వెంటనే కేసీఆర్‌ను అరెస్ట్ చేసి విద్యుత్ కొనుగోలు అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి
తప్పిదాలను ఈఆర్సీపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్/ ఢిల్లీ: చట్టబద్ధ విచారణ కమిషన్‌నే తప్పుపట్టేలా, కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి వైదొలగాలని మాజీ సీఎం కేసీఆర్ ఇచి్చన రాతపూర్వక వివరణ, బెదిరింపులతో కూడిన లేఖ ముమ్మాటికీ ధిక్కరణకు నిదర్శనమ ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కమిషన్ నోటీసులకు వివరణ ఇస్తే సరిపోయేదని, అందుకు భిన్నంగా కమిషన్ నియామకాన్ని తప్పుబట్టి చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగాలంటూ సూచించడం దారుణమన్నారు.
‘ఇది ముమ్మాటికీ ధిక్కరణ కిందకే వస్తుంది. తక్షణమే కేసీఆర్‌ని అరెస్ట్ చేసి విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన అవస రం ఉంది’ అని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కేసీఆర్‌తో సహా విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం, గొర్రెల పంపిణీ స్కాంలలో అవినీతికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయడంతోపాటు వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు.
సీఎంగా పనిచేసిన కేసీఆర్‌కు రాష్ట్ర ప్రభు త్వం నియమించిన కమిషన్‌కు కనీస గౌర వం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకపోవడం శోచనీయమన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కమిషన్ ఏర్పాటే తప్పు అని అనుకుంటే...దీనిపై ముందే కేసీఆర్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
అత్యున్నత న్యాయస్థానం చీవాట్లు మరిచారా?
తెలంగాణ ఉద్యమ సమయంలో జస్టిస్ నర్సింహారెడ్డి నిజాయితీ, ధైర్యసాహసాలను కేసీఆర్ ప్రశంసించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన తప్పిదాలను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)పై నెట్టేసి కేసీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నారా అని నిలదీశారు. ‘ఈఆర్సీ నిర్ణయాలను నర్సింహారెడ్డి కమిషన్ ఇంతవరకు ఎక్కడా ప్రశ్నించలేదు. నాటి కేసీఆర్ సర్కార్ విధానపరమైన నిర్ణయాలు, వాటి ఆధారంగా జరిగిన అవి నీతి, అక్రమాలపైనే విచారణ జరుపుతున్నారు తప్ప ఈఆర్సీపై కాదు. ఈ విషయం తెలిసి కూడా కేసీఆర్ తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఈఆర్సీ ని వివాదంలోకి లాగి బదనాం చేయడం సిగ్గు చేటు’అని బండి సంజయ్ మండిపడ్డారు.
తెలంగాణ బిడ్డ జస్టిస్ నర్సింహారెడ్డి అని సంబోధిస్తూనే ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కేసీఆర్ పేర్కొనడం దుర్మార్గమన్నారు. తెలంగాణ ఉద్య మంలో అగ్రభాగాన ఉంటూ ఉస్మానియా వర్సిటీ లో వేసిన ముళ్ల కంచెను తీసివేయాలంటూ పోలీ సులకు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ముద్దు బిడ్డ నర్సింహారెడ్డి అని తెలిపారు. తన తప్పులు, అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ఎందాకైనా వెళతారనే దానికి ఈ ఉదంతం ఒక నిదర్శనమన్నారు.
నాడు ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా... ప్రెస్‌మీట్ నిర్వహించి న్యాయస్థానాలను ప్రభావితం చేసేలా ఇదే తరహాలో ఎదురుదాడి చేసి బీజేపీపై అభాండాలు మోపి రాజకీయ లబ్ధిపొందాలనుకుని భావిస్తే... కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారా ? అంటూ అత్యున్నత న్యాయస్థానం చివాట్లు పెట్టిన సంగతి కేసీఆర్ మర్చిపోయినట్లున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేతల అవినీతి, అక్రమాలపై ఆధారాలున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులను అరెస్ట్ చేయకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటి? అని సంజయ్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment