Venugopala Chary
-
కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వేణుగోపాలచారి, ఈడిగ ఆంజనేయగౌడ్ గురువారం జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ (టీఎస్ఐడీసీ) చైర్మన్‌గా వేణుగోపాలచారి బంజారాహిల్స్‌లోని ఐడీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు హాజరై వేణుగోపాలచారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి నేతగా క్రియాశీలకంగా పనిచేసిన ఈడిగ ఆంజనేయగౌడ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, తలసాని, ఎమ్మెల్సీ కవిత హాజరై శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి నడిచిన ఉద్యమకారులకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో స్టేడియం నిర్మాణంతో పాటు అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. -
పురస్కారాలతో ప్రోత్సాహం: వేణుగోపాల చారి
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఉన్న వారిని గుర్తించి అవార్డులు ప్రదానం చేయడం మంచి విషయమని కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి అన్నారు. మంగళవారం రాత్రి బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో జరిగిన మెగా రికార్డ్స్ ఇండిపెండెన్స్ డే అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు పురస్కారాలు అందించడం ప్రోత్సహకరంగా ఉంటుందన్నారు. మెగా రికార్డ్స్ క్రియేషన్స్ వ్యవస్థాపకులు పి. శ్రీనివాసరావును ఆయన అభినందించారు. అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రేణుకా ప్రభాకర్ శిష్యబృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యప్రదర్శన, చిన్నారి రిత్విక్ శ్రీ డాన్స్ అలరించాయి. బండి రాములు, రుక్మిణి మాతాజీ బృందం యోగానాలు ఔరా అనిపించాయి. 70 ఏళ్ల వయసులో బండి రాములు వేసిన యోగానాలు సభికులను ఆశ్చర్యానికి గురిచేశాయి. 15 మందికి ఈ సందర్భంగా అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి నాగసాయి వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. చిల్లా రాజశేఖర్‌రెడ్డి, జీసీ రెడ్డి, సనాతన బాలరాజు, డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఏఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: డాక్టర్ లాస్యసింధుకు జాతీయ హెల్త్‌కేర్ అవార్డు) -
వర్షాలతో రూ.2,200 కోట్ల నష్టం!
- కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు రాష్ట్రం నివేదిక సాక్షి, న్యూఢిల్లీ: వరద నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరలో కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించనుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర మంత్రులకు హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదివారమిక్కడ రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇటీవలి వర్షాలకు సంభవించిన నష్టంపై నివేదిక అందించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. ‘‘మా విజ్ఞప్తిపై హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రాష్ట్రానికి కేంద్ర బృందాలను పంపి, నష్టాన్ని అంచనా వేసి తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు’’ అని మహమూద్ అలీ చెప్పారు. వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రూ.2,200 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, ఆ మేరకు రూపొందించిన ప్రాథమిక అంచనా నివేదికను రాజ్‌నాథ్‌కు అందజేశామని మంత్రి ఈటల తెలిపారు. ఇటీవలి వర్షాలతో హైదరాబాద్‌కు రూ.1,157 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. రూ.463 కోట్ల మేర ఆర్అండ్బీ, రూ.298 కోట్ల మేరకు పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. మిడ్ మానేరుతో సహా 671 చెరువులకు గండి పడిందనివివరించారు. వర్షాలతో 46 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. -
అమరావతిలో హైకోర్టుకు భూమి దొరకలేదా?
హైకోర్టు విభజనపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ప్రశ్నించారు. అమరావతిలో హైకోర్టుకు భూమి దొరకడం లేదా అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు ఇచ్చింది రూ. 42 వేల కోట్లేనని, అయితే రూ. 90 వేల కోట్లు ఇచ్చినట్లు అమిత్ షా చెప్పడం సరికాదని ఆయన అన్నారు. ఖమ్మంలో అభ్యర్థిని పోటీ పెట్టేందుకు దిక్కులేని బీజేపీ.. 2019లో తెలంగాణలో అధికారంలోకి వస్తానని చెప్పడం విడ్డూరమని విమర్శించారు. -
ఎమ్మెల్యేరాజ్..!
కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జుల హల్చల్ - కింది స్థాయి ప్రజాప్రతినిధులకు అవమానాలు, బెదిరింపులు - అధికారులతో ఘర్షణలు.. తమ ‘పని’ చేయకుంటే బదిలీ చేయిస్తామని బెదిరింపులు - ఓ కాలేజీ యజమానిని చంపుతానని బెదిరించిన నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం - మాట వినకపోతే జైలులో పెట్టిస్తా.. కాంట్రాక్టర్‌కు వేణుగోపాలాచారి హెచ్చరిక - కాంట్రాక్టర్‌ను నోటికొచ్చిన బూతులు తిట్టిన మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి - ఫ్లెక్సీలో తన ఫొటో పెట్టలేదంటూ సొంత పార్టీ కార్పొరేటర్‌పైనే ఎల్బీనగర్ ఇన్చార్జి రామ్మోహన్ వీరంగం - అధికారులపై దౌర్జన్యానికి దిగిన మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యేలు - 25 మంది ఎమ్మెల్యేల కర్ర పెత్తనంపై సర్కారుకు నిఘా వర్గాల నివేదిక సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తమదనే తెంపరితనం.. మంత్రులు తమ వాళ్లనే మిడిసిపాటు.. తామేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు రెచ్చిపోతున్నారు. ప్రజాప్రతినిధులమని మరిచిపోయి విచ్చలవిడిగా.. వ్యవహరిస్తున్నారు. తమ మాట వినని అధికారులు, కింది స్థాయి ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారు. ‘అంతుచూస్తాం.. చంపేస్తాం.. జైలుకు పంపుతా’మంటూ హింసిస్తున్నారు. కమీషన్లు ముట్టజెప్పనిదే పనులు చేయడానికి వీల్లేదంటూ కాంట్రాక్టర్లను దోచుకుంటున్నారు. అంతేకాదు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకూ తమ ‘కక్కుర్తి’తో అడ్డం పడుతున్నారు. ఒకరిద్దరు కాదు ఏకంగా 25 మంది అధికార పార్టీ శాసనసభ్యులు, మరో డజను మంది వరకూ నియోజకవర్గ ఇన్చార్జులు ఇలా వ్యవహరిస్తున్నట్లుగా నిఘా వర్గాలు ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. సామంత రాజులా..?: ఒక్క మాటలో చెప్పాలంటే కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు తమ నియోజకవర్గాల్లో సామంత రాజులుగా చలామణి అవుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకునేందుకు నిఘా వర్గాలు చేసిన ప్రయత్నంతో ఈ నేతల అవినీతి, అక్రమ వ్యవహారాలెన్నో బయటపడ్డాయి. గ్రామాల్లో సర్పంచ్ అయినా, నగరాల్లో కార్పొరేటర్ అయినా వారి చెప్పుచేతల్లో ఉండాల్సిందే. మండలంలో ఎమ్మార్వో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ ఎవరైనా సరే వారి మాటను వేదంగా పరిగణించాల్సిందే. లేదంటే బదిలీ వేటు పడుతుందని బెదిరిస్తారు. అప్పటికీ వినకపోతే అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ప్రచారం చేస్తారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక పంచాయితీల్లో సెటిల్మెంట్లు చేయడం, పంచాయితీకి పిలిచినా రానివారిని బూతులు తిట్టడం, వాట్సప్‌లో తమకు వ్యతిరేకంగా వచ్చే పత్రికల క్లిప్పింగ్‌లు పెడుతున్నారని బెదిరించడం, చెప్పినట్లు చేయకపో తే జైలులో పెట్టిస్తానని బెదిరించడం నిత్యకృత్యంగా మారిపోయాయి. చెప్పిన పని చేయలేదని అధికారులపై చేయి చేసుకున్న మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల తీరు ఇప్పటికే వివాదాస్పదమైంది. ఓ ఎమ్మెల్యే అటవీ అధికారిపై చేయి చేసుకుంటే, మరో మహిళా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మార్వోను ఇంటికి పిలిచి బూతులు తిట్టారు. ఇప్పుడు మరికొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల బెదిరింపు ఫోన్ సంభాషణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నీ సంగతి తేలుస్తా.. చంపుతా.. కాలేజీ యజమానికి నకిరేకల్ ఎమ్మెల్యే బెదిరింపులు నకిరేకల్ నియోజకవర్గంలో ఓ కాలేజీ నిర్వాహకుడు వీరయ్యను పంచాయితీకి రావాలని అక్కడి ఎమ్మెల్యే వీరేశం హుకుం జారీ చేశారు. ఆ పంచాయితీకి బాధ్యులైన వారితో పరిష్కరించుకుంటామని వీరయ్య చెప్పాడు. దీంతో ఎమ్మెల్యే వీరేశం ఆగ్రహంతో ‘అంతు తేలుస్తా’నంటూ బెదిరించారు. మొత్తం 3 సార్లు వీరయ్యకు ఫోన్లో చేసిన బెది రింపుల సంభాషణలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ‘రమ్మంటే రావడం లేదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడకు వస్తా. డ్రామాలు ఆడుతున్నావారా... కొడుకా నీ సంగతి తేలు స్తా’ అంటూ హెచ్చరించారు. ‘నువ్వెక్కడున్నా వచ్చి కొడతా.. తెలుసుకో నా గురించి.. వచ్చి చంపుతా..’ అని బెది రించారు. నియోజకవర్గంలో కింది స్థాయి ప్రజాప్రతినిధులను ఈ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని, అధికారులను అవమానిస్తున్నారని ఆరోపణలున్నాయి. ‘చెప్పినట్లు వినకపోతే జైలుకు పంపుతా..’ ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించిన సీనియర్ నేత వేణుగోపాలాచారి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సముద్రాల వేణుగోపాలాచారి సీనియర్ నేత. మాజీ కేంద్రమంత్రి. ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న ఆయన ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో టెండర్ తీసుకుని పనులు చేస్తున్న ఓ కాంట్రాక్టర్‌ను పని ఆపేయాలని ఒత్తిడి తెచ్చారు. చెప్పినట్లు వినకపోతే లోపలకు (జైలుకు) పంపుతానంటూ బెదిరించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెబితే పని ఆపేస్తానని కాంట్రాక్టర్ పేర్కొనడంతో.. ‘నేను చెపితే వినవా.. అంతు చూస్తా.. నేను చెపుతున్నా. ప్రభుత్వం మాది. మేము చెప్పినట్లు విను. ఇష్టం లేకపోతే కోర్టుకు పో. అంతేగానీ తమాషా చేయకు. చెప్పినట్లు వినలేదో ఇబ్బంది పడతావు’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. హుషారీ చేస్తే పరేషాన్ అయితవు: రామ్మోహన్ ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్‌నగర్ కార్పొరేటర్ తిరుమల్‌రెడ్డి తన డివిజన్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో నియోజకవర్గ ఇన్చార్జి రామ్మోహన్‌గౌడ్ ఫొటోను చిన్నగా పెట్టారట. దీంతో రామ్మోహన్ తిరుమల్‌రెడ్డికి ఫోన్ చేసి ‘ఫ్లెక్సీలో నా ఫొటో పెట్టవా’ అని దబాయించారు. ఫొటో ఉంది కదాని కార్పొరేటర్ సమాధానమిస్తే... ‘చిన్నగా పైన పెడుతవా.. నీది, జగదీశ్‌రెడ్డి (మంత్రి) ఫొటోలు పెద్దగా పెట్టుకుని నన్ను అవమానిస్తావా.. ఇదిగో చెబుతున్నా.. నీకు జగదీశ్‌రెడ్డి ఉండొచ్చు. నా వెంట సీఎం ఉన్నడు. ఏం ఎమ్మెల్యే అయితనని చెప్పుకుంటున్నవంట. హుషారీ చేస్తే పరేషాన్ అయితవు. నువ్వు కార్పొరేటర్ టికెట్ కొనుకున్నవని నాకు తెలుసు. ఈ సంగతి మీడియాను పిలిచి చెబుతా..’ అని బెదిరించారు. ‘కొడుకా నీ సంగతి చెపుతా..’ కాంట్రాక్టర్‌పై మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వీరంగం మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అసైన్డ్ భూములపై కన్నేశారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని స్థానికంగా ఉండే కాంట్రాక్టర్ ప్రసాద్‌గౌడ్ వాట్సప్ గ్రూపులో పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సదరు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి బెదిరించారు. ‘ఎవడో పేపరోడు రాస్తే దానిని వాట్సప్‌లో పెడతవా.. ఎవరి ఏరియా అనుకుంటున్నావు. నా కొడుకా... ఎట్లా పెట్టినవురా, నీ సంగతి చెప్తా, ఫిర్యాదు చేసి లోపల (జైల్లో) వేయిస్తా..’ అంటూ బూతు పురాణం అందుకున్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలు వాట్సప్ గ్రూపుల్లో పెట్టడం ఇటీవల సాధారణమైపోయింది. అది నేరంకూడా కాదు. కానీ మేడ్చల్ ఎమ్మెల్యే ఇదేమీ పట్టించుకోకుండా ‘నా ఏరియాలో ఉంటూ ఇలా చేస్తావా..’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. మిషన్ కాకతీయకూ ఆటంకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులకూ పలువురు ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. అంచనా కంటే 20 శాతానికిపైగా లెస్‌కు టెండర్లు తీసుకున్న కాంట్రాక్టర్లు సైతం స్థానిక ఎమ్మెల్యేకు సొమ్ము ముట్టజెపితే తప్ప పని మొదలుపెట్టలేరు. ఇటీవలే రాష్ట్రస్థాయి అధికారిక పదవి చేపట్టిన నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఒకాయన దెబ్బకు కాంట్రాక్టర్లు పారిపోతున్నారు. పనిచేయకపోయినా ఫర్వాలేదుగానీ ఆ ఎమ్మెల్యే బెదిరింపులు భరించలేమంటూ చాలా మంది పనులే ప్రారంభించలేదు. నల్లగొండ జిల్లాలో రెండు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ కాకతీయ టెండర్లో పాల్గొనడం కోసం కూడా అక్కడి ఓ ఎమ్మెల్యేకు ముడుపులు సమర్పించుకోవాలి. ఇలా అన్ని జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారు. -
ఢిల్లీలోనూ రాష్ట్రావతరణోత్సవాలు
టీఆర్ఎస్ నేత వేణుగోపాలచారి సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కూడా జూన్ 2 నుంచి 7 వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి తెలిపారు. సచివాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2వ తేదీ ఉదయం 9 గంటలకు డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమాలను ప్రారంభిస్తారన్నారు. తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ హాలులో రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థులకు క్విజ్, వక్తృత్వ పోటీలు, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు బతుకమ్మ బోనాలు, కళారూపాల ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. అలాగే రాజిరెడ్డి దంపతులతో కూచిపూడి నృత్యం, హైదర్బాద్ ఖవ్వాలి బ్రదర్స్‌తో ఖవ్వాలి, ఫ్లోరోసిస్ సమస్యపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. -
600 మెగావాట్ల విద్యుత్ ఇవ్వండి
సీఎం కేసీఆర్ తరఫున కేంద్రమంత్రి గోయల్‌కు వేణుగోపాలాచారి లేఖ శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తిలో నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: తీవ్ర విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణకు తక్షణం 600 మెగావాట్ల విద్యుత్‌ను కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు తరఫున ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్‌కు బుధవారం లేఖ రాశారు. ఎవరికీ కేటాయించని (అన్ అలొకేటెడ్) కోటా కింద 600 మెగావాట్ల విద్యుత్‌ను ఇవ్వాలని అందులో విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తిని ఆపాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెస్తున్న ప్రతిపాదనపై కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి, గోయల్, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శులకు రాసిన లేఖల్లో వివరణ ఇచ్చారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ‘‘శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని కోరుతూ రెండ్రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ వాటర్ బోర్డుకు లేఖ రాసింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం తరఫున ఖండిస్తున్నాం. జీవోలు, నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నట్టు రివర్ బోర్డుకు ఇచ్చిన వివరణలో పేర్కొన్నాం’’ అని చెప్పారు. ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశించకుండా కృష్ణా రివర్ బోర్డుకు సూచించాలని కేంద్రాన్ని కోరినట్టు వివరించారు. -
దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ పీవీ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి వేణుగోపాలాచారి వ్యాఖ్య న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు యావత్ దేశం గర్వించదగ్గ తెలుగు ముద్దుబిడ్డ అని, తెలుగు వారందరికీ ఆదర్శనీయులని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. శనివారం సాయంత్రం ఏపీభవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన పీవీ నరసింహారావు 93వ జయంతి వేడుకలకు వేణుగోపాలాచారి, తెలంగాణ రాష్ట్ర మరో ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేణుగోపాలచారి మాట్లాడుతూ... దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప మేధావిగా కొనియాడారు. పీవీ అపరచాణుక్యుడేకాక అభినవ ఆర్థిక సంస్కర్తగా రామచంద్రు అభివర్ణించారు. తెలుగుజాతికి వన్నెతెచ్చిన పీవీ జయంతి, వర్థంతి కార్యక్రమాలను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించాలని ఆశించారు. ఈ కార్యక్రమానికి ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్, సిబ్బంది హాజరయ్యారు. -
'తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్నారు'
హైదరాబాద్: తెలంగాణలో వెటర్నరీ, హార్టీకల్చర్ యూనివర్శిటీ కోసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కు ప్రతిపాదనలు ఇచ్చామని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. వర్షాల రాక ఆలస్యమైందని, రైతులు అధైర్యపడవద్దని భరోసాయిచ్చారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూస్తామని చెప్పారు. ఈ నెల 25, 26 తేదీల్లో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉండవచ్చని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సీమాంధ్ర నేతలు తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. -
టీఆర్ఎస్ అభ్యర్ధి వేణుగోపాలచారిపై కేసు నమోదు!
ఆదిలాబాద్: టీఆర్ఎస్ ముథోల్ అభ్యర్థి వేణుగోపాలచారిపై లోకేశ్వరం పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన వేణుగోపాలచారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి10 గంటల తర్వాత కూడా బహిరంగసభ నిర్వహించారు. ఈసీ నిబంధనలకు వ్యతిరేకంగా 10 గంటల తర్వాత లోకేశ్వరం బహిరంగసభలో ప్రసంగించడంతో వేణుగోపాలచారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
టిఆర్ఎస్లో చేరిన వేణుగోపాలచారి