్యాక్ కాస్టింగ్ జీడీపీ సిరీస్ విధానానికి సంబంధించి పని కొనసాగుతోందని స్పష్టం చేసింది. -
ఎన్డీయే అభ్యర్థిదే విజయం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా అధికార పక్షం అభ్యర్థి, జేడీయూ సభ్యుడు హరివంశ్ గురువారం సునాయాసంగా విజయం సాధించారు. ఆయనకు 125 ఓట్లు రాగా, విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు 101 ఓట్లు పడ్డాయి. ఇంతకుముందు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న కురియన్ గత నెల పదవీ విరమణ పొందారు. హరివంశ్‌ను మోదీ పొగుడుతూ ‘ఇప్పుడంతా హరి/దేవుడి చేతుల్లో ఉంది. ప్రతిపక్ష, విపక్షమనే తేడాలేకుండా ఆయన సభ్యులందరిపై కరుణతో ఉంటారనే నమ్మకం నాకుంది’ అని అన్నారు. రాజ్యసభ నాయకుడు జైట్లీ, విపక్ష నేత ఆజాద్‌లు హరివంశ్‌పై ప్రశంసలు కురిపించారు. మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న జైట్లీ తొలిసారిగా గురువారమే సభకు వచ్చారు. అంతకుముందు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి హరివంశ్ అభ్యర్థిత్వాన్ని జేడీయూ సభ్యుడు రామ్ ప్రసాద్ సింగ్ ప్రతిపాదించగా, కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) సభ్యుడు రాందాస్ అథవాలే బలపరిచారు. ఎన్నిక అనంతరం హరివంశ్ సభాధ్యక్షుడి స్థానంలో కాసేపు కూర్చోగా సభ్యులంతా చప్పట్లు కొడుతూ, బల్లలు చరుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. హరివంశ్ మాట్లాడుతూ సభా గౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాననీ, సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఎంపీలు తనకు సహకరిస్తారని ఆశిస్తున్నానన్నారు. అనంతరం సభ భోజన విరామం కోసం వాయిదా పడింది. రెండుసార్లు ఓటింగ్ తొలిసారి ఓటింగ్‌లో కొన్ని తప్పులు దొర్లాయని కొందరు సభ్యులు ఫిర్యాదు చేయడంతో రెండోసారి ఓటింగ్ నిర్వహించారు. తొలిసారి ఓటింగ్ సమయంలో హరివంశ్‌కు 122 ఓట్లు, హరిప్రసాద్‌కు 98 ఓట్లు వచ్చాయి. మొత్తం సభ్యుల సంఖ్య 222గా తేలింది. అయితే రెండోసారి ఓటింగ్ జరిగాకా మాత్రం హరివంశ్‌కు 125 ఓట్లు, హరిప్రసాద్‌కు 101 ఓట్లు వచ్చాయి. 24 ఓట్ల తేడాతో హరివంశ్ గెలుపొందారు. సభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య 244 కాగా, ఎన్డీయే కూటమి పార్టీలకు చెందిన మొత్తం 97 మంది సభ్యులూ హాజరై ఓటు వేశారు. బీజేడీ, టీఆర్ఎస్, అన్నా డీఎంకే పార్టీలు కూడా ఎన్డీయే అభ్యర్థికే ఓటు వేయడంతో హరివంశ్ చాలా సులభంగా గెలుపొందారు. మరోవైపు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఆప్, సమాజ్వాదీల్లో ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు చొప్పున 9 మంది, అలాగే డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, పీడీపీల నుంచి ఇద్దరు చొప్పున ఆరుగురు, నాగా పీపుల్స్ ఫ్రంట్ సభ్యుడొకరు.. మొత్తం 16 మంది గైర్హాజరై బీజేపీ సునాయాస విజయానికి కారకులయ్యారు. వీరంతా సభకు వచ్చి విపక్ష అభ్యర్థికి ఓటు వేసి ఉంటే కనీసం ఎన్డీయే కూటమి గట్టి పోటీని ఎదుర్కొని ఉండేది. ఈ 16 మంది గైర్హాజరుతో ఓటింగ్ సమయంలో సభలో 228 మంది సభ్యులు మిగిలారు. దీంతో అభ్యర్థి గెలవడానికి 115 ఓట్లు అవసరమయ్యాయి. ఇద్దరు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆటగాళ్లకంటే అంపైర్లకే సమస్యలెక్కువ: మోదీ హరివంశ్ ఎన్నిక అనంతరం మోదీ సరదాగా మాట్లాడుతూ ‘ప్రస్తుతం సభలో పరిస్థితి చూస్తుంటే ఆటగాళ్ల (సభ్యులు) కంటే అంపైర్ల (చైర్మన్, డిప్యూటీ చైర్మన్)కే ఎక్కువ సమస్యలు ఉన్నట్లుగా ఉన్నాయి’ అని అన్నారు. ‘హరివంశ్ నాలుగు దశాబ్దాలపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఆయనకు ఉద్యోగం ఇచ్చేందుకు రిజర్వు బ్యాంకు కూడా ముందుకొచ్చింది. కానీ ఆ కొలువును ఆయన తిరస్కరించారు. ఎన్నిక ఫలితం అందరికీ ముందుగానే తెలిసినదైనప్పటికీ పద్ధతుల ప్రకారం ఓటింగ్ జరపాల్సి వచ్చింది. ఫరవాలేదు. కొత్త సభ్యులకు సభలో ఓటు ఎలా వేయాలో తెలిసింది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నిక సజావుగా సాగినందుకు విపక్ష అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు, వెంకయ్యకు, సభ్యులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. తొలిసారి ఎంపీ.. అప్పుడే డిప్యూటీ చైర్మన్ ఎంపీగా తొలిసారిగా 2014లో రాజ్యసభకు ఎన్నికైన హరివంశ్ ఆ పదవిలో ఉండగానే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని అలంకరించనుండటం గమనార్హం. 62 ఏళ్ల హరివంశ్ తొలినాళ్లలో ప్రభుత్వోద్యోగాన్ని కాదని పాత్రికేయాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. బిహార్‌లోని బల్లియా జిల్లాకు చెందిన హరివంశ్.. ప్రముఖ దివంగత నేత జయప్రకాశ్ నారాయణ్ సొంత ప్రాంతానికి చెందిన వారే. గతంలో మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు సలహాదారుగానూ కొన్నాళ్లు పనిచేసిన హరివంశ్.. ఆయన పదవి నుంచి దిగిపోయిన అనంతరం మళ్లీ పాత్రికేయ వృత్తిలోకి వెళ్లారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఏ, జర్నలిజంలో డిప్లొమా చదివారు. హిందీ పత్రిక ‘ప్రభాత్ ఖబర్’కు చీఫ్ ఎడిటర్‌గా పనిచేశారు. హిందీలో పలు పుస్తకాలు రాశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. బీజేపీకి కొత్త మిత్రులు! కాంగ్రెస్‌కు భంగపాటు న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికతో కాంగ్రెస్ మరోసారి భంగపడగా, బీజేపీకి కొత్త మిత్రులు దొరికారు. వాస్తవానికి ఈ ఎన్నికకు కాంగ్రెస్ తన అభ్యర్థిని పోటీలో నిలపాలని అనుకోలేదు. విపక్ష పార్టీల నుంచి ఎవరిని నిలబెట్టినా తాము మద్దతిస్తామంది. కానీ విపక్ష కూటమిలోని ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టేందుకు ముందుకు రాకపోవడంతో ఓడిపోతామని తెలిసినా తమ ఎంపీని నిలబెట్టక తప్పని పరిస్థితి కాంగ్రెస్‌ది. పైపెచ్చు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పీడీపీ, ఆప్‌లను తమ వైపుకు తిప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. రాహుల్ కోరితే తాము మద్దతిస్తామని ఆప్ స్పష్టం చేసినప్పటికీ, రాహుల్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. బీజేపీ కొత్తగా టీఆర్ఎస్, బీజేడీల మద్దతు పొందింది. మద్దతు కోసం స్వయంగా మోదీ బీజేడీ అధినేత బిజూ పట్నాయక్‌కు ఫోన్ చేసి∙ఒప్పించారు. బీజేపీతో భేదాభిప్రాయాలున్నట్లుగా కనిపించిన శివసేన, అకాలీదళ్‌లు కూడా ఇప్పుడు ఆ పార్టీతో సత్సంబంధాలనే కలిగి ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు దాదాపు మరో 10 నెలలు మాత్రమే ఉండగా ఇటీవల ఏ ఎన్నిక జరిగినా బీజేపీ గెలుస్తుండగా, కాంగ్రెస్ చతికిలపడుతోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గౌరవప్రదమైన సీట్లైనా గెలుచుకుంటుందో లేదోనని పలువురు సీనియర్ నేతలు ఆందోళనగా ఉన్నారు. -
రాజ్యసభ ‘డిప్యూటీ’కి హోరాహోరీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం గురువారం జరగనున్న ఎన్నిక అధికార, విపక్షాల బల ప్రదర్శనకు వేదిక కానుంది. ఎన్డీయే తరపున జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్, విపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపీ కె. హరిప్రసాద్ బుధవారం నామినేషన్ దాఖలుచేశారు. అనంతరం ఇరువురు అభ్యర్థులు తమదే విజయం అని చెబుతున్నా హోరాహోరీ తప్పేట్లు లేదు. హరివంశ్ తొలిసారి రాజ్యసభ ఎంపీ కాగా, హరిప్రసాద్ కాంగ్రెస్ తరపున మూడుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీల మొత్తం సంఖ్య 244. ఇందులో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు కనీసం 123 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇప్పటివరకున్న అంచనాల ప్రకారం అధికార పార్టీ తమకు 126 మంది ఎంపీల బలముందని చెబుతోంది. విపక్ష కూటమి తమ వద్ద అవసరమైన ఎంపీల బలముందని పేర్కొంది. గెలుపు మాదంటే మాదే! కాంగ్రెస్‌కు తృణమూల్, డీఎంకే, వామపక్ష పార్టీలు, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, టీడీపీలు తమ మద్దతు ప్రకటించాయి. విపక్ష కూటమికి సరిపోయేంత బలముందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. హరిప్రసాద్ వంటి వ్యక్తికి పార్టీలకు అతీతంగా ఎంపీలు మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘రసవత్తరమైన పోటీ ఉంది’ అని కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్ అన్నారు. అధికార కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. కొంతకాలంగా బీజేపీపై విమర్శలు చేస్తున్న శివసేన ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికే మద్దతివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కూటమి అభ్యర్థికే అండగా ఉంటామని అకాలీదళ్ తెలిపింది. అన్నాడీఎంకే, టీఆర్ఎస్లుఎన్డీయే బలపరిచిన అభ్యర్థికే జై కొట్టనున్నట్లు తెలుస్తోంది. కూటముల బలాబలాలు బీజేపీ లెక్కల ప్రకారం హరివంశ్‌కు 91 మంది ఎన్డీయే ఎంపీల సంపూర్ణ మద్దతుంది. వీరితోపాటు ముగ్గురు నామినేటెడ్ ఎంపీలు, ఎస్పీ ఎంపీ అమర్ సింగ్‌లు తోడున్నారు. ఎన్డీయేయేతర పక్షాలైన అన్నాడీఎంకే ఎంపీలు 13 మంది, టీఆర్ఎస్ నుంచి ఆరుగురు, ఏకైక ఐఎన్ఎల్డీ అభ్యర్థి మద్దతు తమకుందని బీజేపీ చెబుతోంది. ఇవన్నీ కలిస్తే హరివంశ్ ఖాతాలోకి 115 ఓట్లు చేరతాయి. బీజేపీ అభ్యర్థిని ఓడించడమే తమ కర్తవ్యమని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే బీజేడీకి ఉన్న 9 మంది ఎంపీలు మద్దతు అధికార పక్షానికి కీలకం కానుంది. వీరి మద్దతు దక్కితే 124 ఎంపీల బలంతో ఎన్డీయే కూటమి అభ్యర్థి గెలిచినట్లే. అటు విపక్షం కూడా తమ లెక్కలను స్పష్టం చేసింది. విపక్ష కూటమి అభ్యర్థికి 61 మంది యూపీఏ ఎంపీలు, 13 మంది ఎస్పీ, 13 మంది తృణమూల్ ఎంపీలతోపాటు ఆరుగురు టీడీపీ, ఐదుగురు సీపీఎం, నలుగురు బీఎస్పీ, నలుగురు డీఎంకే, ఇద్దరు సీపీఐ, ఒక జేడీఎస్ అభ్యర్థి మద్దతుంది. ఈ సంఖ్య మొత్తం 109. ఓ నామినేటెడ్ సభ్యుడు, మరో ఇండిపెండెంట్ ఎంపీ హరిప్రసాద్‌కు మద్దతిచ్చేందుకు సమ్మతించారు. దీంతో విపక్ష బలం 111కు చేరింది. అయితే, కరుణానిధి మృతి నేపథ్యంలో డీఎంకే ఎంపీలు ఢిల్లీకి వచ్చి ఓటు వేస్తారా లేదా అనేది విపక్ష కూటమిని ఆందోళన పరుస్తోంది. ఇద్దరు ఎంపీలున్న పీడీపీ ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించింది. తమ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తే తమ ఎంపీలు విపక్ష కూటమి అభ్యర్థికి మద్దతు చెబుతామని ఆప్ ఎంపీలు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ సభ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ ఎన్నికను చైర్మన్ వెంకయ్య నాయుడు తీర్మానం ద్వారా స్వీకరిస్తారు. ఇరువురు అభ్యర్థులను ప్రతిపాదిస్తూ 9 నోటీసులు వచ్చాయని రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. వీటన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి స్వీకరిస్తారు. ఇందులో మొదటిది తీర్మానాన్ని ప్రకటించాక.. అందులో పేర్కొన్న అభ్యర్థికి ఎందరు మద్దతిస్తున్నారనే విషయాన్ని మూజువాణి ఓటుతో నిర్ణయిస్తారు. ఇందులో ఆ అభ్యర్థి గెలిస్తే ఆయన్ను డిప్యూటీ చైర్మన్‌గా ప్రకటిస్తారు. లేదంటే ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అయితే తీర్మానాల్లో మొదటిది ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ను ప్రతిపాదిస్తూనే ఉందని తెలుస్తోంది. -
‘ఏపీ ప్రత్యేక హోదాపైనే రాహుల్ తొలి సంతకం’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చిన తొలిరోజే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై సంతకం చేస్తారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ తెలిపారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి కూడా టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయిందని ఆయన విమర్శించారు. యూపీఏతోనే ఏపీ ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను సమానంగా వ్యతిరేకిస్తున్నామన్న ఉమెన్ చాందీ.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే అవకాశం లేదన్నారు. అయితే పార్టీ అజెండా, పొత్తులపై ఇప్పుడే చర్చించడం తొందరపాటు నిర్ణయం అవుతుందన్నారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పార్టీని విడిచి వెళ్లినవారు తిరిగి వస్తే తప్పక స్వాగతిస్తామని తెలిపారు. -
రైతు రక్షకుడే రాజు
తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్ళు నిండి అయిదో సంవత్స రంలో అడుగుపెడుతున్న శుభసందర్భంలో చెప్పుకోదగిన సకారాత్మకమైన పరిణామాలు అనేకం ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం సాగిన సుదీర్ఘమైన ఉద్యమానికి సమర్థ నాయకత్వం వహించి, అనితరసాధ్యమైన రాజకీయ చాతు ర్యం ప్రదర్శించి, లక్ష్యం సాధించడమే కాకుండా కొత్త రాష్ట్రా నికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) పగ్గాలు చేపట్టి చరిత్రాత్మక పాత్ర పోషిస్తున్నారు. దీక్షాదక్షతలు, తెలివితేటలు, చొరవతో పాటు అదృష్టం కలిసి రావడంతో ఆయన కత్తికి ఎదురు లేకుండా జైత్రయాత్ర సాగి స్తున్నారు. కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకొని ఒంటరిగా పోరాడి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం, హైదరా బాద్ మునిసిపల్ ఎన్నికలలో ఘనవిజయం సాధించడం, హైదరాబాద్‌లో పదేళ్ళు దర్జాగా ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆదరాబాదరాగా అమరావతి పంపించడం కేసీఆర్ విజయాలలో కొన్ని. ఒక ముఖ్యమంత్రి లేదా ఒక రాష్ట్ర ప్రభుత్వ సాఫల్యవైఫల్యాలను అంచనా వేయడంలో రెండు పద్ధతులు పాటించడం ఆనవా యితీ. ఒకటి, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలలో ఎన్నింటిని, ఎంత బాగా అమలు చేశారనే ప్రాతిపదికగా పరిశీలించడం. రెండు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల లేదా ప్రభుత్వాల తీరుతెన్నులతో పోల్చి ఒక ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం స్థానం ఏమిటో నిర్ణయించడం. రైతుపైనే దృష్టి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందులో ప్రస్తావిం చని అంశాలూ అమలు చేస్తున్నది. ఇటీవల ఎక్కువగా ప్రచా రంలో ఉన్న పథకం రైతుబంధు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్ప టికీ రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టకపోవడం అంద రికీ ఆందోళన కలిగిస్తున్న అంశం. నిజానికి ఇది జాతీయ సమస్య. అన్నదాతను ఆదుకోవడానికి తగినంత కృషి జరగ లేదన్నది వాస్తవం. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై స్వామి నాధన్ కమిషన్ చేసిన సిఫార్సులను కమిషన్‌ను నియమిం చిన యూపీఏ సర్కార్ పట్టించుకోలేదు. తాము చేస్తామని వాగ్దానం చేసిన బీజేపీ కూడా అధికారంలోకి వచ్చాక చేయ డం లేదు. రాష్ట్రం నాలుగేళ్ళ సంబురాలు జరుపుకుంటున్న సందర్భంలో టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రచారాంశాలలో ప్రధా నంగా ప్రస్తావించేవి రైతులోకానికి చేసిన వాగ్దానాలే. ప్రతి ఎకరానికి ఖరీఫ్, రబీ పంటలకు నాలుగు వేల రూపాయల వంతున ఏడాదికి రూ. 8 వేలు సాయం అందించే సంక్షేమ కార్యక్రమానికి ఇటీవలే శ్రీకారం చుట్టారు. అనారోగ్యం వల్ల లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల జీవిత బీమా చెల్లించే విధంగా ప్రతిరైతుకూ బీమా సౌకర్యం కల్పించాలని తాజాగా నిర్ణయించారు. ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా బాండ్ సర్టిఫికేట్లు జారీ చేస్తామని అంటున్నారు. 24 గంటల విద్యుచ్ఛక్తి సరఫరా కొన్ని మాసాలుగా అమలు జరుగు తోంది. రైతుకు ఎన్ని వరాలు ప్రసాదించినా సొంత కాళ్ళ పైన నిలబడే పరిస్థితులు కల్పించే వరకూ అతడికి నిజమైన రక్షణ లేదు. ఎన్డీఏ ప్రభుత్వం నిరుడు ఆహారధాన్యాల ఎంఎస్పి ప్రకటించినప్పుడు లెక్కలు సరిగా లేవంటూ స్వామినాధన్ ఆక్షేపించారు. సేద్యానికి పెట్టిన ఖర్చు, వ్యవ సాయక్షేత్రంలో పని చేసిన కుటుంబసభ్యుల వేతనాలు కలిపి మొత్తం ఖర్చుగా లెక్కవేయాలని (ఏ2 ప్లస్ ఎఫ్ఎల్– ఫ్యామిలీ లేబర్) ఒక సూత్రం చెబుతున్నది. ఈ ఖర్చులకు భూమి కౌలు కింద చెల్లించే మొత్తం కూడా కలపాలని (కాంప్రెహెన్సీవ్ మెజర్ ఆఫ్ కల్టివేషన్ కాస్ట్–సీ2) మరో సూత్రం చెబుతుంది. ఆ విధంగా లెక్కకట్టి దానిపైన 50 శాతం లాభం వేసి ఎంఎస్పి నిర్ణయించాలని సిఫార్సు. ఎన్డీఏ ప్రభుత్వం మొదటి సూత్రాన్ని పరిగణనలోకి తీసు కొని మద్దతు ధర నిర్ణయించడంతో రైతులకు గిట్టుబాటు కాలేదు. కేంద్రం మద్దతు ధర నిర్ణయించిన వెంటనే ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగలేదు. రైతుల నుంచి ఎంఎస్పి కంటే తక్కువ ధరకు దళారులు కొన్న తర్వాత ఎంఎస్పి చెల్లించి వారి నుంచి ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసిన సందర్భాలు తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలలోనూ ఉన్నాయి. మార్కెట్లో రైతుకు దగా జరగకుండా ప్రభుత్వం నిరోధించాలి. అదే విధంగా ఎకరానికి నాలుగు వేల రూపా యల సాయంపైన కూడా విమర్శలు ఉన్నాయి. నాలుగైదు ఎకరాల లోపు కమతం ఉన్న రైతు తన పొలం తాను దున్ను కుంటే ఎకరానికి నాలుగు వేలు కాదు పది వేలు ఇచ్చినా నష్టం లేదు. ఉద్యోగాలో, వ్యాపారాలో చేసుకుంటూ హైదరా బాద్‌లో నివసిస్తున్న భూముల యజమానులకు రైతుబంధు పథకం అనవసరం. మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డికి దాదాపు రెండు లక్షల సాయం ఎందుకు? ఆయన చెక్కు వాపసు చేశారు. అది వేరే విషయం. ఆ విధంగా ఎంత మంది చేస్తారు? హైదరాబాద్‌లో ఉంటున్నవారి భూము లను కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్న కౌలురైతుకు సాయం చేస్తే అర్థవంతంగా ఉండేది. కౌలు రైతులే శక్తికి మించిన పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్నారు. యజమాను లకు కౌలు మొత్తం చెల్లిస్తున్నారు. బ్యాంకు రుణం సదు పాయం లేక ప్రైవేటు వడ్డీవ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. అప్పులపాలవుతున్నారు. కౌలు రైతు ఇంటికి వడ్డీవ్యాపారి వెళ్ళి భార్యాపిల్లల ఎదుట అనరాని మాటలంటే అవమానభారంతో పొలానికి వెళ్ళి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్న కౌలు రైతులే అధికం. వారిని ఆదుకోవడానికి ఏదైనా పథకం ఆలోచిస్తే కేసీఆర్ చరితార్థుడయ్యేవారు. వ్యవసాయ సంక్షో భానికి దేశంలో ఎవ్వరూ పరిష్కారం కనుక్కోలేకపోతు న్నారు. భూమి రికార్డులు సరి చేయించడం, రైతులకు పాస్ పుస్తకాలు ఇప్పించడం వంటి కార్యక్రమాలు స్వాగతించవల సినవే. రైతుల బతుకులు పూర్తిగా బాగుపడాలంటే స్వామి నాధన్ కమిషన్ సిఫార్సులలో ఏ పంట పండించే రైతుకు ఏ సూత్రం లాభదాయకమో దానిని నిజాయితీగా అమలు చేయాలి. సేద్యం విషయంలో వ్యవసాయ విస్తరణాధికా రులు ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చే విధంగా నియం త్రించి, మార్కెట్ వ్యవస్థను పటిష్ఠంగా నిర్మించి, పంటకు లాభసాటి ధర లభించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసు కుంటే రైతు ఆత్మహత్యలు నిలిచిపోతాయి. వ్యవసాయ రంగం క్రమంగా శక్తి పుంజుకుంటుంది. ఆ పని కేసీఆర్ చేయగలిగితే ఆయన దేశానికి ఆదర్శంగా నిలుస్తారు. సంక్షేమరాజ్యం రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా పన్నుల ద్వారా వచ్చే ఆదా యంలో 20 శాతం వృద్ధి ఉంది. జీఎస్టీ ద్వారా కేంద్రం నుంచి అందే మొత్తం కూడా క్రమంగా పెరుగుతోంది. ఐటీ, ఇతర సేవారంగంలోని వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతోంది. అందుకే సాలీనా సంక్షేమంపైన రూ. 40 వేల కోట్లు, నీటిపారుదల రంగంపైన రూ. 37 వేల కోట్లు ప్రభు త్వం ఖర్చు చేయగలుగుతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజె క్టులను ప్రారంభించడం అభినందనీయం. ఉద్యమ ఆకాం క్షలు నెరవేరడానికి తోడ్పతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు దేశం లోనే అత్యంత క్లిష్టమైనది. ఒకానొక ఇంజనీరింగ్ అద్భుతం. కాళేశ్వరం ప్రాజెక్టుపైన చూపెడుతున్న శ్రద్ధ అవిభక్త మహ బూబ్‌నగర్ జిల్లాలో నిర్మించే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపైన పెట్టడంలేదనే విమర్శ ఉంది. తెలంగాణ ప్రాంతం, ప్రజలు, కులాలు, వృత్తుల వంటి సమస్త అంశాలూ కేసీఆర్‌కు క్షుణ్ణంగా తెలుసు కనుక వివిధ వృత్తులవారికి సాయం చేసే పలు పథకాలు చేపట్టారు. సంక్షేమరంగంలో చాలా పథ కాలు అమలు చేస్తున్నారు. ఉద్యమకాలంలో కేసీఆర్ పరుష పదజాలంతో బెదిరిపోయిన సీమాంధ్ర సంతతివారి భయాలు ఈ నాలుగేళ్ళలో తొలగిపోయాయి. అది మంచి పరిణామం. ఇందుకు కూడా కేసీఆర్‌నే అభినందించాలి. ప్రశంసించవలసిన అంశాలు అనేకం ఉన్నప్పటికీ విమ ర్శించవలసిన విధానాలు సైతం లేకపోలేదు. ఉద్యమాలపైన ఉక్కుపాదం మోపడం ఊహించని పరిణామం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్‌ను ఎత్తివేయడం అప్రజాస్వామికం. శాసనసభలో మెజారిటీ ఉన్నా విపక్షంనుంచి ఫిరాయింపు లను ప్రోత్సహించడం ఆక్షేపణీయం. ఖమ్మంలో మిర్చి రైతుల చేతులకు బేడీలు వేయడం తప్పు. పోయిన బడ్జెట్ సమావేశాలలో కాంగ్రెస్‌కి శాసనసభ్యులందరినీ సస్పెండ్ చేయడం కఠినమైన చర్య. సచివాలయానికి వెళ్ళకుండా ప్రగతిభవన్ నుంచే పరిపాలన సాగించడం ఎందుకో ప్రజ లకు అర్థం కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి రోజు నుంచీ పోలీసు వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు తీసు కున్నది. శాంతిభద్రతలు మెరుగుపడినాయి. కానీ కొన్ని నేరాలపైన దర్యాప్తు సాగుతున్నదో, ఆగిపోయిందో, ఆగి పోతే ఎందుకు ఆగిపోయిందో ప్రజలకు తెలిసే అవకాశం లేదు. నయీం కేసు ఏమైందో, కోట్లకు ఓటు కేసులో దర్యాప్తు ఎందుకు నత్తనడక నడుస్తున్నదో, భూకుం భకోణాలపైన గట్టిచర్యలు ఎందుకు తీసుకోవడం లేదో తెలియదు. కాంగ్రెస్ నాయకులు బస్సు యాత్రలు చేస్తు న్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ నెలకొల్పారు. వారికి లభిస్తున్న స్పందన టీఆర్ఎస్కు ఆందోళన కలిగిస్తున్న దాఖలా లేదు. టీఆర్ఎస్ అధినేత, ఇతర నాయకులు 2019లో తమదే విజయం అన్న ధీమాలో ఉన్నారు. ప్రజల మనస్సులో ఏమున్నదో తెలుసుకోవడం అంత తేలిక కాదు. 2004లో ‘ఇండియాషైనింగ్’ (భారత్ వెలుగుతోంది) ఇతి వృత్తంగా సాగిన ప్రచారార్భటి కారణంగా వాజపేయి నాయ కత్వంలోని ఎన్డీఏ గెలవడం తథ్యమని చాలామంది భావిం చాం. కానీ కాంగ్రెస్ గెలిచి యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. దక్షిణాది అధ్వానం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే కేసీఆర్ తానే దేశంలో నంబర్ ఒన్ సీఎం అని చెప్పుకుంటే ఆక్షేపిం చనక్కరలేదు. ముఖ్యంగా దక్షిణాదిలో పరిస్థితి అధ్వానం. తమిళనాడులో జయలలిత మరణం అనంతరం రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో బాబు ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోంది. నాలుగేళ్ళలో చేసింది చూపించడానికి ఒక్కటీ లేదు. కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు ఇప్పుడే కుదుటపడుతున్నాయి. ఐటీ రంగం నుంచి తెలంగాణ కంటే చాలా అధికంగా కర్ణాటకకు ఆదాయం ఉన్నప్పటికీ సంక్షేమరంగంలో తెలంగాణ (తల సరి) ఖర్చు చేసినంతగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. ఏ రకంగా చూసినా దక్షిణాదిలో తెలంగాణ ప్రభుత్వం అగ్రగామిగానే ఉంది. రాష్ట్రంలో రథం ఒడి దుడుకులు లేకుండా నడుస్తున్న కారణంగానే కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషించాలనే ఉబ లాటంతో పావులు కదుపుతున్నారు. ఈ ఫెడరల్ ఫ్రంట్ ప్రయాణం ఎంత వరకూ ఎటువైపు సాగుతుందో స్పష్టత లేదు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి కనుక 1996–98 నాటి అనిశ్చిత పరిస్థితులలో నేషనల్ ఫ్రంట్ సమన్వయకర్తగా చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పగలిగారు. 2004లో, 2009లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎంపీలను వైఎస్ రాజ శేఖరరెడ్డి ప్రసాదించగలిగారు. ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలం గాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో తెలుగు ముఖ్యమంత్రులకు మునుపటి ఆదరణ లభించడం కష్టం. 80 స్థానాలు కలిగిన యూపీలో అఖిలేశ్, మాయావతి, 42 సీట్లున్న పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ మర్యాదగా మాట్లాడుతారు కానీ వారు అంతిమంగా ఇచ్చే గౌరవం సంఖ్యాబలానికి తగ్గట్టే ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్‌ల ప్రమేయం లేకుండా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రస్తుతానికి సాధ్యం కాదు. ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకతపై అంతగా మాట్లాడిన దేవెగౌడ చివరికి కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు దోహదం చేశారు. ఉద్యమకాలంలో అందరినీ కలుపుకొని ముందుకు సాగిన కేసీఆర్ అధికారం లోకి వచ్చిన తర్వాత ఎవ్వరినీ కలవకుండా, తనకు అవస రమైనవారితో మాత్రమే సంప్రదించి నిర్ణయాలు తీసుకుం టున్నారు. మంత్రులు, ఎంఎల్ఏలు సైతం ముఖ్యమంత్రిని కలవలేకపోవడం, మనసు విప్పి మాట్లాడలేకపోవడం మంచి వాతావరణం కాదు. వైఖరి మార్చుకుంటే మరిన్ని వాస్తవాలు తెలుస్తాయి. పూర్తి అవగాహనతో నిర్ణయాలు చేయడం వల్ల కేసీఆర్‌కీ, తెలంగాణ ప్రజలకూ మేలు జరుగుతుంది. - కె. రామచంద్రమూర్తి -
కాంగ్రెస్‌కు వత్తాసు పలకడానికే..
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకడానికే సీపీఎం మహాసభలు పెట్టారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వంలో కలిసి పనిచేసిన సీపీఎంకు కాంగ్రెస్ అవినీతికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. యూపీఏ హయంలో 11లక్షల కోట్ల కుంభకోణాల చోటుచేసుకున్నాయని విమర్శించారు. పేదల పక్షాన ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని ఓడించడమని సీపీఎం పిలుపునివ్వడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌తో సీపీఎం లోపాయికారి ఒప్పందం పెట్టుకోవాలని సభలో రాజకీయ తీర్మానం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. సీపీఎం మహాసభలో కార్మికుల, పేదల గురించి అసలు చర్చే లేదని విమర్శించారు. మతోన్మాద మజ్లిస్, ముస్లింలీగ్‌తో పొత్తుపెట్టుకున్న సీపీఎం లౌకికవాదం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. -
‘అధిష్టానానికి చంద్రబాబుతో జాగ్రత్త అని చెప్పాం’
సాక్షి, ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అవకాశవాదని, జాగ్రతగా ఉండాలని అధిష్టానాన్ని హెచ్చరించామని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో జతకట్టే ప్రసక్తే లేదని వట్టి వసంతకుమార్ స్పష్టం చేశారు. పోలవరం, పట్టిసీమతో పాటు ఇతర పథకాల్లో కూడా భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. యూపీఏ అధికారంలోకి వస్తే ఏపీలో గత నాలుగేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ప్లీనరీలోనే తొలిసారిగా తీర్మానించామని తెలిపారు. -
కూటమి సర్కార్లు చేటు కలిగిస్తాయనడం భ్రమ
అవలోకనం ఎందుకనో మన మార్కెట్ విశ్లేషకులకు కూటమి ప్రభుత్వాలపై దురభిప్రాయాలున్నాయి. ఆ ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థలకు మంచివికాదని, అవి నిర్ణయాత్మకంగా వ్యవహరించలేవని వారి భావన. కానీ వెనక్కెళ్లి చూస్తే సుస్థిరమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాలకంటే కూటమి ప్రభుత్వాల హయాంలోనే దేశం ప్రయోజనం పొందింది. దినదినగండంగా బతుకీడ్చిన ప్రభుత్వాలే అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోగలిగాయి. ప్రపంచబ్యాంకు పాలనా సూచికలు కూడా ఈ విషయాలనే చాటుతున్నాయి. ‘హంగ్ పార్లమెంటు’ అనే పదబంధం వింటేనే స్టాక్ మార్కెట్ వణుకుతుంది. మన ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వం అవసరమని, ఒకే పార్టీకి మెజారిటీ లభించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఇది అసాధ్యమనుకో వడమే ఇందుకు కారణం. ఏక పార్టీ పాలన లేకపోతే సరైన ఆర్థిక నిర్దేశం ఉండదని, అందువల్ల స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో వృద్ధి కొరవడుతుందని, కేబినెట్లో స్వప్రయోజనపరులు పెరుగుతారని, నాయకత్వం చేసే పనులకు అడ్డుతగులుతా రని అటువంటివారు అంటారు. మెజారిటీ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా, కూటములకు వ్యతిరేకంగా సాగే వాదనలకు స్థూలంగా ఇదీ ప్రాతిపదిక. అయితే ఇటీవలి సంవత్సరాల్లోని ఆధారాలు ఈ ఆలోచనను బలపరిచేలా లేవు. యూపీఏ తొలి దశ పాలనాకాలం(2004–09)లో మొదటి అయిదేళ్లూ జీడీపీ వృద్ధి 8.5 శాతం. ఇది దేశ చరిత్రలో ఏ అయిదేళ్ల పాలనను తీసుకున్నా అత్యధికమని చెప్పాలి. కేవలం 145 స్థానాలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దీన్ని సాధించింది. సమాచార హక్కు చట్టంవంటి అత్యుత్తమ చట్టాలు ఈ కాలంలోనే రూపొందాయి. అదే కూటమి తదుపరి ఎన్నికల్లో సైతం 200 స్థానాలు గెల్చుకుని అధికారంలోకొచ్చింది. లెక్కప్రకారం యూపీఏ–2 ప్రభు త్వానికి మరింత స్వేచ్ఛ లభించింది గనుక అది లోగడకంటే ఎక్కువ నిర్ణయాత్మ కంగా ఉండాలి. కానీ జీడీపీ గణాంకాలు దీన్ని ప్రతిఫలించవు. ఈసారి సగటున 7 శాతం వార్షిక జీడీపీ మాత్రమే నమోదైంది. అయితే ఈ కాలం ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచం కోలుకుంటున్న దశ అని, అందువల్ల అధిక వృద్ధి సాధించడానికి అనువైన మద్దతు వెలుపలి నుంచి లభించలేదని మనం గుర్తించాలి. నిజానికి ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉన్న ఈ తరుణంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్న ఈ సమయంలో గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేనంత బలహీనమైన ఆర్థిక వృద్ధి నమోదైంది. ప్రభుత్వ పనితీరును వ్యాఖ్యా నించడం నా ఉద్దేశం కాదు. స్టాక్ మార్కెట్, ఆర్థిక విశ్లేషకులు భయపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వానికుండే మెజారిటీకీ, నమోదయ్యే జీడీపీ వృద్ధికీ సంబంధం లేదని చెప్పడమే నా వివరణలోని అంతరార్థం. కూటమి ప్రభుత్వాలు ప్రధానమైన సంస్కరణలను తీసుకురాలేవన్నది మరో భయం. కానీ దినదినగండంగా బతు కీడ్చిన మైనారిటీ ప్రభుత్వాలున్న కాలంలోనే దేశంలో అత్యంత పెద్ద ఆర్థిక సంస్క రణలు ప్రారంభమయ్యాయి. అందరూ ‘డ్రీమ్ బడ్జెట్’గా చెప్పుకునే 1998నాటి బడ్జెట్‌ను అతి తక్కువ కాలం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమే ప్రవేశ పెట్టింది. ఆ ప్రభుత్వానికి కాంగ్రెస్ వెలుపలినుంచి మద్దతిచ్చింది. కనుక ఈ చరి త్రంతా గమనిస్తే కూటమి ప్రభుత్వాలు మంచివి కావని మార్కెట్లు ఎందుక నుకుంటాయో ఎవరికీ బోధపడదు. ప్రపంచబ్యాంకు వివిధ సంవత్సరాల్లో విడుదల చేసిన ప్రపంచవ్యాప్త పాలనా సూచికల ఆధారంగా యూపీఏ–1, యూపీఏ–2, ఎన్డీఏ ప్రభుత్వాలను పాత్రికేయుడు టీఎన్ నైనన్ పోల్చిచూపారు. అవినీతి నియంత్రణ అంశంలో మన పర్సంటైల్ ర్యాంకు 2013లో 37.0 నుంచి 2016లో 47.1కు మెరుగైంది. కానీ దీనికీ, మన్మోహన్ హయాంలో సాధించిన పర్సంటైల్ 46.8కీ పెద్దగా తేడాలేదు. ప్రభుత్వ పనితీరులో మన దేశం ర్యాంకు 2014లో 45.2 ఉండగా 2016లో అది 57.2, అంతకు చాలాముందు అంటే యూపీఏ–1 హయాం(20017)లో అది 57.3. నియంత్రణలకు సంబంధించి 2012నాటి స్కోరు 35.1 అయితే, 2016లో అది 41.3. కానీ 2006లో అది అత్యధికంగా నమోదైంది. ఆనాటి స్కోరు 45.1. రాజకీయ సుస్థిరత, హింస లేకపోవడం విషయంలో మన ర్యాంకు ఎప్పుడూ అల్పమే. 2005లో అది 17.5... 2014లో 13.8...2015లో 17.1...ఆ మరుసటి ఏడాది 14.3(అంటే 2005నాటి కంటే ఘోరం). శాంతిభద్రతల విషయంలో 2016 (52.4)... 2013 (53.1) కన్నా స్వల్పంగా తక్కువ. కానీ 2006 (58.4)తో పోలిస్తే బాగా తక్కువ. ఈ ర్యాంకుల్లో ఆఖరి సూచిక అభిప్రాయ వ్యక్తీకరణ, జవాబు దారీతనంలో చూస్తే 2013నాటి 61.5 ర్యాంకు 2016 కల్లా 58.6కు దిగింది. ఈ డేటా స్పష్టంగానే ఉంది. మార్కెట్లు, విశ్లేషకులు భయపడుతున్నట్టుగా ‘పటి ష్టమైన, నిర్ణయాత్మకమైన’ ప్రభుత్వం సాధించగలిగేదీ, ‘బలహీనమైన’ ప్రభుత్వం సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇది నాయ కత్వపటిమకూ, దాని గురికి సంబంధించింది. అంతేతప్ప కీలకమైనదిగా కనబడే లోక్‌సభ అమరికతో దీనికి సంబంధం లేదు. ప్రభుత్వానికి మెజారిటీ లేకున్నా కీలకమైన జాతీయ ప్రయోజనానికి సంబంధించిన అంశం చర్చకొచ్చినప్పుడు అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకురావడం కష్టమేమీ కాదు. నిజానికి స్పష్టమైన ఆధిక్యత మనకు అంత మంచిది కాదని నేను వాదిస్తాను. మన దేశంలాంటి వైవి ధ్యభరిత దేశంలో సాహసవంతమైన నిర్ణయం తీసుకుని అది కాస్తా వికటిం చడంకంటే... ఎంతో అప్రమత్తతతో, మధ్యే మార్గం ఎంచుకోవడమే శ్రేయస్కరం. ముందే ఏర్పర్చుకున్న కొన్ని అభిప్రాయాల కారణంగానే ఏదో ఒక పార్టీకి మెజారిటీ ఉండటం మంచిదన్న ఆలోచన ఏర్పడుతుందని మనం ఒప్పుకోవాలి. ఉదా హరణకు ప్రాంతీయ పార్టీలన్నీ అవినీతికరమైనవి, స్వప్రయోజనాలతో కూడిన వని, కుల ప్రాతిపదికన ఏర్పడే పార్టీలు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన అధునాతన భావాలతో ఉండవని కొందరంటారు. కానీ ఇందులో విశ్లేషణకంటే ప్రతికూల భావమే ఉంది. మన ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క పార్టీ మరో పార్టీ కంటే ఏ విషయంలోనూ ఉన్నతమైనదని చెప్పుకోలేదు. ఉత్తర భార తంలోని ఇటీవలి పరిణామాలు 2019లో హంగ్ పార్లమెంటు ఏర్పడవచ్చునని లేదా పాలకపక్షానికి తగినంత మెజారిటీ రాకపోవచ్చునని సూచిస్తున్న నేపథ్యంలో దీన్ని నేను రాయాల్సివచ్చింది. ‘హంగ్’ రావడం లేదా పాలకపక్షానికి మెజారిటీ తగ్గడం తథ్యమని మున్ముందు సర్వేలు వెల్లడిస్తే మన మార్కెట్ విశ్లేషకులు, బిజి నెస్ పత్రికలు దేశ ఆర్థిక వ్యవస్థకూ, సుస్థిరతకూ అది మంచిదికాదని ఊదర గొడతారు. కానీ చరిత్ర మాత్రం అదొక సమస్యే కాదని చెబుతోంది. నిజానికి అలా ‘హంగ్’ ఏర్పడటం స్వాగతించదగ్గదని మాబోటివాళ్లం అనుకుంటున్నాం. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com -
యూపీఏ, ఎన్డీఏ తప్ప ఏ ఫ్రంట్ నిలవదు
మిర్యాలగూడ: దేశంలో యూపీఏ, ఎన్డీఏ కూటములు తప్ప ఏ ఫ్రంట్ ఏర్పాటు చేసినా నిలవదని సీఎల్పీనేత కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడారు. ఏ ప్రాంతీయ పార్టీ అయినా యూపీఏ లేదా ఎన్డీఏ కూటమిలో ఉండాల్సిందేనని, ఇది కాదని కొత్తగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తే కాలక్రమంలో ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రజలే చూస్తారని వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉంటారని తెలిపారు. గెలవటానికి సరిపడా ఓట్లు లేవని తెలిసినా పోటీలో తమ అభ్యర్థిని నిలుపుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో ఉందని, రాజ్యసభ ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేస్తే సుప్రీంకోర్టులో ఆధారాలతో కేసు వేయవచ్చునని అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు రబీ సీజన్లో ఏప్రిల్ 15వ తేదీ వరకు సాగునీరివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడనున్నట్లు తెలిపారు. -
‘యూపీఏ హయాంలోనే బ్యాంకుల పతనం’
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్బీ స్కామ్ నేపథ్యంలో పాలక బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ పతనానికి, నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని బీజేపీ ఆరోపించింది. యూపీఏ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా రుణాలు జారీచేశారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశ రూపురేఖలను మార్చారని చెప్పుకొంటున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీరునూ ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ జోక్యంతో బ్యాంకింగ్ వ్యవస్థ అప్పట్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొందని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలోనే నీరవ్ మోదీ కుంభకోణం వంటి బ్యాంకింగ్ స్కామ్‌లు చోటుచేసుకున్నాయన్నారు. యూపీఏ చేపట్టిన బంగారు దిగుమతుల పథకం లోపభూయిష్టంగా తయారై గీతాంజలి సహా ఏడు ప్రయివేటు జ్యూవెలరీ కంపెనీలకు మేలు చేసిందని అప్పటి ఆర్థిక మంత్రి పీ . చిదంబరం తీరును ఆక్షేపించారు. బ్యాంకు రికార్డుల్లో సరైన సమాచారం నిక్షిప్తం చేసేందుకు యూపీఏ అనుమతించలేదని ఆరోపించారు. యూపీఏ హయాంలో రుణాలు పెద్ద ఎత్తున జారీ చేసినా వాటిని రికార్డుల్లో నమోదు చేయలేదని అన్నారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన 80:20 స్కీమ్‌లో లాభపడిందెవరో కాంగ్రెస్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గీతాంజలి ఇతర కంపెనీల తరపున లాబీయింగ్ చేసిన వారి పేర్లను వెల్లడించాలని మంత్రి కోరారు. రాహుల్ ఇటలీ నుంచి తిరిగివచ్చాక తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. -
నీరవ్‌తో రాహుల్, సింఘ్వీలకు సంబంధాలు!
న్యూఢిల్లీ/ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టిన నీరవ్ మోదీ అండ్ కో విదేశాలకు చెక్కేయగా.. మరోవైపు ఈ పాపానికి బాధ్యులు మీరంటే మీరంటూ బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పర విమర్శల్లో మునిగితేలాయి. ఈ కుంభకోణం యూపీఏ హయాంలోనే జరిగిందని, అయితే ప్రజల్ని తప్పుదారి పట్టించేలా కాంగ్రెస్ పార్టీ అబద్ధాల్ని ప్రచారం చేస్తోందని బీజేపీ ఆరోపించగా.. దేశానికి కాపలాదారుగా ఉన్న మోదీ నిద్రపోతుంటే.. దేశ సంపదను దోచుకుని దొంగలు పరారవుతున్నారని కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. మరోవైపు శనివారం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దేశ వ్యాప్తంగా సోదాలు కొనసాగించి రూ. 25 కోట్ల విలువైన ఆభరణాల్ని స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఇంతవరకూ రూ. 5,674 కోట్ల ఆస్తులు సీజ్ చేశామని ఈడీ తెలిపింది. నీరవ్‌ను పట్టుకుని తీరుతాం: సీతారామన్ నీరవ్ మోదీ కేసులో కాంగ్రెస్ ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను శనివారం బీజేపీ రంగంలోకి దింపింది. ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాలు ఎన్డీయే హయాంలో బయటకొస్తుంటే.. మోదీ ప్రభుత్వ హయాంలో ఈ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. నీరవ్ మోదీ దేశం వదిలి పారిపోవచ్చు. అయితే అతనిపై ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకుంటుంది. నీరవ్‌ను పట్టుకుని తీరుతాం’ అని పేర్కొన్నారు. అసలు పాపమంతా కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమై.. రెట్టింపుగా విస్తరించిందని సీతారామన్ ఆరోపించారు. మోసగాళ్లు దేశం వదిలి పారిపోయేందుకు కుట్ర చేయకుండా.. వారిని పట్టుకుంటున్నామని చెప్పారు. ఎన్డీఏ హయాంలో ఆర్థిక నేరగాళ్లు దేశం వదిలి పారిపోతున్నారు కదా! అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘పారిపోయారు అంటే వారిని మేం పట్టుకోబోమని అర్థం కాదు. వారిపై చర్యలు కొనసాగుతున్నాయి. దర్యాప్తు జరుగుతోంది. తప్పకుండా పట్టుకుని తీరుతాం’ అని చెప్పారు. నీరవ్ మోదీ నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారని సీతారామన్ ఆరోపించారు. కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ భార్య డైరెక్టర్‌గా ఉన్న అద్వైత్ హోల్డింగ్స్‌కు చెందిన ఆస్తిని.. నీరవ్ నడుపుతున్న ‘ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్’ లీజుకు తీసుకుందని ఆమె తెలిపారు. గీతాంజలి జెమ్స్ ఆర్థిక వ్యవహారాలపై 2013లో అభ్యంతరాలు వ్యక్తం చేసిన అలహాబాద్ బ్యాంకు ప్రభుత్వ డైరెక్టర్‌ను రాజీనామా చేయాలని కోరారని, అతని అభ్యంతరాల్ని కనీసం పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. 2017లోనే కుంభకోణం: కపిల్ సిబల్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో కుంభకోణానికి బీజేపీదే బాధ్యతని, ఆశ్రిత పక్షపాత ధోరణిని ప్రధాని నరేంద్ర మోదీ వ్యవస్థీకృతం చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రధాని, ఎన్డీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను దాదాపు నాశనం చేశారని, మోదీ నాయకత్వంలో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతింటుందని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ నిద్రపోతుంటే.. దేశ సంపదతో దొంగలు పారిపోతున్నారని విమర్శించారు. సీబీఐ రెండో ఎఫ్ఐఆర్లో నిందితుడికి జారీ చేసిన అన్ని ‘లెటర్ ఆఫ్ అండర్ స్టాండింగ్(ఎల్వోయూ)’లపై 2017లోనే సంతకం చేసినట్లు ఉందని, కుంభకోణాన్ని అడ్డుకోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నీరవ్, చోక్సీలతో తమ కుటుంబానికి సంబంధాలపై బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ తోసిపుచ్చారు. తన భార్య, కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న అద్వైత్ హోల్డింగ్స్‌కి చెందిన కమలా మిల్స్‌ను నీరవ్ కంపెనీ లీజుకు తీసుకుందని ఆయన వివరణ ఇచ్చారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, తప్పుడు ఆరోపణలు చేసినందుకు సీతారామన్, ఆమె సహచరులపై సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తానని సింఘ్వీ హెచ్చరించారు. ‘అంతా నోట్ల రద్దు వల్లే’ ప్రధానిపై రాహుల్ ఆరోపణలు కొనసాగించారు. ‘నీరవ్ కేసులో ఏం జరిగిందో ప్రధాని చెప్పాలి. ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలి’ అని రాహుల్ అన్నారు. నీరవ్‌తో తనకు వ్యక్తిగత సంబంధాలున్నాయన్న బీజేపీ ఆరోపణల్ని ఆయన తోసిపుచ్చారు. ‘నోట్ల రద్దుతో ఇదంతా మొదలైంది. ప్రజాధనాన్ని సేకరించి మోదీ బ్యాంకింగ్ వ్యవస్థలో పెట్టారు. నీరవ్ రూ. 20 వేల కోట్ల ప్రజాధనంతో దేశం నుంచి పరారయ్యారు’ అని విమర్శించారు. 21చోట్ల సోదాలు శనివారం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) దాడులు కొనసాగించింది. దేశవ్యాప్తంగా 21 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి రూ. 25 కోట్ల విలువైన వజ్రాలు, ఆభరణాల్ని స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) అధికారుల్ని సీబీఐ అరెస్టు చేసింది. రిటైర్డ్ డిప్యూటీ మేనేజరు గోకుల్ నాథ్ శెట్టి, సింగిల్ విండో ఆపరేటర్ మనోజ్ ఖారత్‌తో పాటు నీరవ్ తరఫున హామీదారుగా ఉన్న హేమంత్ భట్‌ను అదుపులోకి తీసుకుంది. వీరిని ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు వారికి 14 రోజుల కస్టడీ విధించింది. ఈ కేసులో మరింత మంది పీఎన్బీ అధికారుల ప్రమేయం ఉండవచ్చని సీబీఐ కోర్టుకు తెలిపింది. రూ. 280 కోట్ల మోసం జరిగిందని, ఇది రూ. 6 వేల కోట్ల వరకూ ఉండవచ్చని రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. పన్ను ఎగవేత కేసులో ఐటీ శాఖ శనివారం గీతాంజలి జెమ్స్, దాని ప్రమోటర్ మెహుల్ చోక్సీ, ఇతరులకు చెందిన 9 బ్యాంకు ఖాతాల్ని అటాచ్ చేసింది. ‘పీఎంఓతో కలిసి పనిచేస్తున్నాం’ ఈ కుంభకోణాన్ని పరిష్కరించేందుకు ప్రధాని కార్యాలయంతో కలిసి పనిచేస్తున్నామని ఆర్థిక శాఖ తెలిపింది. పీఎంఓ ఏ నిర్ణయం తీసుకుంటే దానిని ఆర్థిక శాఖ అమలు చేస్తుంది’ అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శుక్లా తెలిపారు. పీఎన్బీ కేసులో తమ బ్యాంకు వాటా రూ. 2,636 కోట్లు ఉందని యూకో బ్యాంకు తెలిపింది. పీఎన్బీ జారీ చేసిన లెటర్ ఆఫ్ క్రెడిట్ల ఆధారంగా హాంకాంగ్ బ్రాంచీ ఆ మేర రుణాలిచ్చిందని స్టాక్ ఎక్సే్ఛంజీకి తెలిపింది. నీరవ్‌కు ద్వంద్వ పౌరసత్వం! నీరవ్ మోదీ పాస్‌పోర్టును విదేశాంగ శాఖ రద్దు చేసినా.. అతనికి ద్వంద్వ పౌరసత్వాలు ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. నీరవ్, అతని సోదరుడు నిశాల్లు బెల్జియంలో పుట్టి పెరిగారు. నిఘా వర్గాల కథనం మేరకు నీరవ్ భారతదేశ పాస్‌పోర్టును వదులుకుని బెల్జియం పాస్‌పోర్టును సంపాదించినట్లు తెలుస్తోంది. నీరవ్ మాత్రం తాను భారతీయ పౌరుడినేనని గతంలో పేర్కొన్నాడు. గుజరాత్‌కు చెందిన అతను ఫైర్‌స్టార్ డైమండ్ పేరిట ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ప్రఖ్యాత వార్టన్ బిజినెస్ స్కూలులో చేరి మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ 2015లో న్యూయార్క్‌లో నీరవ్ స్టోర్‌ను ప్రారంభించారు. -
విభేదాలు పక్కనపెడదాం..
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో గురువారం ప్రతిపక్ష నాయకులు సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అధికార బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహ రచన, ఐక్యత సాధించడంపై చర్చ జరిగినట్లు తెలిసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో మాదిరిగా 17 ప్రతిపక్ష పార్టీలను ఏకతాటి పైకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే తాజా భేటీ జరిగింది. బీఎస్పీ మినహా మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. విభేదాలు పక్కనపెట్టి జాతీయ ప్రయోజనాల కోసం ఐకమత్యంతో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని సోనియా పిలుపునిచ్చారు. పార్లమెంట్ లోపలా, బయటా ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి వ్యూహం అనుసరించాలన్నారు. పార్టీల మధ్య విభేదాలు ఉండొచ్చు కానీ జాతీయ ప్రయోజనాలకొచ్చే సరికి మాత్రం ఒకే వైఖరి అవలంబించాలన్నారు. మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థాయికి చేరుకుందన్నారు. భేటీ ముగిసిన తరువాత కాంగ్రె స్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ఏడు పార్టీల నాయకులతో కమిటీ ఏర్పాటు... ట్రిపుల్ తలాక్ బిల్లు, సుప్రీంకోర్టు అంతర్గత సంక్షోభం, ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మత ఘర్షణలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏడు పార్టీలకు చెందిన నాయకులతో ఒక కమిటీని ఏర్పాటుచేశారు. ప్రతిపక్షాల మధ్య ఐకమత్యం కొనసాగేందుకు ఈ కమిటీ కృషిచేస్తుంది. సమావేశానికి హాజరైన వారిలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ తరఫున జయ్ ప్రకాశ్ నారాయణ్ యాదవ్, తృణమూల్ నాయకుడు డెరెక్ ఒబ్రియాన్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, ఎస్పీ నాయకుడు రామ్‌గోపాల్ తదితరులు ఉన్నారు. -
మోదీ హయాంలో తగ్గిన ఉగ్రవాద చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గు ముఖం పట్టాయి. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ హయాంతో పోలిస్తే.. మోదీ పాలనలో భారీ స్థాయిలో ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఇదే విషయాన్ని గణాంకాలు కూడా నిరూపిస్తున్నాయి. మన్మోహన్ హయాంలోని 2010 నుంచి 2013 మధ్య కాలంలో జమ్మూ కశ్మీర్లో మొత్తం 1218 ఉగ్రవాద ఘటనలు జరిగాయి. అదే మోదీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2017 మధ్యకాలంలో 1094 ఘటనలు మాత్రమే చోటు చేసుకున్నాయి. 2014 నుంచి ఇప్పటివరకూ భద్రతా బలగాలు.. 580 మంది ఉగ్రవాదును హతమార్చాయి. అదే మన్మోహన్ హాయంలో చివరి నాలుగేళ్లలో 471 మంది టెర్రరిస్టులు మరణించారు. ఉగ్రవాద ఘటనల్లో కశ్మీరీ పౌరుల మృతుల సంఖ్య కూడా యూపీఏతో పోలిస్తే ఎన్డీఏ పాలనలోనే తక్కువగా నమోదయ్యాయి. యూపీఏ చివరి నాలుగేళ్లలో వంద మంది పౌరులు మృతి చెందారు. ఇదే ఎన్డీఏ పాలనలో 92 మంది చనిపోయారు. -
పెద్దల సభలో బీజేపీ హవా
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త ఏడాది భారతీయ జనతాపార్టీకి కలిసివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తొలిసారి పెద్దలసభలో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య ఈ ఏడాది 67కు చేరనుంది. ఎన్డీఏ పక్షాలతో కలుపుకుంటే.. ఈ బలం 98కి చేరుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి రాజ్యసభను శాసిస్తున్న కాంగ్రెస్ పార్టీ తొలిసారి దిగువ స్థానంలోకి రానుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఈ రాష్ట్రాలనుంచి ఈ ఏడాది బీజేపీ భారీగా పెద్దల సభకు సభ్యులను పంపనుంది. పతనం దిశగా కాంగ్రెస్ గత మూడేళ్లుగా పలు రాష్ట్రాల్లో అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ చేజార్చుకుంది. అయితే తాజాగా గుజరాత్లో తన సంఖ్యా బలం పెంచుకోవడం కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే అంశం. ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీ 5 రాజ్యసభ సీట్లను కోల్పోనుంది. ఇతర పార్టీల పరిస్థితి ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం రీత్యా లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)కు మరో రెండు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) మరో ఇద్దరిని పెద్దల సభకు పంపనుంది. దీంతో టీఆర్ఎస్ మొత్తం రాజ్యసభ సభ్యుల సంఖ్య ఐదుకు చేరనుంది. ఇక సమాజ్ వాదీ పార్టీ ఐదు స్థానాలను బీజేపీకి అప్పగించనుంది. -
‘సోనియా రాజకీయాల్లో కొనసాగుతారు’
సాక్షి, న్యూఢిల్లీ : సోనియా గాంధీ రిటైర్మెంట్పై వస్తున్న కథనాలపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి మాత్రమే రిటైర్ అవుతున్నారని.. రాజకీయాల్లో ఆమె కొనసాగుతారని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాల్ ట్విటర్లో తెలిపారు. ‘‘సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలనుంచి మాత్రమే రిటైర్ అవుతున్నారు. రాజకీయాలనుంచి కాదని’’ ఆయన ట్వీట్ చేశారు. సోనియా గాంధీ మేధస్సు, ఆశీస్సులు పార్టీకి ఎప్పటకీ అవసరమని చెప్పారు. శీతాకాల సమావేశాలకు హాజరయిన సోనియా గాంధీ తిరిగి వెళుతూ.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె ‘నేను రాజకీయాలను నుంచి తప్పుకుంటాను’ అని ప్రకటించారు. అంతేకాక మూడేళ్లేగా రాహుల్ గాంధీ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. Would sincerely request friends in the media to not rely upon innuendos. Smt. Sonia Gandhi has retired as President of Indian National Congress and not from politics. Her blessings, wisdom and innate commitment to Congress ideology shall always be our guiding light. — Randeep S Surjewala (@rssurjewala) December 15, 2017 -
రాహుల్ గాంధీకి ధనోవా షాక్
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు అక్రమాలపై మాటలయుద్ధం పతాక స్థాయిలో కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేంద్ర ధనోవా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకున్న 36 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి రాహుల్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. యూపీఏ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకన్నా ఎన్డీఏ తీసుకున్న నిర్ణయాలు అద్భుతమని ఆయన అన్నారు. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలులో ఒక వ్యాపారవేత్తకు ప్రయోజనాలు కల్పించారని రాహుల్‌గాంధీ గురువారం నాడు ఆరోపించిన సంగతి తెలిసిందే. రాహుల్ ఆరోపణల్లో నిజం లేదని ధనోవా పేర్కొన్నారు. అంతేకాక యూపీఏ హయాంలో తీసుకున్న మీడియం మల్టీరోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంఎంఆర్సీఏ) కొనుగోలు ఒప్పందాలకన్నా.. ఎన్డీఏ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని ధనోవా స్పష్టం చేశారు. -
రామ్‌నాథ్ కోవింద్ ఘన విజయం
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో అనుకున్నట్లే జరిగింది. రామ్‌నాథ్ కోవింద్‌కే పట్టం కట్టారు. తొలి నుంచి భారీ ఆధిక్యంతో దూసుకెళ్లిన ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్.. యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్‌పై ఘన విజయం సాధించారు. కోవింద్‌కు 65.65, మీరాకుమార్‌కు 34.34 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక రామ్‌నాథ్‌కు వచ్చిన ఓట్ల విలువ 7,02, 644 కాగా, మీరాకుమార్‌కు వచ్చిన ఓట్లు విలువ 3,67, 314. ఈనెల 25న దేశ 14వ రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన కోవింద్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కోవింద్ గెలుపుతో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. కోవింద్ ప్రొఫెల్... వివాద రహితుడిగా, పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా పేరొందిన కోవింద్ 1945 అక్టోబర్ ఒకటో తేదీన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహత్ జిల్లా డేరాపూర్‌లో జన్మించారు. కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేసి... కాన్పూర్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. తర్వాత సివిల్ సర్వీసెస్‌కు వెళ్లాలన్న ఆశతో ఢిల్లీ చేరుకున్నారు. మూడో ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపికయ్యారు. అయితే ఐఏఎస్ రాకపోవడంతో... న్యాయవాదిగా స్థిరపడిపోయారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 16 ఏళ్లపాటు అడ్వకేట్‌గా పనిచేశారు రామ్‌నాథ్ కోవింద్. రెండుచోట్లా కేంద్ర ప్రభుత్వ కౌన్సిల్‌గా సేవలందించారు. పేద, బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయసేవలు అందించేవారు. దేశసేవపై ఉన్న మక్కువతో తొలుత సంఘ్ పరివార్‌లో చేరారు రామ్‌నాథ్ కోవింద్. ఢిల్లీలో స్థిరపడిన తర్వాత డేరాపూర్‌లోని తన పాత ఇంటిని ఆర్ఎస్ఎస్కే రాసిచ్చారు. 1991లో బీజేపీలో చేరిన కోవింద్... బీజేపీ నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి రెండుసార్లు పోటీచేసి ఓటమిపాలయ్యారు. తర్వాత బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులుగా, బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 1994లో తొలిసారి ఎగువసభకు ఎంపికైన కోవింద్... రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా సేవలందంచారు. 1994 నుంచి 2006 వరకూ రాజ్యసభ ఎంపీగా... పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యులుగా, ఒక కమిటీకి ఛైర్మన్‌గానూ పని చేశారు. ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి.. 2002లో ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రసంగించారు. 2015 ఆగస్టు 16న బీహార్ గవర్నర్‌గా నియమితలైన కోవింద్... ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యేవరకూ ఆ పదవిలో కొనసాగారు. రామ్‌నాథ్ కోవింద్ భార్య పేరు సవితా కోవింద్. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. -
ఏపీలో ఓట్లన్నీ కోవింద్‌కే, ఆధిక్యమెంత!?
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్, యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్ తలపడ్డ ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటలకు మొదలైంది. తొలుత పార్లమెంటు హౌస్‌లో ఏర్పాటుచేసిన బ్యాలెట్ బాక్సును లెక్కిస్తున్నారు. మొదట ఎంపీల ఓట్లను లెక్కించిన అనంతరం రాష్ట్రాల నుంచి వచ్చిన బాక్సులను ఆంగ్ల వర్ణమాల క్రమంలో లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరౌండ్లో అరుణాచల్‌ప్రదేశ్, అసోం, ఆంధ్రప్రదేశ్ బ్యాలెట్ బాక్సుల కౌంటింగ్ పూర్తయింది. రామ్‌నాథ్‌కు 4,79,585, మీరాకుమార్‌కు 2,04,594 ఓట్లు విలువ రాగా, ఏపీలో మాత్రం రామ్‌నాథ్‌కే ఓట్లన్నీ పోలయ్యాయి. మొత్తం నాలుగు టేబుళ్లపై 8 రౌండ్ల పాటు కౌంటింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకల్లా ఫలితాలు ప్రకటించే అవకాశముంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని వినిపిస్తోంది. ఎన్టీయేకు సంపూర్ణ మెజారిటీ ఉండటంతో కోవింద్ సునాయసంగా రాష్ట్రపతి కాబోతున్నారని తెలుస్తోంది. 776 మంది ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలతో మొత్తం 4,895మంది అర్హులైన ప్రజాప్రతినిధుల్లో 99శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇది రికార్డు పోలింగ్. ఈ పోలింగ్‌లో ఎన్డీయే అభ్యర్థి కోవింద్‌కు ఎంత ఆధిక్యం వస్తుందన్న దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. కోవింద్‌కు దాదాపు 70శాతం ఓట్లు లభించవచ్చునని భావిస్తున్నారు. ఏదైనా అద్భుతం, అనూహ్యం జరిగితే ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ విజయం సాధించవచ్చునని అంటున్నారు. -
లెక్కింపు షురూ: కోవింద్ ఆధిక్యమెంత!?
-
రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడే
-
రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడే
న్యూఢిల్లీ: యావత్ భారతావని ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్, యూపీఏ అభ్యర్థిగా మీరా కుమార్ తలపడ్డ ఈ ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం 11 గంటలకు మొదలవుతుందని రిటర్నింగ్ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా తెలిపారు. తొలుత పార్లమెంటు హౌస్‌లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సును లెక్కిస్తామని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రాల నుంచి వచ్చిన బాక్సులను ఆంగ్ల వర్ణమాల క్రమంలో లెక్కించనున్నట్లు మిశ్రా తెలిపారు. నాలుగు టేబుళ్లపై 8 రౌండ్ల పాటు కౌంటింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకల్లా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందన్నారు. -
మీరా కుమారే ప్రధాన మంత్రి అయితే...
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల పక్షాన రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దళిత మహిళ మీరా కుమార్ రాష్ట్రపతి భవన్‌లోకి అడుగుపెట్టలేక పోవచ్చు. బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే కూటమి నిలబెట్టిన దళిత విద్యావేత్త రామ్‌నాథ్ కోవింద్‌కు ఎక్కువ శాతం ఓట్లు ఉండడమే అందుకు కారణం. కానీ 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతిపక్షాలన్నీ నేటిలాగే ఏకమై మీరా కుమారినే ప్రధాన మంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడది అసంబద్ధంగాను, అర్థరహితంగాను, నైరూప్య చిత్రంగాను అనిపించవచ్చు. ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో మీరా కుమార్‌కు మద్దతుగా కాంగ్రెస్ నాయకత్వంలో 17 పార్టీలు ముందుకు వచ్చాయి. ప్రతపక్షం తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని ఆది నుంచి కాంగ్రెస్ వెంటబడిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాలకపక్షంవైపు మొగ్గుచూపారు. ముందుగానే మీరా కుమార్ పేరును ప్రతిపాదించి ఉన్నట్లయితే నితీష్ కుమార్ ప్రతిపక్షం వెంట వచ్చేవారే. తొందరపడి ఆయన బీహార్ గవర్నర్‌గా ఉన్న వ్యక్తి, అందులోనూ దళితుడన్న భావంతో కోవింద్‌కు మద్దతు ప్రకటించారు. ఆయన నిర్ణయాన్ని మార్చుకునే రకం కాదుకనుక ఆయన తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వద్ధి రేటు 7.8 నుంచి 6.1 శాతానికి పడిపోవడం, గోవధ నిషేధం తదితర పరిణామాలు పాలకపక్షానికి దళితులను, ముస్లింలను దూరం చేశాయి. ఈ రెండు వర్గాలే కలసి ఉత్తరప్రదేశ్ జనాభాలో 34 శాతం మంది ఉన్నారు. యూపీలో దళితులంతా ఒక్క మాయావతి వెనకాలే కాకుండా వివిధ గ్రూపుల కింద ఏకమవుతున్నారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతిచ్చిన మహారాష్ట్రకు చెందిన మహర్లు గోవధ నిషేధం కారణంగా బౌద్ధ మతంలోకి మారిపోయారు. జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ పన్నుకు వ్యతిరేకంగా గుజరాతీలోని మార్వీడీలు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరంతా ఇంతకాలం మోదీకి హారతులు పట్టిన వారే. కానీ జీఎస్టీ తమ తరతరాలుగా సంప్రదాయంగా వస్తున్న వ్యాపారాన్ని దెబ్బతీస్తుందన్నది వారి ఆందోళన. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఐక్యతా రాగం వినిపించడం ద్వారా 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష కూటమి ఎన్డీయేను మట్టి కరిపించాలన్నది కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాల వ్యూహం. ఈ వ్యూహం నెరవేరాలంటే మోదీ లాంటి నాయకుడిని ఢీకొనే సమర్థుడైన నాయకత్వం కావాలి. నితీష్ కుమార్ ప్రత్యామ్నాయ నాయకుడిగా తాను ప్రతిపక్షంలో ఎదగాలన్న ఆలోచనతోనే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని రాష్ట్రపతి పదవికి నిలబెట్టాలని పోరారు. ఇప్పుడు ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఇక రాహుల్ గాంధీని మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ప్రతిపక్షాలేవీ గుర్తించడం లేవు. అలా ఎదుగుతాడన్న నమ్మకం ఎవరికీ లేదు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ స్పీకర్‌గా, విదేశీ దౌత్యవేత్తగా సమర్థంగా విధులు నిర్వహించిన రాజకీయానుభవమే కాకుండా మీరా కుమార్‌కు ఉన్నత విద్యార్హతలు ఉన్నాయి. పైగా దళిత నేపథ్యం. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయే కనుక ఆ పార్టీనే మీరా కుమార్‌ను బరిలోకి దించితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం ‘గాంధీ–నెహ్రూ’ వారసత్వ పాలనను పక్కన పెట్టాల్సిందే. 1991లో అలా చేయడం వల్లనే పీవీ నరసింహారావు దేశ ప్రధాని కాగలిగారు. 2004, 2009లో మన్మోహన్ సింగ్ రెండుసార్లు ప్రధాని కాగలిగారు. కొంతకాలంపాటు కాంగ్రెస్ పుత్రరత్నాన్ని పక్కన పెడితే మరింత బలంగా ప్రతిపక్షాలు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరోదఫా ఎన్నికల్లో పుత్ర రత్నానికి పట్టాభిషేకం చేసే అవకాశం రావచ్చు. ప్రస్తుతానికి బంతి సోనియా గాంధీ చేతుల్లోనే ఉంది. ––––––––ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
పావురం ఛాతి ఉంటే అన్‌ఫిట్...
న్యూఢిల్లీ: భారత దేశంలో 1914 నాటి మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ పదవికి అర్హులు కావాలంటే తళతళలాడే తెల్లటి పలు వరుస ఉండాలి. అందుకు క్రమం తప్పకుండా బ్రెష్ చేసుకునే అలవాటు ఉండాలి. ముందుకు ఎముక పొడుచుకు వచ్చినట్లుగా పావురం ఛాతి లాంటి ఛాతి ఉండకూడదు. మోకాళ్లు తగిలేలా తాకుడు కాళ్లు ఉండరాదు. బల్లబరుపు పాదాలు ఉండకూడదు. పాదం బొటనవేలు కిందక వంగి ఉండరాదు. 1878 నాటి భారత ఖజానా చట్టం ప్రకారం పది రూపాయలకంటే ఖరీదైనా ఏ వస్తువు ఏ వ్యక్తి కలిగి ఉన్నా దానికి రెవెన్యూ అధికారి అనుమతి తప్పనిసరి. అలా లేకపోతే ఏడాది జైలు శిక్ష తప్పదు. 1934 ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం ప్రకారం విమానాలతోపాటు గాల్లో పతంగులు ఎగరేసేందుకు కూడా అనుమతులు తప్పనిసరి. కొన్ని రాష్ట్రాల్లో ప్రజల ఇళ్లపైకి, పొలాలపైకి ఎలాంటి కరపత్రాలు పడకుండా చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల పోలీసుల బాధ్యత. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ప్రచారోద్యమాన్ని అడ్డుకునేందుకు వచ్చిన నిబంధన. దేశ విభజన సందర్భంగా పాకిస్తాన్ వలసపోయిన ప్రజలకు ఎప్పుడైనా బెంగాల్, అస్సాం, పంజాబ్ కోర్టులను ఉపయోగించుకునే హక్కు ఉంది. గంగా నదిలో ఒక ఒడ్డు నుంచి రెండో ఒడ్డుకు ప్రయాణికులను తీసుకెళ్లే పడవలు రెండు అణాలకు మించి టోల్ టాక్స్ వసూలు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు అణాలే లేవు. 21 ఏళ్లలోపు యువకులు చదవకూడని లేదా హానికరమైన విషయాన్ని ప్రచురించరాదని 1956 నాటి యువకుల హానికర ప్రచురుణ చట్టం తెలియజేస్తోంది. అప్రదిష్టకరమైన ప్రదర్శనలను నిషేధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకుందని 1876 నాటి డ్రామటిక్ పర్ఫార్మెన్స్ చట్టం తెలియజేస్తోంది. భారత కోర్టులిచ్చే ఏ తీర్పునైనా సమీక్షించే అధికారం బ్రిటిష్ రాణికి ఉంది. ఎప్పుడో కాలంతీరి పోయిన ఇలాంటి చట్టాల్లో 1200 చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో రద్దు చేసింది. మరో 1824 చట్టాలను రద్దు చేయాల్సి ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే కాలంతీరి పోయిన చట్టాలను గుర్తించి వాటిని రద్దు చేయడానికి తన కార్యాలయంలోని కార్యదర్శి ఆర్. రామానుజం అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇదే లక్ష్యంతో 1998లో అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి కూడా ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ కాలం తీరిపోయిన చట్టాలను గుర్తించింది. అయితే వాటిని రద్దు చేసే ప్రక్రియ కొనసాగలేదు. ఇప్పటి రామానుజం కమిటీ కూడా అప్పటి కమిటీ సమీక్షలను పునర్ సమీక్షించి సముచిత నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాలంతీరి పోయిన 1200 చట్టాలను రద్దు చేయగా, ఇప్పటి ప్రభుత్వం మూడేళ్ల కాలంలోనే ఏకంగా 1300 చట్టాలను రద్దు చేసింది. దీనికి రాజ్యసభబో మెజారిటీ కలిగిన యూపీఏ కూటమి కూడా సహకరించింది. -
ఎయిర్ ఇండియాపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్ లైన్స్ ల విమానాల కోనుగోలు ఒప్పందాల్లో కుంభకోణాలు జరిగాయని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఒప్పందాన్ని గత యూపీఏ ప్రభుత్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కెబినెట్ ఆమోదించింది. ఇప్పటికే బొగ్గు, టెలికాం సెక్టార్లో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ తాజాగా 111 విమానాల కోనుగోలులో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర విమానాయనశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణ చేపట్టాలని జనవరిలోనే సుప్రీం కోర్డు సూచించింది. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన సీబీఐ అవతవకలు జరిగాయని తేలడంతో సోమవారం మూడు కేసులు నమోదు చేసింది. రూ. 70 వేల కోట్లతో విమానాలు కొనుగోలు చేయడంతో జాతీయ విమానాయ సంస్థ ఆర్ధికంగా నష్టపోయిందని, ఈ వ్యవహారం ప్రయివేటు సంస్థలకు లాభాదాయకంగా ఉందని దర్యాప్తు బృందం పేర్కొంది. 2005 లో యూపీఏ ప్రభుత్వం బోయింగ్ కంపెనీ నుంచి ఎయిర్ ఇండియా 68 విమానాలు కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. ఒక సంవత్సరం అనంతరం ఇండియన్ ఎయిర్ లైన్స్ ఎయిర్ బస్ నుంచి 43 విమానాలు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2007 లో ఈ రెండు జాతీయ విమానయ సంస్థలు వీలీనమై ఎయిర్ ఇండియాగా సేవలందిస్తున్నాయి. -
నన్ను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు
యూపీఏ, ఎన్డీయేలపై మాల్యా ట్వీట్లు న్యూఢిల్లీ: రుణాల ఎగవేత ఆరోపణలతో దేశం విడిచి వెళ్లిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా ఎగవేతదారులపై ప్రభుత్వ కఠిన చర్యల మీద స్పందించారు. భీకరంగా పోట్లాడుకుంటున్న యూపీఏ, ఎన్డీయే కూటములు తనను ఫుట్బాల్లాగా ఆడుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ఇందుకు మీడియా వేదికగా మారిందంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్వీటర్లో ట్వీట్ చేశారు. ‘ఎన్డీఏ వర్సెస్ యూపీఏ పోటీ నడుస్తోంది. రెండు జట్లు హోరాహోరీగా ఆడుతున్నాయి. మీడియాను చక్కగా పిచ్‌లాగా వాడుకుంటున్నారు. నన్ను ఫుట్బాల్లాగా ఆడుకుంటున్నారు. దురదృష్టవశాత్తు.. ఈ మ్యాచ్‌లో రిఫరీలే లేరు’ అంటూ మాల్యా పేర్కొన్నారు. రుణాలు ఎగవేసిన వారు దేశం విడిచి వెళ్లనివ్వకుండా ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఆయన ట్వీట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు తన కేసులో సీబీఐ తీరుపై కూడా మాల్యా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సీబీఐ ఆరోపణలు షాకింగ్‌గా ఉన్నాయి. అన్నీ అబద్ధాలు, అపోహలే. ఉన్నత స్థాయిలో ఉన్నవారైనా కూడా వ్యాపారం, ఆర్థికాంశాల గురించి పోలీసులకేం తెలుస్తుంది’ అని పేర్కొన్నారు. మాల్యాకి చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ. 9,000 కోట్లు బ్యాంకులకు ఎగవేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో మాల్యా గతేడాది మార్చి 2న బ్రిటన్‌కు పరారయ్యారు. -
సర్జికల్ స్ట్రైక్స్ జరపడం మంచిదే
-
మరో భారీ కుంభకోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం!
సావో పాలో/న్యూఢిల్లీ: వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణాన్ని మరువకముందే మరో భారీ రక్షణ కుంభకోణం దేశ రాజకీయాల్ని అతలాకుతలం చేసే అవకాశం కనిపిస్తోంది. భారత్, సౌదీ అరేబియాతో జెట్ విమాన అమ్మకం ఒప్పందాలు కుదుర్చుకునేందుకు బ్రెజిల్ కంపెనీ ఎంబ్రెయర్ భారీగా ముడుపులు ముట్టజెప్పినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్ దర్యాప్తు సంస్థలు, అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నాయి. 2008లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం మూడు ఈఎంబీ-145 జెట్ విమానాలు కొనుగోలుకు ఎంబ్రెయర్‌తో 208 మిలియన్ డాలర్ల (రూ. 1,391 కోట్ల)తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ ఒప్పందం కోసం దళారీగా వ్యవహరించిన బ్రిటన్‌కు చెందిన డిఫెన్స్ ఏజెంటు సంస్థకు భారీగా కమిషన్లు ముట్టజెప్పినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. భారత రక్షణ వ్యవస్థ ప్రకారం దళారీల ద్వారా, మధ్యవర్తుల ద్వారా ప్రయత్నాలు చేసి ఒప్పందం కుదుర్చుకోవడం నిషేధం. డీఆర్డీవో ప్రాజెక్టు అయిన ఏఈడబ్ల్యూఅండ్ సీ (గగనతల ముందస్తు హెచ్చరికలు, నియంత్రణ వ్యవస్థ) ర్యాడర్కు అనుసంధానం చేసేందుకు ఈఎంబీ-145 యుద్ధవిమానాలు కొనుగోలు చేశారు. రూ. 2,520 కోట్లతో డీఆర్డీవో ఈ ప్రాజెక్టు చేపట్టగా.. పలు మార్పులతో తయారుచేసిన మొదటి విమానం 2011లో, మిగతా రెండు విమానాలు ఆతర్వాత భారత్ చేరాయి. బ్రెజిల్ యుద్ధవిమానాల తయారీ సంస్థ ఎంబ్రెయర్‌తో ఒప్పందం విషయంలో అక్రమాలు జరిగిన విషయం డీఆర్డీవోకు తెలియదని రక్షణమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. -
గవర్నర్‌గా శంకరమూర్తి?
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నపుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కే రోశయ్యను తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. సహజంగా కేంద్రంలో మరోపార్టీ అధికారంలోకి రాగానే గవర్నర్ల సీటుకు కాలం చెల్లుతుంది. గవర్నర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయడమో లేదా కేంద్రమే తొలగించడమో రాజకీయాల్లో సహజం. అయితే ముఖ్యమంత్రి జయలలితతో సత్సంబంధాలు, వివాదరహితుడు కావడంతో రోశయ్య మరో రెండేళ్లు కొనసాగి మొత్తం ఐదేళ్లపాటూ పూర్తికాలం గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2011 ఆగస్టులో రోశయ్య బాధ్యతలు చేపట్టగా ఈనెల 27వ తేదీతో ఆయన పదవీకాలం ముగుస్తుంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి పదవుల కోసం క్యూకట్టిన వారిని సంతృప్తిపరచాల్సిన ఆవశ్యకత కేంద్రానికి ఏర్పడింది. దీంతో కొత్త గవర్నర్‌గా ఎవరు వస్తారనే అంశం ఇటీవల తీవ్రస్థాయిలో చర్చకు వచ్చింది. ముఖ్యంగా ఉత్తరాదివారా, దక్షిణాది వ్యక్తా అనే కోణంలో రెండుగా విభజించి విశ్లేషించుకోవడం ప్రారంభించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలుగుదేశం మిత్రపక్షం కావడంతో ఆ పార్టీకి చెందిన ఒక పేరు పెద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈలోగా కేంద్రంతో తెలుగుదేశానికి సంబంధాలు చెడడంతో కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి ఇటీవలే రాజీనామా చేసిన ఆనందీబెన్ పేరు కూడా కొన్నాళ్లు చలామణి అయింది. బీజేపీ సీనియర్ నేత టీహెచ్ శంకరమూర్తిని పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా పిలిచి త్వరలో మీకు పెద్ద కొత్త పదవి రాబోతోంది, సిద్ధంగా ఉండండి అని చెప్పారు. ఆ పదవి ఉత్తరాదిలో కాకుండా దక్షిణాదిలో ఉండేలా చూడాలని శంకరమూర్తి కోరినట్లు సమాచారం. దక్షిణాదికి సంబంధించి తమిళనాడు గవర్నర్ స్థానం ఖాళీ అవుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నరసింహన్ ఒక్కరే గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో దేనికైనా గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందని కూడా వినపడుతోంది. అయితే తమిళనాడు గవర్నర్‌గా నియమించేందుకే అమిత్‌షా నిర్ణయించినట్లు సమాచారం. -
బీజేపీ, టీఆర్ఎస్ కలసిపోయినట్టే : ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, టీఆర్ఎస్ కలసిపోవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యనేతలు మల్లు భట్టివిక్రమార్క, మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులతో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 26 నెలల తర్వాత రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించడం వల్ల ఒరిగిందేమిటని ప్రశ్నించారు. భవిష్యత్తులో టీఆర్ఎస్, బీజేపీ కలసి ప్రయాణం చేస్తాయనే సంకేతాన్ని ఈ పర్యటన ద్వారా ఇచ్చారని చెప్పారు. పొత్తుకోసం రెండు పార్టీలు తహతహలాడిపోతున్నాయని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. అందుకే ప్రధాని మోదీని కేసీఆర్, సీఎం కేసీఆర్‌ను మోదీ పరస్పరం పొగుడుకున్నారని అన్నారు. మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిందన్నారు. ఆ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ పథకాన్ని ప్రధాని మోదీతో ప్రారంభింపజేశారని ఉత్తమ్ ఆరోపించారు. గోదావరి నదీజలాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. యూపీఏ హయాంలో మంజూరైన పథకాలను, సగానికన్నా ఎక్కువగా పూర్తిచేసిన పనులను ప్రధాని మోదీ ప్రారంభించారని వివరించారు. తెలంగాణలోనూ దళితులకు అన్యాయం జరుగుతున్నదన్నారు. దళితుల గురించి అనుచితంగా మాట్లాడి, అవమానించిన బీజేపీ ఎమ్మెల్యేపై ఆ పార్టీ ఇప్పటిదాకా ఏ చర్యలనూ తీసుకోలేదన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలను గృహనిర్బంధంలో ఉంచడం, పోలీసుస్టేషన్లకు పంపడం అప్రజాస్వామికమని ఉత్తమ్ అన్నారు. ఈ నెల 16న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ సమన్వయ సమావేశం, రైతు సభ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్, అక్రమాలపై 17న పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. -
అగస్టా కంటే పెద్ద కుంభకోణం!
న్యూఢిల్లీ: దేశంలో దుమారం రేపుతోన్న అగస్టా కుంభకోణంకు సంబంధించి విచారణ జరుగుతుండగా.. యూపీఏ హయాంలో జరిగిన మరో భారీ కుంభకోణం బయటపడింది. దేశ రక్షణకు ఉపయోగపడే యుద్ధ నౌకల తయారీలో ఈ స్కామ్ జరగడంతో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ అంతర్గత విచారణకు ఆదేశించారు. 2009లో రెండు కొత్త నావల్ ట్యాంకర్ల కోసం యూపీఏ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ట్యాంకర్లను తయారుచేసి ఇచ్చేందుకు రష్యా, కొరియా, ఇటలీలు బిడ్ లు దాఖలు చేశాయి. వీటిలో రష్యా మిలటరీ గ్రేడ్ స్టీల్ తో తయారుచేసి అందిస్తామని తెలపగా.. తమకు ఆ రకం స్టీల్ అవసరం లేదని ప్రభుత్వం చెప్పడంతో రష్యా డీల్ నుంచి పక్కకు తప్పుకుంది. దీంతో పోటీలో నిలిచిన రెండింటిలో ఇటాలియన్ కంపెనీ ' ఫిన్కాంటైరీ ' డీల్ ను చేజిక్కించుకుంది. 2010లో 'కాగ్' ట్యాంకర్ల డీల్ లో లోపాలు ఉన్నట్లు, కంపెనీకి లాభం చేకూరేట్లు డీల్ ను ఇచ్చినట్లు పేర్కొంది. అక్కడితో ఆగిపోయిన ఈ విషయం తాజాగా ఓ రిటైర్డ్ నావల్ అధికారి వేసిన పిటిషన్ తో మళ్లీ వెలుగులోకి వచ్చింది. కొత్త ట్యాంకర్లు ఎందుకోసం? దేశ అతిపెద్ద విమాన రవాణా నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను రష్యా నుంచి తీసుకురావాల్సి ఉండగా.. నౌక రక్షణ కోసం ఈ రెండు ట్యాంకర్లను 2009, 2011లలో భారతీయ స్ఫెసికేషన్స్ తో అత్యంత వేగంగా భారతీయ నావికాదళంలోకి తీసుకున్నారు. విక్రమాదిత్యను రష్యా నుంచి తీసుకువస్తున్న తరుణంలో రెండింటిలో ఒక ట్యాంకర్ బీటలు వారింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇటాలియన్ కంపెనీకే ఆ డీల్ ను ఇవ్వడానికి గల కారణాలను, డీల్ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. కాగ్ ఆరోపణలు, నేవీ అధికారి ఇచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తోంటే యూపీఏ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం త్వరలో బహిర్గతమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
రెండు విడతలుగా 'నీట్' పరీక్ష
న్యూఢిల్లీ: జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) పై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా ఏకీకృత వైద్య విద్య ప్రవేశపరీక్షను నిర్వహించాలని నిర్వహించాలని ఆదేశించింది. నీట్ పరీక్షను రెండు విడతలుగా ప్రవేశపరీక్షను నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లోనూ నీట్‌ను అమలు చేయాల్సిందేనని వెల్లడించింది. మే 1, జూన్ 24న నీట్ పరీక్ష నిర్వహించి, ఆగస్టు 17న ఫలితాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సెప్టెంబర్ 30 నాటికి కౌన్సిలింగ్ పూర్తి చేసి అక్టోబర్ 1నుంచి తరగతులు ప్రారంభించాలని సూచన చేసింది. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచే నీట్ అమలు కానుంది. కాగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎంసెట్ పరీక్ష యథాతథంగా ఉంటుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు సమాచారాన్ని తీసుకుంటామని, అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయానికి గురి కావద్దని ఆయన సూచించారు. -
‘నీట్’కు ప్రాణప్రతిష్ట!
వైద్య విద్యను అభ్యసించాలని కోరుకునే విద్యార్థుల కోసం జాతీయ స్థాయిలో ఇకపై ఒకే ఉమ్మడి ప్రవేశపరీక్ష ఉండబోతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైనదంటూ లోగడ ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన 2-1 మెజారిటీ తీర్పును వెనక్కి తీసుకుంటు న్నట్టు రాజ్యాంగ ధర్మాసనం సోమవారం తేల్చిచెప్పింది. ఈ తాజా నిర్ణయంతో జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు ప్రాణప్రతిష్ట చేసినట్టయింది. పాత తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకునే వరకూ ‘నీట్’ అమల్లో ఉంటుందని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రకటించింది. అయితే ధర్మాసనం ‘నీట్’ మంచిచెడ్డల జోలికి పోలేదు. గతంలో ముగ్గురు న్యాయమూర్తుల మధ్యా ఎలాంటి చర్చా జరకుండానే తీర్పు వెలువడిందన్న కారణాన్ని చూపి మాత్రమే వెనక్కు తీసుకుంది. యూపీఏ హయాంలో మొగ్గతొడిగిన ‘నీట్’పై ఆది నుంచీ విద్యార్థుల్లో అనేక అనుమానాలున్నాయి. పలు రాష్ట్రాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వెనకా ముందూ చూడకుండా దీనికి అంగీకారం తెలపడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. 2013లో ఒకపక్క ఎంసెట్, మరోపక్క నీట్ నిర్వహించడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఎంసెట్ రాయాలా...నీట్ రాస్తే సరిపోతుందా అనేది తేల్చుకోలేకపోయారు. చివరకు ఎంసెట్ ఆధారంగానే వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలు చేపట్టవచ్చునని అప్పట్లో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వాస్తవానికి ‘నీట్’ రూపుదిద్దుకోవడానికి సుప్రీంకోర్టు 2011లో ఇచ్చిన తీర్పు ప్రధాన కారణం. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న అనేకానేక పరీక్షలు అవినీతికి తావిస్తున్నాయని, ఎన్నో అవకతవకలు చోటుచేసుకుంటున్నా యని సుప్రీంకోర్టు భావించింది. ప్రతిభావంతులకు ఏ కళాశాలలోనూ ప్రవేశం లభించని స్థితి ఉండగా...డబ్బు, పలుకుబడి ఉన్నవారు దొడ్డిదారిన సీట్లు సంపా దిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పారదర్శకత ఉండేలా, అందరికీ సమానావ కాశాలు లభించేలా ఒకే ఉమ్మడి పరీక్ష రూపొందించాలని భారత వైద్య మండలి (ఎంసీఐ)ని ఆదేశించింది. పర్యవసానంగా ‘నీట్’ ఉనికిలోకి వచ్చింది. వైద్య విద్యా ప్రవేశాలకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అనుసరిస్తున్న మాట వాస్తవమే. అందువల్ల వీటి కోసం సంసిద్ధం కావడం విద్యార్థులకు పెద్ద సమస్యగా మారుతున్నది. అయితే అంతమాత్రాన ‘నీట్’ను సర్వరోగ నివారిణిగా భావించలేం. పాత సమస్యలు పోయినా దీంతో కొత్త సమస్యలు ఏర్పడే ప్రమాదం వచ్చిపడింది. ఇందుకు అందరికంటే ముందు ఎంసీఐనీ, కేంద్ర ప్రభుత్వాన్నీ తప్పుబట్టాలి. ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థ అమలులో ఉన్నదనిగానీ, రాష్ట్రాల మనోభావాలను గౌరవించాలనిగానీ ఎంసీఐ అనుకోలేదు. హిందీయేతర ప్రాంతాల విద్యార్థుల కోసం ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలుండాలన్న డిమాండుకు అది తొలుత అంగీకరించలేదు. గుజరాత్, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలు గట్టిగా పట్టుబట్టడంవల్ల చివరకు దిగొచ్చింది. అయితే దానికొక మెలిక పెట్టింది. ఆయా భాషల్లో ప్రశ్నపత్రాలు ఇచ్చేందుకు సిద్ధమేగానీ...ఆ భాషల్లో జవాబులు రాసే విద్యార్ధులు జాతీయ స్థాయి కోటాకు అనర్హులవుతారని నిబంధన విధిం చింది. అదే సమయంలో హిందీ భాషలో పరీక్ష రాసే విద్యార్ధులు మాత్రం జాతీయ కోటాలో సీట్లు సంపాదించుకునే వెసులుబాటు కల్పించింది. మరోపక్క ప్రమా ణాలరీత్యా నాసిరకంగా ఉండే ఈ జాతీయ స్థాయి పరీక్షలో తాము పాలుపంచు కోబోమని ఎయిమ్స్ వంటి ఉన్నత శ్రేణి విద్యా సంస్థలు నిక్కచ్చిగా చెప్పాయి. ఒకే ఉమ్మడి పరీక్ష ఉండాలన్న ఉద్దేశం కాస్తా వీటి మొరాయింపుతో మూలన బడినట్టయింది. ‘నీట్’లో ఉండే ఇతర లోటుపాట్లు ఇంతకన్నా భయంకరమైనవి. వృత్తి విద్యా కోర్సుల్ని సాధించడానికి ప్రయత్నించే లక్షలాదిమంది విద్యార్ధుల్లో అంతరాల దొంతరలుంటాయి. ఆర్ధిక స్థోమత బాగున్నవారికీ, అది సరిగా లేనివారికీ తేడా లుంటాయి. ఢిల్లీలో చదువుకున్న విద్యార్ధికీ...నాగాలాండ్‌లో చదువుకున్న విద్యార్ధికీ ఒకే రకమైన విద్యావకాశాలు అందుబాటులో ఉండవు. ఒక రాష్ట్రంలోనే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలుంటాయి. ఎంతో వెనకబడినవీ ఉంటాయి. ఇలాంటి వారంతా జాతీయస్థాయి పరీక్షలో పోటీ పడాలంటే సామాన్యమైన విషయం కాదు. వీటికితోడు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐఎస్సీ సిలబస్ విద్యార్ధులకు ‘నీట్’ అనుకూలంగా ఉంటుంది తప్ప...ప్రాంతీయ భాషల్లో చదువుకున్నవారికి కొరు కుడు పడదు. ‘నీట్’ ద్వారా సీట్ల కేటాయింపు జరిగితే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ స్థానికేతర విద్యార్ధుల సంఖ్య పెరగడమే కాదు...స్థానికుల్లో కూడా ఉన్నత వర్గాలవారే అధికంగా ఉండే ప్రమాదం ఉంటుంది. ఏతావాతా సమాజంలో వైద్యులు కావాలనుకున్నవారందరికీ ఇది సమానావకాశాలు ఇస్తుందన్న నమ్మకం లేదు. అలాంటపుడు ‘నీట్’ మౌలిక ఉద్దేశమే దెబ్బతింటుందన్న సంగతిని గుర్తిం చాలి. రకరకాల సెట్లతో సమస్యలున్నమాట...ప్రైవేటు విద్యా సంస్థలు అక్రమా లకు పాల్పడుతున్న మాట వాస్తవమైనా వాటిని అరికట్టడానికి వేరే తోవలు వెదకాలి. ఒక రాష్ట్రం నిర్వహించే సెట్‌ను వేరే రాష్ట్రం గుర్తించి తమ సీట్లలో కొంత శాతాన్ని కేటాయిస్తే ఈ సమస్య కొంతవరకూ తీరుతుంది. అలాగే ప్రైవేటు, మైనారిటీ కళాశాలలకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించవచ్చు. ఈ ఏడాదే ‘నీట్’ నిర్వహించుకోవచ్చునని సుప్రీంకోర్టు సూచించినా తగిన వ్యవధి లేదు గనుక ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాకపోవచ్చు. కనీసం వచ్చే విద్యా సంవత్సరం లోపు అయినా ‘నీట్’ లోటుపాట్లపై సమగ్రమైన చర్చ జరిగి మెరుగైన విధానం రూపొందితే విద్యార్ధులకు మేలు కలుగుతుంది. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో విద్యను బలవంతంగా ఉమ్మడి జాబితాలో చేర్చడంవల్ల ఎంతో నష్టం జరిగింది. దాన్ని ‘నీట్’ మరింత దిగజార్చకూడదు.