డిసెంబర్ 6 తేదిన మెగా లోక్ అదాలత్! | Mega lok adalat on December 6th | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 6 తేదిన మెగా లోక్ అదాలత్!

Published Fri, Oct 17 2014 6:34 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

Mega lok adalat on December 6th

హైదరాబాద్: లోక్ అదాలత్ లో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహరెడ్డి అన్నారు. మెగా లోక్ అదాలత్ పై జస్టిస్ నరసింహరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 6 తేదిన లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.
 
సివిల్ కేసులను కూడా లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు. కేసుల సంఖ్యను బట్టి అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ ఉంటుందని ఆయన తెలిపారు. 
 
గత ఏడాది నిర్వహించిన లోక్ అదాలత్ లో 1.11 లక్షల కేసులు పరిష్కారం అయ్యాయని జస్టిస్ నర్సింహరెడ్డి తెలిపారు. ఎఫ్ఐఆర్ దశలో ఉన్న కేసులను మెగా లోక్ అదాలత్ లో పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. ఏపీలో 10 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని జస్టిస్ నర్సింహరెడ్డి వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement