విమర్శలు చేస్తే.. క్రిమినల్‌ కేసులు పెట్టొద్దు: సుప్రీం కోర్టు | sc says govt cannot filing criminal cases against journalists | Sakshi
Sakshi News home page

విమర్శలు చేస్తే.. క్రిమినల్‌ కేసులు పెట్టొద్దు: సుప్రీం కోర్టు

Published Fri, Oct 4 2024 7:16 PM | Last Updated on Fri, Oct 4 2024 7:44 PM

sc says govt cannot filing criminal cases against journalists

ఢిల్లీ:  ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాస్తే.. జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెట్టటం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.  తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జర్నలిస్ట్‌ అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. 

ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించారు.   ఈ సందర్భంగా.. ‘‘ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను గౌరవిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.

జర్నలిస్టులు రాసిన ప్రచురించిన కథనాలను ప్రభుత్వంపై విమర్శలుగా భావించి.. సదరు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని  సుప్రీం సూచించింది. అలా చేస్తే అది భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లే అవుతుందని పేర్కొంది. 

సాధారణ పరిపాలనలోని కుల వివరాలకు సంబంధించి ఓ వార్తా కథనాన్ని ప్రచురించినందుకు ఉ‍త్తర ప్రదేశ్‌  ప్రభుత్వం జర్నలిస్ట్‌ అభిషేఖ్‌ ఉపాధ్యాయ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో జర్నలిస్ట్‌ అభిషేఖ్‌ ఉపాధ్యాయ్‌ను అరెస్టు చేయకుండా సుప్రీం కోర్టు  మధ్యంతర రక్షణ మంజూరు చేసింది.

చదవండి: బీజేపీకి షాక్‌.. శరద్ పవార్ ఎన్సీపీలోకి మాజీ మంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement