
ఆదిలాబాద్: మండల కేంద్రానికి సమీపంలోని భవానిగిరి గుట్ట వద్ద ఉన్న శివాలయంలో గురువారం నాగుపాము దర్శనమిచ్చింది. గర్భగుడి వద్ద ఉన్న రేకుల షెడ్డుపై గంటపాటు పడవ విప్పి ఉండటంతో ఆలయ వ్యవస్థాపకుడు పోచ్చన్న మహరాజ్ ఫోన్‌లో వీడియో తీశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, భక్తులు భారీగా తరలివచ్చి నాగుపాము దర్శనం చేసుకున్నారు.