పాలకోడేరు రూరల్ :
సివిల్ కేసులు అంటే ఏమిటీ, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి.
కేసు ఎలా పెట్టాలి. న్యాయ సహాయం ఎలా పొందాలి వంటి విషయాలు
మనలో చాలామందికి తెలియదు. ఈ అంశాలను ఓ సారి పరిశీలిస్తే..
ఎలాంటి సివిల్ కేసులవుతాయి?
ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన సమస్యలు సివిల్ కేసుల పరిధిలోకి వస్తాయి. ఉదాహరణకు మన ఆస్తులను ఇతరులు ఆక్రమించుకుని ఇబ్బంది పెడుతుంటే, ప్రామిసరీ నోటు హామీతో ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకుంటే సివిల్ కేసులు దాఖలు చేయవచ్చు.
పోలీసులకు సంబంధం లేదు
ఈ సివిల్ కేసులతో పోలీసులకు సంబంధం ఉండదు. వీటిని కోర్టులో సీపీసీ (సివిల్ ప్రొసీజర్ కోడ్) ప్రకారం నేరుగా గానీ లేదా న్యాయవాది ద్వారా గానీ బాధితులు దాఖలు చేయాలి. సివిల్ కేసులను పోలీసులు అసలు పట్టంచుకోరు. ఒకవేళ సివిల్ తగాదాల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగితే మాత్రం పోలీసులు జోక్యం చేసుకుంటారు. నేర తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటారు.
కోర్టు ద్వారానే అరెస్టులు
సివిల్ కేసుల విచారణ కోర్టు పరిధిలోనే జరుగుతుంది. నిందితులు కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలి. వారు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే కోర్టు వారి అరెస్టుకు పోలీసులను ఆదేశిస్తుంది.
ఉచితంగా న్యాయ సాయం సివిల్ కేసులో ఉచిత న్యాయ
సాయం పొందే అవకాశాన్ని కోర్టులు కల్పిస్తాయి. కోర్టులో న్యాయవాదిని పెట్టుకోవడానికి స్తోమత లేనివారు ఉచితంగా ప్రభుత్వ న్యాయవాది ద్వారా సివిల్ కేసు వేసుకోవచ్చు.
సివిల్ కేసులంటే..!
Published Sun, Feb 21 2016 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM
Advertisement
Advertisement