
‘‘నా కెరీర్‌లో ఎప్పుడూ దయచేసి ఓ సినిమా చూడండి అని అడగలేదు. కానీ ‘కోర్టు’( Court Movie) లాంటి మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు మిస్ కాకూడదని చెబుతున్నాను.. అందరూ చూడాలని బతిమాలుతున్నాను’’ అని హీరో నాని(Nani ) చెప్పారు. ప్రియదర్శి ప్రధాన ΄ాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్టు’. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, ఇంద్రగంటి మోహన కృష్ణ, దేవ కట్టా అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ–‘‘కోర్టు’ సినిమాకి వెళ్లాక నా మాటలు మీ అంచనాలకి సరిపోలేదనిపిస్తే... రెండు నెలల్లో రిలీజ్ అవుతున్న నా ‘హిట్ 3’ సినిమాని ఎవరూ చూడొద్దు’’ అని కోరారు.
‘‘బలగం’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ‘కోర్టు’ చేయమని నాని అన్న చెప్పారు’’ అని ప్రియదర్శి తెలిపారు. ‘‘ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నాగ్ అశ్విన్, శ్రీకాంత్ ఓదెల. ‘‘నానీగారు వాల్ పోస్టర్ సినిమా ద్వారా నన్ను డైరెక్టర్‌గా పరిచయం చేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలి’’ అని ప్రశాంత్ వర్మ ఆకాంక్షించారు.
‘‘కోర్టు’ ట్రైలర్ చూశాక సినిమా అద్భుతంగా వచ్చిందనిపిస్తోంది’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘ఈ సినిమాని ఆడియన్స్ సెలబ్రేట్ చేసుకుంటారని భావిస్తున్నాను’’ అని దేవ కట్టా తెలిపారు. ‘‘కోర్టు’ చాలా అందమైన సినిమా’’ అన్నారు నిర్మాత దీప్తి. ‘‘కోర్టు’ మనందరికీ జీవితం. అందరూ థియేటర్స్‌కి రండి’’ అన్నారు రామ్ జగదీశ్.
‘‘ఈ సినిమా ప్రోమోస్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. అందరూ థియేటర్స్‌లో చూడాలి’’ అన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. నటీనటులు శ్రీదేవి, రోహిణి, సురభి ప్రభావతి, హర్ష రోషన్, శ్రీనివాస్ భోగిరెడ్డి, శివాజీ, డైరెక్టర్ శౌర్యువ్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్, లిరిక్ రైటర్ పూర్ణాచారి తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment