టీఆర్ఎస్ అభ్యర్ధి వేణుగోపాలచారిపై కేసు నమోదు!
టీఆర్ఎస్ అభ్యర్ధి వేణుగోపాలచారిపై కేసు నమోదు!
Published Sun, Apr 27 2014 2:56 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
ఆదిలాబాద్: టీఆర్ఎస్ ముథోల్ అభ్యర్థి వేణుగోపాలచారిపై లోకేశ్వరం పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన వేణుగోపాలచారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
శనివారం రాత్రి10 గంటల తర్వాత కూడా బహిరంగసభ నిర్వహించారు. ఈసీ నిబంధనలకు వ్యతిరేకంగా 10 గంటల తర్వాత లోకేశ్వరం బహిరంగసభలో ప్రసంగించడంతో వేణుగోపాలచారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement