కార్పొరేషన్‌ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ | Venugopala Chary Appointed TSIDC chairman | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ

Published Fri, Jan 6 2023 3:58 AM | Last Updated on Fri, Jan 6 2023 3:58 AM

Venugopala Chary Appointed TSIDC chairman - Sakshi

వేణుగోపాలచారిని అభినందిస్తున్న  మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌  

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ కార్పొరేషన్‌ చైర్మన్లుగా నియమితులైన వేణుగోపాలచారి, ఈడిగ ఆంజనేయగౌడ్‌ గురువారం జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ (టీఎస్‌ఐడీసీ) చైర్మన్‌గా వేణుగోపాలచారి బంజారాహిల్స్‌లోని ఐడీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు హాజరై వేణుగోపాలచారికి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌గా రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి నేతగా క్రియాశీలకంగా పనిచేసిన ఈడిగ ఆంజనేయగౌడ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎల్‌బీ స్టేడియంలోని స్పోర్ట్స్‌ అథారిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, తలసాని, ఎమ్మెల్సీ కవిత హాజరై శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి నడిచిన ఉద్యమకారులకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో స్టేడియం నిర్మాణంతో పాటు అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement