Adilabad:అవార్డు అందుకున్న రోజే హఠాన్మరణం | Adilabad Municipal Manager Died Of Heart attack After Receive Award | Sakshi
Sakshi News home page

Adilabad:అవార్డు అందుకున్న రోజే హఠాన్మరణం

Published Sat, Jan 27 2024 8:22 AM | Last Updated on Sat, Jan 27 2024 2:55 PM

Adilabad Municipal Manager Died Of Heart attack After Receive Award - Sakshi

కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుంటున్న దివాకర్‌

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయ మేనేజర్‌ చెన్నమాధవ దివాకర్‌ (56) హఠాన్మ రణం చెందారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసాపత్రం అందుకున్నారు. అనంతరం పట్టణంలోని అంబికానగర్‌లో గల తన ఇంటికి వెళ్లారు.

అల్పాహారం తింటుండగా శ్వాస సమస్య తలెత్తడంతో కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దివ్యాంగుడైన దివా కర్‌కు భార్య నాగలక్ష్మి, కుమా రులు మణికంఠ సాయి, గిరిధర్‌ సాయి ఉన్నారు.

మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన దివాకర్‌ 2003లో ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో టైపిస్ట్‌గా నియుక్తులయ్యారు. అంచెలంచెలుగా ఎదిగి మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. అవార్డు వచ్చిన ఆనందంలో ఇంటికి వెళ్లిన ఆయన గంట వ్యవధిలోనే మృత్యుఒడికి చేరడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
చదవండి: బేగంపేట పీజీ ఉమెన్స్‌ హాస్టల్‌లో కలకలం.. బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement