
సాక్షి,నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు తారస్థాయికి చేరుకున్నాయి. కొలిమిగుండ్ల మండలం చింత లాయపల్లె గ్రామంలో టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగారు. చీనితోటను జేసీబీతో నాశనం చేశారు. అయితే, చీనితోటను నాశనం చేయొద్దంటూ అడ్డుపడిన మహిళలపై కట్టెలు, రాళ్లతో దాడులకు దిగారు. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలు,ఓ బాలిక తీవ్రంగా గాయపడ్డారు.
అయితే, ఈ చీనితోట పంటవేసిన మూడు ఎకరాల పొలంపై కోర్టులో కేసు నడుస్తోంది. కేసు విచారణ కొనసాగుతుండగా సివిల్ కేసులో కొలిమిగుండ్ల సీఐ రమేష్ జోక్యం చేసుకున్నారు. ఆ పొలాన్ని టీడీపీ వర్గీయులకు అప్పగించాలంటూ సదరు పొలం యజమానిపై ఒత్తిడి తెచ్చారు. అయినా బాధితులు తలొగ్గక పోవడంతో కొలిమిగుండ్ల పోలీసులు దాడికి ఉసిగొల్పాడు.
ఇక టీడీపీ నేతల దాడిలో బనగానపల్లె ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితుల్ని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరామర్శించారు. బాధితులకు వైఎస్సార్‌సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Comments
Please login to add a commentAdd a comment