
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో అమలుచేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశంసించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శనివారం సమీక్ష జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి తలసాని కేంద్ర మంత్రికి వివరించారు. గొర్రెల పంపిణీ ఎంతో గొప్ప కార్యక్రమమని, జీవాల ఆరోగ్య పరిరక్షణకు తీసుకున్న చర్యలు బాగున్నాయని గిరిరాజ్ కితాబిచ్చారు. సమావేశంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, పశుసం వర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సువర్ణ, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment