ఆదిలాబాద్ నియోజకవర్గంలో జోగు రామన్న మరోసారి టిఆర్‌ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాదించారు. దీంతో ఆయన నాలుగుసార్లు గెలిచినట్లయింది. ఒకసారి టిడిపి తరపున, మూడుసార్లు టిఆర్‌ఎస్ పక్షాన గెలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్‌లో 2014లో తర్వాత మంత్రిగా ఉన్న జోగు రామన్నకు 2018లో గెలిచిన తర్వాత మంత్రి పదవి దక్కలేదు.
జోగు రామన్న తన సమీప బిజెపి ప్రత్యర్ది పాయల్ శంకర్‌పై 26606 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ ఐ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయింది. రామన్నకు 74050 ఓట్లు రాగా, శంకర్‌కు 47444 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఐ అభ్యర్ది గండ్ర సుజాతకు 32200 ఓట్లు వచ్చాయి. జోగు రామన్న బిసి వర్గానికి చెందినవారు. ఆయన మున్నూరు కాపు సామాజికవర్గం వారు.
2009లో జోగు రామన్న టిడిపి తరపున పోటీచేసి విజయం సాధించగా, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న నేపధ్యంలో టిఆర్‌ఎస్‌లో చేరి పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో ఘన విజయం సాదించారు. తదుపరి 2014, 2018లలో గెలిచారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆరుసార్లు రెడ్లి సామాజికవర్గ నేతలు, ఐదుసార్లు బిసి నేతలు, రెండుసార్లు బ్రాహ్మణ, ముగ్గురు ఇతర వర్గాల నేతలు ఎన్నికయ్యారు.
రామచంద్రారెడ్డి ఆదిలాబాదులో 1978, 85లలో ఇండిపెండెంటుగాను, 1989, 2004లలో కాంగ్రెస్ ఐ తరుఫున మొత్తం నాలుగుసార్లు గెలిచారు. ఈయన నేదురుమల్లి, కోట్ల క్యాబినెట్‌లలో మంత్రిగా కూడా పనిచేసారు. ఇక్కడ 1999లో గెలిచిన పడాల భూమన్న చంద్రబాబు క్యాబినెట్‌లో స్థానం పొందారు. ఆదిలాబాదులో పిడిఎఫ్ రెండుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు మూడుసార్లు, టిడిపి మూడుసార్లు, టిఆర్‌ఎస్ రెండుసార్లు సిపిఐ ఒకసారి గెలవగా, నాలుగుసార్లు ఇండి పెండెంట్లు విజయం సాధించారు. మరో నేత సి.వామన్‌రెడ్డి ఒకసారి ఇండ పిెండెంటుగా, ఇంకోసారి టిడిపి పక్షాన గెలిచారు.
ఆదిలాబాద్‌లో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment