
అమరావతిలో హైకోర్టుకు భూమి దొరకలేదా?
హైకోర్టు విభజనపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ప్రశ్నించారు. అమరావతిలో హైకోర్టుకు భూమి దొరకడం లేదా అని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు ఇచ్చింది రూ. 42 వేల కోట్లేనని, అయితే రూ. 90 వేల కోట్లు ఇచ్చినట్లు అమిత్ షా చెప్పడం సరికాదని ఆయన అన్నారు. ఖమ్మంలో అభ్యర్థిని పోటీ పెట్టేందుకు దిక్కులేని బీజేపీ.. 2019లో తెలంగాణలో అధికారంలోకి వస్తానని చెప్పడం విడ్డూరమని విమర్శించారు.