Amaravati
-
దావోస్.. అంతా తుస్
సాక్షి,విజయవాడ : పెట్టుబడులు తేకుండానే సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. దావోస్ పర్యటనలో ఒక్క పరిశ్రమతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఏపీకి భారీగా పెట్టుబడులు తెస్తామని బయలు దేరిన చంద్రబాబు, లోకేష్..కానీ మూడు రోజుల దావోస్ సమావేశాల్లో ఒక్క ఎంఓయూ కూడా జరగలేదు. అదే సమయంలో దేశంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో జాతీయ,అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 9.3 లక్షల కోట్లు, తెలంగాణ ప్రభుత్వం రూ.56,300 కోట్ల పెట్టుబడుల ఎంవోయూలు చేసుకున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వంతో మాత్రం ఎంవోయూ కుదుర్చుకునేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రాలేదు. దీంతో ఎంవోయూలు లేకుండా పబ్లిసిటీకే చంద్రబాబు దావోస్ పర్యటన పరిమితమైంది.అదే సమయంలో తన దావోస్ పర్యటన కోసం చంద్రబాబు, తనయుడు నారా లోకేష్‌లు రూ.3కోట్లకు పైగా ఖర్చు చేసి జాతీయ మీడియా ఇంటర్వ్యూ ఇచ్చారు. దావోస్ పర్యటనలో రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చి పారిశ్రామిక వేత్తలకు నారా లోకేష్ చెడు సందేశం పంపారు. దావోస్ పర్యటనలో లోకేష్ సీఎం కావాలంటూ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ భజన చేశారు. బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ పబ్లిసిటీకే పరిమితమైంది. ఏపీలో ఎటువంటి కొత్త ప్రాజెక్టుకు ఎంవోయూ చేసుకోని మైక్రోసాఫ్ట్. దావోస్ నుండి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఏపీ అధికారులు తిరుగుముఖం పట్టారు. -
అమరావతిపై కపట ప్రేమ చూపిస్తున్న కూటమి నేతలు
-
మూడు ప్యాకేజీల కాంట్రాక్ట్ విలువ రూ.1,404.14 కోట్లుగా నిర్ధారణ
-
అమరావతి ‘ముంపు టెండర్ల’లో అక్రమాల వరద
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని కొండవీటి వాగు, పాల వాగు వరద ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు చేపట్టే పనుల టెండర్లలో అక్రమాలు వరదెత్తాయి. పనుల అంచనా వ్యయాన్ని 100 నుంచి 250 శాతం పెంచేసి.. మూడు ప్యాకేజీలుగా విభజించి.. ముందుగా ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) అధికారుల ద్వారా ముఖ్యనేతలు మూడు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. వీటి కాంట్రాక్ట్ విలువ (అన్ని పన్నులతో కలిపి) రూ.1,404.13 కోట్లుగా నిర్దేశించారు. పనుల విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్ట్ సంస్థలకు పనులు అప్పగించి.. పెంచిన అంచనా వ్యయం రూ.702.33 కోట్లను కమీషన్ల రూపంలో రాబట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. మూడు ప్యాకేజీల పనులు ఇవీ ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణంగా ఇస్తున్న నిధులతో మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ చేపట్టింది. ఒకటో ప్యాకేజీ కింద కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 23.6 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 16.75 కి.మీ. పొడవున వెడల్పు చేసి, లోతు పెంచడం, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎల్ఎస్ (లంప్సమ్) విధానంలో 24 నెలల్లో పూర్తి చేయడంతోపాటు మరో రెండేళ్లు నిర్వహించాలని నిబంధనతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.462.26 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా రూ.60.53 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ (నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ ప్యాకేజీ పనుల అంచనా వ్యయం రూ.522.79 కోట్లు. రెండో ప్యాకేజీ ఇదీ రెండో ప్యాకేజీ కింద నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడం.. కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో రెండేళ్లలో పూర్తి చేసి, మరో రెండేళ్లు నిర్వహించాలనే షరతుతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.303.73 కోట్లుగా నిర్దేశించింది.దీనికి అదనంగా రూ.38.57 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా విలువ రూ.342.3 కోట్లు. ఒకటో, రెండో ప్యాకేజీ పనులకు షెడ్యూళ్లు దాఖలు చేయడానికి ఈనెల 31 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరిచి.. అర్హత ఉన్న కాంట్రాక్ట్ సంస్థలు దాఖలు చేసిన ఆరి్థక బిడ్లను ఫిబ్రవరి 5న తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించనున్నారు. మూడో ప్యాకేజీ కింద.. మూడో ప్యాకేజీ కింద మంగళగిరి మండలం నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో ఈ నెల 1న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.470.74 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.68.30 కోట్లను రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా వ్యయం రూ.539.04 కోట్లు. ఈ పనుల టెండర్లలో షెడ్యూళ్ల దాఖలుకు ఈ నెల 22 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్, ఈనెల 25న ఆర్థిక బిడ్ తెరిచి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్ట్ సంస్థకు పనులు కట్టబెట్టనున్నారు. అంచనాల్లో పొంగిపొర్లిన అక్రమాలు రాజధాని ప్రాంతం నల్లరేగడి భూమితో కూడుకున్నది. పెద్దగా రాళ్లు, రప్పలు ఉండవు. పొక్లెయిన్లు వంటి యంత్రాలతో సులువుగా కాలువ తవ్వవచ్చు. పైగా ఇవేమీ కొత్తగా తవ్వే కాలువలు కాదు. కొండవీటి వాగు, పాల వాగులను విస్తరించడమే.. కొత్తగా 7.843 కిమీల పొడవున మాత్రమే కాలువ తవ్వాలి. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి తవ్వడానికి ప్రస్తుతం గరిష్టంగా రూ.100 చెల్లిస్తున్నారు.ఈ లెక్కన 8 నుంచి 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కి.మీ. పొడవున కాలువ తవ్వకం పనుల అంచనా వ్యయం రూ.4.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు మించదని, 10 నుంచి 11 వేల క్యూసెక్కుల కాలువ తవ్వకం పనులకు కి.మీ. రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల (జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ వంటి పన్నులతో కలిపి)కు మించదని జలవనరుల శాఖలో అనేక ప్రాజెక్టుల్లో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక అధికారి తేల్చిచెప్పారు.ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మించడానికి అంచనా వ్యయం జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లకు మించదని రిజర్వాయర్ల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న మరో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఒకరు స్పష్టం చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఒకటో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం రూ.301.75 కోట్లకు మించదు. కానీ.. ఈ ప్యాకేజీ కాంట్రాక్ట్ విలువను జీఎస్టీ వంటి పన్నులతో కలిపి రూ.522.79 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.221.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. కొండవీటి వాగు, పాల వాగు లోతు, వెడల్పు పెంచే పనులకు కి.మీ. రూ.5 కోట్లు చొప్పున వేసుకున్నా రూ.201.75 కోట్లు అవుతుంది. శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.వంద కోట్లు లోపే అవుతుంది.జ్యుడీషియల్ ప్రివ్యూ ఉండి ఉంటే..జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ ఉండి ఉంటే టెండర్ ముసాయిదా షెడ్యూల్ దశలోనే ఈ అక్రమాలు బహిర్గతమయ్యేవని.. అందుకే ఆ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఒకరు స్పష్టం చేశారు. జాయింట్ వెంచర్‌గా ఏర్పడి టెండర్ షెడ్యూల్ దాఖలు చేయడానికి వీల్లేదని నిబంధన పెట్టడం ద్వారా ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్ట్ సంస్థకే పనులు అప్పగించేందుకు ముఖ్యనేతలు ఎత్తుగడ వేసినట్టు స్పష్టమవుతోంది. అదే టెండర్ నోటిఫికేషన్లో 50 శాతం పనులను సబ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే వెసులుబాటును కల్పించడాన్ని బట్టి చూస్తే ముఖ్యనేతల దోపిడీ పన్నాగం బట్టబయలవుతుందని రిటైర్డ్ ఎస్ఈ ఒకరు స్పష్టం చేశారు.రాష్ట్రంలో 2014–19 మధ్య టెండర్ల వ్యవస్థను నీరుగార్చి, ప్రతిపాదన దశలోనే పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. అస్మదీయ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి.. వాటిని కమీషన్ల రూపంలో వసూలు చేసుకుని జేబులో వేసుకోవడానికి ముఖ్య నేతలు మరిగారు. 2019 మే 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని చేసి.. టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సు విధానాన్ని రద్దు చేశారు. రూ.100 కోట్లు.. అంతకంటే వ్యయం ఎక్కువగా ఉన్న పనులకు సంబంధించి టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలి.దీన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసి.. ఇంజనీర్లు, మేధావులు, ప్రజలు, కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఆన్లైన్లో జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి అభిప్రాయాలను తీసుకుంటారు. వాటి ఆధారంగా ముసాయిదా షెడ్యూల్లో మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసిన ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదిస్తారు. దాంతోనే సంబంధిత శాఖ అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూను రద్దు చేసింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని పునరుద్ధరించింది. ఇది జరిగాకే రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు టెండర్లు పిలుస్తున్నారు. మిగిలిన రెండు ప్యాకేజీల్లోనూ ఇదే తీరురెండో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.197.05 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం పన్నులతో కలిపి రూ.342.3 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే అంచనా వ్యయం రూ.145.25 కోట్ల మేర పెంచేసినట్టు స్పష్టమవుతోంది. 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడానికి.. కిలోమీటర్‌కు రూ.6 కోట్ల చొప్పున రూ.47.05 కోట్లు అవుతుంది.కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం రూ.150 కోట్లకు మించదు. మూడో ప్యాకేజీ కింద నీరుకొండ వద్ద 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.200 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.339.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. మొత్తమ్మీద ముంపు ముప్పు నివారించడానికి చేపట్టిన మూడు ప్యాకేజీల పనుల్లో అంచనా వ్యయాన్ని రూ.702.33 కోట్లు పెంచేసినట్టు తేటతెల్లమవుతోంది. -
అమరావతిని అక్రమాలపురంగా మారుస్తున్న కూటమి సర్కార్
-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో అడుగడుగునా కమీషన్లు... సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్ ‘హ్యాపీ నెస్ట్’ టెండర్లలో విచ్చలవిడిగా అక్రమాలు
-
ఏం.. తమాషాలు చేస్తున్నారా?.. పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి,అమరావతి: గుంటూరు పట్టాభిపురం పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేశాం. అయినా ఎందుకు తలదూరుస్తున్నారు’ అంటూ మండిపడింది. మంగళవారం హైకోర్టులో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సోదరి వజ్ర కుమారి, వసంత ఇంటి వ్యవహార కేసు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించినా.. సివిల్ వ్యవహారంలో పట్టాభిపురం పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ వజ్రకుమారి, వసంతల తరఫున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ వ్యతిరేక వర్గానికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారని చెప్పారు. అనంతరం, తమ ఆదేశాలను ధిక్కరించిన పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు న్యాయమూర్తి పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆదేశాలను కచ్చితంగా అమలు అయ్యేటట్లు చూడాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించారు. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తే సదరు పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. -
డిప్యూటీ సీఎం పవన్‌తో దిల్ రాజు భేటీ.. ఈ అంశాలపైనే చర్చ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు అమరావతిలో భేటీ అయ్యారు. తాను నిర్మించిన 'గేమ్ ఛేంజర్' సినిమా త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో వారిద్దరి భేటీ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల ధరల పెంపుతో పాటు విజయవాడలో సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమం ఏర్పాటు గురించి పవన్‌తో దిల్ రాజు చర్చించనున్నారు.తెలంగాణలో సంధ్య థియేటర్ ఘటన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో బెనిఫిట్‌షోలు, టికెట్ ధరల పెంపు వంటి అంశాలు ఉండవని ఆయన క్లియర్‌గా చెప్పేశారు. దీంతో సంక్రాంతి సినిమాలపై భారీగా ప్రభావం పడింది. ఈ క్రమంలో దిల్ రాజు- రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్' జనవరి 10న విడుదల కానుంది. తెలంగాణలో ఈ చిత్రానికి ఎలాంటి బెనిఫిట్‌షోలు, టికెట్ ధరల పెంపు ఉండదు. దీంతో కనీసం ఏపీలో అయినా ఈ సౌలభ్యం పొందాలని చిత్ర యూనిట్ భావించింది. ఈమేరకు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. ఏపీలో టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వాలని ఆయన్ను కోరనున్నట్లు సమాచారం. జనవరి 4,5 తేదీలలో విజయవాడలో గేమ్ ఛేంజర్ మెగా ఈవెంట్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చేలా చూడాలని పవన్‌ను కోరనున్నారు. ఈ భేటీ అనంతరం దిల్ రాజు పూర్తి విషయాలు ప్రకటించే అవకాశం ఉంది. -
అమరావతికి అప్పుల వరద.. బాబు సూపర్ షాక్..
-
హ్యాపీనెస్ట్ నిర్మాణానికి టెండర్లు
సాక్షి, అమరావతి: అమరావతిలోని నేలపాడులో నిర్మించనున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం అమల్లో ఉన్న సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టెండర్ డాక్యుమెంట్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. కానీ అప్పటి నుంచి టెండర్లను ఆహ్వానించకుండా.. జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దు చేసిన తర్వాత ఇప్పుడు సీఆర్డీఏ ద్వారా టెండర్లను ఆహ్వానించడం గమనార్హం. అలాగే ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.720 కోట్ల నుంచి రూ.930 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇప్పుడు సీఆర్డీఏ ద్వారా ఈ ప్రాజెక్టుకు రూ.818.03 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ కాంట్రాక్టు విధానంలో టెండర్లను ఆహ్వానించింది. ప్రాజెక్టు పూర్తికి 24 నెలల గడువుఈ ప్రాజెక్టులో భాగంగా జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 అపార్ట్మెంట్ యూనిట్లు నిర్మించాలని టెండర్ డాక్యుమెంట్లో సీఆర్డీఏ పేర్కొంది. షేర్ వాల్ టెక్నాలజీ వినియోగం ద్వారా హ్యాపీనెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. అంతర్గత–బాహ్య విద్యుత్ పనులు, ప్లంబింగ్, శానిటరీ, అగ్నిమాపక పనులు, లిఫ్ట్‌లు, ల్యాండ్ స్కేపింగ్ తదితర పనులు చేపట్టాలని పేర్కొంది. ఓపెన్ టెండర్ విధానంలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు సీఆర్డీఏ తెలిపింది. టెండర్ దక్కించుకున్న సమయం నుంచి 24 నెలల్లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్లంబింగ్, శానిటరీ, ల్యాండ్‌స్కేప్, ఫైర్ ఫైటింగ్, లిఫ్ట్‌లు, సెక్యూరిటీ వ్యవస్థ, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ తదితరాలను అంశాల వారీగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే పనులు పూర్తి చేసినప్పటి నుంచి మూడేళ్ల సమయాన్ని డిఫెక్ట్ లయబిలిటీగా సీఆర్డీఏ పేర్కొంది.10% మొబిలైజేషన్ అడ్వాన్స్..కాంట్రాక్టు వ్యయంలో 10శాతం మేర మొబిౖలెజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పనులు దక్కించుకున్న సంస్థలకు ముందుగానే పనుల విలువలో పది శాతం మేర మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు టెండర్లో పేర్కొంది. అంచనావ్యయానికి ఐదు శాతంలోపు కోట్ చేసిన టెండర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. అంతకన్నా ఎక్కువ కోట్ చేసిన టెండర్లను తిరస్కరించనున్నట్లు వెల్లడించింది. టెండర్ల దాఖలుకు వచ్చే నెల 8 వరకు గడువు ఇచ్చింది. 8వ తేదీ సాయంత్రం సాంకేతిక బిడ్‌ను తెరవనున్నట్లు ప్రకటించింది. జనవరి 10న ఆర్థిక బిడ్‌ను తెరవనున్నట్లు తెలిపింది. -
పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ
పుణే: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. మహారాష్ట్రలోని పుణే నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అమరావతికి చెందిన కార్మికులు వారి కుటుంబాలతోపాటు రెండు రోజుల క్రితం ఉపాధి కోసం పుణేకు వచ్చారు. వఘోలి ప్రాంతంలోని కెస్నాడ్ ఫటా ఫుట్‌పాత్‌పై వీరంతా నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 12.55 గంటల సమయంలో అదుపు తప్పిన ఓ ట్రక్కు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైగా దూసుకెళ్లింది. ఘటనలో రెండేళ్లలోపు ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ గజానన్ టొట్రేను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
రాజధానికే రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా?
సాక్షి, విశాఖపట్నం: రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలోనే నిధులను ఖర్చు చేసి... ఇతర ప్రాంతాలకు అన్యాయం చేయడం సరికాదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విమర్శించారు. రాజధానికే రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా? అని ఆయన ప్రశి్నంచారు. రాజధాని పేరుతో ఉత్తరాం«ధ్ర, రాయలసీమలను పట్టించుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈఏఎస్ శర్మ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ‘గుంటూరు జిల్లా అమరావతిలో రానున్న మూడేళ్లలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణాలు, ఇతర నిధులన్నీ దాదాపు రూ.50వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నామంటూ ప్రభుత్వం ప్రకటించడం ఆందోళన కలిగించే అంశం. ఈ రుణభారం భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలపైనా పడుతుంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల నుంచి కూడా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలి. అమరావతి రాజధాని వల్ల మిగిలిన ప్రాంతాలకు ఎంత లాభం ఉందో తెలీదు కానీ... అన్యాయం మాత్రం తీవ్రంగా జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తిగా భావిస్తున్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తుంటే దాన్ని ఆపకుండా... పక్కనే నక్కపల్లిలో ప్రైవేట్ కంపెనీ ఆర్సెల్లరీ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను స్థాపించేందుకు మొగ్గు చూపడం ఎంతవరకు సమంజసం? ఈ ఒక్క నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వానికి ఉత్తరాంధ్రపై ఉన్న ఉదాసీనత బట్టబయలైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం విభజన చట్టంలో ఉన్న హామీలపై ఇంతవరకు కూటమి ప్రభుత్వం కేంద్రంతో చర్చించకపోవడం కూడా మీ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ వ్యవహారంపై మీరు చూపించిన చొరవపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. రాజధాని పేరుతో బిల్డింగులు, హంగులపై ప్రజల నిధులు ఖర్చు చేసే బదులుగా.. ప్రభుత్వ విధానాల్లో వికేంద్రీకరణ, ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకురావడం, ప్రజాస్వామ్య విధానాలపై దృష్టి సారిస్తే మంచిది. వెనుకబడిన ప్రాంతాలను విస్మరించి వేల కోట్ల రూపాయలను రాజధానికి ఖర్చు చేస్తే రాష్ట్ర ప్రజలు హర్షించరన్న విషయాన్ని గుర్తించాలి..’అని లేఖలో శర్మ పేర్కొన్నారు. -
అమరావతికి కేంద్రం ఇచ్చేది గ్రాంట్ కాదు అప్పే
-
అప్పులతోనే అమరావతి.. పెండింగ్ పనులకు 30వేల కోట్లు!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ అప్పులు చేయడంలో ఫుల్ బిజీ అయిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పులతోనే అమరావతిలో నిర్మాణాలకు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ ద్వారా కేంద్రం అప్పులు ఇప్పిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి కోసం బాబు సర్కార్ 30వేల కోట్ల అప్పులు చేస్తోంది.అప్పులతోనే అమరావతి చేస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు నుండి రూ.6,800 కోట్ల అప్పు తీసుకునేందుకు నిన్న బోర్డు మీటింగ్‌లో ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఏడీబీ ద్వారా అమరావతి కోసం ప్రభుత్వం రూ.6700 కోట్లు అప్పు తెస్తోంది. ప్రపంచబ్యాంకు, ఏడీబీ అప్పులు కలుపుకుంటే అమరావతి కోసమే బాబు సర్కార్ రూ.13,500 కోట్లు అప్పులు చేస్తోంది.ఈ నేపథ్యంలో అమరావతికి కేంద్రం ఇచ్చేది గ్రాంట్ కాదు అప్పు మాత్రమేనని మరోసారి తేలింది. కేంద్రం నిధులు ఇస్తోందంటూ ఇన్నాళ్లూ చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. కానీ, కేంద్రం కేవలం.. ఏడీబీ, ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు మాత్రమే ఇప్పిస్తోంది. ఈ అప్పులన్నింటీనీ కూటమి సర్కార్.. అమరావతి కోసం మళ్లిస్తోంది. మరోవైపు.. హడ్కో ద్వారా 11వేల కోట్లు, కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా 5 వేల కోట్లను బాబు సర్కార్ అప్పుగా తీసుకుంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అమరావతి కోసం సుమారు 30 వేల కోట్ల అప్పు చేస్తోంది. అమరావతిలో పెండింగ్ భవనాల కోసం అప్పులు చేస్తూ.. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో అభివృద్ధి పనులను నిలిపి వేసింది. ప్రస్తుతం అప్పులన్నీ అమరావతికే కేటాయిస్తోంది. -
ఇది ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం
తాడేపల్లి: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపిన కూటమి ప్రభుత్వం...ఈ విషయంలో తక్షణమే పెంచిన భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజల తరుపున వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలు, మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ..ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంరాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోపిన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా ఏఈ లేదా డీఈ కార్యాలయంకు వెళ్ళి, అధికారులకు మెమోరాండంను సమర్పించాలి. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలని సూచించారు.‘ఇది అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి, వారికి న్యాయం జరిగేలా ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, ప్రజాసమస్యలపై ఎంత దృఢంగా ఉందో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడయింది. జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ రెండో కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి’ అని పిలుపునిచ్చారు.ఇందుకు సంబంధించి వైఎస్సార్ సిపి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి. ఈ కార్యక్రమాన్ని ముందు జిల్లా స్ధాయిలో నిర్వహించాలని భావించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నియోజకవర్గ స్ధాయిలో చేయాలని మన అధినేత జగన్ అందుబాటులో ఉన్న నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్ధాయిలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఆయా నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు అందరూ తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. నియోజకవర్గ ఇంఛార్జ్‌లంతా కూడా తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ దోపిడినీ ఎండగట్టాలని సజ్జల పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి..ఈ నెల 21 న మన అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలి, జగన్‌గారిపై ఉన్న ప్రజాభిమానం ఈ సందర్భంగా వెల్లడవ్వాలి, పార్టీ క్యాడర్ అంతా ఉత్సాహంగా పాల్గొని జగన్‌గారిపై ప్రజాభిమానం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలి, ఈ వేడుకలను అందరం విజయవంతం చేద్దాం’ అని సజ్జల పేర్కొన్నారు.సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉందాంసోషల్ మీడియాకు సంబంధించి కొత్తగా మరికొంతమంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారు, వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు లీగల్ సెల్ సిద్దంగా ఉంది, ఏ సమయంలో ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే లీగల్ సెల్‌ను అప్రమత్తం చేసి వారికి అండగా నిలబడాలి. ఇటీవల సోషల్ మీడియా యాక్టివిస్టుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పోలీసులకు తెలియజేసి, దానిని అతిక్రమిస్తే వచ్చే ఇబ్బందులను పోలీసులకు తెలియజేయాలి. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు అవసరమైన సహాయం చేసేందుకు పార్టీ నాయకులు కూడా వెంటనే అందుబాటులో ఉండాలి’ అని సజ్జల హితవు పలికారు. -
అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంతలు తొక్కుతుందని ఎల్లోమీడియాలో కథనాలు
-
అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయమవుతోంది
సాక్షి, హైదరాబాద్: అమరావతి అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు వెళ్తాయేమోననే అభిప్రాయం ఉండేదని, ఇటీవల అమరావతిలో సంభవించిన వరదలతో ఆ భావన పోయిందన్నారు. పొంగులేటి సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోందన్నారు. సెప్టెంబర్‌తో పోలిస్తే నవంబర్‌లో, నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో కొంత పురోగతి కనిపిస్తోందని, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా పెరుగుతోందని చెప్పారు. పెట్టుబడులు ఆంధ్రకు వెళ్లే అవకాశముందా అని విలేకరులు ప్రశ్నించగా... పెట్టుబడిదారులంతా తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారని, కొందరు బెంగళూరు వైపు చూస్తున్నారని చెప్పారు. ‘అమరావతిలో ఇటీవల వచ్చిన వరదలతో సీన్ మారిపోయింది. వాళ్లు ఎంత బూస్టప్ ఇవ్వాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకున్నా వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు’అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల్లో హైడ్రా పట్ల భయం పోయిందని, మొదట్లో తప్పుడు ప్రచారం వల్ల కొంత వేరే అభిప్రాయం ఉన్నా.. ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసిపోయిందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. సంక్రాంతికి రైతు భరోసా తప్పకుండా ఇస్తామని చెప్పిన పొంగులేటి.. రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు రూ.12వేలను రెండు దఫాల్లో ఇస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని, ఇందుకోసం విడతకు రూ.1000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.7 లక్షల కోట్లు అప్పు వాస్తవమని, ఈ విషయంలో చర్చ నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ గొడవ చేయాలని చూస్తోందన్నారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు లెక్కలోకి రావా అని ప్రశ్నించారు. అసలు కార్పొరేషన్ల నుంచి ఒక్క రూపాయి అయినా ఆదాయం వచ్చే పరిస్థితి ఉందా అని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, సినిమా వాళ్లు, జర్నలిస్టులు, ప్రజలందరూ తమకు సమానమేనని అన్నారు. శాసనసభలో ఎవరి పాత్ర వారు పోషించాల్సిందేనని, భట్టిపై ప్రివిలేజ్ తీర్మానం ఇవ్వడం బీఆర్ఎస్ హక్కు అని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని, ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో చర్చలో మాట్లాడాలని తనకు కూడా కోరికగా ఉందని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, ఆదానీ విషయంలో ఏఐసీసీ విధానమే తమ విధానమని స్పష్టంచేశారు. -
‘అమరావతి’కి ఇచ్చేది అప్పే!
సాక్షి, అమరావతి: అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన రూ.15 వేల కోట్లు రుణమని తేలిపోయింది. ఈ మొత్తం కేంద్రం నుంచి గ్రాంట్‌గా ఇస్తున్నట్లు ఇప్పటికే శాసనసభలో ప్రకటించిన సీఎం చంద్రబాబు.. అందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా సభలో ధన్యవాదాలు సైతం తెలిపారు. ఇక ప్రకటించిన మొత్తంలో రూ.13,500 కోట్లు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి కేంద్రం రుణం తీసుకుని ఏపీ రాజధాని నిర్మాణానికి గ్రాంట్‌గా ఇస్తున్నట్లు కూటమి నేతలు ప్రచారం చేశారు. కానీ, ఇవన్నీ అబద్ధమని.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు ఇచ్చేది పూర్తిగా షరతులతో కూడిన రుణమని తాజాగా బహిర్గతమైంది. ఈ మేరకు గురువారం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సమావేశమైన ఆసియా అభివృద్ధి బ్యాంకు బోర్డు అధికారులు ‘అమరావతి ఇన్‌క్లూజివ్ అండ్ సస్టెయినబుల్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్’కి 788.8 మిలియన్ డాలర్ల రుణాన్ని (సుమారు రూ.6,694.36 కోట్లు) ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఈ రుణం మొత్తం థీ121.97 బిలియన్ల జపనీస్ యెన్‌లో అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తంతో అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పథకం కింద వాటాదారులుగా ఉన్న రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వ కాంప్లెక్స్, మౌలిక సదుపాయాలతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం ఖర్చుచేయాలని సూచించారు. ఈ మొత్తాన్ని ఇతర బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల (మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్) సహకారంతో ప్రోగ్రామ్‌కు మద్దతు ఉంటుందని ఏడీబీ భారతదేశ కంట్రీ డైరెక్టర్ మియో ఓకా తెలిపారు. ఇక రుణంగా ఇచ్చే మొత్తానికి వడ్డీ ఉండదని, కానీ 20 ఏళ్ల తర్వాత వాయిదాలుగా ఆనాటికి ఉన్న డాలర్ల విలువకు సమానంగా చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే, అప్పటికి డాలర్ విలువ 20 రెట్లు పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమరావతికి వచ్చే రూ.15,000 కోట్లలో ఏడీబీ, ప్రపంచ బ్యాంకులు ఇచ్చే రూ.13,500 కోట్ల రుణం కాగా, మిగిలిన మొత్తాన్ని కేంద్రం ఇవ్వనుంది. -
నేడు సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణ
-
నేడు సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ
ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఏకైక రాజధాని అని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామని తెలిపింది. కేసు విచారణను ముగించాలని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. చదవండి : ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు! -
అమరావతిని మళ్లీ బంగారు బాతులా మార్చుకున్న కూటమి సర్కారు
-
న్యాయ సాయం కోరే హక్కు నిందితునికి ఉంది
సాక్షి, అమరావతి : ఏదైనా కేసులో నిందితుడిని పోలీసులు పీటీ వారెంట్ మీద మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినప్పుడు, అతను పోలీసు లేదా జ్యూడిషియల్ కస్టడీని వ్యతిరేకిస్తూ తనకు న్యాయ సాయం అందించాలని మేజిస్ట్రేట్‌ను కోరవచ్చని హైకోర్టు తెలిపింది. అలా కోరే హక్కు నిందితుడికి ఉందని స్పష్టం చేసింది. మేజిస్ట్రేట్లు నిందితుడి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి అని అభిప్రాయపడింది. సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్‌కు హైకోర్టు ఈ వెసులుబాటుని ఇచ్చింది. రవికిరణ్‌కు సంబంధించి వివరాలేమీ పోలీసులు తమకు తెలియజేయడంలేదని, దీంతో న్యాయ సాయం పొందే అవకాశం లేకుండా పోతోందన్న అతని తరఫు న్యాయవాది వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాగే రవికిరణ్‌పై నమోదైన కేసుల వివరాలును తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. పీటీ వారెంట్ల వివరాలను పోలీసులు నిందితునికి తెలియచేయాల్సిన పని లేదని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది. తన భర్త రవికిరణ్‌పై ఉన్న కేసుల వివరాలు, పీటీ వారెంట్లపై పోలీసులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదంటూ ఇంటూరి సుజన హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సుజన తరఫున న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది (హోం) ఎ.జయంతి వాదనలు వినిపించారు. -
మళ్లీ వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు అప్పు రూ.4,237 కోట్లు
సాక్షి, అమరావతి : సంపద సృష్టించడం అంటే ప్రజలపై ఆర్థిక భారం మోపడం, అప్పులు చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ రూ.4,237 కోట్లు అప్పు చేయనుంది. పదేళ్ల వ్యవధిలో రూ.1,237 కోట్లు, 14 సంవత్సరాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 15 సంవత్సరాల వ్యవధిలో రూ.1,500 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. వచ్చే మంగళవారం సెక్యురిటీల వేలం ద్వారా ఆర్బీఐ ఈ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించనుంది. గత మంగళవారమే 7.18 శాతం వడ్డీకి రూ.2000 కోట్లు అప్పు చేసిన విషయం తెలిసిందే.. దీంతో చంద్రబాబు ప్రబుత్వం ఇప్పటి వరకు చేసిన అప్పులు రూ.67,237 కోట్లకు చేరనున్నాయి. -
ఉద్యోగ భద్రత కోసం చంటి బిడ్డలతో టీచర్ల ధర్నా
అమరావతి: ‘డీఎస్సీ నుంచి మినహాయించి.. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏడాది మూడు నెలల చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని ధర్నా చేస్తున్న ఈమె పేరు పి.పర్శిక. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూనవరం గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో సైన్స్ టీజీటీగా పనిచేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో తమ పోస్టులు కూడా ఉండడంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తన ఉద్యోగం పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.దాదాపు 237 కిలోమీటర్ల దూరంలోని కూనవరం నుంచి విజయవాడకు వచ్చి తన ఉద్యోగానికి భరోసా కల్పించేలా కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేయాలని రోజుల తరబడి ధర్నా చేస్తోంది’.పర్శిక టీచర్‌తోపాటు వందలాది మంది తమ ఊరు, వాడ, గూడు వదిలి వచ్చి విజయవాడ ధర్నా చౌక్‌లో గత 13 రోజులుగా శాంతియుత నిరసన కొనసాగిస్తున్నా సర్కార్ కనికరించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని లోకేశ్ ఓఎస్డీ చెప్పిన గడువు శుక్రవారంతో ముగుస్తుందని, తమ డిమాండ్లపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని గిరిజన గురుకులాల ఔట్ సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మీనాయక్ గురువారం నాటి కార్యక్రమంలో తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. – సాక్షి, అమరావతి -
'ఆర్జీవీ' పరారీలో ఉన్నారనుకునే వారికి బ్యాడ్ న్యూస్
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కేసులకు భయపడి పరారీలో ఉన్నారని అనుకునే వారి కోసం ఆయన సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. ఇదే క్రమంలో తనపై పెట్టిన కేసులు వాటి సెక్షన్ల వివరాలను పొందుపరిచారు. తాను చేసిన తప్పేంటి..? పోలీసులు నమోదు చేసిన కేసు ఏంటి..? అనేది అందరికీ అర్థం అయ్యేలా తెలుపుతూ.. తన సోషల్ మీడియాలో భారీ ట్వీట్ చేశారు.వర్మ భయపడి పరారీలో ఉన్నారనుకునే వారికి ఆయన పెద్ద షాకిచ్చారని చెప్పవచ్చు. అలాంటి ప్రచారాలతో ఆనందపడి సెలబ్రేట్ చేసుకునే వారికి బ్యాడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం తాను ఎక్కడ ఉన్నారో తెలుపుతూ.. సుమారు 20కి పైగా పాయింట్లతో ఒక ట్వీట చేశారు.వర్మ తన ట్విటర్లో ఇలా షేర్ చేశారు..1.నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ .. ఎందుకంటే ఈ టైమ్ అంత నేను నా డెన్ ఆఫీసులోనే ఉన్నాను, అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకి వెళ్ళడం తప్ప.2. ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంత వరకు నా ఆఫీసులోకి కాలే పెట్టలేదు.. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒక వేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసులోకి ఎందుకు రారు..?3. నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్, ఇప్పుడు సడెన్‌గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినటం మూలన ఆ కంప్లయింట్ ఇచ్చారట.4.ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే నలుగురు వేర్వేరు వ్యక్తులు , ఆంధ్ర ప్రదేశ్‌లోని 4 వేర్వేరు జిల్లాల్లో నా మీద ఈ కేసు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదు అయ్యాయి, అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు, ఇవన్నీ కూడా కేవలం గత 4 , 5 రోజుల్లోనే నమోదు అయ్యాయి.5.నాకు నోటీసు అందిన వెంటనే , నా సినిమా పనుల వల్ల, సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది. ఆయన కూడా అనుమతించడం జరిగింది . కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం , లేకపోతే విడియో ద్వారా హాజరు అవుతాను అని తెలియజేయడం జరిగింది. .. అదే టైమ్‌లో నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడం వెనక ఏదో కుట్ర ఉంది అని కూడా నాకు ,నా వాళ్లకు అనుమానం కలిగింది.6. నేను సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటాను, చాలాసార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని, ఒక సంవత్సర కాలంలో కొన్ని వేళ పోస్టులు చేసి ఉంటాను. వాళ్ళు నేను పెట్టాను అంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రానికి సంబంధించినవి, ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం ఆ చిత్రం విడుదల అవ్వడం కూడ చాలా నెలల క్రితం జరిగిపోయింది.7. నేను పెట్టాను అంటున్న పోస్టులు , వేటి వల్ల ఐతే కొందరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాలలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారో అవి ఈ నోట్ క్రింద పెట్టడం జరిగింది.8. ఈ మీమ్స్ కారణంగా నా మీద 336 (4), 353 (2), 356 (2), 61 (2), 196, 352 of BNS and section 67 of IT సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయబడ్డాయి.9. BNS 336(4) ఏం చెబుతుందంటే.. ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్టును కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం. అయితే, నేను చేసిన పోస్టుల చూస్తే , అందులో ఫోర్జరీ ఎక్కడుంది? , అది కేవలం ఒక కార్టూన్, ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి? 10. BNS 353(2)తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా, మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం . అయితే, నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు.11. BNS 356. (1)ఎవరైనా మాటల ద్వారా గానీ , రాతల ద్వారా గానీ , సంకేతాల ద్వారా గానీ , చిహ్నాల ద్వారా గానీ ఒకరి పరువుకు నష్టం కలిగించడం. ఇలాంటి మీమ్స్లపై పరువు నష్టం కేసులేస్తే రోజుకి లక్ష కేసులు కూడా దాటుతాయి.12. BNS 61(2)ఒక చట్ట విరుద్ధమైన పని చేయడం కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందం. ఇక: మోసపూరిత విధానంలో చద్దబద్దమైన ఫలితం పొందడం. అయితే, దీనితో నాపై ఉన్న కేసుకు లింక్ కెంటి..?13. BNS 196 వేర్వేరు గ్రూపుల మధ్య మతం, ప్రాంతం, జన్మ స్థలం, నివాస ప్రదేశం మొదలైన వాటి ప్రాతిపదికన విద్వేషం సృష్టించడం, శాంతికి భంగం కలిగేలా చేయడం.14. SECTION 67 IT act ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించబడిన లేదా ప్రసారం చేసిన లేదా ప్రసారం చేయడానికి లేదా ప్రసారం చేయడానికి కారణమయ్యే ఎవరైనా, కామాంతమైన లేదా ప్రేక్షక ఆసక్తిని ఆకర్షించటం. Section 67 కేవలం అసభ్యకర విషయాల్ని సృష్టించిన లేదా వ్యాప్తి చేసిన నేరం. అయితే, ఒక వ్యంగ్య చిత్రంలో అసభ్యకరం ఏముంటుంది.. ?15. నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయబడింది అని చెప్పబడుతున్న విషయం , భారత రాజ్యాంగం ARTICLE 19(1)a ప్రకారం న్యాయబద్దమైనది. దీని ప్రకారం ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్చగా తెలియజేయవచ్చు. ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, రాతల ద్వారా, చిత్రాల ద్వారా, సినిమాల ద్వారా, పోస్టర్ల ద్వారా కూడా అవ్వచ్చు.16. ప్రతి ప్రజాస్వామ్య సమాజంలో మూలస్తంభం వాక్ స్వాతంత్రం. దాని ప్రథమ లక్షణం, ఒక వ్యక్తి తన దగ్గరున్న సమాచారాన్ని ఓపెన్‌గా మాట్లాడగలగడం.. అదే విధంగా ఇతరుల నుంచి ఏ విధంగానైనా వచ్చే వాటినీ స్వీకరించటం. ఇది స్వేచ్చ ప్రధాన హక్కు, ఈ హక్కు ను నిర్మూలించడం లేదా హద్దులు నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం.17. ఈ మీమ్ అనే భావప్రకటన ప్రస్తుత సమాజంలో తమ ఆలోచనలను,భావాలను, ఉద్దేశాలను, శైలీని,ప్రవర్తనలు వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధకం. విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కల్చర్లొ ముఖ్య భాగం అయ్యింది. మీమ్స్ అనేవి ఇమేజ్, వీడియో లేదా వాక్యము రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రమే.18. మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతి రోజు ఈ సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ,బూతులు తిట్టుకుంటూ, బోధనలు చేస్తుంటారు… ఇప్పుడు వీటన్నింటినీ సీరియస్‌గా తీసుకుంటే దేశంలో సగం మంది పైన కేసు పెట్టాలి.19. ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే.. నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారణకు హాజరు కావటానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనటానికి అనుమతి కావాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపిన 30 నిమిషాలలో పోలీసులు నా ఆఫీసుకు వచ్చారు. కానీ వాళ్ళు నా ఆఫీసులోపలకి రాలేదు, నన్ను అరెస్టు చేయటానికి వచ్చాం అని కూడా చెప్పలేదు.20. ఇప్పుడూ మీడియాలో వస్తున్న కథనాలు… నన్ను పట్టుకోవటానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారు, వాళ్ళు ముంబై, చెన్నై ఇంకా పలు చోట్ల వెతుకుతున్నారు, నేను పరారీలో ఉన్నాను అనేవి అన్ని అబద్ధాలు.. కానీ ఈ మీడియా ప్రతిసారి మాదిరే హై డ్రామా క్రియేట్ చేసింది.21. నేను నా మొబైల్ ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయటానికి ప్రధాన కారణం, లెక్కలేనన్ని మీడియా కాల్స్, ఇంకా పరామర్శ కాల్స్ ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి. ఇప్పటి వరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైమ్‌కి నాకు ఆఫీసర్ల నుండి ఎటువంటి సమాధానం రాలేదు. నామీద ఒకేసారి వివిధ జిల్లాలో కేసులు నమోదవటం అనేది ఏదో కుట్ర జరుగుతుంది అనిపించింది. అందుకే నేను ముందస్తు బెయిల్ అప్లై చేశాను. కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తీనీ లేక ఒక గ్రూప్‌నీ నిందించటం లేదు. కానీ, వెనుక ఏదో జరుగుతుందని మాత్రం అర్థం అవుతోంది.22. నేను చట్టాన్ని గౌరవిస్తాను. అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలును కచ్చితంగా పాటిస్తాను. కాని దానితో పాటు రాజ్యాంగ పరిధిలో నాకు చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా వినియోగించుకుంటాను.ఎప్పటిలాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకుని అందులో నన్ను సెంట్రల్ కేరక్టర్‌గా చేసి ఒక సినిమా తీసింది. నాకు కూడా వాళ్ళకున్నత టాలెంట్ ఉండి ఉంటే ఎంత బాగుండేదో?నా కేసు —- RGV @ndtv @IndiaToday @TimesNow @republic @TV9Telugu @NtvTeluguLive @sakshinews @tv5newsnow @BBCWorld @DDNewslive @ZeeNews 1.నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ…— Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2024