Civil Cases
-
2018 తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ: సివిల్, క్రిమినల్ కేసుల్లో హైకోర్టు లేదా దిగువ కోర్టులి2018 తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనంన స్టేలు 6 నెలల తర్వాత ప్రత్యేకంగా పొడిగింపు ఆదేశాలివ్వకుంటే వాటంతటవే రద్దవుతాయంటూ 2018లో ఇ2018 తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనంన తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 226 ప్రకారం సంక్రమించిన అధికారాలను 2018 నాటి తీర్పుతో హైకోర్టులు కోల్పోయాయంటూ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది. సీనియర్ లాయర్ రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. అప్పటి తీర్పుపై సమీక్షను రాజ్యాంగధర్మాసనానికి అప్పగిస్తామని తెలిపింది. -
1,518 సివిల్ కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టుల్లో 1,518 సివిల్ కేసుల పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.24,70,81,376 నష్ట పరిహారం అందజేశారు. నగరంలోని సివిల్ కోర్టులలో మొత్తం పది బెంచీలు ఏర్పాటు చేసి ఆదివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించినట్లు సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ రేణుకా యారా తెలిపారు. ఈ సందర్భంగా 324 మోటార్ ప్రమాదం ఇన్సూరెన్స్ క్లెయిమ్ కేసులను కూడా పరిష్కరించామని, బాధితులకు రూ.21 కోట్ల నష్టపరిహారాన్ని అందజేశామని వివరించారు. పర్మినెంట్ లోక్ అదాలత్‌లోని ప్రజా సేవల రంగంలోని ప్రీలిటిగేషన్ కేసులు, 1,092 ఎస్బీఐ బ్యాంక్ కేసులను కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో రేణుక యారా మాట్లాడుతూ.. కాలయాపన లేకుండా సత్వర న్యాయం పొందటం కేవలం లోకదాలత్ లోనే సాధ్యమవుతుందన్నారు. కక్షిదారులు ఇలాంటి జాతీయ లోక్ అదాలత్‌లో తమ కేసుల సత్వర పరిష్కారానికి ముందుకు రావాలని సూచించారు. రెండవ అదనపు చీఫ్ జడ్జి కె ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. లోక్ అదాలత్ తీర్పుకు అప్పీలు ఉండదని, అంతేకాక అది శాశ్వత పరిష్కారం అవుతుందని వివరించారు. న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే.మురళీమోహన్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ లో పరిష్కారమైన సివిల్ కేసులలో కక్షిదారులకు వారు చెల్లించిన కోర్టు ఫీజు వాపసు చెల్లిస్తారన్నారు. బార్ అసోసియేషన్ నూతన కార్యదర్శి నాగభూషణం, మాట్లాడారు. సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ న్యాయస్థానంలోని లోక్ అదాలత్ బెంచ్‌లకు చీఫ్ జడ్జి రేణుకా యారా, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నిర్మల గీతాంబ, రెండవ అదనపు చీఫ్ జడ్జ్ కె ప్రభాకర్ రావు, అదనపు జిల్లా న్యాయమూర్తులు ఉమాదేవి, అపర్ణ , సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ మహి, జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమార్ తదితరులు నేతృత్వం వహించగా.. సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో అదనపు చీఫ్ జడ్జి జీవన్ కుమార్ నేతృత్వం వహించారు. రాచకొండలో 99,476 కేసుల పరిష్కారం రాచకొండ కమిషరేట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న 99,476 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో..93,930 కేసులు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కేసులు కాగా..3,293 కేసులు ఐపీసీ కేసులు, 2.253 డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా సెషన్స్ జడ్జి సీ హరే కృష్ణ భూపతి, రంగారెడ్డి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) సెక్రటరీ ఏ శ్రీదేవి, యాదాద్రి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి వీ బాల భాస్కర్ రావులు లోక్ అదాలత్ లను నిర్వహించి కేసులను పరిష్కరించారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, అదనపు సిపి జీ సుధీర్ బాబు తదితర పోలీస్ అధికారులు పాల్గొని లోక్ అదాలత్ నిర్వహణను పర్యవేక్షించారు. (చదవండి: మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్లపై ఆంక్షలు) -
సూర్యాపేట జిల్లా నాగారం ఎస్ఐ దాష్టీకం...
సాక్షి, సూర్యాపేట: రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకు వచ్చామని పదేపదే చెబుతున్నా అదంతా మాటలకే పరిమతమన్నట్టు కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసినవారిపైనే దాడులు చేస్తూ పోలీసు వ్యవస్థను అభాసుపాలు చేస్తున్నారు. రాజకీయ పలుకుబడి, ఆర్థిక, అంగబలం ఉన్న వారి మాటే పోలీస్ స్టేషన్లో చెల్లుబాటవుతుందని సూర్యాపేట జిల్లాలోని నాగారాం ఎస్ఐ నిరూపించారు. సివిల్ కేసులో తలదూర్చడమే కాకుండా, న్యాయం చేయాలంటూ ఆశ్రయించిన రైతులపైనే ఎస్ఐ లింగం దౌర్జన్యం చేశారు. వారిని లాఠీతో చితకబాదడమే కాకుండా చెప్పినట్టు వినకుంటే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. ప్రాణభయంతో సదరు రైతులు జిల్లా ఎస్పీ భాస్కర్ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. రైతులపై దాష్టీకానికి దిగిన ఎస్ఐ లింగంపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఆయన తీరు మార్చుకోక పోవడంతో శాఖాపరమైన చర్యలు తీసుకున్నా కూడా ఆయన తీరు మాత్రం ఏ మాత్రం మారలేదు. (ప్రేమ పెళ్లి: టెకీ అనునామానాస్పద మృతి) -
ఠాణా.. సెటిల్మెంట్లకు అడ్డా!
సాక్షి, మచిలీపట్నం : పోలీస్ అంటేనే భరోసా.. పోలీసు వ్యవస్థ అంటే బాధ్యత.. అంతకు మించి విశ్వాసం. సగటు మనిషికి పోలీసు స్నేహితుడిలా మెలగాలి. కానీ బందరు తాలూకా స్టేషన్ పరి ధిలో పరిస్థితి దీనికి విరుద్ధంగా నడుస్తోంది. వరుసగా జరుగుతున్న సెటిల్మెంట్లు వారి అవినీతికి అద్దం పడుతున్నాయి. వారి వ్యవహార శైలి వివా దాస్పదం అవుతుండటంతో ప్రజల్లో పోలీసు శాఖకే మాయని మచ్చలా మారుతోంది. ఇందుకు ఇటీవల బందరు తాలూకా స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటనలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బాధితులకు న్యాయం చేసేందుకు ఉద్దేశించిన ఠాణాను అవినీతికి ఠికానాగా మార్చేస్తున్నారు. న్యాయం కోసం ఎవరు వెళ్లినా.. న్యాయం తమవైపు ఉన్నా పైసలు సమర్పించుకోవాల్సి వస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా యి. క్రిమినల్, సివిల్ కేసులన్న బేధం లేకుండా వాటిలో కాలు పెట్టేస్తున్నారు. కాసుల కక్కుర్తితో న్యాయం చేయాల్సిన వారిని బెదిరించి మరీ సెటిల్మెంట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద నిత్యకృత్యంగా మారాయి. మచ్చుకు కొన్ని పరిశీలిస్తే...సివిల్ పంచాయతీల్లో హవా... బందరు మండల పరిధిలోని తుమ్మలచెరువులో 20 మంది రైతులకు సంబంధించి 73.46 ఎకరాల రొయ్యల చెరువు ఉంది. సదరు రైతులు ఎనిమిదేళ్ల క్రితం సత్యనారాయణమూర్తి అనే వ్యక్తికి లీజ్ ఇచ్చారు. కొంత కాలం సాగు చేసుకున్న అనంతరం సత్యనారాయణమూర్తి మంగళగిరికి చెందిన శ్రీనివాసరావుకు అప్పజెప్పాడు. శ్రీనివాసరావు.. గాంధీ అనే వ్యక్తికి అప్పగించారు. గాంధీ చెరువు సాగు చేస్తుండగా.. బెంగళూరుకు చెందిన లక్ష్మీనరసింహన్ అనే ఆమె అకస్మాత్తుగా తెరపైకి వచ్చి చెరువు తనదేనంటూ హంగామా చేసింది. ఈ పంచాయతీ ఎస్పీ వద్దకు చేరింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇది సివిల్ కేసైనా అందులో తల దూర్చి సెటిల్మెంట్కు దిగారు. చెరువుపై పూర్తి హక్కులు లక్ష్మీనరసింహన్‌కే ఉన్నాయంటూ గాంధీ వర్గీయులను బుధవారం బెదిరింపులకు గురి చేశారు. ఏకంగా చెరువు వద్దకు వెళ్లి నానా హంగామా చేశారు. చెరువు వదిలి వెళ్లకపోతే తప్పుడు కేసులు బనాయిస్తామని హెచ్చరించారని బాధితుడు గాంధీ వాపోయాడు. లక్ష్మీనరసింహన్ నుంచి ముడుపులు తీసుకుని తనకు అన్యాయం చేస్తున్నారంటూ గాంధీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒక సివిల్ కేసులో అంత అత్యుత్సాహం చూపాల్సిన అవసరం పోలీసులకు ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేవలం ఈ వ్యవహారమే కాదు జిల్లావ్యాప్తంగా ప్రతి నిత్యం ఇలాంటి సివిల్ సెటిల్మెంట్లతో జేబు నిండా సంపాదిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి తమకు సంపూర్ణ మద్దతు ఉండటంతో ఇలాంటి తంతుకు తెగబడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. -
వాదనలు ముగిసిన 60 రోజుల్లో తీర్పు ఇచ్చి తీరాలి
సాక్షి, హైదరాబాద్: సివిల్ కేసుల సత్వర పరిష్కారం దిశగా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసుల పరిష్కారానికి సంబంధించి ఉభయ రాష్ట్రాల్లోని కిందికోర్టులకు, అక్కడి న్యాయవాదులకు దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా సివిల్ కేసుల పరిష్కారం విషయం లో కిందికోర్టులు అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కేసులో వాదనలు పూర్తయిన నాటి నుంచి గరిష్టంగా 60 రోజుల్లోపు తీర్పు చెప్పాలని నిబంధనలు స్పష్టం చేస్తుంటే.. కింది కోర్టులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయని ఆక్షేపించింది. హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్లూ అమలుకు నోచుకోవట్లేదంది. అనవసరమైన జాప్యానికి తావిస్తూ.. ఓ పద్ధతంటూ లేకుండా విచారిస్తూ ఏళ్ల తరబడి కేసులు అపరిష్కృతంగా ఉండేందుకు కారణమవుతుండటంపై తీవ్ర అసహనం వెలిబుచ్చింది. తీర్పు వాయిదా వేశాక కిందికోర్టులు కారణాల్ని వెల్లడించకుండానే కేసులను సుమోటోగా తిరిగి తెరుస్తుండటంపై విస్మయం వ్యక్తపరిచింది. ఈ తీరువల్ల జడ్జీల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి వస్తోందని, ఇకపై పద్ధతి మార్చుకోవాలని, కేసుల విచారణకు, పరిష్కారానికి ఓ నిర్దిష్ట విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఉభయపక్షాల న్యాయవాదుల వాదనలు పూర్తయి.. కోర్టుకు ఎలాంటి సందేహాలకు తావులేకుండా స్పష్టత వచ్చేంతవరకు కేసులో తీర్పును రిజర్వ్ చేయవద్దని సూచించింది. వాదనలు ముగిసిన 60 రోజుల్లోగా తీర్పు ఇచ్చి తీరాలింది. ఒకసారి తీర్పును రిజర్వ్ చేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కేసును సుమోటోగా తిరిగి తెరవడానికి వీల్లే దంది. అసాధారణ పరిస్థితుల్లో తెరవాల్సి వస్తే అందుకు కారణాల్ని వెల్లడిస్తూ.. ఉభయపక్షాలకు నోటీసులివ్వాలంది. ఈ విషయాన్ని ఓ ప్రొఫార్మా రూపంలో జిల్లా ప్రధాన న్యాయాధికారికి తెలియచేయాలని, జిల్లా ప్రధాన న్యాయాధికారి ఈ విషయాల్ని ఎప్పటికప్పుడు హైకోర్టుకు తెలపాలని స్పష్టం చేసింది. ఓ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి గతవారం ఈ తీర్పిచ్చారు. ప్రాథమిక దశలోనే డాక్యుమెంట్లు సమర్పించాలి... ఈ సందర్భంగా న్యాయవాదులకూ కొన్ని సూచనలు చేశారు. న్యాయవాదులు జాప్యానికి తావులేకుండా కేసు ప్రాథమిక దశలోనే అన్ని దరఖాస్తుల్ని సమర్పించాలన్నారు. అభ్యర్థనల్ని మెరుగుపరచడం, కేసులో పార్టీల చేర్పు, తొలగింపు తదితర విషయాల్లో న్యాయవాదులు చివరిదశలో దరఖాస్తులు వేస్తున్నారని, దీనివల్ల కేసుల పరిష్కారంలో అసాధారణ జాప్యం జరుగుతోందన్నారు. కోర్టు సైతం ప్రాథమిక విచారణ పూర్తయ్యాక న్యాయవాదులతో మాట్లాడి వాదనలకు ఎంత సమయం పడుతుంది.. ఇంకా సమర్పించాల్సిన వివరాలున్నాయా.. తదితర వివరాలు తెలుసుకుని విచారించే కేసులకు సంబంధించి ఓ ప్రత్యేక జాబితాను రూపొందించాల్సి ఉండగా, ఆ పని చేయట్లేదన్నారు. సివిల్ ప్రొసీజర్ కోడ్(సీపీసీ), ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్స్–1980లోని నిబంధనల్ని కచ్చితంగా పాటించి తీరాలన్నారు. వీటితోపాటు వీటి ఆధారంగా హైకోర్టు జారీచేసిన, చేయబోయే సర్క్యులర్లను కిందికోర్టులు పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు హైకోర్టు పాలనాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇదీ కేసు... తన ఇంట్లో ఉన్నవారిని ఖాళీ చేయించే విషయంలో విశాఖపట్నం మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాలుచేస్తూ భామిడిమర్రి విజయలక్ష్మి అనే మహిళ హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్(సీఆర్పీ) వేశారు. తాను దాఖలు చేసిన సవరణ పిటిషన్‌ను విశాఖ కోర్టు కొట్టివేయడంపై అభ్యంతరం తెలిపారు. విజయలక్ష్మి పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు ఇచ్చారు. కిందికోర్టు వాదనలు విని తీర్పును రిజర్వ్ చేశాక.. తీర్పును పదేపదే వాయిదా వేసి, మళ్లీ కేసును సుమోటోగా తెరిచి వాదనలు వినడాన్ని న్యాయమూర్తి గమనించారు. ఇలా తీర్పు రిజర్వ్ చేశాక మళ్లీ సుమోటోగా కేసును తెరవడం సరికాదని, ఇది అనారోగ్యకరమైన వ్యవహారమని తేల్చారు. అయితే విజయలక్ష్మి వేసిన సవరణ పిటిషన్‌ను కొట్టేస్తూ విశాఖకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని న్యాయమూర్తి సమర్థించారు. ఆమె పిటిషన్‌ను కొట్టేశారు. -
ఇక వాయిదాలుండవు
- సివిల్ కేసుల సత్వర పరిష్కారానికి హైకోర్టు కొత్త నిబంధనలు - నోటీసుల జారీ నుంచి తీర్పు వరకు నిర్దిష్ట విధానం - ఇకపై ప్రతీ కేసు పరిష్కారానికి, విధివిధానాల పూర్తికి గడువులు - సమన్లు, నోటీసులకు 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందే - కేసులన్నీ నాలుగు విభాగాలుగా విభజన - భరణం చెల్లింపు, పిల్లల కస్టడీ కేసులకు 9 నెలలు - విడాకులు, కోర్టు తీర్పుల అమలు కేసులకు ఏడాది - ఆస్తి వివాదాల కేసులకు రెండేళ్లలో పరిష్కారం - మధ్యవర్తిత్వం, రాజీ అవకాశాలపై ప్రత్యేకంగా పరిశీలన సాక్షి, హైదరాబాద్: కింది కోర్టులు, వివిధ ట్రిబ్యునళ్లకు పెనుభారంగా పరిణమించిన సివిల్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించడమే లక్ష్యంగా హైకోర్టు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలకు వర్తించే ‘సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్స్’కు కొత్త అధ్యాయాన్ని జత చేసింది. ప్రతీ కేసు విచారణకు నిర్దిష్ట కాల పరిమితిని నిర్దేశించింది. కేసుకు సంబంధించి ప్రతీ విధివిధానానికి కూడా గడువు పెట్టింది. ‘కేస్ ఫ్లో మేనేజ్మెంట్’ పేరుతో రూపొందించిన ఈ కొత్త నిబంధనలు కింది కోర్టుల్లో ఏ కేసులను ఏ పద్ధతిన విచారించాలో నిర్దేశిస్తాయి. సమన్లు, నోటీసుల జారీ మొదలుకుని, తీర్పు వెలువరించేంత వరకు కేసు విచారణ ఏ దశలో ఎలా సాగాలో ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కేసుల ప్రతీ దశలో ప్రస్తుతం జరుగుతున్న అసాధారణ జాప్యానికి దీనితో ఫుల్స్టాప్ పడనుంది. ఇక భరణం చెల్లింపు, పిల్లల కస్టడీ, సంరక్షకుల నియామకం వంటి కేసులను గరిష్టంగా 9 నెలల్లోపు పరిష్కరించాలి. కోర్టు తీర్పుల అమలు, విడాకులు, ఖాళీ చేయించడం వంటి కేసులను 12 నెలల్లోపు పరిష్కరించాలి. ఆస్తుల విభజన, ప్రకటన, స్వాధీనం, ఇంజంక్షన్ వంటి వాటిని 24 నెలల్లో పరిష్కరించాలి. తీర్పు వెలువరించేందుకు సైతం కాల పరిమితి నిర్దేశించింది. తీర్పును రిజర్వ్ చేసుకున్న నాటి నుంచి గరిష్టంగా 2 నెలల్లోపు వెలువరించి తీరాలి. అభ్యంతరాల స్వీకరణ నిమిత్తం హైకోర్టు ఈ కొత్త నిబంధనలను ఇంతకుముందే ఉభయ రాష్ట్రాలకు పంపింది. ఎటువంటి అభ్యంతరాలు రాలేదని ప్రభుత్వాలు చెప్పడంతో.. దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు 2 రాష్ట్ర ప్రభుత్వాలు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేశాయి. నాలుగు ట్రాక్‌లుగా కేసులు ప్రతీ కోర్టు, ట్రిబ్యునళ్ల ప్రిసైడింగ్ అధికారి తన ముందున్న కేసులను ట్రాక్-1, ట్రాక్-2, ట్రాక్-3, ట్రాక్-4లుగా వర్గీకరించాలి. ట్రాక్-1 పరిధిలోకి భరణం చెల్లింపు, పిల్లల కస్టడీ, సంరక్షకుల నియామకం, సందర్శన హక్కులు, అద్దె రికవరీ, శాశ్వత ఇంజంక్షన్, వారసత్వ ధ్రువీకరణ పత్రం వంటి కేసులు వస్తాయి. వీటిని 9నెలల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ట్రాక్-2 పరిధిలోకి తీర్పుల అమలు, విడాకులు, ఖాళీ చేయించడం వంటివి వస్తాయి. వీటిని 12 నెలల్లోపు పరిష్కరించాలి. ట్రాక్-3 పరిధిలోకి ఆస్తుల విభజన, ఆస్తులపై హక్కుల ప్రకటన, స్వాధీనం, తప్పనిసరి ఇంజంక్షన్, అప్పీళ్లు, ఖర్చులు, అనుభవ హక్కు, ట్రేడ్ మార్కులు, కాపీ రైట్లు, పేటెంట్లు, మేథోసంపత్తి హక్కులు తదితర కేసులు వస్తాయి. వీటిని 24 నెలల్లోపు పరిష్కరించాలి. మొదటి 3 ట్రాక్‌ల పరిధిలోకి రాని కేసులు ట్రాక్-4 పరిధిలోకి వస్తాయి. ట్రాక్-3, 4 కేసులను ప్రతివాదులు కోర్టులో హాజరైన నాటి నుంచి 24 నెలల్లోపు పరిష్కరించాలి. సమన్ల జారీకి గడువు తమ ముందున్న కేసుల్లో నోటీసులు, సమన్లు జారీ చేసినప్పుడు... జారీ చేసిన తేదీ నుంచి గరిష్టంగా 30 రోజుల్లోపే రాతపూర్వక సమాధానం గానీ, అభ్యంతరాలు గానీ సమర్పించాలని పేర్కొనాలి. ప్రతివాదులకు అందజేసేందుకు వీలుగా పిటిషనర్ తాను దాఖలు చేసిన కేసుకు సంబంధించిన పిటిషన్, తాత్కాలిక ఊరట కోసం సమర్పించే వ్యాజ్యకాలీన దరఖాస్తు, ఇతర డాక్యుమెంట్ల కాపీలను కోర్టులో సమర్పించాలి. ప్రతివాదుల చిరునామాలను పిటిషనర్ స్పష్టంగా పేర్కొనాలి. ఇది కచ్చితంగా అమలయ్యేలా సంబంధిత కోర్టు చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధికారులు గానీ ప్రతివాదులుగా ఉండి వారికి కోర్టులు నోటీసులు జారీ చేయాల్సి వస్తే... వాటిని ఆ కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులకు అందచేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలకు సమన్లు, నోటీసులు ఇవ్వాలనుకుంటే వాటిని ఆ సంస్థల న్యాయవాదులకు అందేలా చూడాలి. ఏయే దశల్లో కేసుల విచారణ సమన్లు లేదా నోటీసుల జారీతో కేసు విచారణ ప్రారంభమవుతుంది. నోటీసుల జారీ అనంతరం ప్రతివాదులు కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రతివాది ఇచ్చే రాతపూర్వక సమాధానం లేదా దానికి పిటిషనర్ అభ్యంతరాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. వ్యాజ్యకాలీన దరఖాస్తులపై విచారణ చేపట్టిన తరువాత సంబంధిత కేసును మధ్యవర్తిత్వానికి లేదా రాజీకి లేదా లోక్ అదాలత్‌కు నివేదించే అవకాశాలను పరిశీలించాలి. తీర్పులో తేల్చాల్సిన అంశాలను నిర్ణయించాలి. తరువాత సాక్ష్యాలను నమోదు చేసి ఇరుపక్షాల వాదనలు విని తీర్పునివ్వాలి. రెండు కాజ్ లిస్టుల రూపకల్పన ప్రిసైడింగ్ అధికారి రోజూ విచారణకు వచ్చే కేసులకు సంబంధించి రెండు కాజ్‌లిస్టులు (విచారణకు వచ్చే కేసుల జాబితాలు) రూపొందించాలి. వ్యాజ్యకాలీన దరఖాస్తుల విచారణ, మధ్యవర్తిత్వం లేదా రాజీ లేదా లోక్ అదాలత్లకు నివేదించే కేసులు, వాదనలు, తీర్పులు వెలువరించే కేసుల గురించి కాజ్లిస్ట్-1లో పేర్కొనాలి. సమన్లు, నోటీసుల జారీ, ప్రతివాదుల హాజరు, రాతపూర్వక సమాధానం సమర్పణ, పిటిషనర్ల అభ్యంతరాలు తదితరాలను కాజ్లిస్ట్-2లో పేర్కొనాలి. సాక్ష్యాల నమోదు, వాదనల నిమిత్తం విచారించే కేసులను 30 రోజుల ముందుగానే కోర్టు నోటీసు బోర్డులో ఉంచాలి. రాజీ అవకాశాల పరిశీలన రాతపూర్వక సమాధానం సమర్పించిన తరువాత పార్టీల మధ్య ఆ కేసును పరిష్కరించే అవకాశాలను ప్రిసైడింగ్ అధికారి పరిశీలించాలి. పరిష్కార అవకాశాలుంటే ఆ కేసును మధ్యవర్తిత్వానికి లేదా రాజీకి లేదా లోక్ అదాలత్‌కు నివేదించవచ్చు. కేసు పరిష్కారమైతే ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందాల మేర తీర్పునివ్వొచ్చు. లేదంటే సాధారణ పద్ధతిలోనే కేసును విచారించి తీర్పునివ్వాలి. రెండు నెలల్లో తీర్పు సాక్షుల వాంగ్మూలాలను కోర్టు లేదా కోర్టు అనుమతి ద్వారా నియమితులైన కమిషనర్ నమోదు చేస్తారు. సాక్ష్యాల నమోదుకు కమిషనర్‌కు నిర్దిష్ట కాల పరిమితి విధించాలి. సాక్ష్యాల నమోదుకు అవసరమైన డాక్యుమెంట్లను కమిషనర్‌కు అందచేయవచ్చు. అయితే ఒరిజినల్ ఫైల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కమిషనర్‌కు ఇవ్వరాదు. సాక్ష్యాల నమోదు పూర్తయిన 15 రోజులకల్లా వాదనలు ప్రారంభించాలి. ఇరు పార్టీలు కూడా తమ వాదనలను రాతపూర్వకంగా సమర్పించవచ్చు. వాదనలు పూర్తయిన తరువాత అదే రోజు లేదా తీర్పు రిజర్వు చేసిన రెండు నెలల్లోపు తీర్పును వెలువరించాలి. మళ్లీ మళ్లీ నోటీసులు అవసరం లేదు ఒకసారి ప్రభుత్వ న్యాయవాదులు, ప్రభుత్వ రంగ సంస్థల న్యాయవాదులకు అందచేసిన నోటీసులు సక్రమమైనవే అయితే మళ్లీ ఆయా ప్రభుత్వాలకు గానీ, ప్రభుత్వాధికారులకు గానీ ప్రత్యేకంగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సమన్ల జారీకి కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి 7 రోజుల్లోపు ప్రతివాదులకు అందాల్సిన పిటిషన్, ఇతర డాక్యుమెంట్లను కోర్టు సిబ్బందికి పిటిషనర్ అందచేయాలి. లేనిపక్షంలో కోర్టు ఆ కేసును కొట్టివేసే జాబితాలో వేసుకోవాలి. సమన్లు జారీ అయిన నాటి నుంచి 21 రోజుల్లోపు మళ్లీ విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అదే జిల్లా కాకుండా వేరే జిల్లాకు నోటీసులు, సమన్లు వెళ్లాల్సి ఉంటే 30 రోజుల వరకు గడువు తీసుకోవచ్చు. సమన్లు తీసుకునేందుకు ప్రతివాది తిరస్కరిస్తే.. కోర్టు ప్రతివాదుల పరోక్షంలో కేసును విచారించి తీర్పునివ్వొచ్చు. పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోవడానికి సమన్ల జారీలో అసాధారణ జాప్యమే కారణమని గుర్తించిన హైకోర్టు దానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ గడువులను నిర్ణయించింది. -
లోక్ అదాలత్‌లో 1,666 కేసుల పరిష్కారం
కర్నూలు(లీగల్): జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 1,666 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత, కార్యదర్శి ఎం.వి.సోమశేఖర్లు తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్ అదాలత్‌లో జిల్లా 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి వి.వి.శేషు బాబు 33 రోడ్డు ప్రమాద కేసులను పరిష్కరించి బాధితులకు రూ.78.65లక్షల పరిహారం చెల్లించేలా తీర్చునిచ్చారు. రాజీ కాగల క్రిమినల్ కేసులు, ప్రీలిటిగేషన్, సివిల్ కేసులను లోక్ అదాలత్ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్ పరిష్కరించారు. కర్నూలులో 669 కేసులు, నంద్యాలలో 508, ఆదోనిలో 153, పత్తికొండలో 37, ఆలూరులో 46, ఎమ్మిగనూరు 39, డోన్‌లో 33, బనగానపల్లెలో 12, కోయిలకుంట్లలో 35, ఆళ్లగడ్డలో 63, ఆత్మకూరులో 37, నందికొట్కూరులో 34 కేసులను పరిష్కరించారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లా ద్వితీయ స్థానంలో నిలువగా.. మొదటి స్థానాన్ని గుంటూరు జిల్లా దక్కించుకుంది. సాయంత్రం 3.30 గంటలకు లోక్ అదాలత్ కార్యాలయంలో విద్యార్థులకు ‘భారత రాజ్యాంగం-మానవ హక్కుల రక్షణ’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు, మహిళా సాధికారతపై వక్తృత్వ పోటీలను నిర్వహించారు. న్యాయాధికారులు సోమశేఖర్, గాయత్రిదేవి, స్వప్నారాణి, పి.రాజు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో మాంటిస్సోరి, భాష్యం, సెయింట్‌జోసెఫ్, సీరాక్, శ్రీలక్ష్మీ, వాసవి మహిళా కళాశాల, ఎస్సీ, ఎస్టీబీసీ కళాశాల, ప్రసూన లా కాలేజీ, ఉస్మానియా కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌తో కేసుల సత్వర పరిష్కారం
జిల్లా జడ్జి ఉదయగౌరి 154 కేసుల్లో రాజీ ఆదిలాబాద్ క్రైం : లోక్ అదాలత్ ద్వారా కక్షిదారుల కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని జిల్లా జడ్జి ఉదయగౌరి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఇరువురు కక్షిదారుల మధ్య సామరస్యపూర్వకంగా రాజీ కుదిర్చి సమస్యలను పరిష్కరించారు. మొత్తం జిల్లావ్యాప్తంగా 154 కేసుల్లో రాజీ కుదిరింది. అందులో 129 క్రిమినల్ కేసులు, 23 సివిల్ కేసులు, మూడు ప్రిలిటిగేషన్ కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ, కక్షిదారులు కోర్టుల చుట్టూ నెలల తరబడి తిరగకుండా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో కక్షిదారులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి అరుణసారిక, మేజిస్ట్రేట్లు మేరిసార దానమ్మ, భారతి, రాజ్‌కుమార్, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ జ్ఞానేశ్వర్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
సివిల్ కేసులంటే..!
పాలకోడేరు రూరల్ : సివిల్ కేసులు అంటే ఏమిటీ, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి. కేసు ఎలా పెట్టాలి. న్యాయ సహాయం ఎలా పొందాలి వంటి విషయాలు మనలో చాలామందికి తెలియదు. ఈ అంశాలను ఓ సారి పరిశీలిస్తే.. ఎలాంటి సివిల్ కేసులవుతాయి? ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన సమస్యలు సివిల్ కేసుల పరిధిలోకి వస్తాయి. ఉదాహరణకు మన ఆస్తులను ఇతరులు ఆక్రమించుకుని ఇబ్బంది పెడుతుంటే, ప్రామిసరీ నోటు హామీతో ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకుంటే సివిల్ కేసులు దాఖలు చేయవచ్చు. పోలీసులకు సంబంధం లేదు ఈ సివిల్ కేసులతో పోలీసులకు సంబంధం ఉండదు. వీటిని కోర్టులో సీపీసీ (సివిల్ ప్రొసీజర్ కోడ్) ప్రకారం నేరుగా గానీ లేదా న్యాయవాది ద్వారా గానీ బాధితులు దాఖలు చేయాలి. సివిల్ కేసులను పోలీసులు అసలు పట్టంచుకోరు. ఒకవేళ సివిల్ తగాదాల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగితే మాత్రం పోలీసులు జోక్యం చేసుకుంటారు. నేర తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటారు. కోర్టు ద్వారానే అరెస్టులు సివిల్ కేసుల విచారణ కోర్టు పరిధిలోనే జరుగుతుంది. నిందితులు కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలి. వారు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే కోర్టు వారి అరెస్టుకు పోలీసులను ఆదేశిస్తుంది. ఉచితంగా న్యాయ సాయం సివిల్ కేసులో ఉచిత న్యాయ సాయం పొందే అవకాశాన్ని కోర్టులు కల్పిస్తాయి. కోర్టులో న్యాయవాదిని పెట్టుకోవడానికి స్తోమత లేనివారు ఉచితంగా ప్రభుత్వ న్యాయవాది ద్వారా సివిల్ కేసు వేసుకోవచ్చు. -
తెలంగాణలో 3.44 లక్షల పెండింగ్ కేసులు
- క్రిమినల్ కేసులదే అగ్రస్థానం - అత్యధిక కేసుల్లో హైదరాబాద్ తొలిస్థానం - రంగారెడ్డి జిల్లాలో సివిల్ కేసులు అధికం - చివరిస్థానంలో నల్లగొండ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలోని వివిధ న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసుల లెక్కలు తేలాయి. తెలంగాణలో ఉన్న మొత్తం 10 జిల్లాల్లోని అన్ని రకాల న్యాయస్థానాల్లో ఈ నెల 2 వరకు అక్షరాలా 3,44,862 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో క్రిమినల్ కేసులదే మొదటిస్థానం. క్రిమినల్ కేసులు 1,85,127 పెండింగ్‌లో ఉంటే, 1,59,583 సివిల్ కేసులున్నాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 85,132 కేసులు పెం డింగ్‌లో ఉన్నాయి. ఇందులో క్రిమినల్ కేసులే అత్యధికంగా ఉండటం గమనార్హం. ఈ జిల్లాలో 46,009 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నా యి. అత్యల్పంగా నల్లగొండ జిల్లాలో 11,755 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. క్రిమినల్ కేసుల్లోనూ ఈ జిల్లాదే చివరి స్థానం. క్రిమినల్ కేసుల పెండింగ్‌లో హైదరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అత్యధికంగా జరిగే రంగారెడ్డి జిల్లాలో సివిల్ కేసులే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ జిల్లాలో 39,652 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక అన్ని జిల్లాల్లో కలిపి మహిళలు దాఖలు చేసిన 40,152 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో సివిల్ కేసులే అత్యధికం. మహిళలు దాఖలు చేసిన కేసులు పెండింగ్‌లో ఉన్న జిల్లాల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 10 జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఖాళీలతో సహా మొత్తం 291 న్యాయాధికారులున్నారు. -
డిసెంబర్ 6 తేదిన మెగా లోక్ అదాలత్!
