ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు అ‍స్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు | Vice President Jagdeep Dhankhar admitted to AIIMS | Sakshi
Sakshi News home page

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు అ‍స్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు

Published Sun, Mar 9 2025 10:28 AM | Last Updated on Sun, Mar 9 2025 12:47 PM

Vice President Jagdeep Dhankhar admitted to AIIMS

ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌(Jagdeep Dhankar) అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అయితే, ఛాతి నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనకు ఛాతి నొప్పితో బాధపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో, తెల్లవారుజామున 2 గంటలకు ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (AIIMS)కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యబృందం తెలిపింది. ఇక, ధన్కర్‌ అస్వస్థత విషయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎయిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement