Live Updates:
►ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌కర్ గెలుపు
►జగదీప్ ధన్‌కర్‌కు 528 ఓట్లు
►మార్గెరెట్ అల్వాకు 182 ఓట్లు
► చెల్లని ఓట్లు 15
►పోలైన ఓట్లు 725
► 92.9 శాతం పోలింగ్
►ఉప రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 725 మంది ఎంపీలు ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్నారు. రాజ్యసభలో ఎనిమిది ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి
► ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది.
► పార్లమెంట్ హౌస్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగింపు దశకు చేరుకుంది. సాయంత్రం తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
► ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు 93శాతం పోలింగ్ నమోదైంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది.
Discharged my absolute privilege as well as constitutional responsibility. Voted in the #VicePresidentialElection in the Parliament House. pic.twitter.com/exlafU8nYs— Kiren Rijiju (@KirenRijiju) August 6, 2022
►ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీలు శశిథరూర్, జైరామ్ రమేశ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఓటేశారు. అదే విధంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ, బీజేపీ ఎంపీ హేమమాలిని, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ ఓటింగ్‌లో పాల్గొన్నారు.
BJP MP Hema Malini casts her vote for the Vice Presidential election, at the Parliament in Delhi. pic.twitter.com/4wQyDFL5My— ANI (@ANI) August 6, 2022
►ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు ఓటు వేశారు. ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది.
Delhi | Congress MP Rahul Gandhi casts his vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/NKV8JZhRvD— ANI (@ANI) August 6, 2022
►ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఆప్ ఎంపీలు హర్బజన్ సింగ్, సంజయ్ సింగ్, డీఎంకే ఎంపీ కనిమొళి, బీజేపీ ఎంపీ రవికిషన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Delhi | AAP MPs Harbhajan Singh and Sanjay Singh, DMK MP Kanimozhi and BJP MP Ravi Kishan cast their votes for the Vice Presidential election. pic.twitter.com/SPs5bcSEl7— ANI (@ANI) August 6, 2022
► కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Delhi | Union ministers Nitin Gadkari and Dharmendra Pradhan cast votes for the Vice Presidential election at Parliament pic.twitter.com/Z5irlDxbWm— ANI (@ANI) August 6, 2022
► కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్ రామ్ మెఘ్వాల్, వీ మురళీధరన్ ఓటు వేశారు.
Delhi | Union Ministers Gajendra Singh Shekhawat, Arjun Ram Meghwal and V Muraleedharan cast their votes for the Vice Presidential election. pic.twitter.com/2roDcox6yi— ANI (@ANI) August 6, 2022
► కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Delhi | Union Home Minister Amit Shah casts his vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/eH75fIzcRe— ANI (@ANI) August 6, 2022
► మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ ఛైర్‌పై వచ్చి ఓటు వేశారు.
Delhi | Former Prime Minister and Congress MP Dr Manmohan Singh arrives at the Parliament to cast his vote for the Vice Presidential election. pic.twitter.com/OK0GsY5npL— ANI (@ANI) August 6, 2022
► ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi casts his vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/cJWlgGHea7— ANI (@ANI) August 6, 2022
► ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
► ప్రస్తుత ఉప రాష్టపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగిసిపోనుంది. 80 ఏళ్ల వయసున్న మార్గరెట్ ఆల్వా కాంగ్రెస్‌లో సీనియర్ నాయకురాలు . రాజస్థాన్ గవర్నర్‌గా పని చేశారు. 71 ఏళ్ల వయసున్న జగ్‌దీప్ రాజస్థాన్‌కు చెందిన జాట్ నాయకుడు.
► మార్గరెట్ ఆల్వాకు కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, టీఆర్‌ఎస్, ఆప్ మద్దతు తెలుపుతున్నాయి.
► జేడీయూ, వైఎస్సార్‌సీపీ, బీఎస్పీ, ఏఐఏడీఎంకే, శివసేన వంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్డీయే అభ్యర్థికి 515 ఓట్లు పోలయ్యే అవకాశాలున్నాయి.
► టీఎంసీకి లోక్‌సభలో 23 మంది, రాజ్యసభలో 16 మంది సభ్యుల బలం ఉండడం, విపక్ష పార్టీల్లో నెలకొన్న అనైక్యతతో జగ్‌దీప్ విజయం దాదాపుగా ఖరారైపోయింది.
► తమతో మాట మాత్రంగానైనా సంప్రదించకుండా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీలు అభ్యర్థిని ఖరారు చేశారన్న ఆగ్రహంతో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించింది.
► నామినేటెడ్ సభ్యులకి కూడా ఓటు హక్కుంది. ఉభయ సభల్లోనూ 788 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అందరూ ఎంపీలే కావడంతో వారి ఓటు విలువ సమానంగా ఉంటుంది.
► పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు.
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్డీయే అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ నేతమార్గరెట్ ఆల్వా పోటీ పడుతున్నారు. పార్లమెంటు హౌస్‌లో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ వెంటనే ఓట్లులెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment