Viral video: 95 పైసల కోసం గొడవ.. అసలేం జరిగిందంటే.. | Woman Journalist And Cab Driver Argue Over 95 Paise, Netizens Reactions On This Viral Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

Viral video: 95 పైసల కోసం గొడవ.. అసలేం జరిగిందంటే..

Published Sat, Mar 22 2025 8:46 PM | Last Updated on Sun, Mar 23 2025 10:44 AM

Journalist And Cab Driver Argue Over 95 Paise

నోయిడా: కేవలం 95 పైసల కోసం ఓ మహిళా జర్నలిస్టు, క్యాబ్‌ డ్రైవర్‌ వాదించుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. అయితే, నెటిజన్లంతా క్యాబ్‌ డ్రైవర్‌కే మద్దతు ఇస్తున్నారు. ఈ వాగ్విదానికి సంబంధించిన వీడియోను దీపికా నారాయణ్‌ భరద్వాజ్‌ అనే హక్కుల కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టు చేసింది. డ్రైవర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ ఆరోపించగా, ఆమె తనను బెదిరించి టాక్సీ ఛార్జీ చెల్లించడానికి నిరాకరించిందని డ్రైవర్‌ ఆరోపిస్తున్నాడు. కాగా, తాను జర్నలిస్టునని సదరు మహిళా జర్నలిస్టు క్యాబ్‌ డ్రైవర్‌ను బెదిరించినట్లుగా ఆ వీడియోలో ఉంది.

మిగతా 95 పైసలు కూడా చెల్లిస్తే పోయేదానికి ఈగోకు పోయి ఆ మహిళా గొడవకు దిగిందని ఓ నెటిజన్‌.. కేవలం 95 పైసల కోసం క్యాబ్‌ డ్రైవర్‌ను బెదిరించడం అవసరమా..? అంటూ మరో నెటిజన్‌ ప్రశ్నలు గుప్పించారు. క్యాబ్‌ డ్రైవర్‌ది తప్పులేకపోయినా మహిళా కార్డు ఉపయోగించి అతడిని బెదిరించడం కరెక్టు కాదు. చేతిలో డబ్బులు లేకపోతే బస్సులో వెళ్లొచ్చుగా క్యాబ్‌లో వెళ్లి గొడవపడటం ఎందుకు..?’’ అంటూ యూజర్లు ఆ మహిళను తప్పుబడుతున్నారు.

 ఈ ఘటనపై మహిళా జర్నలిస్టు శివంగి శుక్లా వివరణ ఇస్తూ.. తాను క్యాబ్‌ డ్రైవర్‌ను బెదిరించలేదని, అతడే తనతో దురుసుగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. లోకేషన్‌కు దూరంగా క్యాబ్‌ను ఆపేశాడని, లోకేషన్‌కు తీసుకెళ్లమంటే కుదరదని దురుసుగా సమాధానం చెప్పాడు. దాంతో తాను క్యాబ్‌ దిగి రూ.129 పేమెంట్ చేశానని, తొందరలో పైన ఉన్న 95 పైసలు చూసుకోలేదు. ఇంతలోనే 95 పైసలు ఎందుకు కొట్టలేదంటూ క్యాబ్‌ డ్రైవర్‌కు గొడవ దిగాడని, దాంతో తాను జర్నలిస్టునని, దబాయించవద్దని వార్నింగ్‌ ఇచ్చానని ఆ మహిళా జర్నలిస్టు తెలిపారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement