Adilabad District
-
ఆదిలాబాద్ లో సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
-
ఆదివాసీల వింత సంప్రదాయం.. 2 కిలోల నూనె తాగిన మహిళ
-
యూపీకి వెళ్తున్న తెలంగాణ బస్సులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
లక్నో/హైదరాబాద్: తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాద ఘటన యూపీలోని బృందావనంలో చోటు చేసుకుంది.వివరాల ప్రకారం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బైంసా నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి పర్యాటకులతో బస్సు బయలుదేరింది. కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని నిర్మల్ జిల్లా పల్సికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.కాగా, అగ్ని ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రయాణికులంతా హుటాహుటిన బస్సు దిగిపోయారు. ఇక, బస్సులోనే ఉండిపోయిన ఆ వ్యక్తి మాత్రం సజీవ దహనమయ్యాడు. దీంతో, అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అటవీశాఖ అధికారులపై కేశవపట్నం గ్రామస్తుల దాడి..!
-
ఆదిలాబాద్: అటవీ శాఖ సిబ్బందిపై గ్రామస్తుల రాళ్ల దాడి
సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: అటవీ అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఘటన జరిగింది. తెల్లవారుజామున కేశవపట్నం గ్రామంలో అటవీ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కార్డెన్ సెర్చలో పలు ఇళ్లలో కలప దుంగలు, ఫర్నిచర్ దొరికాయి. కలప దుంగలు స్వాధీనం చేసుకుంటున్న క్రమంలో అటవీ అధికారులపై గ్రామస్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో అటవీ సిబ్బంది భయంతో పరుగులు తీశారు.ఈ ఘటనలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి గాయాలయ్యాయి. అటవీ శాఖ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనలో బీట్ ఆఫీసర్ జాధవ్ నౌశిలాల్ స్వల్పంగా గాయపడ్డారు. అటవీ శాఖకు సంబంధించిన ఓ వాహనంంపై దాడి చేసిన స్థానికులు అద్దాలు పగలగొట్టారు. కేశవపట్నం చేరుకున్న పోలీసు బలగాలు.. గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. దాడి విషయాన్ని అటవీ శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.ఇదీ చదవండి: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు -
ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
-
మైనర్ బాలికపై దారుణం..
-
ఆదిలాబాద్ @ 4.7 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. చాలాచోట్ల సాధారణం కంటే సగటున 2 డిగ్రీ సెల్సియస్ నుంచి 4 డిగ్రీ సెల్సియస్ తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం రాష్ట్రంలో అత్యంత తక్కువగా ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 4.7డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఇక్కడ ఈ సమయంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రత కంటే 8.1 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.పటాన్చెరు, హకీంపేట్, హనుమకొండ, మెదక్, నిజామాబాద్, రామగుండం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో సాధారణం కంటే 4డిగ్రీ సెల్సియస్‌కు పైబడి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా నెలకొన్న వాతావరణ పరిస్థితులతో ఉష్ణోగ్రతలు పతనమైనట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఈశాన్య దిశనుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. రానున్న రెండ్రోజులు ఉదయం పూట పొగమంచు ఏర్పడుతుందని, దీంతో జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.రానున్న మూడురోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 4డిగ్రీల వరకు తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై ప్రాంతాలు ఆదిలాబాద్ : 4.7 డిగ్రీలు, అర్లి : 6.3డిగ్రీలు, తండ్ర: 6.6 డిగ్రీలు, తిర్యాణి: 6.7 డిగ్రీలు, కొహిర్: 6.8డిగ్రీలు, జుక్కల్: 7.6డిగ్రీలు, కొట్గిరి: 7.7 డిగ్రీలు, శివంపేట్: 8 డిగ్రీలు, మల్లాపూర్: 8 డిగ్రీలు, మోమీన్‌పేట్: 8.2 డిగ్రీ సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
TG: చిరుత దాడితో మహిళకు గాయాలు.. టెన్షన్లో ప్రజలు
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్య మృగాల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురిపై పులి దాడి చేయగా.. తాజాగా చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. ఓ మహిళపై చిరుత దాడి చేయడంతో ప్రజలు వణికిపోతున్నారు.వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలో చిరుత సంచారం అధికారులు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా డెడ్రా సమీపంలో ఓ మహిళపై చిరుత దాడి చేసింది. ఈ క్రమంలో మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. ఇక, చిరుత దాడి నేపథ్యంలో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.ఇదిలా ఉండగా.. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలే ఓ మహిళపై పులి దాడి చేయడంతో ఆమె మరణించిన విషయం తెలిసిందే. అనంతరం, ఆదిలాబాద్ జిల్లాలోనే మరో ఇద్దరికిపై పులి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వన్య ప్రాణుల వరుస దాడుల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. -
పులి కోసమే వెతుకుతున్నాం సర్..
కాగజ్‌నగర్ డివిజన్లో ఇటీవల ఇద్దరిపై దాడి చేసిన పులి ఆచూకీ కోసం అటవీ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. సిర్పూర్ రేంజ్లో అటవీ అధికారి ఫోన్లో మాట్లాడుతుండగా.. ఆయన కార్యాలయంలో నిజమైన పులిని తలపిస్తున్న పులి బొమ్మ ఆసక్తి రేపుతోంది.పులి భయంతో.. జ్వరం!ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం దుబ్బగూడలో రైతు రౌత్ సురేశ్‌పై పులి దాడి చేయడాన్ని చూసిన అతని భార్య సుజాత జ్వరంతో మంచం పట్టింది. ఏ క్షణాన ఎవరిపై పులి దాడి చేస్తుందో తెలియక.. దుబ్బగూడ.. పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. – ఫొటోలు: సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఆదిలాబాద్‌లో పెద్దపులి హల్చల్
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో గత నాలుగు రోజులుగా పెద్దపులి హల్చల్ చేస్తోంది. గత రెండ్రోజులుగా నార్నూర్ మండలం చోర్గావ్ గ్రామంలో తిష్టవేసి ఆవును తింటున్న దృశ్యం అటవీశాఖ అధికారులు అమర్చిన కెమెరాకు చిక్కింది. దీంతో చోర్గావ్, సుంగాపూర్, బాబేఝరి, మంజ్రి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గురువారం గాదిగూడ మండలం ఖడ్కి గ్రామం మీదుగా బుడుకుంగూడ, సావురి గ్రామం మీదుగా రాంపూర్ చేరుకుంది. వేకువజామున గిరిజన రైతు ప్రకాశ్‌కు చెందిన ఆవుపై దాడి చేసింది. కుటుంబ సభ్యులు అప్రమత్తమై చప్పుడు చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదేరోజు మధ్యాహ్నం నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామ శివారులో పత్తి ఏరుతున్న మహిళలకు పులి కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. అక్కడి నుంచి గంగాపూర్, మాన్కాపూర్ వైపు పులి వెళ్లిందని ప్రచారం జరగడంతో మాన్కాపూర్, రాజులగూడ, నార్నూర్, మహగావ్, నాగల్కొండ, భీంపూర్ గ్రామాల ప్రజలు అప్రమత్తం అయ్యారు. వ్యవసాయ పనులకు వెళ్లిన వారంతా మధ్యాహ్నం ఇంటిబాట పట్టారు. ఎఫ్ఎస్వో సుదర్శన్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు బృందాలుగా విడిపోయి పులి జాడకోసం గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
అమ్మో.. పులి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏటా శీతాకాలంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న పులులు.. ఉమ్మడి ఆదిలాబాద్ వాసుల్లో అలజడి రేపుతున్నాయి. జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ.. పశువులపై దాడి చేసి చంపి తింటున్నాయి. ప్రస్తుతం జానీ, ఎస్–12గా పిలుస్తున్న రెండు పులులు తిరుగుతున్నట్టు గుర్తించారు. ఇలా పులుల రాకను అటవీ అధికారులు, పర్యావరణవేత్తలు స్వాగతిస్తుండగా.. అడవి సమీప ప్రాంతాల ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. పత్తి పంట చేతికొచ్చే వేళ పొలాలకు వెళ్లలేకపోతున్నామని గిరిజన రైతులు వాపోతున్నారు.అక్కడ సరిపోక.. మ హారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యాలలో పులుల సంఖ్య పెరిగింది. అక్కడి ఇరుకు ఆవాసం వల్ల ఆ పులులు తెలంగాణ వైపు వస్తున్నాయి. వాటిలో మగపులులే అధికమని అధికారులు చెప్తున్నారు. గత నెల రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, కుంటాల, సారంగాపూర్, మామడ, పెంబి మండలాల్లో ఎనిమిదేళ్ల మగపులి(జానీ) సంచరిస్తున్నట్టు గుర్తించారు. సుమారు రెండేళ్ల వయసున్న మరో మగ పులి (ఎస్ 12) మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, బెల్లంపల్లి అటవీ ప్రాంతంలో తిరుగుతోంది. ఇంకో పులి కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ ప్రాంతాల్లో కనిపించి వెళ్లిపోయింది.ఇక్కడ కోర్ ఏరియాలోకి వెళ్లలేక.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ జోన్ల నుంచి వస్తున్న పులులు.. కవ్వాల్‌లోని కోర్ ఏరియాకు చేరుకోవాలంటే, 200 కిలోమీటర్లకుపైగా నడవాలి. ఇది వాటికి పెద్ద సమస్య కాకపోయినా.. మధ్యలో జాతీయ రహదారులు, బొగ్గు గనులు, సాగునీటి ప్రాజెక్టులు, పోడు సాగు, పంట పొలాలు పులుల రాకకు ఆటంకంగా మారాయి. రహదారుల వెంట అండర్ పాస్‌లు, ఓవర్ పాస్‌లు ఏర్పాటు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. అయితే ఆ పులులు అడవి అంచుల్లోనే సంచరిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కవ్వాల్ బయట కాగజ్‌నగర్ డివిజన్లో ఐదు పెద్దవి, నాలుగు చిన్నవి కలిపి 9 పులులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.మనుషులపై దాడులతో కలకలం రాష్ట్రంలోకి వస్తున్న పులులు.. పశువులు, మనుషులపై దాడి చేస్తున్నాయి. 2020 నవంబర్‌లో 18 రోజుల వ్యవధిలో ఏ2 అనే మగపులి ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్ (21)పై, పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల (18)పై పొలాల్లో దాడిచేసి చంపేసింది. గత ఏడాది నవంబర్‌లో మరో పులి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన రైతు సిడాం భీము (69)పై దాడి చేసి ప్రాణాలు తీసింది. నాటి ఘటనల నేపథ్యంలో.. ఇప్పుడు అటవీ అధికారులు ఏజెన్సీ ప్రజలను అప్రమత్తం చేశారు.కోర్ ఏరియాలోకి వెళ్లేలా చూస్తున్నాం.. టైగర్ జోన్ వెలుపల సంచరించే కొత్త పులులు కోర్ ఏరియాలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నాం. వేటగాళ్లు ఉచ్చులు వేయకుండా, స్థానికులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పులి దాడి చేసిన పశువుల యజమానులకు వెంటనే పరిహారం ఇస్తున్నాం. పులి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – శాంతారామ్, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్టు టైగర్, కవ్వాల్ టైగర్ రిజర్వుపులుల సంచారంతో భయంగా ఉందిపులి భయంతో పత్తి తీసే పనులు సాగడం లేదు. మా చేన్ల వైపు పులి రాకుండా అటవీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే రైతులు చాలా నష్టపోతారు. – ఆత్రం జైతు, భుర్కరెగడి గ్రామం, నిర్మల్ జిల్లా -
ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథ
ప్రేమ కథ అన్నారు.. పులి బొమ్మ వేశారేంటనేగా మీ డౌటు.. ఏం.. మనుషులకేనా ప్రేమ కథలు.. పులులకుండవా.. ఇది జానీగాడి ప్రేమ కథ.. లవర్ కోసం వందల కిలోమీటర్లు వాకింగ్ చేసొచ్చిన ఓ పెద్ద పులి కథ.. కట్ చేస్తే.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం.. జానీ ఉండేది ఇక్కడే. గత నెల్లో ఒకానొక శుభముహూర్తాన మనోడికి ‘ప్రేమ’లో పడాలనిపించింది. తీరా చూస్తే.. తనకు ఈడైన జోడు అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో తోడు కోసం తన ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాడు. వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ.. ఏకంగా 200 కిలోమీటర్లు నడిచి మన రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా అడవుల్లోకి వచ్చేశాడు.అక్టోబర్ 25న నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి ప్రాంతంలోకి వచ్చిన జానీ.. ఎక్కడా కుదురుగా ఉండటం లేదు. ఓసారి వెనక్కి మహారాష్ట్ర సరిహద్దు దాకా వెళ్లాడు.. మళ్లా తిరిగొచ్చాడు. రోజుకో మండలమన్నట్లు తిరుగుతూనే ఉన్నాడు. ఈ నెల 10వ తేదీనైతే.. రాత్రిపూట మహబూబ్ ఘాట్ రోడ్డుపై కనిపించి అందరికీ కంగారు పెట్టించేశాడు. పెద్ద పులంటే మాటలా మరి.. మంగళవారం మామడ–పెంబి అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడిచేసి చంపేశాడు. ప్రస్తుతం జానీ అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. తన తోడు కోసం.. గూడు కోసం.. ఇంతకీ అటవీ అధికారులేమంటున్నారు? మిగతా క్రూర జంతువులతో పోలిస్తే పులులు కొంచెం డిఫరెంటుగానే ఉంటాయట. మేటింగ్ సీజన్లో తగిన తోడు, గూడు దొరికేదాకా ఎంత దూరమైనా వెళ్తాయట. ఇప్పటివరకూ జానీ.. 500 కిలోమీటర్ల దూరం నడిచాడట. నిర్మల్– ఆదిలాబాద్ మధ్య దట్టమైన అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు ఉండటంతో ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాడట. ఇలా వచ్చిన పులులను సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని.. ‘జానీ’ అనే ఈ పులి ఎటువైపు వెళ్తుందో గమనిస్తూ ఆయా ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నామని, పులి సంరక్షణకు సంబంధించిన సూచనలు చేస్తున్నామని నిర్మల్ డీఎఫ్‌వో నాగిని భాను తెలిపారు. చదవండి: ‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం... భూమాతకు తీరని శోకం! -
పత్తిపై తేమ, ధరల కత్తి
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన నెలకొంది. తేమ శాతం, తక్కువ ధర ఖరారుపై వివాదం ఏర్పడటంతో కొనుగోళ్లు జరగలేదు. తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనాలంటూ రైతులు రాత్రివరకు తమ ఆందోళన కొనసాగించారు. వివరాలిలా ఉన్నాయి.. సీసీఐతో పాటు ప్రైవేట్ వ్యాపారులు పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు శుక్రవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. సీసీఐ క్వింటాల్ పత్తికి మద్దతు ధర రూ.7,521తో కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ప్రైవేట్ వ్యాపారులు మొదట క్వింటాల్ పత్తికి రూ.6,700 ధర వేలం ద్వారా నిర్ణయించి, ఆ తర్వాత రూ.10, రూ.20 పెంచుతూ రూ.7,150 వరకు చేరుకున్నారు.ఆ తర్వాత ధర పెంచేందుకు ససేమిరా అన్నారు. దీంతో కలెక్టర్ రాజర్షిషా, మార్కెట్ అధికారులు ధర పెంచాలని ప్రైవేట్ వ్యాపారులకు సూచించినప్పటికీ వారు ఒప్పుకోలేదు. దీంతో ప్రతిష్టంభన నెలకొంది. సీసీఐతో పోలి్చతే ప్రైవేట్ ధర తక్కువగా ఉండడంతో రైతులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ వారికి నచ్చజెప్పినప్పటికీ వినకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ సీసీఐ, ప్రైవేట్ వ్యాపారులతో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు.ప్రైవేట్ వ్యాపారులు రూ.7,200కు కొనుగోలు చేసేందుకు ఒప్పించారు. మరోవైపు సీసీఐ అధికారులు కూడా నిబంధనల ప్రకారమే కొనుగోలు చేస్తామని తెలిపారు. 8 నుంచి 12 మధ్య శాతం తేమ ఉంటేనే పత్తిని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అది దాటితే క్వింటాలుకు రూ.75.21 చొప్పున కోత విధిస్తామని పేర్కొనడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తేమతో సంబంధం లేకుండా సీసీఐ పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వారికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మద్దతు తెలిపారు. కలెక్టర్ ఘెరావ్..ఉద్రిక్తత ప్రైవేట్ వ్యాపారులు, సీసీఐ అధికారులు, రైతులతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కలెక్టర్ పలుమార్లు చర్చించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్ రూ.7,200కు కొనుగోలు చేసేలా ఒప్పించిన తర్వాత వాహనంలో వెళ్లేందుకు ప్రయత్నించగా రైతులు ఘెరావ్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మొత్తం మీద రాత్రి వరకు తేమ పేచీ తేలలేదు. తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తి పంటను కొనుగోలు చేయాలని రైతులు పట్టుబట్టారు. కానీ నిబంధనల ప్రకారమే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు చెప్పడం, ధర పెంచేందుకు ప్రైవేట్ వ్యాపారులు ఒప్పుకోక పోవడంతో రైతులు ఆందోళనకు దిగారు.దీంతో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, మార్కెటింగ్ అధికారులు మరోసారి సీసీఐ అధికారులు, ప్రైవేట్ వ్యాపారులతో చర్చించినా ఎటూ తేలలేదు. కోపోద్రిక్తులైన రైతులు మార్కెట్ యార్డు నుంచి పంజాబ్ చౌక్ చేరుకొని రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళనను కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. రాత్రి వరకు ప్రైవేట్ వ్యాపారులతో చర్చలు జరిపిన జిల్లా కలెక్టర్.. చివరకు మొదటి రోజు తీసుకొచ్చిన పత్తిని తేమతో సంబంధం లేకుండా క్వింటాల్ రూ.6,696 చొప్పున శనివారం కొనుగోలు చేసేలా వ్యాపారులను ఒప్పించారు. -
ఈ ఇల్లు పాఠాలు నేర్పుతుంది
తల్లిదండ్రులు మడావి లక్ష్మణ్, కమలాబాయిలతో టీచరు ఉద్యోగం సాధించిన కుమార్తెలు కవిత, దివ్య, కళ్యాణి, టీచర్ కావడమే లక్ష్యమంటున్న చిన్నకుమార్తె కృష్ణప్రియ (కుడి చివర) ‘ఎంత మంది పిల్లలు?’ అనే ప్రశ్న వినిపించినప్పుడల్లా లక్ష్మణ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తినంత పనయ్యేది. ఎందుకంటే...‘నాకు అయిదుగురు ఆడపిల్లలు’ అనే మాట లక్షణ్ నోటినుంచి వినిపించడమే ఆలస్యం ‘అయ్యో!’ అనే అకారణ సానుభూతి వినిపించేది. ‘ఇంట్లో ఒకరిద్దరు ఆడపిల్లలు ఉంటేనే కష్టం. అలాంటిది అయిదుగురు ఆడపిల్లలంటే మాటలా! నీ కోసం చాలా కష్టాలు ఎదురుచూస్తున్నాయి’ అనేవాళ్లు. అయితే వారి పెదవి విరుపు మాటలు, వెక్కిరింపులు తనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేకపోయాయి. ఈ ఇల్లు పిల్లలకు బడి పాఠాలు చెప్పే ఇల్లే కాదు... ఆడపిల్లల్ని తక్కువ చేసి చూసేవారికి గుణపాఠాలూ చెబుతుంది.ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన మడావి లక్ష్మణ్ బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. ఆదివాసీ తెగకు చెందిన లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తరువాత ఆర్థిక కష్టాలు తీరాయి. లక్ష్మణ్– కమలాబాయి దంపతులకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది.‘ఆడపిల్ల ఇంటికి అదృష్టం’ అన్నారు చుట్టాలు పక్కాలు, పెద్దలు.రెండోసారి ఆడపిల్ల పుట్టింది. వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. ‘మళ్లీ ఆడపిల్లేనా!’ అన్నారు.‘ఇద్దరు పిల్లలు చాలు’ అనుకునే సమయంలో ‘లేదు... లేదు... అబ్బాయి కావాల్సిందే’ అని పట్టుబట్టారు ఇంటి పెద్దలు.మూడో సారి... అమ్మాయి. ‘ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు చాలు’ అనుకునే లోపే....‘అలా ఎలా కుదురుతుంది....అబ్బాయి...’ అనే మాట మళ్లీ ముందుకు వచ్చింది.నాల్గోసారి... అమ్మాయి.‘ఇక చాలు’ అని గట్టిగా అనుకున్నా సరే... పెద్దల ఒత్తిడికి తలవొంచక తప్పలేదు.‘ఆరు నూరైనా ఈసారి కొడుకే’ అన్నారు చాలా నమ్మకంగా పెద్దలు. దేవుడికి గట్టిగా మొక్కుకున్నారు.అయిదోసారి... అమ్మాయి. ‘అయ్యయ్యో’ అనే సానుభూతులు ఆకాశాన్ని అంటాయి. అయితే లక్ష్మణ్, కమలాబాయి దంపతులు ఎప్పుడూ నిరాశపడలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఖర్చులకు సరిపడా జీతం రాకపోవడంతో ఖర్చులు పెరిగాయి. ‘ఎంత ఖర్చు అయినా, అప్పు చేసైనా సరే పిల్లలను బాగా చదివించాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు లక్ష్మణ్. పిల్లల్ని చదివించడమే కాదు ఆడపిల్లలు అనే వివక్ష ఎక్కడా ప్రదర్శించేవారు కాదు. ఆటల్లో, పాటల్లో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు. పిల్లలు బాగా చదువుకోవాలంటే బెత్తం పట్టుకోనక్కర్లేదు. వారికి నాలుగు మంచి మాటలు చెబితే సరిపోతుంది. ఆ మాటే వారికి తిరుగులేని తారకమంత్రం అవుతుంది.అయిదుగురు పిల్లల్ని కూర్చోపెట్టుకొని ‘‘అమ్మా... మీ నాయిన టీచర్. మా నాయినకు మాత్రం చదువు ఒక్క ముక్క కూడా రాదు. నాకు మాత్రం సదువుకోవాలనే బాగా ఇది ఉండే. అయితే మా కుటుంబ పరిస్థితి చూస్తే... ఇంత దీనమైన పరిస్థితుల్లో సదువు అవసరమా అనిపించేది. ఎందుకంటే సదువుకోవాలంటే ఎంతో కొంత డబ్బు కావాలి. ఏ రోజుకు ఆరోజే బువ్వకు కష్టపడే మా దగ్గర డబ్బు ఎక్కడిది! అయినా సరే సదువుకోవాలని గట్టిగా అనుకున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను...’ అని నాన్న చిన్నప్పుడు చెప్పిన మాటలు పిల్లలపై బలమైన ప్రభావాన్ని చూపాయి. వారు చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఆ ఫలితం వృథా పోలేదు.ఇప్పుడు...రెండో కూతురు కవిత, మూడో కూతురు దివ్య, నాల్గో కూతురు కళ్యాణి ప్రభుత్వ ఉపాధ్యాయులు. చిన్న కూతురు కృష్ణప్రియ కొద్ది మార్కుల తేడాతో టీచర్ అయ్యే చాన్స్ మిస్ అయింది. అక్కలలాగే టీచర్ కావాలని కలలు కంటున్న కృష్ణప్రియకు మరోప్రయత్నంలో తన కల నెరవేర్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అప్పుడు ఒకే ఇంట్లో నలుగురు టీచర్లు!ఇంటర్ వరకు చదివిన పెద్ద కూతురు రత్నకుమారి చెల్లెళ్ల స్ఫూర్తితో పై చదువులు చదవాలనుకుంటోంది. వారిలాగే ఒక విజయాన్ని అందుకోవాలనుకుంటుంది. ఇప్పుడు లక్ష్మణ్‌ను చూసి జనాలు ఏమంటున్నారు? ‘నీకేమయ్యా... ఇంటినిండా టీచర్లే!’ ‘మీది టీచర్స్ ఫ్యామిలీ’నాన్న మాటలుతల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. వారి ఆశీర్వాద బలంతోనే టీచర్ అయ్యాను. ‘చదువే మన సంపద’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండే వాడు. ఆయన మాటలు మనసులో నాటుకు΄ోయాయి.– కవిత, రెండో కుమార్తెనేను టీచర్... అక్కహెడ్మాస్టర్అక్క కవితకు, నాకు ఒకేసారి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం నేను జైనూర్ మండలం జెండాగూడలో ఎస్జీటీగా పనిచేస్తున్నాను. మా స్కూలుకు అక్క కవితనే ప్రధానో΄ాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మేము ఇప్పుడు ఒకే బడిలో పనిచేస్తుండటం సంతోషంగా ఉంది.– దివ్య, మూడో కుమార్తెఆరోజు ఎంత సంతోషమో!మొన్నటి డీఎస్సీలో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో నాకు ΄ోస్టింగ్ ఇచ్చారు. మొన్ననే విధుల్లో చేరాను. టీచర్‌గా మొదటి రోజు స్కూల్‌కి వెళ్లినప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ‘మా ముగ్గురు పిల్లలు టీచర్లే అని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాను’ అంటున్నాడు నాన్న.– కళ్యాణి, నాలుగో కుమార్తెటీచర్ కావడమే నా లక్ష్యంఅక్క కళ్యాణితో కలిసి నేను కూడా మొన్నటి డీఎస్సీ పరీక్ష రాశాను. కొద్ది మార్కుల తేడాతో నాకు ఉద్యోగం చేజారింది. అయితే నా లక్ష్యాన్ని మాత్రం వీడను. ఎలాగైనా టీచర్ కొలువు సాధిస్తాను.– కృష్ణప్రియ, ఐదో కుమార్తె – గోడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి -
అడవిలో అన్నలు లేనట్లేనా!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వామపక్ష తీవ్రవాద ప్రాంతాల జాబితా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కేంద్ర హోంశాఖ తొలగించింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ మావోయిస్టుల కార్యక్రమాలేవి లేకపోవడం, భద్రత బలగాలు పూర్తి పట్టు సాధించడంతో ఎల్‌డబ్ల్యూఈ(లెఫ్ట్ వింగ్ ఎక్స్స్ట్రిమిజం ఎఫెక్టెడ్) ప్రాంతాల నుంచి తప్పించింది. గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం కారణంగా ప్రత్యేక పథకాల అమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రత బలగాల పర్యవేక్షణ కొనసాగతున్నాయి. భవిష్యత్‌లో ఈ కార్యకలాపాలు క్రమంగా తగ్గనున్నాయి.ప్రత్యేక పథకాలతో నిధులుదేశంలో నక్సలిజాన్ని తగ్గించేందుకు ఆపరేషన్ ‘సమాధాన్’, రాష్ట్రంలో ‘గ్రీన్‌హంట్’ పేర్లతో మావోయిస్టుల ఏరివేత కొనసాగింది. 2010లో 96జిల్లాల్లో ‘మావో’ల ప్రభావం ఉండగా, 2021నాటికి 46కు పడిపోయి, తాజాగా 38జిల్లాలకు చేరింది. ఈ నెల 7న వామపక్ష ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాలను వా మపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం లేకపోవడంతో ఎల్‌డబ్ల్యూఈ నుంచి తొలగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు మాత్రమే ఉన్నాయి. నక్సల్స్ కారణంగా ఎన్నికల సమయంలో ఓటింగ్ గంట ముందే నిలిపివేయడం, అధికారులు, ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో రాష్ట్ర, కేంద్ర బలగాల పహారా, స్థానికులపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. దేశంలో 2026నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని తగ్గించేలా కేంద్రం చర్యలు చేపట్టింది.సమసమాజ స్థాపన లక్ష్యంగాపేద, ధనిక మధ్య అంతరాలను తొలగిస్తూ భూ స్వామ్య, పెట్టుబడిదారి వ్యవస్థలకు వ్యతిరేకంగా ఐదు దశాబ్దాల క్రితం నక్సలిజం పురుడు పోసుకుంది. కార్మిక, కర్షక, రైతాంగ సమస్యల పరిష్కారానికి విప్లవ పంథాలోనే సమసమాజ స్థాపన సాధ్యమని ఆ పార్టీ ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి జిల్లా నుంచి యువత నక్సలిజం వైపు మళ్లారు. మూడు దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీ గిరిజన, మైదాన ప్రాంతాలు, ఇటు సింగరేణి ప్రాంతంలో సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) సంస్థలు విప్లవ బావుటా ఎగురవేశాయి. ప్రజల మద్దతుతో అనేక పోరాటాల్లో పోలీ సులపై పైచేయి సాధించారు. లక్సెట్టిపేట, ఇంద్రవెల్లి, ఉట్నూరు, ఖానాపూర్, తిర్యాణి, సిర్పూర్, చెన్నూరు, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, ఆదిలాబాద్, జ న్నారం తదితరచోట్ల భీకర పోరాటాలు జరిగాయి. దొరల ఇళ్లపై దాడులు, దోపిడీదారులు, ప్రజాకంఠకులను ప్రజాకోర్టులో శిక్షించేవారు. ఆ సమయంలోనే నిరుపేదలకు భూపంపిణీ జరిగింది. బలగాలు, నక్సల్స్‌కు మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం ఉండగా క్రమంగా తగ్గుముఖం పట్టింది.‘కడంబా’ ఘటన చివరిదిఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతంతోపాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు, ప్రాణహిత, పెన్‌గంగా, గోదావరి తీర గ్రామాలకు గత పదేళ్లుగా కొత్త రోడ్లు, సమాచార వ్యవస్థతో మౌలిక వసతులు అభివృద్ధి చెందాయి. రూ.కోట్లు వెచ్చించి ఆసుపత్రులు, గిరిజన యువతకు పథకాలు తె చ్చారు. దీంతో నక్సలిజం తగ్గింది. తెలంగా ణ ఏర్పడ్డాక కేబీఎం(కుమురంభీం మంచి ర్యాల) కమిటీ తిరిగి కార్యకలాపాలు సాగించేందుకు ప్రయత్నించింది. గిరిజన యువతను ఉద్యమం వైపు ఆకర్షించి దళంలో చే ర్చుకునే ప్రయత్నం చేసింది. 2020లో కాగజ్‌నగర్ మండలం కడంబా అడవుల్లో భద త్రా బలగాల చేతిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చుక్కాలు, నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన బాదీరావు మృతిచెందారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర సభ్యుడు అడెళ్లు భాస్కర్ పట్టు పెంచే ప్రయత్నాలు చేసినా వీలు కాలేదు. రెండేళ్ల క్రితం ఆయన సహచరి కంతి లింగవ్వ చనిపోయింది. పార్టీ బలోపేతం లక్ష్యంగా మూడేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో ఇంద్రవెల్లి, సిర్పూర్, మంగీ, చెన్నూరు, మంచిర్యాల ఏరియాలకు కొత్త నియామకాలు చేపట్టింది. ఈ కమిటీలు దండకారణ్యం కేంద్రంగానే కార్యకలా పాలు సాగించాయి. కోవిడ్ తర్వాత పలు మార్లు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి ఉమ్మడి జిల్లాలో ప్రవేశించే ప్రయత్నాలు జరిగాయి. కానీ నిలదొక్కులేకపోయారు. ప్రస్తుతం కోల్‌బెల్ట్ కమిటీ పేరుతో సింగరేణి కార్మి కుల పక్షాన, స్థానిక ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ పత్రిక ప్రకటనలు మాత్రం వెలువడుతున్నాయి. -
Konda Laxman Bapuji: ఉద్యమాల కొండ..
తెలంగాణ ప్రాంతానికి దాస్య విముక్తి కల్పించిన నాయకుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని వాంకిడి అనే కుగ్రామంలో ఒక నిరు పేద చేనేత కుటుంబంలో 1915 సెప్టెంబర్ 27న బాపూజీ జన్మించారు. భూమికోసం, భుక్తికోసం, నిజాం సంస్థానంలో సుదీ ర్ఘకాలం కొనసాగిన సంగ్రామంలో జనానికి అండగా నిలిచారు. ఆయన ఇచ్చిన ‘జై తెలంగాణ‘ నినాదం ప్రజాబాహుళ్యాన్ని జాగృత పర్చింది.1938లో తాను మెట్రిక్యులేషన్ చదువుతున్న ప్పుడే హైద్రాబాద్ స్టేట్ కాంగ్రెస్‌లో చేరి పౌర హక్కుల ఉద్యమం, వందేమాతర ఉద్యమం, ఆంధ్ర మహా సభల్లో క్రియాశీలక పాత్ర పోషించి పలువురు జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ఆబిడ్స్ పోస్ట్ ఆఫీసుపై, కోఠిలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీపై జాతీయ జెండా ఎగురవేసి సంచలనం సృష్టించారు. నవాబుల పాలనలో నలిగి పోతున్న ప్రజానీకాన్ని రక్షించాలంటే మీర్–ఉస్మాన్ అలీఖాన్‌ను అంతమొందించడం ఒక్కటే మార్గమని భావించి షోలాపూర్, బొంబాయి, అహ్మదా బాద్‌లలో ‘పహాడీ’ (కొండ) పేరుతో ప్రచ్ఛన్న కార్యకలాపాలు నిర్వహించి నిజాం రాజుపై బాంబు దాడికి వ్యూహం రచించారు.రెండు దఫాలు మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించారు. ముల్కీ ఉద్యమం నుండి మొన్నటి తెలంగాణ ఉద్యమం దాక ముందుండి నడిపించారు. కార్మికులను, చేతివృత్తుల వారిని సమీకరించి సహకార రంగం పరిధి లోకి తీసుకొచ్చారు. బీసీల స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కాకా కాలేల్కర్ కమిటీ, మండల కమిషన్లకు జనాభా దామాషా ప్రకారం రేజర్వేషన్లతో పాటు రాజ్యాధికారంలో బీసీలకు వాటా దక్కేలా చూడాలని నివేదించారు. ప్రభుత్వాలు సమగ్ర కుల గణన చేపట్టి ఆ దిశలో ముందడుగు వేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి. – డా. వంగర భూమయ్య, పాలమూరు విశ్వవిద్యాలయంలో సహాయాచార్యులుఇవి చదవండి: భారత విప్లవ ప్రతీక! -
రూ.2.25 కోట్ల గంజాయి స్వాధీనం
ఆదిలాబాద్‌టౌన్: అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బుధవారం తలమడుగు మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో లక్ష్మీపూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఈ ముఠాలోని ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఆరుగురు పరారయ్యారు. ఆంధ్ర, ఒడిశా బార్డర్ అటవీ ప్రాంతం నుంచి ఈ ముఠా దేశంలోని వివిధ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున గంజాయిని సరఫరా చేస్తోంది. ఉత్తరాఖండ్‌కు చెందిన కంటెయినర్ ఆదిలాబాద్ పట్టణం నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేయడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. కంటెయినర్ లోపల 292 ప్యాకెట్లలో దాదాపు 9 క్వింటాళ్ల గంజాయి లభించింది. దీని విలువ సుమారు రూ.2.25 కోట్లు ఉంటుందని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులపై కేసు నమోదు చేశారు. అరెస్టయినవారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కంటెయినర్ డ్రైవర్ వసీమ్ అన్సారి, క్లీనర్ అర్మాన్లు ఉన్నారు. కాగా ఒడిశా రాష్ట్రం మ ల్కాజిగిరికి చెందిన ఆశిష్, యూపీలోని మీరట్‌కు చెందిన పండిత్‌జీ, మహారాష్ట్రలోని బుల్దాన, దులే జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు, అలాగే ఉత్తరాఖండ్‌కు చెందిన అన్షుజైన్, సోను అన్సారీలు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి ఐచర్ కంటైనర్‌తో పాటు 292 గంజాయి ప్యాకెట్లు, రెండు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. -
ఆదిలాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత
-
కవలల అడ్డా.. వడ్డాడి
ఒకే పోలికలుండే కవలలను గుర్తు పట్టడానికి ఎవరైనా తికమక పడుతుంటారు. అలాంటిది ఒకే గ్రామంలో పదుల సంఖ్యలో కవలలుంటే?.. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడిలో 20 మంది వరకు కవలలు ఉండడంతో.. ఆ గ్రామాన్ని కవలల విలేజ్‌గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఐదు కవలల జంటలు స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో విద్య అభ్యసిస్తుండగా.. మిగతా పిల్లలు ఇతర చోట్ల చదువుతున్నారు. గ్రామ పాఠశాలలో విరాట్–విశాల్, కావ్య–దివ్య, గౌతమి–గాయత్రి, హర్షిత్–వర్షిత్, ప్రణాళిక–ప్రత్యక్ష చదువుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఇటు న్యాయం! అటు సాయం!!
సాక్షి, సిటీబ్యూరో: నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు.. ఆయనకు చదువు విలువ తెలుసు.. చదువుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందో.. ఎంత గౌరవం ఉంటుందో తెలియజేసే నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కష్టాలు స్వయంగా అనుభవించారు. అందుకే తనకు చేతనైనంత సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏటా విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, జామెట్రీ బాక్సులు, స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అందిస్తూ సమాజ సేవకు నడుం బిగించారు. చేతనైనంత సాయం చేస్తే ప్రకృతి కూడా మనకు సాయపడుతుందని చెబుతారు న్యాయవాది సంగిశెట్టి బాబు. ఆయన గురించిన మరిన్ని విషయాలు..ఇబ్రహీంపట్నం సమీపంలోని రాయ్‌పూర్‌లో ఓ నిరుపేద కుటుంబంలో యాదమ్మ, శంకరయ్య దంపతులకు జన్మించారు సంగిశెట్టి బాబు. చిన్నప్పటి నుంచి కడుపేదరికం అనుభవించారు. అయితే తమ జీవితాలను చదువు మాత్రమే మారుస్తుందన్న మాటను తు.చ. తప్పకుండా పాటించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీల్లో విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ సాధించారు. లా ప్రాక్టీస్ చేసుకుంటూనే పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు పడొద్దనే తలంపుతో తన వంతు సాయంగా ముందడుగు వేస్తున్నారు.ఒక్క రూపాయి లేనిస్థితి నుంచి..తన తల్లిదండ్రుల పేరుతో 2016లో యాదశంకర మెమోరియల్ ఫౌండేషన్ పేరుతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో తన చేతిలో ఒక్క రూపాయి కూడా లేదట. కానీ సంకల్ప బలం తోడైతే ఏదైనా సాధించవచ్చని నమ్మే బాబుకు.. విద్యా సామగ్రి పిల్లలకు అందజేసే ముందురోజు కేసులకు సంబంధించిన డబ్బులు వచ్చాయట. అందుకే తాను నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు వెళ్తున్నాన్నంటారు బాబు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో..హైదరాబాద్ చుట్టుపక్కల చాలామంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు చదువుకోవడమే కష్టం అవుతుందన్న విషయం గుర్తు చేసుకున్నారు. అంతే ఏటా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లోని పిల్లలకు సామగ్రి అందజేస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేక ఎవరూ చదువు మధ్యలో ఆపేయొద్దనేదే తన ఉద్దేశమని బాబు అంటున్నారు. భవిష్యత్తులో పిల్లల కోసం ఎంత కష్టమైనా తాను ముందుంటానని చెబుతున్నారు. బాబు నేపథ్యం స్ఫూర్తిదాయకం అయితే.. ఆయన సేవాగుణం ఆదర్శప్రాయం అనడంలో అతిశయోక్తి లేదు.ఇవి చదవండి: సాయపు చేతులు..! -
ఊరంతా బావులే..!
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అడెగామ(బి) గ్రామంలో పెద్దపెద్ద బావులే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఆ బావుల్లో నీరు భూ ఉపరితలానికి సమాంతరంగా.. నిండుకుండలా కనిపిస్తున్నాయి. వర్షాధారంపైనే ఆధారపడినా, వర్షాకాలం ముగిసిన తర్వాత ఈ బావుల్లోని నీటిని మోటార్ల ద్వారా పంటలకు నీటితడులు అందిస్తామని ఆ గ్రామ రైతులు చెబుతున్నారు. నీటిఎద్దడిని అధిగమించేందుకు..అడెగామ(బి)లో 309 రైతు కుటుంబాలు ఉన్నాయి. 772 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దశాబ్దాలుగా వర్షాకాలం కాకుండా ఇతర కాలాల్లో పంటలకు బావుల ద్వారే నీటితడులు అందిస్తూ రక్షించుకుంటున్నారు. బోరు వేసుకోవడం తక్కువ ఖర్చు అయినా, దాని ద్వారా సరిపడా నీరు పంటలకు అందించని పరిస్థితి ఉండడంతో ఈ గ్రామ రైతులు ప్రత్యామ్నాయంగా బావుల వైపు దృష్టి సారించారు. తద్వారా వర్షాకాలంలో నిండుకుండలా, మిగతా కాలాల్లో నీటి ప్రదాయినిగా ఈ బావులు నిలుస్తున్నాయి. ఖర్చుతో కూడుకున్నదే..బోరు 300 ఫీట్ల లోతులో వేయించినా అయ్యే ఖర్చు లక్ష రూపాయలపైనే.. అదే ఇలాంటి బావులు తవ్వించాలంటే రైతుకు సమయంతోపాటు పెద్ద మొత్తం వెచ్చించాల్సిందే. కనిష్టంగా రూ.6 లక్షల నుంచి గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ప్రధానంగా పంటలకు నీరు అందించేందుకు రైతులు ఈ ఖర్చుకు వెనుకాడకపోవడం గమనార్హం. బావిని తవ్విన తర్వాత పైనుంచి సుమారు 25 ఫీట్ల వరకు సిమెంట్‌తో తయారు చేసిన రింగులు చుట్టూరా వేస్తున్నారు.సమృద్ధిగా నీటితడులు అందించగలుగుతున్నాంనాకు మూడెకరాల చేను ఉంది. వానాకాలంలో పత్తి, సోయా, కూరగాయలు, యాసంగిలో శనగ, కూరగాయలు సాగు చేస్తున్నా. అక్టోబర్, నవంబర్లలో పత్తి పూత, కాత దశకు వస్తుంది. ఆ సమయంలో రెండు, మూడు నీటితడులు అందిస్తే మంచి దిగుబడులు వస్తాయి. ఆ సమయంలో బోర్ల నుంచి సరిపడా నీళ్లులేని పరిస్థితి. బావుల నుంచి సమృద్ధిగా నీటితడులు అందించగలుగుతున్నాం. మిగతా పంటలకు సరిపడా నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. – శివ శంకర్, రైతు, అడెగామ(బి)బావుల్లో అధికంగా నీటి ఊటలుఅడెగామ(బి) గ్రామ పరిస్థితుల దృష్ట్యా ఆ రైతులు బావులు తవ్వించుకున్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో బోర్లు లోతులో అధికంగా ఉన్నప్పటికీ వెడల్పు తక్కువ ఉంటుంది. కాబట్టి నీటి ఊటలు తక్కువ స్థాయిలో వస్తాయి. అదే బావుల వెడల్పు అధికంగా ఉండడంతో భూమి పొరల నుంచి జలాలు ఎక్కువగా బావుల్లోకి వస్తాయి. తద్వారా బావుల్లో అనేక పొరల నుంచి జలాలు ఊరుతాయి. తద్వారా ఆ రైతులకు ఉపయుక్తంగా మారుతుంది. – పుల్లయ్య, భూగర్భ జలశాస్త్రవేత్త, ఆదిలాబాద్ -
#TeejFestival : ఆదిలాబాద్ : ఘనంగా తీజ్ సంబరాలు (ఫొటోలు)
-
వాగులూ... వంకలూ..
సాక్షి, నెట్వర్క్: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలకు జలకళ సంతరించుకుంది. ములుగు జిల్లాలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి 14.38 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మల్లూరువాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26 ఫీట్లు కాగా ప్రస్తుతం 19 ఫీట్ల నీటిమట్టం ఉంది.వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో 163 నంబరు జాతీయ రహదారిపైకి గోదావరి వరద చేరడంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. చీకుపల్లిలోని బొగత జలపాతం ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది. ⇒ వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు 30.3 ఫీట్లకు 21.9 అడుగులకు నీటిమట్టం చేరింది. ⇒ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారు మధ్యతరహా చలివాగు ప్రాజెక్టు సామర్థ్యం 18 ఫీట్లు ఉండగా.. ప్రస్తుతం నీటి మట్టం 15.2ఫీట్లకు చేరి నిండుకుండను తలపిస్తోంది. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాన జోరు తగ్గడం లేదు. వర్షాలతో పంటలు నీట మునుగుతున్నాయి. పత్తి చేలల్లో ఇసుక మేటలు వేశాయి. ప్రాణహితకు భారీగా వరద పోటెత్తడంతో వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద తెలంగాణ–మహారాష్ట్ర మధ్య నడిచే నాటుపడవలను నిలిపివేశారు.వాగులో ఇద్దరు గల్లంతుచెట్టు కొమ్మ పట్టుకొని ఒకరు బయటకు..జాడ తెలియని మరొకరు ఉట్నూర్ రూరల్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ఒకరు గల్లంతైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని చోటు చేసుకుంది. బొప్పరికుంట గ్రామానికి చెందిన టేకం రాజు, టేకం లక్ష్మణ్(28) సొంత పనులపై ఉట్నూ ర్కు సాయంత్రం వచ్చారు.పని ముగించుకొని తిరిగి రాత్రి గ్రామానికి కాలినడకన బయలుదేరారు. గంగాపూ ర్ వద్ద వాగు దాటే క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇద్దరు కొట్టుకుపోయారు. రాజు చెట్టు కొమ్మ పట్టుకొని బయటకు వచ్చాడు. లక్ష్మణ్ వాగులో గల్లంతయ్యాడు. రెస్క్యూ టీం సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపునకు అంతరాయం కలిగింది. -
అందరి మాటతోనే ‘భరోసా’
సాక్షి, ఆదిలాబాద్: ‘రైతు భరోసాను నిర్దిష్టంగా అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ విషయంలో ఓపె న్ మైండ్‌తో ఉన్నాం. మాకు మేము ఏదో నిర్ణయం తీసుకోవడం లేదు. అందరితో చర్చించి అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలనే సదుద్దేశంతోనే ఉన్నాం. అన్ని జి ల్లాల్లో కేబినెట్ సబ్ కమిటీ పర్యటించి ప్రజాక్షేత్రంలో అభిప్రాయాలు సేకరించి...అసెంబ్లీలో నివేదిక పొందుపరుస్తాం. రైతుభరోసా పేద, బడుగువర్గాలకు న్యాయం చేసేదిగా ఉండాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పరిమితులు ఖరారు కాలేదు. గ్రామం యూనిట్‌గా తీసుకోవాలని ఎక్కువమంది రైతులు సూచిస్తున్నారు.. పోడు రైతులకు సర్కారు సాయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం.’అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కుమురంభీం కాంప్లెక్స్ సమావేశ మందిరంలో రైతు భరోసా విధివిధానాల ఖరారుపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల నుంచి అభిప్రాయాలు, సలహాల ను కేబినెట్ సబ్ కమిటీ సేకరించింది. ఈ కమిటీ చైర్మన్ మ ల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల్లో కీలకమైన రైతుభరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి తీరుతామని డిప్యూటీ సీఎం అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు. నిజమైన రైతులకే రైతుభరో సా అందించేందుకు అన్నివర్గాల ప్రజల నుంచి అభిప్రాయా లు స్వీకరిస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మరోమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తూ ఇంకా ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు రైతులకు భూమికి సంబంధించి సరైన పత్రాలు కూడా లేవని తెలిపారు. ఇలా అన్ని విషయాల్లోనూ ఆలోచన చేస్తామని చెప్పా రు. ఎకరం భూమి లేకున్నా, ఏదో ఒకవిధంగా సాగు చేస్తు న్న రైతులకు లబ్ధి చేకూర్చాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించి ఆదుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు కోరారు.వైఎస్ అమలు చేసిన కౌలురైతు చట్టాన్ని తీసుకురావాలి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2011లో అమలు చేసిన కౌలు రైతు చట్టాన్ని తీసుకురావాలని రైతులు, రైతు సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సాగుచేస్తున్న వారిలో 30 నుంచి 40 శాతం మంది కౌలురైతులే ఉన్నారని వివరించారు. 95 శాతం ఆత్మహత్య లు కౌలు రైతులవేనని పేర్కొన్నారు. పట్టాదారులకు భరోసా కల్పించి కౌలు రైతులకు న్యాయం చేయాలని మంత్రివర్గ ఉప సంఘాన్ని కోరారు. రైతు భరోసానే కాకుండా మిగతా వాటి విషయంలోనూ కౌలు రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం విధివిధానాలు రూపొందించాలన్నారు. ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో పహాణీలు, పోడు భూముల సమస్య కారణంగా మెజారిటీ రైతులు ప్రభుత్వ సాయం పొందలేక పోతున్నారన్నారు. పేద, దళిత, గిరిజన రైతులకు రైతు భరో సా అందించాలని పలువురు కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ప్రత్యేకంగా తీసుకొని పదెకరాలు సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా వర్తింపజేయాలని కోరారు. ఎంపిక చేసిన వారితోనే మాట్లాడించారు ఎంపిక చేసిన రైతులతోనే మాట్లాడిస్తున్నారని నిజమైన రైతులతో మాట్లాడించడం లేదని కొందరు ఆరోపించారు. దీంతో స్పెషల్ రోప్ పార్టీ పోలీసులు ఎంటర్ అయ్యారు. వేదిక ముందు ప్రజాప్రతినిధులకు రక్షణగా ఇటువైపు నుంచి అటు వైపు వరకు కూర్చున్నారు. కాగా రైతులను తాము ఎంపిక చేయలేదని, వ్యవసాయ అధికారులే గుర్తించారని ఖానా పూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. కాగా కేబినెట్ సబ్‌కమిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.