
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల తీరుపై దేశ అత్యున్నత న్యాయం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా నమోదు చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. యూపీలో చట్టాన్ని అతిక్రమించే చర్యలే ప్రతిరోజూ కనిపిస్తున్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తి తాను తిరిగి తీసుకున్న నగదును ఇవ్వకపోవడంతో అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు యూపీ పోలీసులు.
ఈ కేసులో సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో అసలు యూపీలో ఏం జరుగుతుందని సూటిగా ప్రశ్నించింది సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్శనాథన్‌లతో కూడిన ధర్మాసనం.
‘ఇదొక సివిల్ కేసు.. దీన్ని క్రిమినల్ కేసు కింద ఎందుకు ఫైల్ చేశారు. యూపీ పోలీసుల తీరు ఎంతమాత్రం సహేతుకం కాదు. సివిల్ నేపథ్యం ఉన్న కేసుల్ని క్రిమినల్ కేసుగా ఎందుకు మార్చి రాశారు. చట్ట ప్రకారం ఇది సరైనది కాదు. ఒక మనిషి దగ్గర తీసుకున్న డబ్బును తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వలేని పక్షంలో అది క్రిమినల్ కేసులోకి రాదు యూపీలో ప్రతీరోజూ చాలా వరకూ ఈ తరహా కేసులే కనిపిస్తున్నాయి. సివిల్ కేసుల్ని తీసుకొచ్చి క్రిమినల్ కేసుల కింద ఎలా ఫైల్ చేస్తారు. ఇది కంప్లీట్ గా చట్టాన్ని అతిక్రమించడమే’ అని ధర్మాసనం చురకలు అంటించింది.
ఇదీ చదవండి: మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు