Talasani Srinivas Yadav
-
దళిత నేతను అవమానించారు.. కాంగ్రెస్ పై తలసాని కామెంట్స్
-
ఇథనాల్ మంటలు: కాంగ్రెస్ నేతలకు తలసాని సవాల్
సాక్షి, హైదరాబాద్: దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే, దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని మీడియాతో మాట్లాడుతూ..‘ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో నా కుమారుడికి సంబందం ఉందని పీసీసీ అధ్యక్షుడు, మంత్రి సీతక్క ఆరోపణలు చేశారు. ఇథనాల్ కంపెనీతో మా కుటుంబానికి సంబంధం లేదు. ఇథనాల్ కంపెనీ వద్దు అని అక్కడి గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజమండ్రి దగ్గర ఒక డిస్టిలరీస్ కంపెనీలో 8 మంది డైరెక్టర్లలో ఒకరిగా నా కుమారుడు ఉన్నారు. 2016లోనే డిస్టిలరీస్ కంపెనీ డైరెక్టర్ గా నా కుమారుడు రాజీనామా చేశాడు.ఆ పేపర్లను పట్టుకుని మాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నా కుటుంబానికి చెందిన కంపెనీ అని నిరూపిస్తే మీకే కంపెనీని రాసిస్తాను. బీఆర్ఎస్ పార్టీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. దిలావర్పూర్ గ్రామ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజం. ఇథనాల్ కంపెనీకి గత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇథనాల్ కంపెనీ పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. లగచర్లలో కేటీఆర్ కుట్ర చేశారని ప్రభుత్వం ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. -
పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం: ఎమ్మెల్యే తలసాని
సనత్‌నగర్ (హైదరాబాద్): తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కార్యకర్తలు, నాయకులు అయోమయానికి గురికావద్దని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టం చేశారు. వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద ఆదివారం నిర్వహించిన సనత్‌నగర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన సోదరుడు శంకర్‌యాదవ్ మరణం విషాదం నుంచి తాము ఇంకా కోలుకోలేదన్నారు. శంకర్‌యాదవ్‌తో తనకున్న ప్రత్యేక బంధం సికింద్రాబాద్ ప్రజలందరికీ తెలుసునన్నారు. తమ కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉందని, ఆ కారణంగానే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోతున్నట్లు వివరించారు. -
శ్రీనివాస్ యాదవ్ మౌనం వెనక కారణమేమిటో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో తనదైన ముద్రతో వ్యవహరించే మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల తరుణంలో పెద్దగా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబ సభ్యుల తర్వాత.. ముఖ్యంగా నగర రాజకీయాలకు సంబంధించిన అంశాల్లో అన్నీ తానై వ్యవహరించే తలసాని దూకుడు వైఖరి గతంలో మాదిరిగా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గానికి సంబంధించినంత వరకు చురుగ్గా ఉన్నారని, స్థానిక సమస్యలు విన్నవించుకోవడానికి ప్రతిరోజూ ఉదయం తన వద్దకు వచ్చే ప్రజలను కలుస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజులకు వ్యతిరేకంగా నగరవ్యాప్తంగా జరిగిన ధర్నా తదితర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తోంది. బహుశా, ప్రత్యర్థి పార్టీలపై గతంలో మాదిరిగా తీవ్ర రాజకీయ విమర్శలు చేయకపోవడం వల్లే అయి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వ్యాఖ్యల ఆంతర్యమేమిటో? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వారు నగరానికి వచ్చినప్పుడు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు తానే వెళ్లడం తెలిసిందే. రాజకీయంగా ఎవరిౖపైనెనా వెరవకుండా విమర్శలు, ప్రతివిమర్శలు చేయడాన్ని, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిపై సైతం గతంలో పరుష వ్యాఖ్యలు చేయడాన్ని నగర ప్రజలు గుర్తు చేస్తున్నారు. గతంలో మాదిరి దూకుడు లేకపోవడం వల్ల కావచ్చు వెలితిగా కనిపిస్తోందని అంటున్న వారూ ఉన్నారు. ప్రస్తుతం తమ పార్టీ అధికారంలో లేనందున అనవసర వివాదాల్లో తలదూర్చరాదనే తలంపుతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రాజకీయంగా ఎలాంటి విమర్శలు కానీ, ప్రతివిమర్శలు కానీ చేయడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీలకు సంబంధించి సైతం ఆయన పెద్దగా విమర్శలు చేయలేదు. పైపెచ్చు పేదలకు ఉపకరించే కార్యక్రమాలు ఎవరు చేసినా తమ మద్దతు ఉంటుందని తన నియోజకవర్గంలో ఆయా కార్యక్రమాల ప్రారంభాల సందర్భంగా పేర్కొనడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికలపైనా.. బీఆర్ఎస్ నుంచే ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడంతో సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ తలసానికి ఇవ్వనున్నారనే ప్రచారం మొదలైనప్పటికీ ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దానం పార్టీ మార్పు గురించీ ప్రతిస్పందించలేదు. బహుశా తాను కూడా గతంలో పార్టీ మారడం వల్ల అయి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గత ఎన్నికల్లో ఆయన కొడుకు సాయికిరణ్‌కు టికెట్ కోసం ప్రయత్నించి, సాధించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆయననే రంగంలోకి దింపనున్నారా.. లేక తాను పోటీ చేసే యోచనలో ఉన్నారా అన్నదీ తెలియడం లేదు. అటు పోటీకి సంబంధించి కానీ, ఇటు రాజకీయ వ్యాఖ్యలకు సంబంధించి కానీ తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ తలసాని వ్యవహరిస్తున్న తాజా వైఖరికి కారణమేమిటన్నది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. -
ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
-
గొర్రెల స్కాంలో ముమ్మరంగా సాగుతోన్న దర్యాప్తు
-
ఫైల్స్ చోరీ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన తలసాని ఓఎస్డీ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ కుమార్ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. అయితే, మూడు రోజుల క్రితం.. పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీ అయిన ఉదంతంలో కల్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యాలయం నుంచి పలు కీలక పైళ్లను తీసుకెళ్లారని, మిగతా ఫైళ్లను చిందరవందరగా పడేశారని పేరొన్నారు. ఆఫీస్‌లో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారన్న వాచ్‌మన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కల్యాణ్‌తోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థకశాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించిన కల్యాణ్ బీరువాలో ఉన్న ద్రస్తాలను కారులో తరలించుకునిపోయారు. వాచ్‌మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. అక్కడి సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను చింపేశారు. అంతటితో ఆగకుండా చించివేసిన ఫైళ్లను తన కారులో తరలించుకుని పోయారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం పనిచేయకుండా చేశారు. దీంతో వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. అతడికి సహకరించిన కంప్యూటర్ ఆపరేటర్స్ ఎలిజ మోహన్, అటెండర్లు వెంకటేశ్, ప్రశాంత్‌లపైనా కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. -
నడుస్తున్న ప్రగతికి ఓటెయ్యండి..
-
కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాబోతున్నారు: తలసాని
-
కేసీఆర్ చేసినన్ని కార్యక్రమాలు దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు: తలసాని
-
నాంపల్లిలో ఘోరం.. ఆ ఒక్క తప్పుతో బూడిదైన బతుకులు
-
బజార్ ఘాట్ అగ్నిప్రమాదం.. మృతులకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా
-
బజార్ ఘాట్ అగ్నిప్రమాదంపై కేటీఆర్, తలసాని
-
‘రేవంత్.. మేము కూడా నీలా మాట్లాడగలం’
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి తలసాని యాదవ్ మండిపడ్డారు. రేవంత్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేకంగా తనను, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును నోటికి వచ్చినట్లు రేవంత్ తిడుతున్నాడని, తాము కూడా అలా మాట్లాడగలం అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన తలసాని.. ‘ గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని సీట్లు గెలుస్తున్నాం. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు. తొమ్మిదిన్నర ఏళ్లలో అద్భుతంగా అభివృద్ది చెందింది. పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి పిసిసి నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. హోదా కలిగిన వ్యక్తి పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నియోజకవర్గం లో ఉన్న ప్రజా ప్రతినిధులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు. ప్రజలు వీడి భాషను గమనించాలి. రేవంత్ రెడ్డి ఒక్కడికే వస్తుందా ఆ భాష. నీచంగా మాట్లదటం ఎంత వరకు సబబు. కాంగ్రెస్ పార్టీ దీన్ని గమనించాలి’ అని పేర్కొన్నారు. -
ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు..మా గెలుపు ఖాయం
-
బీసీల కోసం కేసీఆర్ ఎంతో చేశారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీలకు, అట్ట డుగు వర్గాల పేదల అభ్యున్నతికి కేసీఆర్ లాగా కృషి చేసిన ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా లేరని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం తన నివాసంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రాసిన ‘బీసీ ఆత్మగౌరవ భవనాలు’ పుస్తకాన్ని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ సామాజిక వర్గాల జీవన ప్రమాణాలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్మాణాత్మకంగా కృషి చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీలకు ఆత్మగౌరవ భవనాలు కట్టించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, చేతి వృత్తుల వారికి లక్ష రూపాయలు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. ‘మేమొస్తే బీసీ సీఎం’ అని అమిత్ షా ప్రకటించడం పచ్చి బూటకమని విమర్శించారు. బీజేపీకి, కాంగ్రెస్‌కి బీసీ ఓట్ల మీద ఉన్న శ్రద్ధ బీసీల జీవన ప్రమాణాలు పెంచడంపై లేదని విమర్శించారు. పుస్తక రచయిత జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ దార్శ నిక ఆలోచనలకు ఆచరణ రూపంగా బీసీలు నిలిచి తీరుతారని, కేసీఆర్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటారని అన్నారు. -
సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కానిస్టేబుల్ చెంపపై కొట్టిన హోంమంత్రి మహమూద్ అలీ
-
కానిస్టేబుల్ చెంపచెల్లుమనిపించిన హోంమంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. సహనం కోల్పోయిన హోంమత్రి.. తన వ్యక్తిగత సహాయకుడు, గన్‌మెన్ అయిన కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. అమీర్‌పేటల డీకే రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. నేడు మంత్రి తలసాని జన్మదినం సందర్భంగా మంత్రి మహమూద్ అలీ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలో బోకే ఎక్కడ అంటూ తన సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు. అయితే బోకే గురించి తెలియదని సిబ్బంది చెప్పడంతో సహనం కోల్పోయిన హోంమంత్రి మహమూద్ అలీ కానిస్టేబుల్‌ను చెంప దెబ్బ కొట్టారు. దీంతో షాక్ అయిన సదరు గన్‌మెన్ మంత్రిని అలాగే చూస్తుండిపోయారు. ఆకస్మిక ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ క్రమంలో మంత్రి తలసాని.. మహమూద్ అలీకి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. తరువాత వెనకాల ఉన్న వ్యక్తుల దగ్గరి నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహమూద్ అలీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోంమంత్రి అయినంత మాత్రాన సిబ్బందిపై ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Telangana Home Minister Mahamood Ali raises his hand on security for not bringing a bouquet to greet Minister Talasani Srinivas Yadav on his birthday pic.twitter.com/PDUFNcdUnP — Naveena (@TheNaveena) October 6, 2023 -
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటకు మాట
-
కర్ణాటకలో హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ నేతలు తెలంగాణలో డిక్లరేషన్లు పట్టుకుని తిరుగుతున్నారు: తలసాని
-
ఓటమి భయంతోనే బీజేపీ జమిలి ఆలోచనలు
సాక్షి, హైదరాబాద్: ఓటమి భయంతోనే కేంద్రంలోని బీజేపీ జమిలి ఎన్నికల ఆలోచనలు చేస్తోందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు తమదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తాజా సర్వేల్లో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ గెలిచే అవకాశా ల్లేవని పేర్కొన్నారు. డబుల్బెడ్రూమ్ ఇళ్లపంపిణీకి సంబంధించి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలకు సంబంధించి విలే కరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, ఉన్నట్లుండి వేవ్ మార్చితే ఫలితాలు మారతాయని భ్రమ పడుతోందన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా కేసీఆర్ సర్కార్ సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను నియమించిన పార్టీ తమదన్నారు. త్వర లో జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ‘వన్ నేషన్– వన్ ఎలక్షన్’బిల్లు పెడతారనే ప్రచారం జరుగుతోందన్నారు. దేశంలో మోదీ క్రేజ్ పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే నివేదికలు ఆ పార్టీ వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ రెంటికీ కలిపి ఎన్నికలు పెడితే తమకేమైనా లాభం కలుగుతుందనే యోచనలో బీజేపీ ఉందన్నారు. జమిలి ఎన్నికలంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. నిర్ణీత షెడ్యూలు మేరకే ఎన్నికలు నిర్వహించాల్సిందిగా తాము ఈసీని కోరతామన్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. -
వచ్చే నెల 19నే వినాయక చవితి: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వినాయక చవిత ఉత్సవాలపై భాగ్యనగర్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల 19వ తేదీన సాంప్రదాయబద్దంగా వినాయక చవిత పండుగ నిర్వహించుకోవాలని సూచించింది. అలాగే, 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు సోమవారం భేటీ అయ్యారు. గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక చవితి ఏ రోజున జరుపుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే, వచ్చే నెల18వ తేదీన మధ్యాహ్నం చవితి మొదలై 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది. సూర్యోదయం తర్వాత వచ్చిన తిథినే పండుగ రోజుగా గుర్తిస్తాం. కాబట్టి 19వ తేదీన సాంప్రదాయబద్దంగా వినాయక చవిత జరుపుతున్నాం. వచ్చే నెల 28వ తేదీన నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. పొలిటికల్ ఫ్లెక్సీలు వద్దు.. గత ఏడాది లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం. గణేష్ పూజా విధానం తెలిపే బుక్‌తో పాటు పూజా సామాగ్రిని భక్తులకు ఇవ్వాలిని నిర్ణయించాం. గణేష్ మండపాలకు పోలీసు పర్మిషన్ తప్పనిసరి కాదు. స్థానిక పోలీసు స్టేషన్లో చెబితే సరిపోతుంది. గణేష్ ఉత్సవాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు పెడుతున్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే ఫ్లెక్సీలను నిషేధించింది. ఈసారి కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను పెట్టవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు చెప్పాం. గణేష్ ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రావాలని అడిగినట్టు తెలిపారు. పండుగ ఘనంగా నిర్వహిస్తాం.. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. 30వేలకు పైగా వినాయక విగ్రహాలు తయారవుతున్నాయి. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పండుగ సజావుగా జరిగేందుకు కృషి చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున గడిచిన తొమ్మిదేళ్లలో అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహించాం. గణేష్ నిమజ్జన కార్యక్రమం శోభాయమానంగా జరుగుతోంది. వినాయక నిమజ్జనం కోసం తాత్కాలిక చెరువులను ఏర్పాటు చేస్తాం. వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి ఒకేరోజు వస్తున్నాయి. ఆరోజు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఉత్సవాలు నిర్వహిస్తాం. మన తెలంగాణ పండుగ సాంప్రదాయం దేశ విదేశాలకు విస్తరించింది. గణేష్ మండపాల పర్మిషన్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: మొక్కలు రావాలంటే భూమికి తడి తగలాలి..సంస్కృతి నిలబడాలంటే.. -
చట్ట సభల్లో యాదవుల నాయకత్వం పెరగాలి
నాగోల్: రాష్ట్రంలో యాదవుల జనాభా ప్రకారంరాజకీయ పార్టీలు అవకాశాలు కల్పించాలని యాదవ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. యాదవుల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలు స్పష్టం చేయాలని కోరాయి. అఖిల భారత యాదవ మహాసభ యాదవ విద్యావంతుల వేదిక, యాదవ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీల సంయుక్త ఆ ధ్వర్యంలో శుక్రవారం నాగోల్‌లో యాదవ యుద్ధ భేరి పేరిట బహిరంగ సభ నిర్వహించారు. యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలు పా ర్టీలు, యాదవ సంఘాల నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మంత్రి తలసాని మాట్లాడు తూ చట్టసభల్లో యాదవుల నాయకత్వం పెరగాల ని చెప్పారు. త్వరలో హైదరాబాద్‌లో 25లక్షల మంది యాదవులతో భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటుతామన్నారు. యాదవుల్లో ఐక్యత కోసం ప్రతి జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావళి సదర్ వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని కోరా రు. యాదవుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభు త్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని చెప్పారు. యాదవ నాయకుడు ప్రధాని కావాలి బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో గొల్ల కురుమలతోపాటు అన్ని బీసీ, ఎంబీసీ కులాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించారు. రాజకీయ పా ర్టీల బీఫామ్ కోసం బిక్కుబిక్కుమనే పరిస్థితి దాపురించిందని, బీసీలే బీ ఫామ్‌లు ఇచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించా రు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలందరూ ఏకమై రాజ్యా ధికారం సాధించాలని పిలుపునిచ్చారు. అంబర్‌పే ట నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్‌ను యాదవ సంఘ నేత ఆర్.లక్ష్మణ్ యాదవ్‌కు ఇస్తామని, ఐక్యంగా గె లిపించుకోవాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల ప్రదాత బీపీ మండల్ మనవడు, ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో 20 శాతం జనాభా ఉన్న యాదవ నాయకుడు ప్రధానమంత్రి కావాల్సిన అవసరముందని తెలిపారు. తెలంగాణలో 18 శాతం జనాభా ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం నామమాత్రమేనని ఆందోళన వ్యక్తం చేశారు. యాదవుల అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యంపై యాదవ డిక్లరేషన్‌ను చలకాని వెంకట్ యాదవ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి తలసాని క్షమాపణలు
సాక్షి, హైదరాబాద్: ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం సందర్భంగా జరిగిన ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పందించారు. బైంసా ఏఎంసీ ఛైర్మన్ రాజేష్‌బాబుకు మంత్రి క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు. కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందని.. పక్కనున్న ఓ వ్యక్తి తన కాలు తొక్కుతూ ముందుకెళ్లడంతో కాలికి గాయం అయ్యిందని ఆ సందర్భంగానే వ్యక్తిని నెట్టివేశానని అన్నారు మంత్రి తలసాని. సోషల్ మీడియాలో కావాలనే ఈ ఘటనను పెద్దది చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. తను తోసేసిన వ్యక్తి రాజేష్ బాబు అని, గిరిజన బిడ్డ తర్వాతే తెలిసిందని, వెంటనే ఫోన్ చేసి క్షమాపణ చెప్పానన్నారు. ఆ రోజు జరిగిన ఘటనపై గిరిజనుల మనోభావాలు దెబ్బతింటే మరోసారి క్షమాపణ చెబుతున్నానని తలసాని చెప్పారు. తాను బడుగు, బలహీన, దళిత, మైనార్టీ గిరిజన వర్గాల గొంతుకనని, తెలంగాణలో జరిగే సేవాలాల్, కొమురం భీం జయంతి కార్యక్రమాలు ముందుండి చేస్తానన్నారు. ఆ రోజు జరిగిన ఘటనపై వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మరోసారి క్షమాపణ చెబుతున్నానని తలసాని పేర్కొన్నారు. చదవండి: ‘పాలేరు నుంచే తుమ్మల పోటీ’