Sheep distribution
-
జస్టిస్ నర్సింహారెడ్డిని వైదొలగాలనడం ముమ్మాటికీ ధిక్కరణే
సాక్షి, హైదరాబాద్/ ఢిల్లీ: చట్టబద్ధ విచారణ కమిషన్నే తప్పుపట్టేలా, కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి వైదొలగాలని మాజీ సీఎం కేసీఆర్ ఇచి్చన రాతపూర్వక వివరణ, బెదిరింపులతో కూడిన లేఖ ముమ్మాటికీ ధిక్కరణకు నిదర్శనమ ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కమిషన్ నోటీసులకు వివరణ ఇస్తే సరిపోయేదని, అందుకు భిన్నంగా కమిషన్ నియామకాన్ని తప్పుబట్టి చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగాలంటూ సూచించడం దారుణమన్నారు.‘ఇది ముమ్మాటికీ ధిక్కరణ కిందకే వస్తుంది. తక్షణమే కేసీఆర్‌ని అరెస్ట్ చేసి విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన అవస రం ఉంది’ అని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కేసీఆర్‌తో సహా విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం, గొర్రెల పంపిణీ స్కాంలలో అవినీతికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయడంతోపాటు వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు.సీఎంగా పనిచేసిన కేసీఆర్‌కు రాష్ట్ర ప్రభు త్వం నియమించిన కమిషన్‌కు కనీస గౌర వం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకపోవడం శోచనీయమన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కమిషన్ ఏర్పాటే తప్పు అని అనుకుంటే...దీనిపై ముందే కేసీఆర్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానం చీవాట్లు మరిచారా? తెలంగాణ ఉద్యమ సమయంలో జస్టిస్ నర్సింహారెడ్డి నిజాయితీ, ధైర్యసాహసాలను కేసీఆర్ ప్రశంసించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన తప్పిదాలను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)పై నెట్టేసి కేసీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నారా అని నిలదీశారు. ‘ఈఆర్సీ నిర్ణయాలను నర్సింహారెడ్డి కమిషన్ ఇంతవరకు ఎక్కడా ప్రశ్నించలేదు. నాటి కేసీఆర్ సర్కార్ విధానపరమైన నిర్ణయాలు, వాటి ఆధారంగా జరిగిన అవి నీతి, అక్రమాలపైనే విచారణ జరుపుతున్నారు తప్ప ఈఆర్సీపై కాదు. ఈ విషయం తెలిసి కూడా కేసీఆర్ తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఈఆర్సీ ని వివాదంలోకి లాగి బదనాం చేయడం సిగ్గు చేటు’అని బండి సంజయ్ మండిపడ్డారు.తెలంగాణ బిడ్డ జస్టిస్ నర్సింహారెడ్డి అని సంబోధిస్తూనే ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కేసీఆర్ పేర్కొనడం దుర్మార్గమన్నారు. తెలంగాణ ఉద్య మంలో అగ్రభాగాన ఉంటూ ఉస్మానియా వర్సిటీ లో వేసిన ముళ్ల కంచెను తీసివేయాలంటూ పోలీ సులకు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ముద్దు బిడ్డ నర్సింహారెడ్డి అని తెలిపారు. తన తప్పులు, అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ఎందాకైనా వెళతారనే దానికి ఈ ఉదంతం ఒక నిదర్శనమన్నారు.నాడు ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా... ప్రెస్‌మీట్ నిర్వహించి న్యాయస్థానాలను ప్రభావితం చేసేలా ఇదే తరహాలో ఎదురుదాడి చేసి బీజేపీపై అభాండాలు మోపి రాజకీయ లబ్ధిపొందాలనుకుని భావిస్తే... కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారా ? అంటూ అత్యున్నత న్యాయస్థానం చివాట్లు పెట్టిన సంగతి కేసీఆర్ మర్చిపోయినట్లున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలపై ఆధారాలున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులను అరెస్ట్ చేయకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటి? అని సంజయ్ ప్రశ్నించారు. -
‘నగదు’పై ఈడీ ఫోకస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కుంభకోణం కేసుపై సమగ్ర దర్యాప్తునకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా నగదు లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. గొర్రెల పంపిణీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు జరిగిన నిధుల లావాదేవీలు, గొర్రెల పంపిణీ, లబ్ధిదారుల వివరాలు, ఇతర పూర్తి సమాచారం ఇవ్వాలంటూ ఈడీ ఇప్పటికే తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహ కార సంస్థ ఎండీకి లేఖ రాసింది. దీనిని అత్యవసరంగా పరిగణించి వివరాలు ఇవ్వాలని కోరింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 54 కింద ఈడీ అధికారులు ఈ వివరాలను తీసుకోనున్నారు.ఈడీ అధికారులు వస్తారనుకున్నా..గొర్రెల పంపిణీ వ్యవహారం దర్యాప్తు కోసం ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం గొర్రె లు, మేకల సహకార అభివృద్ధి సంస్థకు రాను న్నట్టు ప్రచారం జరిగింది. ఈడీ అధికారులు వస్తున్నట్టు సంస్థ వర్గాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. కానీ కార్యాలయంలో సంస్థ ఎండీ, ఇతర ఉన్నతాధికారులెవరూ అందు బాటులో లేరని, వారు ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇవ్వడానికి వెళ్లారని పేర్కొన్నాయి. పలు అనివార్య కారణాలతోనే ఈడీ అధికారులు రాలేదని తెలిసింది. అధి కారులు ఇచ్చే సమాచారాన్ని విశ్లేషించేందుకు, ఆర్థిక లావాదేవీల్లోని లోపాలను గుర్తించేందు కు ఈడీ ఇప్పటికే ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్టు తెలిసింది. తగిన సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగి, క్షేత్రస్థాయిలో వివ రాలు సేకరించేందుకు ఈడీ అధికారులు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ఏసీబీ కూడా దూకుడుగా..గొర్రెల పంపిణీ వ్యవహారంపై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. సు మారు రూ.700 కోట్ల మేర అవినీతి జరిగినట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కీలక నిందితులుగా భావిస్తున్న రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి ఓఎస్డీ కల్యాణ్ కుమార్‌లను మూడు రోజుల పాటు కస్టడీకి తీ సుకుని విచారించారు.ప్రస్తుతం ఏసీబీ దర్యా ప్తు కీలక దశలో ఉంది. ఈ నేపథ్యంలో ఏసీబీ నుంచి అవసరమైన సమాచారాన్ని కోరాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. ఎంతమేర అవినీతి జరిగింది? సొమ్మును ఎవ రెవరి ఖాతాల్లోకి, ఎలా మళ్లించారు? ఏయే బ్యాంకు ఖాతాల్లోకి అక్రమంగా నిధులు మళ్లా యన్న వివరాలను తేల్చాలని యోచిస్తున్నట్టు సమాచారం. నగదు లావాదేవీలపై ఈడీ ము మ్మర దర్యాప్తు చేపడితే.. ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తాయోనన్న చర్చ జరుగుతోంది. -
గొర్రెలు, చేపల పంపిణీ కథ తేల్చండి
సాక్షి, హైదరాబాద్: గొర్రెలు, చేపల పంపిణీ పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశించారు, లబ్ధిదారుల ఎంపిక, గొర్రెల కొనుగోలు, పంపిణీ జరిగిన తీరుపై దర్యాప్తు చేయాలని స్పష్టం చేశారు. విజిలెన్స్ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో ఏవైనా అవినీతి, అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే, ఆ ఫైలును అవినీతి నిరోధక శాఖకు అప్పగించాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో పశు సంవర్ధక శాఖ, పాడి అభివృద్ధి, మత్స్య శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వివరాలు ఎందుకు సేకరించలేదు? ఇటీవల గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను బినామీ పేర్లతో కొందరు ఉద్యోగులు సొంత ఖాతాలకు మళ్లించుకున్న కేసులో ఏసీబీ దర్యాప్తు గురించి సీఎం మాట్లాడుతూ శాఖాపరంగా వివరాలేమీ సేకరించలేదా అని పశు, మత్స్యశాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో మొదటి విడతకు రూ.3955 కోట్ల రుణం ఇచ్చిన నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) రెండో విడత రుణం ఇవ్వకుండా ఎందుకు నిలిపివేసిందని అధికారులను నిలదీశారు. అప్పటికే ఈ పథకంపై కాగ్ అభ్యంతరాలను లేవనెత్తడం, అవకతవకలను గుర్తించిన నేపథ్యంలోనే ఎన్సీడీసీ రుణం ఇవ్వలేదని అధికారులు బదులిచ్చారు. తమ వాటా కింద 25 శాతం డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు గొర్రెలను ఎందుకు పంపిణీ చేయలేదని సీఎం ప్రశ్నించారు. రెండో విడత కింద 85,488 మంది తమ వాటాగా చెల్లించిన దాదాపు రూ.430 కోట్లు జిల్లా కలెక్టర్ల ఖాతాల్లోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 2,20,792 మంది లబ్ధిదారులు తమ వాటా ఇవ్వలేదన్నారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలు కొనసాగించాలి పాడి రైతులకు ఒక లీటర్‌కు నాలుగు రూపాయల ప్రోత్సాహకాన్ని ఏప్రిల్ నుంచి మళ్లీ ప్రారంభిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం మూడేళ్ల నుంచి ఈ ప్రోత్సాహకాన్ని నిలిపివేసిందని, ఆ మొత్తం బకాయిలు రూ.203 కోట్లు పేరుకుపోయాయని అధికారులు తెలిపారు. ప్రతి నెలా గ్రీన్ చానల్ ద్వారా ఈ ప్రోత్సాహకాలు చెల్లించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో వెటర్నరీ హాస్పిటల్ తప్పకుండా ఉండాలని, 91 కొత్త మండలాల్లోనూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలను కొనసాగించాలని, అందుకు అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలన్నారు. టీఎస్పీఎస్సీ చేపట్టిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాల్లో ఈ విభాగంలో ఏళ్లతరబడి పని చేస్తున్న వారికి వెయిటేజీ ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలించాలని, వైద్యారోగ్య శాఖలో అమలైన వెయిటేజీ విధానాన్ని ఈ విభాగంలోనూ వర్తించేలా చూడాలని ముఖ్య మంత్రి అధికారులకు సూచించారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి స్పెషల్ సీఎస్ ఆధర్ సిన్హా, డెయిరీ డైరెక్టర్ లక్ష్మి, ఫిషరీస్ డైరెక్టర్ గోపి సమావేశంలో పాల్గొన్నారు. -
గొల్ల, కురుమల అభివృద్ధికి కృషి
నకిరేకల్(నల్లగొండ): గొర్రెల పెంపకం వృత్తి గా జీవిస్తున్న గొల్ల, కురుమల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అర్హులైనవారికి గొర్రె పిల్లల యూనిట్లు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో రెండవ విడత గొర్రెల యూనిట్ల పంపిణీని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తల సాని మాట్లాడుతూ.. గొర్రెల పంపిణీకి రాష్ట్ర బడ్జెట్లో రూ.12వేల కోట్లు ప్రకటించారని తెలిపారు. మొదటివిడతలో 50 శాతం పంపిణీ చేశామన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో రెండో విడత పంపిణీ చేపట్టామన్నారు. మొదట ఒక యూనిట్‌కు రూ.1.25 లక్షలు ఉండగా, రేట్లు పెరిగాయని గ్రహించిన సీఎం కేసీఆర్ ఒక యూనిట్‌కు రూ.1.75 లక్షలకు పెంచి పథకాన్ని కొనసాగించారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.90 కోట్ల గొర్రెలు ఉన్నాయని తలసాని వెల్లడించారు. కాంగ్రెస్‌తో ఒరిగేదేమీ లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఒరిగేదే మీ లేదని మంత్రి తలసాని అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా తెలంగాణ అన్ని రంగా ల్లో వెనుకబడిందన్నారు. తెలంగాణలో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్, సంక్షేమ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి వైపు ఇతర రాష్ట్రాలు చూస్తున్నాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టంకట్టేందుకు ప్రజ లు సిద్ధంగా ఉన్నారన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్య క్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా ఎస్పీ అపూర్వరావు తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 5 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీకి రంగం సిద్ధమైంది. వచ్చే నెల 5వ తేదీ నుంచి రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. గొర్రెల పంపిణీ పథకంపై మంగళవారం డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షాసమావేశంలో గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా, డైరెక్టర్ డాక్టర్. ఎస్.రాంచందర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 5వ తేదీ నుంచి గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, ఈలోగా లబ్ధిదారులను తీసుకెళ్లి గొర్రెలు కొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రూ.500 కోట్లు విడుదల కాగా, గొర్రెల పంపిణీ పథకానికి అవసరమైన నిధులను ఇవ్వడంలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) జాప్యం చేస్తున్న నేపథ్యంలో ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వమే తన ఖజానా నుంచి నిధులను సమకూర్చాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రస్తుతానికి రూ.1000 కోట్ల నిధులను మంజూరు చేసింది. రూ.వెయ్యి కోట్లలో రూ.500 కోట్లకు గాను ఆర్థిక శాఖ బడ్జెట్ విడుదల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో గొర్రెల కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లలో పశుసంవర్ధక శాఖ అధికారులున్నారు. కాగా, రెండో విడత పంపిణీ ప్రక్రియను వచ్చే నెల 5వ తేదీన మంత్రి తలసాని నల్లగొండలో ప్రారంభించనుండగా, అదే రోజున అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రారంభం కానుంది. -
ఉగాది తర్వాత గొర్రెల పంపిణీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రెండో విడత గొర్రెల పంపిణీ ఉగాది, శ్రీరామనవమి పండగల తర్వాత చేపడతామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. గొర్రెల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ పథకం యూనిట్ వ్యయాన్ని కూడా పెంచుతామన్నారు. ఆదివారం సంగారెడ్డిలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం, కురుమ సంఘం భవన నిర్మాణానికి శుంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో హరీశ్‌రావు మాట్లాడుతూ రూ.300 కోట్లతో హైదరాబాద్‌లో గొల్ల, కురుమల ఆత్మగౌరవ భవనం నిర్మిస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వం గొల్ల, కురుమలను వాడుకుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.2 వేల కోట్లతో సరిపెట్టి, బీసీలకు అన్యాయం చేస్తోందని హరీశ్ విమర్శించారు. కురుమ సామాజిక వర్గంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగేవని, కల్యాణలక్ష్మి పథకం అమలు చేసిన తర్వాత ఈ బాల్యవివాహాలు బంద్ అయ్యాయన్నారు. రాష్ట్రంలో గొల్ల, కురమలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక మాజీ మంత్రి రేవన్న సీఎం కేసీఆర్‌ను కలిసి గొంగడి కప్పి అభినందించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఈ విషయంలో రేవన్నకు ఏఐసీసీ నోటీసులు కూడా జారీ చేసిందన్నారు. సభలో ఎంపీలు బీబీపాటిల్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, హెచ్‌డీసీ రాష్ట్ర చైర్మన్ చింతప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గొల్ల కుర్మ సంఘం నేతలు నగేశ్, శ్రీహరి, పాండు తదితరులు పాల్గొన్నారు. -
చేపలు వదిలారు... గొర్రెలెప్పుడో?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అమలుపై ప్రభుత్వ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సమయంలో ఆ నియోజకవర్గంలో హడావుడి చేసి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసిన పశుసంవర్థక శాఖ అధికారులు ఇప్పుడు గప్‌చుప్ కావడం చర్చనీయాంశమైంది. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం అక్కడ 7,200 యూనిట్ల గొర్రెల కోసం లబ్ధిదారులు ఇప్పటికే డీడీలు చెల్లించగా, వారికి గొర్రెలు ఎప్పుడివ్వాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. అసలు ఈసారి గొర్రెల పంపిణీ ఉంటుందా లేదా అన్నదానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదని, తామైతే లబ్ధిదారుల వివరాలను సేకరించామని చెబుతున్నారు. గొర్రెల కొనుగోలుకు అవసరమైన రూ.90 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందో తేలాల్సి ఉంది. ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా..: రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. హుజూర్నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడి లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో గొర్రెలు పంపిణీ చేశారు. అయితే, మునుగోడు విషయంలో ప్రభుత్వం భిన్నంగా ఆలోచిస్తోందనే చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనా మా వల్లనే సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో నియోజకవర్గ ప్రజలకు అందుతున్నాయనే చర్చకు తావులేకుండా ఆచితూ చి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంకా గొర్రెల పంపిణీపై నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే, బుధవా రం మునుగోడు మండలంలోని కిష్టాపూర్ పెద్ద చెరువులో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వ హించింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్, గొర్రెల సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్లు హాజరై అక్కడి చెరువులో చేపపిల్లలను వదిలారు. అలాగే, గొర్రెలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గొర్రెల పంపిణీ త్వరలో జరుగుతుందా? ఈసారి ప్రభుత్వ వ్యూహం ఏంటి? రెండో విడతలో భాగంగా అందరితోపాటే ఈ నియోజకవర్గంలో గొర్రెల పంపిణీ ఉంటుందా? లేదా ఉప ఎన్నిక సమయంలోనే పంపిణీ జరుగుతుందా? అన్నది వేచిచూడాల్సిందే. -
రుణం ఇప్పిస్తామని రూ.8కోట్లకు టోకరా
ఘట్కేసర్: గొర్రెల పంపిణీ సబ్సిడీ రుణం ఇప్పిస్తామని చెప్పి అమా యకుల దగ్గర్నుంచి రూ.8 కోట్లు వసూలు చేసిన ముగ్గురిని ఘట్కేసర్ పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గానికి చెందిన వారికి ప్రభుత్వమిచ్చే సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని చెప్పి కొర్రెముల్ సహాయ పశువైద్యాధికారి సజ్జ శ్రీనివాస్‌రావు, సజ్జ లక్ష్మి, కొల్లి అరవింద్‌కుమార్ గొల్ల, కురుమల దగ్గర రూ.8 కోట్లు వసూలు చేశారు. ఎంతకూవీరు రుణాల ఊసెత్తకపోవడంతో డబ్బులిచ్చిన వారు గట్టిగా నిలదీశారు. దీంతో అప్పట్నుంచి ఈ ముగ్గురూ ఎవరికీ కన్పించకుండా ముఖం చాటేశారు. ఎనిమిది నెలల క్రితం కూకట్ పల్లికి చెందిన బాధితులు ప్రమీలా, జ్యోతి తాము మోసపోయామన్న విషయాన్ని గ్రహించి వీరిపై కూకట్పల్లి పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. శ్రీనివాస్, లక్ష్మి దంపతులు మేడ్చల్‌లో, అరవింద్ కుమార్ రామాంతపూర్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్న పోలీసులు వల పన్ని శుక్రవారం అరెస్టు చేశారు. వీరిని ఎల్బీనగర్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరు పరచగా కోర్టు వీరికి రిమాండ్ విధించింది. కాగా, ఈ కేసులో మరో నిందితుడు సజ్జ శ్రీనివాస్ బావమరిది అనిల్ కుమార్ పరారీలోనే ఉన్నాడు. వీరందరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఎవరైనా బాధితులుంటే ఫిర్యా దు చేయాలని సూచించారు. కేసును ఛేదించిన ఘట్కేçసర్ పీఎస్ సిబ్బందిని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అభినందించారు. -
మనీ లేదాయె.. ‘మంద’ రాదాయె!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ఓ ప్రహసనంగా మారింది. బాలారిష్టాలు, అవినీతి ఆరోపణలు, రీసైక్లింగ్ విమర్శల నడుమ మొదటి విడత గొర్రెల పంపిణీ జరగ్గా, రెండో విడత పంపిణీకి నిధుల లేమి అడ్డంకిగా ఉంది. మొదటి విడతలో నాలుగేళ్లపాటు జాప్యం చేసి 3.8 లక్షల యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయగా, రెండో విడత గొర్రెల పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా అర్థంకాని పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో 3.6 లక్షల యూనిట్లను మంజూరు చేసేందుకు అవసరమయ్యే రూ. 6 వేల కోట్లను రుణం కింద ఇవ్వా లని జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్సీడీసీ)కు 4 నెలల క్రితమే రాష్ట్ర గొర్రెల సమాఖ్య లేఖ రాసినా ఇప్పటివరకు అతీగతీ లేదు. అసలు రుణం వస్తుందో లేదో కూడా అర్థం కాని దుస్థితి. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో గొర్రెల పంపిణీకి రూ.1,000 కోట్లు కేటాయించడం గమనార్హం. సమావేశం జరగలేదట! వాస్తవానికి, హుజూరాబాద్ ఉప ఎన్నికల కంటే ముందే రెండో విడత గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 3.6 లక్షల యూనిట్ల పంపిణీకి గొర్రెలు, మేకలు పెంపకందారుల సమాఖ్యకు అనుమతినిచ్చింది. కానీ, ఇప్పటివరకు కేవలం హుజూరాబాద్ నియోజకవర్గంలో పంపిణీ చేసిన 3–4 వేల యూనిట్లు తప్పితే అదనంగా ఒక్క గొర్రెనూ పంపిణీ చేయలేదు. ఇందుకు ఎన్సీడీసీ రుణమే అవరోధంగా మారిందనే చర్చ జరుగుతోంది. ఎన్సీడీసీ బోర్డు సమావేశం జరగనందునే ఇంకా రుణం మంజూరు కావడం లేదని అధికారులు పైకి చెపుతున్నా.. ఆ రుణం మంజూరు లో ఎక్కడో తకరారు జరిగిందనే వాదన కూడా ఉంది. పెండింగ్‌కు ఎప్పుడు మోక్షం రెండో విడత అటుంచితే మొదటి విడతలో పెండింగ్‌లో ఉన్న యూనిట్లను కూడా ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. ఇందులో 21 గొర్రెలు ఒక యూనిట్‌గా లబ్ధిదారులకు ఇచ్చే యూనిట్ ధర రూ.1.25లక్షలు ఉండగా, దాన్ని గత ఏడాది రూ.1.75లక్షలకు పెంచారు. అంటే లబ్ధిదారుల వాటా కింద చెల్లించాల్సిన రూ.31,250కి తోడు అదనంగా రూ.12,500 చెల్లించాల్సి వచ్చింది. నాలుగేళ్ల క్రితమే డీడీలు కట్టినా ప్రభు త్వ జాప్యం వల్లనే తమకు గొర్రెలు రాలేదని, అందువల్ల ఆ అదనపు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని లబ్ధిదారులు అప్పట్లో కోరారు. కానీ, గొర్రెల సమాఖ్య ఒప్పుకోలేదు. రుణ నిబంధనలు అంగీకరించవంటూ అదనపు వాటానూ కట్టించుకున్నారు. కానీ, అదనపు వాటా కట్టిన 28 వేల మం దికి పైగా లబ్ధిదారుల్లో 2 వేల మందికి ఇప్పటివరకు గొర్రెల పంపిణీ చేయలేదు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలానికి చెందిన గొర్రెల పెంపకందారులు అదనపు వాటా చెల్లించి రెండు నెలలైనా ఎదురుచూపులు తప్పలేదు. రూ. 500 కోట్లు చేతులు మారాయి మొదటి విడత గొర్రెల పంపిణీలో అవినీతి ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. హైదరాబాద్‌లోని పశుసంవర్థక శాఖ ప్రధాన కార్యాలయంలోని ఓ కీలక వ్యక్తి కనుసన్నల్లోనే వ్యవహారమంతా సాగిందని, యూనిట్‌కు రేటు పెట్టి కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. రూ.4 వేల కోట్ల వ్యయంతో సాగిన పంపిణీలో రూ.500 కోట్ల వరకు చేతులు మారాయనే చర్చ పశుసంవర్థక శాఖలో బహిరంగ రహస్యమే కావడం గమనార్హం. పంపిణీ కోసం దళారులు యూనియన్లుగా మారి ఒకచోట సమావేశమయ్యేంత స్థాయిలో అవినీతి జరిగిందని సమాచారం. ఇక, ఆ తర్వాత ఓ ప్రైవేటు సంస్థకు గొర్రెలను ఎంపిక చేసే కాంట్రాక్టును కట్టబెట్టినా.. దీనిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆ సంస్థను తప్పించారు. క్షేత్రస్థాయిలోని పశువైద్యుల మొదలు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు ముడుపులు ముట్టాయనే ఆరోపణలున్నాయి. అధికారులు కొన్నిచోట్ల లబ్ధిదారులకు గొర్రెలు ఇవ్వకుండా రూ.60–70 వేల వరకు డబ్బులిచ్చి అవకతవకలకు పాల్పడినట్లు కూడా వినిపిస్తోంది. నగదు బదిలీనే పరిష్కారం గొర్రెల పంపిణీలో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తుందని పథకం మార్గదర్శకాల్లో పెట్టారు. కానీ, ఒక్కరోజు కూడా సీఎంవో సమీక్షించలేదు. అసలు దళారులను ఎవరు ప్రోత్సహిస్తున్నారో తేల్చాలి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే గొల్ల, కుర్మలకు నగదు బదిలీ చేసి.. నచ్చిన చోట గొర్రెలు కొనుక్కునే అవకాశమివ్వాలి. ఆ తర్వాత ఆరునెలల్లో ఎప్పుడైనా తనిఖీ చేసి దుర్వినియోగం చేసినట్టు తేలితే వారిపై చర్యలు తీసుకోవాలి. మొదటి విడత పెండింగ్ యూనిట్లను పంపిణీ చేసి, బడ్జెట్లో పెట్టిన రూ.1,000 కోట్ల నిధులతో రెండో విడత పంపిణీని కూడా త్వరగా చేపట్టాలి. – ఉడుత రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం -
రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.6 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అవిరామ కృషితో రాష్ట్రంలో సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు వస్తున్నాయని.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇప్పటికే గొర్రెల పంపిణీ, చేపల పెంపకం వంటి పథకాలు అద్భుతాలను నమోదు చేశాయని చెప్పారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ‘వృత్తి కులాలైన బీసీ వర్గాల అభ్యున్నతి– ప్రభుత్వ కార్యాచరణ– రెండో విడత గొర్రెల పంపిణీ’అంశాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బీసీలను అన్నిరంగాల్లో ఆదుకోవడానికి ప్రణాళికలు రచించి, అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీసీల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. ‘‘ప్ర భుత్వ చర్యలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతోంది. కులవృ త్తులను మరింతగా ప్రోత్సహిస్తాం. ఒకనాడు బ్రా హ్మణులతో సమానంగా గౌరవం పొందిన పద్మ శాలి వర్గం సమైక్య పాలనలో ఆకలిచావులకు, ఆత్మహత్యలకు బలైపోయింది. ప్రభుత్వ చిత్తశుద్ధి, మంత్రి కేటీఆర్ కార్యదక్షతతో చేనేత వృత్తి సాధారణ స్థితికి చేరుకుంది. ప్రభుత్వం వారితోపాటు గౌడలు, నాయీ బ్రాహ్మ ణులు, రజక, ఇతర వృత్తికులాల అభ్యున్నతికి వినూత్న పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి పథాన నడిపిస్తున్నది’’అని పేర్కొన్నారు. గొర్రెల సంపత్తిలో నంబర్‌వన్ గొర్రెల సంపత్తిలో తెలంగాణ రాజస్థాన్‌ను అధిగమించి దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరుకుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీకి నిధులు సమకూర్చాలని ఆర్థిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ‘‘రూ.5 వేలకోట్లతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీ అద్భుత ఫలితాలిచ్చింది. రెండో విడత పంపిణీ కోసం మరో రూ.6 వేల కోట్లను కేటాయిస్తున్నాం. ఇప్పుడు ఇస్తున్నట్టుగానే (ఒక యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు) పంపిణీ కొనసాగించాలి. యూనిట్ ధరను రూ.1.75 లక్షలకు పెంచుతున్నాం. ఇప్పటికే డీడీలు కట్టిన 14 వేల మందికీ ఈ పెంపును వర్తింపజేస్తాం’’అని తెలిపారు. మత్స్యశాఖ ద్వారానే చేపల పెంపకం సముద్రతీరానికి దూరంగా ఉన్న పట్టణాలు, నగరాలకు చేపలు ఎగుమతి చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ చెరువుల్లో చేపల ఉత్పత్తి మత్స్యశాఖ పర్యవేక్షణలోనే ఉంటుందని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండి, అర్హులైన యువకులకు చేపల పెంపకాల సొసైటీల్లో అవకాశం కల్పించాలని ఆదేశించారు. రెండో విడతలో 3.81 లక్షల యూనిట్లు: మంత్రి తలసాని రెండో విడతలో భాగంగా 3.81 లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేస్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు రూ.6 వేల కోట్లు మంజూరు చేయడంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. లక్షలాది మంది గొల్లకుర్మలు కేసీఆర్‌కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. త్వరలోనే గొర్రెల పంపిణీని పెద్ద ఎత్తున ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8,109 గొర్రెల పెంపకందారుల సొసైటీల్లోని 7,61,898 మందికి సబ్సిడీ గొర్రెలు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తలసాని తెలిపారు. మొదటివిడతలో రూ.4,702.78 కోట్లతో 3,76,223 యూనిట్లను పంపిణీ చేశామని.. వాటితో 1.37 కోట్ల గొర్రెపిల్లలు జన్మించాయని, గొల్లకుర్మలకు రూ.6,850 కోట్ల మేర ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గొర్రెల యూనిట్ మొత్తాన్ని రూ.1.75 లక్షలకు పెంచారని.. ఈ మేరకు లబ్ధిదారులు తమ వాటాగా రూ.43,750 చొప్పున డీడీలు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. -
రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.6 వేల కోట్లు: సీఎం కేసీఆర్
-
రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.6 వేల కోట్లు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీపై సీఎం.. ప్రగతి భవన్లో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.రెండో విడత పంపిణీకి రూ.6వేల కోట్లు కేటాయిస్తునట్లు సీఎం వెల్లడించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా రూ. 5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేపట్టామని పేర్కొన్నారు. కుల వృత్తులను ఒక్కొక్కటిగా గాడిన పెడుతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. -
'జగనన్న జీవక్రాంతి' పథకం ప్రారంభం
-
మహిళలకు మెరుగైన జీవనోపాధే లక్ష్యంగా..
ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది.. అక్క చెల్లెమ్మలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది.. వారి ముఖాల్లో సంతోషం ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుంది.. ఆ అక్క చెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటాను మరోసారి భరోసా ఇస్తున్నాను.. అక్క చెల్లెమ్మలు చేపట్టబోయే వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లాలి.. వారికి ఇంకా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను.. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఇన్నాళ్లూ నిర్లక్ష్యం.. వాటిని బాగు చేయాలని గత ప్రభుత్వాలు ఏనాడూ భావించలేదు.. చిత్తశుద్ధితో పథకాలు చేపడితే ఎలా ఉంటాయన్న దానికి ఉదాహరణే ఇప్పుడు మనం అమలు చేస్తున్న పథకాలు.. సాక్షి, అమరావతి : వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల్లో అక్క చెల్లెమ్మలకు స్వయం ఉపాధి కల్పించే దిశలో చేపట్టిన మేకలు, గొర్రెల పంపిణీ ‘జగనన్న జీవక్రాంతి’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మేలు జాతికి చెందిన 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టగా, మొత్తం రూ.1869 కోట్ల వ్యయంతో పథకం అమలు చేస్తున్నారు. కార్యక్రమం ప్రారంభంలో వైఎస్ జగన్‌కు గొంగడి కప్పి, తాటి ఆకులతో రూపొందించిన గొడుగు, మేక పిల్లను లబ్ధిదారులు బహుకరించారు. అవి ఆదాయం కల్పించే వనరులు: – జగనన్న జీవక్రాంతి పథకం అత్యంత తృప్తి ఇచ్చే పథకాల్లో ఇది ఒకటి. – వ్యవసాయంతో పాటు, మేకలు, పశువులు, కోళ్లు, చేపల సాగు వంటివి చేపడితే రైతుల కుటుంబాలకు ఎంతో అండగా ఉంటుంది. – కరవు, కాటకాలు వచ్చినా అవి ఆదుకుంటాయి. రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు అదనంగా ఆదాయం కల్పించే వనరులు అవి. – గత ప్రభుత్వాలు ఏనాడూ వ్యవసాయ అనుబంధ రంగాలను బాగు చేయాలని భావించలేదు. మరి మన ప్రభుత్వ హయాంలో: – చిత్తశుద్ధితో పథకాలు చేపడితే ఎలా ఉంటాయన్న దానికి ఉదాహరణ. – అమూల్‌తో ఒప్పందం తర్వాత 4.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెల పంపిణీ, అంటే ఒక ఆవు దూడ లేదా కడుపుతో ఉన్న గేదె పంపిణీ. – ఇవాళ 2.49 లక్షల యూనిట్ల మేకలు, గొర్రెలు పంపిణీకి ఇవాళ శ్రీకారం. – ఒక్కో యూనిట్లో 15 మేకలు లేదా గొర్రెలు. వాటిలో 14 ఆడవి కాగా, ఒకటి మగది (మేకపోతు లేదా పొట్టేలు). ఇవన్నీ ఎందుకంటే..: – గ్రామీణ ప్రాంతాల్లో చేయూత, ఆసరా కింద ఊరికే సహాయం చేయడం కాకుండా, ఆ డబ్బులతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలు వ్యాపారం చేసుకునేలా ప్రయత్నం. – దాని వల్ల అదే గ్రామంలో వారికి ఉపాధి కల్పించడంతో పాటు, ఆదాయ వనరు ఏర్పర్చినట్లు అవుతుంది. – దాని వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెమ్మల జీవితాలు మారుతాయి. – చేయూత పథకంలో ఏటా రూ.18,750 చొప్పున 4 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు ఇవ్వడంతో పాటు, వారిని చేయి పట్టుకుని నడిపిస్తే బాగుంటుందని, ఒక తమ్ముడిగా, అన్నగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఈ అడుగులు ముందుకు పడుతున్నాయి. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు: – ఇవాళ 2.49 లక్షల యూనిట్లను దాదాపు రూ.1869 కోట్ల వ్యయంతో పథకం. – 4.69 యూనిట్లు ఆవులు, గేదెల పంపిణీకి రూ.3500 కోట్లకు పైగా వ్యయం. – రెండూ కలిపి దాదాపు రూ.5500 కోట్ల వ్యయంతో అక్క చెల్లెమ్మల జీవితాలు మార్చే ప్రయత్నం. – 2,11,780 ఆవుల యూనిట్లు, 2,57,211 గేదెల యూనిట్ల పంపిణీని వారం క్రితం ప్రారంభించాం. – పథకం ప్రారంభం రోజున 7 వేల యూనిట్లు పంపిణీ చేశాం. వచ్చే ఫిబ్రవరి నాటికి లక్ష యూనిట్లు, ఆ తర్వాత ఆగస్టు నుంచి మళ్లీ ఫిబ్రవరీ (2022) వరకు 3.69 లక్షల యూనిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. – ఆ విధంగా దాదాపు 4.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెలు పంపిణీ జరుగుతుంది. – గొర్రెల యూనిట్లు 1,51,671 ఇంకా 97,480 మేకల యూనిట్లు పంపిణీకి షెడ్యూల్ ఇచ్చాం. – 5 నుంచి 6 నెలల వయసున్న 14 మేక పిల్లలు, ఒక పొట్టేలు లేదా మేకపోతు ఇస్తాం. తొలి దశలో వచ్చే మార్చి చివరి నాటికి 20 వేల యూనిట్లు పంపిణీ. – రెండో విడతలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 1.30 లక్షల యూనిట్లు మూడో సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు 99 వేల యూనిట్లు పంపిణీ. – ఆ విధంగా దాదాపు 40 లక్షల మేకలు, గొర్రెలు. ఎక్కడెక్కడి నుంచో సేకరించాల్సి వస్తోంది. అందుకే మూడు దశల్లో కార్యక్రమం అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు: – రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అక్క చెల్లెమ్మల జీవితాలలో వెలుగులు తీసుకు వచ్చేందుకు ఏడాదిన్నరగా ఎన్నో పథకాలు అమలు చేశామంటూ వాటి ప్రస్తావన. – ఇంకా నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో 50 శాతం అక్క చెల్లెమ్మలకు ఇస్తూ చట్టం చేశాం. మరోవైపు దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు కూడా అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. – ఈ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం. అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే ప్రభుత్వం. పలు సంస్థలతో ఒప్పందం: – ఇవన్నీ కూడా గతంలో చేయూత డబ్బు ఇచ్చి, ఆ సొమ్ముతో అక్క చెల్లెమ్మలకు జీవనోపాధి కల్పించే చర్యలు తీసుకున్నాం. – వారికి జీవనోపాధి కోసం ఐటీసీ, అమూల్, రిలయెన్స్, పీ అండ్ జీ, హెచ్ఎల్ఎల్, అల్లానా వంటి సంస్థలతో ఒప్పందం. ఆయా సంస్థల సహకారంతో అక్క చెల్లెమ్మలకు వ్యాపారంలో తోడ్పాటు. – వ్యాపారంలో అక్క చెల్లెమ్మలకు తప్పనిసరిగా లాభాలు వచ్చేలా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. సరైనవి ఎంచుకునేలా..: – అయితే అక్కచెల్లెమ్మలలో ఎవరైతే మేకలు, గొర్రెలు కావాలనుకున్నారో వారికి ఇవాళ ఇస్తున్నాం. – వారు స్థానిక జాతుల్లో నచ్చిన వాటిని కొనుగోలు చేసుకునే అవకాశం. – వారికి సరైన ధరకు మేకలు, గొర్రెలు వచ్చేలా, అన్నీ సవ్యంగా జరగడం కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా ఏర్పాటు. – ఇద్దరు పశు వైద్యులు, సెర్ప్ అధికారులు, బ్యాంక్ అధికారులతో కమిటీ ఏర్పాటు. అవి లబ్ధిదారుడికి అడుగడుగునా తోడుగా నిలుస్తాయి. వారి ధృవీకరణ తర్వాతే వాటి కొనుగోలు. – ఆ విధంగా అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తూ చేయి పట్టుకుని నడిపిస్తారు. దీని వల్ల అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతుంది. ఆర్బీకేల ద్వారా మరిన్ని సేవలు: – గ్రామాలలో ఆర్బీకేలు రైతులకు వ్యవసాయ పరంగానే కాకుండా, వారికి పశువుల పోషణలో కూడా పూర్తిగా తోడ్పడతాయి. – రైతులు, అక్క చెల్లెమ్మలను ఆర్బీకేలు చేయి పట్టుకుని నడిపిస్తాయి. – పశువుల మంచి చెడులు చూసే వ్యవస్థ కూడా ఆర్బీకేలలో ఏర్పాటు. – నత్తల నివారణ, వ్యాధి నిరోధక టీకాలు, బాహ్య పరాన్న జీవుల నిర్మూలన, పశు ఆరోగ్య సంరక్షణ కార్డుల జారీ వంటివి ఆర్బీకేల పరిధిలో ఇంకా సమతుల్యమైన దాణా సరఫరా. – వైయస్సార్ సన్నజీవుల నష్ట పరిహారం పథకం (ఇన్సూరెన్సు). దీన్ని కూడా ఆర్బీకేల పరిధిలోకి తీసుకువస్తున్నాం. – టీకాలు వేయడం, వెటర్నరీ సర్వీసులు కూడా ఆర్బీకేల పరిధిలోకి తెస్తాం. క్రెడిట్ కార్డులు–శిక్షణ: – రైతుల మాదిరిగా పశువులకు కూడా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ. – ఆవులు, గేదెలు కొన్న వారితో పాటు, మేకలు, గొర్రెలు కొన్నవారికి కూడా ఉపయోగం. – ఇంకా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల ఆధునిక పోషణ, యాజమాన్య పద్ధతులపై శిక్షణ. – కర్నూలు జిల్లా డోన్, అనంతపురం జిల్లా పెనుగొండలో గొర్రెల పెంపకం శిక్షణా కేంద్రాలకు అనుమతి, త్వరలోనే ఏర్పాటు. – వాటిలో శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తాం. రాష్ట్రంలో అల్లానా గ్రూప్: – మాంసం కొనడానికి అల్లానా గ్రూప్ ఉంది. ఆ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. – అయితే అంత కంటే ఎక్కువ ధర వస్తే అక్కచెల్లెమ్మలు నేరుగా అమ్ముకోవచ్చు. అల్లానాకే అమ్మాలని లేదు. – అల్లానా గ్రూప్ తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాలలో మీట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేస్తోంది. పాడి రైతులు, అక్క చెల్లెమ్మలకు అండ: – వ్యవసాయం, పాడి పశువుల రంగంలో ఉన్న రైతులు, అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వం ఎంతో అండగా ఉంటుంది. – రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది. – అక్క చెల్లెమ్మలు బాగుంటే, రాష్ట్రం బాగుంటుందని, వారి ముఖాల్లో అహర్నిశలు సంతోషం ఉండేందుకు మన ప్రభుత్వం కృషి చేస్తుంది. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా..: ‘ఆ అక్క చెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటానని మరోసారి భరోసా ఇస్తూ, మీరు చేపట్టబోయే ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లాలని, మీకు ఇంకా మంచి జరగాలని, మీకు ఇంకా మేలు చేసే అవకాశం దేవుడు కల్పించాలని మనసారా కోరుకుంటున్నాను’. అంటూ జగన్ ప్రసంగం ముగించారు. మరింత తోడుగా నిలుస్తాం : రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల్లో మరింత తోడుగా నిలుస్తామని ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన అల్లానా గ్రూప్ ఛైర్మన్ ఇర్ఫాన్ వెల్లడించారు. రాష్ట్రంలో మీట్ ప్రాససింగ్ యూనిట్లతో పాటు, మ్యాంగో ప్రాససింగ్ యూనిట్ కూడా ఏర్పాటుకు ఇదే సరైన సమయమని ఇర్ఫాన్ పేర్కొనగా.. జగన్ స్వాగతించారు. మరోవైపు బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో మేకలు, గొర్రెలలో మంచి బ్రీడ్ ఉందని, వాటిని ఇక్కడికి కూడా తీసుకువస్తే, రైతులు, అక్క చెల్లెమ్మలకు ఎంతో మేలు జరుగుతుందని, అందుకు తాము సహకరిస్తామని అల్లానా గ్రూప్ ఛైర్మన్ తెలిపారు. దీనిపైనా సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్, ఆ దిశలో చురుకుగా పరిశీలించాలని పశు సంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏపీ అగ్రి మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవియస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యతో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా, జిల్లాల నుంచి అధికారులు, పథకం లబ్ధిదారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు. -
ఏపీ: నవంబర్ 26న పాడి పండుగ
సాక్షి, అమరావతి : వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల లబ్ధిదారులైన మహిళలకు నవంబర్ 26వ తేదీన పాడి పశువులను పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పంపిణీకి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. వర్చువల్ విధానంలో వచ్చే గురువారం రోజు తొలిదశలో ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని 400 గ్రామాల్లో దాదాపు 7 వేల యూనిట్ల పాడి పశువుల పంపిణీని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం దశలవారీగా పంపిణీ చేసేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల లబ్ధిదారులైన మహిళలకు పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా వివరాలను పరిశీలించారు. చేయూత ద్వారా కొత్తగా లబ్ధి పొందిన 2.78 లక్షల మంది నుంచి కూడా ఆప్షన్లు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పశువులపై పెట్టుబడి పోషకులకు కచ్చితంగా గిట్టుబాటు కావాలని, ఈ మేరకు పాడి పశువులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. పాల దిగుబడి బాగుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా సాధికారత, సుస్థిర ఆర్ధికాభివృద్ధి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు చెప్పారు. పశువుల దాణా, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల ద్వారా ఇప్పటివరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 78 వేల దుకాణాలు ప్రారంభం అయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీదిరి అప్పలరాజు, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షలో సీఎం సూచనల్లో ముఖ్యాంశాలివీ.. ఆర్బీకేల్లో సదుపాయాలను వినియోగించుకోవాలి పెట్టుబడి కచ్చితంగా గిట్టుబాటు అయ్యేలా మేలు జాతిని ఎంపిక చేసేలా జాగ్రత్త వహించాలి. కొనుగోళ్ల కమిటీలో సాంకేతిక నైపుణ్యం కలిగిన వారుండాలి. బీమా సంస్థ ప్రతినిధితో పాటు బ్యాంకర్ కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలి. పశు సంవర్థక శాఖ సేవలను బలోపేతం చేసి ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలి. పాడి పశువులకు ఎలాంటి సమస్య వచ్చినా ఆర్బీకేల పరిధిలో వెంటనే వాటికి వైద్యం అందించేలా అధికారులు సన్నద్ధం కావాలి. ఆర్బీకేల పరిధిలో ఏర్పాటయ్యే వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలను వైద్య సేవల కోసం వినియోగించుకోవాలి. కాల్ సెంటర్ల ద్వారా వైద్యం అందించాలి. సహజసిద్ధమైన దాణా.. పశువుల దాణా సక్రమంగా సరఫరా చేస్తూ రసాయనాలు (కెమికల్స్) లేకుండా సహజమైన పదార్థాలతో తయారైనవే అందించాలి. పశువులకు కలుషితమైన ఆహారం అందించడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు పెరుగుతున్నాయి. సేంద్రీయ (ఆర్గానిక్) పాలు, సేంద్రీయ మాంసం ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల ఉత్పత్తులకు మరింత మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుంది. సేంద్రీయ పాల బ్రాండ్‌పై విస్తృత ప్రచారం చేపట్టి మహిళలకు అవగాహన కల్పించాలి. పశువులకు ఆరోగ్య కార్డులు.. ప్రతి పశువునూ పశు సంవర్థక శాఖ అధికారులు భౌతికంగా తనిఖీ చేశాక లబ్ధిదారులకు అందచేయనున్నారు. లబ్ధిదారుల జాబితాను ఆర్బీకేల పరిధిలో నమోదు చేసి ప్రతి నెలా పశువుల ఆరోగ్యాన్ని వైద్యులు పరిశీలిస్తారు. పాడి పశువులకు ఇచ్చే ఆరోగ్య కార్డులో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేస్తారు. పాల దిగుబడి వివరాలు కూడా ఇందులో పొందుపరుస్తారు. లబ్ధిదారులకు పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ ఇలా 2020 నవంబర్ 26 : ప్రకాశం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లోని 400 గ్రామాల్లో దాదాపు 7 వేల యూనిట్ల గేదెలు, ఆవుల పంపిణీ 2020 డిసెంబర్ 5 – 2021 ఫిబ్రవరి 28 మధ్య :దాదాపు లక్ష యూనిట్ల ఆవులు, గేదెల పంపిణీ ఆగస్టు 2021 – ఫిబ్రవరి 2022 మధ్య : 3.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెల పంపిణీ 2021 నవంబరు 30 నుంచి – 2021 డిసెంబర్ 31 వరకు: గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ -
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలుంటాయి: తలసాని
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీని చేపట్టిందని, లబ్ధిదారులకు ఇచ్చిన గొర్రెలు చనిపోతే బీమా క్లెయిమ్ చేసిన వెంటనే వారికి గొర్రెలను ఇవ్వడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధికారులపై సోమవారం ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.కోట్లలో బీమా సొమ్మును ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తోందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల అమాయకులైన రైతులు నష్టపోవాలా అని ప్రశ్నించారు. వచ్చే నెల 5లోగా గొర్రెలకు చెందిన బీమా క్లెయిమ్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పశుసంవర్థక కార్యక్రమాలు భేష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో అమలుచేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశంసించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శనివారం సమీక్ష జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి తలసాని కేంద్ర మంత్రికి వివరించారు. గొర్రెల పంపిణీ ఎంతో గొప్ప కార్యక్రమమని, జీవాల ఆరోగ్య పరిరక్షణకు తీసుకున్న చర్యలు బాగున్నాయని గిరిరాజ్ కితాబిచ్చారు. సమావేశంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, పశుసం వర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సువర్ణ, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ నిధుల్నీ వదల్లేదు
సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : రైతులను ఆదుకునేందుకు ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉండాల్సిన ప్రభుత్వ యంత్రాంగం గత ఎన్నికల్లో తాయిలాల కోసం వారి కష్టార్జితాన్ని పణంగా పెట్టింది. సాగుబడి లేక దిగాలుగా ఉన్న రైతులకు సాయం చేయాల్సింది పోయి వారికి ఇవ్వాల్సిన బిల్లులను ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు వినియోగిందింది. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కరువు ఛాయలు కనిపిస్తున్నా ప్రత్యామ్నాయాల కోసం ప్రతిపాదనలు చేస్తుంటే... బిల్లులు రాని పనులెందుకని రైతాంగం ప్రశ్నిస్తోంది. వ్యవసాయం కష్టమయినప్పుడు, ఖరీఫ్, రబీల సాగుకు వర్షాభావం ఎదురయినప్పుడు, చినుకు జాడ లేక ఇబ్బందులకు గురయినప్పుడు రైతులను ఆదుకోవాలంటే ఉన్న ఒకే ఒక మార్గం భూ సార సంరక్షణ పనులు. ఇందుకోసం ఏటా ప్రణాళిక ప్రకారం కోట్లాది రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే ఏటా ప్రణాళికలు రూపొందించి వ్యవసాయం ఇబ్బందయిన ప్రాంతాల్లో గొర్రెల పెంపకం, కూరగాయల సేద్యం, చెక్‌డ్యాంల నిర్మాణాలతో రైతులను ఆదుకోవాలి. ఈ పనులకు సంబంధించి విడుదలయిన నిధులను రైతాంగానికి కాకుండా ఇతర పనులకు మళ్లిస్తే.. ఇక రైతులు ఎవరిని అడగాలో తెలియక సతమతమవుతున్నారు. రైతులకు అందని బిల్లులు అన్ని రంగాలనూ ఆదుకోవాల్సిన గత ప్రభుత్వం ఉప్పెనలా వచ్చి పడుతున్న ఎన్నికలను చూసి బెదిరిపోయింది. చేసేది లేక ఎలాగైనా ఓటర్లను ఆకట్టుకోవాలని ఎక్కడెక్కడ ఉన్న బడ్జెట్‌నూ తాయిలాలకోసం మళ్లించేసింది. చివరకు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు విడుదలయిన ప్రత్యామ్నాయ వనరులనూ వదల్లేదు. దీనివల్ల ఆరు క్లస్టర్లకు చెందిన రైతులకు చెల్లించాల్సిన బిల్లులు నిలిచిపోయాయి. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాలకు చెందిన రూ. 99 లక్షలు ఇప్పుడు అందకుండా పోయాయి. భూసార సంరక్షణ విభాగం బొబ్బిలి పరిధిలో పనులకోసం 2016–17 ఆర్థిక సంవత్సరానికి రూ.101లక్షలు మంజూరయ్యా యి. ఈ నిధులతో బాడంగి, మెంటాడ, సాలూ రు, కొత్తవలస, మెరకముడిదాం క్లస్టర్లలో గొర్రెల పెంపకం, కాయగూరల సాగు, చెక్ డ్యాంల నిర్మాణం వంటి పనులు చేపట్టారు. ఈ క్లస్టర్ల పరిధిలోని రైతులకు 50 శాతం సబ్సిడీ కింద బిల్లులు చెల్లించాల్సి ఉంది. కానీ బిల్లులు పెట్టిన వాటిలో దాదాపు 50 శాతం పూర్తవ్వకుండానే మిగతా బిల్లులు నిలిచిపోయాయి. మంజూరయిన రూ.101లక్షల్లో కేవలం రూ. 60లక్షలు మాత్రమే బిల్లులు అయ్యాయి. మిగతా రూ.40 లక్షలు చెల్లించలేదు. ఎందుకని ఆరాతీస్తే ఈ బిల్లులను పసుపు కుంకుమ కోసం మళ్లించేసినట్టు తేలింది. ఇక 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ. కోటీ 18లక్షల బడ్జెట్ విడుదలయింది. ఈ నిధులతో రామభద్రపురం, దత్తిరాజేరు, ఎల్కోట, కురుపాం, గుర్ల, బాడంగి క్లస్టర్ల పరిధిలో పలు వ్యవసాయ పనులు చేపట్టారు. ఇందులో నేటికీ రూ.59 లక్షల బిల్లులు కాలేదు. ఏమని అడిగితే ఎన్నికల ముందు ఈ నిధులను సీఎఫ్ఎంఎస్ ద్వారా ఇతర పద్దుల కోసం గత ప్రభుత్వం మళ్లించిందని తేలింది. బిల్లులు రావాల్సి ఉంది ఇలా జిల్లాలో 2016–17 సంవత్సరానికి చెందిన రూ.40లక్షలు, 2017–18 సంవత్సరానికి చెందిన రూ. 59 లక్షలు మొత్తం రూ.99లక్షలు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాలకోసం నిత్యం రైతులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. భూ సంరక్షణ పనుల కింద రెండేళ్లుగా వివిధ క్లస్టర్లలో పనులు చేపడుతున్నాం. 2016–17 ఆర్థిక సంవత్సరానికి రూ.20లక్షలు, 2017–18 సంవత్సరానికి రూ.25లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే రైతులకు చెల్లించాలని వారి బ్యాంకు అకౌంట్ల పేరున బిల్లులు చెల్లించాలని ట్రెజరీకి సమర్పించాం. కానీ బిల్లులు అవలేదు. బిల్లులకోసం ఎదురు చూస్తున్నాం. – పి.చంద్రశేఖర బాబు, ఏడీ, భూ సంరక్షణ విభాగం, బొబ్బిలి -
రెండో విడత ఏది..?
సాక్షి, వరంగల్ రూరల్ : ఆర్భాటంగా ప్రారంభించారు.. అద్భుతంగా ఉంటుందన్నారు.. ఆర్థికంగా పోరగమి స్తారని తెలిపారు.కాని క్షేత్ర స్థాయిలోకి వచ్చే సరికి పరిస్థితి తారుమారైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం అస్తవ్యస్తంగా మారింది. గొర్రెల పంపిణీ పథకంలో లోపాలు గొల్ల కురుమల పాలిట శాపాలుగా మారుతు న్నాయి. లక్ష్యం మేరకు గొర్రెల పంపిణీ ఇంతవరకూ జరుగలేదంటే అతిశయోక్తి కాదు. గొల్ల, కురుమ, యా దవుల కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబన సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ఆశించిన స్థాయిలో అమలు కావడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 237 గొర్రెల కాపర్ల సొసైటీలు ఉండగా అందులో 26,152 సభ్యులు ఉన్నారు. వీరిలో మొదటి విడతలో 13,111, రెండో విడతలో 13,052 మంది సభ్యులకు ఇచ్చేందుకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. జూన్ 20, 2017న జిల్లాలో గొర్రెల పంపిణీ ప్రారంభమైంది. మొదటి విడతలో 13,111 మంజూరు కాగా 12,832 మందికి గొర్రెలను పంపిణీ చేశారు. రెండో విడతలో 13,052 మందికి మంజూరు చేయగా ఇప్పటి వరకు 77 మందికే అందించారు. గొర్రెల పంపిణీ ఇలా.. గొర్రెల కాపరుల సంఘాల్లో సభ్యులైన వారంతా ఈ పథకం కింద లబ్ధిపొందేందుకు అర్హులు. జిల్లాలో ఒక్కో యూనిట్‌కు 21 గొర్రెలు అందజేస్తున్నారు. ఒక్కో యూనిట్ విలువ రూ1.25లక్షలు. ఇందులో 75 శాతం సబ్సిడీ అందజేస్తారు. మిగిలిన 25 శాతం లబ్ధిదారుడు తన వాటా కింద చెల్లిస్తున్నాడు. అంటే ఎంపికైన ఒక్కో లబ్ధిదారుడికి సబ్సిడీ కింద 75 శాతం అనగా రూ.93,750 రాయితీ ఇస్తున్నారు. మిగతా 25శాతం రూ 31,250 లబ్ధిదారులు చెల్లిస్తున్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ, మండల పశువైద్యాధికారి, కాపర్ల సంఘాల్లోని కొందరు సభ్యులతో ఓ కొనుగోలు కమిటీ ఉంది. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను తీసువచ్చిన తర్వాత లబ్ధిదారులకు అందజేస్తున్నారు. వీటికి ఉచితంగా ఇన్సూరెన్స్ చేయనున్నారు. ఇది కూడా డాక్టర్లే చేయాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. గతంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేది. రెండో విడతలో 77 మందికే అందజేత రెండో విడతలో 13,052 మందికి మంజూరు చేయగా ఇప్పటివరకు 77 మందికే అందించారు. అక్టోబర్, 2018న ప్రారంభమైన రెండో విడత ఇప్పటి వరకూ పుంజుకోలేదు. డీడీ కట్టేదుకు లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నా గొర్రెలు అందించే వారు కరువయ్యారు. మొదటి విడత ఏప్రిల్, 2018 నాటికి పూర్తికావల్సి ఉన్న నేటికి పూర్తి కాలేదు. మాకు కూడా గొర్రెలు ఇయ్యాలే.. మాది చెన్నారావుపేట మం డల కేంద్రం. మా కురుమ సంఘంలో 105 మంది సభ్యులు ఉన్నారు. మొదటి విడతగా మా సంఘంలో 53 మందికి ఇచ్చారు. రెండో విడత వెంటనే ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేదు. గొర్రెలు తీసుకున్నవాళ్లు లాభపడ్డారు. మాకు గొర్రె లేదు.. ఏది లేదు. అడిగితే ఎన్నికల కోడ్ ఉన్నది. అయిపోయాక ఇస్తామని చెబుతున్నారు. కొందరికి ఇచ్చి కొందరికి ఆపడం ఏంది.. మాకూ కూడా సర్కారు తొందరగా ఇచ్చి ఆదుకోవాలి. –చిట్టె మల్లయ్య, గొర్రెల కాపరి, చెన్నారావుపేట రెండేళ్లయినా.. రెండో విడత లేదు.. మా ఊరిలో గొర్రెల పంపిణీ కోసం గ్రామ సభలు పెట్టి ముందస్తుగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొదటి విడతలో సగం మందికి గొర్రెలు ఇచ్చారు. మిగతా సగం మంది లబ్ధిదారులకు ఏడాది లోపు సబ్సిడీ గొర్రెలు ఇస్తామన్నారు. కానీ రెండేళ్లు పూర్తయినా ఇప్పటివరకు లబ్ధిదారులకు ఇవ్వలేదు. అధికారులను అడిగితే ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తామని దాటవేస్తున్నారు. వెంటనే ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ గొర్రెలు పంపిణీ చేయాలి. –పెద్దబోయిన రాజన్న, నల్లబెల్లి -
టెండర్ల ద్వారా గొర్రెల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: గొర్రెల కొనుగోళ్లలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం పశువైద్యుల సాయంతో లబ్ధిదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి గొర్రెలు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అవి నీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో టెండర్ ప్రక్రియ ద్వారా గొర్రె లను కొనుగోలుచేసి, గొల్ల కుర్మలకు పంపిణీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే నేరుగా లబ్ధిదారులకే సొమ్మును జమ చేసి గొర్రెలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించే అంశంపైనా కూడా పరిశీలన చేస్తోంది. ఈ రెండింటిలో ఏదో ఒక పద్ధతిని అవలంబిస్తే క్షేత్రస్థాయిలో పెద్దఎత్తున జరుగుతున్న రీసైక్లింగ్‌ను నివారించడంతోపాటు, పశువైద్యుల అక్రమాలకు తాళం వేసినట్లవుతుందని భావిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 75.95 లక్షల గొర్రెలను కొనుగోలు చేసినట్లు గొర్రెల, మేకల అభివృద్ధి సమాఖ్య గణాంకాలు చెబుతున్నాయి. అయితే కొనుగోలు చేసి పంపిణీ చేసిన గొర్రెలనే నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ కొనుగోలు చేసినట్లు చూపి పంపిణీ చేయడంతో గొర్రెలు యథేచ్ఛగా రీసైక్లింగ్ అయినట్లు తేలింది. కొందరు పశువైద్యులు అమ్మకందారులతో కుమ్మక్కై అక్రమంగా వ్యవహరించారు. ఈ క్రమంలో గొర్రెలు గ్రౌండింగ్ చేయకున్నా చేసినట్లు చూపారు. దీంతో ఆరుగురు పశువైద్యులను సస్పెండ్ కూడా చేశారు. అయినప్పటికీ పశువైద్యులు బాధ్యతరాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని ఆ శాఖలోని అధికారులే విమర్శలు చేస్తున్నారు. ఫలితంగానే టెండర్ లేదా నేరుగా లబ్ధిదారుడి ఖాతాకు సబ్సిడీ రూపంలో డబ్బు జమచేసి గొర్రెలు కొనుగోళ్లు చేసేలా ప్రభుత్వం ఆలోచిస్తుంది. సరఫరా గొర్రెలపై సర్వే... 2018 జూన్‌లో సీఎం కేసీఆర్ గొర్రెల అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంపై పశుసంవర్థక శాఖ సర్వే చేపట్టింది. ఏయే గ్రామాల్లో ఎన్ని యూనిట్లు పంపిణీ చేశారు. వాటిలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి. ఎన్నింటిని అమ్ముకున్నారు. ఎందుకోసం విక్రయించుకోవాల్సి వచ్చిందనే కారణాలతో ఈ సర్వే చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. -
సబ్సిడీ గొర్రెలేవి..?
జనగామ అర్బన్: జిల్లాలో రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుంది. డీడీలు తీసి గొర్లకాపరులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. 10,954 యూనిట్లకు గొర్రెలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 1,407 యూనిట్లకు మాత్రమే ఇచ్చారు. మొదటి విడతలోనూ 313 యూనిట్లకు ఇప్పటి వరకు సబ్సిడీ అందలేదు. జనగామ జిల్లాలో 21,704 గొర్రెల యూనిట్లు ఉన్నాయి. ప్రభుత్వం మొదటి విడతలో 10,750 యూనిట్లను ఎంపిక చేసింది. 10,437 మందికి 21 గొర్రెల చొప్పున పంపిణీ చేశారు. ఇంకా 313 యూనిట్లకు సబ్సిడీ ఇప్పటి వరకు అందలేదు. రెండో విడతలో 10,954 యూనిట్లకు గొర్రెలు ఇవ్వాల్సి ఉంది. వీరంతా డీడీలు తీసి గొర్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 1,407 యూనిట్లకు ఇచ్చారు. 9547 యూనిట్లకు ఇవ్వాల్సి ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో 55 మందికి, దేవరుప్పులలో 11 మందికి పంíపిణీ చేయగా నర్మెట, తరిగొప్పుల మండలాల్లో ఒక్కరికీ పంపిణీ చేయకపోవడం గమనార్హం. మొదటి విడతకే మోక్షంలేదు.. జిల్లాలో మొదటి విడతలో పూర్తిస్థాయిలో గొర్లను పంపిణీ చేయలేదు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో 4,325 యూనిట్లుకు 4,236 యూనిట్లు, పాలకుర్తిలో 2,525 యూనిట్లుకు 2,451 యునిట్లు పంపిణీ చేశారు. రఘునాథపల్లి, తరిగొప్పుల మండలాల్లో అత్యధికంగా 36 యూనిట్ల సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉంది. మొదటి విడతలోనే పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. విడుదల కాని బడ్జెట్.. మొదటి విడతలో సబ్సిడీ గొర్రెల పధకానికి రూ.100 కోట్లు కేటాయించి విడుదల చేసిన ప్రభుత్వం రెండో విడతలో దాదాపు 14 కోట్లు మాత్రమే కేటాయించినట్లు సమాచారం. దీంతో నిధులు కేటాయించిన మేరకు అధికారులు పట్టణంలో లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ కూడా పంపిణీకి అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. బడ్జెట్ విడుదలైతే పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అందని ఇన్సూరెన్స్.. జిల్లావ్యాప్తంగా వివిధ కారణాలతో ఇప్పటి వరకు 400లకు పైగా సబ్సిడీ గొర్లు మృత్యువాత పడ్డాయి. వీటిలో కొన్నింటికి మాత్రమే ఇన్సూరెన్స్ మంజూరైంది. మిగతా వాటికి మంజూరు కాలేదు. మంజూరైన డబ్బులను కూడా ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. సబ్సిడీ గొర్రెలను అక్రమంగా తరలిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్న గొర్లు కూడా మాయమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు చొరవ చూపాలి.. సబ్సిడీ గొర్రెల మంజూరులో అధికారులు చొరవ చూపాలి. రెండో విడతకు సంబంధించి బ్యాంకులో డీడీ తీసి దాదాపు ఆరునెలలు గడిపోయింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అర్హులైన వారికి న్యాయం చేయాలి. – కూకట్ల చంద్రయ్య, గానుగుపహాడ్ లబ్ధిదారులకే డబ్బులు అందజేయాలి.. ప్రభుత్వం అందించే సబ్సిడీని లబ్ధిదారులకు నేరుగా అందజేయాలి. ప్రభుత్వం అందజేసే గొర్రెలకు ఇన్సూరెన్స్ రావడం లేదు. దీంతో లబ్ధిదారులకు నష్టం కలుగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – జాయ మల్లేషం, జీఎంపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు విడతల వారీగా అందజేస్తున్నాం.. ప్రభుత్వం విడుదల చేస్తున్న బడ్జెట్‌కు అనుగుణంగా అర్హులైన యూనిట్లను మంజూరు చేస్తున్నాం. కొంతకాలంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల అందజేయలేకపోయాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు, ఉన్నతాధికారులు సూచనల మేరకు అందజేస్తాం.– భిక్షపతి, జనగామ జిల్లా వెటర్నరీ అధికారి -
తెచ్చుడు.. అమ్ముడే!
సబ్సిడీ గొర్రెల రీసైక్లింగ్ యథేచ్ఛగా కొనసాగుతుందడానికి మహబూబ్‌నగర్ మండలం దివిటిపల్లి గ్రామమే నిదర్శనం. ఈ గ్రామానికి మొత్తం 34 యూనిట్లు మంజూరైతే రెండు రోజుల క్రితం 32 యూనిట్లు మాత్రమే పంపిణీ చేశారు. గొల్ల కురుమ సంఘం నేత బంధువులకు సంబంధించి రెండు యూనిట్లు గ్రామానికి రాకుండానే కాగితాలపైనే మంజూరు చూపిస్తుండటం గమనార్హం. ఇందులో పశుసంవర్ధకశాఖ అధికారుల పాత్రపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు యూనిట్లే కాకుండా మంజూరైన మిగతా గొర్రెలను కూడా గ్రామం నుంచి తరలించినట్లు సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే గొల్లకుర్మల ఆర్థికాభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం అబాసు పాలవుతుందనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కులవృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం జిల్లాలో అపహాస్యమవుతోంది. గొల్ల, కురుమల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం క్షేత్ర స్థాయిలో పక్కదారి పడుతోంది. అధికారులు, రాజకీయ నాయకులు, లబ్ధిదారులు ఒకటవ్వడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఈ పథకం లక్ష్యాన్ని చేరడం లేదు. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల పోలీసు నిఘా లేకపోవడం.. చెక్‌పోస్టులు ఉన్నా వాటి పనితీరు అంతంత మాత్రంగానే ఉండడంతో జిల్లాలో గొర్రెల రీసైక్లింగ్ దందా జోరుగా కొనసాగుతుంది. సబ్సిడీపై పంపిణీ చేస్తున్న గొర్రెలను మరుసటి రోజే లబ్ధిదారులు అమ్ముకుంటున్న ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. గొర్రెలు ఇచ్చింది అమ్ముకోవడానికా.. పెంచుకోవడానికా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇదంతా సంబంధిత శాఖ అధికారులకు తెలిసినా ‘మామూళ్ల’ మైకంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పోలీసులు నిఘా కొరవడంతో.. అటు చెక్‌పోస్టుల కంట పడకుండా పక్కా ప్లాన్‌తో మారుమూల గ్రామాల మీదుగా రాత్రి వేళల్లో సరిహద్దు దాటిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు మాత్రం ఈ పథకం తీరు తెన్నులను సమీక్షించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. జోరుగా కమీషన్లు గొర్రెల పథకం ఇటు దళారులు, అటు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. జిల్లాలో 528 యాదవ సంఘాల్లో 54,591 మంది సభ్యులు ఉన్నారు. వీరందరినీ ఈ పథకం కింద అధికారులు ఎంపిక చేశారు. వీరిలో మొదటి విడతలో 27,075 మంది లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి గత ఏడాది నుంచి గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికీ జిల్లాలో 22,197 మంది లబ్ధిదారులకు 4,66,137 గొర్రెలను పంపిణీ చేశారు. వీటిలో 20 శాతం కూడా లబ్ధిదారుల వద్ద లేవని యాదవ సంఘం సభ్యులే చెబుతుండడం గమనార్హం. ఇప్పటి వరకు జిల్లాలో గొర్రెల కొనుగోలు కోసం రూ.277.46 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో అధికారులు, దళారులు కలిసి 20శాతం చొప్పున కమీషన్ దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ ఆదాయంలో అందరికీ స్థాయిని బట్టి వాటాలు కేటాయించినట్లు తెలుస్తోంది. అందుకే పెద్ద ఎత్తున గొర్రెలు రీసైక్లింగ్ జరుగుతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా కనీసం పథకం తీరు తెన్నులను సమీక్షించడానికి సిద్ధపడడం ఏమిటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎలా తరలిస్తారంటే... సబ్సిడీ గొర్రెలను దళారులు చాలా చాకచక్యంగా తరలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు కేంద్రానికి దూరంగా ఉంటే సబ్సిడీ గొర్రెల చెవులకు ఉన్న ట్యాగ్‌లను తొలగించి రాత్రి సమయంలో వాహనాల్లో గుర్తుపట్టకుండా సాధారణ గొర్రెల్లో కలిపి తరలిస్తున్నారు. ఇక దగ్గర్లో ఉంటే మేత కోసమని నడిపించుకుంటూ సరిహద్దు దాటగానే వాహనాలు ఎక్కించి తరలిస్తున్నారు. ఈలోగా ఎవరైనా గుర్తుపట్టి సబ్సిడీ గొర్రెలు తరలుతున్నాయని అధికారులకు సమాచారం ఇస్తే అప్పుడు ఇక్కడ మేత లేదు.. కాసే వారు లేరు.. మా బంధువుల ఇంటికి తోలుతున్నామని చెబుతుంటారు. గట్టిగా నిలదీస్తే ఎంతోకొంత ముట్టజెప్పి వెళ్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. వీరు ప్రధాన రహదారుల్లో కాకుండా అధికారుల సూచన మేరకు మారుమూల గ్రామాల మీదుగా వెళ్తున్నారనే విమర్శలున్నాయి. రాష్ట్రంలోనే తొలి కేసు ఇక్కడే... సబ్సిడీ గొర్రెల పథకం అమలులో భాగంగా గొర్రెల రీసైక్లింగ్ చేసే విషయంలో 2017 సంవత్సరంలో జిల్లాలోని హన్వాడ మండలం కిష్టంపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులు సబ్సిడీ గొర్రెలను అమ్ముకోవడంతో వారిపై అధికారులు కేసులు నమోదు చేసి డబ్బు రికవరీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే గొర్రెల రీ సైక్లింగ్ విషయం ఇదే తొలికేసు కావడం గమనార్హం. అదేవిధంగా ధన్వాడ మండలంలో ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి. అనంతరం పలు వర్గాల నుంచి ఒత్తిళ్లు... అధికారుల మామూళ్ల మత్తు కారణంగా రీసైక్లింగ్ వ్యవహారాన్ని మామూలుగా తీసుకుంటున్నారు. గ్రామాల్లో గొర్రెలను విక్రయిస్తున్నారని సమాచారం ఇచ్చినా పశుసంవర్ధకశాఖ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది. సమాచారం ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నట్లయితే విక్రయాలు జరగకపోయేవని స్థానికులు అంటున్నారు. ప్రారంభంలో పంపిణీ చేసిన గొర్రెలనే లబ్ధిదారులు అమ్ముకున్నట్లు తెలిసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆంధ్రా, తమిళనాడు నుంచి కొనుగోలు జిల్లాలోని పలు మండలాల లబ్ధిదారులకు గొర్రెలను అందజేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరంతో పాటు తమిళనాడు రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్నారు. అయితే కొనుగోలు చేస్తున్న సమయంలోనే అక్కడి బేరగాళ్లతో ఇక్కడి నుంచి వెళ్లిన వారు మాటముచ్చట పక్కా చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇక్కడకు తీసుకొచ్చి లబ్ధిదారులకు అందజేసిన వెంటనే వారు యూనిట్లను కొనుగోలు చేసి మళ్లీ ఆంధ్రాకు తరలిస్తున్నారు. ఇలా క్రయ, విక్రయాలలో అధికారులకు స్థాయిని బట్టి వాటాలు కేటాయిస్తున్నారు. పోలీసులదే బాధ్యత జిల్లాలో గొర్రెల రీసైక్లింగ్ జరుగుతున్న మాట వాస్తవమే. కానీ వాటిని అరికట్టేందుకు తగిన యంత్రాంగం మా వద్ద లేదు. పథకాన్ని అమలు చేయడం వరకు మాత్రమే మా బాధ్యత. గొర్రెలు సరిహద్దు దాటకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ శాఖది. గొర్రెలు రీసైక్లింగ్ జరగకుండా చూడాలని మేం ఇది వరకే పోలీసులకు సూచించాం. – దుర్గయ్య, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి -
మందలు మండికే!
పరిగి : గొల్లకురుమలకు పంపిణీ చేస్తున్న గొర్రెల పంపిణీలో గోల్మాల్ జరుగుతోంది...తెచ్చిన జీవాలను పంపిణీ చేయడం.. ఆవెంటనే అమ్మటం.. మళ్లీ వాటినే పంపిణీ చేయడం.. తిరిగి మండికి తరలించడం.. ఇలా పంపిణీ ప్రక్రియ మొత్తం రీ సైక్లింగ్ రూపంలో జరుగుతుందే తప్ప.. ఏమాత్రం పారదర్శకంగా లేదు.. గొల్లకుర్మలకు రాయితీపై గొర్రెల యూనిట్లు పంపిణీ చేయటం ద్వారా వారికి ఉపాధి కల్పించటంతో పాటు ఆర్థిక స్వావలంభన అందించాలనే ప్రభుత్వం లక్ష్యం పూర్తిగా నీరుగారి పోతోంది. కొన్ని గ్రామాల్లో పంపిణీ చేసిన జీవాల్లో ఒకటి రెండు యూనిట్లు మాత్రమే పోషించుకుంటుండగా .. మరి కొన్ని గ్రామాల్లో మొత్తం యూనిట్లను కొన్న చోటæనుంచి పక్కకు రాగానే విక్రయించి చేతిలో డబ్బులు పట్టుకుని వస్తున్నారు. జిల్లాలో 22,025 యూనిట్లు పంపిణీ చేయాలని పశు సంవర్ధక శాఖ అధికారులు గుర్తించగా మొదటి విడతలో 10,954 యూనిట్లు, రెండో విడతలో 11,071 యూనిట్లు పంపిణీ చేయాలి. కాగా ఇప్పటివరకు 4,053 యూనిట్ల గొర్రెలు జిల్లాలో పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్‌కు రూ.1.10 లక్షల ధర నిర్ణయించిన ప్రభుత్వం రూ.30 వేలు రైతు వాటాగా చెల్లించాలి. మిగతా రూ.80 వేలు ప్రభుత్వం రాయితీపై అందిస్తోంది. ఈ డబ్బులతో ఒక్కో లబ్ధిదారుడికి 21 గొర్రెలు పంపిణీ చేస్తోంది. వీటికి బీమా కూడా ఈ డబ్బుల్లో నుంచే చేస్తారు. కొంటే రూ.1.10లక్షలు.. విక్రయిస్తే రూ.70 వేలు ⇒ ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం పంపిణీ చేసిన యూనిట్ గొర్రెలు కనీసం ఓ ఏడాది వరకైనా షోషించాలి. వాటిని పునరుత్పత్తి చేసి వాటికి పుట్టిన పిల్లలను విక్రయిస్తే గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదుగుతారని ప్రభుత్వ ఆశయం. కానీ ఇది నెరవేరేటట్టు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. ⇒ పంపిణీ చేస్తున్న గొర్రెలు కొన్నిచోట్ల ఇళ్లకు వచ్చిన వారంలోపు చెవులకు కట్టిన ట్యాగ్లు కత్తిరించి విక్రయిస్తున్నారు. ⇒ మరికొన్ని చోట్ల ఇళ్లకు చేరకుండానే అక్కడికక్కడే విక్రయించి వస్తున్నారు. ⇒ కొందరు కర్ణాటకకు చెందిన బ్రోకర్లు ఈ తతంగం నిర్వహిస్తున్నారని సమాచారం. వీరికి పశు వైద్యులు వాటాలు తీసుకుని సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ⇒ ఒక్కో యూనిట్‌కు రూ.1.10 లక్షలు ఖర్చు చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేస్తుండగా బ్రోకర్ల అవతారమెత్తిన కొందరు ఆ గొర్రెలు ఆ వెంటనే రూ.70 వేలు చెల్లించి తీసుకెళ్తున్నారు. ⇒ కొన్న పది నిమిషాలకే ఆ యూనిట్ గొర్రెల ధర రూ.30 వేలు తగ్గించి బ్రోకర్ల తమ మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. ⇒ మళ్లీ అవే గొర్రెలకు ట్యాగ్లు తగిలించి లబ్ధిదారులకు విక్రయిస్తున్నారు. ఇలా గొర్రెల పంపిణీ అంతా రీ సైక్లింగ్‌గా జరుగుతోంది. ⇒ బీమా డబ్బులు సైతం యూనిట్ కాస్టు నుంచి పట్టుకుంటున్నారు. బీమా చేయకుండానే గొర్రెల్ని విక్రయిస్తుండడంతో ఆ డబ్బులు ఏమవుతున్నాయో అర్థం కావడం లేదు. పరిగిలో మచ్చుకు కొన్ని.. ⇒ నస్కల్ గ్రామంలో 21 యూనిట్లు గొర్రెలు ప్రభుత్వం గొల్ల కురుమలకు పంపిణీ చేసింది. వీటిలో 19 యూనిట్లు వారం గడవకముందే విక్రయించుకున్నారు. ⇒ సయ్యద్‌పల్లిలో మొత్తం 38 యూనిట్లు పంపిణీ చేశారు. వీటిలో 12 యూనిట్ల గొర్రెలు గ్రామానికి కూడా చేరకుండానే అక్కడికక్కడే విక్రయించి వచ్చేశారు. ⇒ రుక్కంపల్లిలో 16 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేయగా ఇప్పటికే 12 యూనిట్లు విక్రయించారు. ⇒ బర్కత్‌పల్లిలో 58 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేయగా 15 యూనిట్ల వరకు విక్రయించినట్లు సమాచారం. ⇒ లక్ష్మీదేవిపల్లి, రూప్కాన్పేట్, గోవిందాపూర్ తదితర గ్రామాల్లోనూ ఇలాగే రెండు నుంచి ఐదు యూనిట్ల వరకు విక్రయించారు. విక్రయాలు వాస్తవమే! గొర్రెల యూనిట్లు పంపిణీ చేశాక ఏడాది వరకు విక్రయించుకోవద్దు. కానీ కొన్ని గ్రామాల్లో లబ్ధిదారులు తెచ్చిన వెంటనే విక్రయిస్తున్నారు. ఇలాంటి వారి సమాచారం సేకరిస్తున్నాం. ఇలాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని యూనిట్లు అందించిన వెంటనే బీమా చేయడం లేదు. పోషించే వారికే బీమా వర్తించేలా చేస్తున్నాం. – డాక్టర్ చంద్రశేఖర్, పశుసంవర్ధక శాఖ అధికారి -
గొర్రెల పంపిణీ ఘనత కేసీఆర్‌దే
సదాశివపేట(సంగారెడ్డి): కురుమలు ఆర్థికంగా ఎదిగేందుకు వారికి సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యెగ్గె మల్లేశం అన్నారు. పట్టణంలోని శుక్రవారం నిర్వహించిన మల్లికార్జున స్వామి కురుమ సంఘం ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకులు కురుమజాతిని, కురుమల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం కురుమల జీవన స్థితిగతులను గమనించి గొర్రెలను సబ్బడీపై పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కురుమలకు గొర్రెల పంపిణీతో పాటు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తానని ప్రకటించడం హర్షించద్గ విషయమన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించేందుకు వినూత్న పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం అందజేసిన సబ్బిడీ గొర్రెలను అమ్మకుండా పోషించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో కురుమసంఘం జిల్లా అధ్యక్షుడు బూరుగడ్డ పుష్పనాగేశ్, జిల్లా నాయకుడు డాక్లర్ శ్రీహరి, మహిళ కన్వీనర్ గీత, సదాశివపేట మం డల కురుమ సంఘం అధ్యక్షుడు కొత్తగొల్ల కృష్ణ, గడ్డమీది సత్యనారాయణ, మునిపల్లి మండల అధ్యక్షుడు శంకరయ్య, ప్రధాన కార్యదర్శి బండారి పాండు, ఆత్మకమిటీ చైర్మన్ సత్యనారాయణ, మల్లికార్జున కురుమ సం ఘం అధ్యక్షుడు పైతర సాయికుమార్, నాయకు లు అ నంతయ్య, రాంచందర్, చంద్రన్న, బక్కన్న, గో పాల్, శివశంకర్, రాములు, మల్లేశం, కిష్టయ్య, హనుమయ్య, జగన్నాథం, శివశంకర్, నర్సింలు పాల్గొన్నారు. -
‘రీ సైక్లింగ్’లో విషాదం
ఇటిక్యాల (అలంపూర్): రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కుర్మల ఆర్థికాభివృద్ధి కోసం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం రోజురోజుకూ మరింతగా పక్కదారిపడుతోంది. దీనిపై పెద్దఎత్తున వార్తలు వెలువడుతున్నా.. మంత్రులస్థాయిలో హెచ్చరికలు వచ్చినా, అవకతవకలకు పాల్పడిన కొందరిపై చర్యలు చేపట్టినా.. ‘రీసైక్లింగ్’ జరుగుతూనే ఉంది. దళారులు ఈ గొర్రెలను పక్క రాష్ట్రాలకు తరలిస్తుండగా వాటినే తిరిగి సేకరణ పేరిట కొత్త లబ్ధిదారుల చెంతకు చేరుస్తున్నారు. ఇలా రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకు గొర్రెలను తరలిస్తున్న వ్యాన్ శుక్రవారం బోల్తాపడి 79 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వాటి చెవులకున్న ట్యాగ్‌లను తొల గించినట్లుగా రంధ్రాలుండటంతో ‘రీసైక్లింగ్’ గొర్రెలుగా గుర్తించారు. పట్టుబడకుండా తెల్లవారుజామున: గురువారం అర్ధరాత్రి దాటిన అనంతరం సూర్యాపేట జిల్లా సిద్దిసముద్రం తండా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు ఓ డీసీఎం వ్యాన్‌లో 139 సబ్సిడీ గొర్రెలను తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ రవి నిద్రమత్తులో ఉండడంతో.. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజీ వద్ద వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో వ్యాన్ డ్రైవర్ రవితోపాటు రఘునాయక్, రాముడు అనే వ్యక్తులకు గాయాలయ్యాయి. వ్యాన్‌లోని 79 గొర్రెలు చనిపోయాయి. మిగతావాటికి గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన డ్రైవర్ రవి, రఘునాయక్, రాముడులను చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. గొర్రెల విషయంపై పశువైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇటిక్యాల పశువైద్యాధికారి భువనేశ్వరి, ధర్మవరం పశువైద్య సబ్ సెంటర్ వైద్యుడు రాజేశ్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని గొర్రెలను పరిశీలించారు. చనిపోయినవాటిని పూడ్చి పెట్టించి, బతికున్న వాటిని స్థానిక వీఆర్ఏలకు అప్పగించారు. అయితే ఈ గొర్రెలన్నీ సబ్సిడీపై అందజేసినవేనని, రీసైక్లింగ్ కోసమే అనంతపురం జిల్లాకు తరలిస్తున్నారని పశువైద్యులు, పోలీసులు భావిస్తున్నారు. ప్రతీ గొర్రె చెవికి ట్యాగ్ వేసిన గుర్తులు (రంధ్రాలు) ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో సబ్సిడీపై లబ్ధిదారులకు అందజేసిన సబ్సిడీ గొర్రెలను.. వాటి చెవులకు వేసిన ట్యాగ్‌లను తొలగించి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.