chest pain
-
ఆర్బీఐ గవర్నర్‌కి ఛాతినొప్పి: ఎసిడిటీ వల్ల కూడా ఇలా జరుగుతుందా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఛాతినొప్పి కారణంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు ఆర్బీఐ అధికార ప్రతినిధి వెల్లడించిన సంగతి తెలిసిందే. నిజానికి ఛాతినొప్పి అనగానే గుండె సంబంధిత అనారోగ్య సమస్యగానే భావిస్తాం. కానీ ఆయనకు ఎసిడిటీ కారణంగా ఛాతినొప్పి వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అంటే.. ఎసిడిటీ వల్ల కూడా ఇలా జరుగుతుందా ? దీన్ని గుర్తించగలమా..?ఒడిశాలో జన్మించిన శక్తికాంత దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25వ గవర్నర్. ప్రస్తుతం ఆయన చైన్నైలోని అపోల ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో రెండు మూడు గంటల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడ శక్తిదాస్కి ఎసిడిటి కారణంగా ఛాతి నొప్పి వచ్చిందని అందువల్లే ఆస్పత్రిలో చేరినట్లు నివేదకలు చెబుతున్నాయి. అంటే ఎసిడిటీ వల్ల కూడా ఛాతీ నొప్పి వస్తుందా అనే సందేహం ఒక్కసారిగా అందరిలోనూ మెదలయ్యింది. అయితే నిపుణులు ఏమంటున్నారంటే..ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ అనేది అన్నవాహికలోకి ఆమ్లం తిరిగి ప్రవహిస్తున్నప్పు ఇది సంభవిస్తుందని చెబుతున్నారు. దీని కారణంగా గుండెల్లో మంట, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉత్పన్నమువుతాయని అన్నారు. దీన్ని ఆరోగ్యకరమైన జీవనశైలితో బయటపడవచ్చు లేదా మందులతో కూడా నివారించొచ్చని వెల్లడించారు. అయితే ఒక్కోసారి తీవ్రమైన సందర్భాల్లోనే ఇలా ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు నిపుణులు. గుర్తించగలమా? అంటే..ఆమ్లత్వంతో సంబంధం ఉన్న ఛాతీ నొప్పిని యాసిడ్ రిఫ్లక్స్ అని పిలుస్తారు. సాధారణంగా ఇది ఛాతీలో మంటలా వస్తుంది. అయితే అందరూ గుండెల్లో మంటగా అపోహ పడుతుంటారు. ఈ విధంగా ఏదైనా తిన్న తర్వాత జరగుతుంది. ముఖ్యంగా పడుకున్నప్పుడు తీవ్రమై కొన్ని సార్లు పుల్లని రుచి లేదా కడుపు ఆమ్లం గొంతులోకి తన్నుకురావడంతో వాంతి రూపంలో బయటకొస్తుంది. అయితే గుండె సంబంధిత ఛాతీ నొప్పిలా కాకుండా ఎసిడిటీ సంబంధిత అసౌకర్యం చేతులు, మేడ లేదా దవడలకు వ్యాపించదు. చెప్పాలంటే ఈ సమస్యను ప్రథమ చికిత్సలో భాగంగా బాధితుడిని నిటారుగా కూర్చోబెడితే ఆ సమస్య నుంచి కొంత మేర ఉపశమనం పొందుతారు. పైగా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఛాతి నొప్పిని గుండె సంబంధితమా లేదా ఎసిడిటీ వల్ల అనేది గుర్తించడం మాత్రమే కష్టమే అంటున్నారు నిపుణులు. అందువల్ల వాళ్లని తక్షణమే సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తే అక్కడ వైద్యులే ఇది దేని వల్ల వచ్చిందనేది అంచనా వేయగలరు అని చెబుతున్నారు నిపుణులు.ఎప్పుడు క్రిటికల్ అంటే..అన్నవాహిక అల్సర్లు లేదా స్ట్రిక్చర్స్ వంటి అంతర్లీన సమస్యలు ఉంటే..నిర్జలీకరణానికి దారితీసేలా నిరంతర వాంతులు లేదా తీవ్రమైన ఛాతి నొప్పికి దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: బరువు తగ్గి.. అందాల పోటీలో కిరీటాన్ని దక్కించుకుంది!) -
ఆసుపత్రిలో చేరిన ఆర్జేడీ నేత 'తేజ్ ప్రతాప్ యాదవ్'
రాష్ట్రీయ జనతా దళ్ ( RJD ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు 'తేజ్ ప్రతాప్ యాదవ్' శుక్రవారం స్వల్ప అస్వస్థకు గురయ్యారు. లో బీపీ (బ్లడ్ ప్రెషర్) కారణంగా ఛాతిలో నొప్పి రావడంతో పాట్నాలోని రాజేంద్ర నగర్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. ఇంటి వద్ద ఉన్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఛాతిలో నొప్పి అని చెప్పడంతో.. అతని సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. తేజ్ ప్రతాప్ ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరడం తొమ్మిది నెలల్లో ఇది రెండోసారి. ఆసుపత్రిలో చేరటానికి ముందు తేజ్ ప్రతాప్ యాదవ్ కృష్ణబ్రహ్మం ప్రాంతంలో జ్ఞాన్ బిందు గ్రంథాలయాన్ని ప్రారంభించి బక్సర్ జిల్లాను సందర్శించారు. ఇప్పటికే పర్యావరణ శాఖ, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఈయన పనిచేశారు. ప్రస్తుతం ఈయన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. -
పరోట తిని వ్యక్తి మృతి
అన్నానగర్: పరోట తిన్న కొద్దిసేపటికే ఛాతి నొప్పితో వ్యక్తి మృతిచెందాడు. వివరాలు.. తేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని సిత్తర్పట్టికి చెందిన రామకృష్ణన్ (39) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ సదురగిరిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో లారీ డ్రైవర్‌గా చేరాడు. అదే పట్టణానికి చెందిన వీరముత్తు, రామకృష్ణన్ లారీలో సరుకులు ఎక్కించుకుని నిలకోటై సమీపంలోని విలంపట్టి ప్రైవేట్ మిల్లుకు వచ్చారు. గురువారం రాత్రి ఇద్దరూ అక్కడున్న ఓ కేఫ్‌లో పరోటా తిన్నారు. కొద్దిసేపటికి రామకృష్ణన్‌కు ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. వెంటనే చికిత్స నిమిత్తం నిలకోటై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడు. అతని తల్లి ఇన్బవల్లికి.. పోలీసులకు సమాచారం అందించారు. విలంపట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. -
కూతురు పెళ్లి జరిగిన కొద్దిసేపటికే ఆగిన తండ్రి గుండె
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): కూతురికి ఉదయం వైభవంగా పెళ్లి చేసి సాయంత్రం అత్తవారింటికి పంపే తంతూ కొనసాగుతుండగా ఓ తండ్రి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ పెళ్లింట విషాదం నెలకొంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని ముబారక్ పూర్(బి) గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొరుబాయిని శ్రీశైలం(46) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన భార్య అనారోగ్యంతో ఆరు నెలల క్రితం మృతి చెందింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు మానస వివాహాన్ని ఈనెల 3న ఆదివారం సదాశివపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బంధుమిత్రుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించాడు. సాయంత్రం తన స్వగృహంలో అప్పగింతలు జరుగుతున్న సమయంలో శ్రీశైలంకు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. చిన్న కూతురు అనూష అనాథగా మిగలడంతో బంధుమిత్రులు కన్నీరు మున్నీరయ్యారు. సోమవారం గ్రామంలో శ్రీశైలం అంత్యక్రియలు నిర్వహించారు. -
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి స్వల్ప అస్వస్థత!
సాక్షి, ఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి(58) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు ఆయన వెళ్లారు. అయితే ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నట్లు నిర్ధారించుకున్న వైద్యులు.. చికిత్స అందించారు. ఛాతి ప్రాంతంలో నొప్పిగా అనిపించడంతో ఆయన రాత్రి 11 గం. ప్రాంతంలో ఎయిమ్స్‌కు వెళ్లారు. కార్డియోన్యూరో సెంటర్లోని కార్డిక్ కేర్ యూనిట్లో ఆయనకు పరీక్షలు జరిగాయి. అనంతరం ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యే ఉన్నట్లు వైద్యులు తేల్చి.. అడ్మిట్ చేసుకున్నారు. చికిత్స అనంతరం సోమవారం ఉదయం ఆయన్ని డిశ్చార్జి చేయొచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: సూపర్ సీనియర్లు కూడా పోటీ నై!! -
చాతి నొప్పితో విద్యార్థిని అవస్థలు
కొమరం భీమ్: తీవ్ర చాతి నొప్పితో బాధపడుతూ ఓ గిరిజన విద్యార్థిని నానా అవస్థలు ఎదుర్కొన్న సంఘటన మంగళవారం తిర్యాణి మండలంలో చో టు చేసుకుంది. విద్యార్థులు, గిన్నెధరి వైద్యురాలు ఆయేషా తెలిపిన వివరాల ప్రకారం.. గిన్నెధరి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సుప్రియ అనే విద్యార్థిని మంగళవారం చాతి నొప్పితో విలవిలలాడింది. తోటి విద్యార్థినులు గమనించి సుప్రియను వెంటనే తిర్యాణి ఆసుపత్రికి తరలించారు. కాగా విద్యార్థిని నొప్పితో బాధపడుతున్నా ఉపాధ్యాయులు ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. -
ఆసిఫాబాద్: ఛాతీలో నొప్పి.. దూకేసిన ఆర్టీసీ డ్రైవర్
కుమ్రం భీం ఆసిఫాబాద్: జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మార్గంలో ప్రమాదం సంభవించింది. బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో డ్రైవర్ బస్సు నుంచి బయటకు దూకేశాడు. అదుపు తప్పిన బస్సు.. బోల్తా పడింది. ప్రమాదం జరిగినప్పుడు సదరు సూపర్ లగ్జరీ బస్సులో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉండగా.. ఒకరికి గాయాలైనట్లు సమాచారం. ప్రయాణికుడితో పాటు ఛాతీ నొప్పికి గురైన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. -
మ్యాచ్ ఆడుతుండగానే చాతిలో నొప్పి... పరుగున ఆసుపత్రికి
పాకిస్తాన్ టెస్టు ఓపెనర్ అబీద్ అలీ చాతినొప్పికి గురయ్యాడు. క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో భాగంగా కైబర్ పంక్తున్నవాతో జరుగుతున్న మ్యాచ్‌లో అబీద్ అలీ 61 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్ ద్వారా అబీద్ అలీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 9వేల పరుగులు పూర్తి చేశాడు. కాగా మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే అతనికి రెండుసార్లు చాతినొప్పి రావడంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. డ్రెస్సింగ్‌రూమ్‌కు చేరుకున్న అబీద్ వెంటనే ఫిజియో సలహాతో ఆసుపత్రిలో జాయినయ్యాడు. ప్రస్తుతం అబీద్ అలీ అబ్జర్వేషన్లో ఉన్నాడని.. గుండె సంబంధిత వ్యాధి ఏమైనా ఉందా అన్న కోణంలో వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికైతే అతని పరిస్థితి బాగానే ఉందని.. చెకప్ తర్వాత అబీద్ అలీ పరిస్థితిపై ఒక క్లారిటీ వస్తుందని సెంట్రల్ పంజాబ్ మేనేజర్ అశ్రఫ్ అలీ పేర్కొన్నాడు. ఇక క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ ద్వారా 2007లో క్రికెట్లో అరంగేట్రం చేసిన అబీద్ అలీ 31 ఏళ్ల వయసులో పాకిస్తాన్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇక పాక్ జాతీయ జట్టు తరపున 16 టెస్టులు ఆడిన అబీద్ అలీ 16 టెస్టుల్లో 1180 పరుగులు చేశాడు. చదవండి: Shoaib Maliks Nephew: రికార్డు సృష్టించిన షోయబ్ మాలిక్ మేనల్లుడు.. అరుదైన ఘనత -
‘హృదయ’ వేదన! చిన్న వయసులోనే ఆగుతున్న శ్వాస.. కారణలివే!
గాంధారి మండలం గుజ్జుల్ తండాకు చెందిన జగ్గు అనే వ్యక్తి ఛాతీలో నొప్పంటూ కుప్పకూలిపోయాడు.. ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. జగ్గును బతికించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వైద్యుడు లక్ష్మణ్ సైతం గుండెపోటుకు గురై అక్కడికక్కడే తనువు చాలించారు. వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలించే క్రమంలో పేషెంట్ కూడా మృత్యు ఒడికి చేరాడు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనలు గాంధారిలో విషాదాన్ని నింపాయి. ఇలా రోజూ ఎందరో గుండెపోటుకు గురై మృత్యువాతపడుతున్నారు. సాక్షి, కామారెడ్డి: అన్ని రంగాల్లో పెరిగిన పో టీ, మారిన ఆహారపు అలవాట్లు ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతున్నాయి. శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఒత్తిళ్లు పెరగడంతో ఆరోగ్యం దెబ్బతింటోంది. రక్తపోటు గుండెపోటుకు దారితీస్తోంది. సకాలంలో గు ర్తించకపోవడం, సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో పలువురు మృత్యుఒడికి చేరుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతూ చాలా మంది గుండె సమస్యల బారిన పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు 33,137 మంది, నిజామాబాద్ జిల్లాలో 60 వేల మంది వరకు ఉన్నారు. అంటే ఉమ్మడి జిల్లాలో 90 వేల పైచిలుకు మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. అలాగే మధుమేహం బారిన పడిన వారు కామారెడ్డి జిల్లాలో 17,690 మంది ఉండగా, నిజామాబాద్ జిల్లాలో దాదాపు 30 వేల మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మధుమేహం బాధితులు 47 వేలు దాటారు. ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లతో.. పొగ పీల్చడం, అతిగా మద్యం సేవించడం, అనవసరపు ఒత్తిళ్లు, జంక్ ఫుడ్ తినడం వంటి వాటితో రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఒత్తిళ్లను అధిగమించాలి ముఖ్యంగా యువత సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, సరిపడా నిద్రలేకపోవడం, జంక్‌ఫుడ్ తినడం, మద్యం సేవించ డం, స్థూలకాయం, ఒత్తిడి వంటి వాటితో గుండె జబ్బులబారిన పడుతున్నారు. సరైన వ్యాయామం లేకపోవడం కూడా ఇబ్బంది కలిగిస్తోంది. – సురేశ్, ఎండీ, జనరల్ ఫిజీషియన్, కామారెడ్డి -
అన్నా హజారేకు అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక
సాక్షి, ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. 84 ఏళ్ల అన్నా హజారేకు ఛాతిలో నొప్పి రావడంతో పుణెలోని రూబీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. డాక్టర్ల పరిశీలనలో ఉంచినట్టు రూబీ హాల్ క్లినిక్ మెడికల్ సూపరింటెండెంట్ అవధూత్ భోధమ్వాడ్ తెలిపారు. అన్నా హజారేకు యాంజియోగ్రఫీ పరీక్షలు చేయగా గుండెలోని కరోనరీ ఆర్టెరీలో చిన్న బ్లాకేజీ ఉన్నట్లు తేలిందని, దీంతో వైద్య బృందం ఆ బ్లాకేజీని తొలగించినట్లు పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకావం ఉందన్నారు. కాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆసుపత్రికి కాల్ చేసి అన్నా హజారే ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. చదవండి: కంగనా రనౌత్‌కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు, డిసెంబర్ 6న హాజరవ్వాల్సిందే! -
ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన రాజస్థాన్ సీఎం
Ashok Gehlot Hospitalized: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం ఆయన్ని జైపూర్ సవాయి మాన్సింగ్ ఆస్పత్రిలో చేర్పించారు. డెబ్భై ఏళ్ల వయసున్న గెహ్లోట్.. కరోనా సోకి తగ్గాక రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు గురువారం ఆయన ఛాతీ నొప్పికి గురికాగా.. ఈ ఉదయం ఆస్పత్రిలో చేర్పించారు . పోస్ట్ కొవిడ్ సమస్యలున్న ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించనున్నట్లు సమాచారం. Post Covid I was having health issues & Since yesterday I was having severe pain in my chest. Just got my CT NGO done in SMS hospital.Angioplasty will be done.I am happy that I'm getting it done at SMS Hospital.I am fine & will be back soon.Your blessings & well wishes r with me. — Ashok Gehlot (@ashokgehlot51) August 27, 2021 తన ఆరోగ్య స్థితిగతులపై స్వయంగా అశోక్ గెహ్లోట్ శుక్రవారం ఉదయం ట్వీట్ చేయడం విశేషం. ప్రస్తుతం తనకు బాగానే ఉందని, త్వరగా కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఆయన ట్వీట్లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో గెహ్లోట్ ఢిల్లీ పర్యటన రద్దైంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు. చదవండి: కేజ్రీవాల్‌ను కలిసిన సోనూసూద్ -
మైనర్ బాలికకు కడుపులో నొప్పి.. ట్విస్ట్ ఏంటంటే..
సాక్షి, నందిపేట్(ఆర్మూర్): ప్రేమించానని వెంటపడి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన మండలంలోని డొంకేశ్వర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డొంకేశ్వర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల ఓ యువకుడు బతుకుదెరువు కోసం బయట దేశానికి వెళ్లి వచ్చి ఖాళీగా ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక బోధన్‌లో గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసి ఉండటంతో ఇంటి వద్దే ఉంటుంది. గత కొంతకాలంగా ఆ బాలికను ప్రేమించానని యువకుడు వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు గత కొన్ని రోజుల నుంచి కడుపునొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పడంతో కడుపులో ఏదైనా రక్తపు గడ్డ పెరిగిందనే అనుమానంతో సోమవారం జిల్లా కేంద్ర ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. డాక్టర్లు పరీక్షలు జరిపి బాలిక మూడు నెలల గర్భిణి అని నిర్ధారించారు. ఈ విషయమై బాలికను తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో విషయాన్ని అంతా వివరించింది. సమాచారం తెలుసుకున్న సఖీ టీం బృందం సభ్యులు స్థానిక పోలిస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మంగళవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నిందితులపై గందరగోళం.. బాలికపై అత్యాచారం చేసి గర్భవతి చేసిన ఘటనలో ఈ ప్రాంతానికి చెందిన పాస్టర్‌పై మొదట ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్థానికంగా చర్చనీయ అంశంగా మారింది. కాగా విచారణను చేపట్టిన పోలీసులు డొంకేశ్వర్ గ్రామానికి చెందిన మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
మళ్లీ ఆసుపత్రిలో చేరిన గంగూలీ
సాక్షి, కోలకతా: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆయనకు మళ్లీ ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన కోలకతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇటీవల గుండెపోటుకు గురై , కోలుకున్న దాదా మళ్లీ ఆసుపత్రిలో చేరారన్న వార్త క్రికెట్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, గంగూలీకి మంగళవారం ఛాతీలో కొంచెం నొప్పిగా అనిపించింది. కానీ బుధవారం ఆ నొప్పి మరింత పెరగడంతో గ్రీన్ కారిడార్ ద్వారా ముందు జాగ్రత్తగా గంగూలీని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. (ఆస్పత్రి నుంచి సౌరవ్ గంగూలీ డిశ్చార్జ్) కాగా ఇటీవల (జనవరి, 2) గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ చికిత్స అనంతరం జనవరి 7వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. స్వల్ప గుండెపోటుతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరిన గంగూలీకి వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే. (గంగూలీకి మరో రెండు బ్లాక్స్.. 24 గంటలు అబ్జర్వేషన్లోనే) BCCI Chief Sourav Ganguly being taken to Apollo Hospital in Kolkata after he complained of chest pain. More details awaited. (File photo) pic.twitter.com/e72Iai7eVz — ANI (@ANI) January 27, 2021 -
గుండె బరువుగా, ఛాతీ నొప్పిగా ఉంటోందా?
సాధారణంగా బీపీ లేదా గుండెజబ్బులు మొదట్లో కాస్తంత పెద్ద వయసు వారికి, మధ్య వయసు దాటిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ గత కొన్నేళ్లుగా ఈ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఉద్యోగం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి లేదా ఇతరత్రా కారణాల వల్ల నిండా పాతికేళ్లు నిండని వయసు వాళ్లలో కూడా గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. ఒక్కోసారి తీవ్రమైన అనర్థాలు కూడా జరుగుతున్నాయి. బీపీతో మొదలైన సమస్య తీవ్రమైన గుండెపోటుకు దారితీస్తుంది. గుండె బరువుగా ఉండటం, ఛాతీలో నొప్పిగా ఉండటం లేదా గుండెదడగా అనిపించడం వంటి లక్షణాలు కొన్నిసార్లు తీవ్రమైన గుండెకు సంబంధించిన రుగ్మతలను సూచిస్తాయి. గుండె సమస్యలనేవి ఆ స్థాయిలో లోలోపలే చేయాల్సిన చేటును చేసేస్తాయి. పని ఒత్తిడి తీవ్రంగా ఉన్నవారు హైబీపీ సమస్యకు లోనవుతారు. అలాగే పనిఒత్తిడి చాలా ఎక్కువగా ఉండటం అన్నది తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు. ఫలితంగా గుండెదడ, గుండె లయలోనూ మార్పులు కనిపించవచ్చు. ఇలాంటివారు... తమ కుటుంబాల్లో ఏవైనా గుండెజబ్బుల చరిత్ర ఉందేమో చూసుకోవాలి. అలా ఉన్నవారు తప్పనిసరిగా ఒకసారి హృద్రోగనిపుణులను కలిసి గుండె పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో తేలిన ఫలితాలను బట్టి అవసరమైతే మందులు వాడాల్సి రావచ్చు. అయితే ఈలోపు ఇలాంటివారందరూ తమ పని లక్ష్యాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్త వహించాలి. రోజుకు కనీసం అరగంటపాటు వ్యాయాయం లేదా వాకింగ్ చేయాలి. మంచి జీవనశైలి నియమాలు పాటిస్తూ మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యమూ కుదుట పడుతుంది. భవిష్యత్తులో గుండెజబ్బులను నివారించుకోవచ్చు. -
ఫార్చ్యూన్ కొంపముంచిన గంగూలీ ‘గుండెపోటు’
సాక్షి, ముంబై: ప్రస్తుత టెక్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తమకు నచ్చని అంశంపైన మాత్రమే గాకుండా, కొన్నిసునిశితమైన అంశాలను కూడా నెటిజన్లు పట్టేస్తారు. తాజాగా వినియోగదారులను బుట్టలో పడేసే వ్యాపార ప్రకటనలపై కూడా స్పందించడమే కాదు ట్రోలింగ్‌తో ట్రెండ్ క్రియేట్ చేశారు. వ్యంగ్య బాణాలు, మీమ్స్‌తో తన అభిప్రాయాలను వెల్లడించారు. జనవరి 3 న తేలికపాటి గుండెపోటుకు గురైన తరువాత భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎండార్స్ చేసిన ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ వంట నూనె ప్రకటనపై యూజర్లు భారీగా ట్రోల్ చేశారు. ఇది నిజంగా హెల్దీ అయిలేనా? అంటూ.. ఇప్పటికైనా తెలిసిందా దాదా.. గెట్ వెల్ సూన్ అంటూ.. గంగూలీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ యాడ్ క్యాంపెయిన్‌పై సోషల్ మీడియా యూజర్లు విమర్శలు గుప్పించారు. క్రీడాకారుడైన గంగూలీ రోజూ వ్యాయామం చేస్తారు. ఫిట్‌గా ఉంటారు...అయినా గుండెపోటుకు గురయ్యారు. గంగూలీ యాడ్‌లో చెప్పినట్టుగా ఆ ఆయిల్ నిజంగా ఆరోగ్యమేనా అని ఒకరు ప్రశ్నించారు. ఒత్తిడే ప్రధాన కారణం కావచ్చు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కూడా "దాదా త్వరగా కోలుకోవాలి. ఎపుడూ పరీక్షించిన, ప్రయత్నించిన ఉత్పత్తులను మాత్రమే ప్రోత్సహించాలి. జాగ్రత్తగా ఉండాలి.. గాడ్ బ్లెస్’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు: దీంతో గంగూలీ నటించిన సదరు ప్రకటనను అన్ని ప్లాట్‌ఫాంనుంచి తొలగించడం గమనార్హం. ‘దాదా బోలే వెల్కం టూ ది ఫార్టీస్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ వంట నూనె యాడ్ వస్తుంది. ఈ ప్రకటన ఏప్రిల్ 2020 నుండి దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయం నుంచి వివిధ ఛానళ్ల సమయంలో ప్లే అవుతోంది. అంటే 40ల ఏళ్ల వయసులో కూడా తమ నూనె గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది అనేది ఈ ప్రకటన సారాంశం. అయితే తాజాగా గంగూలీకి గుండెపోటు రావడం, గుండెలో రెండు బ్లాక్ ఉన్నాయని తేలడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఈ నూనె ప్రామాణికతపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ వివాదాన్ని పరిశీలిస్తున్నామని, బ్రాండ్ క్రియేటివ్ ఫార్చ్యూన్ క్రియేటివ్ ఏజెన్సీ ఓగిల్వి & మాథర్ ప్రతినిధి తెలిపారు. అటు కస్టమర్ల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు సంస్థ వేగిరమే తగిన చర్యలు చేపట్టాలని యాడ్ ఏజెన్సీ నిపుణులు భావిస్తున్నారు. కాగా బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఛాతీ నొప్పితో( జనవరి 2 న) పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.. మూడు కరోనరీ ఆర్టరీ బ్లాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. యాంజియోప్లాస్టీ అనంతరం, గూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని రేపు( బుధవారం) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. #Saurav #Ganguly sports person completely fit. Spends time in gym Daily, can do preventive test anytime. Still suffered Cardiac problem 2-3 vessel were blocked. He do advertisement of #Fortune oil. That it is healthy ? Is it really healthy? For me stress is main factor .. pic.twitter.com/SaTptVgpW0 — Doctor Of Bones (@dramolsoni) January 3, 2021 #Saurav #Ganguly sports person completely fit. Spends time in gym Daily, can do preventive test anytime. Still suffered Cardiac problem 2-3 vessel were blocked. He do advertisement of #Fortune oil. That it is healthy ? Is it really healthy? For me stress is main factor .. pic.twitter.com/SaTptVgpW0 — Doctor Of Bones (@dramolsoni) January 3, 2021 Seen many tweets on the irony in Sourav Ganguly endorsing Fortune RiceBran Oil. Got to realise it’s the risk one takes in any endorsement. It isn’t that Ganguly lived an unhealthy lifestyle. Importantly, sportsmen with a 10-15 year playing life need to keep the earnings coming in — Lloyd Mathias (@LloydMathias) January 3, 2021 Now you know .. #Fortune does not work .. @SGanguly99 dada get well soon pic.twitter.com/tawBK0Uv5Q — Jaspal Singh (@JaspalSinghSays) January 3, 2021 Dada @SGanguly99 get well soon. Always promote tested and tried products. Be Self conscious and careful. God bless.#SouravGanguly pic.twitter.com/pB9oUtTh0r — Kirti Azad (@KirtiAzaad) January 3, 2021 -
గంగూలీకి మరో రెండు బ్లాక్స్.. 24 గంటలు అబ్జర్వేషన్లోనే
సాక్షి, కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఛాతీ నొప్పితో బాధపడుతూ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరిన గంగూలీకి వైద్యులు శనివారం యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందని, పూర్తిగా స్పృహలో ఉన్నారని డాక్టర్ అఫ్తాబ్ విలేకరులకు తెలిపారు. అయితే ఆయన మరో 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్నారు. గంగూలీ, తన కూతురు సనాతోనూ మాట్లాడారని, చికిత్స కొనసాగుతుందనీ వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి సీఈవో డాక్టర్ రూపాలి బసు వెల్లడించారు. గంగూలీకి యాంజియోప్లాస్టీ నిర్వహించి ఒక స్టెంట్ వేశామని అఫ్తాబ్ తెలిపారు. ఇంకా ఆయన గుండెలో మరో రెండు బ్లాక్స్ ఉన్నాయని, వీటికి చికిత్స అందించనున్నామన్నారు. ఆది, సోమవారాల్లో మరో రెండు స్టంట్లు వేయనున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో మరో 48 గంటల పాటు దాదా హాస్పిటల్లోనే ఉంటారని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. అలాగే గంగూలీకి చికిత్స నిమిత్తం ముగ్గురు డాక్టర్లతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపింది. కాగా గంగూలీకి ఆస్పత్రిలో చేరారన్న వార్తతో భారత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లతో పాటు అభిమానుల్లో ఆందోళనలో మునిగిపోయారు. ముఖ్యంగా గంగూలీ నువ్వు త్వరగా కోలుకోవాలి అంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భావోద్వేగ ట్వీట్ చేశారు. అటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా దాదా కోలుకోవాలంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. Sourav Ganguly has undergone angioplasty. He is stable now. He will be monitored for 24 hours. He is completely conscious. There are two blockages in his heart for which he will be treated: Dr Aftab Khan, Woodlands Hospital, Kolkata. pic.twitter.com/ackcaGwJKu — ANI (@ANI) January 2, 2021 Just got to know about your ailment Sourav. Hope each passing day brings you closer to a full and speedy recovery! Get well soon. pic.twitter.com/NIC6pFRRdv — Sachin Tendulkar (@sachin_rt) January 2, 2021 -
ఆసుపత్రిలో చేరిన డీకే శివకుమార్
బెంగుళూరు : కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. సోమవారం రాత్రి ఆయనకు ఛాతీనొప్పి రావడంతో బెంగుళూరులోని ఆసుపత్రికి తరలించారు. అయితే నవంబర్ మొదటి వారంలోనే శివకుమార్‌కు హైబీపీ(అధిక రక్తపోటు) రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. ఇటీవలే తిరిగి తన నివాసానికి చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో తీహార్ జైలు నుంచి అక్టోబర్ 23న విడుదల అయ్యారు. ఈ సందర్భంగా కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ పండ్లమాలలతో ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఇక బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం శివ కుమార్ మైసూర్‌లోని వివిధ దేవాలయాలు, మఠాలను సందర్శించారు. -
గుండె కవాటాల సమస్య అంటే ఏమిటి? వివరంగా చెప్పండి
నా వయసు 58 ఏళ్లు. గత కొద్దికాలంగా నేను ఆయాసంతో బాధపడుతున్నాను. పొడిదగ్గు, గుండెలో దడగా ఉండటంతో పాటు ఛాతీలో నొప్పి కూడా వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని పరీక్షలు జరిపి, నేను గుండె కవాటాల్లో సమస్యతో బాధపడుతున్నట్లుగా చెప్పారు. గుండె కవాటాల సమస్యలు, వాటి చికిత్స విధానాల గురించి దయచేసి వివరంగా చెప్పండి. మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీలో హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. గుండెలో నాలుగు కవాటాలు (వాల్వ్స్) ఉంటాయి. అవి ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, మైట్రల్‌వాల్వ్, అయోర్టిక్ వాల్వ్. ఈ నాలుగు కవాటాల్లో ప్రధానంగా రెండు రకాల సమస్యలు రావచ్చు. అవి... 1) కవాటం సన్నబడటం (స్టెనోసిస్), 2) కవాటం లీక్ కావడం (రిగర్జటేషన్). దీనికి కారణం... కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు. అయితే మరికొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజ్తోనూ, ఇంకొందరిలో పుట్టుకతోనే ఇలాంటి సమస్యలు రావచ్చు. సాధారణంగా మీరు పేర్కొన్న లక్షణాలతో ఈ సమస్య కొందరిలో వ్యక్తమయితే... ఇంకొందరిలో మాత్రం సమస్య వచ్చిన వాల్వ్‌ను బట్టి నిర్దిష్టంగా కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు ట్రైకస్పిడ్ వాల్వ్ లీక్ సమస్య ఉన్నవారిలో కాళ్ల వాపు కనిపిస్తుంది. మైట్రల్ వాల్వ్ సన్నబడితే స్పృహతప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో సమస్య ఉన్న వాల్వ్‌ను స్పష్టంగా చూసేందుకు ట్రాన్స్ఈసోఫేసియల్ ఎకో కార్డియోగ్రామ్ అనే పరీక్ష అవసరం కావచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే కవాటాల (వాల్వ్స్) సమస్యకు చాలావరకు మందులతోనే చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే... రోగిపరిస్థితిని బట్టి శస్త్రచికిత్స అవసరమవుతుంది. అంటే మైట్రల్వాల్స్ సన్నగా మారితే అలాంటి రోగుల్లో బెలూన్ వాల్వులోప్లాస్టీ అనే శస్త్రచికిత్స చేసి, సన్నబడ్డ వాల్వ్‌ను తిరిగి తెరవవచ్చు. అయితే మిగతా కవాటాలు సన్నగా మారి లీక్ అవుతుంటే ఈ వాల్వులోప్లాస్టీ ప్రక్రియ సాధ్యం కాదు. అలాంటప్పుడు వాల్వ్ రీప్లేస్మెంట్ అన్నదే పరిష్కారం.గుండె కవాటాలను మార్చి కృత్రిమ కవాటాలను అమర్చే క్రమంలో రెండు రకాల కవాటాలను ఉపయోగించవచ్చు. మెకానికల్ వాల్వ్ అనేది ఉపయోగించినప్పుడు ఒక ప్రతికూలత ఉంటుంది. అలాంటి రోగులకు జీవితాంతం రక్తాన్ని పలచబార్చే ‘ఎసిట్రోమ్’ మందులు వాడాల్సి ఉంటుంది. ఇక టిష్యూ కవాటాల విషయానికి వస్తే, ఇవి ఇతర జంతువుల కండరాలతో రూపొందించినవి. ఇవి వాడిన వారిలో రక్తాన్ని పలుచబార్చే ‘ఎసిట్రోమ్’ వంటి మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఈ టిష్యూ వాల్వ్‌లు 15 ఏళ్ల వరకు పనిచేస్తాయి. ప్రస్తుతం కవాటాలకు వచ్చే సమస్యలను పరిష్కరించడానికి శస్త్రచికిత్స కన్నా వాల్వ్ రిపేర్ చేయడానికి అత్యంత ప్రాధాన్యం వస్తున్నారు. ఎందుకంటే వాల్వ్‌ను రీప్లేస్ చేయడం కంటే ప్రకృతి ఇచ్చిన స్వాభావికమైన మన కవాటమే మెరుగైనది. అందుకే ఇప్పుడు వైద్యనిపుణులు కవాటం మరమ్మతుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా ఇలా ఉన్న వాల్వ్నే రిపేర్ చేసినట్లయితే, జీవితాంతం ‘ఎసిట్రోమ్‘ వాడాల్సిన పనిలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న వాల్వ్‌ను ప్రత్యేకంగా మైగ్రల్, ట్రైకస్పిడ్ వాల్వ్‌ల విషయంలో రిపేర్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. మాంసాహారం మానేయాల్సిందేనా? నా వయసు 50 ఏళ్లు. నేను మాంసాహారం ఇష్టంగా తింటూ ఉంటాను. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం ఇంతగా తీసుకోకూడదనీ, దీనివల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ పేరుకుంటుందనీ, అది ఈ వయసులో గుండె జబ్బులకు దారితీస్తుందని ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. కొలెస్ట్రాల్ అనే కొవ్వులలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఒంటికి మేలుచేసే కొవ్వులు. వీటిని హైడెన్సిటీ లైపో ప్రొటీన్ (హెచ్‌డీఎల్) అంటారు. ఇవి గుడ్డు తెల్లసొనలో ఉంటాయి. శరీరానికి హానికారకమైన కొవ్వులను ఎల్డీఎల్ (లోడెన్సిటీ లైపో ప్రొటీన్స్) అంటారు. చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు గుండెజబ్బులకు ఒక రిస్క్ ఫాక్టర్. చెడు కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం తినేవారిలో, ఫాస్ట్‌ఫుడ్ తీసుకునే వారిలో గుండెజబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తంలో ఈ రెండు రకాల కొవ్వులు కలుపుకొని 200 లోపు ఉండాలి. ఎల్డీఎల్ 100 లోపు, హెచ్‌డీఎల్ 40 పైన ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే మరో రకం కొవ్వులు కూడా గుండెకు హాని చేస్తాయి. ఇవి 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరంలోకి రెండు రకాలుగా చేరుతుంది. ఒకటి ఆహారం ద్వారా, మరొకటి లివర్ పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు నరాల వ్యవస్థ కోసం, శిశువు రెండేళ్లపాటు ఎదగడానికి ఈ కొవ్వులు ఉపయోగపడతాయి. ఆ తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే జన్యుతత్వాన్ని బట్టి ఈ కొవ్వులు (మంచి, చెడు రెండు రకాల కొలెస్ట్రాల్స్) ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వేపుళ్లు, బేకరీ పదార్థాలు, కృత్రిమ నెయ్యి వంటి పదార్థాలను ఎక్కువగా తినేవాళ్లలో కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. ఇక రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి... డాక్టర్లు వాటిని అదుపు చేసే మందులు ఇస్తుంటారు. ఈ తరహా మందులు వాడుతున్న వారు వాటిని మధ్యలోనే ఆపకూడదు. మీరు మాంసాహారం మానేయలేకపోతే... కొవ్వు తక్కువగా ఉండే చేపలు, చికెన్ వంటి వైట్‌మీట్ తీసుకోండి. వీటిలోనూ చికెన్ కంటే చేపలు మంచిది. అది కూడా ఉడికించినవే. వేపుడు వద్దు. డాక్టర్ పి. ప్రణీత్, సీనియర్ ఇంటర్వెన్షల్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
బ్రియాన్ లారాకు అస్వస్థత
ముంబై : వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైన లారా ఉన్నట్లుండి ఛాతి నొప్పితో బాధపడ్డారు. దాంతో ఆయనను ముంబై పరెల్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత గుండెజబ్బు మళ్లీ వస్తుందా?
నా వయసు 59 ఏళ్లు. ఇదివరకు ఒకసారి గుండె రక్తనాళాల్లో ఒకచోట పూడిక ఏర్పడిందని నాకు స్టెంట్ వేశారు. ఇటీవల మళ్లీ నాకు అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి వస్తోంది. ఇదివరకే స్టెంట్ వేయించుకున్నను కదా గుండెపోటు రాదులే అనుకొని కొంతకాలంపాటు ఛాతీనొప్పిని అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ సందేహం వస్తోంది. ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ రక్తనాళాల్లో పూడికలు రావని చాలామంది మీలాగే అపోహ పడుతుంటారు. కానీ ఇది నిజం కాదు. స్టెంట్ సహాయంతో అప్పటికే ఉన్న అవరోధాన్ని మాత్రమే తొలగిస్తారు. కానీ మళ్లీ కొత్తగా పూడికలు రాకుండా ఆ స్టెంట్ అడ్డుకోలేదు. ఒకసారి గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి స్టెంట్ పెట్టిన తర్వాత మళ్లీ పూడికలు రాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో పూర్తిస్థాయి జాగ్రత్తలు, చికిత్సలు తీసుకుంటూ ఉండాలి. మీరు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి బట్టి మీకు ఎలాంటి చికిత్స అందించాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఒకవేళ బైపాస్ అవసరం అని చెప్పినా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అత్యాధునిక వైద్యవిధానాలతో చిన్న కోతతోనే బైపాస్ చేయడమూ సాధ్యమే. మీరు మీ ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. మందులతోనే నయం అయ్యే పరిస్థితి ఉంటే ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. ఇక సాధ్యమైనంతవరకు మీరు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల గుండెజబ్బు వస్తుందా? నా వయసు 37 ఏళ్లు. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నాను. నాకు కోపం, ఆవేశంతో పాటు భయం కూడా ఎక్కువ. నా మనసు ఎప్పుడూ కీడు శంకిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మా బాస్ పిలిస్తే చాలు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందనని నాకు ముచ్చెమటలు పట్టేస్తాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలాగే ఎవరైనా నాతో పర్సనల్‌గా మాట్లాడాలని అన్నప్పుడు కూడా చాలా తీవ్రంగా. అదేపనిగా ఆలోచిస్తుంటాను. కానీ వాళ్లతో మాట్లాడిన అనంతరం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాను. ఆందోళన సమయంలో నా గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. దీన్ని బట్టి నాకేమైనా గుండెజబ్బు ఉందేమోనని అనిపిస్తుంటుంది. నాకు గుండెజబ్బు ఉందా? వచ్చేందుకు అవకాశం ఉందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీకు ఫోబియా ఉన్నట్లు చెప్పవచ్చు. అలాగని, అది మినహాయించి, మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని మాత్రం చెప్పలేం. సాధారణంగా ఎక్కువగా భయపడినప్పుడు చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే గుండెకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం అయ్యే ముందు కూడా ఈ సంకేతాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. మీరు నడిచినప్పుడు గానీ, మెట్లెక్కినప్పుడు గానీ మీరు పేర్కొన్న లక్షణాలతో పాటుగా ఆయాసం, ఛాతీలో నొప్పి రావడం వంటివి చోటుచేసుకుంటే మీరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలకు అవి సంకేతాలని చెప్పవచ్చు. కాబట్టి మీరు వెంటనే కార్డియాలజిస్ట్‌ని కలిసి, మీ లక్షణాలను వివరిస్తే, వారు తగిన పరీక్షలు నిర్వహించి, మీకు ఉన్న అసలు సమస్యను తెలుసుకునేందుకూ, మీ వాస్తవ సమస్యపై ఒక అవగాహనకు వచ్చేందుకు వీలుంది. అందుకు అనుగుణంగా తగిన చికిత్సను కూడా అందించవచ్చు. అంతేకాకుండా మీ కుటుంబంలో ఎవరైనా గుండె సంబంధిత వ్యాధితో అనారోగ్యానికి గురైన చరిత్ర ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే మీకు పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం లాంటి అలవాట్లు ఉన్నా లేదా షుగర్ వంటి ఇతర వ్యాధులు ఉన్నా మీరు భవిష్యత్తులో గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒకవేళ పై లక్షణాలు ఉన్నప్పటికీ, వైద్య పరీక్షల్లో ఏ కారణాలూ కనిపించకపోతే మీరు కేవలం ఫోబియాతో బాధపడుతున్నట్లుగా నిర్ధారణ చేయవచ్చు. ఆ తర్వాత మీరు సైకియాట్రిస్ట్‌ను కలిసి కౌన్సెలింగ్ ఇప్పించుకుంటే సరిపోతుంది. ఈమధ్యకాలంలో ఇలాంటి కేసులు యువతీయువకుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా కాకుండా పైన పేర్కొన్న గుండెకు సంబంధించిన లక్షణాలుంటే మాత్రం ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణం డాక్టర్ని కలిసి, పరీక్షలు నిర్వహించుకుని, తగిన చికిత్సను పొందండి. భయపడాల్సిన పనేమీ లేదు. మీ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు, చికిత్స ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. తరచూ ఛాతీనొప్పి... గుండెజబ్బు కావచ్చా? నా వయసు 42 ఏళ్లు. నాకు తరచూ ఛాతీలో నొప్పి వస్తోంది. ఈ విషయం స్నేహితులతో చెప్పినప్పుడు... అది గుండెపోటుకు దారితీయవచ్చుననీ, పరీక్షలు చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. గుండెపోటు ఎందుకు వస్తుంది? దానిని ఎలా గుర్తించాలి? శరీరంలోని భాగాలన్నింటికీ రక్తం సరఫరా చేసే పంపింగ్ స్టేషన్ లాంటిది గుండె. కండరాలతో నిర్మితమైన ఈ గుండె సక్రమంగా పనిచేయడానికి దానికి శుద్ధమైన (ఆక్సిజన్‌తో కూడిన) రక్తం నిరంతరం సరఫరా జరుగుతూ ఉండాలి. కరొనరీ ధమనుల ద్వారా దానికి రక్తం అందుతూ ఉంటుంది. ఈ ధమనులకు వ్యాధి సోకితే అవి కుంచించుకుపోయి తగిన పరిమాణంలో శుద్ధమైన రక్తాన్ని సరఫరా చేయలేవు. కొవ్వు – క్యాల్షియమ్ – ప్రోటీన్ అణువులు రక్తనాళాల లోపలి గోడలపై పాచిలాగా పేరుకుపోవడం వల్ల ఈ రక్తనాళాలు కుంచించుకుపోతాయి. అలా ధమని పూర్తిగా మూసుకుపోయిన పక్షంలో దాని ద్వారా రక్తం సరఫరా కావాల్సిన గుండె కండరాలకు పోషకాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఫలితంగా గుండెకండరాలు చచ్చుబడిపోతాయి. దాంతో గుండెపోటు వస్తుంది. సాధారణంగా గుండెపోటుకు ఇదే కారణం అయినప్పటికీ కరొనరీ ధమనుల్లో ఏర్పడే తీవ్రమైన సంకోచ వ్యాకోచాలు కూడా గుండెపోటుకు దారితీస్తాయి. ఈ విధంగా సంకోచించిన సమయంలో రక్తనాళాల (ధమనుల) ద్వారా గుండె కండరాలకు జరిగే రక్తసరఫరా చాలా తక్కువ పరిమాణానికి పడిపోవడమో లేదా పూర్తిగా నిలిచిపోవడమో జరుగుతుంది. వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, కరోనరీ ధమనులకు సంబంధించి పెద్దగా సమస్యలు లేని సందర్భంలో కూడా ఇలా జరగవచ్చు. గుండెపోటులో ఈ కింద పేర్కొన్న లక్షణాలు ముందే కనిపిస్తాయి. ∙ఛాతీ–రొమ్ము ఎముక కింద – ఎడమచేతిలో భాగంగా, ఒత్తిడిగా, నొప్పిగా అనిపిస్తుంది. ►ఈ అసౌకర్యం వీపు వైపునకు, దవడలు, చేతి గుండా ఇతర అవయవాలకు వ్యాపిస్తున్నట్లుగా తోస్తుంది. ►కడుపు ఉబ్బరంగా, అజీర్తిగా, ఏదో అడ్డుపడుతున్నట్లుగా అనిపిస్తుంది. ►చెమటలు పట్టడం, వికారం, వాంతి వస్తున్నట్లుగా ఉంటుంది. ►చాలా బలహీనంగా, ఆందోళనగా ఉండి శ్వాస తీసుకోవడం కష్టంగా తోస్తుంది. ►గుండె వేగంగా, అసహజంగా కొట్టుకుంటుంది. ఈ లక్షణాలు దాదాపు 30 నిమిషాల పాటు కనిపిస్తాయి. అందువల్ల ఛాతీలో నొప్పి వస్తే ముందుగా ఆసుపత్రికి వెళ్లి, అది గుండెపోటు కాదని నిర్ధారణ చేసుకోండి. కొంతమందిలో ఈ లక్షణాలు ఏమీ కనిపించకుండా కూడా గుండెపోటు రావచ్చు. దీన్ని సైలెంట్ హార్ట్‌ఎటాక్‌గా పరిగణించవచ్చు. ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్ ఎవరికైనా రావచ్చు. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో ఈ రకమైన గుండెపోటు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. స్పష్టమైన లక్షణాలుతో, వెంటనే గుర్తించడానికి తెలిసిపోయే లక్షణాలతో గుండెలో అసౌకర్యం కలుగుతున్న విషయాన్ని గుర్తించినప్పుడు, తక్షణం ఆ రోగులను ఆసుపత్రికి చేరిస్తే, వారి ప్రాణాలు కాపాడవచ్చు. మన దేశంలో ప్రతి 33 సెకండ్లకు ఒకరు గుండెపోటుకు గురవుతున్నారు. ఇలా ఏటా ఇరవై లక్షల మంది హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తున్నట్లు అంచనా. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల వారితో పోలిస్తే భారతీయులు సగటున పది సంవత్సరాలు ముందుగానే గుండెపోటుకు గురవుతున్నారు. పైగా మన దేశస్తుల్లో గుండెపోటుకు గురవుతున్నవారిలో చాలా మంది యువకులు, మధ్యవయస్కులే ఎక్కువ. ఇలా స్పష్టమైన లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే అన్ని సౌకర్యాలు ఉన్న పెద్దాసుపత్రులకు వెళ్లి, తగిన పరీక్షలు చేయించుకుంటే ఎన్నో ప్రాణాలు అర్థంతరంగా ముగియకుండా కాపాడవచ్చు. డా. రాజశేఖర్ వరద, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్. సికింద్రాబాద్ -
పరీక్షలన్నీ నార్మల్... ఛాతీలో సూది గుచ్చినట్లు నొప్పి
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్ నా వయస్సు 47 ఏళ్లు. బరువ# 72 కిలోలు. ఏడాది కిందట ఛాతిలో నొప్పి వస్తే ఈసీజీ, ఎకో, టీఎంటీ, ఎక్స్‌రే పరీక్షలు చేయించాను. అంతా నార్మల్ అని వచ్చింది. గ్యాస్ట్రబుల్ ఏదైనా ఉందేమోనని ఎండోస్కోపీ, రక్తపరీక్ష, ఎక్స్‌రే చేయించాను. అవి కూడా నార్మలే. నాకు ఎలాంటి దురలవాట్లు లేవు. ఛాతీలో సూది గుచ్చినట్లుగా చురుక్కువుని నొప్పి వచ్చి కొద్దిసేపు అలాగే ఉంటోంది. గత మూడేళ్లుగా ఈ సమస్య ఉంది. అయితే రిపోర్టుల్లో ఏమీ ఉండటం లేదు. ఏ జబ్బూ లేకపోతే ఎందుకీ లక్షణాలు కనిపిస్తున్నాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. – ఎన్. భానుప్రసాద్, భీమవరం మీరు కార్డియాక్ వర్కప్, ఎండోస్కోపిక్ వర్కప్ చేయించుకున్నారు కాబట్టి, అవి నార్మల్‌గానే ఉన్నాయి కాబట్టి మీకు గుండె సవుస్య, అసిడిటీకి సంబంధించిన సవుస్యలేదనే చెప్పవచ్చు. కాబట్టి మీరు ఈ విషయంలో మరీ ఎక్కువగా ఆందోళన చెందకండి. అయితే ఇలాంటి నాన్–కార్డియాక్ పెయిన్స్ (గుండెకు సంబంధంలేని నొప్పుల)కు పిత్తాశయంలో రాళ్లు, పాంక్రియాటైటిస్, సర్వైకల్ స్పాండిలోసిస్, ఇంటర్‌కాస్టల్ వుయాల్జియా (పక్కటెవుుకల్లో నొప్పి) వంటివి కూడా కారణాలు కావచ్చు. కాబట్టి మీరు మరొకసారి మీ డాక్టర్‌ను కలిసి, మీ సమస్యను విపులంగా చర్చించి, ఇక్కడ పేర్కొన్న వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించండి. అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా వారు చికిత్స సూచిస్తారు. నోటి నుంచి రక్తం పడింది... ప్రమాదమా? నాకు 56 ఏళ్లు. గత ఎనిమిదేళ్లుగా నుంచి గుండెజబ్బు, డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నాను. హృద్రోగం కోసం చికిత్స కూడా తీసుకున్నాను. ఆ తర్వాత కొద్ది రోజులకు చక్కెర వ్యాధి వచ్చింది. వారం క్రితం పరీక్ష చేయించుకుంటే నాకు షుగర్ 340 ఎంజీ/డీఎల్ ఉంది. ఇన్సులిన్ తీసుకుంటున్నా చక్కెర పాళ్లు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. షుగర్ నియంత్రణలో ఉండటం లేదు. అయితే ఇటీవల కొంతకాలం నుంచి ఇన్సులిన్ తీసుకోవడం లేదు. ఆ సమయంలో ఒకసారి నోటి నుంచి రక్తం పడింది. ఇలా మూడుసార్లు జరిగింది. నాకు తగిన సలహా ఇవ్వండి. – ఎమ్డీ. గఫూర్బేగ్, గుంటూరు డయాబెటిస్, హృద్రోగం... ఈ రెండూ ఉన్నవాళ్లు ఇన్సులిన్ మొదలుపెట్టాక ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఆపకూడదు. ఒకవేళ తప్పనిసరిగా ఆపాల్సిన పరిస్థితి ఏదైనా వస్తే అప్పుడు కూడా డాక్టర్‌ను సంప్రదించాక మాత్రమే వారి సలహా మేరకు ఆపాల్సి ఉంటుంది. మీరు చెప్పినట్లుగా నోటి నుంచి రక్తం పడటం అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. అయితే దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఒక్కోసారి మీరు వాడే ఇతర మందులైన యాస్పిరిన్, రక్తాన్ని పలచబార్చే మందుల వంటి వాటి వల్ల కూడా ఇలా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు వీలైనంత త్వరగా మెడికల్ స్పెషలిస్ట్‌కు చూపించుకోండి. వారి సలహా మేరకు చికిత్స తీసుకోండి. కార్డియో మయోపతి అంటున్నారు... జాగ్రత్తలు ఏమిటి? నా వయసు 63 ఏళ్లు. నాకు కార్డియోవుయోపతి అనే సమస్య ఉందనీ, అయితే దానికి ఆపరేషన్ అవసరం లేదనీ, కాకపోతే జీవితాంతం వుందులు వాడాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. నాకు ఏవిధమైన ఇతర రుగ్మతలు, చెడు అలవాట్లు లేవు. నా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? – వేణుగోపాల రావు, నెల్లూరు మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీకు ఉన్న సమస్య ‘హైపర్‌ట్రాఫిక్ కార్డియోవుయోపతి’ అనిపిస్తోంది. ఇది సాధారణంగా గుండెలోని ఛాంబర్స్ వుందంగా తయారవ్వడం వల్ల వచ్చే సమస్య. ఒక్కోసారి వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఈ రుగ్మత ఉన్నవారు వుందులు తప్పనిసరిగా వాడాల్సిందే. వుందులు వాడకపోతే అకస్మాత్తుగా కార్డియాక్ సవుస్య వచ్చి ఒక్కోసారి ప్రాణాలకే ముప్పురావచ్చు లేదా పక్షవాతం వంటి సవుస్యకు దారితీసే అవకాశం కూడా ఉంది. అందువల్ల క్రవుం తప్పకుండా వుందులు వాడుతూ తరచూ కార్డియాలజిస్ట్ నేతృత్వంలో పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఇక జాగ్రత్తల విషయానికి వస్తే... మీరు శ్రవు ఎక్కువగా ఉండే ఎక్సర్‌సైజ్‌లను నివారించండి. ఒంటి మీద గడ్డలు... ఎవరిని సంప్రదించాలి? నా వయస్సు 30 ఏళ్లు. నా చేతులు, ఛాతీ, పొట్ట మీద చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి నా ఒంటిపైన ఇవి వస్తున్నాయి. ఒకసారి డాక్టర్‌కు చూపించాను. వాటి వల్ల ఎలాంటి హానీ ఉండదు అంటున్నారు. ఇందులో కొన్ని కాస్త నొప్పిగానూ, మరికొన్ని అంతగా నొప్పి లేకుండా ఉన్నాయి. ఇవి ఏమైనా క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందా? ఇంకా ఎవరికైనా చూపించాలా? – డి. ఆనంద్, నిజామాబాద్ మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు ఉన్న గడ్డలు బహుశా కొవ్వు కణుతులు (లైపోమా)గానీ లేదా న్యూరోఫైబ్రోమాగాని అయి ఉండవచ్చు. మీ డాక్టర్‌కు చూపించి ఆయన సలహా తీసుకున్నారు కాబట్టి ఆందోళన పడకుండా నిశ్చింతగా ఉండండి. ఆయన పరీక్షించే చెప్పి ఉంటారు కాబట్టి వాటి వల్ల ఏలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడదు. మీరు చెప్పినట్లుగా హానికరం కాని ఈ గడ్డలు బాగా పెద్దవైనా, నొప్పి ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించి శస్త్రచికిత్స ద్వారా తొలగింపజేసుకోవడం ఒక మార్గం. ఒకవేళ ఇవి క్యాన్సర్‌కు సంబంధించిన గడ్డలేమో అనే మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనుకుంటే నీడిల్ బయాప్సీ చేయించుకుని నిశ్చింతగా ఉండండి. మీరు మొదట ఒకసారి మెడికల్ స్పెషలిస్ట్‌ను కలవండి. లేదా మీకు మరీ అంత అనుమానంగా ఉంటే ఒకసారి మెడికల్ ఆంకాలజిస్టును సంప్రదించండి. క్షయ వ్యాధి... తిరగబెట్టే అవకాశం ఉందా? నా వయస్సు 45 ఏళ్లు. మూడేళ్ల క్రితం క్షయ వ్యాధి పాజిటివ్ వచ్చింది. హెచ్ఐవీ పరీక్ష కూడా చేయించాను. అది నెగెటివ్ వచ్చింది. ఆర్నెల్ల పాటు చికిత్స తీసుకున్నాను. చికిత్స తర్వాత పరీక్ష చేయించుకుంటే అప్పుడు నెగెటివ్ వచ్చింది. ఒకసారి క్షయ వచ్చాక అది తగ్గేవరకు మందులుతో తగ్గి, నెగెటివ్ అని వచ్చాక కూడా అది మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – రవీందర్, సంగారెడ్డి పూర్తిగా చికిత్స తీసుకున్న తర్వాత క్షయవ్యాధి తిరగబెట్టడానికి అవకాశాలు కాస్త అరుదే. అయితే అరుదుగానైనా ఈ సమస్య మళ్లీ వచ్చేందుకు అవకాశం లేకపోలేదు. ఇలా వ్యాధి తిరగబెట్టడం అన్నది చికిత్స పొందిన వ్యక్తి వ్యాధి నిరోధకశక్తిపై ఆధారపడి ఉంటుంది. వారిలో ఏవైనా ఇతర కారణాల వల్ల (ఉదాహరణకు... డయాబెటిస్, వయసు పైబడటం, హెచ్ఐవీ వంటివి) వ్యాధినిరోధకశక్తి బాగా తగ్గిపోతే... క్షయ మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఉండవచ్చు. దీన్నే ‘రీ యాక్టివేషన్’ అంటారు. ఇలా వ్యాధి తిరగబెట్టకుండా ఉండాలంటే క్షయ వచ్చి తగ్గిన వారు... మంచి సమతుల పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన నిద్ర వంటి మంచి జీవనశైలి అలవాట్లను అనుసరిస్తుండాలి. అలాగే ఇలాంటివారికి డయాబెటిస్ లాంటి సమస్యలు ఉంటే వాటిని పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వ్యాధి తిరగబెట్టినట్లు మీకు అనుమానం వస్తే ఒకసారి పల్మునాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ ఎమ్. గోవర్ధన్ సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
లాలూ యాదవ్‌కు ఏమైంది?
రాంచీ: బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్(69) శనివారం తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆయన్ను ఇక్కడి రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) ఆస్పత్రిలో చేర్చారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలడంతో లాలూ డిసెంబర్ 23 నుంచి రాంచీలోని బిర్సాముండా జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాలూ ఆరోగ్యస్థితిని కార్డియాలజీ విభాగం వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య సమస్యపై వైద్యులు ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు దాణా కుంభకోణంలో దుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్లను అక్రమంగా విత్‌డ్రా చేసిన కేసులో తీర్పును సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది. తండ్రి అనారోగ్యం గురించి తెలియగానే లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ హుటాహుటిన పట్నా నుంచి రాంచీకి వచ్చారు. రిమ్స్‌కు వెళ్లి తండ్రి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్, జార్ఖండ్ ఆర్జేడీ అధ్యక్షుడు అన్నపూర్ణ దేవి, వందలాది పార్టీ కార్యకర్తలు రిమ్స్‌కు తరలివచ్చారు. తమ నాయకుడిని చూసేందుకు అనుమతించడం లేదని అన్నపూర్ణ దేవి మీడియాతో చెప్పారు. లాలూ అనారోగ్యం గురించి తమకు సమాచారం ఇవ్వలేదని, మీడియా ద్వారా తెలుసుకుని ఇక్కడకు వచ్చినట్టు వెల్లడించారు. -
గుండె, ఊపిరితిత్తుల మార్పిడితో పీపీహెచ్‌కు చెక్!
హార్ట్ అండ్ లంగ్ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 22 ఏళ్లు. ఇంజనీరింగ్ పూర్తిచేసి కాంపస్ సెలక్షన్లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కానీ అంతలోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఛాతీలో నొప్పి– తీవ్రమైన అసౌకర్యం, గుండెదడ, శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతోంది. ఇక్కడి డాక్టర్లకు చూపిస్తే ఏవో పరీక్షలు చేసి వాడికి పీపీహెచ్ అనే వ్యాధి ఉందని చెప్పారు. గుండె, ఊపిరితిత్తులు రెండూ చెడిపోయాయయని చెబుతున్నారు. ఏవో మందులు రాశారుగానీ ప్రాణానికి ప్రమాదం అంటున్నారు. గుండె, ఊపిరితిత్తులు రెండింటి మార్పిడితోనే శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందంటున్నారు. ఈ వ్యాధి ఏమిటి? ఎందుకు వస్తుంది? వాడు మా ఒక్కగానొక్క కొడుకు. వాడిని రక్షించుకునే మార్గం సూచించండి. – పి. అంజమ్మ, నకిరేకల్ మీ అబ్బాయికి వచ్చిన వ్యాధి ప్రైమరీ పల్మునరీ హైపర్‌టెన్షన్. దీని సంక్షిప్త రూపమే ఈ పీపీహెచ్. అరుదైన ఈ వ్యాధిలో ఊపిరితిత్తుల్లో రక్తపోటు విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి రక్తనాళాల వెడల్పు తగ్గి ఇరుకుగా తయారవుతాయి. తీవ్రమైన ఈ వ్యాధి కారణంగా గుండె, ఊపిరితిత్తులు రెండూ దెబ్బతింటాయి. గుండెపోటు వచ్చే అవకాశాలు పెరిగిపోయి, ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి కలుగుతుంది. అయితే అంతమాత్రం చేత ఆశలన్నీ వదులుకోనవసరం లేదు. ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనల వల్ల, కొత్త మందుల ఆవిష్కరణ వల్ల, అవయవ మార్పిడిలో నూతన శస్త్రచికిత్స మెళకువలు అభివృద్ధి చెందడం వల్ల పీపీహెచ్‌కు ఇప్పుడు నమ్మకమైన చికిత్స అందుబాటులో ఉంది. దాని ద్వారా రోగి జీవితకాలాన్ని పొడిగించవచ్చు. పీపీహెచ్ రావడానికి స్పష్టమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ కొన్ని కుటుంబాలలో పీపీహెచ్ ఎక్కువగా కనిపిస్తోంది. మన దేశంలో ఏటా పది లక్షల మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. పీపీహెచ్ మొదటిదశలో డాక్టర్లు నిర్వహించే సాధారణ వైద్యపరీక్షల్లోనే ఈ వ్యాధి బయటపడుతుంది. వ్యాధి ముదిరిన తర్వాత మాత్రం పీపీహెచ్ లక్షణాలు... గుండె జబ్బులు, శ్వాసకోశ రుగ్మతల్లాగా కనిపించి కాస్త తికమకపెడతాయి. కానీ మీరు తెలిపిన విషయాలను బట్టి చూస్తే మీ అబ్బాయికి సాధారణ వైద్యపరీక్షలతోనే ఈ వ్యాధి నిర్ధారణ అయ్యిందని తెలుస్తోంది. దీన్ని బట్టి బహుశా అది ప్రాథమిక దశలోనే ఉండి ఉండాలి. అలాగైతే మందులతోనే దానికి చికిత్స చేయివచ్చు. కొన్ని జాగ్రత్తలతో అతడు సాధారణ జీవితం గడపవచ్చు. ఒకవేళ ఇందుకు భిన్నంగా మీ అబ్బాయికి వ్యాధి ముదిరి ఉన్నా నిరాశపడాల్సిన పనిలేదు. గుండె, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లయితే అవయవ మార్పిడితో ప్రాణాలు కాపాడవచ్చు. పైగా మీ అబ్బాయి యువకుడు అయినందువల్ల గుండె, ఊపిరితిత్తులు రెండింటి మార్పిడికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవలే పీపీహెచ్ వల్ల ఒక బాలిక గుండె, ఊపిరితిత్తులు పూర్తిగా తిన్నా... కంబైన్డ్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా ఆమెకు మా హాస్పిటల్లోనే అవయవమార్పిడి చేసి రక్షించగలిగాం. మూడు నెలల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్న ఆ బాలిక ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. కాబట్టి మీరు మీ అబ్బాయి విషయంలో నిరాశపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు పెద్ద ఆసుపత్రికి వెళ్లి చూపించుకోండి. అక్కడ ఛాతీ ఎక్స్‌రే, ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్, పల్మునరీ ఫంక్షన్ టెస్ట్ వంటి పరీక్షలు నిర్వహించి వ్యాధి ఏ స్థాయిలో ఉందో నిర్ధారణ చేస్తారు. పరిస్థితిని చూసి చికిత్స ప్రారంభించవచ్చు. ఒకవేళ గుండె, ఊపిరితిత్తులు మార్చాల్సిన అసవరం వస్తే డాక్టర్లు గుర్తించిన వెంటనే ఆ అవయవాల కోసం ప్రభుత్వ నిర్వహణలో ఉన్న జీవన్‌దాన్ సంస్థలో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. దాత లభించేంతరకు కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఆందోళన చెందకుండా మీరు మీకు దగ్గర్లోని పెద్ద హాస్పిటల్స్‌లోని గుండెనిపుణులకు చూపించుకొని వారి సూచన మేరకు అవసరమైన తదుపరి ఏర్పాట్లు చేసుకోండి. డాక్టర్ పి.వి. నరేశ్ కుమార్ సీనియర్ కార్డియో–థొరాసిక్, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్. పాపకు తరచూ జలుబు.... ఎందుకిలా? పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు ఏడేళ్లు. ఆమెకు తరచూ జలుబు చేస్తోంది. ఇటీవల ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తోంది. రాత్రుళ్లు ముక్కులు బిగదీసుకుపోయి ఊపిరితీసుకోవడం సాఫీగా జరగడం లేదంటూ ఏడుస్తోంది. డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుతున్నా ఫలితం కేవలం తాత్కాలికమే. మా పాప సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. – రమాసుందరి, శ్రీకాకుళం మీరు రాసిన లక్షణాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్‌ను రైనైటిస్‌గా చెప్పవచ్చు. రైనైటిస్ అనేది ముక్కు లోపలి పొర ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ఇలాంటివారిలో మీరు చెప్పిన జలుబు మాత్రమే కాకుండా ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కులోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇటీవల రైనైటిస్ కేసులు పెరుగుతున్నాయి. కొద్దిమందిలో ఇది సైనసైటిస్, ఆస్తమాతో పాటు కనిపించవచ్చు. ఈ లక్షణాలు కొంతమందిలో ఎప్పుడూ ఉంటాయి. మరికొందరిలో సీజనల్‌గా కనిపిస్తుంటాయి. ఈ సమస్య ఉన్న చాలామందిలో అది ఏదో ఒక అలర్జీ వల్ల సంభవించడం మామూలే. అయితే కొద్దిమందిలో అలర్జీతో సంబంధం లేకుండానూ, మరికొద్దిమందిలో ఇతరత్రా నాన్ ఇన్ఫెక్షియస్ కారణాల వల్ల కూడా కనిపించవచ్చు. అంటే... అలర్జెన్స్ వల్లనే కాకుండా చల్లటి గాలి, ఎక్సర్సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం (ఎమోషనల్ డిస్టర్బెన్సెస్) వల్ల కూడా వస్తుందన్నమాట. అరుదుగా కొన్నిసార్లు హార్మోన్లలో సమతుల్యం లోపించడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇక మీ పాప విషయంలో ఇది ఇడియోపథిక్ అలర్జిక్ రైనైటిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టమే అయినప్పటికీ– కంప్లీట్ హీమోగ్రామ్, ఇమ్యునోగ్లోబ్లులిన్ (ఐజీఈ) లెవెల్స్, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్ నేసల్ డ్రాప్స్), యాంటీహిస్టమైన్ గ్రూపు మందులు వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్ స్టెరాయిడ్స్‌తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్‌ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్‌పౌడర్, ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువులు, దుమ్మూ ధూళి వంటి వాటికి దూరంగా ఉండాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
ఆర్యూ మాజీ రిజిస్ట్రార్‌కు అస్వస్థత
- ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరిక - ఏడు నెలలుగా మానసిక క్షోభ కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ఎన్.టి.కె.నాయక్ మానసిక క్షోభతో ఛాతీ నొప్పికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాయత్రీ ఎస్టేట్‌లోని విజయదుర్గ కార్డియాక్ సెంటర్‌కు తరలించారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు.. మనోవేదనకు గురైనట్లు, గుండె సంబంధ సమస్యలున్నట్లు తెలిపారు. వర్సిటీలో ఇటీవలి పరిణామాలు, అధికారుల వేధింపులే ఇందుకు ప్రధాన కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
చర్మం పొట్టుగా రాలుతోంది!
నా వయసు 28 ఏళ్లు. రెండు మూడు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతోంది. ఎన్ని మందులు వాడినా తాత్కాలికమైన ఉపశమనమే ఉంది. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. దీనికి హోమియోలో మందు ఉందా? – రాజేశ్, మంచిర్యాల మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సొరియాసిస్‌గా తెలుస్తోంది. ఇందులో చర్మంపై మచ్చలు లేదా బొబ్బల్లా ఏర్పడి, అవి పొలుసులుగా ఊడిపోతోంది. సొరియాసిస్ సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసు వారికైనా రావచ్చు. కారణాలు : వంశపారంపర్యం లేదా అధిక ఒత్తిడి ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు సొరియాసిస్‌కు ప్రధాన కారణం. లక్షణాలు: ∙చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది lకేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి lతలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు చూడటానికి కూడా బాగాలేక మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. వ్యాధి ఉన్నప్పుడు... ఆధునిక జీవన శైలి వల్ల వంశపారంపర్యంగా ఈ వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. చాలా హడావిడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుతూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. చర్మం మరీ పొడిబారిపోకుండా తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. చికిత్స ముందుగా రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా జెనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సొరియాసిస్ సమస్యకు సమూలమైన చికిత్స అందించడం హోమియో ప్రక్రియలో పూర్తిగా సాధ్యమవుతుంది. ఛాతీ నొప్పి... సమస్య ఏమిటి? నా వయసు 38 ఏళ్లు. నాకు తరచూ ఛాతీ ఎడమభాగంలో నొప్పి వస్తోంది. మూడేళ్ల నుంచి ఈ నొప్పితో బాధపడుతున్నాను. కార్డియాలజిస్టును కలిసి గుండె సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకున్నాను. సమస్య ఏమీ లేదని అంటున్నారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. రాత్రివేళల్లో నొప్పి మరీ ఎక్కువ అవుతోంది. సమస్య ఏమై ఉంటుంది? ఈ నొప్పి తగ్గే మార్గం లేదా? – నవీన్‌కుమార్, నల్లగొండ మీరు తెలిపిన వివరాలు, పేర్కొన్న లక్షణాలను బట్టి మీకు ఆహార వాహికకు సంబంధించిన ‘రిఫ్లక్స్ డిసీజ్’తో బాధపడుతున్నట్లు అర్థమవుతోంది. ఇది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. అందులో మీ రిఫ్లక్స్ డిసీజ్ తీవ్రత తెలుస్తుంది. రాత్రివేళల్లో నొప్పి ఎక్కువ అంటున్నారు కాబట్టి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును కలసి, ఆ నొప్పిని తగ్గించుకునే మందులు వాడండి. మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు మీ సమస్యను తీవ్రతరం చేస్తాయి. వాటిని వాడటం వల్ల లక్ష ణాలు పెరుగుతాయి. వాటిని గుర్తించి, వాటి నుంచి దూరంగా ఉండాలి. ఇటువంటి మార్పులతో మీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. నా వయసు 40 ఏళ్లు. నెల రోజులుగా కడుపులో మంట, నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రతించాను. పరీక్షల్లో కడుపులో చిన్న పుండు ఉందని తేలింది. అల్ట్రాసౌండ్‌లో పిత్తాశయంలో రాయి ఉన్నట్లుగా వచ్చింది. ఈ సమస్య మందులతో తగ్గుతుందా, ఆపరేషన్ అవసరమా? – టి. రవి, వరంగల్ సాధారణంగా వయసు పెరిగేకొద్దీ పిత్తాశయంలో (గాల్‌బ్లాడర్‌లో) రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. పిత్తాశయంలో రాళ్లు ఉన్నంతమాత్రాన ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ రాళ్ల వల్ల తరచూ నొప్పి వస్తుంటే అప్పుడు గాల్‌బ్లాడర్‌ను తొలగించాల్సి ఉంటుంది. మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీకు యాసిడ్ పెప్టిక్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మీకు వచ్చే నొప్పి పిత్తాశయానికి సంబంధించినది కాదు. కాబట్టి మీరు భయపడాల్సిందేమీ లేదు. ఒకసారి వైద్యుడిని సంప్రతించి తగిన చికిత్స తీసుకోండి.