ప్రముఖ ఆంగ్లపత్రికలో పాత్రికేయుడుగా పనిచేస్తున్న ఎన్‌డీ.శివకుమార్ (39) సోమవారం ఉదయం గుండెనొప్పితో వృుతిచెందారు.
పలువురికి శాసనసభ సంతాపం
బెంగళూరు : ప్రముఖ ఆంగ్లపత్రికలో పాత్రికేయుడుగా పనిచేస్తున్న ఎన్‌డీ.శివకుమార్ (39) సోమవారం ఉదయం గుండెనొప్పితో వృుతిచెందారు. బెళగావి శీతాకాల సమావేశాల కవరేజ్ కోసం బెళగావికి వెళ్లిన శివకుమార్ సోమవారం ఉదయం గుండెనొప్పి రావ డంతో కేఎల్‌ఈ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం ఉదయం వృుతిచెందారు.
శివకుమార్ మరణవార్త తెలియగానే ముఖ్యమంత్రి సిద్దరామయ్య, సమాచారశాఖామంత్రి రోషన్‌బేగ్ ఆస్పత్రికి వెళ్లి అంతిమదర్శనం చేసుకుని తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. వృుతుడికి భార్యతో పాటు రెండేళ్ల వయసు గల కుమార్తె ఉన్నారు.
ఇటీవల వృుతిచెందిన పలువురికి శాసనసభ సంతాపం
మాజీ ఎమ్మెల్యే ఎంపీ.వెంకటేశ్, మహ్మద్‌సైఫ్ ఉద్దీన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వీఆర్.కృష్ణయ్యర్, పాత్రికేయుడు ఎన్.డీ.శివకుమార్ తదితరులకు విదానసభ సమావేశాల్లో భావపూర్వ శ్రధ్దాంజలి అర్పించారు. సమావేశాల్లో స్పీకర్ కాగోడుతిమ్మప్ప సంతాపం ప్రకటించి వృుతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ.... ఎంపీ.వెంకటేశ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు ఉత్తమ సేవలందిచార ంటూ ఆయన సేవలను కొనియాడారు. అదేవిధంగా మహ్మద్‌సైఫ్ ఉద్దీన్ వక్ఫ్‌బోర్డు అధ్యక్షుడిగా ప్రజలకు సేవలందించారని తెలిపారు. యువపాత్రికేయుడు ఎన్‌డీ.శివకుమార్ విధినిర్వహణలో వృుతిచెందడం అత్యంత దురదృష్టకర విషయమన్నారు. ప్రతిపక్షనేత జగదీశ్‌షెట్టర్ మాట్లాడుతూ ఉత్తమ పాత్రికేయుల్లో ఎన్‌డీ.శివకుమార్ కూడా ఒకరని ఆయన ఆకస్మిక మరణం తీవ్ర దిగ్బాంతికి గురిచేసిందన్నారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిచేకూర్చాలన్నారు.