హైదరాబాద్: లోక్ అదాలత్ లో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహరెడ్డి అన్నారు. మెగా లోక్ అదాలత్ పై జస్టిస్ నరసింహరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 6 తేదిన లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. సివిల్ కేసులను కూడా లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు. కేసుల సంఖ్యను బట్టి అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ ఉంటుందని ఆయన తెలిపారు. గత ఏడాది నిర్వహించిన లోక్ అదాలత్ లో 1.11 లక్షల కేసులు పరిష్కారం అయ్యాయని జస్టిస్ నర్సింహరెడ్డి తెలిపారు. ఎఫ్ఐఆర్ దశలో ఉన్న కేసులను మెగా లోక్ అదాలత్ లో పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. ఏపీలో 10 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని జస్టిస్ నర్సింహరెడ్డి వెల్లడించారు. -
సివిల్ ‘సెటిల్’మెంట్లు
సాక్షి, ఒంగోలు: ‘ఎవరేమంటే మాకేమీ.. అధికారం వ చేతుల్లో ఉంది. మేం ఏ చెబితే అదే.. పిల్లిని కుక్కంటాం.. కుక్కని పిల్లంటాం. ఎవరెదురు చెప్తారు?’ అన్నట్లు ఉంది సివిల్ వ్యవహారాల్లో కొంతమంది పోలీసు అధికారుల తీరు. ‘ఇచ్చట సివిల్ కేసులు పరిష్కరించబడవు’ అంటూ తాటికాయంత అక్షరాలతో పోలీస్‌స్టేషన్‌లో బోర్డులు వేలాడుతుంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సివిల్ కేసులను పరిష్కరించవద్దని ఉన్నతాధికారుల ఆదేశాలు సైతం ఉన్నాయి. అయినా సరే మేమింతే.. అన్నట్లుగా జిల్లాలోని పలువురు స్టేషన్ హౌస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో పోలీస్ ఠాణాల్లో పేదవారికి ఒక న్యాయం, పెద్ద వారికి మరో న్యాయం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కొన్ని వ్యవహారాల్లో సంబంధిత ఎస్‌హెచ్‌వోలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. ఒంగోలు నగరంలోని పోలీస్స్టేషన్లలో సివిల్ పంచాయతీలు, కేసులు నమోదు చేయకుండా ‘రాజీ’లతో సరిపెడుతున్నారు. నగరంలోని ఒక పోలీస్‌స్టేషన్‌లో అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నేత జోక్యం లేనిదే పని కాదు అని బాధితులు వాపోతున్నారు. ఇటీవల జిల్లాలోని ఒక ఎస్సై ఏకంగా 45 కేసుల్లో ఇరువర్గాలకు రాజీ కుదిర్చి ఏ మాత్రం కేసులు నమోదు చేయకపోవడంతో పోలీసు బాస్ ఆగ్రహానికి గురయ్యారు. వీఆర్‌లో ఉంటూ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పోలీసు పరేడ్ గ్రౌండ్‌కి పరుగులు పెట్టాడు. నగరానికి చెందిన ఒక పోలీసు అధికారి ఓ కేసును నమోదు చేయకపోవడమే కాకుండా ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. అయితే సదరు కేసును దర్యాప్తు చేయాల్సింది మాత్రం ఆయన పై అధికారే. ఇది తెలిసినా.. అసలు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లక పోగా.. ఒక వర్గానికి చెందిన వ్యక్తి నుంచి మరొకరికి రూ.50 వేలు చెల్లించేలా తీర్పునిచ్చారు. ఇక సదరు అధికారికి, పోలీస్‌స్టేషన్‌కు ఇవ్వాల్సిన మొత్తం మామూలే. కేసుకు సంబంధించిన వివరాలివీ.. నగరంలోని ఓ అపార్టుమెంట్‌కు వాచ్‌మెన్‌గా ఉన్న ఒక వ్యక్తి కొండముచ్చును పెంచుకుంటున్నాడు. అయితే ఆ కొండముచ్చు.. పక్కింట్లో ఉండే ఒక ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్‌కి చెందిన పూలమొక్కలను ధ్వంసం చేస్తోంది. ఈ నేపథ్యంలో సదరు ప్రొఫెసర్ వాచ్‌మెన్‌ను గట్టిగా ప్రశ్నించాడు. ఈ విషయంలో ఘర్షణ పెరగడంతో ఇరువర్గాల వారు పోలీసులను ఆశ్రయించారు. వాచ్మెన్ మాత్రం తనను ప్రొఫెసర్ కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేయగా, తనపై వాచ్మెన్ దాడికి పాల్పడ్డాడని ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు కాకుండా ఉండేందుకు.. వాచ్‌మెన్‌కు ప్రొఫెసర్ నుంచి రూ.50 వేలను ఇప్పించారు. ఇది ఉన్నతాధికారుల దృష్టికెళ్లింది. నగరంలోని మరో పోలీస్ అధికారి తన స్టేషన్లో తరచూ సివిల్ పంచాయతీలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ స్థానిక నేతను మధ్యవర్తిగా ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తాజాగా శివప్రసాద్ కాలనీకి చెందిన ఓ యువకుడిపై గోపాల్‌నగర్‌కు చెందిన ఫైనాన్షియర్ నగదు లావాదేవీల విషయమై ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వ్యవహారంలో ఆ యువకుడు చేసిన నేరం పెద్దగా లేనప్పటికీ సదరు కాంగ్రెస్ పార్టీ నేత మధ్యవర్తిత్వంతో రూ.50 వేలకు బేరం కుదిరినట్లు సమాచారం. ఈ విధంగా పోలీస్స్టేషన్లలో అవినీతి రాజ్యమేలుతోంది. దీనికి ముగింపు ఎప్పుడో ఉన్నతాధికారులే చెప్పాలి.